Tuesday, January 2, 2018

శుభోదయం


మాటలు చెప్పేవాళ్ళదగ్గరకి
జనం తాత్కాలికంగా చేరుతారు
కానీ కష్టపడే వాళ్ళ దగ్గరకి
విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది.
 
కొన్ని పువ్వులు సూర్యకిరణాలకి వికసిస్తాయి.
మరి కొన్ని రాత్రి కమ్మటి వాసననిస్తాయి.
ఏ పువ్వుని ఎక్కడ ఉంచాలో భగవంతుడికి తెలుసు.
అలాగే మనమూ ఎక్కడ రాణిస్తామో అక్కడికే చేరుస్తాడు.

మన ఉనికిని మనమే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి.
ఒక మామూలు మనిషిని ఎవరూ గుర్తు పెట్టుకోరు.
సృజన,సమయోచిత స్పందన ఉన్న వారిని అందరూ గుర్తు పెట్టుకుంటారు.

నా లక్ష్యాన్ని లేదా కోరికను ఎందుకు పొందలేకపోతున్నాను?
లోపం ఎక్కడుంది?దానిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి?
అన్నది మనకి మనమే ఆత్మవిమర్శ చేసుకొని
మన లోపాలను మనమే సరిచేసుకోవాలి.

కాలిలో గుచ్చుకున్న ముల్లు తొలగిన తరువాత
నడవడానికి ఎంత సౌకర్యంగా ఉంటుందో,
అలాగే మనసులోని అహంకారం తొలగిన తరువాతే
జీవితంలోని ఆనందం అనుభవమవుతుంది.

No comments:

Post a Comment