Saturday, August 29, 2015

కవితా సాహితి

నీటి గడియారం
నువ్వు ఎక్కడలచుకొన్న రైలు 
ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు 
ఏళ్ళూ పూళ్ళూ నిరీక్షించలేక 

ఎక్కేస్తావేదో ఒక బండీ . 
నీ ఆదర్శాల లగేజీ 
ఎక్సేసంటాడు టీ. ఐ .సీ 
నీ ఈప్సితాల ట్రంకుపెట్లు 
కలలబ్రేకులో పారేయాలి . 
నువ్వు తెచ్చుకొన్నవన్నీ ఎక్కించీలోపున 
కదిలిపోతుంది బండీ .
అందుకే అందులో కొన్ని 
నీ అభిమాన హీరోలదగ్గిరేవదిలెయ్యి . 
నువ్వు వెళ్ళదలచుకొన్న ఊరు
నువ్వుబతికుండగా చేరదారైలు 
దేవుడా !ఇంత చేశావా అని 
ఉన్న ఊళ్ళోనే ఉండు

ఆరుద్ర
-----------------------------
తెలుగమ్మా వెలుగమ్మా
దాశరధి,
తెలుగమ్మా తెలుగమ్మా

అలనాటి మహాంధ్ర వైభవాగ్నులు మాలో
వెలింగింప జేయవమ్మా!
నలు చెరగుల తెలుగు ప్రజ హనమ్ముగ బ్రతుకన్


ఓరుగల్లు పురాన ఉదయించి గగనమ్ము 
ప్రాకిన తెల్గు పతాక నీవు 
విద్యానగరమందు విప్పారి వెల్గిన 
సాహితి చంద్రమశ్శకల నీవు 
ఇక్ష్వాకు రాజు ఇలవేలుపై నంది 
కొండ వీటి సెనంగు దండి 
వీరుల భుజ దండమ్ము దూకిన చండి నీవు

పోతనామాత్యు భాగబతాది మధుర 
గీతికలలోన పలికిన కీరమీవు 
కవి కలమ్మున గళమున చవులు నింపు 
స్వామినీ కవితా సరస్వతివి నీవు

నీవు లేకున్నచో నేనేడ? జగమేడ?
దారి లేనట్టి యెడారిగాక 
నీవు రాకున్న చో భావ మంజరులేడ? 
శిశిర జర్జర వన శ్రేణి గాక నీవు లేకున్నచో నిత్య యౌవన మేడ? 
వార్దక బ్రష్ట జీవనము గాక 
నీవు రాకున్నచో నింగి తారకలేడ? 
గాడాంధకార మేఘములె గాక 
అఖిల సారస్వతోద్యానమందు పొగడ
పువ్వులటు గుమ్మనెడు నిన్ను పొగడ తరమె
రమ్ము నారసనా నృత్య రంగమందు 
నర్తనము చెయవమ్మ ఆంద్ర జనయిత్రి!

రక్త కాంచన తరువ్ర తతి శారద వేళ
పూవులతో పొంగి పోయినట్లు 
శశి కాంత పాషాణ చయము వెన్నెలలోన 
కరిగి నీరైకాల్వగట్టి నట్లు 
చంద్ర బాహు ద్వయ సాంద్రోప గూహమ్య 
కల్హారమునకు పుల్కలిడినట్లు
రాజ హంసీ గురుద్ర చిత బాల తరంగ 
రంగ వల్లి నీట పొంగినట్లు

నిన్ను తలచిన యపుడెల్ల నన్ను నేను 
మరచి పోదును వింత సంబరము తోడ 
తెలుగు టిల్లెప్పుడొకటిగా వెల్లుగునట్లు 
వరము లీ వమ్మ ఆంధ్ర సౌ భాగ్య ల క్ష్మి

ద్వేషాగ్ని యార, పీయూష ధారలు వార 
పద్యాల కొన్నింటి పాడదలతు 
కాటిన్యములు దండి, కరుణమ్ము పెంపొంద 
పదముల కొన్నిటిని వాడవలతు
వినమెల్లడుల్లగా రసముప్పతిల్లగా 
వివిధ భావముల కల్పించనెంతు 
అసహనమ్ముల ద్రుంచ ఐకమత్యము పెంచ 
నిర్మల స్నేహమ్ము నించదలతు

ఎన్ని కోట్లైన నేమి నీ కన్న బిడ్డ 
రెక్కడింది ననేమి వారొక్కటియని 
ఐక్య కంఠమ్ముగా పల్కునట్లు సేయ 
కవిత చెప్పెదనమ్మ బంగారు తల్లి.

శ్రీ దాశరధి

No comments:

Post a Comment