Tuesday, January 9, 2018

శుభ సాయంత్రం.


మనసునయినా,శరీరాన్నయినా అదుపులో ఉంచుకోవడానికి చేసే సాధన రెండు రోజులో,రెండు వారాలో చేసి మనవల్ల కావటంలేదని ఊరుకోవడం కాదు.వశం అయ్యే వరకూ చెయ్యవలసినదే.
నీవొక మహోన్నత శిఖరమయినా,నేనొక అతి చిన్న నీటిబుడగనయినా-మన ఇద్దరి వెనుకా ఉన్నది అత్యంత శక్తివంతమయిన దివ్య చైతన్యమే.

ఆత్మ విశ్వాసం కలిగి ఉండండి.
గొప్ప విశ్వాసాల నుంచే మహత్తర కార్యాలు సాధించబడతాయి.

ఎదుటివారిని ఏకంగా ఖండించడం కన్నా కాస్త అనునయంగా మాట్లాడుతూ వారిని నీ వైపుకు తిప్పుకొని  కలుపుకుంటూ ముందుకు సాగడం కుడా అవసరమే.

అవసరంలో ఉన్నవారికి,అర్హులకీ,తిరిగి ఇవ్వలేని వారికీ చేసే దానమే గొప్పదానం

తెలియక చేసిన తప్పును  ఎన్నిసార్లయినా క్షమించవచ్చు.
కాని .....ఆ తప్పు తెలిసి చేసినదా? తెలియక చేసినదా? అని నిర్ణయించే ముందు పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

No comments:

Post a Comment