మొన్న వూరు వెళ్ళినప్పుడు నేలతల్లి సోయగాలు తిలకించి పులకించిన భావావేశం ఈ ఉషోదయ శుభవేళ మీ కోసం. భూదేవి అరుగుపై ఆకాశం పందిరి! వరిని వరియించ దివినుండి దిగివచ్చె గోదావరి!! సురలు తిలకించి పులకించి దీవెనల వానలు కురిపించినారు రేపటి ఆశలకై నాటిన విత్తులు ఆకుపచ్చ వరి నారుమడులైనాయి రైతు పురహితుడై ఆ నారుమడులతో మూడుముడులు వేయ సాగే లోక కళ్యాణమునకు. ఆ సిరులపంటను మన పంటిసిరిగా అందించేందుకు. జై జననీ! జన్మభూమి!! జై జై కిసాన్!!! సత్యసాయి విస్సా. 



No comments:
Post a Comment