స్వచ్ఛ భారత్ అభియాన్ వెబ్ సైట్ ద్వారా విస్సా ఫౌండేషన్ కు చేంజ్ మేకర్ బేడ్జ్ స్థాయి ఓ గర్వ కారణం 1 వ స్థాయి 480 పాయింట్సు నుంచి 16 స్థాయిలు దాటి 1 లక్ష పాయింట్సుకి చేరువై ఇప్పుడు 3 లక్షల 1970 పాయింట్సు చేరిన ప్రస్థానం . ఇది నిజంగా మా చిన్నారుల విజయం. మా విస్సా ఫౌండేషన్! బాలమిత్ర, చందమామలకు వారి తల్లితండ్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఈ విజయం మా చిన్నారులందరిదీ మరీ ముఖ్యంగా వారిని ఉత్సాహంగా పంపుతున్న వారి తల్లితండ్రులదీ అని సవినయంగా మనవి చేస్తున్నాను. స్వచ్చ భారత్ కార్యక్రమాలు 2014 సంవత్సరం నుంచి మా విస్సా ఫౌండేషన్ అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఆదివారం పిల్లలకు వివిధ తరగతులు, కార్యశాలలు నిర్వహించి వివిధ అంశాల పట్ల అవగాహన కలిగేలా ఉదా: మొక్కలు నాటడం, నీళ్ళు పోయడం, కలుపు తీయడం వంటి సంరక్షణ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాల పునర్వినియోగం వంటి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలను ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్ వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది. ఆ విజయ ప్రస్థానం అనంతంగా కొనసాగుగాక!
భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Friday, December 24, 2021
స్వచ్ఛ భారత్ అభియాన్ వెబ్ సైట్ ద్వారా విస్సా ఫౌండేషన్ కు చేంజ్ మేకర్ బేడ్జ్ స్థాయి ఓ గర్వ కారణం!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment