Thursday, March 29, 2018

మన మహనీయులు: శ్రీ కృష్ణ దేవరాయలు

మన మహనీయులు: శ్రీ కృష్ణ దేవరాయలు:  సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజ...

Monday, March 26, 2018

శ్రీ మద్రామాయణము నందలి వ్యక్తిత్వాల శోభ.

శ్రీ మద్రామాయణము నందలి కొన్ని సందర్భాలు/ సంభాషణలు.
ఆయా మహోన్నత వ్యక్తిత్వాల శోభ ఎలాంటిదో చూడండి.

వాల్మీకితో నారదుడు.

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ౹
ఆర్యః సర్వసమశ్చైవ సదైవప్రియదర్శనః ౹

స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః ౹
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ౹

విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శినః ౹
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ౹
ధనదేన సమ స్తాగే సత్యే ధర్మ ఇవాపరః ౹

16-18, 1 వ సర్గ, బాలకాండము,శ్రీమద్రామాయణము.

నదులు సముద్రమును కలిసినట్లు సత్పురుషులు నిరంతరం శ్రీరాముని చేరుచుందురు.
అతను అందరికీ పూజ్యుడు. ఎవరియెడలా వైషమ్యాలు గాని,తారతమ్యాలుగానీ లేక మెలగువాడు.,
ఎల్లవేళలా అందరికీ ఆయన దర్శనము ప్రీతినిగొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణవిలసితుడు, అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీమహావిష్ణువు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు,సుతిమెత్తని హృదయం కలవాడే ఐనను తన ఆశ్రితులకు అపకారం చేసినవారి యెడల ప్రళయాగ్నివంటివాడు.
సహనమున భూదేవి వంటివాడు. కుబేరుడివలె త్యాగస్వభావం కలవాడు,సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు.

సీతాదేవి రాములవారితో.....
పశ్చాదపి హి దుఃఖేన మమ నైవాస్తి జీవితమ్ ౹
ఉజ్ఝితాయాస్తవయా నాథ!తదైవ మరణం వరమ్ ౹

ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే ౹
కిం పునర్దశవర్షాణి త్రీణిచైకం చ దుఃఖితా ౹

20 - 21, 30 వ సర్గ, అయోధ్యాకాండ, శ్రీ మద్రాయణము.


ప్రభూ! నీవు నన్ను ఇచటనే  విడిచి, వనములకు వెళ్ళినచో, ఆ పిమ్మటనైన దుర్భరమైన నీయెడబాడు కారణముగా నేను జీవించియుండుట అసంభవం.
కనుక, ఇప్పుడే నీయెదుటనే ప్రాణములు వీడుట మేలు.
స్వామీ! నీకు దూరమై ఈ విరహ బాధను ఒక్క క్షణం కూడా భరించలేను. ఇక దుర్భరదుఃఖముతో పదునాలుగేళ్ళు ఎలా గడపగలను?

అరణ్యవాసం విషయంలో శ్రీ రామునితో లక్ష్మణుడు.

న దేవలోకాక్రమణం నామరత్వమహం వృణే ౹
ఐశ్వర్యం వాపి లోకానం కామయే న త్వయా వినా ౹

5, 31 వ సర్గ, అయోధ్యాకాండ.

స్వామీ! నీ వెంట ఉండి నిన్ను సేవించు భాగ్యమునకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభిఃచిననూ నాకు అక్కర లేదు, జనన మరణ రాహిత్యమును కూడా నేను కోరుకొనను., అంతే  కాదు పరమపద ప్రాప్తిని సైతము నేను వాంఛింపను.

శ్రీ రామునితో భరతుడు.

 అధిరోహా౽ర్య! పాదాభ్యాం పాదుకే హేమభూషితే ౹
ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః ౹

తవ పాదుకయోర్న్యస్య రాజ్యతంత్రం పరంతప! ౹
చతుర్దశే హి సంపూర్ణే వర్ష౽హని రఘూత్తమ!౹
న ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్షామి హుతాశనమ్౹

21& 25,
112 వ సర్గ, అయోధ్యాకాండ.


పూజ్యుడైన ఓ అన్నా! నీ పాదుకలు బంగారం తో తాపబడినవి.
వాటిని ఒకసారి నీ పాదములకు తొడిగి నాకు అనుగ్రహింపు.
అవే సమస్తలోకాలకు యోగక్షేమాలు సమకూర్చును.

ఓ పరంతపా! ఈ పదునాలుగేళ్ళు రాజ్యతంత్రమును నీ పాదుకల మీదనే ఉంచెదను.
పదునాలుగేళ్ళు ముగిసిన మరునాడు నీ దర్శనం కానిచో అగ్ని ప్రవేశం చేసెదను.


రామాయణం మనకిచ్చే ఆదర్శ సందేశం.

శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామ తత్వం.....

అవకాశం ఉన్నా భర్త వెంట నడవటం సీత తత్వం....

కష్టాల్లో తోడు నిలవటం లక్ష్మణ తత్వం...

నమ్మిన వారి కోసం తెగించటం ఆంజనేయ తత్వం.....

ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్ధం....

ఇదే రామాయణం మనకిచ్చే ఆదర్శ సందేశం.....

ఈ జగమంతా రామ మయం.....
రామాయణం మన రక్తంలో ఉంది.

రామో విగ్రహవాన్ ధర్మః ...

రాముడు మనలాంటి మాములు మనిషే. రామాయణంలో రాముడు ఎక్కడా మహిమలు చూపలేదు.

ఒక మాములు వ్యక్తిగా పుట్టిన వ్యక్తి దాదాపు 10,00,000 నుంచి 18,00,000 సవత్సరాలు గడిచిపోయినా, ఇంకా అదే వైభవంతో వెలగడానికి కారణం రాముడి సత్యనిష్ట, ధర్మ నిబద్ధత.

రాముడు తన బాణాలతో 18,000 మంది కర దూషణాదులను చంపాడు కానీ తనకు అమోఘమైన శక్తి ఉన్నదని గర్వించలేదు.

 వాలి ప్రపంచంలో ఉన్న వానర సైన్యాన్ని ఏక తాటి పైకి తీసుకు వచ్చి, సమన్వయ పరిచాడు.

 వాలి ఎంత శక్తివంతుడంటే, వాలికి రావణాసురుడు కూడా భయపడ్డాడు.

 అటువంటి వాలితో స్నేహం చేస్తే, సీతమ్మను క్షణంలో లంక నుంచి తీసుకురావచ్చని తెలిసినా, వాలి తన ధర్మం తప్పాడని అతని సాయం కోరలేదు.

 వాలిని చూసి భయపడుతున్న సుగ్రీవునికి అండగా నిలబడ్డడు.

 వాలిని చంపి, రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పజెప్పాడు కానీ తాను రాజ్యంలో కొద్ది భాగం కూడా తీసుకోలేదు.

శత్రువు తమ్ముడైనా, తనను శరణు వేడుకున్నాడని విభీషణుడికి గౌరవం ఇచ్చాడు, స్నేహం కుదిరిని వెంటనే విభీషణునికి లంకాధిపతిగా సముద్రజలాలతో పట్టాభిషేకం చేశాడు శ్రీ రాముడు.

అప్పుడు అక్కడున్న వారికి ఒక ప్రశ్న తలెత్తింది.

 విభీషణుడు శరణుజొచ్చాడని అతనికి పట్టాభిషేకం చేశావు, మరి రేపు రావణుడు శరణు వేడితే ఏం చేస్తావు రామా?!

 అని అడిగారు
అక్కడున్న వారు.

నేను ఆడిన మాట తప్పను, అదే జరిగితే, విభీషణుడిని అయోధ్యకు రాజును చేస్తాను అన్నాడు.

 ఇంత ధైర్యంగా ఈ మాటను ఎవరు చెప్పగలరు ఒక్క మన రాముడు తప్ప!

రామ రావణ యుద్ధం అప్పట్లో ఒక ప్రపంచ యుద్ధంగా చెప్పచ్చు.

రావణుడు సమస్త ప్రపంచాన్ని హడలు గొట్టిన వీరుడు.

 అటువంటి రావణుడితో యువకుడైన రాముడు  పోరాటం చేయడానికి పూనుకోవడం, అది కూడా వైరంతో కాదు, తన భార్య కోసం ............... ఒక చారిత్రాత్మిక సంఘటన.

 రాముడు అందగాడు, రాకుమారుడు, ఆజానుబాహుడు, తను కోరుకుంటే ప్రపంచంలో ఉన్నా సుందరీమణులందరూ రాముడిని వివాహం చేసుకోవాడానికి సిద్ధపడతారు.

 అయినా, కట్టుకున్న భార్యను కాపాడటం భర్త విధి.

 ధర్మార్ధ కామాలలో నేను నీ చేయి విడిచి పెట్టను అని వివాహ సమయంలో చేసిన ప్రమాణాన్ని గట్టిగా పాటించి, లోకానీకి మార్గం చూపినవాడు శ్రీ రాముడు.

తన భార్య కోసం రావణుడితో భీకరయుద్ధానికి సిద్ధమయ్యాడు.
అదిమాములు యుద్ధం కాదు, అందులో అణ్వస్త్రాలు (న్యూక్లియర్ వెపన్లు), మిస్సైల్స్, రాడర్లకు అంతుచిక్కని విధంగా తయారు చేయబడిన యుద్ధ విమానాలు మొదలైనవి రావణుడి చెంత ఉన్నా, వాటికి బెదరలేదు శ్రీరాముడు.

 ఎదురించి, యుద్ధం చేసి గెలిచాడు, రావణుడి చెంత బంధీలుగా ఉన్నా ఎందరో స్త్రీలను విడిపించాడు, సీతమ్మను గ్రహించాడు.

ఇంత చేసినా, లంక నుంచి రూపాయి తీసుకోలేదు, రాజ్యంలో వాటా అడగలేదు.

లంకలో ధర్మస్థాపన చేసి, విభీషణుడిని లంకాధిపతిని చేశాడు.

అప్పటికి రాముడికి రాజ్యం మీద ఆసక్తిలేదు.

 భరతుడి మనసు మారిందేమో, భరతుడు రాజ్యపరిపాలన చేయాలనుకుంటున్నాడేమో, ఒక వేల అదే నిజమైతే, తాను తన జీవితాన్ని అడవిలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు.

అక్కడ పరిస్థితి చూసి రమ్మని హనుమను పంపారు, భరతుడు రాముడి రాక ఆలస్యమైందని ఆత్మాహుతికి సిద్ధం అవుతున్నాడని తెలుసుకుని, తన తమ్ముడి ప్రాణం కోసమే రాముడు అయోధ్య చేరాడు.




"ముద్దబంతి పూవులో" వరుసలో పేరడీ పాట.....

ఒక పేరడీ పాట.....

మూగమనసులు చిత్రంలో "ముద్దబంతి పూవులో" వరుసలో పాడుకోవాలి...

ముద్దపప్పు కూరలో - ములగకాడ పులుసులో
తెలుగువారి రుచులు - ఎందరికి తెలుసులే  || ముద్దపప్పు||

మిరపకాయలో కారం దాగుందని తెలుసును
గోంగూరను జోడిస్తే ఏమౌనో తెలుసునా.....ఆ...ఆ..ఆ...
చూసినా....రుచి చూసినా....కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీరెనకాల ఏ కారమో తెలుసునా...... || ముద్దపప్పు||

రసం 'అరవ'దే గాని ఘాటుంటది దానికీ
జ్వరమొచ్చిన మనిషికే తెలిసోస్తుందారుచీ.....
వడియాలను జతచేసి పదిలంగా తినుకో
తినుకొని హాయిగా కమ్మగా నిదురపో.... || ముద్దపప్పు||

ఆవకాయ మాగాయలే ఆంధ్రులకు రక్ష
సున్నుండలు జంతికలే శ్రీరామ రక్ష.....
తిన్నోళ్ళు, తిననోళ్ళ తీపి తీపి గురుతులు
సిరులొలికే పంటలూ- మన తెలుగు వారి వంటలు  || ముద్దపప్పు||
( శ్రీ రాయచోటి కృష్ణమూర్తి గారిచే విరచితము)

అంతర్జాల తెలుగు భాష

అంతర్జాల తెలుగు భాష
అంతర్జాలం = internet
ముఖ గ్రంథం = Facebook
 ఏమిటది = what'sup
దరఖాస్తు = application
అన్వేషిక = Google
క్రీడా సంగ్రహణము= Play store
మీ ఆజ్ఞ నాళం = YouTube
వితరిణి = share it
జాబితా = file
తపాల కట్ట = G-mail
గణన యంత్రం = computer
4వ తరం = 4G
కీలక ఫలకం = keyboard
చలన భాషిణి = Mobile phone
 నిస్తంత్రి భాషాంత్రర్జాల యంత్రం = WiFi
ధర్శన చెలికాడు = vidmate
విస్తరణ క్షేత్రం = website
సమాచార ధూత = messenger
సల్లాపములు = chatting
ప్రతిబింబం = image
శ్రవణ సంభంది = audio
దృశ్య సంభంది =  video
సమాచార నిమ్న బదిలి  = download
సమాచార ఊర్ద్వ బదిలి = upload
మృది సామగ్రి = software
ఘన సామగ్రి = hardware
బంధన = link
ముద్ర లేఖనం = typing
అద్దకం = Printing
 స్పర్శ తెర=Touch screen
 చాతుర్య చలన భాషిణి= smart phone
దృశ్య పిలుపు= Video call
శబ్ధ పిలుపు = audio call
సమాచారా బంధక క్రిమి = VIRUS
జ్ఞప్తిక ఘన పత్రం = Memory card
 ధ్వని ముద్రీకరణ = audio Recording
అంకాత్మక కటకము = digital camera
అర్ధ ముఖ చిత్రపటం= Profile picture

                

Tuesday, March 20, 2018

మీ ఇంట్లో తొమ్మిది , పది లేదా ఇంటర్ ఒకటవ, రెండవ సంవత్సరం చదువుతున్న పిల్లలు వున్నారా ? ఇంకా కింది { 7 , 8 వ తరగతులు } లేదా పై తరగతులు { ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా బి ఎస్ సి లాంటి డిగ్రీ లేదా పీజీ అయినా } అయినా సరే !

మీ ఇంట్లో తొమ్మిది , పది లేదా ఇంటర్ ఒకటవ, రెండవ సంవత్సరం చదువుతున్న పిల్లలు వున్నారా ? ఇంకా కింది { 7 , 8 వ తరగతులు } లేదా పై తరగతులు { ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా బి ఎస్ సి లాంటి డిగ్రీ లేదా పీజీ అయినా } అయినా సరే !
ఒక్కసారి దయ చేసివినండి . చూస్తున్నారుగా చుట్టూరా ఏమి జరుగుతుందో ? "మీ అంచనాలను అందుకోలేక పోతున్నాము" అంటూ పిల్లలు సెల్ఫీ వీడియో లు తీసి మరీ ఆత్మ హత్య చేసుకొంటున్నారు . అంటే వారు చిన్న బుచ్చుకొంటున్నది మీ అంచనాలను అందుకోలేమో అనే ఆందోళన వల్ల. ఇపుడు తల్లితండ్రులుగా మీరు అర్జెంటు గా చెయ్యాల్సింది ఒకటి వుంది . అబ్బో .. మా అబ్బాయి / అమ్మాయి అంత బలహీన మనస్తత్వం వున్నవారు కాదండీ.. వారు చదువులో అద్భుతంగా రాణిస్తారు అని అనుకోకండి . ప్రతి తల్లితండ్రి అలాగే అనుకొంటారు . జరగరానిది జరిగితే ఇక జీవితాంతం జీవచ్ఛవాల్లా ఉండాల్సి వస్తుంది . సరే మీ పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారు . అలాంటి ఆలోచన రాదు . మంచిదే . కానీ ఇలా చేస్తే మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు . దీని కోసం మీరు ఏమి ఖర్చుపెట్టనక్కర లేదు . కావాల్సిందల్లా మీ అరగంట సమయమే .
ఇంట్లో టీవీ గట్రా ఆఫ్ చెయ్యండి . ప్రశాంతగా దంపతులిద్దరూ కూర్చోండి . పిల్లల్ని ఎదురుగా కూర్చుపెట్టుకోండి . లేదా ఇంట్లో వద్దుఅనుకొంటే దగ్గరగా వున్నా పార్క్ లో కూర్చోపెట్టి ఇలా మాట్లాడండి .
నువ్వు నీ శక్తి కొద్దీ కష్ట పడి చదువు . మనసు లగ్నం చేసి చదువు . ఇప్పుడే ముగిసిన ఇంటర్ లాంటి పరీక్ష లు అయినా సరే రేపు జరగ బోయే ఎంట్రన్స్ పరీక్ష లు అయినా సరే . నీ శక్తి కొద్దీ చదువు. అదే చాలు . రిజల్ట్ ఎలా వున్నా ఫరవా లేదు . మేము ఏమీ అనుకోము . చిన్న బుచ్చుకోము . బాధ పడం. టెన్త్ లోనో ఇంటర్ లోనో ఫెయిల్ అయినా ఏమీ కాదు . ఇంజనీరింగ్ లోనో మెడిసిన్ లోనో సీట్ రాకపోయినా ఏమీ కాదు .
అయినా మనం చెయ్యాల్సింది కష్ట పడడం వరకే . ఫలితాలు మన చేతిలో వుండవు . మీరు ఆస్తికులైతే ఇలా చెప్పండి .. అయినా అన్నీ ఆ భగవంతుడు ముందుగానే నిర్ణయించి ఉంటాడు . శివుని ఆజ్ఞ లేనిదే { లేదా జీసస్ లేదా అల్లా - మీ మతాన్ని బట్టి ; మీరు నాస్తికులు అయితే దీన్నే హేతుబద్దంగా వివరించండి } చీమ అయినా కుట్టదు అంటారు . గీత లో కృష్ణుడు చెప్పినట్టు పని చెయ్యడం వరకే మన భాద్యత . దాని ఫలితం పై కాదు . అసలు ఫలితం గురించి ఆలోచిస్తే టెన్షన్ పెరిగి లక్షాన్ని అందుకోలేము . మొన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ చూసారు కదా . చివరి ఓవర్ ల లో ఇండియన్ బాట్స్మన్ ఎలా పరుగులు కొట్టి బంగ్లా దేశ్ ను ఓడించారో . వారు బాటింగ్ పై ద్రుష్టి పెట్టారు . అయ్యో పరుగులు వస్తాయో మ్యాచ్ గెలుస్తామో లేదో అని ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ పెరిగి ఫలితం తయారు మారు అయ్యివుండేది .
జీవితం లో నీకు మేము వున్నాము . ఫలితం ఎలా వున్నా పరవా లేదు . ఇది కాక పొతే మరొకటి . అసలు నీకు ఒకటి తెలుసా . కృత్రిమ మేధస్సు, రోబో ల వినియోగం వల్ల నువ్వు చదువు ముగించి జాబ్ మార్కెట్ లో కి అడుగు పెట్టేటప్పటికీ ఇప్పుడున్న ఉద్యోగాల్లో చాల మటుకు వుండవు . కొన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి . ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి . జ్ఞాపక శక్తి పై ఆధార పడి జరిగే నేటి పరీక్షల్లో వచ్చే మార్కులు రాంక్ లు వాటి ఆధారంగా జరిగే కోర్స్ లు రేపు ఎందుకు కొరగావు .
జీవితం లో ఓటమి అంటూ ఏమీ ఉండదు . ప్రతి అపజయం ఒక చక్కటి అవకాశం . అది ఎన్నో పాఠాల్ని మనకు నేర్పుతుంది . నీలో శక్తికి పదును పెట్టు . చుట్టూరా జరిగే పరిణామాల్ని కనిపెట్టు . పాఠాల్ని గ్రహించు . ఇంజనీరింగ్ పరీక్షలో మంచి రాంక్ సాధించిన వాడు రేపు ఇంజినీర్ అవుతాడు . నువ్వు కాలేదనే బాధ వద్దు . వాడికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి నువ్వు ఎదుగు . ఇందుకు డబ్బు మూటలు అక్కర లేదు . గాడ్ ఫాదర్ అక్కర లేదు . కావలసింది సంకల్పం . ఇంటర్ నెట్ చేతిలో వుంది . అంటే అర చేతిలో ప్రపంచం . సమాజాన్ని చదువు . నీ శక్తి సామర్త్యాలను పెంపొందించుకో . ఎదగాలి అనే బలమైన సంకల్పము ఉంటే చాలు . మిఠాయల్ని అమ్ముకొనే వాడు ఏదో ఆ రోజుకి సంపాదిస్తాడు అనుకొంటారు . కానీ పుల్లా రెడ్డి గారు మరోలా ఆలోచించారు . వందల మందికి ఉపాధి కల్పించారు . అయన స్థాపించిన సంస్థల్లో ఇప్పుడు ఎంతో మంది చదువుతున్నారు . థింక్ బిగ్ . అపజయమే నీకు ఆయుధం కావాలి . నీలో కసిని పెంచాలి . ఇందుకు తల్లితండ్రిగా మేము నీకు అండగా ఉంటాము . మేము వద్దన్నా మరో ముప్పై ఏళ్ళు బతుకుతాము . అంతకాలం నీకు మా అండ ఉంటుంది .
పక్కింటి అంకుల్ లేదా పై ఇంటి ఆంటీ లేదా మీ ఫ్రెండ్ లేదా పక్క ఇంటి అమ్మాయి నువ్వు ఫెయిల్ అయ్యావని నవ్వని . ఏమి కద్దు . వారి నవ్వులే నీకు ఆశీర్వాదాలు . వారి వెక్కిరింపులే నీ ప్రగతి కి సోపానాలు . నాన్నా నీ పై ప్రాణం పెట్టుకొని బతుకుతున్నాము . నువ్వు మా కళ్ళముందు ఉంటే చాలు . ఎన్ని పరీక్షలు ఫెయిల్ అయినా ఏమి కాదు . ఎలాంటి అఘాయిత్యానికి పాలుపడను అని మా పైన ప్రమాణమా చెయ్యి . నీ result ఎలా వున్నా నీకు అండగా ఉంటామని మేము ఇదిగో దేవుడిపై { లేదా మీ అంతరాత్మ పై } ప్రమాణం చేస్తున్నాము .
ఇలా ఒక అరగంట గడపండి . తెలుగిళ్ళలో { ఆ మాట కొస్తే ఏ బాషా వారైనా} చావు మేళాలు మోగకూడదు. పిల్లల్ని కోల్పోవడానికి మించిన నరకం మరొకటి ఉండదు . అనారోగ్యం వల్ల అమ్మాయి ని కోల్పయిన నాకు తెలుసు గుండె కోత ఎలా ఉంటుందో . ఇలా చెప్పే నైతిక హక్కు నాకు వుంది . మరోకోణం లో కూడా నాకు అపజయాలు మన ప్రగతికి సోపానాలు అనే చెప్పే హక్కు నాకు వుంది . అండర్ ఏజ్ వల్ల నాకు ఆ రోజుల్లో ఎంబీబీస్ చేసే అవకాశం రాలేదు . అయ్యో ఎంతబాగా చదివినా ఎంబీబీస్ లేదా చివరికి వేటిర్నరీ లేదా అగ్రికల్చర్ bsc చేసే అవకాశం దక్క లేదు అని బాధ పడ్డా. అటుపై ఐఏఎస్ ను లక్ష్యం గా చేసుకొని మూడు సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్లినా ఏదో సర్వీస్ అయితే వచ్చింది కానీ అనుకొన్న ఐఏఎస్ రాలేదు . ఇప్పుడు వెనుతిరిగి చూస్తే నా తో పాటు చదివి డాక్టర్స్ అటు పైన ఐఏఎస్ లు అయినా వారికంటే ఎక్కువ సంతోషంగా బతుకుతున్నా. వందల మందిని డాక్టర్ లు గా ఐఏఎస్ లు గా తీర్చి దిద్దా . ఐఏఎస్ ల కంటే డాక్టర్ ల కంటే ఎక్కువ పేరు సంపాదించా . నా జీవితం లో చెప్పుకోదగ్గ విజయం లేదు . అన్నే పరాజయాలే. కానీ జీవితంగా మొత్తంగా చూస్తే నా జీవితమే ఒక సక్సెస్ స్టోరీ . పరాజయం తెచ్చివ విజయం ఇది . నేను జీవితం అనే పరుగు పందెం లో గెలిచిన తాబేలు .
ఇంతకూ వంద రేట్లు వెయ్యి రేట్లు మీ పిల్లలు విజయాన్ని సాధిస్తారు . నేడు ప్రపంచమే ఒక అవకాశాల గని . కావాల్సిందల్లా ఆలోచన . కృషి పట్టుదల . చికెన్ ముక్కలు అమ్మి డబ్బు సంపాదించాలి అంటే మీరు ఏమంటారు . అరేయ్ రోజుకు వంద రూపాయిలు కూడా సంపాదించ లేవు అంటారు . కానీ KFC వాడు మరోలా ఆలోచించాడు . అందుకే ప్రపంచ సామ్రాజ్యాన్ని నిర్మించాడు . అన్ని తలా కిందులు కానున్న రేపటి రోబో యుగం లు మార్కుల చదువులు చట్టుబండలు కానున్నాయి . ఆలోచనే పెట్టుబడి . అదే భవిష్యత్తు . మీ పిల్లలని ఎగరనివ్వండి. ఆ రెక్కల కు శక్తి నివ్వండి .
ఈ సందేశం మరొకరికి ఉపయోగ పడుతుంది అను కొంటె వారితో పంచుకోండి

Thursday, March 15, 2018

పెద్దలమాట చద్దిమూట

బద్దకంలో దారిద్రo ఉంది 
కృషిలో ఐశ్వర్యం ఉంది 
అందుకేనేమో........ 
కృషితో నాస్తి దుర్భిక్ష్యం అంటారు.!!!

అవసరమైతే ఎవరికైనా సలహా ఇవ్వు 
కానీ ... సూటిపోటి మాటలతో భాద  పెట్టకు.

ఆంగ్లభాష అన్నం పెడుతుంది 
కానీ... మన అమ్మభాష పక్కోడికి 
అన్నం పెట్టమంటుంది.

మనిషన్న వాడు కష్టాలకు
దూరంగా ఉండాలనుకుంటాడు.
మనసున్నవాడు ఆ కష్టాలలో ఉన్న
తనవారికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటాడు.

ఉత్తముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు
వేవేకవంతుడు ఎన్నడూ చిక్కుల్లో పడడు
సాహసవంతుడు ఎన్నడూ భయపడడు.

"దేవత"

ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగింది.

"అందరూ అనుకుంటున్నారు రేపు నువ్వు నన్ను భూమ్మీదకు పంపిస్తున్నవంట
కదా! ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేనెలా జీవించగలను?".

దానికి భగవంతుడు చిరునవ్వుతో

"నీ కోసం ఒక  "దేవత"  అక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాదు నీ కోసం ఆడుతుంది,
పాడుతోంది. నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది. నిన్ను ఎల్ల వేళలా ఆనందంగా ఉంచుతుంది. నన్ను గుర్తుకురాకుండా చేస్తుంది".

"మరి నాకు అక్కడ భాష రాదు కదా
మాటలు ఎలా అర్ధం చేసుకోను? నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు"? అని అడిగింది పాప.
భగవంతుడు: నువ్వు మాట్లాడకపోయినా
నీకేం కావాలో ఆ "దేవతకు" అన్నీ తెలుసు. అడగకుండానే నీఅవసరాలు తీరుస్తుంది.
ఆ "దేవత"  తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా
సరే నిన్ను కాపాడుకొంటుంది" అన్నాడు భగవంతుడు.

పాప: మరి నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను?

భగవంతుడు: నీ "దేవత" రెండు చేతులు ఒక చోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా
ఎలా ప్రార్దించాలో చెబుతుంది. నీలో ఉండే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతోంది అన్నాడు.
ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది. భూలోకం నుంచి వేదనాద ధ్వనులు వినిపించాయి. అప్పుడు ఆ చిన్నారి పాప
తొందరపడుతూ నా దేవత పేరేంటి అని అడిగింది.
ఆ దేవత పేరు "అమ్మ" అని సమాధానమిచ్చాడు భగవంతుడు.

Wednesday, March 14, 2018

💐💐ఆనందానికి ఆవలి గట్టు💐💐




         గొల్లపూడి మారుతీరావు
***********

ఆనందం ఒక దృక్పథం.
అది సంస్కృతి, సంస్కారమూ, స్వభా వమూ కలిసి ప్రసాదించే వారసత్వం. చదువుకుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, పవిత్రమైన నేలలో కన్ను విప్పే పుష్పం.

మా ఇంట్లో ఓ వంట మనిషి పని చేస్తోంది .. 50 సంవత్సరాలు.
లోగడ ప్రముఖ సంగీత దర్శకులు కేవీ మహదేవన్‌ ఇంట్లో పని చేసేది.
ఆమె భర్తకి అనారోగ్యం. పని చెయ్యలేడు. ఇద్దరు ఆడపిల్లలు.
మా ఇంటి దగ్గర్నుంచి లోకల్‌ ట్రైన్‌లో నాలుగు స్టేషన్లు ప్రయాణం చేసి,
 పార్కు స్టేషన్‌ నుంచి 14 స్టేషన్లు దాటి ఇల్లు చేరుతుంది.
ఇది గత 14 సంవత్సరాలుగా ఆమె దైనందిన జీవితం.
ఎప్పుడైనా అడుగుతాను ‘ఇంత శ్రమ ఇబ్బంది కాదా?’ అని.
ఆమె సమాధానం ‘అలా అనుకుంటే ఎలాగ సార్‌! ఇల్లు గడవాలి. పిల్లల్ని పెంచాలి’ ..
ఆమె జీవితం ఆనందంగానే ఉంది. కారణo .. ఆమె తన జీవిత లక్ష్యాన్ని తన పరి స్థితులకు కుదించుకుంది.

 25 ఏళ్ల అమ్మాయి .. పుట్టు గుడ్డి.
 పేరు వినూ. చిన్నప్పటినుంచీ జీవితంలో ఏనాటికయినా సివిల్‌ సర్వీసు చెయ్యాలని కలలుగన్నది. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి అంధురాలు ఐ.ఎఫ్‌.ఎస్‌. ఆఫీసరుగా సెలెక్టయింది.
గుడ్డి, మూగ, చెముడు ఉన్న ఒక మహాద్భుతం– హెలెన్‌ కెల్లర్‌ని ఆమె ఉదహరించింది.
   ‘జీవితంలో నేను అన్నీ చేయలేకపోవచ్చు .. కానీ కొన్నయినా చెయ్య గలను’.

వీరందరూ జీవితాన్ని మెడబట్టుకు లొంగదీసి .. విజయాన్ని పరమావధిగా చేసుకుని .. ఆనం దంగా ఉన్న జీవులు.
 వీరి జీవన రహస్యం .. స్వధర్మాన్ని గర్వంగా, చిత్తశుద్ధితో నిర్వహించడం.
 ఈ దేశంలో చాలామందికి ‘స్వధర్మం’ అంటే బూతు మాట.
ఇందులో మతం ఉందా? దేవుడు ఉన్నాడా? బీజేపీ ఉందా? ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఉందా?
    ‘స్వధర్మం’ అంటే నీ విధిని .. నీ ఆశయం మేరకు .. శ్రద్ధగా నిర్వహించడం.
        అదీ– అదే– అంతే– ఆనందానికి దగ్గర తోవ.

అమెరికాలో యేల్‌ విశ్వవిద్యాలయంలో ఆనందంగా జీవించడానికి కొత్త కోర్సుని ప్రారంభించారు.
 దాదాపు అన్ని డిపార్టుమెంటుల విద్యార్థులూ అటువేపు దూకారు.
 ప్రస్తుతం 1,182 మంది మేధావులయిన విద్యార్థులు ఇందులో ఉన్నారు.
ఈ కోర్సు ఏం నేర్పుతుంది? మనిషి సంతోషంగా ఉండటం ఎలాగో నేర్పుతుంది.
మనకి నవ్వొస్తుంది– ‘ఇది ఒకరు నేర్పాల్సిన విషయమా?’ అని.
హైందవ జీవన విధానంలోనే ఈ ‘అర’ ఉంది.

మన ఖర్మ .. మనం మనకి అక్కరలేని వేలంటైన్‌ డేలను దిగుమతి చేసుకుంటున్నాం.
జనవరి 1న బారుల్లో తాగి తందనాలాడడాన్ని గొప్ప వినోదంగా నెత్తిన వేసు కుంటున్నాం.
తల్లిదండ్రుల్ని అనాధ శరణాలయాలకి అప్పగించి మరిచిపోవడాన్ని అలవాటు చేసుకుంటున్నాం.
మనం ఉగాదులు మరిచిపోయాం.
 సంక్రాంతి సంబరాలంటే చాలామందికి తెలీదు.
మా తరంలో ఏ కుర్రాడూ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వినలేదు.
 గురువుని సాక్షాత్తూ దేవుడన్నాం.
 ఇప్పుడు ఓ కుర్రాడు తనని అది లించిన కారణానికి టీచర్నే కాల్చి చంపాడు.
ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలూ, చదువుకొని అటకెక్కించి .. రాజ కీయాలలో రొమ్ము విరుచుకునే ప్రబుద్ధులూ .. ఇవి విదేశీ యుల దరిద్రాలు. మనం కనీవినీ ఎరుగని అరాచకాలు.
 మనలో ఇప్పటికీ సత్య నాదెళ్లలూ, పుట్టుగుడ్డి వినూలు ఉన్నారు.
    .. సరైన దృక్పథాన్ని ఏర్పరచుకుంటే మనకి యేల్‌ విశ్వవిద్యాలయం కోర్సులు అక్కరలేదు ..

ప్రపంచంలో ఏ సంస్కృతీ ‘సర్వేజనా స్సుఖినోభవంతు’ అనలేదు.
ఓ మామూలు నేలబారు మనిషి ఆ మాట అని ఏం సాధిస్తాడు???
 బాబూ! అతను జనులందరినీ ఉద్ధరించలేకపోవచ్చు.
 కానీ అందరూ సుఖంగా ఉండాలన్న పాజిటివ్‌ ఆలోచన మొదట అతన్ని సుఖంగా ఉంచుతుంది.
ఈ ఆశంస సమాజానికి కానక్కరలేదు.
 అది తన సంకల్పాన్ని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచే Subjective తావీజు.

భగవద్గీతని మనం తప్ప చాలా దేశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయి.
 అది దేవుడి పుస్తకం కాదు.
ఈ రోజుల్లో దేవుడి రేపరు చుట్టి మన ‘జీవన విధానాన్ని’ సూచించే వాచకం.
 ఇందులో సూచించినవన్నీ చేయగలవాడు మహాత్ముడు.
ఏ ఒక్కటయినా చేయగలిగినవాడు నిత్య సంతోషి ..   ఏమిటా పనులు???

అందరిపట్లా స్నేహ భావన,
మిత్రత్వం, కరుణ, దేనిమీదా మమకారం లేకపోవడం,
అహంకారాన్ని విడిచిపెట్టడం,
సుఖాన్నీ, దుఃఖాన్నీ ఒకేలాగ చూడటం, ఓర్పు, సంతుష్టి కలవాడు (ఉదా: మా వంట మనిషి),
దృఢ నిశ్చయం కలవాడు (వినూ అనే పుట్టు గుడ్డి)– ఇది నమూనా జాబితా
(భగ. 12 అ.శ్లో. 13–14). ఇందులో మతమూ, శ్రీకృష్ణుడూ, హిందుత్వం లేదు.

యేల్‌ విశ్వవిద్యాలయం కోర్సు వారి దురదృష్టం. కనీసం వారు పోగొట్టుకున్నదేమిటో సంపాదించుకోవాలని తంటాలు పడుతున్నారు. వాళ్లు వదులుకోలేక ఇబ్బంది పడుతున్న వికా రాల్ని దిగుమతి చేసుకుని మన విలువైన ఆస్తుల్ని చంపుకుంటున్నాం.

   ..ఆనందం ఒక దృక్పథం..
.. Happiness is an attitude ..
.. ఒక మానసిక స్థితి..
అది బయటినుంచి రాదు..
సంస్కృతి, సంస్కారమూ, స్వభావమూ కలిసి ప్రసాదించే వారసత్వం.
అది చదువుకుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, పవిత్రమైన నేలలో కన్ను విప్పే పుష్పం. అదీ ఆనందం.

మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది

ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది

దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం  : https://goo.gl/gDaGJ4

ఎ పి లో   జిల్లాల వారి దేవాలయాల వివరాలు   : https://goo.gl/Qzhzis

రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం  : https://goo.gl/VnNaj5

జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు  : https://goo.gl/X9NBUe

శక్తిపీఠాలు సమాచారం  : https://goo.gl/LtvStS

గ్రూప్ టెంపుల్స్  : https://goo.gl/N9xD8M

ఆరుపడైవీడు క్షేత్రాల కోసం  : https://goo.gl/HqGR8P

పంచారామ క్షేత్రాల వివరాలు  : https://goo.gl/ygX5hW

పంచభూత క్షేత్రాల వివరాలు  : https://goo.gl/pqtgxj

తిరుమల గురించి  : https://goo.gl/mb2DGD

శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF

కాశి గురించి  : https://goo.gl/DZzKa1

రామేశ్వరం గురించి  : https://goo.gl/yyH424

అరుణాచలం గురించి  : https://goo.gl/eFbKNE

మదురై గురించి : https://goo.gl/1Ntthd

శ్రీశైలం గురించి  : https://goo.gl/ZUfFHo

కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి  : https://goo.gl/A5UU7v

ప్రసిద్ధ శైవ క్షేత్రాలు  : https://goo.gl/mn2K3y

మహాభారతం పుస్తకాలూ  : https://goo.gl/v1XuqV

భాగవతం పుస్తకాలూ  : https://goo.gl/9fMcDp

టెంపుల్ క్విజ్ ఆడండి  : https://goo.gl/nrhsBK

దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం  : https://goo.gl/gDaGJ4

ఎ పి లో   జిల్లాల వారి దేవాలయాల వివరాలు   : https://goo.gl/Qzhzis

రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం  : https://goo.gl/VnNaj5

జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు  : https://goo.gl/X9NBUe

శక్తిపీఠాలు సమాచారం  : https://goo.gl/LtvStS

గ్రూప్ టెంపుల్స్  : https://goo.gl/N9xD8M

ఆరుపడైవీడు క్షేత్రాల కోసం  : https://goo.gl/HqGR8P

పంచారామ క్షేత్రాల వివరాలు  : https://goo.gl/ygX5hW

పంచభూత క్షేత్రాల వివరాలు  : https://goo.gl/pqtgxj

తిరుమల గురించి  : https://goo.gl/mb2DGD

శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF

కాశి గురించి  : https://goo.gl/DZzKa1

రామేశ్వరం గురించి  : https://goo.gl/yyH424

అరుణాచలం గురించి  : https://goo.gl/eFbKNE

మదురై గురించి : https://goo.gl/1Ntthd

శ్రీశైలం గురించి  : https://goo.gl/ZUfFHo

కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి  : https://goo.gl/A5UU7v

ప్రసిద్ధ శైవ క్షేత్రాలు  : https://goo.gl/mn2K3y

మహాభారతం పుస్తకాలూ  : https://goo.gl/v1XuqV

భాగవతం పుస్తకాలూ  : https://goo.gl/9fMcDp

టెంపుల్ క్విజ్ ఆడండి  : https://goo.gl/nrhsBK

రాముడి వంశ వృక్షo



ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం

బ్రహ్మ కొడుకు మరీచి

మరీచి కొడుకు కాశ్యపుడు.

కాశ్యపుడు కొడుకు సూర్యుడు.

సూర్యుడు కొడుకు మనువు.

మనువు కొడుకు ఇక్ష్వాకువు.

ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.

కుక్షి కొడుకు వికుక్షి.

వికుక్షి కొడుకు బాణుడు.

బాణుడు కొడుకు అనరణ్యుడు.

అనరణ్యుడు కొడుకు పృధువు.

పృధువు కొడుకు త్రిశంఖుడు.

త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)

దుంధుమారుడు కొడుకు మాంధాత.

మాంధాత కొడుకు సుసంధి.

సుసంధి కొడుకు ధృవసంధి.

ధృవసంధి కొడుకు భరతుడు.

భరతుడు కొడుకు అశితుడు.

అశితుడు కొడుకు సగరుడు.

సగరుడు కొడుకు అసమంజసుడు.

అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.

అంశుమంతుడు కొడుకు దిలీపుడు.

దిలీపుడు కొడుకు భగీరధుడు.

భగీరధుడు కొడుకు కకుత్సుడు.

కకుత్సుడు కొడుకు రఘువు.

రఘువు కొడుకు ప్రవుర్ధుడు.

ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.

శంఖనుడు కొడుకు సుదర్శనుడు.

సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.

అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.

శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.

మరువు కొడుకు ప్రశిష్యకుడు.

ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.

అంబరీశుడు కొడుకు నహుషుడు.

నహుషుడు కొడుకు యయాతి.

యయాతి కొడుకు నాభాగుడు.

నాభాగుడు కొడుకు అజుడు.

అజుడు కొడుకు ధశరథుడు.

ధశరథుడు కొడుకు రాముడు.

రాముడి కొడుకులు లవ కుశలు . .

ఇది రాముడి వంశ వృక్షo ...

ఉపసంహారం Teens pemapkam oka kala - By Sri Yandamuri



ఉపసంహారం
ముగింపుకొచ్చాం. అంతా చదివి, పిల్లల పెంపకం ఇంత కష్టమా అనుకోకండి. ఇంత ఇష్టమా అనుకోండి..! ఇదంతా సాధ్యమా అనుకోకండి. సాధ్యమైనంత చేయండి..! ఎవరి కర్మకి వారే బాధ్యులు అనుకోకండి. పిల్లల కర్మకి మనమే బాధ్యులమని అని నమ్మండి..!
ఇంత చెప్పారు కదా... మీరు పిల్లల్ని మీరు ఇలాగే పెంచారా? అని మీరు ప్రశ్నించవచ్చు. నేను కాదు. నా తండ్రి నన్ను ఇలా పెంచారు.
గోదావరి పక్క ‘గుత్తెనదీవి’ అనే పల్లెటూళ్ళో మా తాతగారు స్కూలు గుమస్తాగా పూరి పాకలో ఉండేవారట. మా తండ్రికి ఎనిమిదేళ్ళ వయసులో ఆయన చనిపోయారట. ఆ రోజుల్లో రాజమండ్రిలో సీతారామయ్యగారనే ఒక దయార్ద్రహృదయుడు అనాధ పిల్లల్ని చేరదీసి చదివిస్తూ ఉంటే, మా తండ్రి అక్కడ చదువుకున్నారు. మా వంశంలో ఆయనే మొదటి గ్రాడ్యుయేటు. పోషించలేక నన్ను మాతాత (అమ్మనాన్న) గారి దగ్గర ఉంచారు. నేను పెద్దగా తెలివైనవాడిని కాను. దానికి తోడు తాత గారి గారాబం. అందువల్ల అయిదు, ఆరు క్లాసుల్లో ఫెయిల్ అయ్యాను కూడా. ఆరో క్లాసులో ఉన్నప్పుడు తాతగారి మరణంతో తండ్రి దగ్గరకు వచ్చాను. అప్పడు వారు చాలా తక్కువ స్థాయిలో ఉండేవారు. టేబిల్ ఫ్యాన్ కొన్నప్పుడు మా అమ్మ కొబ్బరికాయ కొట్టి పూజ చేయటం నాకు తెలుసు.
అనంతపురంలో నా తండ్రి ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టి, వీధిలో పిల్లలందరికీ సాయంత్రాలు ఉచితంగా పాఠాలు చెప్పేవారు. కేవలం తండ్రి పెంపకం వల్ల ఏడో తరగతి నుంచి దశ తిరిగింది. ఆపై చదువులో వెనుదిరిగి చూసుకోలేదు. కాకినాడలోనే బి.కాం పి.ఆర్. కాలేజి ప్రధముడిగా వచ్చినా, విశాఖపట్నం వెళ్లి ఎమ్.కాం చదివేటoత డబ్భు లేదు కాబట్టి, ఉన్న ఊర్లోనే సి.ఏ. (ఆ కోర్సు ఫీజు ఆ రోజుల్లో 1200) చదివాను. నాలుగు సంవత్సరాల కోర్సు మూడేళ్ళలో పుర్తయిపోయింది. 
ఒక కుర్రవాడి జీవితానికి ఇంట్లో పెద్దల సారధ్యం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇంకేమి తార్కాణం కావాలి? స్వోత్కర్ష అనుకోకపోతే, నా తండ్రి అడుగుజాడల్లోనే నేనూ కొడుకుని పెంచాను. 
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, వారానికొకసారి కూర్చుని, ఏమి చదువుతున్నాడో చర్చించేవాడిని. వాడు ఇంటర్ స్టేట్ రాంకర్. పాకెట్ మనీ కాన్సెప్టు నా తండ్రి నాకు నేర్పారు. ఖమ్మంలో ఎనిమిదో క్లాసు చదువుతూ చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్తూ సంపాదిoచుకునేవాడిని. ఇంటర్ అవగానే, నా కొడుకు కూడా పగలు నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్ లో ఇండస్ట్రియల్ ట్రైనీగా 1500 కి పని చేస్తూ, సాయంత్రం పూట ఇంటి పక్కనే ఉన్న కాలేజిలో బి.కాం చదివాడు. యూనివర్సిటీ థర్డ్ రాంకర్. ఇరవై రెండేళ్ళకే సి.ఏ. పూర్తి చేసి, (ఈ లోపులోనే నాలుగు సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండటంతో) IIT, Ph.Dలతో పోటీ పడి ప్రపంచ బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించాడు. కొంతకాలం పని చేసాక, ఎం.బి.ఏ చదివి ప్రస్తుతం ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఏడాదికి మూడు కోట్ల జీతంతో పనిచేస్తున్నాడు. అతడి భార్య చార్టెడ్-అకౌంటెన్సీలో ఇండియా టాప్ రాంకర్. మనవడు టెన్నిస్ లో తన దేశం (వియత్నాం) తరుపున సింగపూర్ వెళ్ళాడు. పియానో లో ప్రావీణ్యం ఉన్నది. ఇంటర్నేషనల్ ఒలంపియాడ్‌లో గోల్డ్ మెడలిస్ట్. ఏషియా అబాకస్ కోసం రష్యా వెళ్ళాడు. అతడి వయసు పన్నెండు సంవత్సరాలు. పుట్టిన రోజులు జరుపుకోకుండా ఆ డబ్బులు ఛారిటీలకి ఇస్తాడు.
వారాలు చేసుకుంటూ చదివిన ఒక తండ్రి వంశం, మూడు తరాల్లో ఎలా మారిందో చూస్తే, వంశంలో ఒక్కరు బాగుపడితే వంశం మొత్తానికి అది టర్నింగ్ పాయింటై, సింగిల్ బెడ్ రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ విల్లాకి మారుతుందని చెప్పటానికే ఈ స్వోత్కర్ష. అవునా కాదా? ఆలోచించి చూడండి. 
మనిష బాగుపడకుండా ఉండటానికి కారణం డబ్బు లేకపోవటం కాదు. శ్రద్ధ లేక పోవటం. మంచి పెంపకం బ్రహ్మ విద్యేమీ కాదు. అన్ని వ్యాపకాలకన్నా (ముఖ్యంగా టి.వీ చూడటం కన్నా) అది నిజoగా బావుంటుంది. పెట్టుబడి ఏమీ అక్కరలేదు. పెంచటం పై ‘పాషన్’ ఉండాలంతే. 
అదీ ఈ వ్యాస పరoపర ఉద్దేశ్యం. పాతికేళ్ళ కొడుకు భుజం మీద ఒక తండ్రి చేయివేసి మాట్లాడగలిగితే అది అద్భుతమైన ప్రేమ ప్రకటన.
ఆకాశం పక్క మీద వెన్నెల దుప్పటేస్తే, చందమామ తలదిండు... జీవితం.
అమ్మవడి పక్కమీద ప్రేమ దుప్పటి పరిస్తే నాన్న చెయ్యి తల దిండు... బాల్యం.
బెస్ట్ ఆఫ్ లక్.

Tuesday, March 13, 2018

మావి చిగురు తినగానే కోయిల పలికేనా --- ఆ పాట సాహిత్యాన్ని ఈ చిత్రాలకు అన్వయిస్తూ సాయిత్యం

శుభోదయం!! వేసవి కాలం మరీ ముఖ్యంగా వసంత కాలం వస్తోందంటే, ఇన్నాళ్లు జడత్వంతో ఉన్న ప్రకృతిలో ఒక చైతన్యం వనంలో నవత్వం ఇదిగో ఇలా మౌనం గా ఉన్న ఓ దుంప లొంచి   ఒక పువ్వు అలా అలా ఇలా మొలకెత్తి, తలయెత్తి ఠీవిగా ఎలా రాజసాలు పోతోందో ఈ రోజు నా ఉదయపు నడకలో చూసినప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పాట సీతామాలక్ష్మి సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చిన గీతానికి పువ్వుకు తావి అబ్బినట్లుగా బాలు సుశీలగారి గళాల పరిమళం "మావి చిగురు తినగానే కోయిల పలికేనా" పాట గుర్తుకు తెచ్చింది.
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునోగాని ఆమని ఈవని
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పోడుములు
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమనునోగాని ఆమని ఈవని
మావి చిగురు తినగానే
కోయిల పలికేనా కోయిల పలికేనా
ఆ పాట సాహిత్యాన్ని ఈ చిత్రాలకు అన్వయిస్తూ ఆస్వాదించండి.
మీ కోసం ఆ పాట యూట్యూబ్ ఈ లింక్ https://www.youtube.com/watch?v=Wd5xLjDmet0నొక్కి ఆనందించండి!!  శుభోదయం!!
సత్యసాయి విస్సా ఫౌండేషన్.

Thursday, March 8, 2018

"ప్రతి కుర్రాడికీ ఒక పాఠం. ప్రతీ వృద్ధుడికీ ఒక నమ్మకం".జపనీస్ కథ

ఐ లవ్యూ డియర్
నర్సాపురం నుండి పాలకొల్లు ట్రైన్ లో వెళ్తున్నాను. గోధూళివేళ. కిటికీ లోంచి పొలాలు, అందమైన ప్రకృతి, స్వచ్చమైన గాలి... అక్కడక్కడా పెంకుటిళ్ళు, డాబాలు... ఇంత అందమైన ప్రకృతిలోనూ ప్రకృతికే అందానిచ్చే అద్భుతమైన దృశ్యం. ఇంటి పెరట్లో మొక్కల మధ్య గట్టు మీద కూర్చున్న తండ్రి, పక్కన నిల్చుని తల రుద్దుతూన్నభార్య, చెంబుతో నీళ్ళు అందిస్తున్న పదేళ్ళ కొడుకు, గిన్నె పట్టుకొని కుంకుడో, శీకాకాయరసమో తల మీద పోస్తున్న కూతురు... ఇలాంటి దృశ్యం చూసి ఎన్నో ఏళ్ళు అయింది.
చేస్తున్న పనిలో ఇలా కుటుంబ సభ్యులందరూ మమేకమవడం చాదస్తంగా, కాస్త పాతచింతకాయ పచ్చడిగా ఉందని అనేవారూ ఉండకపోరు. తినడానికే సమయం దొరకని ఈకాలంలో, ఏ షాంపూతోనో రెండునిముషాల్లో అయిపోయే స్నానానికి సొంత పనులు మానుకొని ఇంతమంది చేయడం ఏమిటని వాదించేవారూ ఉంటారు. కానీ జీవితంలో చెరిగిపోని సంపద ఈ మధురానుభూతులే కదా.
మామని చంపటానికి కోడలు చేసే ప్రయత్నాలూ… రక్త సంబంధికుల మధ్య చిచ్చులు పెట్టే విలన్ కథలూ చూస్తూ సాడిస్టిక్ భావప్రాప్తి చెందే టి.వీ. నుంచి ఒక పది నిముషాలు పిల్లలకి (మానవ సంబంధాల మీద, ప్రేమా ఆప్యాయతల మీదా) కథలు చెప్పటానికి కేటాయిస్తే బావుంటుంది. ఎన్నో మంచి కథలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ క్రింది జపనీస్ కథ చదివండి.
ఒక యువకుడు పుట్టిన రోజు నాడు తన ఎనభై ఏళ్ళ తాతని డిన్నర్‌కి తీసుకువెళ్ళాడు. భోజనం మధ్యలో పొలమారి, ఆ వృద్ధుడు గ్లాసు సరిగ్గా పట్టుకోలేక వదిలెయ్యటంతో ఆ హడావుడీ, కంగార్లో అన్నం ఆయన బట్టల మీద పడి, దాని మీద చిక్కటి సూపు జారి, అసహ్యంగా తయారైంది. పెద్ద శబ్దంతో గ్లాసు క్రింద పడటంతో అటు తిరిగిన కస్టమర్లు, వాళ్ళ వైపు జిగుప్సగా చూసారు.
ఇదేమీ పట్టనట్టు ఆ యువకుడు ఆయన భోజనం పూర్తయ్యేవరకూ ఆగి, ఆ తరువాత వాష్-బేసిన్ దగ్గరకు తీసుకు వెళ్ళి, అన్నం మెతుకులు చేత్తో దులిపి, బట్టల మీద పడిన సూపు శుభ్రంగా కడిగి, తడి చేసిన జేబు రుమాల్తో మొహం తుడిచి, దువ్వెన తీసి తల దువ్వి, కళ్ళజోడు తిరిగి సరిగ్గా సర్ది, మొత్తం పరికించి సంతృప్తి చెంది, తిరిగి టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు.
అప్పటి వరకూ శబ్దపు వర్షంలో మునిగిపోయిన రెస్టారెంటు ఒక ఇబ్బందికరమైన స్వీయ అపరాధనా భావపు అవమానంతో నిశ్శబ్దమై పోయింది. బిల్లు పే చేసి ఇద్దరూ బయటకు వెళ్తూ ఉండగా, వెనుక నుంచి ఒక కస్టమరు "బాబూ... నువ్వు ఇక్కడ ఏవో వదిలేసి వెళ్తున్నావ్" అని అరిచాడు.
ఆ యువకుడు వెనక్కి తిరిగి తన టేబుల్ వైపు చూసి "ఏమీ లేవే. ఏమిటి?" అని అడిగాడు.
"ప్రతి కుర్రాడికీ ఒక పాఠం. ప్రతీ వృద్ధుడికీ ఒక నమ్మకం".
(From: velugu vennela deepaalu: bedtime stories for your child)

Tuesday, March 6, 2018

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

*ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.*
*ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?*
వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.
“ రాముడెవ్వానితో రావణు మర్దించె?
పర వాసు దేవుని పట్నమేది ?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?
వెలయ నిమ్మ పండు విత్తునేది?
అల రంభ కొప్పులో అలరు పూదండేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?
అన్నిటను జూడ ఐదేసి యక్షరములు
ఈవ లావాల జూచిన నేక విధము
చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”
లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”.
👉పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు.
తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.
మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని,
నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.
👉ఇక జవాబుల సూచికలు-
ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,
*ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి.* (ఉదా;- “ కిటికి”వలె ).
1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?
2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?
3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)
4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?
5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?
6.సభలో నవ్వించే కవిపేరు ఏది?
7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)
8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?
*ఈ క్రింది జవాబులు చూడండి.*
1.తోకమూకతో!
( వానరాలకి ఇంకొక పేరు.)
2.రంగనగరం!
( శ్రీరంగం )
3.లకోల కోల!
( కోల= బాణం)
4.జంబీర బీజం!
( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)
5.మందార దామం!
( దామం అంటే దండ)
6.వికట కవి!
( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)
7.పంచాస్య చాపం!
( శివుని విల్లు)
8.నంద సదనం!
( నందుని ఇల్లు)
పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి.
👉అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం.
*ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి*.
ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.
పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

భయంలో చాలా రకాలున్నాయి - యండమూరి

భయంలో చాలా రకాలున్నాయి. శ్రీమతి ఆఫీస్ నుంచి ఆరింటికి ఇంటికి రాకపోతే ఏడుపొస్తే అది 'అభధ్రతాభావం'. ఆమెపై కోపమొస్తే అది 'చిరాకు'. మాటిమాటికి కొట్టుకుంటూన్న కిటికి తలుపు రాబోయే సునామీకి నిదర్శనమేమోనని భయపడితే అది 'టెన్షన్'. బంగాళాఖాతం నుంచి ఆ సునామీ హైదరాబాద్ వరకూ వస్తుందేమోనన్న ముందు చూపుతో చర్మినార్ ఎక్కాలనిపిస్తే అది 'ఏంగ్జయిటి.' అగ్నిపర్వతాలకీ, భూకంపాలకి ఆలవాలమయిన జపాన్ వచ్చే నెల వెళ్ళాల్సివచ్చినప్పుడు, అప్పుడు అక్కడ హొటల్ కూలిపోతుందేమో అన్న భయంతో ఇక్కడ ఇండియాలో నిద్ర పట్టకపోతే అది 'ఆoదోళన'. కాసింత నిద్ర పట్టగానే ఎర్రటి లావా చుట్టుముట్టినట్టు కల వస్తే అది 'నెర్వస్‌నెస్'.

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి - 5

'ఆపిల్‌ తినొద్దు' అన్నాడు భగవంతుడు. 'ఎందుకూ?' అన్నాడు మనిషి. 'కారణాలు అడక్కు. ఆపిల్ తినొద్దన్నానంతే' అరిచాడు దేవుడు. ఆయన మాటలు వినకుండా అతడూ, అతడి భార్యా పండు తిన్నారు. కోపమొచ్చిన భగవంతుడు వాళ్ళకు ఒక పాఠం నేర్పాలనుకున్నాడు.
వారికి సంతానాన్ని ఇచ్చాడు.
...
"నేను రాక్షసుల్నీ, భూతాల్నీ పెంచుతున్నానా?" అన్నది మీ ప్రశ్నయితే దానికి సమాధానం… ‘కాదు. నిశ్చయంగా కాదు..!’
ఇంట్లో కుటుంబసభ్యులందరూ మాటిమాటికీ ఆనంద భాష్పాలు తుడుచుకోవటం కేవలం టీ.వీ. అడ్వర్టైజ్మెంట్లలోనే చూస్తాం. ఘర్షణలు లేకుండా ఏ ఇల్లూ ఉండదు. కానీ కొద్ది ప్రయత్నంతో ‘హౌస్’ని ‘హోమ్’ చేసుకోవచ్చు. ప్రేమ ఆప్యాయతలు సిమెంటు ఇసుకలుగా కలిపి పిల్లలకి ‘వ్యక్తిత్వo’ అనే మంచి భవంతిని నిర్మిస్తే, తిరిగి అంతే ప్రేమ వృద్ధాప్యంలో దొరుకుతుంది. బంధం మల్లె తీగలాంటిది. అది పెరిగి పూలు పూయాలంటే మంచి పోషణ కావాలి. పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వంతో వికసించాలంటే, వయసుతో బాటు వచ్చే వారి మానసిక పరిణామాల గురించి తెలుసుకుంటూ దానికి తగ్గ పోషణనివ్వాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాo.
1. నమ్మకం / అపనమ్మకం:
పద్దెనిమిది నెలల వయసు వరకూ పిల్లలు ‘నమ్మకం/అపనమ్మకం‘ స్టేజ్లో పెరుగుతారు. తమ అవసరాలన్నీ పెద్దలు తీరుస్తూoటే, చుట్టూ ఉన్న వాళ్ళంతా దయార్ద్ర హృదయులనీ, ప్రపంచమంతా మంచిదనీ నమ్మకం పెంచుకుంటారు. తల్లి ఎలాగూ పక్కనే ఉంటుంది కాబట్టి, తండ్రి కూడా ఎక్కువ సమయం గడిపే కొద్దీ, పిల్లలకి మనుష్యుల పట్ల మరింత సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అలా కాకుండా... పనుల వత్తిడి వల్ల పెద్దలు చంటి పిల్లలని సరిగ్గా చూసుకో లేదనుకుందాం. పసి వయసులోనే ప్రపంచం పట్ల వారికి అపనమ్మకం ఏర్పడుతుంది. ఒక ఉదాహరణ ద్వారా ఇది పరిశీలిద్దాం.
ఇరవై ఏళ్ళ అమ్మాయి తల్లి అయింది. అందం చెడిపోతుందన్న భయంతోనో, ఫేస్బుక్ పిచ్చివల్లనో, చాటింగ్లో పడి పిల్లవాడి పెంపకం పట్టించుకోదు. పాలు కూడా ఇవ్వదు. ఏడ్చిఏడ్చి పిల్లవాడే ఆపాలే తప్ప ఆపాల గురించి పట్టించుకోదు. అప్పుడతడు రెండు రకాలుగా మారవచ్చు. (ఏ) ప్రతి చిన్న విషయానికీ ఇతరుల మీద ఆధారపడటం. (బి) ఎవరినీ లెక్క చేయకుండా ఏకాకిగా బ్రతకటం.
‘పిల్లలపై వారి బాల్యం తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది’ అన్న విషయాన్ని, ప్రపంచపు అత్త్యుత్తమ ఇద్దరు సైకాలజిస్టులు కెల్లీ, ఫ్రాయిడ్ రెండు విభిన్నమైన దృక్పథాలతో చూస్తున్నారు.
 బాల్యం బాగా లేని ఎందరో ప్రముఖుల జీవితాలు పరిశీలించిన కెల్లీ “... చిన్న వయసులో కష్టాలు అనుభవించిన పిల్లలు స్వతంత్రభావాలతో ఎదిగి, తాము అనుకున్నది సాధిస్తారని" అంటాడు. లింకన్, థామస్ ఆల్వా ఎడిసన్, లాల్ బహదూర్ శాస్త్రి, హారిసన్ ఫోర్డ్ (ఇండియానా జోన్స్) లాంటి గొప్పవాళ్ళ ఉదాహరణలు చూస్తే ఈ థియరీ కరెక్టే అనిపిస్తుంది.
 మరో పక్క ఫ్రాయిడ్ దానికి వ్యతిరేకంగా “బాల్యంలో ప్రేమ రాహిత్యం వల్ల పిల్లలు మాఫియా లీడర్లు, టెర్రరిస్టులుగా మారతారు” అని వాదిస్తాడు. స్టాలిన్, హిట్లర్ మొదలైనవారి జీవితాలని చూస్తే ఆ థియరీ కూడా కరెక్టే అనిపిస్తుంది.
దీనిబట్టి మనకో విషయం అర్థం అవుతుంది. బాల్యంలో పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లలు ఏదో ఒక విపరీత ధోరణిలో పయనించక తప్పదు. అటు కోపం, చెడు అలవాట్లు, డిప్రెషన్ లాంటి నెగటివ్ పరిణామాలు కావచ్చు. లేదా పట్టుదల, గమ్యం, కసి లాంటి పాజిటివ్ (మంచి) కావచ్చు. ఫ్రాయిడ్ చెప్పినా, కెల్లీ చెప్పినా అదే కదా..! పిల్లల భవిష్యత్తుని ‘విధి’ కి వదిలేయ్యాకుండా ఉండటమే ఉత్తమ పేరెంటింగ్.
2. నిర్ధారణ / అనుమానం:
ఒకటి నుంచీ మూడు సంవత్సరాల పిల్లల్లో, తమ చుట్టూ ఉన్న వాతావరణం పట్ల కుతూహలం మొదలవుతుంది. వారికో ఐడెంటిటి ఏర్పడుతుంది. తప్పటడుగులకే తల్లి సంబరం, ముద్దుముద్దు మాటలకి పెద్దలు ముచ్చటపడే విధానం, వీటన్నిటి వల్లా ప్రపంచం అంతా తననే ప్రేమిస్తుందన్న నమ్మకం కలుగుతుంది. తనని చూసి ఓ అబ్బాయి నవ్వగానే తనలో ఏదో గొప్పతనం ఉండే ఉంటుందన్న అమ్మాయి అమాయకత్వం లాంటి స్టేజి ఇది. దీని తరువాత పిల్లలు అతి ప్రమాదకరమైన మూడో స్టేజ్లోకి వెళ్తారు.
3. తెలివి / జడత్వం:
మూడేళ్ళ వయసులో పిల్లలు తొలిసారి ఇల్లు వదిలి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్య పెరిగిన పిల్లలు టీచర్లు, ఆయాల సంరక్షణలోకి వెళ్తారు. స్కూల్లో తోటి పిల్లల మధ్య కొత్త వాతావరణం... ఇంట్లో ప్రేమ స్థానే బయట టీచర్ల విసుగు అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ ప్లే-స్కూల్స్ ని తక్కువ చెయ్యటం కాదు. ప్లే-స్కూల్స్‌లో ఆయాలు. టీచర్స్ చాలా ఓర్పు, సహనంతో ఉంటారు. అయినా వారూ మనుష్యులేగా..! అప్పుడప్పుడు వారి బాధ్యతారహిత రుసరుసల మధ్య పసిపిల్లల బాల్యం కొత్త మలుపు తిరుగుతుంది.
మరోపక్క ఇంట్లో వాతావరణం కూడా కాస్త వేడెక్కుతుంది. అల్లరికి తల్లిదండ్రులు విసుగు ప్రదర్శిoచటం మొదలుపెడతారు. అప్పటివరకూ అడిగిందల్లా ఇచ్చిన పెద్దలు, అసంబద్ద కోర్కెలని తిరస్కరిoచటం ప్రారంభిస్తారు. ‘నిరాదరణ’ అంటే ఏమిటో కొద్ది కొద్దిగా తెలుస్తుంది. జీవితం అంటే పరమాన్నమే కాదు, పచ్చిమెరపకారం అనేది తొలిసారి అర్థమవుతుంది.
ఈ షాక్‌ని వారు ఓపట్టాన తట్టుకోలేరు. తమ హక్కుల కోసం ప్రతిఘటించటం నేర్చుకుంటారు. అక్కడి నుంచీ అల్లరి ప్రారంభం అవుతుంది. పిల్లల హైపర్-ఆక్టివిటీకీ, పెద్దల కంట్రోల్ కీ మధ్య ఇల్లు యుద్ధరంగం అవుతుంది.
ఈ విషయమై 69 పిల్లల్ని కని ప్రపంచ రికార్డ్స్ సృష్టించిన మిస్సెస్ ఫీయొడెర్ “ఏడాది రాగానే పిల్లలకి ‘…మ్ ...మ్మ ...అమ్మ... అనమ్మా’ అంటూ ప్రోత్సాహిస్తాం. రెండేళ్ళు వచ్చేసరికి “దామ్మ... దా” అంటూ నడవమని బలవంతపెడతాము. ఆ తరువాత ఇరవై ఏళ్ళ పాటు వాళ్ళని “కాస్సేపు మాట్లాడకుండా ఉండవా, కదలకుండా కుదురుగా కూర్చోవా. ప్లీజ్. నీకు దణ్ణం పెడతాను’ అంటూ ప్రార్థిస్తాం” అంటుంది.
4. క్రియేటివిటి / ఆత్మన్యూనత:
అయిదు నుంచి పదమూడేళ్ళ వయసులో పిల్లలు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. తమ తెలివితేటలని బహిర్గత పరచాలన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ సమయంలో వారి ఉత్సాహానికి ప్రోత్సాహం లభించిన పిల్లలు తెలివైన వారుగా; లేని పిల్లలు జడులుగా (జడత్వం అంటే క్రియేటివిటి లేకపోవటం), ప్రయాణం మొదలుపెడతారు. పెద్దల కోపం అర్థమవటం ప్రారంభం అవుతుంది ప్రేమ ఆప్యాయతలు బలంగా పెనవేసుకునేది ఈ స్టేజ్‌లోనే.. ఆ సమయంలో పెద్దల నుంచి నిరాదరణా, విమర్శా, దండనా ఎక్కువైతే వాళ్ళు ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు.
5. గెలుపు / అయోమయం:
13-20 మధ్య వయసులో పిల్లలకి ఒక రంగుల లోకం కనబడటం ప్రారంభం అవుతుంది. ఎవరికీ చెప్పుకోలేని శారీరకమార్పులతో పాటూ, అందం తాలూకు అవగాహన కూడా మొదలవుతుంది. కాస్త థ్రిల్. చాలా అయోమయం. ఆత్మగౌరవం, వ్యక్తిత్వం, తమపట్ల తమకి నమ్మకం ప్రారంభం అవుతుంది. ఆ నమ్మకం మితి మీరితే రాష్ డ్రైవింగ్ (సూడో-గెలుపు), అపోజిట్ జెండర్‌తో ప్రేమ (గుర్తిoప బడాలన్న కోరిక), చిన్న వయసులోనే సెక్స్ (విచక్షణా లేమి) మొదలైన - దార్లలోకి వెళ్ళవచ్చు. తమపై నమ్మకం తగ్గితే పిరికితనం, నత్తి, నిర్ణయలేమి మొదలైన అవలక్షణాలకు గురి అవ్వొచ్చు.
తల్లిదండ్రులని వదిలేసి స్నేహితుల వైపు మొగ్గే వయసిది. తమ అస్తిత్వం (ఐడెంటిటి) నిలుపుకోవడానికి వీళ్ళు తరచూ ఇంట్లో పోట్లాడుతూ ఉంటారు. ఎదిగిన ఒక పేరెంట్కీ, ఎదుగుతూన్న ఒక వ్యక్తిత్వానికీ మధ్య ఘర్షణే అల్లరి. ఈ పోరాటంలో గెలిచినా/ఓడినా పెద్దలకి దూరం అవుతారు. మరోరకంగా చెప్పాలంటే తమ పోరాటంలో పెద్దల్ని గెలిచిన తరువాత, తమ గెలుపుని (కొత్త మోటర్ బైక్, పబ్కి డబ్బులు) స్నేహితులతో పంచుకుంటారు. ఇంట్లో గడపటం తక్కువ అవుతుంది. ఒకవేళ పెద్దలు ఇటువంటివి నిరాకరించినా, ఆ కారణం వలన పెద్దలకి దూరం అవుతారు.
ఆ పైది యుక్త వయసు. ‘తన కుటుంబం’ అన్న ధ్యాస ప్రారంభం అవుతుంది. కొందరు లంచగొండితనం, స్వార్థం వైపు వెళితే, మరికొందరు సమాజంలో గుర్తింపు, ఇతరులకి సహాయం, దయాగుణo మొదలైనవి అలవర్చుకుంటారు. వీరు గెలిచినవారు. తాము సాధించిన విజయాలని తలుచుకుంటూ, మరణం గురించి దిగులు చెందకుండా వార్ధక్యపు అంతిమ గమ్యాన్ని సంతృప్తితో చేరుకుంటారు. అయితే ఈ పుస్తకం పిల్లల గురించే తప్ప ఇరవై ఏళ్ళు దాటిన వారి గురించి కాదు కాబట్టి ఈ వివరణ ఇక్కడితో ఆపుదాం.

పిల్లల మానసిక సమస్యలు - యండమూరి

పిల్లల మానసిక సమస్యలు
పిల్లల్లో కనపడే ఈ క్రింది సమస్యలకి డాక్టర్లు అవసరం లేదు. మీరు చాలు.
1. సమస్య - విశ్లేషణాలోపం: ‘హిమాలయాలకి అవతలి వైపు ఉన్న చైనా మన దేశానికి ఏ దిక్కున ఉన్నది? ఉత్తరమా? దక్షిణమా?’ అని అడిగితే ఇంటర్ చదివే అమ్మాయికి అసలు ప్రశ్నే అర్థం కాదు. కొందరు పిల్లలు ఈ విధంగా సమస్యల్ని విశ్లేషించలేరు. ఇది మానసిక రుగ్మత కాదు. చిన్న చిన్న క్విజ్ ప్రోగ్రాములు నిర్వహిస్తే ఈ సమస్య తగ్గిపోతుంది.
2. ధృక్పథ మార్పు లోపం: సమస్యని ఒకే దృక్పథంతో చూస్తూ, మరో రకంగా ఆలోచించలేకపోవటం కొందరి పిల్లల్లో లోపం. 'ఒక బెగ్గర్ అన్నయ్య చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి తమ్ముళ్ళు లేరు, ఎలా?' అన్న ప్రశ్నకి చాలాసేపు ఆలోచిస్తే అందులో తప్పేమీలేదు. కానీ 'బిచ్చగాళ్ళు అందరూ మగవారే అయ్యుండాలన్న రూల్ లేదు కదా' అని హింట్ ఇచ్చినా కూడా, సమాధానం చెప్పలేకపోతే ఈరకమైన లోపం ఉన్నదన్నమాట. ఈ పిల్లలు ‘ఆలోచించవలసిన’ ప్రశ్నల్ని అవాయిడ్ చేస్తారు. హేతువు, తర్కం పట్ల ఏ మాత్రం కుతూహలం ఉండదు.
3. కమ్యునికేషన్ లోపం: కొందరు పిల్లలు మాట్లాడుతూoటే అర్థంకాదు. అది మూడు రకాలుగా వస్తుంది. 1. నెమ్మది నెమ్మదిగా కూడబలుక్కుని మాట్లాడటం. 2. వేగంగా మాటలు దొర్లిస్తూ మాట్లాడటం. 3. కర్త కర్మ క్రియ లేకుండా మాట్లాడటం..! మొదటిదానికి స్పీచ్ తెరపిస్ట్ అవసరం. రెండోది హైపరాక్టివ్ లక్షణం. దీని గురించి తరువాత చర్చిద్దాం. మూడోది మాత్రం కాస్త ఆలోచించవలసిన విషయం. ఇంట్లో అందరూ వాడే భాషనే మాట్లాడుతున్నా, ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాడంటే ఎక్కడో లోపం ఉన్నదన్నమాట. అది భాషలోనా? మనస్తత్వంలోనా? అన్న విషయం గుర్తించాలి.
4. పక్క తడపటం (bed wetting): పిల్లల్లో ఉండే కొన్ని అతి సామాన్య లక్షణాలు పెద్దల్ని భయభ్రాoతులని చేస్తాయి. నిద్రలో ఉలిక్కిపడటం, పక్క తడపడం, మొదలైనవి ఉదాహరణలు. వారసత్వo, స్కూల్లో వత్తిడీ, ఇంట్లో గొడవలూ పిల్లలు పక్క తడపటానికి ముఖ్యకారణాలు. దాదాపు 80% పిల్లల్లో అయిదేళ్ళ వయసొచ్చేసరికి తగ్గిపోతుంది. ఈ లక్షణం దానంతట అదే తగ్గిపోవటo నిజానికి చాలా మంచి పరిణామo. అప్పటివరకూ బెడ్-వెట్టింగ్ చేసిన పిల్లవాడు ఆ అవలక్షణం పోగానే ‘నన్ను నేను కంట్రోల్ చేసుకోగలిగాను’ అని ఫీల్ అవుతూ స్వీయగౌరవాన్నీ, తన పట్ల నమ్మకాన్నీ పెంచుకుంటాడు. మీకు తెలుసా? సచిన్ టెండుల్కర్ నిద్రలో కలవరించేవాడు. అంతే కాదు, అతడికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉండేది. కానీ ఆ తరువాత అతడు క్రికెట్ వీరుడయ్యాడు.
5. ప్రతిస్పందనా లోపం: అడిగిన ప్రశ్నలకి మీ పిల్లలు ఎంత తొందరగా సమాధానాలు చెపుతున్నారు? ప్రతిస్పందనలునాలుగు రకాలు. 1) 1000+ 40+ 1000+ 30+ 1000+ 20+ 1000+ 10 ఎంతని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా 5000 అనటం తొందరపాటు ప్రతిస్పందన. 2) ఆరుగుళ్ళ రివ్వాల్వర్‌లో ఒక బులెట్ పెట్టి మాగజైన్ గిర్రున తిప్పి పేలిస్తే, అవతలివారు చావటానికి 1/6 ఛాన్స్ ఉంటుందని ప్రతిస్పందించటం కాన్ఫిడెన్స్. నుదిటి మీద పెట్టుకుని పేల్చి చూపించటం ఓవర్-కాన్ఫిడెన్స్. 3) రాముడి తండ్రికి సీత కొడుకు ఏమవుతాడని అడిగితే రెండు నిముషాలు ఆలోచించటం జడత్వ ప్రతిస్పందన (స్లో రిఫ్లెక్స్). 4) అసలు ఆలోచించటానికే ఇష్టపడక పోవటం ప్రతికూల ప్రతిస్పందన.
6. ఎడమ చేతివాటం: ఇది అసలు అవలక్షణమే కాదు. ఒక రకంగా అది మంచిది కూడా. రెండు చేతులూ సమానంగా ఉపయోగపడి, ఎడమ చేతివాటం ఉన్నవారు మిగతా పిల్లలకన్నా చురుగ్గా ఉంటారు.
6. అతి వాగుడు Vs ఇంట్రావర్షన్ Vs రిజర్వ్‌డ్‌నెస్: అవసరం లేకపోయినా మాట్లాడటం అతి వాగుడు, అవసరo ఉన్నా మాట్లాడ లేకపోవడం ఇంట్రావెర్షన్. రెండూ తప్పే. క్లుప్తంగా మాట్లడడం రిజర్వ్‌డ్‌నెస్. క్లాసులో ‘అమెరికా ప్రధానమంత్రి ఎవరు?’ అని అడగగానే దూరంనుంచి మరెవరో ‘మోడీ’ అని సమాధానం చెప్తారు. ‘ఆడిగింది ఎవరిని? నువ్వెందుకు చెప్తున్నావు?’ అని ప్రశ్నిస్తే అటునుంచి సమాధానం ఉండదు. జ్ఞానులు మాట్లాడవలసి ఉంది కాబట్టి సంభాషిస్తారు. అజ్ఞానులు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. అవసరం లేకపోయినా ఎక్కువ మాట్లాడటాన్ని ‘డయేరియా ఆఫ్ టాకింగ్’ అంటారు. ఒక వయసు వచ్చాక కూడా పిల్లలు లొడలొడా మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులకి బావుంటుందేమో కానీ, అది ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అలా అని ఏమీ మాట్లాడకుండా ముంగిలా ఉంటే అది మరింత ప్రమాదకరం. స్నేహంగా హుషారుగా ఉండటం వేరు, అతివాగుడు వేరు.
పరిష్కార మార్గాలు:
1. ముందు పిల్లవాడికి ఫలానా బలహీనత ఉంది అని నమ్మండి. (a+b)2 ఎంతో చెప్పగలిగిన కుర్రవాడు (b+a)2 చెప్పలేకపోతే జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. వాళ్ళ తెలివితక్కువతనం మీదా, బలహీనతల మీదా దృష్టి నిలపకుండా, వాటినుంచి బయట పడడానికి వారు చేసే ప్రయత్నాలకి చేయూతనివ్వండి.
2. షాప్కి వెళ్ళి నెలసరి దినుసులు తీసుకురావటం, బిల్లు సరిగ్గా ఉన్నదో లేదో చూడటం, సొంతంగా ఆటో మాట్లాడుకుని సామాన్లు ఇంటికి తీసుకురావడం లాంటి చిన్నచిన్న విషయాలు కూడా మానసిక వికాసానికి తోడ్పడతాయి.
3. చాలెంజస్లో పాల్గొనేలా చేయండి. ఉదాహరణకి మీ ఎత్తు ఎంతో ఉజ్జాయింపుగా చెప్పమని బంపర్ బహుమతి ఆఫర్ చెయ్యండి. మీ డైనింగ్ టేబుల్ పొడవు 70 అంగుళాలా? అంతకన్నా ఎక్కువా? అని మీ పిల్లల్తో పందెం కట్టండి. ఆ తరువాత స్కేల్తో కొలిచి చూడండి. ఉత్సాహభరితమైన ఈ రకo లెక్కలు పిల్లల్లో చురుకుదనాన్ని ప్రేరేపిస్తాయి.
4.. చిన్న వయసులోనే పిల్లలకి డైరీ రాసే అలవాటు చేయండి. పిల్లలకి మీరిచ్చే గొప్ప బహుమతి అది. డైరీ అంటే మనసుతో డేటింగ్ చేసుకోవటం. ముఖ్యంగా ఇంట్రావర్ట్ పిల్లలకి ఈ అలవాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 'పడుకోబోయే ముందు, మరోలా చెప్పాలంటే, రోజు చివర్లో స్వీయ-విమర్శ చేసుకోవటం కోసం అయిదు నిమిషాలు గడపలేని వాడు జంతువుతో సమానం. ఎందుకంటే జంతువులు డైరీలు రాయవు' అంటాడు బెర్నాడ్ షా.
6. తల్లిదండ్రులు పక్కన లేకపోతే తమ పనులు తాము చేసుకోవటం, తోటి పిల్లలతో కలిసి పని చేయాల్సిన అవసరం... ఆ విధంగా పిల్లలు తమ గుహలోనుంచి బయటకి రావడానికి సమ్మర్ కాంప్స్, టూరిజం మొదలైనవి సహాయపడతాయి. వారి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.
7. చిత్రలేఖనం, మ్యూజిక్ మొదలైన అభిరుచుల్ని కొందరు పెద్దలు మొగ్గలోనే త్రుoచివేయటంతో, మరే రకమైన అభిరుచీ, ఆర్టూ లేని పిల్లలు అతివాగుడికి అలవాటు పడతారు. ఈ చిన్న విషయం పేరెంట్స్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బావుంటుంది.
పిల్లలకి ఇంకా మాటలు రాలేదనీ, చెవులు వినిపించటం లేదనీ కంగారూ పడే పేరెంట్స్ ఒక విషయం గమనిచాలి. భయం వేరు. జాగ్రత్త వేరు. పిల్లల్లో హైపర్-ఆక్టివ్ డిజార్డర్ పదేళ్ళు వచ్చేసరికి దాదాపు తగ్గిపోతుంది. కొన్ని స్వభావ సిద్ధమైన సహజ ప్రవర్తనా లోపాలు వయసు పెరిగిన తరువాత కూడా కొనసాగితే భయపడాలే తప్ప, చిన్నపిల్లల్లో అలాంటి లక్షణాలు ‘లేకపోతేనే’ భయపడాలి. పొరపాటున మీరు ఏ ‘ఫేక్’ కౌన్సిలర్ దగ్గరకో, హిప్నాటిస్ట్ దగ్గరకో వెళ్తే మిమ్మల్ని మరింత భయపెట్టే ప్రమాదం ఉంది. ముందే చెప్పినట్టు, మంచి క్వాలిఫైడ్ వైద్యుడి దగ్గరకు మాత్రమే తీసుకువెళ్ళండి. అది కూడా, వయసు పెరిగిన తరువాత కూడా ఆ లక్షణాలు ఉంటేనే..! లేకపోతే మీ లావు పర్సు సన్నబడుతుంది.

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి 4

నిశ్శబ్దం రెండు రకాలు. లోపలా, బయట..! ఎనిమిదో క్లాసు వరకూ బాగా వచ్చిన మార్కులు సడెన్‌గా తగ్గిపోతే, దానికి చాలా కారణాలు ఉండవచ్చు. అందులో ఒకటి స్ట్రెస్. పిల్లల్లో నిరంతరం లోలోపల ఛాటింగ్ జరుగుతూనే ఉంటుంది. అది ఒక విధమైన మానసిక అలసటకి దారి తీస్తుంది. దానికి బెస్ట్ మందు ‘ధ్యానం’. అంటే ముక్కు మూసుకోవటం కాదు. నిశ్సబ్దంగా ఉండటం.
నిశ్శబ్దం అంటే చుట్టూ ఉన్న బిజీ, క్రేజీ ప్రపంచంలో నీ అస్థిత్వాన్ని నువ్వు గుర్తించుకోవటo. గమ్యం మీద దృష్టి నిలుపుతూ తనలోకి తాను అంతర్ముఖుడవటం. ఎంతోసేపు అవసరం లేదు. అయిదు నిముషాలు. మొదట్లో అయిదు నిమిషాలుగా ప్రారంభమైన ఈ ప్రక్రియ, సాగిoచే కొద్దీ మరింత ఆనందప్రసాదిని అవుతుంది. మిత్రుడు సీతారామశాస్త్రి వ్రాసినట్టు తనతో తాను రమించటమంటే అదే. ఆత్మవిమర్శకీ, అంతర్విమర్శకీ రోజుకో అయిదు నిముషాలు కేటాయించటంలో నష్టమేమున్నది?
ఒంటరితనం వేరు - ఏకాంతం వేరు. ఏకాంతం అంటే నీ నిశ్శబ్దాన్ని నువ్వు ప్రేమించటం. ఒంటరితనం అంటే నీ ఏకాంతాన్ని నువ్వు భరించ లేకపోవటం.
ఏకాంతం అంటే నీతో నువ్వు కమ్యూనికేట్ చేసుకోవటం. ఒంటరితనం అంటే ఛాటింగ్ కోసం మనసు తహతహలాడటం.
“కేవలం నా నిశ్శబ్దపు గ్యాపులను పూరించటానికి మాత్రమే మాటల్ని వాడతాను” అని ఎక్కడో వ్రాసాను. నిశ్శబ్దంగా పని చేసుకోవటం ఒకసారి అలవాటయితే, ఈ 'నిశ్శబ్దంతో మాట్లాడే ప్రక్రియ'ని, పిల్లలు తొందర్లోనే పెంచుకుంటారు.

టీన్స్ పెంపకం ఒక కళ - యండమూరి -3



ప్రతి ఇంట్లోనూ పిల్లలు పెద్దల ప్రేమ పొందుతారు. కానీ పెద్దల ‘గౌరవం’ పొందగలగటం కొందరు పిల్లలు మాత్రమే సాధించగలిగే అద్భుతమైన అనుభవం. ‘మీ ఇంట్లో మీకు గౌరవం ఉందా’ అని అడిగినప్పుడు పిల్లలకి అర్థం కాదు. ఇంట్లో గౌరవం అంటే ఏమిటి? రాత్రి సెకండ్ షో చూసొచ్చి మధ్యాహ్నం నిద్ర పోతూన్న కుర్రాడు, తమ్ముణ్ణి కాస్త గొడవ చెయ్యొద్దని చెప్పమంటే ‘వెధవ నిద్రా నువ్వూనూ’ అంటుంది తల్లి. దేశం తరపున అండర్ 19 ఆడి వచ్చి పడుకున్న కుర్రాడి తమ్ముడు గొడవ చేస్తూoటే ‘అన్నయ్య నిద్ర పోతున్నాడు. అల్లరి చెయ్యకు’ అంటుంది. ఇంట్లో గౌరవం సంపాదించటం అంటే అదే.
ప్రతి విద్యార్థి లోపలా ఒక బహుమతి ప్యాక్ చేయబడి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో దాన్ని విప్పుతారు. కొంతమంది తమలో ఆ ప్యాకెట్ ఉందన్న విషయం చివరివరకూ కూడా తెలుసుకోరు.
పిల్లలు విశ్వనాథన్ ఆనంద్, విరాట్ అంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు కానీ చదువు మధ్యలో ఖాళీ సమయాల్లో తమకిష్టమైన రంగంలో నిమగ్నులైనప్పుడు... ఆటోమాటిగ్గా ఆ గౌరవం లభిస్తుంది. ఒక ఇంట్లో అందరూ టీ.వీ చూస్తున్నారనుకుదాం. ఒక కుర్రాడు మాత్రం గదిలో తమ్ముడికి పాఠాలు వివరిస్తున్నాడు. ఆ కుర్రాడిపై ఇంట్లో అందరికీ ప్రేమతో కూడిన 'గౌరవం' ఉంటుంది. కారణం? మిగతా అందరూ ‘ఇంకొకరి’ క్రియేటివిటీ చూస్తున్నారు. కుర్రాడు తన జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇంకొకరికి విద్యాదానం చేస్తున్నాడు. అదీ తేడా.
(From: Teens pempakam oka kala).

Monday, March 5, 2018

బ్రాహ్మణ విద్యార్థులకు వేదం చదవడానికి కంచి పీఠం సువర్ణావకాశం!


"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి పుస్తకం నుంచి కొన్ని మంచి విషయాలు 2

టీన్స్ - సెల్ఫ్ లవ్:
తమ ఛార్మ్ అందం, స్టయిల్, సంభాషణతో ఇతరులని ప్రభావితం చేసేందుకు టీన్స్ అమితంగా ఇష్టపడతారు. తాము ఎత్తయిన స్టేజిపై ఉన్నామనీ, క్రింద నిల్చుని యావత్ ప్రపంచం తమవైపు కళ్ళప్పగించి చూస్తోందనీ ‘నిజాయితీగా’ నమ్ముతారు. అందుకే అద్దం ముందు గంటల కొద్దీ గడుపుతారు. ఆ చర్యని ఎగతాళి చేసినప్పుడు వారు అమితంగా హర్ట్ అవుతారు. కొందరు రివోల్ట్ అవుతారు. పైకి ఎలా కనపడినా, చాలామంది టీన్స్ మనసులు అతి సున్నితం. వాళ్ళ మూడ్ పాడుచేయడానికి చిన్న కామెంట్ చాలు. వాళ్ళ అందాన్ని, ఫ్యాషన్నీ, బ్రతికేవిధానాన్నీ విమర్శించినా, ఏడిపించినా అది వాళ్ళని ఎంతగా బాధిస్తుందంటే, వారు తమ గుహలోకి వెళ్ళిపోయి, ఇక బయటికి రారు.
అలా కామెంట్ చెయ్యటం కన్నా చిన్న చిన్న ప్రాపంచిక సహజ స్వాభావిక మానసిక సూత్రాలు వారికి వివరించండి. పిల్లలకి సెల్ఫ్-అడ్మిరేషన్ మరీ ఎక్కువ అవుతోందని అనిపించినప్పుడు సున్నితంగా మందలించండి. "…ఎప్పుడూ నువ్వు నీ గురించే ఆలోచించడం వల్ల నీకు నీపట్ల అవసరమైన దాని కన్నా ఎక్కువ అభిమానం (నెగెటివ్ సెల్ఫ్-ఈగో) ఏర్పడుతుంది. అందరూ అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ ఉంటారన్న అభిప్రాయం మార్చుకో. అవతలివారికి నువ్వు ఎంతో దగ్గరయితే తప్ప, నీ గురించి ఆలోచించడానికి ఎవరికీ అంత సమయం ఉండదు అందరిలోకీ స్పెషల్‌గా ఉండాలన్న ఆలోచన మంచిదే కానీ, దానికి కావలసింది మొహo మీద మేకప్ కాదు. నీ ప్రవర్తన" అన్న వాస్తవo వారికి అర్థమయ్యేలా చెప్పండి.
నార్సిస్-సిస్ట్ మనస్తత్వం:
నార్సిసేస్ అనే యువకుడు చెరువులో మొహం చూసుకుని తనతోనే ప్రేమలో పడతాడు. అందులోంచి వచ్చిందే ఈ పేరు. సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ప్రకారం, ఈ రకమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు తమని తాము అవసరమైనదానికన్నా ఎక్కువ ప్రేమించుకుంటారు. లేని లక్షణాలని ఆపాదించుకుంటారు. తాము నమ్మిందే వేదం అని భావిస్తారు. స్వీయ-ప్రేమ మంచిదే కానీ అవధులు దాటితే, అవతలి వారు చెప్పిన సలహాల్ని పాటించనివ్వదు. ఈ లక్షణాలున్న పిల్లలందరూ నిశ్శబ్దం, ఆవేశం, దుఃఖం మొదలైన ఆయుధాలతో తమ కోపాన్నీ / అసంతృప్తినీ బహిర్గతపరుస్తూ ఉంటారు. సెల్ఫ్-లవ్ మరీ ఎక్కువైతే, అది మిసంత్రోప్ మనస్తత్వానికి దారి తియ్యవచ్చు.
మిసాంత్రోప్ మనస్తత్వం: పక్క ప్రయాణీకుడు సైకాలజిస్ట్. అభిమాని. మాటల సందర్భంలో ‘దున్నపోతులు’ అన్న కథాంశం ప్రసక్తి వచ్చింది. “టైటిల్ ఇంటరెస్టింగ్ గా ఉంది. కథ ఏమిటి?” ఉత్సుకంగా ప్రశ్నించాడు. “... ఒక మనిషికి కొద్దికొద్దిగా కొమ్ములు పెరుగుతాయి. కుడితి తాగాలని కోరిక పుడుతుంది. గేదెల మీద రొమాంటిక్ కోరిక పెరుగుతుంది. ఒక స్టేజ్ వచ్చేసరికి, ప్రపంచంలో ప్రతివాడూ దున్నపోతుగా మారిపోయి, ఒక్క హేతువాది మిగులుతాడు. దున్నపోతులన్నీ కలిసి ఆ మనిషిని కొమ్ములతో కుమ్మి చంపేస్తాయి” సంక్షిప్తంగా వివరించాను. వెళ్ళేటప్పుడు కరచాలనం చేస్తూ, "నేను మీ గురించి అనుకున్నది కరక్టే. మీరూ రాoగోపాల్ వర్మ లాగే మిసాంత్రోప్” అని వీడ్కోలు తీసుకున్నాడు.
అది నాకు కొత్త పదం. విమర్శనో, పొగడ్తో అర్థం కాలేదు. తరువాత పరిశీలిస్తే ఆయన చెప్పింది నిజం అనిపించింది. మిసాంత్రోప్ అంటే తన అభిప్రాయాల మీద నమ్మకం వల్ల ప్రపంచం పట్ల కలిగిన కోపంతో ప్రతిస్పందించే వాడు. వీరు కళాకారులైతే రచనల్లోనో, సినిమాల్లోనో, పాటల్లోనో ఇది ప్రతిబంబిస్తూ ఉంటుంది. "ఈ ప్రపంచంలోకెల్లా నేను ఎక్కువ అసహించుకునే జంతువు - మనిషి" అంటాడు అలెగ్జాండర్ పోప్. ఆస్కార్ వైల్డ్, జాపాల్ సార్త్రే, జోనాథన్ స్విఫ్ట్ ఈ వర్గం వారే.
వీరు మనుషులలోని నెగటివ్ కోణాన్ని ఎక్కువ పరిశీలిస్తూ, నచ్చని వాళ్ళని మొదటిక్షణంలోనే అవాయిడ్ చేస్తారు. అవతలి వారిని ఇంప్రెస్ చేయటం కోసం ముసుగు వేసుకోరు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఏదో జనాల్తో కలిసి బ్రతకాలి అన్నట్టు ఉంటారు. అందువల్ల వీరికి (తమ గ్రూపు తప్ప) మిత్రులు చాలా తక్కువ ఉంటారు. వీరు తమ సిద్ధాంతాలే నమ్ముతారు. ఏకీభవించని వారందరూ మూర్ఖులు. వారి పట్ల కోపం. జాలి. బలమైన స్నేహాలుoడవు. ప్రపంచానికి ‘అవుట్ సైడర్’ గానే జీవిస్తారు. తాము నమ్మిందే వేదం అన్న ఫీలింగ్ తప్పు కాదు కానీ, కొంత వయసు వచ్చాక ఒంటరి అయిపోతారు. సాధారణంగా ఎక్కువ నవ్వరు.
ఈ మనస్తత్వం మితి మీరితే అది అమానుషం అవుతుంది. తమ వాదన వినని వ్యతిరేకుల్ని అమితంగా ద్వేషిస్తారు. అమాయకుల్ని చంపే ఐ.ఎస్ ఉగ్రవాదులనుంచీ, ప్రేమించిన అమ్మాయి మీద ఆసిడ్ పోసేవారు ఇలాంటి శ్రుతి మించిన మిసాంత్రోప్ మనస్తత్వంవారే.
ప్రస్తుతం టీనేజ్ యువతలో ఈ మనస్తత్వం ఎక్కువ అవుతోంది. హుక్కా తాగినా, పదహారేళ్ళ వయసులో ప్రేమలోపడినా, తాగి ఆక్సిడెంట్ చేసినా తన సిద్దంతమే తన మతం..! పెద్దల మార్గదర్శకత్వాన్ని ఆమోదించటం లేదు. మాటని గౌరవించటం లేదు. (పెద్దల గతం కూడా గౌరవిoచేటంత గొప్పగా లేకపోవటం ఒక కారణం అయ్యుండవచ్చు). వీరి దృష్టిలో కష్టాలు స్వయంకృతాపరాధాలు. ఇతరుల కష్టాల్లో పాలుపంచుకోరు.
భవబంధాలు ఎక్కువ ఉండవు కాబట్టి వీరికి దుఃఖం కూడా తక్కువ ఒక వ్యక్తి కూతురు వేరే కులం మనిషిని పెళ్ళి చేసుకుందనుకుందాం. సమాజం ఏమనుకుంటుందో అని ఆ తండ్రి అని విలవిలలాడిపోతాడు. 'మిసాంత్రోప్' వ్యక్తి అసలు పట్టించుకోడు.. ఇష్టం ఉంటే కూతురిని తిరిగి ఆహ్వానిస్తాడు, లేదా నిర్ధాక్షణ్యంగా వదిలేస్తాడు. సమాజం గురించి క్షణం కూడా ఆలోచించడు. ఎవరూ లేకపోయినా బ్రతగ్గలనన్న ధైర్యo, పేరు ప్రఖ్యాతలు, ధనము ఉంటే పర్వాలేదు కానీ, లేకపోతే ఈ రకమైన 'మిసాంత్రోప్' మనస్తత్వం మనిషిని అజాత మిత్రువుగా చేస్తుంది.

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి పుస్తకం నుంచి కొన్ని మంచి విషయాలు 1

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి పుస్తకం నుంచి కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకోవలసినవి, మనం అందరం ఆచరించవలసినవి. అందుకే మంచి పుస్తకాలు చదువుదాం! పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు చేద్దాం! సత్యసాయి విస్సాఫౌండేషన్! .......ఒక వాస్తవం జీవితాన్ని మారుస్తుంది:

డెలాయిట్ కంపెనీలో సెమినార్ పూర్తయిన తరువాత ఒక యంగ్ ఎగ్జిక్యూటివ్ తన అనుభవం చెప్పాడు. "మాది మధ్య తరగతికి కాస్త దిగువ కుటుంబం. డిగ్రీ చదువుతున్న అన్నయ్య. పెళ్లి కావలసిన ఇద్దరు అక్కలు. నేను ఇంటర్ చదివే రోజులు. మా స్నేహితులందరికీ మోటార్ సైకిల్స్ ఉండేవి. రైడింగ్ నాకు చాలా ఇష్టం. మా నాన్నని కొనమని అడిగాను. ఒప్పుకోలేదు. ‘ఎలాగైనా కొనాల్సిందే’ అని తిండి మానేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసాను. మామూలుగా కన్నా ఎక్కువ నీరసం నటించాను. మూడు రోజులయ్యేసరికి నాన్న దిగివచ్చారు. గదిలో పడుకుని ఉన్నాను. అమ్మ నా పక్కనే కూర్చొని బ్రతిమాలుతోంది. నాన్న లోపలకి వచ్చి అమ్మతో ముక్తసరిగా, “వాణ్ణి తిండి తినమను. రేపు కొనిస్తానని చెప్పు" అని వెళ్ళిపోయాడు. అంత తొందరగా నాన్న దిగి వస్తాడనుకోలేదు. ఎవరెస్టు ఎక్కినంత సంతోషం వేసింది. అమ్మ తడి గుడ్డతో మొహం తుడిచి వంటింట్లోకి తీసుకెళ్తూండగా, వాష్ బేసిన్ దగ్గర నాన్న నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ఏడుస్తూ ఉండటం చూసాను. వళ్ళంతా జలదరించింది. బహుశా అప్పుడే నా జీవితం మలుపు తిరిగి ఉంటుంది. నేనీ రోజు ఇక్కడ ఇలా ఉన్నతస్థితిలో ఉన్నానంటే ఆ సంఘటనే కారణం. ఉద్యోగంలో చేరిన అయిదు సంవత్సరాలవరకు బైక్ కొనలేదు. ముందు నాన్నగారి ఇంటి అప్పు తీర్చాను."

యూ ఆర్ డిఫరెంట్:

స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కాలేజికి వెళ్ళటం మానేసిన అమ్మాయి, పిక్నిక్ కి డబ్బులివ్వలేదని చేతి నరం కోసుకున్న అబ్బాయి మాకు తెలుసు. పిల్లలకు మీ ఆర్థిక పరిస్థితులు అర్థమయ్యేట్టుగా చెప్పండి. సర్దుకుపోవడం, రాజీపడడం నేర్పoడి. క్రికెటర్ రోహిత్ శర్మ తండ్రి, కొడుకుని సరిగ్గా పోషించలేక తన తండ్రి (తాత) దగ్గర వదిలేసాడు. రోహిత్ శర్మ పని చేస్తూ చదువుకున్నాడు. సి.ఏ. చదివేరోజుల్లో మధ్యాహ్నం లంచ్ కి మా ఇంట్లో ముప్పై పైసలు ఇచ్చేవారు. దానికి ఒక దోశ వచ్చేది. చెట్ని ఫ్రీ కాబట్టి ఐదారుసార్లు వేయిoచుకునే వాడిని. ఇదంతా, రొమాంటిసైజింగ్-ది-పాస్ట్ గా గొప్పలు చెప్పటం కాదు. అర్థం చేసుకునే వయసు రాగానే, లేనిపోని హెచ్చులకి పోకుండా తమ ఆర్థిక పరిస్థితి చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశ్యం.

"క్లాసులో అందరికీ సెల్ఫోన్స్ ఉన్నాయి. నాకే లేదు" అని మీ పిల్లవాడు పోరు పెడుతూంటే, "నువ్వు డిఫరెంటమ్మా. వాళ్ళు వేరు, మనం వేరు. మనకి అంత స్తోమతులేదు” అనండి.

“వడ్డున కుర్చుని సలహాలివ్వటం సులభం. మీకేం తెలుసు? అడిగింది ఇవ్వకపోతే ఇల్లు పీకి పాకం పెడతారు” అంటారా? అవసరాలు మానుకుని పిల్లలు అడిగిందల్లా కొనివ్వటం, సుఖాలు తగ్గించుకుని వారికి సౌఖ్యాలు అమర్చటం... ఇలా చేస్తూ పోతే, కొంతకాలం అయ్యేసరికి పిల్లలు దాన్ని ప్రేమగా గుర్తించరు. ఇవ్వటం మీ బాధ్యత అనుకుంటారు. ఇవ్వటం ప్రేమ కాదు. ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎంత ఇవ్వాలో తెలుసుకుని అంతే ఇవ్వటం ఆరోగ్యకరమైన ప్రేమ. మరోలా చెప్పాలంటే, వారి పట్ల మీ ప్రేమ ప్రూవ్ చేసుకోవటం కోసం ఇవ్వటం కన్నా... వారి మంచి భవిష్యత్తు కోసం, కోర్కెల్ని కంట్రోల్‌లో పెట్టుకునే గుణం వారికి నేర్పటం కోసం… కావలసింది మాత్రమే ఇస్తున్నారన్న మాట. పిల్లల్ని ఇన్వాల్వ్ చెయ్యటమంటే, మీ (ఆర్థిక) సునామీ ఆటుపోట్లలో చుక్కాని వారి చేతికి ఇవ్వటం అన్నమాట. ఆ చుక్కానికి మరో పేరే ‘బాధ్యత’.
From: TEENS PEMPAKAM OKA KALA

Total Pageviews