Wednesday, October 4, 2017

వీరేశలింగం ఆయన నివసించిన గృహం

ఆంధ్రకేసరి చిత్రం కోసం ఆరుద్ర గారు రాసిన
"వేదంలా ఘోషించే గోదావరి" అన్న పాటలో వర్ణించినట్లు
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రవరం మనకు సాంస్కృతిక వరం
శతాబ్దాల చరిత గల ఆ సుందర నగరం అడుగడుగునా మనకు తరతరాలుగా
ఎన్నో జ్ఞాపకాలుగా గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యంలా అలరిస్తూనే ఉంటుంది
రాజరాజ నరేంద్రుడు, కాకతీయులు, రెడ్డి రాజులు
గజపతులు.. నరపతులు.. ఏలిన ఆ ఊరిలోని
ఆ కథలన్ని అనాదిగా నినదించె ఆ గౌతమి హోరు సౌరు
నన్నయ్య ఆది కవితకు ఆవాసమై శ్రీనాధ కవి నివాసమై
కవిసార్వభౌములకు ఆలవాలమై
నవ కవితలు వికసించె నందనవనమై
దిట్టమైన శిల్పాల దేవళాలతో
కట్టుకథల చిత్రాంగి కనక మేడలతో
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు అని ఆ కవి రాసినట్లుగా
ఆ వీరేశలింగం మిగలకపోయినా ఆయన నివసించిన గృహం మాత్రం ఇంకా ఆ అరుదైన జ్ఞాపకాలని మనకు అందించేందుకు ఇంకా మిగిలే వుంది. ప్రతిరోజూ ఉదయం        నుంచి          సాయంత్రం వరకూ ఒక్క శుక్రవారం తప్ప మిగతా రోజులల్లో ఉచితంగా సందర్శించవచ్చు ఇంకా అనేక చారిత్రక విశేషాలు గురించి మిగతా పోస్టులో తెలుసుకుందాం! నేను మొన్న దర్శించిన ఆ దివ్యభావనా భవనం వీలయితే మీరు దర్శించండి! సత్యసాయి విస్సా ఫౌండేషన్.



































No comments:

Post a Comment