Saturday, October 10, 2015

పురివిప్పిన మయూరం


పురివిప్పిన మయూరం

ఎప్పటిలాగే ఆరోజూ ఉదయపు నడకకి వెళ్ళాను 
శరత్కాలపు ఆహ్లాదపూరిత ఉషోదయం రసభరితం చేస్తోంది!
పచ్చ చీర కప్పుకున్న వనకన్య మనోభావనలని
పక్షుల కువకువలు నేపధ్య గానం అందిస్తుండగా 
తన విప్పారిన పురితో వివరించేందుకు
ఒక మయురం సమాయత్త మైంది
ఆ మహాద్భుత దృశ్యాన్ని 
కొంచెం దగ్గరగా చిత్రీకరిద్దామని 
అత్యాశకు పోయాను
ఆ అలికిడికి తన పింఛపు వింజామరను
తనలోనికి పొదువుకుని 
తన దైన వయ్యారి నడకలతో 
అలా అలా కనుమరుగైపోయింది!
ఒక మహా నృత్య ప్రదర్శన అద్భుత రసావిష్కరణ మధ్యలో అర్ధంతరంగా ఆగిపోయినప్పటి 
ప్రేక్షకుడి హృదయ స్పందనలా మిగిలిపోయాను అలా ...చూస్తుండిపోయాను.

ఈ లింక్ పై నొక్కి మీరూ చూడండి.. మన మనో భావనా వనాలలో సంతస వసంతాలను అందించే వనాలను పెంచండి! వన్య ప్రాణులను సంరక్షించండి!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.

https://www.youtube.chttps://www.youtube.com/watch?v=u1EsUCYhWng#Email=ssvissa%40gmail.comom/watch?v=u1EsUCYhWng#Email=ssvissa%40gmail.com

No comments:

Post a Comment