Thursday, September 27, 2018

అర్బన్ నక్సల్స్ అసలు రంగు ఇదీ...⚜-డాక్టర్ పి.భాస్కర యోగి, ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన వ్యాసం

అర్బన్ నక్సల్స్ అసలు రంగు ఇదీ...
"ప్రతీది గంగా తీరం నుండి మాకు వచ్చింది" అని పాశ్చాత్య మేధావి ఫ్రాంకోయిస్ వాల్టేర్ అం టాడు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో భారతీయ సంస్కృతి ముందు ఉంటుంది. గ్రీకు, రోమన్ నాగరికతలు క్రైస్తవ మత విస్తృతి తర్వాత కనుమరుగైపోయాయి. ఆసియాఖండ దీపంగా పేరొందిన బౌద్ధతత్త్వం ఇస్లాం దండయాత్రల తర్వాత నామమాత్రంగా మిగిలింది. రెండు వేల ఏళ్లలో అన్ని బాధలను తట్టుకొని నిలబడినవి భారతీయ, చైనా సంస్కృతులే. మన దేశంలో 700 ఏళ్ళు ఇస్లాం పాలన, 200 ఏళ్లు బ్రిటీషు వారి రూపంలో క్రైస్తవ పాలన సాగినా ఇక్కడి సాంస్కృతిక పునాదులను పూర్తిగా మార్చలేకపోయారు. దీనికి కారణం ఏమిటన్నది ఇవాళ ప్రపంచం ముందున్న ప్రశ్న!
ఇపుడు అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలు వాటి మూల సంస్కృతి కోల్పోయి వ్యాపార, వాణిజ్య రూపంగా కన్పిస్తున్నా, వాటి అంతర్గత ప్రవాహంలో క్రైస్తవం ఉంది. ఆప్ఘన్ చుట్టూ వున్న గాంధార స్థానంలో ఇస్లాం రాజ్యమేలుతుంది. భారత్‌లోని 135 కోట్ల జనాభా ప్రపంచంలోని 650 కోట్ల జనాభాలో అతి పెద్ద భాగం. ఇది ప్రపంచ మానవ వనరే గాకుండా మార్కెట్టుగా కూడా ఉపయోగపడాలనే వాణిజ్య మతరాజ్యాల లక్ష్యం. అందుకే దీనిని మార్కెట్ మాయాజాలంలో ముంచాలంటే ఏం చేయాలని ఆలోచించిన ఈ మత వాణిజ్యవేత్తలు ఇక్కడికి ‘హిట్‌మాన్’లను పంపించారు. వీళ్ల దెబ్బకు సోవియట్ రష్యానే ముక్కలుగా అయిపోయింది. ఇలా విడగొట్టాలని సిఐఏకు చెందిన గూఢచారులు పనిచేస్తున్నట్లు ఎన్నో వార్తలొచ్చాయి. రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్ బహిరంగంగానే చెప్పారు. సోవియట్ రష్యా తర్వాత వీరి లక్ష్యం భారత్, చైనాలే. చైనా కఠినమైన నియంతృత్వ విధానాలు అవలంబించడంతో ఈ కుట్రలకు సందు దొరకట్లేదు. కానీ భారత్‌లో మితిమీరిన స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం ఉన్నందున ఇది ప్రథమ లక్ష్యం అయ్యింది. పాశ్చాత్య క్రైస్తవ వాణిజ్య విస్తరణ కోసం ఒకవైపు ప్రయత్నం జరుగుతుంటే, వెయ్యేళ్లు పాలించినా మేం ఈ దేశాన్ని పూర్తిగా ఆక్రమించలేకపోయాం అని ప్రపంచ ఇస్లామిక శక్తులు మరోవైపు చూస్తున్నాయి.
ఈ క్రమంలో దేశంలోని విభజన శక్తులను ఈ వ్యవస్థలే పెంచి పోషిస్తున్నాయి. ఈ దేశాన్ని పట్టుకోవాలంటే ఈ సంస్కృతి విధ్వంసం కావాలన్నదే వారి ఆలోచన. ఇక్కడి మెజారిటీ ప్రజల అలవాట్లను మార్చితే మార్కెట్‌ను విస్తరింపజేసుకోవచ్చని వారు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, దుస్తులు, పని సంస్కృతి, పండుగల్లో మార్పులు.. ఇలా కొత్త కొత్త మా ర్కెట్లు సృష్టించినపుడే ఇది సాధ్యం అవుతుంది. ఉదాహరణకు ఇక్కడ లేని ‘బర్త్‌డే పార్టీ’లను అలవాటు చేసారు. దాంతో కేక్‌లు కోయడం, అందులో కలిపే తినాలనిపించే ‘పదార్థాల’ అమ్మకం పెరిగింది. ఇక్కడి సినిమా నటులు విదేశాలకు వెళ్లి హాఫ్ కట్ గౌనులు తొడుక్కోవడం చూసివస్తే ఇక్కడి చలన చి త్రాల్లో, టీవీ కార్యక్రమాల్లో అవే వేసుకోవడం మనకు నిత్య దృశ్యాలే. అది చూ సేందుకు ఇక్కడి యువకులు టీవీలకు అతుక్కుంటే- వాళ్ల వాణిజ్య ప్రకటనలు మెదళ్లలో నిక్షిప్తం అవుతాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల 24 గంటలూ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇదంతా మెల్ల మెల్లగా యువకుల్లో లైంగిక ఉద్రేకాలకు కారణం అవుతోంది. ఇలా సాంస్కృతిక ధ్వంసం వల్ల వాణిజ్య జీవనంలోకి మనల్ని లాగడమే అసలు కథ ప్రారంభం అవుతుంది. తనదికాని పరాయి సంస్కృతివైపు మనిషి మళ్లాలంటే ఏం చేయాలి? సాంస్కృతిక విధ్వంసం జరగాలి. అందుకు ఈ దేశ మూల సంస్కృతికి ఆధారమైన నమ్మకాలపై దాడి జరగాలి. దీనికోసం ఎంచుకొన్న గొప్ప మార్గమే ‘అర్బన్ నక్సలిజం’!
వీరంతా మహానగరాల్లో మావోయిస్టులు, ఒకాయన రచయితగా గొప్ప పేరు సంపాదించాడు. ఆయన యం.యం. కల్బుర్గి (M. M. Kalburgi). ఈయన శివలింగాలపై మూత్రం పోస్తానని అంటాడు. దీనికి బసవేశ్వరుణ్ణి అడ్డుపెట్టుకొంటాడు. రంగనాయకమ్మ లాంటి పేరుమోసిన రచయిత్రి రామాయణ విషవృక్షం రాస్తుంది! భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి వారు భాషాశాస్తవ్రేత్తలుగా నటిస్తూ తెలుగు భాషను ఎందుకూ కొరగాకుండా చేసారు. కంచె ఐలయ్య లాంటివారు కులాల మధ్య సంఘర్షణను రెచ్చగొడుతారు. దళిత ఫ్రీడం నెట్‌వర్క్ పేరుతో ఉన్న సంస్థ ఇతనికి అండగా ఉంటుంది. ఈ విషయం రాజీవ్ మల్హోత్రా తన ‘బ్రేకింగ్ ఇండియా’లో వివరించాడు. సీపీఎంకు అనుబంధంగా పనిచేసే జన విజ్ఞాన వేదిక నాస్తికత్వాన్ని నడిపిస్తుంది. మావోయిస్టు వాదనలను వినిపించే గొంతుకలు కేంద్ర సాహిత్య అకాడమీలో తమ స్థానం పదిలం చేసుకొన్నాయి. చరిత్ర పేరుతో వెండి డోనిగర్( Wendy doniger), రోమిల్లా థాపర్(Romila Thapar), సతీశ్ చంద్ర లాంటివారు ఈ దేశపు అసలు చరిత్రను మరుగుపరిచి స్వాభిమానం లేకుండా చేస్తారు. రచయితలుగా అరుంధతీ రాయ్, అర్బన్ సుఖియా, బిపిన్ చంద్ర వంటివారు రోజూ ప్రతీకాత్మక శక్తులకు మద్దతునిస్తారు. గాంధేయవాద ముసుగేసుకొన్న రామచంద్ర గుహలాంటి వారు కొత్త కొత్త చారిత్రక వివాదాలకు ‘ముగింపు’ ఇస్తారు. మేధా పాట్కర్ లాంటివాళ్లు రోజూ ఆందోళనలతో వార్తల్లో ఉంటారు. దాదాపు 10 ఏళ్లు నడిచిన నర్మదా బచావ్ ఆందోళనను- మెడలో బంగారు గొలుసు కూడా లేని మేధాపాట్కర్ ఎలా నడిపింది? స్వామి అగ్నివేశ్ లాంటి వారు ఆర్య సమాజం ముసుగులో బజార్లోకి వచ్చి హిందూ దేవీ దేవతలను దూషిస్తారు. జాన్ దయాల్( John Dayal) వంటి క్రైస్తవ ఎన్జీవో నాయకులు ఈ దేశంలో విద్యుత్ ప్రాజెక్టులను ఆపగలరు. ఉమర్ ఖలీద్, కన్హయ్య కుమార్ వంటివారు విద్యార్థి నాయకుల ముసుగులో ‘ఆజాదీ’ కావాలని నినదిస్తారు. రాజ్‌దీప్ సర్దేశాయి, బర్ఖాదత్ వంటివారు జర్నలిస్టుల రూపంలో జాతీయ వాదంపై యుద్ధం చేస్తుంటారు. వరవరరావు లాంటివారు కవిగా, గద్దర్‌లాంటి వారు కళాకారుడిగా, సుధా భరద్వాజ్ లాంటివారు మానవ హక్కుల కార్యకర్తగా, ప్రశాంత్ భూషణ్, షబ్నం లోన్(Shabnam Lone) వంటివారు న్యాయవాదులుగా తన కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇక విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన జి.యన్.సాయిబాబా వంటి విద్యావేత్తలు యూనివర్సిటీల్లో ఈ భావవ్యాప్తి కొనసాగిస్తారు.
ఈ మహానుభావులంతా తమ కార్యకలాపాలు సాగించేందుకు ఎన్జీవోలు తోడ్పాటును అందిస్తాయి. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్జీవో నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించాడు. అప్పటినుండి గిలాగిలా కొట్టుకుంటున్న ఈ స్వయం ప్రకటిత మేధావులు మోదీపై అకారణ ద్వేషం పెంచుకొన్నారు. మైనారిటీలకు సెక్యులరిజం పేరుతో మద్దతు ఇస్తే అది వికటించి ‘మెజారిటీ వర్సెస్ మైనారిటీ’గా మారుతుందని భయభ్రాంతులకు గురైన వీరు కులం కార్డును అందుకొన్నారు. దాని పర్యవసానమే రోహిత్ వేముల ఆత్మహత్య మొదలుకొని ఇపుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. 31 డిసెంబర్ 2017 నాటికి బీమా కోరేగావ్ యుద్ధ విజయానికి 200 ఏళ్లు అయ్యింది. 1 జనవరి 1818న జరిగిన ఆ కదనంలో మహర్లు పీష్వాలను ఓడించారు. దీనిని బట్టి ఈ దేశంలో దళితులు ఎంత యోధులో మనకు తెలుస్తుంది. కానీ దళితుల అణచివేత జరుగుతోందని ఈ గ్యాంగే ప్రచారం చేస్తుంది. జస్టిస్ పార్టీ అవశేషమైన జాస్తి చలమేశ్వర్ అనే న్యాయమూర్తి భారత చరిత్రలో మొదటిసారి ప్రజల ముందుకు వచ్చి- సుప్రీం కోర్టులో అన్యాయం జరుగుతోందనగానే సెక్యులర్ ముఠాలు, నాయకులు కేంద్రంపై ఒంటికాలినెత్తారు. మోదీపై హత్యకు కుట్ర కేసులో అనుమానితులకు సుప్రీం కోర్టు అనుకూలంగా మాట్లాడితే- అది ప్రజాస్వామ్య విజయం అంటున్నారు.
నక్సలైట్లు అడవుల్లో గన్నులు పట్టుకొని చేసిన విధ్వంసంతో సమతూకంగా ఈ మహానగర మావోయిస్టులు పెన్నులతో మెదళ్లలో విషం నింపుతున్నారు. ఈ అరెస్టులను, విచారణను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ నిందించడం, ‘వేయి ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్ర చేయడమే’. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, మన్మోహన్ సింగ్ వంటి కాంగ్రెస్ పెద్దలు ఇదే నక్సలైట్ విధానాలను గురించి ఏం మాట్లాడారో రికార్డులు తిరగేస్తే బాగుంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీ కదా 128 నిషేధిత సంస్థల్లో ఈ గ్రూపును పెట్టింది?
విచారణ చేస్తే కదా నిజానిజాలు తెలిసేది? ఈ దేశంలో అవకాశవాదం కోసం ఏదైనా మాట్లాడుతారు. వందలమంది ప్రాణాలను బలిగొన్న యాకూబ్ మెమెన్‌కు అనేక సంవత్సరాల విచారణ తర్వాత ఉరిశిక్ష విధిస్తే దానిని రద్దుచేయాలని అర్ధరాత్రి వేళ సుప్రీం కోర్టు తలుపు తట్టేవాళ్లు- మిర్యాలగూడలో మారుతీరావును అర్జెంట్‌గా చంపాలంటారు? చట్టాన్ని, దర్యాప్తు సంస్థలను గౌరవించడం అంటే సామాన్యులకు అర్థం కావడం లేదు. భీమా కోరేగావ్ అల్లర్ల తర్వాత ఎల్గార్ పరిషత్ చేసిన చర్యలపై ఆర్నెళ్లు విచారణ జరిపిన దర్యాప్తు సంస్థలు అయిదుగురిని అదుపులోకి తీసుకొంటే అదేదో ప్రజాస్వామ్యం నాశనం అయినా మిలిట్రీ పాలన వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సబబు? ఒకవేళ వాళ్లు అందులో పాల్గొనకపోతే మంచిదే కదా? అయితే వాళ్లను అరెస్టు చేయడమే మహానేరంగా మీడియా సంస్థలు గోల చేయడం బాగాలేదు. అయినా ఈ రోజు నీతిమంతుడైన ప్రధాని మరణం కన్నా ఈ బుద్ధిజీవుల నిర్బంధమే ఘోరంగా కన్పించడం విశేషం!?
నిజానికి మావోయిస్టుల్లో ఎక్కువమంది బహుజన కులాలవారే ఎందుకు మరణిస్తున్నారు. అగ్రకుల మేధావులంతా హాయిగా పట్టణాల్లో కూర్చుని సాధ్యం కాని సిద్ధాంతాలను యువకుల మెదళ్లలోకి ఎక్కించి తుపాకులిచ్చి పంపిస్తారు. సత్యమూర్తి ఎందుకు బయటకు వచ్చాడో చెప్పగలరా? అర్బన్ నక్సల్స్ ముద్రపడిన ఈ మేధావుల కుమారులు, అల్లుళ్లు, కూతుళ్లు ఉన్నత ఉద్యోగాలు సంపాదించడం నిజం కాదా? కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఎవరు పెత్తందార్లో చెప్పగలరా? మొన్నటికి మొన్న సుప్రీం ఐకోర్టు అవకాశం వస్తే ఇంటికి వచ్చిన వరవరరావును కుటుంబ సభ్యులంతా ఎదురేగి కౌగిలించుకొన్నపుడు ఆయనలో ఎంతో భావోద్వేగం కన్పించింది. అలాగే దళిత, బహుజన బిడ్డలు ఉద్యమంలోకి వెళ్లి తల్లిదండ్రులు మరణిస్తే అంత్యక్రియలకు హాజరుకాలేని స్థితిలో వాళ్లకు ఎంత బాధ కలిగి వుంటుంది? ప్రాణాలు పోగొట్టుకున్న దళిత, బీసీ కులస్థులు పోలీసులు కావచ్చు, మావోలు కావచ్చు. వాళ్లకు కుటుంబ సభ్యులు ఉన్నారని విస్మరిస్తే ఎలా? వరవరరావు లాంటి భావోద్వేగం గల కవికి, మేధావికి చేసే వినతి- ఇన్నాళ్లకు నీతిగల ఓ ప్రధాని బీసీ కులం నుంచి వచ్చాడు.. ఆయనపై మేధో ఉగ్రవాదం వద్దు. ఒకవేళ ఈ మేధావులకు సంబంధం లేకపోతే అలాంటి కుట్ర జరుగకపోతే అంతకన్నా గొప్ప విషయం ఇంకేమీ ఉండదు.
-డాక్టర్ పి.భాస్కర యోగి
bhaskarayogi.p@gmail.com
ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన వ్యాసం

Wednesday, September 26, 2018

అర్బన్ నక్సల్స్ అసలు రంగు ఇదీ...⚜-డాక్టర్ పి.భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన వ్యాసం

అర్బన్ నక్సల్స్ అసలు రంగు ఇదీ...⚜

Friday, September 14, 2018

ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు. *Names of Spices :*

ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు.
*Names of Spices 
1. cumin seeds - జీలకర్ర
2. Turmeric - పసుపు
3. Cinnamon - దాల్చిన
4. Coriander leaves - కొత్తిమీర
5. Clove - లవంగం
6. Black Mustard seeds - ఆవాలు
7. Blackpepper - మిరియాలు
8. Bayleaves --. బిరియానీ ఆకు
9. Cardamom --. యాలకులు
10.Fenugreek --. మెంతులు
11.Asafoetida --. ఇంగువ
12.Fennel seeds --.సోపు గింజలు
13.Curry leaves ---. కరివేపాకు
14.Poppy seeds ---. గసగసాల
15.Sesame seeds - నువ్వులు
16.Watermelon -- పుచ్చకాయ
17. Dry mango powder - మామిడి పొడి
18.Carom seeds -- వాము
19.Garlic --. వెల్లుల్లి
20. Nutmeg -- జాజికాయ
21.Camphor --కర్పూరం
22.Saffron --. కుంకుమపువ్వ
23.Mace --. జాపత్రి
24.Wailong -- మరాఠిమొగ్గ
25.Basil -- తులసి
26.Sandal -- చందనం
27.Soap nuts - కుంకుడు
28.Betal nuts - వక్కలు
29.Dried ginger - శొంఠి
30.Sago --. సగ్గు బియ్యం
31.Jaggery -- బెల్లం
32.Mint ---. పుదీన
33.Coriander Seeds -- ధనియాలు
34.Almond -- బాదం
35.Cashew --. జీడిపప్పు.
*Names of Vegetable*
1. Sweet potato - చిలకడదుంప
2. Onions - ఉల్లి పాయలు
3. Yam --. కంద గడ్డ
4. Brinjal --. వంకాయ
5. Cucumber - దోసకాయ
6. Drumstick - మునగకాయ
7. Pumpkin/Squash - గుమ్మడికాయ
8. Mustard greens --. ఆవ ఆకులు
9. Peppermint leaves- మిరియాల ఆకులు
10.BitterGourd - కాకరకాయ
11.BottleGourd - సొరకాయ
12.Ridge Gourd - బీరకాయ
13.SnakeGourd - పొట్లకాయ
14.Soft Gourd -. దొండకాయ
15. Colocasia roots - చేమదుంప, చేమగడ్డ
16.Turnip-వోక
17.Broccoli - ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి
18.Chilli --- మిరపకాయ
19.Lady's finger-బెండకాయ
20.Aloo. ----. ఉర్లగడ్డ.
*Names of dry fruits:*
1. Almond Nut. -- బాదం
2. Apricot dried --- ఎండిన
సీమ బాదం/ జల్లారు పండు
3. Betel-nut -- తమలపాకుల గింజ
4. Cashew nut --. జీడి పప్పు
5. Chestnut --. చెస్ట్నట్
6. Coconut --. కొబ్బరి
7. Cudpahnut --. సార పలుకులు
8. Currant --. ఎండుద్రాక్ష
9. Dates Dried -- ఎండు ఖర్జూరం
10.Fig --. అత్తి పండ్లు
11.Groundnuts, Peanuts - వేరుశెనగ పప్పు
12.Pine Nuts - చిల్గోజా, పైన్ కాయలు
13.Pistachio Nut - పిస్తా
14.Walnuts - అక్రోటుకాయ.
*ధాన్యాలు, పిండ్లు మరియు పప్పుల పేర్లు -:*
1. Barley -. బార్లీ
2. Buckwheat -- కుట్టు, దానా
3. Chickpeas -- ముడిశెనగలు
4. Cracked wheat- గోోధుమ రవ్వ
5. Cream of wheat / semolina - సెమోలినా
6. Flour ---. పిండి
7. Chickpea flour -- శనగ పిండి
8. Pastry flour --. మైదా పిండి
9. Garbanzo beans - ముడిశెనగలు
10.Red gram --. కందులు
11.Green gram -- పెసలు
12.Blackgram --. మినుము
13.Bengal gram - శనగలు
14.Horsegram --. ఉలవలు
15.maize --. మొక్కజొన్న
16.Pearl millet -. సజ్జలు
17.Beaten paddy- అటుకులు
18.Rice --. బియ్యం
19.Sorghum - జొన్న

Monday, September 10, 2018

సుశృతుడు

ఈయన పేరు సుశృతుడు...
ప్రపంచపు మొట్ట మొదటి సర్జన్...
క్రీస్తుకు పూర్వమే "ఆపరేషన్" అనే వైద్య ప్రక్రియను మొదలు పెట్టింది ఈ భారతీయ హైందవ ఋషి పుంగవుడే...
ఈయన విగ్రహాన్ని మెల్ బోర్న్ లోని తమ "రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జిరి " లో ఎంతో గౌరవంగా ప్రతిష్ఠించుకున్నారు ఆదేశం వారు... మన పాలకుల నిర్లక్ష్యం, ఈయన ఎవరో కూడా నేటి యువతకు తెలియదు...

Monday, September 3, 2018

కర్ణుడి దాన గుణం కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో

కర్ణుడి దాన గుణం
ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దున పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళాడట.

అప్పుడు కర్ణుడు అభ్యంగ స్నానానికి తయారవుతున్నాడు.

తలకు నూనె రాసుకుంటున్నాడు.

కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది.

కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాహున్నది నాకిస్తావా? అని అడిగాడు.

వెంటనే కర్ణుడు తేసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె
యిచ్చాడు.

కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో యిస్తున్నావు?

కుడిచేత్తో యీయరాదా? అన్నాడు.

అందుకు కర్ణుడు

క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:

అర్థము:--

కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు.

లక్ష్మిచంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణం లో ఎలా మారుతుందో తెలియదు.

 కనుక గిన్నె ఈ చేతినుంచు ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు.

అందుకనే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే
చెయ్యాలనే హితోక్తి ననుసరించి యిలా చేశాను.
అన్నాడు.

అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు.

అందుకు కర్ణుడు

దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా
దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ

అర్థము:-

 కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం.

అంతే కాదు నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించు. అని కోరాడు.

దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో అర్థమవుతుంది.

దానం విషయం లో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగ గానే ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి.

దానం చేసి నేను చేశానని
డప్పు కొట్టుకోకూడదు.

ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు. మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవరుచుకోవాలి. .

Total Pageviews