Saturday, January 30, 2016

//దిద్దుబాటు// తప్పని నిబంధనలు కొన్ని.. కట్టుదిట్టం చేస్తే కనుసన్నల నుండీ జారిపోతారని తెలిసినా భద్రతావలయమన్నదే గీయకుంటే.. మనసును కలుషితం చేసే ఉత్ప్రేరకాలెన్నో నేడు.. ఎటు తిరిగినా మహేంద్రజాలంతో మాయజేసే మోసాలు.. ఏమరుపటులోనే సర్పాలై కాటేసే విషవలయాలు దిగమింగుకోలేని ఆత్మన్యూనతను పెంచే కట్టుబాట్లు కొన్ని ఆకతాయితనాన్ని ఆసరా చేసుకొని వయసును కసిదీరా నలిపేస్తే.. బలహీనమైన అంతరాత్మ పోరాటంలో.. రకరకాల ఒత్తిళ్ళకు గురయ్యే పిల్లలెందరో.. నిన్నమొన్నటి దాకా పొత్తిళ్ళలోని పాపాయిలే అయినా.. తప్పులు దిద్దని నిర్లక్ష్యం మన పొరలు కమ్మితే.. రేపటి సమాజానికి సమాధానమివ్వలేని సందిగ్ధాలేగా మిగిలేది..!!


Friday, January 29, 2016

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి నా నమస్కారం../\..

 అమ్మ

అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే...
ఎందుకంటే...

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.
మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".

శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".
"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?
ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.
                           అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి నా నమస్కారం../\..

ఓం నమో వేంకటేశాయ! ఓం నమో నారాయణాయ!! ఓం నమో భగవతే వాసుదేవాయ!!!


Wednesday, January 27, 2016

ఎన్ని జన్మల పుణ్యమో....


ఎన్ని జన్మల పుణ్యమో - నిను 
కొల్చు భాగ్యంబైనది
పరమపావనమైన నీదు 
సన్నిధానమె పెన్నిధి 
                                          సన్నిధానమె పెన్నిధి      !!ఎన్ని జన్మల పుణ్యమో!!

కోరికొలిచే వారికెన్నో 
కోర్కెలను కురిపించినావు   !!కోరి !!
నేరమెంచక నన్నుదయతో
                                            చేరదీసి బ్రోవరా     !!చేరదీసి !!   !!ఎన్ని జన్మల పుణ్యమో!!

మరణబాధను మాన్పినావు
మరల ప్రాణం పోసినావు  !!మరణ !!
పతితుడవై విలపించు బాపని 
                                              వ్యధలు బాపిన దైవమా    !!వ్యధలు !!   !!ఎన్ని జన్మల పుణ్యమో!!

మహిమలెన్నో చూపినావు 
మహిని దైవుడై వెలసినావు    !!మహిమ !!
తుంగభద్రాతీర నిలయా 
                                  రాఘవేంద్రా నీ దయా  !!రాఘ !!  !!ఎన్ని జన్మల పుణ్యమో!!



Tuesday, January 26, 2016

శుభోదయ౦../\..



జీవితంలో ఎప్పుడైనా
ఎవరి నైనా పనికి రాని వారిగా
పరిగణించవద్దు ఎందుకంటే 
చెడిపోయిన గడియారం
కూడా రోజుకు రెండు సార్లు
సరైన సమయం సూచిస్తుంది.


Thursday, January 21, 2016

నమస్కార సంస్కారం!! తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!  మిత్రులందరికీ శుభరాత్రి! మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికీ పడితే వారికి స్టైల్ గా ఒంటి చేత్తో నమస్కరించి ఎంతో సంస్కార వంతుల మనుకుంటాము, దేవాలయం లో ఎవరూ పరస్పర అభివాదం(నమస్కార పలకరింపులు) చేసుకో కూడదు, ఒకవేళ ఎవరైనా మనకి నమస్కరించినప్పుడు మనం ఈ దేవాలయం లో ఉన్నామో ఆ దేవునికి సమర్పించాలి. పరమేశ్వరార్పణ మస్తు! అనాలి ఒక వేళ ఎవరికైనా మనం నమస్కరించాలి అనుకుంటే ఆ దేవుని నామస్మరణ చెయ్యాలి. ముఖ్యంగా దేవాలయం ప్రాంగణం లోనికి ప్రవేశించగానే మనం అహాన్ని, ఇహలోక విషయాల్ని వదిలేసి చిత్తం చెప్పులమీద కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే  "త్వాం మురారిహృదయేశ్వరీం భజే" కనకధారా స్తోత్రంలో సంకారా చార్యుల వారు చెప్పినట్లుగా. నమస్కారం అనేది ఎలా చేయాలి? వచన, అంగ, మానసం. వచన - నోటితో; అంగ - శరీరంతో; మానసం - మనస్సుతో; త్రికరణ శుద్ధిగా చేసే నమస్కారానికి ప్రణతి అని పేరు.  ఇంకా వంటి చేత్తో నమస్కారం పెడితే జరిగే నష్టం గురించి శ్రీ విష్ణు పురాణం లోని ఈ శ్లోకం, భావం చదవండి.
తెలియక పోవడం తప్పుకాదు, తెలుసుకోలేక పోవడం తప్పు, తెలిసినదాన్ని ఆచరించక పోవడం మహా మాహా తప్పు      
శ్లో!!జన్మ ప్రభృతి యత్కించిత్!
చేతసా ధర్మ మాచరేత్!
సర్వంతు నిష్ఫలం యాతి!
ఏకహస్తాభివాదనాత్!!
పుట్టినది మొదలుకొని గావించుతూ వచ్చిన ధర్మము ఏకొంచెమున్నను అదికూడా ఒక్కచేతితో పెద్దలకు అభివాదనము చేయుటవల్ల నశించిపోతుంది. ఎందువల్లనంటే ఏకహస్తాభివాదన
మందు అవినయమే భాసిస్తుంటుంది. దానివల్ల సర్వ ధర్మములు  నిష్ఫలమైపోతాయి. నమస్కారానికి ఒక సంస్కారం వుంది, ఉదాహరణకి మనం సౌచాలయంలో (టాయిలెట్స్) మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు లేదా ఆ ప్రదేశంలో కూడా నమస్కరిస్తాము అది చాలా తప్పు ఆంగ్లేయుల సంస్కృతిని విడిచిపెట్టి తిరిగి మన సంస్కృతిని పూర్తిగా అలవాటు చేసుకోకపోవటం వల్ల వచ్చిపడిన దుస్థితి యిది. అంగ్ల భాషనీ అవసరమైన మేరకు వినియోగిద్దాం! మన భాషా సంప్రదాయాలను ఎల్లప్పుడూ పాటిద్దాం!  ఇప్పటికైనా మనమందరం అందరికీ రెండు చేతులూ ఉపయోగించి హృదయపూర్వకమైన నమస్కారాన్నే అందిద్దాము.తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ 
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
బిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్నపూర్నేశ్వరీ !!
సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్ఠి పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని పెద్దలు చెపుతారు. 




Tuesday, January 19, 2016

నీవల్ల కాదు....!!

ఇద్దరబ్బాయిలు. ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు.
ఊరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు.
చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.
ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు.
అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు.
చుట్టుపక్కల ఎవరూ లేదు. అరిచినా సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.
చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.
"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.
నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.
చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.
"అన్నా ... భయపడకు... జాగ్రత్తగా పట్టుకో... పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.
తాడు చివరను ఒక చెట్టుకి కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు. ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.
ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.
ఊళ్లో ఎవరూ నమ్మలేదు. ఆరేళ్ల వాడేమిటి, పదేళ్ల వాడిని లాగడమేమిటి? అందునా బావి నుంచి లాగడమేమిటి? అసాధ్యం. వాడు చేయలేడని అన్నారు.
ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.
సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.
దేవాలయం ముసలి పూజారిగారికి విషయం తెలిసింది.
"మీరు నమ్ముతారా పూజారి గారూ"
"నమ్ముతాను"
"ఎలా?"
"చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు."
"అదెలా సాధ్యం. అంత చిన్నోడు ఎలా చేయగలడు?"
"తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు. ఒరేయ్... నీకంత బలం లేదురా... నువ్వు చేయలేవురా... అది నీవల్ల సాధ్యం కాదురా...అని చెప్పేవారెవరూ ఆ పరిసరాల్లో లేరు. కాబట్టి వాడు చేయగలిగాడు. నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. "
ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.
"నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే..." అన్నాడు పూజారిగారు.
🙏ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు💢

🔥ప్రపంచంలోనే ఇండియాలో అనేక మిస్టీరియస్ సన్నివేశాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. భారతదేశంలో ప్రతీది ఒక మిస్టరీనే తలపిస్తుంది.
సంపన్నమైన పురాణగాధలు, అపార పరిమాణం, మరిచిపోలేని ఇతిహాసాలకు పుట్టినిల్లు భారతావని. కొన్ని చూసి తరించేవి అయితే.. మరికొన్ని ఆశ్చర్యం, భయం కలిగించేవి. మరికొన్ని సందేహాలతో సతమతపెట్టేవి చాలా ఉన్నాయి.:

హిందూ ఆలయాల వెనకున్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యం ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఇండియా చాలా ప్రత్యేకం. ఎక్కడ చూసినా, ఎటు వెళ్లినా భారతదేశం చుట్టూ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలే కనిపిస్తాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ.. మిస్టరీతో మిలితమై ఉన్నాయి. ఎవరికీ అంతుచిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఆ దేవాలయాలు, కట్టడాల్లో దాగున్నాయి. ఏ పురావస్తు శాఖ ఖచ్చితంగా చెప్పలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు సృష్టించారు. ఇండియాలో అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం కలిగించే దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. మీలో అంతులేని ఆలోచనలు, ఆశ్చర్యాలు తీసుకొచ్చే కొన్ని పుణ్యక్షేత్రాల విశేషాలు, మిస్టరీలు మీకోసం..

 🔥పంజాబ్ లోని మోహాలి జిల్లాలో ఉంది .
...గురుద్వార. ....
1659లో సిక్కుల ఏడో గురువు గురు హర్ రాయ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గురుద్వారలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఇక్కడున్న మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకు ఏడాది పొడవునా.. మామిడి పండ్లు ఉంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా పండ్లు కాస్తూనే ఉంటాయి.

 🔥ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న .......యాగంటి ఉమామహేశ్వర ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉన్న పెద్ద నందీశ్వరుడి విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వస్తోందని భక్తులు నమ్ముతారు. మొదట్లో చాలా చిన్నగా ఉన్న విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి.. ఇప్పుడు ఆలయం ప్రాంగణం అంతా వ్యాపించిందని స్థానికులు చెబుతారు. అయితే ఆ రాయి స్వభావం పెరిగే తత్వం కలిగి ఉందని.. ఆ రాయి 20 ఏళ్లకు 1 ఇంచు పరిమాణం పెరుగుతుందని పురావస్తు శాఖ సర్వే తెలియజేస్తోంది.

 🔥ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి. ఇక్కడ ఉన్న స్తంభాలు మిస్టరీగా మిగిలాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించారు. విజయానగర్ స్టైల్లో ఈ రాతి కట్టడ నిర్మాణం జరిగింది. ఇక్కడ స్తంభం కింద క్లాత్ ని ఈజీగా పట్టించవచ్చు. అంటే.. స్తంభానికి, కింద ఫ్లోర్ కి గ్యాప్ ఉంటుంది. అంటే స్తంభం కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండానే ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం గ్రౌండ్ కి తాకకుండా.. ఆలయాన్ని అంతా ఎలా సపోర్ట్ చేస్తుందో.. ఎవరికీ అర్థంకాని రహస్యం.

  మరో విచిత్రం

 90 కేజీల రాయి పూనెలోని చిన్న దర్గాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ 11 మంది మనుషులు అంతకంటే ఎక్కువ కాదు.. తక్కువ కాదు.. కరెక్ట్ గా 11 మంది ఒక రాయికి కేవలం ఒక వేలుతో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమర్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకి ఎత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 11 అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూ ఉంటుంది. భక్తుల తల పైనే ఆ రాయి తేలుతూ ఉంటుంది. అప్పుడు కమర్ అలీ దర్వేష్ అని భక్తులు గట్టిగా అరుస్తారు.

 🔥తంజావూర్ లోని శివాలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయమంతా గ్రానైట్ స్టోన్స్ తోనే కట్టారు. అది కూడా అక్కడ దగ్గరి ప్రాంతాల్లో ఎక్కడా స్టోన్ లభించేది కాదు. 216 అడుగుల అతి పెద్ద నిర్మాణం ఈ తంజావూర్ ఆలయం. ఆలయ సమీపంలో ఎలాంటి సదుపాయాలు లేవు. పెద్ద గాలి, వర్షాలతో ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అయినా కూడా వెయ్యి ఏళ్ల క్రితం ఈ ఆలయం ఇంత పెద్దగా.. ఎలాంటి మెటీరియల్ లేకుండా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ.

 🔥తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివారాధన చేయడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండటం గమనించారు. తర్వాత ఆ పాము ఆలయంలో ఉన్న బిల్వ చెట్టు ఎక్కి బిల్వ పత్రాలు సేకరించి.. తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి సమర్పించింది.

🔥హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి అయిన ప్రాంతాలలో.   .... పూరి .......నాలుగోది. ఛార్ ధామ్ క్షేత్రాలలో ఇదొకటి. విష్ణువునే ఇక్కడ జగన్నాథ స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయ విగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రతిమ రాయి కాదు... వేప బెరడుతో తయారు చేస్తారు. ఈ విగ్రహాన్ని బ్రహ్మ అంటారు. ఈ విగ్రహాలను 12 ఏళ్లకొకసారి అంటే నబ కళేబర ఉత్సవ సమయంలో మారుస్తారు. అదే ఇక్కడున్న స్పెషాలిటీ.

 🔥మహారాష్ర్టలో ఉన్న శని షింగాపూర్ చాలా ఫేమస్.
ఎందుకంటే ఈ ఊళ్లో ఏ ఒక్క ఇంటికి తలుపులు ఉండవు. తలుపులు లేకపోయినా.. ఇంతవరకు ఎప్పుడూ దొంగతనాలు కూడా జరగలేదు. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్లకు శని దేవుడే శిక్ష విధిస్తాడని గ్రామస్తుల నమ్మకం. మరో ఆశ్చర్యకర విషయమేంటంటే.. 2011లో ఇక్కడ ఒక బ్యాంక్ కూడా ప్రారంభించారు. అది కూడా ఎలాంటి తాళం లేకుండా. దేశంలో మొదటిసారి ఇలాంటి విశేషం జరిగింది.

 🔥కైలాశ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది.
 దీని నిర్మాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎలాంటి కట్టడమైనా.. పునాది నుంచి మొదలవుతుంది. కానీ.. కొండలనే శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఈ ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో.. ఆలయ నిర్మాణమంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్పశైలి ఈ ఆలయ ప్రత్యేకత.
మహారాష్ర్టలోని షోలాపూర్ జిల్లా షేప్టాల్ గ్రామంలో పాముల పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేకంగా కొంత ప్రదేశం కల్పిస్తారు. ప్రతి ఇంట్లో మనుషులు మాదిరిగా... పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఎవరినైనా పాము కరిచినట్లు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు

🔥 ఉత్తరప్రదేశ్ లోని సితాపూర్ జిల్లాలోని.
.... ఖబీస్ బాబా ఆలయం ...  చాలా విచిత్రం కలిగిస్తుంది. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు.. పూజారీ ఉండరు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతారు. ప్రచండమైన శివ భక్తుడు ఖబీస్ బాబా ఇక్కడ ఉంటారు. ఇతను సాయంత్రం భక్తులు సమర్పించే మద్యం సేవించి.. భక్తుల అనారోగ్య సమస్యలను నయం చేస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం.

🔥శ్రావణబెళగలలోని గోమతేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. దీన్నే బాహుబలి అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకే రాతితో ఈ విగ్రహాన్ని చెక్కడం విశేషం. 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహాన్ని చూడవచ్చు. గోమతేశ్వర జైనుల గురువు.

🔥అమ్రోహా ఉత్తరప్రదేశ్ లోని ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం షార్ర్ఫుద్దీన్ షా విలాయత్ గా ప్రసిద్ది చెందింది. ఈ పుణ్యక్షేత్రం మతాధికారి ఆలయ రక్షణగా తేళ్లను పెట్టారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు వీటిని పట్టుకోవచ్చు. కానీ అవి వాళ్లకు ఎలాంటి హాని చేయవు. అదే ఇక్కడి స్పెషాలిటీ.

🔥 తాజ్ మహల్ అనగానే..
షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్ కోసం నిర్మించినదని అందరూ భావిస్తారు. కానీ ఇక్కడో షాకింగ్ న్యూస్ ఉంది.
 న్యూఢిల్లీలోని ఓ ప్రొఫెసర్ ఈ తాజ్ మహల్ శివుడి కోసం నిర్మించారని.. అదే తేజో మహాలయ అని వెల్లడించారు.
సుప్రీం కమాండర్ నుంచి ఈ ఆలయాన్ని తీసుకుని తర్వాత తాజ్ మహల్ గా షాజహాన్ నిర్మించారని ఆయన తెలిపారు. మొగల్ చక్రవర్తులు శత్రువుల ఆలయాలు ఆక్రమించి వాటిని తమ ప్రేమికుల కోసం సమాధులుగా పునర్ నిర్మించేవాళ్లని వివరించారు.

🔥 .......మమ్మీస్ ....
అంటే అందరికీ ఈజిఫ్టే గుర్తొస్తుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని గ్యూ అనే గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షాకిస్తోంది. సంఘా టెంజింగ్ అనే టిబిట్ కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ కూర్చొని ఉంది. అది కూడా చెక్కుచెదరని చర్మం, జుట్టుతో ఈ మమ్మీ కనిపిస్తుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏

Sunday, January 17, 2016

ఎవరు గొప్ప?

తోటలోని ఆకుల మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది.
"నేను అన్నిటికన్నా శుభప్రదం. మంగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమంగళం" అంది మామిడాకు.
అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి.
"నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ పనికిరారు" అంది కరివేపాకు.
కరివేపాకులు కూరలో తప్పనిసరి. కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచీ అవి కూరలో కరివేపాకులయ్యాయి.
"అన్నం తినేందుకు నేనే పనికొస్తాను. మీరంతా వేస్టు" అంటూ నీలిగింది అరిటాకు.
అప్పట్నుంచీ అరటాకు అన్నం తినేశాక చెత్తకుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది.
"అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధికోసం అంతా నన్నే తింటారు" అని హొయలు పోయింది తమలపాకు.
అప్పట్నుంచీ మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టాడు.
పాపం... తులసి ఆకు.... ఏమీ అనలేదు. తన గొప్ప చెప్పుకోలేదు.
అందుకే దాన్ని పూజిస్తారు. తులసమ్మ అని పిలుస్తారు. గోవర్ధనమంత పర్వతాన్ని ఎత్తిన వాడిని తులాభారంలో తేలిపోయేలా చేసేందుకు ఒక్క తులసిదళం చాలు. అంతెందుకు...? అంత్య ఘడియల్లో తులసి తీర్థం నోట్లో పోస్తే వైకుంఠమే సంప్రాప్తిస్తుంది.

Saturday, January 16, 2016

మాతృభాషా విద్యాబోధన పై ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ఈనాడు 17-1-01-2016

ఇది చదివిన తర్వాత ఐనా మరి కళ్ళు తెరుద్దామా? మాతృభాషలో విద్యాభోదన ఎంతో మేలు అని అనాదిగా భాషా శాస్త్రవేత్తలు, మేధావులు, విజ్ఞులు, ఎంతో మొత్తుకుంటున్నా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు, ఇటు ఆంగ్ల చదువుల మోజు, మాతృభాషలో చదివితే ఉపాధిలేకపోవడం, ప్రభుత్వపు ఉదాసీనత, అది ఆసరాగా తీసుకుని  పుట్ట గొడుగుల్లా పుట్టు కొచ్చిన ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాకంతో చదువు 'కొనడం' గా మారిపోయింది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవని ఇతర సన్నాయి నొక్కులు నొక్కుతూ మాతృభాషలో మాట్లాడితే దండించడం వంటి చర్యలకు తెగబడ్డాయి. ఉన్నత విద్య రాసి పెరిగింది వాసి తగ్గింది. ఆంగ్లభాష ప్రాధాన్యం చాలా గొప్పది అందులో ఎటువంటి సందేహమూ లేదు,  మరి గతంలో చదువుకున్న మేధావులకు అడ్డురాని మాతృభాష మరి నేటి కుహనా మేధావులకు ఎందుకు అడ్డువస్తోంది. వాస్తవాలు వెల్లడైన ఇటువంటి సర్వేలను గుర్తించి పిల్లి పాలు తాగినట్లు గా, వేలం వెర్రిగా, గొర్రెల మందల్లా పోకుండా మాతృభాషలో పునాది వేద్దాం! ఆంగ్లం, ఇతర భాషల భవనాలు నిర్మిద్దాం!! జై తెలుగు తల్లి! జై జై తెలంగాణా తల్లి!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.

"ఎంకంటె ఎంకిరా , ఎన్నెల్ల మల్లిరా"......" వెన్నలొచ్చినవేళ "...... డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ


"ఎంకంటె ఎంకిరా , ఎన్నెల్ల మల్లిరా"
Vijayavenkatakrishna Subbarao Ponnada's photo.
ఎంకి సూపుల్లోన ఏముందొ గాని ,
వెలుగు పూలను సిమ్మి ఎద గిల్లుతాయి !
ఎంకి నవ్వుల్లోన ఏముందొ గాని ,
సెలయేటి గలగలలు తెల్ల బోతాయి !
ఎంకి నడుమున తానేమి సూసేనొ ,
ఎల వాగు వంకర్లు యెగిరి పోతాయి !
ఎంకి జడ బిగువు నేముందొ గాని ,
నల్ల నాగు మెలితిరిగి సుళ్ళు తిరిగేను !
ఎంకి నడకలలో ఏముందొ గాని ,
ఎల హంసలన్నీను మురిసి సూత్తాయి !
ఎంకి తలపులలో యేముందొ గాని ,
గుండె సందడి సేసి గుంజాటతాది !
ఎంకి సైగల్లోన ఏముందొ గాని ,
గుండె గొంతున కొచ్చి, ఆడ సూత్తాది !
ఎంకి సొగసులోన ఏముందొగాని ,
ఎన్నెల్లొ సిందేయ ఎర్రి పుట్టేను !
ఎంకి లాంటీ పిల్ల యేడుందొ సెప్పు ,
సెప్ప లేవుర మల్ల !
ఎంకంటె ఎంకిరా , ఎల మావి పూతరా ,
ఎంకంటె ఎంకిరా , సెలయేటి ఆటర ,
ఎంకంటె ఎంకిరా , ఎన్నెల్ల మల్లిరా !
ఎంకంటె ఎంకిరా , జాబిల్లి సెల్లిరా !(2)
................ డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 16 /01 /2016 .



" వెన్నలొచ్చినవేళ ".......................... డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ.
వెన్నలొచ్చినవేళ వేధింపు లేల !
చిన్నదానీ మోము చిగురించ దేల !
వన్నెలన్నియు జూడ వాడేను బాల !
కన్నె మనంబునా కలవరం బేల !
ఎన్నెన్ని కోర్కెలో ఎదనిండ జూడు !
అన్నెపున్నె మెరుగ అతివ నీ తోడు !
కన్నాను కలలెన్నొ కలికి నీ కొరకు !
మన్నించి దరిజేరి మరులతో చిలుకు !
పరువాలు పగబూని పమిటనే వీడె !
కురవాలి జవరాలి కులుకులే నేడె !
మురవాలి మనసులూ ముద్దుగా తడిసి !
మరవాలి లోకాన్ని మనసార మరచి !
కలువతో చంద్రయ్య కలిసేటి వేళ !
నిలువెల్ల వెన్నెలే నెపమేల బేల !
అలసిసొ లసితేను హాయినే మరచి !
కిలకిలా రవములా కేరింత పరచి !
కలహంస రావేమె కథకంచి కేగ !
కలహంస రావేమె కథకంచి కేగ !
" ద్విపద మాలిక " ............. డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 02 /02 /2016 .

నమస్కార సంస్కారం!! తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!విస్సా ఫౌండేషన్.

నమస్కార సంస్కారం!! 
తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!
మిత్రులందరికీ శుభరాత్రి! మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికీ పడితే వారికి స్టైల్ గా ఒంటి చేత్తో నమస్కరించి ఎంతో సంస్కార వంతుల మనుకుంటాము, దేవాలయం లో ఎవరూ పరస్పర అభివాదం(నమస్కార పలకరింపులు) చేసుకో కూడదు, ఒకవేళ ఎవరైనా మనకి నమస్కరించినప్పుడు మనం ఈ దేవాలయం లో ఉన్నామో ఆ దేవునికి సమర్పించాలి. పరమేశ్వరార్పణ మస్తు! అనాలి ఒక వేళ ఎవరికైనా మనం నమస్కరించాలి అనుకుంటే ఆ దేవుని నామస్మరణ చెయ్యాలి. ముఖ్యంగా దేవాలయం ప్రాంగణం లోనికి ప్రవేశించగానే మనం అహాన్ని, ఇహలోక విషయాల్ని వదిలేసి చిత్తం చెప్పులమీద కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే "త్వాం మురారిహృదయేశ్వరీం భజే" కనకధారా స్తోత్రంలో సంకారా చార్యుల వారు చెప్పినట్లుగా. నమస్కారం అనేది ఎలా చేయాలి? వచన, అంగ, మానసం. వచన - నోటితో; అంగ - శరీరంతో; మానసం - మనస్సుతో; త్రికరణ శుద్ధిగా చేసే నమస్కారానికి ప్రణతి అని పేరు. ఇంకా వంటి చేత్తో నమస్కారం పెడితే జరిగే నష్టం గురించి శ్రీ విష్ణు పురాణం లోని ఈ శ్లోకం, భావం చదవండి.
తెలియక పోవడం తప్పుకాదు, తెలుసుకోలేక పోవడం తప్పు, తెలిసినదాన్ని ఆచరించక పోవడం మహా మాహా తప్పు
శ్లో!!జన్మ ప్రభృతి యత్కించిత్!
చేతసా ధర్మ మాచరేత్!
సర్వంతు నిష్ఫలం యాతి!
ఏకహస్తాభివాదనాత్!!
పుట్టినది మొదలుకొని గావించుతూ వచ్చిన ధర్మము ఏకొంచెమున్నను అదికూడా ఒక్కచేతితో పెద్దలకు అభివాదనము చేయుటవల్ల నశించిపోతుంది. ఎందువల్లనంటే ఏకహస్తాభివాదన
మందు అవినయమే భాసిస్తుంటుంది. దానివల్ల సర్వ ధర్మములు నిష్ఫలమైపోతాయి. నమస్కారానికి ఒక సంస్కారం వుంది, ఉదాహరణకి మనం సౌచాలయంలో (టాయిలెట్స్) మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు లేదా ఆ ప్రదేశంలో కూడా నమస్కరిస్తాము అది చాలా తప్పు ఆంగ్లేయుల సంస్కృతిని విడిచిపెట్టి తిరిగి మన సంస్కృతిని పూర్తిగా అలవాటు చేసుకోకపోవటం వల్ల వచ్చిపడిన దుస్థితి యిది. అంగ్ల భాషనీ అవసరమైన మేరకు వినియోగిద్దాం! మన భాషా సంప్రదాయాలను ఎల్లప్పుడూ పాటిద్దాం! ఇప్పటికైనా మనమందరం అందరికీ రెండు చేతులూ ఉపయోగించి హృదయపూర్వకమైన నమస్కారాన్నే అందిద్దాము.తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.

Wednesday, January 13, 2016

బంధుమిత్రులందరికీ భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ శుభాకాంక్షలు. మీ ఆశయాలు, ఆశలు నెరవేరేలా భోగి భోగభాగ్యాలు సిరిసంపదలు ప్రసాదించాలి.


విశ్వవ్యాప్త బంధు మిత్రులందరికీ భోగి శుభాకాంక్షలు .......















విశ్వవ్యాప్త బంధు మిత్రులందరికీ భోగి శుభాకాంక్షలు .......
ముందుగా  మంగళ వాద్యములతో ప్రారంభిద్దాం!! ఈ లింక్ క్లిక్ చెయ్యండి!
https://www.youtube.com/watch?v=UEweAta6gAM&index=3&list=RD58jfLwIFLMU
భోగి అంటే భోజనం 
భోగి అంటే దేవునికి భోగం 
భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం 
భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం 
భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం 
భోగి అంటే అన్నిటినీ అంగరంగవైభవంగా ఆనందించడం 
భోగి అంటే సూర్యుణ్ని ఆరాధించే అతి పెద్ద ఉత్సవం.

సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉన్నది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.

భోగి పండుగ: బలి చక్రవర్తి
అసురేశ్వరుడైన బలిచక్రవర్తిని శ్రీమహావిష్ణువు వామన రూపంలో పాతాళానికి పంపిన పర్వదినమే భోగిపండుగ. భోగిమంటలు మానవునిలోని, కల్మషాలను పటాపంచలు చేస్తాయని, సంకటాలు దగ్ధం అవుతాయని చెప్తారు. బలి చక్రవర్తి వామనుడు మూడు అడుగుల స్థలం ఇవ్వమని కోరాడు. ఆ మూడు అడుగుల స్థలం ఇచ్చి, తనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను; జాగృత్, స్వప్న, సుషుప్త్యావస్థలను; సత్వ, రజ, తమో గుణములను, ఈషణత్రయాన్ని హరింపజేసుకున్నాడు. వామనుని పాదస్పర్శతో బలిచక్రవర్తి, అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకొని జ్ఞాన వెలుగును దర్శించి ఉత్తరాయణమంతా స్వర్గ ద్వారములు, వైకుంఠ ద్వారములు తెరచి ఉండేటట్లుగా, ఆ సమయంలో మరణించిన వారికి ఉత్తమ గతి ప్రాప్తించేటట్లుగా శ్రీమన్నారాయణుని నుండి మానవాళి కోసం వరం అడిగి, పొందాడు. మనస్సులో మాధవుణ్ణి మనసారా నింపుకుని మానవసేవలో మాధవ సేవా పుణ్యాన్ని పొందమని చెప్తుంది

భోగి మంటలు
భోగి సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ ఇది. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. మంటలో పాత కర్రపుల్లలు, పిడకల దండలు, కొబ్బరిమట్టలు... లాంటి వాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువులను పారెయ్యలేక ఏడాదిపాటుగా దాచిపెడతారు. దానిని భౌతికలోభ గుణం అంటారు. ఈ సంధర్భంలో అన్నీ మంటలో వేయడం వల్ల వైరాగ్యం కలుగుతుందనేది. లౌకికార్ధం. సమాజానికి మేలు కలగటమే కాక అందరికీ వీటి అక్కరకు వచ్చే పని చేయటం ఇందులోని పరమార్ధం. పాత వస్తువులతో పాటు, మనషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆ రోజు నుంచి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచన. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ మంటలో వేసిన వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయిన తరవాత, దాని మీదే నీళ్లు కాచుకుని స్నానాలు చేస్తారు. ఈ రోజున మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలి కాచుకుంటూ పరమానందం చెందుతారు.

సూర్యారాధన సంరంభం
ప్రతి నెల సంక్రమణానికి ముందు వచ్చే రోజు భోగి. సూర్యుడు దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి మారతాడు కనక ఈ సంక్రమణం ఘనంగా నిర్వహిస్తారు. ఇది మాఘమాసానికి ముందు వస్తుంది. మాఘమాసంలో స్నానాలు. సూర్యారాధన జరుగుతాయి. జపతపాలకి, ప్రతిష్ఠలకి, దేవవ్రతాలకి ఈ నెల ప్రత్యేకం. 27 నక్షత్రాల అమృతం పూర్తయ్యాక వచ్చేదే భోగి.
రేగు పళ్లను అర్కఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటం.

(" భోగి " ప్రత్యేకత ... శ్రీ గౌతమి గారి సౌజన్యంతో  )

సంక్రాంతి క్రాంతి

సంక్రాంతి క్రాంతి
పండుగ అంటే? ఓ ఏడాది ఎదురుచూపు!
ఒక అందమైన అనుబంధం! 
ఆనందపు అనుభవాల సుమహారం!
పాత తీపి జ్ఞాపకాల సమాహారం!
సంక్రాంతి అంటే- దాదాపు నెల రోజులనుంచి 
ఊరంతా సంబరంగా జరుపుకునే పెద్దపండుగ 
ఇంటింటా పచ్చని తోరణాలు, ఇంటిముంగిట కల్లాపి జల్లులతో తీర్చిన రంగవల్లులు వీధులలో రంగు రంగు రంగోలీ తివాచీలు, ఆ వాటి పై వీధుల వీధుల విభుడేగే అన్నట్లుగా దేవాలయాన్ని వీడి మన ముంగిట్లోకి పల్లకీ లో ఊరేగి వచ్చీ మరీ ఆశీర్వచనాలు అందించే భక్త సులభుడైన దేవుళ్ళు, హరిదాసులు, బుడబుక్కల వారు, గొబ్బెమ్మల ఆటపాటలు  
పుష్యం చలి మంచం పై నుండి లేవనియ్యదు, దుప్పటి తియ్యనియ్యదు. వీధిలో భోగిమంటల హడావుడి   తూరుపు దిక్కు ఇంకా వెలుగురేకలు విచ్చుకోక ముందే అమ్మ కేకలు లేవండి! లేవండి! అంటూ త్వరగా తలంటి స్నానాల కోసం ఆవిడ హడావిడి. నెత్తిమీద చమురు పెట్టి అత్తకడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అంటూ దీవెనలతో ఆనక వళ్ళంతా నూనిరాసి కుంకుడు కాయలు కొట్టించి, నలుగు పిండి రాసి, నలిచిన పిండిని కాకిని పిలుస్తూ కాకీ నా నలుపు నువ్వు తీసుకుని నా తెలుపు నాకిచ్చేయ్ అంటూ స్నానాలగది పిట్టగోడపై ఆ నలుగు పిండి ముద్దపెడితే కాకులు తీసుకు వెళ్ళడం. పిల్లల స్నానం చేస్తున్నప్పుడు కంటిలో కుంకుడు పులుసు పడిందని, గట్టిగా రుద్దవద్దు అని ఏడుపులు... మన  వంతు వచ్చేదాకా వినోదమే స్నానాలు అయ్యాక కొత్తబట్టలు భోగి దండలు భోగిమంటల్లో వెయ్యడం,  
సంక్రాంతి మూడు రోజుల పండగ కాదు. ఒక మాసం పాటు హడావిడి చేసే పండగ. డిసెంబర్ నుంచే సన్నాహాలు మొదలైపోయేవి. అటక మీద ఎక్కి దూలాలు, గోడలపై బూజులు దులిపి గోడలకి సున్నాలు తలుపులకి రంగులు గడపలకు పువ్వులు లతలు పెయింట్ చెయ్యడం పసుపు కుంకుమ బొట్లు పెట్టడం    కొత్త దుస్తుల ఎంపికలు, కుట్టించు కోవడం టైలర్ త్వరగా ఇస్తాడా ఇవ్వడా ఎదురు చూపులు, పెరట్లో పూలు కొయ్యడం. వాటి నాజూకుదనం పరిమళం, కొత్తబట్టలు తోడుక్కోవడం, గుడి మైకులో పాటలు, మధ్యాహ్నం పడమటింట్లో పిల్ల పెద్దలు కలసి ఘుమఘుమల భోజనాలు, మేట్నీసినిమాకి ఉరుకులు      
సాయం కాలాలు సందె గొబ్బెమ్మలుంచి ఆటలు పాటలు.
‘పువ్వు పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట?
రాజ వారి తోటలో మల్లె పూవు పూసిందంట’
‘గొబ్బీయల్లో గొబ్బీయల్లో
సుబ్బి గొబ్బెమ్మ సిరులనీయవె
చేమంతి పూవంటి చెల్లెలి నీయవే
తామర పూవంటి తమ్ముణ్నీయవే
మొగలి పూవంటి మొగుణ్నీయవే’
ఇలా ఎన్నో గొబ్బెమ్మల పాటలు ఆటలు
గంగిరెద్దుఆటలు, వారు వాయించే సన్నాయిలు, ఇచ్చే దీవెనలు డబడబ బుడబుక్కల సవ్వడులతో   బుడబుక్కల వారి "అంబపలుకు జగదంబ పలుకు" అంటూ భయం గొలిపే విచిత్ర వేషధారణ, అక్షయ పాత్రలతో హరిదాసు కీర్తనలు అందించే దీవెనలు చేతిలో చిడతల చప్పుళ్ళూ – అన్నీ ప్రపంచపు వింతలే. పండగ ప్రతి సవ్వడి ఒక కొత్త స్వరంలా వినిపించేది. భోగిపళ్ళ పేరంటాలు, గలగల రాలి పడుతూ రాగి నాణేలు, బొమ్మలకొలువులు, పన్నీటి సువాసనలు, వెలుగుతూ దీపాలు, ముత్తైదువల ఆశీర్వచన హారతి పాటలు, పిల్లల చిరాకు ఏడుపులు, గుళ్ళో గోదాదేవి కల్యాణాలు, ఇంట్లోకి వినిపిస్తూ మేళతాళాలు, వూరంతా సంక్రాంతి సందడి ఈ కవితలో ఆస్వాదించండి!  
మంచుతెరల చేమంతుల దోబూచులు 
బంతిపూల పూబంతుల విరబూతలు 
హేమంతం చేసెనంట సీమంతం 
పుడమితల్లి కడుపుపంట లోగిళ్ళను చేసెనంట శ్రీమంతం ..సిరివంతం! 
సిరుల విరులతో అలరారే కాలం 
ఆబాలగోపాలం ఆలపించు భూపాలం 
శుభ సంక్రాంతి శోభకిదే సంకేతం!
దినకర మకర సంక్రమణ సరంభాని కిదే యిదే స్వాగతం!
ముంగిళ్ళ రంగవల్లి వేదికగా అదిగదిగో...
హరిలో రంగహరీ...కీర్తనల హరిదాసు నర్తనలు 
ముద్దులొలుకు గుమ్మల గొబ్బెమ్మల పాటలూ..
ఇవిగివిగో...బొమ్మల కొలువులు...భోగిపళ్ల బోసి నవ్వులు 
అందాల అనుబంధాలు...ఆనందాలు పెనవేసిన బంధాలు 
ఇలా తెలిగింటి వెలుగులతో వెలిగెనంట భోగిమంట 
మంగళకరమై శుక్రవారపు శోభాయమానంగా అరుదెంచే
మకర సంక్రాంతి కిదే యిదే స్వాగతమంటా..
డబడబ బుడబుక్కల సడులు...డోలు...సన్నాయి తోడ  
డూడూ బసవన్నలాడు సందడులు..  
కోడిపుంజుల రంజైన ఎడ్లపందాల గెలుపుల ఈలలు
గాలిపటాల అలలు అహహా..
అంబరాలు తాకినవి సంక్రాంతి సంబరాలు 
సర్వాంగ సుందరమీ ధనుర్మాస సోయగాలు 
పాడిపంటల వేడిమంటల  భోగి పండుగ 
పిండివంటల పొంగలి పొంగుల పెద్దపండుగ  
పశువుల మేనినునుపుల మా కనుమ పండుగ..కలల పండుగ
ఆ పర్వదిన మాధుర్యం...అపూర్వ సంప్రదాయ సౌరభం 
మూడునాళ్ళూ ముచ్చటగా సంక్రాంతి...తెలుగునేల తియ్యదనాల స్రవంతి
జాలువారాలి నిరంతరం...తరలిరావాలి తరం తరం 
తరం తరం... నిరంతరం....నిరంతరం ..తరంతరం.  
సత్యసాయి విస్సా ఫౌండేషన్.

సంక్రాంతి కోసం దాదాపు ఒక నెల రోజులనుండి సందడి మొదలవుతుంది..ఆవుపేడతో ఇలా భోగి పిడకలు తయారు చేస్తారు. మా చిన్నారి మహాలక్ష్మి తన మిత్రబృందముతో ఆ తయారీలో నిమగ్నమై వుంది.  



పిల్లలందరూ "ఎప్పుడెప్పుడు పండుగ ఏడాది పండుగ, పండుగెందుకొచ్చింది పప్పులు(పిండివంటలు) తినడాని కొచ్చింది" అంటూ పాడుకుంటూ
భోగిమంటకు అవసరమైన సామాగ్రిని ప్రతి ఇంటింటికి వెళ్లి సేకరిస్తారు.  

ఆడపిల్లలు ముగ్గులు వెయ్యడానికి అనువుగా మొగపిల్లలు ఇంటి ఆవరణని శుభ్రం చేసి సిద్ధం చేస్తున్నారు. 


చిన్నారుల చేతుల్లో రంగవల్లికలు గా రూపుదిద్దుకోనున్నరంగులు...
నేలతల్లి కి రంగవల్లికలల్లుతున్న చిన్నారులు. 






భోగి మంటలకు సర్వం సిద్ధం!  





స్నానానికి నీళ్ళు కాస్తూ...కుంకుడు కాయలు కొడుతూ, అభ్యంగన స్నానం లో చిన్నారులు  





భోగి దండలు భోగి మంటల్లో వెయ్యటం. 






 గొబ్బెమ్మలతో ముద్దుగుమ్మల ఆట పాట


సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలు. పురస్కారాలు 


Total Pageviews