Thursday, January 11, 2018

శుభ సాయంత్రం ../\..

సంతృప్తి అనే వంతెన విరిగిపోతే ఇక 
మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి 
అడ్డూ... ఆపూ... ఉండవు.

జీవితం మరియు సమయం మనకి మంచి ఉపాధ్యాయుల లాంటివారు 
జీవితం నేర్పిస్తుంది మనకి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో 
సమయం నేర్పిస్తుంది జీవితం ఎంత విలువైనదో .

జీవితం సప్తస్వరాల సమ్మేళనం
షడ్రుచుల మృష్టాన్న భోజనం
ఒక్కోసారి అది పెద్ద చదరంగం
నవ్వుతూ ఆస్వాదిస్తే నిత్యనూతనం
యవ్వనమైన,వృద్దాప్యమైన
దేవుడాడే వైకుంఠపాళీ మన జీవిత గమనం!!!!

ఒక మంచి వ్యక్తి ఎదురయినప్పుడు ఆదర్శంగా తీసుకో.
చెడ్డ వ్యక్తి ఎదురయినప్పుడు నీ హృదయాన్ని పరిరక్షించుకో.

జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే 
వ్యక్తిత్వం లేనివారి మాట,
మానవత్వం లేనివారి ప్రేమ,
స్థిరత్వం లేనివారి సలహాలు నమ్మకూడదు.

No comments:

Post a Comment