Thursday, June 4, 2015

శుభకార్యాలకి, లేదా ఏదైనా పనిమీద బయటకి వెడుతున్నప్పుడు ముగ్గురు ఎందుకు వెళ్ళకూడదు?

                                                           పెద్దల మాట!!!

                             శుభకార్యాలకి, లేదా ఏదైనా పనిమీద బయటకి వెడుతున్నప్పుడు  ముగ్గురు వెళ్ళకూడదు అని పెద్దలు అనడం  మనం చాలాసార్లు వింటూ ఉంటాము. ముగ్గురువెడితే మార్గమధ్యలో అభిప్రాయబేధాలు రావచ్చు. అప్పుడు ఒకరితో ఒకరు మాది సరయినదంటే కాదు మేము చెప్పినదే సరైనది అని వాదన రావచ్చు. అప్పుడు అసలు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళకుండా గొడవకి దిగుతారు. అదే ఇద్దరయితే ఒకరికొకరు సర్దిచెప్పుకుంటూ చేయవలసిన పనిని జయప్రదంగా చేసుకొని వస్తారు. కాబట్టి ఏదైనా పనిమీద బయటకి వెడుతున్నప్పుడు  ముగ్గురు వెళ్ళకూడదు అని పెద్దలు చెపుతారు.

No comments:

Post a Comment