Wednesday, September 29, 2021

 బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. తమ గురించి తాము చెప్పుకోలేని పరిస్థితి బ్రాహ్మణులకు కలిగింది. ఈ నేపధ్యంలో పాత్రికేయులు డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావు రాసిన "సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర" బ్రాహ్మణేతర విమర్శకులకు అసలు-సిసలైన సమాధానం అనాలి. ఇది చదివిన వారు-ముఖ్యంగా బ్రాహ్మణ విమర్శకులు, "ఓహో...బ్రాహ్మణులంటే ఇంత గొప్ప వారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన చేయవచ్చా?" అన్న ఆలోచన చేయక మానరు.

 

          సామూహిక జన జీవన వ్యవస్థే సమాజం అంటూ ప్రారంభించి, అనేకానేక విషయాలను, సంక్షిప్తంగా అంటూనే, వివరంగా తెలియచేసే ప్రయత్నంలో పాలకోడేటి సఫలమయ్యారనడంలో సందేహం లేదు. వివరాలలోకి పోతే.... ప్రపంచంలో ఎన్ని మతాలున్నా హైందవ మతానికి, లేదా, వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే కాలంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. మరో వాదన ప్రకారం, ఆర్యులు ఆంధ్ర దేశం రాక ముందు, చాతుర్వర్ణ పద్ధతి లేదు. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే ఐనా, కొంత వ్యత్యాసం వుంది. లోతుగా పోతే, బ్రాహ్మణులని పిలిపించుకోవాలంటే, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం తప్పని సరి. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, చాతుర్వర్ణాలుండవచ్చు కదా! ఇలాంటి వ్యవస్థ ప్రాచీన కాలం నాటి ఈజిప్ట్, బాబిలోనియాలతో సహా, చైనా దేశంలోనూ వుండేదట. అక్కడి వాడుక ప్రకారం వారిని పూజారులుగా, పాలకులుగా, వృత్తి దారులుగా, బానిసలుగా విభజించారు. అలానే ప్రాచీన ఇరాన్‌లో "పిస్త్రీ" అనే నాలుగు వర్ణాలుండేవి.

 

          ఇక "కులం" అంటే ఏమిటో చూద్దాం. ఒక అర్థం ప్రకారం కులమంటే "నివాసం". వర్ణాలు వేరు, జాతులు వేరు. వర్ణం అనే మాట "వర్గం" ను సూచిస్తే, జాతి అనేది "కులం" ను సూచిస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే "క్లాస్", "కాస్ట్" అన్న మాట. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, ఒక విషయం మాత్రం వాస్తవం. అది ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ పడాల్సిన అవసరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు. బ్రాహ్మణుల విషయానికొస్తే, వారు సమాజంలో దైవ చింతనను పెంచాలని, సమాజ హితం కోరే "పురోహితులు” గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను చాలా కాలంపాటు, బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. కాలానుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బ్రాహ్మణులు కూడా మార్పులకు లోనుకాక తప్పలేదు. ఒకటి మాత్రం వాస్తవం. బ్రాహ్మణులు కులవ్యవస్థకు కారకులు కాదు. వారు కుల వ్యవస్థను పెంచి పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ.

 

          "బ్రాహ్మణులు" అనే మాట "బ్రహ్మన్" అనే పదం నుంచి వచ్చింది. బ్రహ్మన్ అంటే "యజ్ఞం’ అనే అర్థం కూడా వుంది. అంటే యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే "బ్రహ్మ" అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు. అంటే వేదాధ్యయనం చేసిన వాడు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. ఒకానొక రోజుల్లో బ్రాహ్మణులకు బ్రహ్మ-క్షత్రియ గుణాలుండేవి. కాని, ఆ తరువాత, వారు తమ క్షత్రియ గుణాలను పూర్తిగా వదిలి, పాలన, మంత్రాంగం, పురహితాల వైపు దృష్టి మరల్చారు. బ్రాహ్మణులకు అనాది నుంచీ, సమాజంలోని ఇతరుల నుంచి ఎంతో గౌరవ ప్రపత్తులు లభించేవి. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు పనిచేసే "పంచ ప్రధానుల" లో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణులుండేవారు. అదే నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఐంది. సుమతి శతకం ప్రకారం, ఒక ప్రదేశం గ్రామం అనిపించుకోవాలంటే, దానికి వుండాల్సిన ప్రాధమిక లక్ష్యాలలో వూళ్లో బ్రాహ్మణుడు వుండడం కూడా ఒకటి. సమాజాన్ని మార్క్సిస్టు కోణంలో నిశితంగా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రంధంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా గొప్ప యోగ్యతా పత్రం ఇచ్చారు. ఆర్య, ఆదిమ వాసుల పునఃకలయికవల్ల ఏర్పడిన కులంగా బ్రాహ్మణులను అభివర్ణించి, ప్రాచీన పవిత్ర గ్రంథాలలో లభ్యమైన వాటిని భద్ర పరిచింది వారేనని, దాని విలువ అపారమని పేర్కొన్నారు.  

 

          బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని "మాత్రులు" అని; వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని "బ్రాహ్మణులు" అని; బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని "శ్రోత్రియులు" అని; నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులను "అనూచానులు" అని; ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్న వారిని "భ్రూణులు" అని; ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని "ఋషికల్పులు" అని; రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని "ఋషులు" అని; సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని "మునులు" అని అంటారు.

 

          అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచ గౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే బ్రాహ్మణులు, భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో "బహున్" లుగా, మయన్మార్‍లో "పొన్న" లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త  బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది వరకూ వున్నాయి. వారిని, తెలగాణ్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణ కమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ పది తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగం వారిని నియోగులంటారు.

 

          వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమైన కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని "వైదికులు" అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ వుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన ఈ బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మారిపోయాయి.

 

          వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు "నియోగులు". వారిలో, ఆరు వేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి నియోగులని రకరకాల ఉప శాఖల వారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే వినియోగించబడిన వారని. నియోగులు సంప్రదాయ బ్రాహ్మణులు కారనే వాదన కూడా వుంది. కొందరి దృష్టిలో సంప్రదాయ బ్రాహ్మణులంటే వైదిక కార్యాలు చేసే వైదికులు మాత్రమేనని. పౌరోహిత్యం వృత్తిగా కాకుండా, లౌకిక ఉద్యోగాల మీద ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరు వేల నియోగులది పెద్ద ఉప శాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో అనే విషయం ఇదమిద్ధంగా తేలలేదు. శతాబ్దాల క్రితం ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజులు పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాధమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల పరిపాలనా కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించి నందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న పేరొచ్చిందంటారు. అంతవరకూ యుద్ధాలలో కూడా పాల్గొన్న బ్రాహ్మణులు పాలనా రంగంలోకి వచ్చారు. మరో కథనం ప్రకారం, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి వుండవచ్చు.     వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంత వరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో వున్నాయి. వేటిలో ఏది నిజమో, ఏవి కావో మరింత పరిశోధనలు చేయాల్సి వుంటుంది.

 

వైదికులైనా, నియోగులైనా, తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?

 

ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్నాయి. క్రిస్టియన్ మిషనరీల రాకతో, అంతకు ముందు ముస్లింల పాలనలో, ప్రారంభమైన బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో బలపడి, స్వతంత్ర భారత దేశంలో పతాక దశకు చేరుకుంది. దశాబ్దం క్రితం మండల కమీషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూనుకుని పోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృఛ్చికంగా జరిగిందేమీకాదు. భారత దేశ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలచడంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు కలగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటీష్ ప్రభుత్వం, భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు బ్రాహ్మణులను దెబ్బ తీయాలని భావించింది. అలనాడు ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే స్వతంత్ర భారత దేశంలో మండల్ కమీషన్ అనుసరించింది. చదువుకున్న బ్రాహ్మణుల మూలాన, భారతదేశంలో తమ గుత్తాధిపత్యానికి ప్రమాదం వుందని భావించింది బ్రిటీష్ ప్రభుత్వం. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించడం వారి అనుమానాన్ని మరింత ధృఢ పరిచింది.

 

అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం. బ్రాహ్మణులంటే బ్రహ్మ జ్ఞానం కలవారని. అదొక సామాజిక వర్గం. హైందవ మతంలో, ఆచారంలో, ఒక భాగం. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు వైదిక కాలం నుంచి కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తోంది. భారతీయ మనుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, వ్యాపారులు, బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అనే నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి. నాలుగు వర్ణాలుగా అనాది నుంచీ విభజన జరిగిన వాటిలో మొదటిది బ్రాహ్మణులు కాగా, మిగిలిన మూడింటిని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులనీ పిలవడం మొదలెట్టారు. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు దక్కిన ప్రత్యేక హోదా నాటి నుంచీ నేటి దాకా ఒక విధంగా కొనసాగుతూనే వుంది. వాళ్ల గొప్పతనానికి, ఆధిపత్యానికి, ఇప్పటికీ గౌరవం లభిస్తున్నప్పటికీ, అనాదిగా వారికి దక్కిన హక్కుల విషయంలో మాత్రం అడుగడుగునా కోతలు ఎప్పటి నుంచో మొదలైంది. ఇతర కులాల వారు, వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే జ్ఞాన సముపార్జన వాళ్లకే చాలా కాలం వరకూ పరిమితమై పోయింది. కాలానుగుణంగా వస్తున్న మార్పులలో ఇతర వర్ణాల వారు, కులాల వారు, జ్ఞాన సముపార్జన విషయంలో వీరితో పోటీ పడి నెగ్గుకొస్తున్నప్పటికీ, సాంప్రదాయిక వైదిక విద్యా సముపార్జన మాత్రం ఇంకా వీరి అధీనంలోనే చాలా వరకు వుందనాలి. వాళ్లకు సంఘంలో వున్న గౌరవం వల్లనైతేనేమి, సాంప్రదాయకంగా వారికి లభిస్తున్న విద్య వల్ల నైతేనేమి, బ్రాహ్మణులు మత పరమైన వ్యవహారాలనే కాకుండా లౌకిక వ్యవహారాలను కూడా చక్కదిద్దే స్థాయికి ఎదిగారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటు పడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదాలలో ప్రావీణ్యం కల వారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభిస్తోంది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద-పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై చక్కటి అవగాహన కలిగి ఉంటారు.

--------------------శుభరాత్రి ------------------------

Saturday, September 25, 2021

ప్రపంచ నదుల దినోత్సవ సందర్భంగా గోదావరీ నదీమతల్ల వడిలో కొన్ని మధుర క్షణాలు

 #ప్రపంచ నదుల దినోత్సవం🌊🎉 #ప్రపంచ నదుల దినోత్సవం #ప్రపంచ నదుల దినోత్సవం

వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికా లోని ఎడారులలోను, సౌదీ అరేబియా లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్‌ స్టోన్‌) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్‌) ఉంటే నీరు అంతగా ఇంకదు.





"గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు`"అన్న మంత్రాన్ని పఠిస్తూ గంగ, యమున, సరస్వతి వంటి పుణ్యనదులన్నీ కూడా తాను స్పృశించిన నీటిలో ఉండుగాక అని దీని అర్థం.  జ్యోతిష శాస్త్ర రీత్యా నీటి మీదా, మానవుల మనసు మీదా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడట. అందుకే ఈ మాసానికి `కౌముది మాసం` అని కూడా పేరు. అలాంటి చంద్ర కిరణాలతో, ఔషధులతో రాత్రంతా తడిసిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనాదిగా మన పెద్దలు నదులకు గొప్ప స్థానాన్ని అందించారు. వాటిని దేవతలుగా భావించి కొలిచారు. అలాంటిది సాక్షాత్తూ ఆయా నదీజలాలలోనే స్నానంమాచరించే సందర్భం వస్తే వదులుకోరు కదా! ఆ సందర్భమే కార్తీక మాసం!!! ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్దకు చేరుకుని సంకల్పం చెప్పుకుని, పితృదేవతలను తల్చుకుని, దానధర్మాలు చేసి, దీపాన్ని వెలిగించి, భగవంతుడిని కొలుచుకోవాలని కార్తీక పురాణం చెబుతోంది. ఇక ఆయా పుణ్యనదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయవచ్చని ప్రోత్సహిస్తుంటారు పెద్దలు. 


గోదావరితల్లి పై నా స్వీయ కవిత ఈ లింక్‌ లో చూడండి 

 https://www.youtube.com/watch?v=NoLrZn1ctcE



















ప్రపంచంలోని పెద్ద నదుల: పొడవైన నదుల జాబితా నైలు నది (6,695 కి.మీ.) అమెజాన్ నది (6,683 కి.మీ.) యాంగ్‌ట్జీ నది (చాంగ్ జియాంగ్) (6,380 కి.మీ.) మిసిసిపి నది (5,970 కి.మీ.) ఓబ్ నది (5,410 కి.మీ.) హువాంగ్ హో (4,830 కి.మీ.) కాంగో నది (4,630 కి.మీ.) లెనా నది (4,400 కి.మీ.) అమూర్ నది (4,350 కి.మీ.) యెనిసెయి నది (4,106 కి.మీ.) భారత దేశాన్ని🇮🇳 నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. నదులను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పాటమాలజీ అందురు. మరిన్ని వివరాలకు www.sriwritings.blogspot.com/2000/07/blog-post_1.html గంగ, సింధు, యమున, బ్రహ్మపుత్ర, సరస్వతి, పంజాబు లోని ఐదు నదులు : **సింధూ నది, **రావి నది, **బియాస్ నది, **సట్లెజ్ నది, **చీనాబ్ నది, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, నర్మద, తపతి, మహానది, భరతపూయ, దహీసార్, దామోదర్, ఘాగర్ గోమతి, కోయెనా, మండోవి, మిధి, ఓషివార, సబర్మతి, శరావతి, ఉల్హాస్, వశిష్ఠి, జువారి, పంబా, నాగావళి, నేడు ప్రపంచ నదుల దినోత్సవం🌊 #WorldRiversDay 🌊🌊🌊🌊 సముద్రుడే విశ్వమంటు సర్వస్వము ధారబోసి అస్థిత్వము కోల్పోయిన నదినెవ్వరు ఓదార్చిరి ఔషధముల ఆస్తినంత ఒడిదుడుకుల దూకుడులో వారాశికి సమర్పించు నదినెవ్వరు ఒడార్చిరి పిల్ల నదుల తీసుకొచ్చి సంగమమున ప్రేమమీరి సంద్రుడికే బలి ఇచ్చెడి నదినెవ్వరు ఓదార్చిరి తనలో తీపిని సైతము విశ్వాసపు ముసుగులోన ఉప్పుకు దాసోహమిచ్చు నదినెవ్వరు ఓదార్చిరి తానై జమకట్టు రాళ్ళు కడలిలోని రత్నములని భ్రమసి ఎగసె నదినెవ్వరు ఓదార్చిరి సంప్రోక్షణ పరమైనను కాలుష్యపు కోరలలో సర్వరోగిగా మారిన నదినెవ్వరు ఓదార్చిరి తన గమనమును మార్చివేసి మనిషి కట్టు ఆనకట్ట ఆకాశపు హర్మ్య మన్న నదినెవ్వరు ఓదార్చిరి నది యెన్నడు సజీవమే కష్టాలలో కడలియె నది ఒంటరిగా పయనించును ఒంటరియై అమరమౌను. కవి: అష్టకాల విద్యాచరణ శర్మ

Thursday, September 23, 2021

 *బంధాలు భారమై'పోయా'యా:* 🌹🤝


           *మన చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు.  వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి.  ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు.  ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు.  ఇల్లంతా వెతికినా కనిపించవు.  అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది.  అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు.   కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు.  ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి.  బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు*.  


         *రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది.  ఇక గత రెండు మూడు దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి.  ఒకే పట్నంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది.  ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఆర్ధికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభం అయింది.  డబ్బున్న బంధువులకు ఒకరకమైన మర్యాదలు, డబ్బులేని బంధువులకు మరొకరకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది.  ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ,  అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంతవాళ్ళం అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలు పెట్టారు.   డబ్బులేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు*. 


          *ఇక సొంత అన్నదమ్ములైనా, అక్కాచెల్లెళ్ళే అయినా, ఏవైనా ఫంక్షన్స్ ఉంటె తప్ప కలుసుకోవడం లేదు.  మామూలుగా వెళ్లి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది.  ఆ ఫంక్షన్స్ కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్లడం, భోజనాలు అయ్యాక వెంటనే "పనులు ఉన్నాయి" అని వంక చెప్పి వెళ్లిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాము.  మనుషుల మధ్య  ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది*.  


     *సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకుని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలయితే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి.  అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకుని, కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్లిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు.   వందలమంది అతిధులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునొ, తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చెయ్యడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు*.  


            *అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా, కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్లిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి.  చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెబుతుంటారు. ఏడాదికి వందరోజులు సెలవులు ఉన్నాయి మనకు. లేనిదల్లా ఆత్మీయతలు...బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు!  అన్నం అనేది మనమధ్య మానసిక బంధాలను సుదృఢంగా నిలిపి అజరామరం గావించే  అమృతం లాంటిది*.


                *కొందరికి తల్లితండ్రులను పలకరించే తీరికలేని సంపాదనలో ఉన్నారు. అది చాలా దుర్భరమైన స్థితి*.


 *ఆలోచించండి బంధాలను బలపరుచుకోండి*🙏🌹

Wednesday, September 22, 2021

 ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మనసు కవి జీవితంలోని ఒక సరదా సంఘటన..🌹*_


👉మనసుకవి ఆత్రేయ పాట రాసే విధానం చాలా వింతగా ఉంటుంది. పగలంతా పిచ్చాపాటీతో కాలం గడుపుతారు. డాన్ పీంచ్ సిగరేట్ పేకెట్లూ.. పళ్లెంలో ఆరారగా ప్రూట్సు.. ఇవివుండి తీరాలి. అసిస్టెంట్ డైరెక్టరు పాట రాయించుకోవడం కోసం వస్తాడు, పేపర్లూ పాడ్‌తో. పెన్నుతెరిచి మరీ రెడీగా వుంటాడు. ఆ పెన్ను అలాగే వుంటుంది. ప్రూట్సు ఒకటీ అరా అవుతాయి. సిగరెట్లు మొత్తం ఖాళీ అవుతాయి. ఆయన నిద్రలోకి జారుకుంటాడు.

అంతే!

మళ్లీ సాయంత్రం.

ఫ్రెష్ష్‌గా స్నానం చెయ్యడం

ధవళ వస్త్రాలు ధరించడం.. సిగరెట్ వెలిగించడం.

‘‘ఎందాకా వచ్చాం?’’

‘‘ఏదీ... మొదలు పెట్టందే!’’

‘‘మొదలుపెడితే పాట పూర్తయినట్లే కదరా! ఆ మొదలు దొరకడం లేదు.’’

‘‘ఓ మాట అనండి!’’

‘‘వేడి కాఫీ చెప్పు!’’

‘‘మాట అనమంటే ఇదా!’’

ఇలా వుంటుంది ఆయన ధోరణి.

పాట పూర్తికాదు.

గంటలు.. రోజులు.. వారాలు గడుస్తుంటాయి.

‘‘పాట’’ పుట్టదు.

హోటలుకి అద్దె పెరిగిపోతుంది. ప్రొడ్యూసరు లబోదిబోమంటాడు. సరిగ్గా ఇలా జరిగింది, పద్మశ్రీ పి పుల్లయ్యగారి మురళీకృష్ణ చిత్రానికి.

ఇద్దరిమధ్య మంచి చనువుంది. తిట్లూ- పొగడ్తలూ సర్వసాధారణం. ఆరోజు అమీతుమీ తేల్చుకోడానికి పుల్లయ్యగారొచ్చారు.

‘‘పాట వొచ్చిందా?’’ పుల్లయ్యగారు.

‘‘వొచ్చి చచ్చింది!’’ ఆత్రేయ సమాధానం.

‘‘నన్ను చంపకు. ఇక రూమ్ వెకేట్‌చేసి బయలుదేరు!’’

‘‘ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నాను’’

‘‘సిగ్గులేదూ నీకు!’’

‘‘వుంటే సినిమాలకెందుకు పనిచేస్తాను!’’

వీరి మాటల్లో బూతులు సర్వసాధారణం. అవి వ్రాయదగ్గవి కాదు.

కారు ఆత్రేయగారింటికేసి దూసుకుపోతోంది వేగంగా.

అంతకుమించిన వేగంతో వారిమధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

పుల్లయ్యగారి ముఖంలో కోపం. ఆత్రేయ ముఖంలో చెక్కుచెదరని చిరునవ్వు.

‘‘దిగూ! నువ్వు ఎక్కడవున్నా- ఏవైనా.. నువ్వు సుఖంగా వుండాలనే నేను కోరుకుంటాను!’’ అన్నాడు పుల్లయ్యగారు.


అంతే! ఏదో ఫ్లాష్ వెలిగింది.

కారు తిప్పు. మన ఆఫీసుకి పోనివ్వు.. అన్నాడు ఆత్రేయ.

‘‘ఏం ఉద్ధరిద్దామని!’’

‘‘ఎలా- పోనియ్యవయ్యా!...

ఆఫీసు చేరుకుంది కారు.

‘‘ఎక్కడవున్నా- ఏమైనా’’

మనమెవరికి వారై వేరైనా...

నీ సుఖమే నే కోరుతున్నా

నిను వీడి అందుకే వెళుతున్నా- సాకీ...పల్లవి. వచ్చేసింది.


అనుకున్నామని జరగవు అన్ని

అనుకోలేదని ఆగవు కొన్ని

జరిగినవన్నీ మంచికనీ,

అనుకోవడమే మనిషి పనీ... చరణం వొచ్చేసింది-

ఇక రెండవ చరణం-


‘వలచుట తెలిసిన నా మనసునకు

మరచుట మాత్రం తెలియనిదా

మనసిచ్చినదే నిజమైతే

మన్నించుటయె రుజువుకదా- రెండవ చరణం వచ్చేసింది.

ముక్తాయింపు వుండాలి కదా-

‘‘నీ కలలే కమ్మగా పండనీ.

కలకాలం నీలో దాగనీ..

చిరంజీవిగా వుండాలనీ..

దీవిస్తున్నా.. నా దేవినీ.. దీవిస్తున్నా నా దేవిని..


పాట అయిపోయింది. పుల్లయ్యగారికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఆత్రేయ చేతుల్ని ముద్దుపెట్టుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఈ పాట మాస్టర్ వేణు చేతుల్లో పడింది. ఆయన ట్యూను చేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. రిహార్సల్స్‌లో ఘంటసాల మాస్టారు విన్నారు. ఆయన ఆ పాటకి ప్రాణం పోశారు. ఘంటసాల మాస్టారి జీవితంలో అత్యంత ఇష్టమైన పాట.

వేణు మాస్టారికి ప్రాణం ఈ పాట.

పుల్లయ్యిగారికి ఈ పాట ఆరో ప్రాణం...

అక్కినేని నట జీవితంలో పూర్ణాయుష్షు నింపుకున్న పాట ఇది!

అయితే ఆత్రేయకిది కేవలం ‘పాట విడుపు’ మాత్రమే!..


💟💟💟💟💟💟💟💟💟💟

                              ---------------   శుభసాయంత్రం ----------------------


Thursday, September 16, 2021

 స్కూళ్ల నిర్వాకం...                                     

ఒక ప్రైవేట్ స్కూల్ కి DEO lnspection ki వెళ్లి, 

ఒక పిల్లాడిని లేపి అడిగారు


DEO: శివ ధనుస్సు విరిచినది ఎవరు ప్రశ్నించారు?


స్టూడెంట్: సార్...నేను కాదు అని ఏడుస్తూ బదులిచ్చాడు.


అది విని DEO క్లాస్ టీచర్ ని కోపంగా ఏంటి ఇది అని అడిగారు.


క్లాస్ టీచర్ : "చ..చ వీడు అలాంటి వాడు కాదు సర్.... నాకు వీడి గురించి బాగా తెలుసు" అని బదులిచ్చాడు.


కోపంతో DEO, HM ని పిలిపించి.. శివ ధనుస్సు విరిచింది ఎవరు అని అడిగితే పిల్లలకి తెలియకపోతే కనీసం క్లాస్ టీచర్ కి అయినా తెలియాలి కదా..అని అన్నారు.


వెంటనే HM: సార్ ఈ క్లాసు పిల్లలు అలాంటి వారు కాదు..6 వ క్లాస్ పిల్లలు చేసి ఉండవచ్చు.... అని అన్నారు.


కోపంతో DEO: స్కూల్ బంద్ చేయండి అని ఆర్డర్ వేసారు.


HM: వెంటనే స్కూల్ కరస్పాండెంట్ ని పిలిపించాడు.


కరస్పాండెంట్: సార్...స్కూల్ మూసేయకండి..కావాలంటే విల్లు ఖరీదు ఎంతైనా నేను ఇస్తాను....అని అన్నాడు.


కోపంతో DEO....విద్యా శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొర పెట్టుకున్నాడు....


విద్యా శాఖ మంత్రి: ఏయ్.. ఏయ్ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, ఏమైనా విరగకొడతారు. అయినా తెలిసి కూడా అక్కడ విల్లుని ఎందుకు వదిలేశారు అని అన్నారు....


DEO...తల పట్టుకుని CM దగ్గరికి వెళ్ళాడు..


CM: దీని గురించి నాకు తెలియదు.ఊరికే నేను ఏమీ చెప్పను..ఇదంతా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చేస్తున్న కుట్ర.... 


విల్లును ఎవరూ విరగ్గొట్టలేదు.... 

ఒకవేళ విరగ్గొడితే దీని పైన CBI enquiry  వేయిస్తాం. 

దీని వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా సరే వదలం.

చట్టం ముందు దోషిగా నిలబెడతాం అని చెప్పారు.


DEO గారిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేశారు......😃   ఇది మన   చదువుల పరిస్థితి దుస్థితి  

🤣🤣🤣🤣🤣🤣


 ఒక్కరే నవ్వు కోకండి పక్క వారికి కూడా పంపండి.

Saturday, September 11, 2021

ఎక్కడ న్యూస్ ఛానళ్ళ పేరిట హింస లేదో ....Where the mind is without fear and head is held high

 ఎక్కడ న్యూస్ ఛానళ్ళ పేరిట హింస లేదో ....

ఎక్కడ 24 గంటల వార్తల పేరిట
చూపిందే చూపి జనాల్ని చంపరో...
ఎక్కడ బిగ్ బాస్ పేరిట సెమీ పోర్న్ రియాలిటీ షోలు నడిపించరో..
ఎక్కడ జబర్ధస్త్ పేరిట బూతు కామెడీ లు నిర్వహించరో...
ఎక్కడ సీరియళ్ళ పేరిట కుట్రలు కుతంత్రాలు చూపించరో...
ఎక్కడ న్యూస్ ఛానళ్ళు రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగవో...
ఎక్కడ రిమోట్ కంట్రోల్ లు చెత్తబుట్టలో పారేసి... ఇంటిల్లిపాదీ కలిసి కబుర్లు చెప్పుకుంటారో...
ఆ స్వేచ్ఛా స్వర్గానికి....తండ్రీ నా దేశాన్ని నడిపించు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు - శతం జీవ శరదో వర్ధమాన

 పుట్టిన రోజు శుభాకాంక్షలు

💐💐💐శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతిశత మితి శతం దీర్ఘమాయుః|
మరుత ఏనావర్ధయంతి|
శతమేన మేవ శతాత్మానాం భవతి శతమనంతం భవతి|
శత మైశ్వర్యం భవతి|
శతమితి శతం దీర్ఘమాయుః|
అగ్నే యశస్వి యశ సేమ మర్ప యేంద్రావతీ మపచితీ మి హావహ|
అయం మూర్ధా పరమేష్ఠీ సువర్చా స్సమానానా ము త్తమశ్లోకో అస్తు||
శతమానం భవతి శతాయుః
పురుషః శతేంధ్రియ
ఆయుఃశ్శ్యేవేంధ్రియే ప్రతితిష్ఠతి.
సుదినం సుదినం జన్మదినం తవ,
సుదినం సుదినం భవతు మంగళం,
సుదినం సుదినం చిరంజీవ భవ,
సుదినం సుదినం యశోవర్ధనం,
విజయీ భవ సర్వత్ర సర్వదా.
శత మానం భవతి శతయుహ్
పురుష శతేంద్రియ
ఆయుష్యే వేంద్రియే ప్రతితిశ్ఠతి!
ఆశీర్వాద శ్లోకం
శ్లో.గృహంకనక శోభితం
వదనమస్తు! విద్యోజ్జ్వలం
వపుర్బాల విరాజితం హృదయమస్తు! సత్వాచీం తమ్
భవంతు తవ శత్రవో భువితు కాందిశీకాః!
పరం సుహృజ్జన సమాగమం భవతు తే సదా హర్నిశం!!
తా.మీ ఇల్లు బంగారం చేతను , మీ ముఖము విద్య చేతను శోభిల్లుగాక , మీశరీరం బలిష్టమై యుప్పెనుగాక ,
మీ హృదయము సత్వ గుణముతో నిండియుండునుగాక, మీ శత్రువులు నాలుగుదిక్కులకు పా రిపోవుదురు గాక , రాత్రింబవళ్ళు మీకు సత్పురుష సాంగత్యము లభించునుగాక.
మీ ఇంట ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి
భక్తీ, జ్ఞాన, వైరాగ్య , సిద్దులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, తులతూగి
పుత్ర,పౌత్రులతో బంధు, మిత్రులతో కళకళలాడు గాక!!దీర్ఘాయుష్మాన్భవ భూ , జల , నిధి , నికేప, ధన, ధాన్య, వస్త్ర , వస్తు, నూతనస్థలి, నూతనగృహ, వాస్తుదోషానివారణ, అష్టమ, అర్థాష్టమ, ఏలిననాటి శనిదోషానివారణ, ఇష్టదైవత, కులదైవత అనుగ్రహ! శతృష్ణేహ అనుకూలిత !ఉన్నతాధికార అనుకూలిత ! సమాజ అనుకూలిత !పదవి అనుకూలిత ! కుటుంభఅనుకూలిత ! దాంపత్య జీవిత అనుకూలిత !తత్సంతానప్రాప్తి! పుత్ర పుత్త్రాభి వృద్ధి ! ఆనందజీవితప్రాప్తి ! మనఃశాంతి ప్రాప్తి ! రోగనిరోధకశక్తి ప్రాప్తి రాచరికముఖతేజస్సు! దానగుణ! దానశీలి!! దైవానుకూల !తల్లిదండ్రుల ఆశీర్వాద ! గగనసంచార గురువుల ఆశీర్వాద ! స్నేహపూర్వక ఆశీర్వాద ! ఇష్టదైవత , కులదైవత ,తధాస్తు దైవత ఆశీర్వాదమస్తు! .
శ్రీశైలం శ్రీ గంగా పార్వతీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ రామ శర్మ ఓం నమో వేంకటేశాయ
మీ శ్రీ రామ శర్మ 9490944543
1

 వ్యక్తిత్వవికాసం -- ఈ పదం వినని వారుండరు.ఇది సనాతనం, అధునాతనం, వినూత్నం, నిత్యనూతనం. అప్పుడూ ఇప్పుడూ అందరినోటా చెలామణి అవుతూనే ఉంటుంది.

వ్యక్తిత్వవికాసం అనే పేరు వినగానే మనమదిలో తళుక్కున మెరిసే పేర్లు స్టీఫెన్ కోవె, డేల్ కార్నెగీ, థామస్ హేరీ మొదలైనవి. అంతే కానీ సీతాన్వేషణలో భాగంగా లంకకు వెళ్ళే ప్రయత్నంలో నీరసించి కూర్చొన్న హనుమంతునికి స్వీయశక్తిని గుర్తుచేసి ప్రోత్సహించిన జాంబవంతుడు గుర్తుకు రాడు. యుధ్ధబూమిలో కృంగిపోయిన అర్జునునికి ధీరవచనాలను, కర్తవ్యాన్ని బొధించిన శ్రీకృష్ణుణ్ణి మర్చిపోయాం. పడిలేచిన కెరటంలా ఎన్నిసార్లు విఫలమైనా నిరాశ చెందకుండా అనుకున్నది సాధించిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు గుర్తుకు రాడు. శివ్ ఖేరా రాసిన 'యు కెన్ విన్' అనే వ్యక్తిత్వవికాస పుస్తకాన్ని చదువుతామే కాని ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో వ్యక్తిత్వవికాస శిక్షణా గ్రంథంగా పేరొందిన మన భగవద్గీతను కనీసం తెరవడానికి కూడా ఇష్టపడం.

అయినా మన మహాత్ములంతా ఏ ఉపనిషత్తుల కాలానికో, ఏ పురాణాల కలానికో చెందినవారు, కాబట్టి వారిని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? అని అంటారేమో! అలాగైతే, వివేక శంఖారావంతో భారతజాతిని మేల్కొలిపిన యుగనాయకుడు, యువనాయకుడు అయిన స్వామి వివేకానంద జీవిత సందేశాలని మాత్రం ఎంతమంది చదివి ఉంటారు? నేటి తరానికి స్ఫూర్తిప్రదాత స్వామీజీయే అని గుర్తించిన భారతప్రభుత్వం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందని ఎంతమంది గుర్తుంచుకున్నారు? మన పూర్వీకులలో ఉన్న గొప్పవారిని, మనదేశ సంస్కృతిని గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము.

Wednesday, September 8, 2021

 చిన్న‌త‌నంలో ఎంత‌ క‌ష్ట‌మైనా రావచ్చుగాని పిండి మ‌ర‌కెళ్ళాల్సిన క‌ష్టం మాత్రం ఎవ్వ‌రికీ రాకూడ‌దు. ఆసాంతం చ‌దివి మీరే అవునో, కాదో చెప్పండి. నా బాల్యంలో కొంత కాలం అవ‌నిగ‌డ్డ‌, గిద్ద‌లూరు, ఇచ్చాపురం వంటి చిన్న ఊళ్ళ‌ల్లో గ‌డిచింది. అప్ప‌ట్లో అన్న‌పూర్ణా ఆటాలు, ఆశీర్వాద్ ఆటా ఆశీర్వాదాలు మాకు దొర‌క‌ని క‌ష్ట‌కాల‌మాయే. అంద‌రూ గోధుమ‌లు, ధాన్యం, ప‌ప్పులు మ‌ర ఆడించుకోవ‌ల్సిందే. ఈ ప‌నికోసం అమ్మ‌లు, అమ్మ‌మ్మ‌లు మ‌మ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమ‌ర‌కు తోలేవాళ్ళు. మాకు ఇప్ప‌టి పిల్ల‌లంత అవేర్‌నెస్ లేక‌పోవ‌డంతో కార్మిక శాఖ‌కు కంప్లైట్ చేయాల‌ని తెలియ‌దు. మేము అలా పిండిమ‌ర దారిప‌ట్ట‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీ జ‌ల్లులా మ‌ర‌కు పోయి వ‌స్తే పావలానో, ప‌దిపైస‌లో ఆక‌ర్ష్ ప‌థ‌కానికి ఆశ ప‌డి ఈ సాహ‌సానికి సిద్ద‌ప‌డితే మేము ప‌డ్డ క‌ష్టాలు ప‌గోడికి కూడా వ‌ద్దు.


గోధుమ‌లో మ‌రొక‌టో నాలుగుమూడు కిలోలు క్యాన్‌లో పోసి ఆడించుకు ర‌మ్మ‌ని చెపుతూ అమ్మ‌లు మ‌ర‌వాడికి ఒక కేజీ త‌క్కువ చేసి చెప్ప‌మ‌ని చెప్పి పంపేవారు. మ‌ర‌కు పోయి అబ‌ద్దం చెప్ప‌డానికి పూర్తిగా సాహ‌సించ‌లేక పిండిమ‌ర చ‌క్రాలు క‌ర్‌క‌ర్ మ‌ని చేసే సౌండ్‌లో అశ్వ‌ద్దామ హ‌తఃకుంజ‌రః అన్న‌ట్లుగా మూడు కేజీల‌ని రెండ‌నో నాలుగును మూడ‌నో అనేసేవాళ్ళం. పిండిమ‌ర వాళ్ళు పొద్దున్నుంచి నాలాంటి వాళ్ళ‌ను ఎంత‌మందిని చూసుంటారు? బాల‌య్య బాబులా కంటి చూపుతో స‌రుకు తూకం క‌నిపెట్టేసి క‌రెక్ట్ గా వ‌సూలు చేసేవాళ్ళు.


ఇంట్లో మ‌ర‌కు పంపేముందు క‌ణ్వ‌మ‌హ‌ర్షి శ‌కుంత‌ల‌కు చేసే అప్ప‌గింత‌ల కంటె ఎక్కువే మాకూ బోధ జ‌రిగేది. ”పిండి ఆడించేప్పుడు దిక్కులు చూడ‌కు, పిండికాజేస్తారు జాగ్ర‌త్త” అని, మ‌రుమ్‌గా ప‌ట్టించ‌మ‌నో, మెత్త‌గా ప‌ట్టించ‌మ‌నో, ప‌సుపు త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో, కారం త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో ఆంక్ష‌లు చెప్పి పంపేవారు. ఇన్ని జాగ్ర‌త్త‌లు చెప్పారు క‌దా అని మేము పిండిమ‌రలో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర‌నుండి ముఖ్య‌మంత్రి గారి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు డేగ క‌న్నుతో చూస్తున్న‌ట్లుండే వాళ్ళం. దీనికితోడు ప్ర‌తి పిండి మ‌ర‌లో ఒక స‌న్న గొట్టం దొంగ చాటుగా వాళ్ళ ఇంట్లోకి ఉంటుంద‌ని అందులోనుండి కొంత పిండి మ‌ర‌వాళ్ళు కాజేస్తార‌న్న బ‌ల‌మైన‌ రూమరుండేది.



మా దుర (అ)భిమాన పిండిమర‌


పిండిమ‌ర‌కు చేరుకుని హై ఎల‌ర్ట్ లో వెయిటింగ్‌లో ఉంటే ఈ లోపు మ‌ర‌వాళ్ళు మేము పిల్ల‌లం గ‌నుక పెద్ద‌ల్ని, నోరుగ‌ల‌వాళ్ళ‌ని ప్ర‌యార్టీలో పెట్టేసేవారు. ఆ రోజుల్లో క‌రెంట్ ఉన్న స‌మ‌యం కంటే క‌రెంట్ క‌ట్ స‌మ‌య‌మే ఎక్కువ కావ‌డంతో వెయిటింగ్ త‌ప్పేది కాదు. ఈ వినోదాన్ని గ‌మ‌నిస్తూ కొంత సేపయ్యేప్ప‌టికి మ‌ర‌లో లేచిన పిండంతా త‌ల‌మీద ప‌డి మాకు బాల‌వృద్దుల గెట‌ప్ వ‌చ్చేసేది. కాసేప‌టికి ఆ గోల‌లోనే ఆప‌రేట‌ర్ మా చేతిలో క్యాన్ గుంజుకుని స్పెసిఫికేష‌న్స్ చెప్పేలోపే పైనున్న బ‌కెట్ లో పోసేసి పిండి వ‌చ్చే గొట్టానికి వేలాడుతున్న టార్ప‌లిన్ గుడ్డ‌ను మ‌డిచి గొట్టం మీద‌కు తోసి క‌ర్ క‌ర్ మ‌ని విష్టుమూర్తిలా రెండు చ‌క్రాలు తిప్పేవాడు. పైన బ‌కెట్‌లో వేసిన గోధుమ‌లు గ్రైండ‌ర్‌లో న‌లిగి క్రింద ఉన్న టిన్‌లో ప‌డ‌టానికి మూడు, నాలుగు నిముషాలు ప‌ట్టేది. పిండి నలిగి కింద‌కు ప‌డే టైమ్ కు మ‌డ‌చి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని క్రింద ఉన్న డ‌బ్బాలోకి సెట్ చేసేవాడు. ఈ నాలుగైదు నిముషాల్లో పైన వేసినదంతా పిండిగా వ‌స్తుందో లేదో అన్న టెన్ష‌న్‌తో మా న‌రాలు చిట్లుతుండేవి. (ఇంట్లో పెట్టిన అప్ప‌గింత‌లు భ‌యాలు సామాన్యమైనవా!) మ‌న‌పిండి ఆడుతున్నంత సేపూ ఏ చ‌క్రం తిప్పినా ఎటువెళ్ళినా మ‌న పిండి పోతోంద‌న్న అనుమానంతో మాకు మ‌న‌శ్శాంతి ఉండేదికాదు. కాసేప‌టికి డ‌బ్బాలో ప‌డ్డ‌పిండిని మ‌న క్యాన్‌లో వొంపి పొమ్మ‌నేవాడు. మ‌న క‌ళ్ళ‌న్నీ వింబుల్డ‌న్ ఫైన‌ల్ మ్యాచ్‌లో బాలు వైపే తిరుగుతున్న‌ట్లు ఆప‌రేట‌ర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి.


ఈ అడ్వెంచ‌ర్ ముగించుకుని త‌ల, వొళ్ళు దులుపుకుని క్యాన్ భుజానికో, సైకిల్‌కో త‌గిలించుకుని మ‌న‌కు ఇవ్వ‌బోయే పావాలాకు బ‌డ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ ఇల్లు చేరేవాళ్ళం. ఇంటికి రాగానే క్యాన్ లో వ‌చ్చిన పిండిని తూనిక‌లు కొల‌త‌ల శాఖ‌ల వ‌లె హోమ్ శాఖ‌వారు కొలిచేవారు. ఇహ‌మొద‌లు ”ఎటు దిక్కులు చూశావ్‌! ఆ చ‌చ్చినోడు మోసం చేసి పిండి కాజేశాడు. మేము ఎన్ని చెప్పిపంపితే ఏం ప్ర‌యోజ‌నం, అర‌కేజి త‌క్కువొచ్చింది. మెత్త‌గా ప‌ట్ట‌మంటే బ‌ర‌గ్గా ప‌ట్టాడు. నీకు ఇన్నేళ్ళొచ్చాయి. ఒక్క ప‌నీ వివ‌రంగా చేసుకురాలేవు” అంటూ కేంద్ర్రప్ర‌భుత్వం జి.ఎస్‌.టీ కాంపెన్సేష‌న్ ఎగొట్టిన‌ట్లో, త‌గ్గించిన‌ట్లో వారి ద‌యాదాక్షిణ్యాల‌తో కొంత‌ కోత విధించి ప‌దిపైస‌లే ఇవ్వ‌డ‌మో మ‌రీమూడ్ బాగాలేక పోతే మొత్తానికే మొండి చెయ్యి చూపేవారు. ఇలాంటి చేదు అనుభ‌వ‌మైన త‌రువాత మ‌ళ్ళీ మ‌ర‌కు పోకూడ‌దు అనుకునే వాడిని కాని ప్ర‌తీసారీ కొత్త రాయితీల‌తో న‌మ్మ‌బ‌లికి పంపేవారు. క్లైమాక్స్ మాత్రం ఒక్క‌టే, ‘పిండి త‌క్కువ, మోసం జ‌రిగిపోయింది. మీ వ‌ల్ల ఏమీ కాదు’.



Jhoot Bole Kauwa Kaate మై మ‌ర‌కే చ‌లే జాయేంగే


పిండిమ‌ర విధులు ఎల‌క్ష‌న్‌ డ్యూటీల్లా ఏ మిన‌హాయింపులు లేనివే. నేను ఇంట‌ర్ చ‌దివేట‌ప్పుడు సెల‌వ‌ల‌కు మా ప్ర‌సాద‌న్న‌య్య గుడివాడ వ‌చ్చాడు. ఆ రోజుల్లో బాబీ సినిమా విడుద‌లై ఒక వూపు వూపేస్తోంది. కాలేజి నుండి ఇల్లు చేరుకునేందుకు సందు తిర‌గ్గానే ప్ర‌సాద‌న్న‌య్య రెండు చేతుల్లో రెండు క్యాన్లతో ఎదుర‌య్యాడు. ‘అన్న‌య్యా ఎక్క‌డికి?’ అని అడ‌గ్గానే నిన్న‌నే మేము చూసొచ్చిన బాబీ సినిమాలో ‘మై మ‌ర‌కే చ‌లే జాయేంగే` పాటెత్తుకుని ‘పిండిమ‌ర‌కే చ‌లేజాయేంగే’ అని హుషారుగా ప‌రుగెత్తుకున్నాడు. భ‌విష్య‌త్ in front crocodiles festival అని తెలియ‌క క‌దా అన్న‌య్య ఇంత ఎగిరెగిరి ప‌డుతున్నాడు అనుకున్నా. నేను ఊహించినంతగా కాక‌పోయినా మ‌ర నుండి తిరిగొచ్చిన త‌రువాత హోమియో లో పొటెన్సీ డోసు ప‌డ‌నే ప‌డింది. బావ కొడుకని సంభావింప‌క మా అన్న‌య్య‌ను త‌గురీతిగానే అమ్మ స‌త్క‌రించింది.


ఆ రోజుల్లో పిండిమ‌ర స్వానుభ‌వం అయిన సాటి కామ్రేడ్స్ అంద‌రికీ ఒక్క విష‌యం అర్థ‌మై ఉంటుంది. యూనివ‌ర్సిటీ వీ.సీ.గా ప‌నిచేసి విద్యార్థుల‌తో తిట్టించుకోకుండా ఉండొచ్చేమో, ఎమ్మేల్యేగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రితో మంచి అనిపించుకోవ‌చ్చేమో కానీ పిండిమ‌ర‌కెళ్ళొచ్చి మంచి ప‌నిమంతుడ‌నిపించుకోవ‌డం మాత్రం దుర్ల‌భం.


ఎక్క‌డో మ‌హాక‌వులు డా.ఎన్‌.గోపి వంటివారు త‌ప్ప మాన‌వమాత్రులు పిండిమ‌ర‌ల పై మ‌రులుగొన‌లేరు. వారు వ‌డ్ల గిర్ని పై రాసిన అద్భుత‌మైన క‌విత‌లోని కొన్ని వాక్యాల‌ తో ముగిస్తా.


”యాభైయ్యేండ్ల కింద‌టి ముచ్చ‌ట‌


ఆ ప‌ట్టాచప్పుడు


పేద‌వారి బ‌తుకు ల‌య‌ను ధ్వ‌నించేది


అతుకుల వ‌ల్ల ఏర్ప‌డిన శ‌బ్దాల‌వి


అతుకు ఒక‌టైతే టిక్‌టిక్‌


అనేక‌మైతే


ట‌క్ టిక్ ట‌క్ టిక్ ట‌క్ టిక్ ……..


వ‌డ్ల గిర్ని ఫోటో తీస్తే


దాని ప‌క్క‌న‌


ఓ పేద‌కార్మికురాలి అవ‌తారంలో


మా అమ్మ‌మ్మ క‌నిపిస్తుంది


వ‌డ్ల‌ను చేట‌ల‌తో


ఇనుప‌తొట్టిలో పోసే కూలిప‌ని ఆమెది


రెండు బ‌స్తాల ఒక్క రైతులు


ఓ పిడికెడు బియ్యం


ఆమె గంప‌లో పోసి పొయ్యేవారు


మా అమ్మ‌మ్మ కూడ బెట్టిన‌


ఆనాటి గింజ‌లే


ఇవాళ్టి నా క‌వితాక్ష‌రాలు ….


ఇప్ప‌టికీ


దారిలో ఎక్క‌డ‌న్న‌


వ‌డ్ల‌గిర్ని క‌నిపిస్తే


కారును స్లో చేస్తాను


మా అమ్మ‌మ్మ క‌న‌ప‌డుందేమో అని”


(ఆప్తులు ఆచార్య‌గోపి గారికి కృత‌జ్ఞ‌త‌ల‌తో …)

Tuesday, September 7, 2021

 కరణీకము - 6 


అక్కన్న మాదన్న సోదరులు 


                   వంశపారంపర్య కరణీకాలు రద్దు కాకముందు గ్రామ కరణాలుగా  పనిచేసిన వారిలో నియోగులలోని  మరొక శాఖ గోల్కొండ వ్యాపారులు అనే పేరుతో ప్రసిద్ధులు. ఈ భాగంలో మనం ఆ శాఖకు చెందిన అక్కన్న మాదన్నల  వివరాలు తెలుసుకుందాం. సాధారణ కరణములుగానే జీవనం ప్రారంభించినప్పటికీ,  గోల్కొండ కుతుబ్ షాహి ప్రభువులు పాలించిన కాలంలో ఉన్నత రాజోద్యోగులుగా ఒక వెలుగు వెలిగిన అక్కన్న, మాదన్న సోదరుల   అజరామరమైన చరిత్రకు నేటికీ నిలిచివున్న వారు కట్టించిన  నిర్మాణాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ పాత నగరంతో కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారికి శాలిబండ ( షా ఆలీ బండ) సమీపంలోని హరి బౌలి బంగారు మైసమ్మ (మహంకాళి)  ఆలయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. జంటనగరాలలో ఏటా  ఆషాఢమాసంలో వైభవంగా జరిగే బోనాల పండుగ సందర్భంగా సుప్రసిద్ధమైన  ‘ఘటం ఊరేగింపు’  ప్రారంభం అయ్యేది అక్కడినుంచే. డెబ్భై ఏళ్ల క్రితం వరకూ ఒక పెద్ద మట్టిదిబ్బ కింద పూడిపోయి ఉన్న ఈ ఆలయాన్ని పరిశోధకులు అప్పుడే  కనుగొని వెలుగులోకి తెచ్చారు. క్రీ.శ. 17 వ శతాబ్దిలో దీనిని నిర్మించిన ఆ సోదరుల పేరుమీదుగానే  నేటికీ దీనిని అక్కన్న మాదన్నల  ఆలయం అనే స్థానికులు వ్యవహరిస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా జరిగే ఘటం ఊరేగింపును   అక్కన్న మాదన్నల ఆలయంలోని ఘటాన్ని  అగ్రభాగంలో ఒక ఏనుగు అంబారీ మీద నిలిపి, అటూ ఇటూ గుర్రాలమీద పూన్చిన అక్కన్న మాదన్నల బొమ్మలు వెంటరాగా  వైభవోపేతంగా నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా  సాగే ఘటం ఊరేగింపు నయా పుల్ వద్ద మూసీ నది నీటిలో ఘటాన్ని నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. 1998 లో కొందరు ముష్కరులు విచక్షణారహితంగా చేసిన దాడిలో ఈ  హరిబౌలి  ఆలయంలో కొంతభాగం దెబ్బతిన్నది. ఒకప్పుడు ఈ  అక్కన్న మాదన్న సోదరులకు విజయవాడ ప్రాంతంలోనూ మంచి ప్రఖ్యాతి  ఉండేది. విజయవాడ ప్రాంతంలో ఇంద్రకీలాద్రి, మొగల్రాజు పురం  తదితర పర్వతాలలో అతి ప్రాచీనకాలంలో తొలిచిన గుహాలయాలు, సమీపంలోని గుంటూరు జిల్లా  ఉండవల్లి గుహాలయాలు సుప్రసిద్దాలు. కనకదుర్గ ఆలయం ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంలో క్రీ. పూ. రెండవ శతాబ్దిలో తొలిచిన ఒక గుహాలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలున్నాయి. ఆ పర్వతపాదంలోని   కొన్ని గుహలు క్రీ. శ. 6, 7 శతాబ్దాలలో తొలిచినట్టివి. అలాంటి ఒక గుహలో 

క్రీ. శ. 17 వ శతాబ్దంలో అక్కన్న మాదన్న సోదరులు నిర్మించినదిగా ప్రసిద్ధమైన ఒక ఆలయం ఉంది. కొందరు ఆ గుహ విష్ణుకుండిన వంశ పాలకులు  తొలిపించగా,  ఆలయం మాత్రం  అక్కన్న మాదన్నలచేత తరువాత కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. కొందరేమో ఆ సోదరులు ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయం సందర్శించిన సందర్భాలలో అక్కడే అధికారులతో  కచేరీ నిర్వహిస్తూ ఉండే  కారణంగా అక్కడి గుహలు అన్నిటినీ అక్కన్న మాదన్న గుహలు అంటున్నారనీ,  వాస్తవానికి అవన్నీ విష్ణుకుండినుల నిర్మాణాలేననీ  భావిస్తున్నారు. 


                     ఇక ఆ సంగతి అలా ఉంచి, అసలీ అక్కన్న మాదన్నలు ఎవరో చూద్దాం. కరణీకం వృత్తిగా కలిగిన కొందరు నియోగులు ‘ ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్ర’మన్నట్లు  రాజోద్యోగాలలో - మంత్రులు, సేనానులు, దుర్గాధ్యక్షులు, దుబాసీలు గా - కూడా నియమించబడటం మనకి తెలుసు. మహామంత్రి తిమ్మరుసు, మరాఠా సేనాని హరి పంత్, ఝాన్సీ లక్ష్మీబాయి తండ్రి మోరోపంత్ తాంబే మొదలైన వారిని గురించి మనం ముందే తెలుసుకున్నాం. మహారాష్ట్ర మూలాలు కలిగిన నియోగి బ్రాహ్మణులలో కొందరిని గోల్కొండ వ్యాపారులు అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవలసినది పింగళి మాదన్న, అక్కన్న సోదరుల గురించే. వీరిది భారద్వాజ గోత్రం. ఆ కారణంగా గౌతమ గోత్రుడు అయినట్టి  ‘ కళా పూర్ణోదయము’ 


కావ్యకర్త పింగళి సూరనకూ వీరికీ ఎలాంటి సంబంధమూ లేదు. గోల్కొండ వ్యాపారులు ఋగ్వేదులు. ఐదు బహమనీ రాజ్యాలలో ఒకటైన  గోల్కొండను కుతుబ్ షాహీ వంశస్థులు పాలించారనే విషయం అందరికీ తెలిసినదే. గోల్కొండ నవాబులలో తానీషా (లేక తానాషా) అనే మరోపేరు కలిగిన అబుల్ హసన్ కుతుబ్ షా ( క్రీ. శ. 1658 - 1687 ) చిట్టచివరి వాడు. తానాషా అంటే మంచిరాజు అని అర్థం. ఆ తానీషా కొలువులో మాదన్న ముఖ్యమంత్రిగానూ, అక్కన్న సేనాధిపతిగానూ పనిచేశారు. తానీషా ఇస్లాం మతంలోని షియా తెగకు సంబంధించినవాడు. అందుకే ఆయనలో పరమత సహనం ఎక్కువ. హిందూ ముస్లింలను సమభావంతో చూస్తూ హిందువులకు కూడా ముస్లిం లతో పాటు ఉన్నత పదవులిచ్చి గౌరవించాడు. హిందూ ఆలయాలకు కూడా భూరి విరాళాలు ఇచ్చేవాడు. చిన్న ఉద్యోగులుగా తన కొలువులో చేరిన అక్కన్న మాదన్నలకు వారి సేవలకు మెచ్చి తానీషా పెద్ద పదవులిచ్చి గౌరవించాడు. వారు కూడా సమయానుకూలంగా వ్యవహరిస్తూ, నవాబు మనసు గెలుచుకోవటమే కాక, అవసరమైన సందర్భాలలో రాజనీతితోపాటు కౌటిల్యాన్నీప్రదర్శిస్తూ ఒక్కొక్క మెట్టూ క్రమంగా ఎగబాకుతూ అంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 


            అందరూ అనుకునే విధంగా అక్కన్న కు  మాదన్న  స్వంత తమ్ముడు కాదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన పింగళి మాదన్నకు, గోల్కొండ రాజ్యపు  సేనాధిపతిగా  పనిచేసిన అక్కన్న తన తల్లి తరఫు దూరపు బంధువు. వారిద్దరూ  వరుసకు అక్కచెల్లెళ్ళ పిల్లలట. అయినా వారిద్దరూ స్వంత అన్నదమ్ములలాగే కలిసి మెలిసి ఉండేవారు. వయస్సులో తనకన్నా పెద్దవాడు కనుక  అక్కన్నగారిని మాదన్నగారు  ‘ అన్నగారూ ! ‘ అని సంబోధించేవారట. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరూ కలిసే తీసుకునేవారట. ప్రజలు కూడా వారిరువురినీ వేరువేరని  కాక, ఒక్కటిగానే భావించి ‘ అక్కన్న మాదన్నలు’ అంటూ వ్యవహరించేవారట. చెన్న పట్టణం ( మదరాసు) లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా  అవసరమైన సందర్భాలలో ‘అక్కన్న మాదన్న గార్లకు’ అంటూ ఇరువురినీ ఒకటిగానే సంబోధిస్తూ లేఖలు రాయడం చూస్తే వారిరువురూ ఎంత ఏకగ్రీవంగా పనిచేసేవారో గ్రహించగలం. అప్పట్లో కుంఫిణీ (కంపెనీ) వారి  చెన్నపట్టణం ఫాక్టరీ, ఓడ రేవు గోల్కొండ నవాబు రాజ్యంలో  అంతర్భాగంగానే ఉండేవి. నవాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే ఇంగ్లిష్ వారు అక్కడ సరకుల ఎగుమతి దిగుమతుల వంటి నౌకా వాణిజ్య  కార్యకలాపాలు నిర్వహించుకునేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎప్పటికప్పుడు తమ కార్యకలాపాలను అక్కన్న మాదన్నలకు లేఖలద్వారా నివేదించేవారు. ఇందుకోసం వారు కంపెనీ ప్రతినిధిగా గోలకొండలో ఈ సోదరులకు అనుకూలుడైన వీరరాఘవులు అనే తెలుగు కరణాన్ని గుమాస్తాగా నియమించి, అతని ద్వారా అక్కన్న మాదన్నలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వారితో సత్సంబంధాలు నెరపుతూ ఉండేవారట. వీరరాఘవులు అటు కంపెనీ వారికి, ఇటు అక్కన్న మాదన్నలకూ అప్పట్లో రాసిన లేఖల కారణంగా నాటి చారిత్రక విశేషాలతో పాటు, అక్కన్న మాదన్నల గురించిన పలు విశేషాలు మనకు తెలుస్తున్నాయి. 


                     గోల్కొండ నవాబు తానీషాకూ,  మరాఠా సార్వభౌముడైన శివాజీకీ  ఉమ్మడి శత్రువైన ఢిల్లీ మొఘల్ పాదుషా ఔరంగజేబ్ నుంచి  గోల్కొండ రాజ్యానికి ప్రమాదం పొంచివున్నదని ముందుగానే గ్రహించిన గోల్కొండ ముఖ్యమంత్రి మాదన్న పంతులు ప్రత్యేకమైన చొరవ ప్రదర్శించి శివాజీకి, తానీషాకూ  మైత్రి కుదిర్చాడు. క్రీ. శ. 1674 లో పట్టాభిషిక్తుడు అయ్యాక  శివాజీ కర్ణాటక, ద్రావిడ దేశాలపై దండయాత్రకు వెళ్ళే సమయంలో ఆయన్ని  మాదన్న గోల్కొండ కోటకు తన అతిథిగా ఆహ్వానించాడు. అప్పుడు గోల్కొండ కోటలో 


శివాజీకి మాదన్న, మాదన్నకు శివాజీ విందులిచ్చుకున్నారని ‘ శివ దిగ్విజయము’ అనే గ్రంథం పేర్కొంది. క్రీ. శ. 1680 లో శివాజీ మరణించిన తరువాత ఆయన కుమారుడు శంభాజీకి, 

తానీషాకూ మైత్రి కుదర్చటంలోనూ, వారిరువురినీ ఔరంగజేబ్ పైకి దాడికి ప్రేరేపించటంలోనూ మంత్రి మాదన్న నిర్వర్తించిన పాత్ర ప్రశంసాపాత్రం. ‘మన శత్రువుకు శత్రువు ఎల్లప్పుడూ  

మనకు మిత్రుడే’ అనే ప్రాథమిక సూత్రం మీదనే ఈ విషయంలో మాదన్న మంత్రి రాజనీతి ఆధారపడింది.  తనకు వ్యతిరేకంగా శంభాజీ గోల్కొండ నవాబుతో మైత్రి కుదుర్చుకోవటం రుచించని ఔరంగజేబ్ 1685 జూలైలో తన కుమారుడు ముఅజ్జం నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని గోల్కొండ రాజ్యం మీదికి దండయాత్రకు పంపాడు. మొఘల్ సైన్యం గోల్కొండ కోటను పట్టుకునే ప్రయత్నం చెయ్యకుండా ముందుగా హైదరాబాద్ నగరాన్ని దోచుకున్నారు. ఆ దోపిడీలో లభించిన సంపదతో మరింతగా సైన్యాన్ని, ఆయుధాలనూ సమకూర్చుకుని గోల్కొండ కోటపై దాడికి సిద్ధం కాసాగాడు ముఅజ్జం. మాదన్న మంత్రి ముందుచూపుతో మేల్కొనటం వల్ల  ముఅజ్జంతో తానీషా సంధిచేసుకున్న కారణంగా గోల్కొండ రాజ్యానికి అప్పటికి పెను ప్రమాదం తప్పింది. తాము యుద్ధానికి సిద్ధంగా లేని సమయంలో ఊహించని రీతిలో ముంచుకు వచ్చిన మొఘల్ దండయాత్ర ప్రమాదం ఆ సంధి షరతుల ప్రకారం గోల్కొండ నవాబు సాధారణ కప్పం కాక అదనంగా కోటి ఇరవై లక్షల రూపాయలు చెల్లించి మొఘల్ సార్వభౌమత్వాన్ని గుర్తించటంతో తాత్కాలికంగా నివారించబడింది. కానీ సంధి షరతుల ప్రకారం చెల్లించిన కప్పం ఔరంగజేబ్ కి ఎంతమాత్రం తృప్తి కలిగించలేదు. గోల్కొండ రాజ్యపు సంపద గురించి - ముఖ్యంగా అక్కడి వజ్రవైడూర్యాలను  గురించి వినివున్న ఔరంగజేబ్ గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో కలిపేసుకోవాలని ఉబలాటపడ్డాడు. అపారమైన సంపద దోచుకోవాలంటే గోల్కొండనే కొల్లగొట్టాలని భావించాడు ఔరంగజేబు. ‘కొడితే గోల్కొండనే కొట్టాలి అనే నానుడి’  అప్పటికే సుప్రసిద్ధం. అందుకే  మొఘల్ సైన్యం 1687 ఫిబ్రవరిలో మరొకసారి గోల్కొండపై పెద్దఎత్తున దాడి చేసింది. సంధి చేసుకున్న తరువాత లభించిన ఏడాదిన్నర విరామ కాలంలో అక్కన్న మాదన్నలు గోల్కొండ కోటను పటిష్టపరిచే కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టారు. అందుకే ఆ రెండవ దాడి ఎనిమిది నెలల పాటు సాగినా కోటను పట్టుకోవటం ఔరంగజేబు వల్ల కాలేదు. మాదన్న యుక్తులు, ఎత్తుగడలు, అక్కన్న యుద్ధ వ్యూహనైపుణ్యం, అబ్దుల్ రజాక్ లారీ వంటి స్వామిభక్తిపరులైన వీర సైనికుల శౌర్య ప్రతాపాల కారణంగా కోట శత్రు సైన్యానికి అంతకాలం పాటు వశం కాలేదు. దానికితోడు దండయాత్ర కాలంలో మొఘల్ సైన్యాలు  తీవ్ర ఆహార  కొరతను ఎదుర్కొన్నాయి. మరోపక్క కుంభవృష్టిగా కురిసిన వానలు మొఘల్ సైన్యాన్ని చీకాకు పెట్టాయి. వానలు తగ్గుముఖం పట్టాక ఔరంగజేబు తిరిగి దాడులు ముమ్మరం చేశాడు. ఈసారి కుట్రలకూ, మోసానికీ తెగబడింది మొఘల్ సైన్యం. అగ్నికి ఆజ్యం పోసినట్లు గోల్కొండ కోటలోని కొందరు సైనికాధికారులు శత్రు పక్షానికి సహకరించారు. ఆ విద్రోహకర పరిస్థితి ఏర్పడటానికి దారితీసిన కారణాలు తెలుసుకోవాలంటే గత చరిత్ర కొంత తెలుసుకోవాలి. 


                           తన సేవలతో, పరాక్రమంతో అంతకుముందు సాధారణ ‘ఫౌజ్ దారు’  స్థాయి  చిన్న సైనికోద్యోగిగా పనిచేస్తున్న అక్కన్న  క్రమంగా తానీషాకు దగ్గరయ్యాడు. తానీషాకు అక్కన్న శక్తిసామర్థ్యాలు, నిజాయతీపై నమ్మకం కుదిరింది. అందుకే ఆయన గతంలో తన దగ్గర సేనానిగా పనిచేస్తుండిన మహమ్మద్ ఇబ్రాహీం అనేవాడిని క్రీ.శ. 1682 లో తొలగించి, ఆ స్థానంలో  అక్కన్నను గోల్కొండ రాజ్యానికి  ‘షాహ లష్కర్ ‘ (సేనాధిపతి) గా నియమించాడు. ఇక అక్కడినుంచి సైన్యంలోని ముస్లిం వర్గాలలో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. అదనుచూసుకుని  సైన్యంలోని సున్నీ వర్గీయులు ( దాడి చేసిన ఔరంగజేబ్ కూడా సున్నీ 


అయిన కారణంగా ) శత్రు పక్షంలో చేరిపోయారు. ఒక ముస్లిం ప్రభువు దగ్గర హిందూ ఉద్యోగులైన అక్కన్న మాదన్నలు ప్రాపకం సంపాదించటమే కాక తమ గోల్కొండ ముస్లిం రాజ్య నిర్వహణలో వారే కీలకమై  చక్రం తిప్పుతూ ఉండటం చూసి  మతోన్మాదులు  సహించలేకపోయారు. అందుకే అక్కన్న మాదన్నల పట్ల వారు అకారణ శత్రుత్వాన్ని పెంచుకున్నారు.  వారు అక్కన్న మాదన్నలను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. అక్కన్న మీద పగబూనిన ఒకప్పటి గోల్కొండ సేనాని మహమ్మద్ ఇబ్రాహీం  వర్గీయులు చేసిన కుట్ర కారణంగానే క్రీ. శ. 1685 లో గోల్కొండపై జరిపిన మొదటి దాడిలో మొఘలులకు హైదరాబాద్ నగరంలో వారి విచ్చలవిడి దోపిడీకి ఎలాంటి  ప్రతిఘటన లేకుండా పోయింది. తిరుగుబాటుదారులైన  సైనిక సర్దారులు తమ నవాబు  హిందువులను ముఖ్యమంత్రిగా, సేనాధిపతిగా నియమించుకుని హిందూ అనుకూల పాలన సాగిస్తున్నాడనీ, హిందూ దేవాలయాలకు భూరి విరాళాలు ఇస్తున్నాడనీ  తానీషాకి వ్యతిరేకంగా  ఔరంగజేబ్ కి నూరిపోశారు. మతసహనం పొడ గిట్టని ఔరంగజేబు ఆ కారణంగా తానీషా మీద పగ పెంచుకుని గోల్కొండ కోట మీద దాడికి మొదటి పర్యాయం తన కుమారుడు ముఅజ్జంను, ఖాన్ జహాన్ అనే సేనానిని అశేషమైన సైన్యాన్ని ఇచ్చి పంపాడు. మహమ్మదీయ సర్దారులకు  అక్కన్న మాదన్నలపై ఏర్పడిన శత్రుభావం మరింతగా పెరిగి, అగ్నికి ఆజ్యంపోసినట్లైన ఒక ఘటనను  ఇక్కడ పేర్కొనాలి. మాదన్న మంత్రి రోజూ స్నానం చేస్తూ సంధ్యావందనం చేసుకునే ఒక వ్యక్తిగత కొలనులో దిగి ఒకరోజు  మహమ్మద్ ఇబ్రాహీం మాదన్న చూస్తూ ఉండగానే ఆయన్ని కవ్వించే ఉద్దేశంతో కావాలనే స్నానం చేశాడట. దీనిని తనకు జరిగిన అవమానంగా భావించిన మాదన్న వెంటనే ఇబ్రాహీంని కొరడాలతో కొట్టించాడట. కోటలో ఇదొక సంచలన వార్తగా మారి, ముస్లింలు - ప్రత్యేకించి ముస్లిం మహిళలు - అందరికీ అక్కన్న మాదన్నలపై పగ పెరిగిపోయింది. ముస్లిం సర్దారులు ఈ విషయాన్ని ఔరంగజేబ్ కుమారుడు ముఅజ్జం దృష్టికి తెచ్చి ఎలాగైనా సరే వారిరువురినీ ఖతం చేస్తేనేగానీ కోటను జయించటం సాధ్యపడదని ఆయనకు చెవినిల్లు కట్టుకుని నూరిపోశారు. వారంతా అక్కన్న మాదన్నల అంతానికి ఒక పక్కా ప్రణాళికను రచించారు. క్రీ. శ. 1687  అక్టోబర్ మాసంలో ఒకరోజు అక్కన్న మాదన్నలు కొలువునుంచి ఇంటికి వెళుతూ ఉండగా ముస్లిం స్త్రీలు వారిరువురినీ మోసపూరితంగా సంహరించారు. వారి ఇరువురి తలలూ ఔరంగజేబ్ కుమారుడు ముఅజ్జం కి పంపారు. ఆ రోజే గోల్కొండ రాజ్యంలో బ్రాహ్మణులను అసంఖ్యాకంగా చంపేశారు. అక్కన్న మాదన్నలను అడ్డు తొలగించటంతో ఇక నవాబు తానీషాకు,  గోల్కొండ కోటకు కుట్రదారులనుండి  రక్షణ కరవైంది. తానీషా కొలువులోని అబ్దుల్లా పెయిన్ అనే ఆఫ్ఘన్ దేశీయుడైన ఉన్నత సైనికోద్యోగిని పెద్ద మొత్తంలో లంచం ఇవ్వజూపి లోబరచుకున్నారు. లంచపు  సొమ్ముకు ఆశపడి పెయిన్ అర్దరాత్రి వేళ కోట తూర్పు ద్వారం తెరిపించి, మొఘల్ సైన్యానికి లోనికి మార్గం చూపాడు.మొఘలులు తానీషాని మోసపూరితంగా ఖైదుచేసి దౌలతాబాద్ ( దేవగిరి) లోని చెరసాలకు తరలించారు.అక్కడ అప్పటికే బీజాపూర్ సుల్తాన్ సికిందర్ ఆదిల్ షా బందీగా ఉన్నాడు. ఏడు కోట్ల రూపాయల భారీ మొత్తాన్నీ, కోట్లాది రూపాయల విలువచేసే వజ్ర వైడూర్యాలనూ, బంగారు, వెండి నగలనూ మొఘలులు గోల్కొండ కోట నుంచి దోచుకుపోయారు. చెరసాలలోని తానీషా కి యాభై వేల రూపాయల వార్షిక పింఛను మంజూరుచేసిన మొఘలులు గోల్కొండ రాజ్యాన్ని తమ సామ్రాజ్యంలో విలీనం చేసేసుకున్నారు. 


                        


             ఇక అక్కన్న మాదన్నలపై గోల్కొండ రాజ్యంలోని ముస్లింలలో  తీవ్రమైన  వ్యతిరేకత రావటానికి ఒక ముస్లిం రాజ్యంలో ఆ హిందూ సోదరులిరువురూ తామే సర్వస్వమై రాజ్య నిర్వహణలో చక్రం తిప్పటం  ఒక్కటే  కాక  పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటో కూడా ఒకసారి పరిశీలిద్దాం. మహమ్మద్ ఇబ్రాహీం అనే అతనిని సేనాని పదవి నుంచి 

తొలగించి, తానీషా క్రీ. శ. 1682 లో ఒక సామాన్య సైనికోద్యోగి అయిన అక్కన్నను ఆ పదవిలో నియమించటాన్ని రాజ్యంలోని సాధారణ ముస్లింలు  - ప్రత్యేకించి సున్నీ శాఖ అనుయాయులు-  సహించలేకపోయారు. షియా శాఖీయుడైన తానీషా హిందూ సోదరులైన అక్కన్న మాదన్నలను 

పూర్తిగా నమ్మి, వారిపైనే మొత్తం రాజ్యభారాన్ని మోపడం రుచించని సున్నీ శాఖీయులు ఔరంగజేబ్ దండయాత్రల సందర్భంగా అక్కన్న, మాదన్నలకు వ్యతిరేకంగా  ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టి, బహిరంగ  తిరుగుబాటుకు సిద్ధపడ్డారు. ఇక తన వ్యక్తిగత కొలనులో స్నానం చేసిన చిన్నపాటి  నేరానికి మహమ్మద్ ఇబ్రాహీంను  మాదన్న (అది తనకు జరిగిన అవమానంగా భావించి)  తీవ్రంగా శిక్షించడాన్ని రాజ్యంలోని సామాన్య ముస్లింలు - ప్రత్యేకించి ముస్లిం మహిళలు - సహించలేకపోయారు. ఒక ముస్లిం రాజ్యంలో ముస్లింలే రెండవ తరగతి పౌరులుగా జీవించవలసి రావటం అంటే అది  తానీషా ఇచ్చిన అలుసు చూసుకుని అక్కన్న మాదన్నలు కండకావరంతో రెచ్చిపోవటంగా వారు భావించారు. ఈ హిందూ సోదరుల ప్రోత్సాహంతో తానీషా హిందూ ఆలయాలకు భూరి ఆస్తులు, విరాళాలు ఇవ్వటం, వారు  తానీషా అండ చూసుకుని హరి బౌలిలో  బంగారు మైసమ్మ  ఆలయం నిర్మించటమే కాక, గోల్కొండ కోటలోపలే జగదంబికా మహంకాళి  అమ్మవారి ఆలయం నిర్మించి, ఏటేటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉండటం సామాన్య ముస్లిం కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఇదికాక ఈ సోదరులు గోల్కొండ రాజ్యంలో తమ పర్యటనల సందర్భంగా హిందూ ఆలయాలకు తరచుగా వెళ్లి  భూరి విరాళాలు ఇస్తూ ఉండటం కూడా ముస్లిం మత పెద్దలకు కంటగింపు అయింది.   సున్నీ మతపెద్దలు ఈ విషయాన్ని దండయాత్రకు వచ్చిన ఔరంగజేబ్, అతని కుమారుడు ముఅజ్జం లకు నివేదించగా గోల్కొండ రాజ్యంలో  అక్కన్న, మాదన్నల ప్రాబల్యం ఎలాగైనా తగ్గించి తీరాలని, హిందూ మత విజృంభణకు ఎలాగైనా అడ్డుకట్ట వేసి తీరాలని, ఇందుకోసం ముందుగా ఈ సోదరుల అడ్డు తొలగించుకోవాలని ఔరంగజేబ్ భావించాడు. మతరీత్యా తానీషా షియా ముస్లిం కావటం, ఆయన పరమత సహనం పాటించటం, పరమతస్థులైన అక్కన్న, మాదన్నలకు పెద్ద పదవులిచ్చి గౌరవించటం, మాదన్న ముందుగా శివాజీకి, తానీషాకి, ఆ తరువాత శివాజీ కుమారుడు శంభాజీకీ, తానీషాకీ మధ్య మైత్రి కుదర్చటం ఔరంగజేబ్ కి ఆగ్రహం కలిగించింది. అందుకే  క్రీ. శ. 1685 లో జరిపిన  మొదటి దండయాత్రలో భారీగా కప్పం తీసుకుని వెనక్కి తగ్గినా, తానీషా మీద, గోల్కొండ షియా రాజ్యం మీద, ప్రత్యేకించి అక్కన్న, మాదన్న సోదరుల మీద పగతో రగిలిపోయిన ఔరంగజేబ్ తిరిగి క్రీ.శ. 1687 ఫిబ్రవరిలో పెద్దపెట్టున గోల్కొండపై విరుచుకుపడ్డాడు. ఇదే అదనుగా  అక్కన్న, మాదన్నల మీద, తానీషా మీద గతంలో పగబట్టిన  గోల్కొండ రాజ్య మాజీ సేనాని మహమ్మద్ ఇబ్రాహీం మొఘలులతో కలిసిపోయి, మొఘల్ సైన్యం హైదరాబాద్ నగరాన్ని దోచుకోవటంలో వారికి సహకరించటం గోల్కొండ రాజ్యానికి పెనుశాపంగా మారింది. అక్కన్న మాదన్నలు నిత్యం చేసే ధర్మకార్యాల కారణంగా గోల్కొండ రాజ్యంలోని హిందువులలోని కొందరు - ప్రత్యేకించి బ్రాహ్మణులు, శైవులు  వారిని అభిమానించినా మిగిలిన హిందువులు ఈ సోదరుల పట్ల సానుభూతితో  ఏమీ లేరు.  సాధారణ ముస్లింలు అక్కన్న మాదన్నలను  ద్వేషించటానికి మరికొన్ని కారణాలు తోడయ్యాయి. 


                      


                  అక్కన్న మాదన్నలు హిందూ దేవాలయాలకు ఉదారంగా విరాళాలు ఇవ్వటం, సత్రములు నిర్మించి,  బ్రాహ్మణులకు ఉచిత భోజన సదుపాయాలను ఏర్పాటు చేయటం వంటి  ధర్మకార్యాలు చేసి హిందువులు - ముఖ్యంగా బ్రాహ్మణుల దృష్టిలో ధర్మాత్ములని పేరొందారు. 

వారు ప్రతిరోజూ ప్రాతః కాలంలో శివపూజలు చేస్తూ, ఆ సమయమున తమను సందర్శించిన కవి పండితులను - ప్రత్యేకించి శివకవుల పాండిత్యాన్ని పరిశీలించి వారికి తగిన బహుమతులిచ్చి 

సత్కరించి పంపేవారు. ఈ సోదరులను వక్తృ శ్రోతలుగా చేసి త్రిపురాంతకం నుంచి వచ్చిన తెనాలి రామలింగము అనే శైవకవి తాను రచించిన ‘ ధీరజన మనో విరాజితము’ అనే ఏకాశ్వాస ప్రబంధాన్ని వారికి వినిపించి, వారిచే సత్కరించబడటం గురించి మనం ముందే చెప్పుకున్నాం. అక్కన్న మాదన్నలు గోల్కొండ రాజ్యంలో తమకున్న ఎదురులేని అధికారాల కారణంగా నిరంకుశులై ఆనాటి అనుకూల  పరిస్థితులను తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా మలచుకోవటం కూడా ఇక్కడ  గమనార్హం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్టణం, చెన్నపట్టణం లలో నాడు నిర్వహిస్తున్న నౌకా వాణిజ్య  కార్యకలాపాలు, వారి గిడ్డంగుల వ్యవహారాలను గోల్కొండ రాజ్యం తరఫున  వీరరాఘవులు  అనే ఒక తెలుగు కరణాన్ని గుమాస్తాగా నియమించి, అతని ద్వారా నియంత్రిస్తూ తమ పదవులను వ్యక్తిగత ప్రయోజనం కోసం కంపెనీ వారినుంచి వీలైనంత పెద్ద మొత్తాలలో సొమ్ము రాబట్టడానికి వినియోగించటం కూడా గమనార్హం. కంపెనీ వారి గిడ్డంగులు, రేవులు గోల్కొండ రాజ్య అధికార పరిధిలోనివైన కారణంగా ఎంత మొత్తం ఇవ్వమని కోరినా, ఎన్ని షరతులు విధించినా గత్యంతరంలేని స్థితిలో వాటన్నిటికీ అంగీకరించి కంపెనీ వారు ఆ మొత్తాలను అక్కన్న మాదన్నలకు చెల్లించేవారు. అప్పట్లో అక్కన్నకు స్వంతంగా కొన్ని ఓడలు కూడా ఉండేవి. ఆయన నౌకా వ్యాపారం నిర్వహించేవాడు. క్రీ. శ. 1679 ఫిబ్రవరి నెలలో కంపెనీ వారు తమ వ్యాపార అవసరాల నిమిత్తం తమకు శాంతోం, ఎగ్మూర్ ప్రాంతాలు కౌలుకు ఇప్పించమని  కోరినప్పుడు, తిరిగి క్రీ. శ. 1682 జూలై నెలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం చేసుకొనటానికి అనుమతులు మంజూరు చేయమని కోరినప్పుడు గోల్కొండ రాజ్యానికి కంపెనీవారు చెల్లించాల్సిన వార్షిక  పన్నుమొత్తం నిర్ణయించటంతో పాటు   ఈ సోదరుల వ్యక్తిగత ప్రయోజనాలూ నెరవేరాయి. అక్కన్న గారి స్వంత ఓడలకు కంపెనీవారు పలు వెసులుబాట్లు కల్పించారు. అలాగే క్రీ. శ. 1682 సెప్టెంబర్ నెలలో కంపెనీవారు విశాఖపట్టణం మొదలైన ప్రదేశాలలో తమకు వర్తకం విషయంలో కొన్ని వీళ్ళు కలగజేయమని అక్కన్న, మాదన్నలకు ఒక లేఖరాసి, అనేక బహుమానాలతో సహా ఆ లేఖను వారికి పంపారు. ఆ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన అక్కన్న కి, కంపెనీ వారికి దుబాష్ ( దుబాసీ) గా వ్యవహరించిన వెంకటాద్రి అనే ఒక కరణానికి - ఈ ఇరువురికీ  ఎన్నో విలువైన బహుమతులు  కంపెనీ వారినుంచి ముట్టినట్లు లేఖాధారాలు ఉన్నాయి. క్రీ. శ. 1682 నవంబర్ నెలలో మాదన్న కుమారుడు మల్లప్ప వివాహం సందర్భంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వీసెడు బంగారపు గొలుసు తయారు చేయించి పెళ్లి కానుకగా పంపారు.( అప్పట్లో రూపాయి ఎత్తును తులము అనేవారు. తులమునే కొందరు నవటాకు అనీ, ఇంకొందరు పలము అనీ కూడా అనేవారు. ఒక తులం బంగారం సాధారణంగా బరువులో పదహారు రూపాయలకు సమానంగా భావించేవారు. అలాంటి 120 తులాలు ఒక వీసె. అంటే అప్పట్లో వీసెడు బంగారం విలువ 1,920 రూపాయలన్నమాట. అప్పట్లో వెండి రూపాయిలో ఉండే వెండి విలువ రూపాయే ఉండేది)   క్రీ. శ. 1683 జనవరి నెల ఒకటో తేదీన ఆంగ్ల నూతన సంవత్సర కానుకగా     కంపెనీ వారు 400 వరహాలు మాదన్న గారికి  పంపారు. ఆ సందర్భంగా పంపిన లేఖలో మాదన్న గారి అనుగ్రహమును కోరి ఆ కానుకలను పంపినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.( వరహా అనేది వరాహ ముద్ర కలిగిన బంగారు నాణెం. దీనినే పగోడా అనికూడా అంటారు. ఒక పగోడా మూడున్నర రూపాయలకు సమానం. అంటే మాదన్న గారికి క్రీ.శ. 1683 జనవరిలో నూతన సంవత్సర కానుకగా ముట్టిన మొత్తం 400 x 3.5 అంటే 1400 


రూపాయలు).  గోల్కొండ రాజ్య పరిధిలో  వ్యాపారం చేసుకునేందుకు కంపెనీ వారు తానీషా ప్రభుత్వానికి చెల్లించవలసిన వార్షిక  పన్ను మొత్తం  1,200 వరహాలుగా క్రీ. శ. 1682 జూలైలో  నిర్ణయించబడింది. ప్రభుత్వానికి జమ అయ్యే  మొత్తం 1,200 వరహాలు కాగా దానిలో మూడవ వంతు అంటే 400 వరహాలు మాదన్న మంత్రికి లాంఛనంగా ( లంచంగా ) ముందుగానే ముట్టిందన్నమాట. గోల్కొండ రాజ్య సేనాధిపతి అక్కన్న గారికి ఇంగ్లిష్ వ్యాపారులను అనుగ్రహించటానికి, ఇతరదేశాల వ్యాపారులను గోల్కొండ రాజ్యం నుంచి తరిమివేయటానికి ఎన్నో పుట్ల రాగి, కావలసినంత ధనం ఇస్తామని చెన్నపట్నంలోని కంపెనీవారు క్రీ.శ. 1683 ఆగస్టు 14 వ తేదీ ఒక లేఖ రాశారు. ఇంతేనా ?  వైభవోపేతంగా జరిపిన   మాదన్న కుమారుడి ఉపనయనానికి, పెళ్ళికి, మాదన్న గారి పేష్కార్ ( Secretary) కి, ఆయన బిడ్డకీ, పినతండ్రికి కూడా ఇలాగే కంపెనీ వారినుంచి తరచు భారీగానే నజరానాలు ముట్టేవి. తమ స్వంత మనుషులైన వీరరాఘవులు, వెంకటాద్రి వంటి వారిని గుమాస్తాలుగా నియమించుకుని వారి ద్వారా లోపాయకారీగా జరిపిన ఈ కరణీకంలో అక్కన్న మాదన్నలే కాదు. వారి అనుచరవర్గం భారీగా లాభపడినట్లు,దశలవారీగా ప్రతి దశలోనూ లంచం చేతిలో పడకుండా ఎక్కడా ఏ పనీ కూడా  ఈ సోదరుల దగ్గర సానుకూలపడేది కాదని ఈ సోదరులు కంపెనీవారితో సాగించిన నాటి ఉత్తర ప్రత్యుత్తరాలు తిరుగులేని విధంగా చాటుతున్నాయి. కంపెనీ వారు ఆశిస్తున్న ఏ పని జరగాలన్నా వారి నుండి తమకు దక్కాల్సిన లాంఛనాలు, కానుకలు వగైరాలను ముందుగానే తమ మనుషుల ద్వారా  ఈ సోదరులు కంపెనీవారికి తెలిపేవారు. గోల్కొండ రాజ్యంలో ఈ అన్నదమ్ములకు దొరికిన బంగారు అవకాశం అలాంటిది. తానీషా అభిమానాన్ని పొందిన ఈ సోదరులమీద రాజ్యంలో చాపకింద నీరులా  ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వారిని  ఎవ్వరూ ఏమీ చేయలేని స్థితే ఉండింది.     ఆనాటి నిరంకుశ పాలన కారణంగా వీరి మాటకు అడ్డులేకుండా పోయింది. క్రీ.శ. 1672 లో తానీషా మామగారు అబ్దుల్లా కుతుబ్ షా (1626 - 72)  చనిపోయిన సందర్భంలో అక్కన్న మాదన్నలు చేసిన కరణీకం, కుట్రల 

కారణంగానే  మృతిచెందిన సుల్తాన్  అల్లుడైన తానీషా తేలిగ్గా అధికారాన్ని చేజిక్కించుకోగలిగాడనీ, ఆ కారణంగానే ఆ సోదరుల పట్ల ఆయన కృతజ్ఞతాభావంతో వారు ఏమిచేసినా ఉదాసీనంగా ఉండేవాడని అంటారు. తానీషా రాజ్యపాలనా భారం మొత్తాన్ని ఈ సోదరుల మీదనే వదిలేసి వారిపై పూర్తి విశ్వాసం కలిగివుండటం కారణంగా వారికి తమ పాలనా వ్యవహారాలలో ఇంతటి  నిరంకుశత్వం చెలాయించటం సాధ్యపడింది. ఈ సోదరులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నకొద్దీ వారిపై ముస్లిం ప్రజలలో వ్యతిరేకత తీవ్రతరం కావటం, అందరి మనసులలో గూడు కట్టుకున్న ఆ వ్యతిరేకతే  క్రమంగా  మరింత  తీవ్రమై,  కొందరు ముస్లిం స్త్రీల సహకారంతో  ఈ సోదరులను ప్రత్యర్థులు హత్యచేయటానికి దారితీసిందని మనం ముందుగానే చెప్పుకున్నాం.  గోల్కొండ రాజ్యంలోని హిందువులలోని అత్యధికులు  కూడా అక్కన్న మాదన్నల పట్ల సానుకూలంగా ఏమీ లేరు. ఈ సోదరుల వలన ప్రయోజనాలు పొందిన బ్రాహ్మణులు - ముఖ్యంగా శైవులు - వీరిని ధర్మాత్ములుగా కీర్తించినా  ఈ సోదరులు  చేసిన తప్పులలో అన్నింటికంటే క్షమించరాని  తప్పు ఒకటుంది. పరమ కిరాతకునిగా, దురాశాపరునిగా పేరొందిన పొదిలి లింగన్న అనే కరణం వజ్రాల వ్యాపారంలో ప్రవేశించి రాజ్యంలో పలు దోపిడీలు, అరాచకాలు చేస్తూ ఉంటే, అక్కన్న మాదన్నలు అలాంటి వాడిని చేరదీసి, క్రీ.శ. 1682 లో ‘ దొంగ చేతికే తాళం చెవులు ఇచ్చినట్లు’  ఆ లింగన్ననే కృష్ణానదికి దక్షిణంగా ఉన్న గోల్కొండ రాజ్యానికంతటికీ  తమ తరఫున సుబేదార్ ( గవర్నర్) గా నియమించారు. పొదిలి లింగన్న  అప్పటికే కుట్రదారునిగా, చాడీకోరుగా  ఆంధ్రదేశమంతా దుష్కీర్తిని మూటకట్టుకున్నాడు. నేటి ఆరు జిల్లాలలోని  భూభాగాన్ని గండికోట కేంద్రంగా దాదాపు రెండువందల ఏళ్ళ పాటు (ముందు  హంపి విజయనగర ప్రభువులకు సామంతపాలకులుగా, ఆ తరువాత క్రీ. శ. 1652 వరకు   స్వతంత్రంగానే ) పాలించిన  పెమ్మసాని ప్రభువులపై అసూయాద్వేషాలతో  పగబూనాడు లింగన్న.  గోల్కొండ  పంచన చేరి, అబ్దుల్లా కుతుబ్ షా కొలువులోని కుటిలుడు, స్వామిద్రోహి అయిన మీర్ జుమ్లా అనే మంత్రి ( వజీరు) తో  కలిసి కుతంత్రాలు పన్ని అబ్దుల్లా కుతుబ్ షాను గండికోటపై దాడికి పురికొలిపింది  వంచకుడైన ఈ లింగన్నే. ఆ కుట్ర ఫలితమే క్రీ.శ. 1652 లో జరిగిన గండికోట యుద్ధంలో  కుతంత్రంతో, మోసంతో గోల్కొండ సైన్యానికి లభించిన విజయం. పొదిలి లింగన్న అరాచక చరిత్ర గురించి, అతడి కుట్రపూరిత స్వభావాన్ని గురించి, తరువాత భాగంలో వివరిస్తాను. అక్కన్న మాదన్నలు  తమ స్వీయ ఆర్ధిక ప్రయోజనాల సాధనకోసం ఈ లింగన్నను తమ ప్రతినిధిగా నియమించుకుని  చేసిన పనుల కారణంగా ఈ సోదరులు ఎంతో ప్రజా వ్యతిరేకతను కొనితెచ్చుకున్నారు. హంపి విజయనగర వారసత్వాన్ని నిలబెట్టిన బలమైన  హిందూ రాజ్యమైన గండికోట విధ్వంసం  పట్ల కలత చెందిన ఆంధ్రులు అందుకు మూల కారకుడైన లింగన్నతో   అక్కన్న మాదన్నల దోస్తీని ఎలా సహిస్తారు ? అందుకే హిందువులలో అత్యధికులకు  అక్కన్న మాదన్నల పట్ల సానుకూల వైఖరి లేకపోవటం. 


                    తమ మేనల్లుడు, నేటి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడైన కంచెర్ల గోపన్న 

(1620 - 88) అనే భద్రాచల రామదాసును వీరు క్రీ.శ. 1672 తరువాత కాలంలో గ్రామ కరణం స్థాయినుంచి పదోన్నతి కల్పించి తమ సిఫారసుతో పాలవంచ తహసీల్దారుగా నియమింపజేయగా, ఆ తరువాత ఆయన ప్రభుత్వ బొక్కసానికి చేరవలసిన నిధులను దారి మళ్ళించి, భద్రాచల రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికో, లేక పునర్నిర్మాణానికో  వెచ్చించినందున, ఆ నేరం తాలూకు అపకీర్తిని అక్కన్న మాదన్నలు కూడా మోయాల్సివచ్చింది. ఆ నేరానికిగాను శిక్షగా రామదాసు గోల్కొండ చెరసాలలో         పన్నెండేళ్ళు కారాగారవాసం చేస్తూ ‘ దాశరధీ కరుణా పయోనిధీ’ అనే మకుటంతో 108 పద్యాలతో దాశరధీ శతకాన్నీ, పలు కీర్తనలనూ రాశాడు. ఈ ఘటన కారణంగా రామదాసు ఆర్థిక అక్రమాల వెనుక  అక్కన్న మాదన్నల హస్తం కూడా ఉందని అక్కన్న మాదన్నల ప్రత్యర్థులతో సహా సామాన్య ముస్లింలంతా ఈ ఇరువురు సోదరులపై విమర్శనాస్త్రాలు సంధించారు. 


                      ఇక వచ్ఛే భాగంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు భక్త రామదాసు, ‘ ఆంధ్ర వాల్మీకి’ గా పేరొందిన కవి వావిలికొలను సుబ్బారావు ( వాసుదాసు)ల సాహిత్య, సామాజిక సేవతో పాటు, కిరాతకునిగా పేరొందిన పొదిలి లింగన్న కుట్రలు, కుహకాల గురించి కూడా విపులంగా వివరిస్తాను. 


                            -- మీ.. రవీంద్రనాథ్.

Total Pageviews