Wednesday, December 27, 2017

పెసరట్టు పాట.

సరదా...సరదా పెసరట్టు
ఉప్మాతో ఇది జతకట్టు
జీడిపప్పు వేసా బాగా కలిసేట్టు
ఉల్లి,మిర్చి,అల్లం తో మెలిపెట్టు
జీలకర్రతో జోడీపెట్టు
కాలిచా నేతితో రుచిగా వేగేట్టు
ఉప్మా వేసి మడతెట్టు
కొబ్బరి చట్నీ జోడెట్టు
అల్లం పచ్చడి అతికెట్టు
తెలుగువాడిదే దీని పేటెంటు
భలే కాంబినేషనంటూ పట్టెయ్ ఓ పట్టు
ఆకలి దీనితో అటకెక్కు
కావాలంటే అడిగెయ్ మరో సెట్టు
ఆపై కాఫీ ఆర్డరెట్టు
స్వర్గం జానెడు దూరమే నామీదొట్టు..
🙂  😉 😂😃😁😅

**భావుక మిత్రుల స్పందనకై ఎదురుచూస్తూ.....

No comments:

Post a Comment