Monday, October 12, 2015

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... మన పిల్లలకి నేర్పిద్దాం!!

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....
                          మన పిల్లలకి నేర్పిద్దాం!!

పలికెడిది భాగవత మఁట,

పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ

బలికిన భవహర మగునఁట,
 
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?

టీకా:

పలికెడిది = పలుకునది; భాగవతము = భాగవతము; అఁట = అట; పలికించెడి = పలికించెడి; వాడు = వాడు; రామభద్రుండు = రాముడు; అఁట = అట; నేన్ = నేను; పలికిన = పలికినట్లయిన; భవ = సంసార బంధనములు; హరము = తొలగుట; అగునఁట = అవుతుందట; పలికెద = (అందుకే) పలుకుదును; వేఱొండు = ఇంకొక; గాథ = కథ; పలుకఁగన్ = పలకటం; ఏలా = ఎందుకు.

భావము:

వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన
 శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు
 పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి 
వ్రాయను.

No comments:

Post a Comment