Friday, December 24, 2021

స్వచ్ఛ భారత్ అభియాన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా విస్సా ఫౌండేషన్‌ కు చేంజ్‌ మేకర్‌ బేడ్జ్‌ స్థాయి ఓ గర్వ కారణం!

స్వచ్ఛ భారత్ అభియాన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా విస్సా ఫౌండేషన్‌ కు చేంజ్‌ మేకర్‌ బేడ్జ్‌ స్థాయి ఓ గర్వ కారణం 1 వ స్థాయి 480 పాయింట్సు నుంచి 16 స్థాయిలు దాటి 1 లక్ష పాయింట్సుకి చేరువై ఇప్పుడు 3 లక్షల 1970 పాయింట్సు చేరిన ప్రస్థానం . ఇది నిజంగా మా చిన్నారుల విజయం. మా విస్సా ఫౌండేషన్‌! బాలమిత్ర, చందమామలకు వారి తల్లితండ్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఈ విజయం మా చిన్నారులందరిదీ మరీ ముఖ్యంగా వారిని ఉత్సాహంగా పంపుతున్న వారి తల్లితండ్రులదీ అని సవినయంగా మనవి చేస్తున్నాను. స్వచ్చ భారత్‌ కార్యక్రమాలు 2014 సంవత్సరం నుంచి మా విస్సా ఫౌండేషన్‌ అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఆదివారం పిల్లలకు వివిధ తరగతులు, కార్యశాలలు నిర్వహించి వివిధ అంశాల పట్ల అవగాహన కలిగేలా ఉదా: మొక్కలు నాటడం, నీళ్ళు పోయడం, కలుపు తీయడం వంటి సంరక్షణ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్ధాల పునర్వినియోగం వంటి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలను ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్‌ వెబ్‌ సైట్‌ లో ఉంచడం జరిగింది. ఆ విజయ ప్రస్థానం అనంతంగా కొనసాగుగాక!





Thursday, December 23, 2021

వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన #రత్నం రతన_టాటా. ''

 

వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన #రత్నం
డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు. కారణం ఆ నాల్గవ వ్యక్తి #రతన_టాటా. '' సార్ , మీరు ? '' '' అవును , మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? '' అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ]
TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది !
బాల్యంలో ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది.
యవ్వనంలో ఆయన girl friend మోసం చేసింది.
ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి.
కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. #TATA సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది :
టాటా సంస్థ అయిన #TCS యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.
భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది.
ప్రతి ఏటా అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50000 + కోట్లు ]
నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క #TajHotel మీద [ కింద ఫోటోలో కనిపిస్తుంది ] ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం , పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ] నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు : Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.
నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద. ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశాన్ని సేవిస్తున్నాడు.
(సేకరణ)

Saturday, December 11, 2021

 64లక్షల #జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక #పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా #దేహం పెరుగుతుంది. దేహం మీద #మోహం పెరుగుతుంది.

ఈ దేహం నేనె అంటాం. కానీ ఎలా?

నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?

ఏ భాగము వినదు.

వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.

చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6అడుగులు అవుతుంది.

అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.

ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?

ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?

ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?

ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు. 

ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.

ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి యొక్క అర్థం అని తెలుసుకొ..

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.

రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.

చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.

ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

రూపానికి ముందు నువ్వున్నావు.

రూపంలో నువ్వున్నావ్.

రూపం వదిలేశాకా నువ్వుంటావు.

ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు. 

ఈ దేహం అమ్మ నాన్న లు ఇచ్చిన ఒ అద్భుత వరం. 

కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్....👏👏

Sunday, December 5, 2021

దొరకునా ఇటువంటి సేవ! స్వామియే శరణం అయ్యప్ప!!

 

దొరకునా ఇటువంటి సేవ! స్వామియే శరణం అయ్యప్ప!!

శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతిచోటా పడిపూజలు నిర్వహించి అహారపదార్ధాల ప్రసాదం అందించడం సాధారణం 

అలా కాక కొత్తగా అలొచించి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్త యాత్రీకులకు మార్గ మధ్యంలో భోజన సదుపాయం కల్పించాలన్న నా సంకల్పానికి మిత్రులు రిటైర్డ్‌ జడ్జ్‌ శ్రీ మాల్యాద్రి గారు స్పందించి వారి విశ్వవ్యాప్త సేవా సంఘం నెట్వర్క్‌ ద్వారా నెల్లూరు రైల్‌ స్టేషన్‌ లలో  04.12.2021 తేదీన  మధ్యాహ్నం 1 గంటకు 60 మంది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు నెల్లూరు శ్రీ గొనుగుంట సుధాకర్‌ రావు గారు శ్రీ సత్యనారాయణ గారి సహాయంతో మరియు 05.12.2021 తేదీన ఒంగొలు రైల్‌ స్టేషన్‌ లలో 6 మంది భక్తులకు శ్రీ నేరెళ్ళ శ్రీనివాస్‌ గారి ద్వారా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. చేసింది చెప్పకూడదు అంటారు కానీ కొత్తగా అలోచించి ఇలా, కాశీ, తిరుపతి మొదలైన వివిధ తీర్ధయాత్రలు చేసే భక్త యాత్రీకులకు మనం ఇలా కల్పిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్‌ పెట్టడం జరిగింది. కావున నా విన్నపం ఏమనగా? వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌ దగ్గరలో వున్న సేవా భావం కలిగిన ఔత్సాహిక మిత్రులు వారి ఫోన్‌ నంబర్ల వివరాలు నా మెసేజ్‌ బాక్స్‌లొ ఇవ్వ మని మనవి. భవిష్యత్‌ కార్యాచరణకు వారి సహాయ, సహకారాలు అవసరం అయినప్పుడు వినియోగించ వచ్చు. 



శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతిచోటా పడిపూజలు నిర్వహించి అహారపదార్ధాల ప్రసాదం అందించడం సాధారణం 

అలా కాక కొత్తగా అలొచించి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్త యాత్రీకులకు మార్గ మధ్యంలో భోజన సదుపాయం కల్పించాలన్న నా సంకల్పానికి మిత్రులు రిటైర్డ్‌ జడ్జ్‌ శ్రీ మాల్యాద్రి గారు స్పందించి వారి విశ్వవ్యాప్త సేవా సంఘం నెట్వర్క్‌ ద్వారా నెల్లూరు రైల్‌ స్టేషన్‌ లలో  04.12.2021 తేదీన  మధ్యాహ్నం 1 గంటకు 60 మంది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు నెల్లూరు శ్రీ గొనుగుంట సుధాకర్‌ రావు గారు శ్రీ సత్యనారాయణ గారి సహాయంతో మరియు 05.12.2021 తేదీన ఒంగొలు రైల్‌ స్టేషన్‌ లలో 6 మంది భక్తులకు శ్రీ నేరెళ్ళ శ్రీనివాస్‌ గారి ద్వారా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. చేసింది చెప్పకూడదు అంటారు కానీ కొత్తగా అలోచించి ఇలా, కాశీ, తిరుపతి మొదలైన వివిధ తీర్ధయాత్రలు చేసే భక్త యాత్రీకులకు మనం ఇలా కల్పిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్‌ పెట్టడం జరిగింది. కావున నా విన్నపం ఏమనగా? వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌ దగ్గరలో వున్న సేవా భావం కలిగిన ఔత్సాహిక మిత్రులు వారి ఫోన్‌ నంబర్ల వివరాలు నా మెసేజ్‌ బాక్స్‌లొ ఇవ్వ మని మనవి. భవిష్యత్‌ కార్యాచరణకు వారి సహాయ, సహకారాలు అవసరం అయినప్పుడు వినియోగించ వచ్చు. 

నేనేమీ చెయ్యలేదు చేసినదంతయు ఆ సర్వేశ్వరుడే అని 

మా పెద్ద తాతగారు కీ.శే. బ్రహ్మశ్రీ విస్సా వేంకట రావు గారు రాసిన ఈ పద్యం నాకు ఎప్పుడూ గుర్తు వస్తుంది. 

      చేసితి దానధర్మములు చేసితి నెన్నియొ తీర్థయాత్రలన్

      చేసితి పుణ్యకార్యముల జేసితి నెన్నియొ దైవపూజలన్ 

      చేసితి నన్ని చేతినొక చిల్లియు గవ్వయు లేకపోయినన్ 

      చేసితినంటి గాని యవి చేసినదంతయు నీవెగా ప్రభూ!

అంతా మనం చేసాం అనుకుంటాము కానీ చేసేదంతా ఆ జగన్నాటక సూత్రధారి. మనమంతా పాత్రధారులమే, అందుకే ఏ పుణ్యకార్యం అయినా చివరలో శ్రీ కృష్ణార్పణం అనిపిస్తారు. కర్తా కారయితా చైవ ప్రేరక శ్చానుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారస్సమ భాగినః వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. 

భవదీయుడు 

సత్యసాయి విస్సా ఫౌండేషన్‌!

Wednesday, December 1, 2021

తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేకతలు

 తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ఆలయాలు:

అప్పనపల్లి వెంకన్నబాబు
అయినవిల్లి వినాయకుడు
ముక్తేశ్వరం శివాలయం
ర్యాలి జగన్మోహన స్వామి
ముమ్మిడివరం బాలయోగి
మురమళ్ళ నిత్య శివపార్వతీ కల్యాణం
జగ్గన్నతోట ప్రభలతీర్థం
వాడపల్లి వేంకటేశ్వర స్వామి
ద్రాక్షారామం భీమేశ్వరుడు
సామర్లకోట కుమార భీమేశ్వడు
అన్నవరం సత్యనారాయణ స్వామి
బిక్కవోలు సుబ్బారాయుడు
నవ జనార్ధనలు
మందపల్లి శని దేవుడు
పిఠాపురం కుక్కుటేశ్వరుడు
కోరుకొండ నరసింహుడు
అంతర్వేది నరసింహ స్వామి
సర్పవరం భావనారాయణుడు
చింతలూరు ధన్వంతరి స్వామి
ద్వారపూడి అయ్యప్ప
గొల్లాలుమామిడాడ సుర్యనారయణ
జిల్లా గ్రామదేవతలు:
కాకినాడ నూకాలమ్మ
తుని దగ్గర లోవ తలుపులమ్మ
పెద్దాపురం మరిడమ్మ
కాండ్రకోట నూకాలమ్మ
చింతలూరు నూకాలమ్మ
దేవి పట్నం గండిపోశమ్మ
కత్తిపూడి సత్తిమ్మ
గొల్లపాలెం ధనమ్మ
జిల్లా ప్రత్యేకం:
అమలాపురం అరటి తోటలు
కొత్తపేట కొబ్బరి తోటలు
అంబాజీపేట వంటాముదం
రావులపాలెం గోదావరి బ్రిడ్జి
రాజోలు రాజుల దర్జా
ముక్కామల పప్పుచెక్కలు
బెండమూర్లంక దోసకాయలు
ఎదుర్లంక బాలయోగి బ్రిడ్జి
కోటిపల్లి నావల రేవు
పుల్లేటికుర్రు చేనేత చీరలు
గంగలకుర్రు గంగా బొండాలు
ఆత్రేయపురం పూతరేకలు
పసలపూడి గోదారి కథలు
రామచంద్రపురం పంటపొలాలు
తాపేశ్వరం మడత కాజా
మండపేట బెల్లం గవ్వలు
బొబ్బర్లంక కొబ్బరుండలు
తుని తమలపాకులు
కత్తిపూడి కరకజ్జం
బెండపూడి బెల్లం జీళ్ళు
జగ్గంపేట జాంపళ్ళు
ప్రత్తిపాడు జొన్నపొత్తులు
రాజానగరం సీతాఫలాలు
రాజమండ్రి రైలు బ్రిడ్జి
ధవళేశ్వరం ఆనకట్ట
కడియం పూలతోటలు
ద్వారపూడి బట్టల సంత
అనపర్తి చేపల చెరువులు
సామర్లకోట పంచదార ఫాక్టరీ
పెద్దాపురం పాండవుల మెట్ట
పిఠాపురం అత్తరు సెంటు
గొల్లప్రోలు పచ్చమిర్చి
కాకినాడ కోటయ్య కాజా
ఉప్పాడ పట్టుచీరలు
మామిడాడ మామిడి తాండ్ర
తాళ్ళరేవు తాటి తాండ్ర
ఏలేశ్వరం వంకాయలు
వడిశలేరు చేగోడి
అడ్డతీగెల పనసకాయలు
గోకవరం మామిడి తోటలు
మారేడుమిల్లి అడవుల అందాలు
కాకినాడ హోప్ ఐలాండ
ఇవేగాక
కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు కాకినాడ. కాకినాడ 'యంగ్ మెన్స్ క్లబ్' నుంచి
రేలంగి, ఎస్వీ రంగారావు, అంజలీదేవి, నల్ల రామ మూర్తి , ఆదినారాయణ రావు, సత్యం (సంగీతం) మొదలగు వారు ఇక్కడి వారే.
చదువుల తల్లి సరస్వతీ నిలయం రాజమండ్రి:
వీరేశలింగం, పానుగంటి, చిలకమర్తి, మొక్కపాటి, శ్రీపాద, వేదుల, దేవులపల్లి, భమిడిపాటి, మునిమాణిక్యం వంటి లబ్ధప్రతిష్ఠులైన రచయితలు ఇక్కడి వారే!
ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారత రచనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే!
జయప్రద, రాజబాబు, అలీ మొదలగు వారు రాజమండ్రి ప్రాంతము వారే!
ఇలాంటివి ఇంకా ఎన్నో జిల్లా ప్రత్యేకతలు ఉన్నాయి.

Total Pageviews