Friday, April 13, 2018

దువ్వూరి వారి దవ్వుల వేణువు

లేత తమలముల రీతి చెన్నొందెడి
........పాదముల్ గనినంత మోదమగును
మోదమ్ము కలిగించు పాదాల చుట్టుక
........వెండి నూపురములు వేడ్క జేయు
వేడ్కను జేసెడి వెండి యందెల పైన
.......పట్టుపావడ సౌరు వన్నె లద్దు
వన్నెల నద్దెడు పట్టుపావడకున్న
.......బంగరు టంచులు భ్రాంతి గొలుపు
భ్రాంతి గొలిపెడి సొగసుల పదిలమైన
యడుగులకు రమ్ము పారాణి నలదుకొమ్ము!
అలరు పారాణి పదముల తెలుగు బిడ్డ!
నర్తనప్రియవై నీవు నాట్యమాడు.

No comments:

Post a Comment