Monday, March 30, 2015

కొబ్బరికాయ ( టెంకాయ ) ప్రాముఖ్యత.

                                         కొబ్బరికాయ ( టెంకాయ ) ప్రాముఖ్యత.

 భక్తులు తమ హృదయాన్ని భగవంతునికి అర్పించాలని శాస్త్రాలు చెపుతున్నాయి. నిజంగా హృదయ సమర్పణం సాధ్యం కానిదని దానికి ప్రతీకగా కొబ్బరికాయను సమర్పించడమనే విధానం ఏర్పడింది.

                       నైవేద్యమిడ మాకు నారికేళము లేదు 
                       హృదయమే చేతి కందనీయనుంటి!!
అన్న కవి మాటలలో ఈ భావమే ప్రకారాంతరంగా వ్యక్తమవుతున్నది. మనకు స్థూల, సూక్ష్మ, కారణాలనేమూడు శరీరలున్నాయని వేదాంతశాస్త్రం నిరూపిస్తుంది.ఈ శరీరాలను వదిలించుకొంటేనే ముక్తి. కొబ్బరికాయపై  బెరడు స్థూల శరీరాన్ని, కొబ్బరి శూక్ష్మ శరీరాన్ని,నీరు కారణ శరీరాన్ని సూచిస్తాయి. జీవత్వం పొందటానికి సంకేతంగా మూడు ఆవరణలతో వున్నా టెంకాయను దేవునికి అర్పిస్తున్నట్లు భావించాలి.
           కాయపైనున్న పిలక అహంకారానికి సంకేతమని కొందరు, అఖండ జ్ఞానానికి సూచకమని మరికొందరూ చెపుతారు. నీరు చంచలమైన మనస్సుకు సూచకమని గూడా వివరిస్తారు. పిలకను తొలగించడం  అహంకార నిర్మూలనాన్ని సూచిస్తుంది. లేదా చివరివరకూ,,, అంటే శరీరత్రయం నశించి జ్ఞేయంలో లీనమయ్యే వరకూ, జ్ఞానరూప శిఖను అట్లే వుంచి తరువాత దాన్ని తొలగించాలని కుడా వివరిస్తారు.
కొబ్బరికాయను దేవతలకు సమర్పించాదాన్ని గురించి ఒక ఐతిహ్యం వుందని పెద్దలు చెపుతారు. అది ఏమిటంటే వినాయకుడు ఒకసారి శివుణ్ణి " నీ  తలను నాకు బలిగా ఇమ్మ"న్నాడట. తల ఇవ్వడం కుదరదు కానీ తలతో సరితూగే దానిని ఇస్తాను అని మూడు కన్నులవేల్పు తలకు బదులుగా మూడు కన్నులున్న నారికేళం వినాయకుడికి ఇచ్చి తృప్తి పరచినట్లు  ఆ తరువాత దేవతలకందరికీ టెంకాయలు సమర్పించే సంప్రదాయం ఏర్పడిందని పెద్దలు చెపుతారు.  

No comments:

Post a Comment

Total Pageviews