Thursday, January 4, 2018

శుభ సాయంత్రం


సలహా అన్నది మంచులాంటిది 
ఎంత మృదువుగా చెప్పగలిగితే 
అంత ఎక్కువకాలం మనలో ఉండి
మన మనసులోకి దిగుతుంది. 

కొన్ని పువ్వులు సూర్యకిరణాలకి వికసిస్తాయి.
మరి కొన్ని రాత్రి కమ్మటి వాసననిస్తాయి.
ఏ పువ్వుని ఎక్కడ ఉంచాలో భగవంతుడికి తెలుసు.
అలాగే మనమూ ఎక్కడ రాణిస్తామో అక్కడికే చేరుస్తాడు.

ప్రశంస పన్నీరు లాంటిది.
తాత్కాలిక గుబాళింపే తప్ప దప్పికకు ఉపయోగపడదు.
విమర్శ వేడినీరు లాంటిది.వెంటనే చురుక్కుమన్నా కుళ్ళునూ(లోపాలను) కడుగుతుంది.చల్లారాక దప్పికా తీరుస్తుంది.

అందరినీ విమర్శించేవారు 
ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు 
కానీ అందరినీ సరదాగా పలకరించేవారు 
నిత్యం నూతన ఆనందాలతో జీవిస్తారు.

No comments:

Post a Comment