//దిద్దుబాటు// తప్పని నిబంధనలు కొన్ని.. కట్టుదిట్టం చేస్తే కనుసన్నల నుండీ జారిపోతారని తెలిసినా భద్రతావలయమన్నదే గీయకుంటే.. మనసును కలుషితం చేసే ఉత్ప్రేరకాలెన్నో నేడు.. ఎటు తిరిగినా మహేంద్రజాలంతో మాయజేసే మోసాలు.. ఏమరుపటులోనే సర్పాలై కాటేసే విషవలయాలు దిగమింగుకోలేని ఆత్మన్యూనతను పెంచే కట్టుబాట్లు కొన్ని ఆకతాయితనాన్ని ఆసరా చేసుకొని వయసును కసిదీరా నలిపేస్తే.. బలహీనమైన అంతరాత్మ పోరాటంలో.. రకరకాల ఒత్తిళ్ళకు గురయ్యే పిల్లలెందరో.. నిన్నమొన్నటి దాకా పొత్తిళ్ళలోని పాపాయిలే అయినా.. తప్పులు దిద్దని నిర్లక్ష్యం మన పొరలు కమ్మితే.. రేపటి సమాజానికి సమాధానమివ్వలేని సందిగ్ధాలేగా మిగిలేది..!!
No comments:
Post a Comment