Monday, January 9, 2017

సంక్రాంతి సాక్షి ......."గురుసహస్రావధాని" డా.కడిమిళ్ళ వరప్రసాద్


సంక్రాంతి సాక్షి
వైరాగ్య వాసనల్ పండించె భరతాంబ
దానికి మా హరిదాసు సాక్షి
సంగీతమున జంతు జాలమ్ము మురిపించె
ఇద్దానికో గంగిరెద్దు సాక్షి
సరస సంభాషణా సాహితీ చాతురి
కల్లరి మరదలు పిల్ల సాక్షి
ప్రతి పదార్థమునందు భగవంతునిం జూపె
ముఖ్యమ్ముగా గొబ్బిముద్ద సాక్షి
కాయ కష్టమ్ములో లక్ష్మి గలదటంచు
పలుకుచుంటకు బచ్చని పైరు సాక్షి
పల్లె సొగసులకై రంగవల్లి సాక్షి
శ్రమయె సౌందర్యమనగ సంక్రాంతి సాక్షి
......."గురుసహస్రావధాని" డా.కడిమిళ్ళ వరప్రసాద్

No comments:

Post a Comment