Wednesday, April 29, 2015

మన పావన గోదావరి

                                                       మన పావన గోదావరి 

గోముఖాన పుట్టి'నదే' మన పావన గోదావరి

గలగలమని పారు'నదే' మన పావన గోదావరి!!


హైలెస్సల హుషారుతో మెలికలెన్నొ తిరుగుతుంది

జలగీతల సాగు'నదే' మన పావన గోదావరి!!

పాయలుగా విడిపోతూ మరల ఏక వాహినౌను

జలమార్గములేయు'నదే' మన పావన గోదావరి!!

వేకువలో రవి కాంతులు మేనంతా పూసుకుంది

బిడియాలను జార్చు'నదే' మన పావన గోదావరి!!

చందమామ దూకుతాడు ఈదులాటలాడేందుకు 

అలలకొంగు దాచు'నదే' మన పావన గోదావరి!!

సరసమైన సాగరాన్ని కలవాలని నెలరాజా

వడివడిగా కదులు'నదే' మన పావన గోదావరి!!!

No comments:

Post a Comment