Friday, June 29, 2018

*మనసు పోయిన ప్రతిచోటుకి కళ్ళు పోకూడదు*


మనసు చాలా చిత్రమైనది.
విచిత్రాలు చేయిస్తుంది. మహావిచిత్రాలు విచిత్రమైనది. చంచలమైనది. కోతిలా ఆడుతుంది. మనల్ని ఆడిస్తుంది. ఆట పట్టిస్తుంది, ఆందోళన చేస్తుంది. చేయిస్తుంది అదే కోతిని మనం ఎక్కడ నొక్కాలో ఏ రకంగా తొక్కాలో అక్కడ నొక్క గలిగితే, ఆ రకంగా తొక్కగలిస్తే అది తోక ముడుస్తుంది.
అదంత సులభమా? కానే కాదు.
అదొక యజ్ఞం. అదొక దుర్బేధ్యమైన విషయం. దృఢ చిత్తం, అవిచ్ఛమైన, అవిశ్రాంతమైన అనంతమైన కఠోర సాధన ద్వారానే సాధ్యం అభ్యాసం చేయాలి.
ఎంతో కష్టించాలి. ఎన్నో కష్టాలు పడాలి. చిత్తశుద్ధి కావాలి, ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రత కుదరాలంటే మనసు శాంతంగా ఉండాలి. దానికి ప్రశాంతత కావాలి.
ఒకాయన ఓ మంత్రాన్ని జపం చేయాలని, తన ఇంటిలో కూచుని జపం ప్రారంభించేడు. ఇంతలో తన ఇంట్లో ఉన్న వారందరూ లేచారు. వారి చర్యలు, మాటలు, వాళ్ళు చేసే పనులవల్ల శబ్దాలవల్ల అతని జపం చేయడానికి అవసరమైన దృష్టి ఏకాగ్రత కుదరలేదు. ఇంటిలో శాంతిలేదని గ్రహించేడు. ఇంట్లో విసిగిపోయేడు. ఏం చేయాలా అని ఆలోచించేడు.
తిన్నగా దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళిపోయేడు. మంచి ప్రదేశం చూసుకుని ఓ చెట్టుక్రింద ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుని, మహా సంతోషించి, ఆ చెట్టుక్రింద తన జపంచేయటం మొదలెట్టేడు. కొంచెంసేపు గడిచింది. జపం సాగుతోంది. ఒక్కసారి చెట్టుమీద ఉన్న పక్షులు అరవడం మొదలుపెట్టేయి. పక్షుల గోల అధికమవుతోంది. దానికితోడు పక్షులు అతనిమీద రెట్టలు వేస్తున్నాయి. అతడికి చిరాకు ఎత్తుతోంది. సాధనకు భంగం కలిగింది. ‘‘అటు ఇంట్లో పిల్లలగోల అడవిలో పిట్టల గోల, నాకు ఈ జన్మలో ధ్యానంచేసుకునే అదృష్టం లేదు. మళ్ళీ జన్మలోనైనా ఆ అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తూ జీవితాన్ని అంతం చేసుకుందామన్నాడు. కొన్ని కట్టెలు తెచ్చేడు. చితిగా పేర్చుకున్నాడు. నిప్పుపెట్టేడు. ఆ మంటల్లోకి దూకాలని సిద్ధపడ్డాడు. దూరంగా ఎక్కడ్నుంచో ‘‘ఆగాగు’’అన్న అరుపు వినబడింది. అతను ఆ అరుపు ఎవరిదో అని ఇటుఅటు చూస్తుండగా ఓ ముసలాయన వచ్చేడు.
‘‘నాయనా! నువ్వు మంటల్లో దూకు. నీ ప్రాణం అంతంచేసుకో. మాకేమీ అభ్యంతరంలేదు. కానీ గాలి ఇటువైపునుంచి మేము నివాసముంటున్న గుడిసెలవైపు వీస్తోంది. మనిషి సజీవంగా కాలుతూ ఉంటే, కమురు కంపును మేము సహించలేము. కాబట్టి గాలి దిశ మరోవైపుకు మారేటంతవరకు వేచి ఉండు. గాలి మరోవైపు మారేక నీ ఇష్ఠం వచ్చిన పని నువ్వుచేసుకో. అంతవరకు ఆగలేకపోతే మరోచోటుకి వెళ్ళిపో’’ అన్నాడు.
ఈ మాటలు ధ్యానం చేయాలనుకున్న వ్యక్తి విన్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు. నేను చచ్చిపోవటానికి కూడా నాకు స్వాతంత్య్రం లేదు. ఆటంకాలు, అంతరాయాలు అంతటా, అన్నింటా వస్తూనే ఉంటాయి. ఈ అడ్డంకులకు అంతు అనేది ఉండదు అని అనుకున్నాడు. బాగా ఆలోచించేడు. నా ఇంటికేపోయి వీలుచూచుకుని మనస్సు నిలకడ చేసుకుంటాను. ధ్యానం చేసుకోడానికి ప్రయత్నం చేస్తాను అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయేడు. ఎక్కడ అతను మొదలెట్టేడో అటు తిరిగి ఇటు తిరిగి అతను మళ్ళీ మొదటి స్థానానికే వెళ్ళిపోయేడు .
అసలు ధ్యానం చేసుకోవాలన్నా జపం చేసుకోవాలన్నా ఏకాంతమనేది దానంతట అదిరాదు. ఏకాంతాన్ని మనం తెచ్చుకోవాలి. ఏర్పరచుకోవాలి. ఏర్పాటుచేసుకోవాలి. అభ్యాసంతోనో సాధనతోనో ఏకాంతాన్ని సముపార్జించుకోవాలి. సంపాదించుకోవాలి.
జపానికి, ధ్యానానికి కావలసినది ఏకాగ్రత. దృఢ చిత్తం. ఏకాంతం, ఏకాంత ప్రదేశం కాదు. మొక్కవోని దృఢ చిత్తం ఉంటే ఏకాంతం మన స్వంతమవుతుంది. ఏకాంత ప్రదేశం దానంతటదే మనకి మన మనస్సుకి సిద్ధిస్తుంది. అలవోకగా లభ్యమవుతుంది. మనసు నిర్మలంగా ఉంటే దేనిమీద విపరీతమైన ధ్యాస లేకపోతే కోరికలను నియంత్రించు కోగలగితే చాలు ఏకాగ్రత కలుగుతుంది.
*ధ్యాన సాధనకి బ్రాహ్మీ ముహూర్తం అనుకూలమైన సమయం*

కోపం ఎలావుండాలి అంటే ...

ఉత్తమే క్షణికః కోపః,
మధ్యమే ఘటికాద్వయమ్,
అధమే స్యాత్ అహోరాత్రం,
పాపిష్టే మరణాన్తకః"
భావం:
ఉత్తముని యందు కోపం క్షణకాలం ఉంటుంది.
మధ్యముని యందు 2ఘడియలు ఉంటుంది.
అధముని యందు ఒక రోజు ఉంటుంది.
కాని పాపిష్టియందు చచ్చేంత వరకూ ఉంటుంది.
మనిషికున్న లోపలి శత్రువులలో కోపం ఒకటి. దీనికి వశం కారాదు.
అయినను కొన్ని సందర్భాలలో తెచ్చుకున్న కోపం ప్రకటించాలి.
కాని సహజకోపానికి వశం కారాదు. సహజకోపం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
భారతయుద్ధంలో భీష్ముని ధాటికి అర్జునుడు తట్టుకోలేక నీరుకారి పోతున్నాడు. ఆ సమయంలో అర్జునుని ఉత్సాహపరచటానికి శ్రీకృష్ణుడు తెచ్చుకొన్న కోపంతో సుదర్శనచక్రంతో భీష్ముని వధిస్తానని రథం నుండి కిందికి దూకి విజృంభిస్తాడు.
అపుడు అర్జునుడు కృష్ణుని వారించి, నేను యుద్ధం చేస్తానని మరింత ఉత్సాహంతో భీష్మునిపై మహాయుద్ధం చేస్తాడు. ఇలా ఉండాలి కోపం.
శ్రీరాముడు కోపంతో సముద్రునిపై అస్త్రం ఎక్కుపెట్టాడు. సముద్రుడు
ఆ అస్త్రాన్ని తనలో దాగి ఉన్న రాక్షసులపై ప్రయోగించమని కోరాడు. ఉత్తముల కోపం ఒక ప్రయోజనాన్ని కూడా సూచిస్తుంది.
చెడుమార్గం పడుతున్న వారిపై తెచ్చుకున్న కోపాన్ని తాత్కాలికంగా ప్రదర్శించడంలో తప్పులేదు

*BALANCE SHEET Of LIFE*

*BALANCE SHEET Of LIFE*
Birth is your
*Opening Stock.*

What comes to you
is
*Credit.*

What goes from you
is
*Debit.*
Death is your
*Closing Stock.*
Your ideas are your
*Assets.*
Your bad habits are
your *Liabilities.*
Your happiness is
your
*Profit.*
Your sorrow is your
*Loss.*
Your soul is your
*Goodwill.*
Your heart is your
*fixed*
*Assets*
Your character is
your
*Capital.*
Your knowledge is
your
*Investment*
Your age is your
*Depreciation.*

And finally :
*ALWAYS REMEMBER, GOD IS YOUR AUDITOR*.
Have a perfect balance sheet...

కంచు పాత్ర మహత్తు!

కంచు పాత్ర మహత్తు!
ఇవాళే ఓ మిత్రుడి దగ్గర చూశాను. కనీసం 250-300 ఏళ్లనాటిది. ఈ పాత్రలో ప్రత్యేకత దాని వయసుకాదు. దానిని తయారుచేసిన విధానం. వాడిన టెక్నాలజీ. బ్రిటీషోడు భారతదేశానికి రాకముందే, సైన్సు, టెక్నాలజీ తెలివితేటలు మనకు ఇవ్వకముందే తయారయిన పాత్ర ఇది.
ఆ పాత్ర గురించి నేను అవగతం చేసుకున్న మూడు ముక్కలు చెబుతాను. అది పూర్తిగా కంచుతో తయారుచేసిన పాత్ర. అంచుమీద మూడు వైపులా మూడు చేప బొమ్మలు వుంటాయి. చేతులు శుభ్రంగా కడుక్కుని.. ఒక్కో చేప బొమ్మమీద రుద్దుతూ వుంటే ఒక్కో శబ్దం వినిపిస్తుంది. ఒక చేపమీద ఓంకార నాదం వినిపిస్తుంది. రెండో చేపమీద ఘంటారావం వినిపిస్తుంది. మూడో చేపమీద శంఖారావం వినిపిస్తుంది.
మన రణగొణ ధ్వనుల మధ్య కాకుండా నిర్మలమైన వాతావరణంలో ఆ చేప బొమ్మలను వేలితో తడిమితే.. ఆ శబ్దాలు వీనులవిందుగా వుంటాయి. కనీసం అరకిలోమీటరు వరకూ ఆ ధ్వనులు వినిపిస్తాయి.
ఆ పాత్రను తయారుచేసిన వారి జ్ఞానం, వారు అందించదలచిన సందేశం ఏ ఉన్నత స్థాయిలో వున్నదో నాకు తెలియదు. ఆ పాత్రను చూశాక నాకు బోధపడిన విషయాలు మాత్రం ఇవే.


సంగమేశ్వరం

ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం
జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ... నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.
పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన కూతురు ని అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.
ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు.
అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.
ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.
ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది . అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి.
ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.
కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న 'మచ్చుమర్రి' గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు.తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.

శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్.

శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్.
హనుమంతునికి ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమదాలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లో కాలు చదువు కోవాలి. సకల రోగ, భూత, ప్రేత, పిశాచాది భాధలు తొలగుటకు, అభీష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధ లో ఉన్న ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వానిని లెక్కించుటకు వాడుట మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదువ వలసిన ధ్యానం ' శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్.
'శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకంతరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం.
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశనశత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసిచివరిలో స్వామికి విశేషర్చన జరిపించి'' మయాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వర దో భూత్వా మామాభిష్ట సిద్దం ద దాతు'' అని జలమును అక్షత లతో వదలి పెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం,శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.ఆచరణ: భక్తులకు ఏ బాధలు కల్గినా నియమాలు చెప్పి వారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వార తోలగునట్లు చేయాలి. హనుమత్పు దక్షిణ ధ్యానం శీలాఫలకం పై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెల్పాలి.అభి షేకంపరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కావున ఆయనకు అభిషేకం ఇష్టం. అందునా మన్యు సూక్త అభిషేకంచే పరమానంద భరితుడౌతాడు. కోరికలు తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర నాడు తప్పక చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగల్గుట మరీ మంచిది.
సర్వేజనా సుఖినోభవంతు!!

Thursday, June 28, 2018

టైమ్ తో పాటు మీ వ్యాపారం మరియు మీ వ్యక్తిగత స్వభావం మారాలి..!

1998 లో కోడాక్ 170,000 ఉద్యోగులు పని చేసేవారు..మార్కెట్లో తయారు అయ్యే 85% ఫోటోగ్రాఫిక్ పేపర్ అమ్మే వారు.
ఆతర్వాత సంవత్సరాలలో డిజిటల్ ఫోటోగ్రఫీ వలన .. కోడాక్ దివాలాతీసింది.. దాంతో వారి సిబ్బంది రోడ్డు మీద పడ్డారు.
HMT (గడియారం)
BAJAJ (స్కూటర్)
డినోరా (TV)
మర్ఫీ (రేడియో)
నోకియా (మొబైల్)
RAJDOOT (బైక్)
AMBASDOR (కారు)
స్నేహితులారా,
వారి గుణాత్మక విలువలు, నాణ్యతకు లోటు లేదు.. కానీ వారు రోడ్డున పడ్డారు !!
కారణం
వారు కాలక్రమేణా మారలేదు !!
మీ కళ్ళ ముందే రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచ పూర్తిగా మారుతుంది మరియు పరిశ్రమలో నడుస్తున్న 70 - 90% ఉద్యోగాలు బంద్
అవుతాయి.
4 వ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం...
"ఉబెర్" కేవలం ఒక సాఫ్ట్వేర్. అతను తన సొంత కారుని కలిగి లేడు, అయినప్పటికీ తనది ప్రపంచంలో అతిపెద్ద టాక్సీ కంపెనీ.
"ఎయిర్బన్బ్" ప్రపంచంలోని అతిపెద్ద హోటల్ సంస్థ వారు తమ సొంత హోటల్ని కలిగి లేరు.
Paytm, ola cabs, oyo, Amazon, Flikcart వంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
ఇప్పుడు joint లో, ఎలాగైన సరే అంతటా IBM వాట్సన్ సాఫ్ట్వేర్ క్షణాల్లో మంచి లీగల్ సలహా ఇవ్వాలని యోచనలో ఉంది.
యువ న్యాయవాదులకు పనిలేకపోవడం జరుగుతుంది, తదుపరి 10 సంవత్సరాల్లో ఈ రంగంలో నిరుద్యోగత ఉంటుంది, 90% USELESS... మిగతా 10% సూపర్ నిపుణులు మిగులుతారు..
వాట్సన్ అనే సాఫ్ట్వేర్ మానవులతో పోలిస్తే క్యాన్సర్ యొక్క 4x ఖచ్చితత్వంతో తెలుపుతుంటుంది - 2030 నాటికి కంప్యూటర్ మానవుల కంటే తెలివైనది.
2019 నాటికి డ్రైవర్లెస్ కార్లు రోడ్లపై పయనిస్తాయి. 2020 నాటికి, ఈ సింగిల్ ఆవిష్కరణ మొత్తం ప్రపంచాన్ని మార్చడానికి ప్రారంభమవుతుంది.
రాబోయే 10 సంవత్సరాలలో 90% కార్లు ప్రపంచవ్యాప్తంగా వీధులు నుండి అదృశ్యమై... ఎలక్ట్రిక్ కార్లు & అన్ని హైబ్రిడ్ కార్లే...రోడ్లు ఖాళీగా ఉంటాయి, పెట్రోల్ వినియోగం 90% తగ్గుతుంది, అన్ని అరబ్ దేశాలు దివాళా తీస్తాయి.
మీరు ఉబెర్ కార్ సాఫ్ట్వేర్ నుంచి మెసేజ్ చేసిన కొన్ని క్షణాలు లో మీ గుమ్మాల వద్ద నిలిపిన ఒక చోదకరహిత కారు... మీరుచేసే రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది ఒకరితో ఒకరు భాగస్వామ్యం ఉంటే..
చోదకరహిత కార్లు 99% ప్రమాదరహితంగా కలిగిస్తాయి..
కాబట్టి కార్ బీమా వృత్తి నుండి విరమించాల్సి ఉంటుంది..!
డ్రైవర్ లాంటి ఉద్యోగంకు భూమ్మీద జీవంఉండదు... నగరాలు మరియు రోడ్లు 90% కార్లు అదృశ్యం కాబట్టి ముగుస్తుంది. స్వయం చాలకంగా ట్రాఫిక్ మరియు పార్కింగ్.. దీంతో ఒకకారు నేటి 20 కార్లు సమానం..
ఈ రోజు నుంచి 5 లేదా 10 సంవత్సరాల క్రితం PCO లేని స్థలం లేదు. ఇప్పుడు అందరి పాకెట్స్ లో మొబైల్ ఫోన్లు వచ్చింది, PCO లు మూసివేశారు..
అప్పుడు వాళ్ళు అన్ని PCO ల్లో ఫోన్ రీఛార్జ్ అమ్మకం ప్రారంభించారు. ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్ లైన్ లో జరుగుతోంది.
మీరు ఎప్పుడైనా గమనించారా..?
ఈనాడు మార్కెట్లో ప్రతి మూడవ స్టోర్ మొబైల్ ఫోన్ షాపే -
అమ్మకానికి, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ మెదలైన వాటికి...
కరెన్సీ నోట్ కు బదులుగా ప్లాస్టిక్ మనీ మరియు ఇప్పుడు డిజిటల్ అన్నింటికీ Paytm.. ఇప్పుడు ప్రజలు రైలు టిక్కెట్లు ఫోన్ లో బుక్ చేసుకుంటున్నారు.. డబ్బు మారకం లావాదేవీలు ఇప్పుడు అన్ని డిజిటల్..
ప్రపంచ చాలా వేగంగా మారుతోంది..
కళ్ళు, చెవులు, ముక్కు తెలివిగా తెరిచి ఉంచండి లేదా మీరు వెనకబడతారు...!
కాలక్రమేణా మార్చడానికి సిద్ధంగా ఉండండి.
సో...
టైమ్ తో పాటు మీ వ్యాపారం మరియు మీ వ్యక్తిగత స్వభావం మారాలి..!
"Time to Time Update & Upgrade"
సమయం తో పాటు సాగండి..!
విజయం పొందండి..!( WhatsApp message )

మన సంస్కృతిని గౌరవిద్దాం

మమ్మీ డాడీ పిలుపులు*
నమ్మల నాన్నల దినములు నరువుల సొమ్ముల్*
కమ్మని పిలుపులు మానుకు*
నమ్మకముల పెంపు రోజు లవసరమేలో*

వ్యాపారములు పెంచుకొనుటకు పాశ్చాత్యులు అనుసరించు విధానాలలో ఈ *దినములు ఒకటి. బహుమతులు, గులాబీలు, శుభాకాంక్షలు తెలుపు పత్రముల అమ్మకముల కొరకు వివిధ దినములు పుట్టించు చున్నారు. ఉగ్గుపాలతోనే మాతృదేవో భవ, పితృదేవోభవ, ఆశ్చర్యదేవోభవ, అతిధి దేవోభవ అని నేర్పించిన సంస్కృతి మనది.
కానీ నేటి విద్యావ్యవస్థ, సామాజిక వర్తన, కుటుంబవ్యవస్థలలో వచ్చిన మార్పుల వలన ఈ మంచి విషయములు మరుగున పడిపోవుచున్నవి. విపరీతములు చోటు చేసుకొనుచున్నవి.

మా నాన్నకు (బదులుగా ఇక్కడ ఒక బూతు పదం వాడుతూ) చాదస్తం ఎక్కువరా... ఎప్పుడు చూడు ఏవో నీతులు చెప్తాడు, ఖర్చులకు డబ్బులు మాత్రం ఇవ్వడు అంటూ కనీస గౌరవం లేకుండా మాట్లాడే పిల్లలు,

 అంతర్జాలంలో వావి వరసలకు తిలోకదకాలిచ్చి అసభ్యమైన కధలు, చిత్రాలు పెట్టి, చదివి, చూసి చెడిపోతున్న యువత,

పాఠశాలల్లో, కళాశాలల్లో చదువు మాని ఇతర వ్యాపకాలు ఎక్కువై గురువులను దూషిస్తూ, మహిళా ఉపాధ్యాయులను సైతం లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విద్యార్థులు,

ఈ విదేశీ దినాల, సంస్కృతి అలవరచుకుంటూ ఒక్కరోజు శుభాకాంక్షలు పంపితే మురిసిపోదామా? పెద్దలుగా వారిని సంస్కరించే పని మొదలుపెడదామా?

ఎవరో పనిగట్టుకు వచ్చి చెప్తే అది సంస్కరణ కాదు. మార్పు మనతోనే మొదలు పెడదాం.... 6 నుంచి 60 ఏళ్ల వారి వరకు మంచి వైపు మనమే తొలి అడుగు వేద్దాం

మన సంస్కృతిని గౌరవిద్దాం

మంచిమాటలు

"చీకటిని చీకటి
పారద్రోలలేదు......!
వెలుతురు మాత్రమే
ఆపని చేయగలదు.
                      అలాగే!
విద్వేషాన్ని విద్వేషం
నిర్మూలించలేదు.
ప్రేమ మాత్రమే ఆపని
చేయగలదు.
     
వంద బిందెలతో
నీళ్లు పోసినంత మాత్రాన
చెట్టు అమాంతం
కాయలు కాయదు. అలాగే!
మనం ఎక్కువ
కష్టపడుతున్నాం
కదా అని పనులు
క్షణాలలో పూర్తి అవవు.
దేనికైనా సమయం రావాలి....!
సహనం కావాలి........!!

సాహసమంటే ఎప్పుడు రగిలిపోవడమే కాదు.
వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకుని మళ్లీ ప్రయత్నించడం కూడా.

ఎదుటివారికి ఒక సలహా కాని,వస్తువు కానీ
ఇచ్చే ముందు ఎదుటివారి పరిస్థితులలో
నువ్వుంటే ఏం చేస్తావు అని ఒక్క క్షణం ఆలోచించి చూడు.
ఉచితానుచితాలు తెలుస్తాయి.

ఒక దీపంతో వేలాది జ్యోతులను వెలిగించినా
 దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే, ఎదుటివారితో సంతోషాన్ని
పంచుకుంటే మనకు తరిగేది ఏమీ ఉండదు.

తెలుగు కవులకు, పద్య రచయితలకు జోహార్లు

చదివే సమయంలో
పెదవి మాత్రమే తగిలే పద్యం-

భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా

*చదివే సమయంలో *
పెదవులు తగలనిది

శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా

ఒక అక్షరం పెదవికి తగలనిది * *తరువాతి అక్షరం తగిలేది
అంటే పెదవి తగలనిది,తగిలేది

దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా

కేవలం నాలుక కదిలేది

సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా

నాలుక కదలని(తగలని) పద్యాలు

కాయముగేహము వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా

భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా

నాలుక కదిలీ కదలని పద్యం

ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా
🙏🙏🙏🙏
పద్య భాషాభిమానులకు జోహార్లు.
తెలుగు కవులకు, పద్య రచయితలకు జోహార్లు🙏🙏

అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని 🙏🙏🙏🙏

నక్షత్రయుక్తo చమత్కార పద్యం

నక్షత్రయుక్తo చమత్కారం చూ( చదవండి )డండి :-

నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్

ఇందులో  నాలుగు  నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు. ఇటువంటి ప్రహేళికలను'ప్రముషితా' ప్రహేళికలని అంటారని కవి దండి తన'కావ్యాదర్శం'  లో చెప్పాడు.

ఇప్పుడు వివరణ చూద్దాం!
మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె "ఉత్తర" (నక్షత్రం పేరు )  ఆమె అభిమన్యుని భార్య. నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర "భరణిని" ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు  ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక "మూల" ( నక్షత్రం పేరు ) కు రమ్మని పిలిచి; నక్షత్రము పైనవేసి అంటే "హస్త" (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి;  నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట.

అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!

Aanandamayee: గృహా ప్రవేశము

Aanandamayee: గృహా ప్రవేశము:              గృహా ప్రవేశం జరుగు రోజున ప్రాతః కాలములో   అభ్యంగ స్నానం కావించి శుచిఅయిన   వస్త్రాలు ధరించి తొలుత   వినాయక ప్రార్ధన...

Tuesday, June 26, 2018

andarivadu: వరద గుడి అంటే ఏమిటి? ఇది దేనికి సూచన?

andarivadu: వరద గుడి అంటే ఏమిటి? ఇది దేనికి సూచన?: వరద గుడి  ఇది వర్షం రాకకి సూచన. ఈ వరద గుడి చంద్రుడికి దగ్గరగా ఉంటె వర్షం ఇప్పటిలో లేనట్లు. చంద్రుడి చుట్టూ దూరంగా వేస్తె ఒకటి రెండు రోజుల్లో...

andarivadu: వరద గుడి అంటే ఏమిటి? ఇది దేనికి సూచన?

andarivadu: వరద గుడి అంటే ఏమిటి? ఇది దేనికి సూచన?: వరద గుడి  ఇది వర్షం రాకకి సూచన. ఈ వరద గుడి చంద్రుడికి దగ్గరగా ఉంటె వర్షం ఇప్పటిలో లేనట్లు. చంద్రుడి చుట్టూ దూరంగా వేస్తె ఒకటి రెండు రోజుల్లో...

Sunday, June 24, 2018

సమ్మోహనం...విశ్లేషణ..సమీక్ష Vadrevu China Veerabhadrudu

ఏ పసితనంలోనో నా మనసుమీద గాఢంగా ముద్రవేసుకున్న రంగుల కలల్లో హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్ కథలు కూడా ఉన్నాయి. అవి ఏండర్సన్ రాసిన కథలు అని తెలియకముందే ఆ కథలు నా హృదయంలో సీతాకోక చిలుకల్లాగా వాలి గూడుకట్టుకున్నాయి. చాలా చాలా ఏళ్ళకిందట,మా ఊళ్ళో, నా పసినాట నేను చదివిన బొమ్మల కథ, ఏడు పరుపుల కింద ఒక్క బఠానీ గింజకి నిద్ర పట్టక వళ్ళంతా కందిపోయిన సుకుమారి రాకుమారి కథ-The Princess and the Pea (1835) అని ఎన్నో ఏళ్ళకిగానీ తెలియలేదు.
ఏండర్సన్ కథలు నాలో ఉన్న ఒక పసితనాన్ని, ఒక నిర్మలహృత్ స్థానాన్ని నాకు గుర్తుచేస్తాయి. ఆ కథల్ని అంటిపెట్టుకుని ఒక దిగులు ఉంటుంది. కోమలమైన పసిపాపల అమాయికత్వం ఉంటుంది. ఈ లోకం లోకి వచ్చే ప్రతి శిశువూ దేవుడింకా ఈ లోకం పట్ల నిరాశ చెందలేదని గుర్తుచేస్తూంటుందని అన్నాడు టాగోర్. ఏండర్సన్ కథలు చదివినప్పుడు, ఏ ఒక్క కథ చదివినా, ఈ లోకం పట్ల మనమింకా నిరాశ చెందనవసరవం లేదనిపిస్తూంటుంది. ఏళ్ళ కిందట అతడి Angel (1843) కథ చదివాను. అతడు ఆ కథ రాసినప్పుడు డెన్మార్క్ అత్యంత బీదదేశాల్లో ఒకటి. పసిపాపలు బతకడానికి అవకాశంలేని దుర్భరదారిద్ర్యం ఆ దేశంలో. ఈ రోజు డెన్మార్క్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. ఆ దేశాన్ని సుభిక్షంగా చేసిన శక్తుల్లో ఏండర్సన్ కథలు కూడా ఉన్నాయనడానికి నాకు సంకోచం లేదు. మన చుట్టూ భరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు, వాటినుంచి మరింత మెరుగైన జీవితం వైపు నడవాలన్న ప్రేరణలోంచో, లేదా ప్రేరణకోసమో, ఎవరో ఒకరు మనకు అందమైన కొన్ని కథల్నీ, కొన్ని కలల్నీ పంచకతప్పదు.
'సమ్మోహనం' అట్లాంటి కథ. కథగా అందులో ఏమీ లేదు. కానీ ఒక కలగా ఆ కథనం అద్భుతం. సమ్మోహనం కథ ఏండర్సన్ కథ కాదు. కాని, స్ఫూర్తిలో, ఆ సినిమా చూస్తున్నంతసేపూ, నాకు ఏండర్సన్ పదే పదే గుర్తొస్తూ ఉన్నాడు. ముఖ్యం, ఆ చిత్రనాయిక, సమీర, ఏండర్సన్ కథల్లో మాత్రమే కనిపించే ఒక యాంజెల్.
ఈ చిత్రదర్శకుడు అది చెయ్యగలిగాడనో, ఇదింకా బాగా చెయ్యలేకపోయాడనో, అట్లాంటి విశ్లేషణ ఏదీ రాయాలని లేదు నాకు. అన్నిటికన్నా ముఖ్యం, అత్యవసరంగా అతడు మనకొక ఫెయిరీ టేల్ చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయి, సమీర పాత్ర పోషించిన ఆ యువతి, (ఆమె పేరు అదితిరావు అని మా అమ్మాయి చెప్పింది) ద్వారా ఒక యాంజెల్ ని మనకి పరిచయం చేసాడు.
సినిమా చూసి ఇంటికి వచ్చేటప్పటికి, అర్థరాత్రి దాటింది. ఆకాశంలో ద్వాదశి చంద్రుడు మరింత ప్రకాశమానంగా ఉన్నాడు. చెట్లు తమలో తాము నిద్రలో నవ్వుకుంటూ ఉన్నాయి. ఏ దేవదూత, ఏ చిన్నారిశిశువు కోసం రెక్కలు చాపి, దిగివస్తున్నదోగాని సుమనోహరమైన ఒక తెమ్మెర నన్ను తాకిపోయింది.
నిష్టురమైన వాస్తవం చిత్రించడం పట్ల తెలుగు కథకులకి చాల ఆసక్తి. కాని నిష్టుర వాస్తవం ఎలా ఉంటుందో వాళ్ళకి నిజంగా తెలుసునా అని నాకు సందేహం. కలలు పండించడం పట్ల మన చిత్రదర్శకులకి చాలా మక్కువ. కాని వాళ్ళకి కలగనడమే రాదు. కలలు ఎలా ఉంటాయో, ఏ ఒక్క చిత్రదర్శకుడికీ, సినిమాకవికీ, కథకుడికీ తెలీదన్నది నాకు నిశ్చయం. నిజమైన దర్శకుడు కలల్ని చిత్రించడు. అతడి చిత్రం చూస్తుంటే మనం కలలుగంటాం. మనలోని పసిపాపకి మరింత చేరువగా జరుగుతాం. సమ్మోహనం చేసిందదే.
Comments
Anil Atluri <నిష్టురమైన వాస్తవం చిత్రించడం పట్ల తెలుగు కథకులకి చాల ఆసక్తి. కాని నిష్టుర వాస్తవం ఎలా ఉంటుందో వాళ్ళకి నిజంగా తెలుసునా అని నాకు సందేహం.> నాకు అదే సందేహం!
Manage
LikeShow More Reactions
Reply2h
నవీన్ కుమార్ ఎంత హాయిగా ఉందో సినిమా. మెత్తని మాటలు, తడితడిగా కదిలే కళ్ళు, సన్నని బంగారు తీగలా మెరిసే సంగీతం.. ఆహ్, it was wonderful to watch this movie. ఆ అనుభూతి అంతా ఈ ఉదయం మళ్లీ ఒకసారి తడిమింది. Thank you sir.. 
🙂
Manage
LikeShow More Reactions
Reply2hEdited
Meghana M Sir, మణిరత్నం తీసిన చెలియా సినిమా లో కూడా అదితిరావు హైదరి మీరు విశ్లేషించిన ఒక angel లాగే కనిపిస్తుంది. తెర మీద నుండి ఒక కలలోకి తీసుకెళుతుంది. సమ్మోహనం ఇంకా చూడలేదు కానీ మీ విశ్లేషణ చదివిన తరువాత చూడలని ఉంది. ఇలాంటి కల కనడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు...Thank You Sir.
Manage
LikeShow More Reactions
Reply2h
Rama Subba Rao Bhuthamapuram ఎన్నో కష్టాలు, ఆపదలనుంచి తేరుకొని ఇపుడు ఒక అత్యంత శాంతిమయ దేశంగా పిలవబడుతోంది డెన్మార్క్! అక్కడ నేరాలూ ఉండవు, ప్రమాదాలు జరగవు!! ఇక సినెమాల ద్వారా ప్రతి ప్రేక్షకుడిని ఒక నిగూఢ ప్రతిభాశీలిగా మార్చాలంటాడు సుప్రసిద్ధ హిందీ చలనచిత్ర దర్శకుడు వీ.శాంతారం....

వనజవనమాలి: ఈ శుభలేఖ చూడండి..

వనజవనమాలి: ఈ శుభలేఖ చూడండి..: తుమ్మెద మంత్రం చదువుతూ ఉంటే.. కోయిల మేళం వాయిస్తుంటే.. చిలకమ్మా పెళ్లి కూతురాయేనే..గోరింక పెళ్లి కొడుకాయెనే.. అంటూ .. ఓ.. ఆత్మీయ ఆ...

Saturday, June 23, 2018

తెలుగు గజల్: ఉందో లేదో స్వర్గం

తెలుగు గజల్: ఉందో లేదో స్వర్గం: రచన : తటపర్తి రాజగోపాలన్ గానం : గజల్ శ్రీనివాస్ ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్ సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్ అమ్మ గ...

Friday, June 15, 2018

*సద్గురువు అమ్మ* *భగవంతుడు నాన్న*


నాలుగైదు నెలల పిల్లవాడు.
మంచం మీద పడుకుని ఉన్నాడు.
ఇంకా నిలబడటం,నడవటం రాని వాడు. ఇక మంచం దిగే యోచనే తెలియని వాడు.
ప్రక్కనే పడక్కుర్చీలో నాన్న పుస్తకమేదో చదువుకుంటున్నాడు.
ఇంతలో పిల్లవాడు మల మూత్రాలు విడిచాడు. ఆ పొత్తిగుడ్డల్లోనే గుండ్రంగా పొర్లాడు. బోర్లా,వెల్లకిలా పడ్డాడు.
ముక్కూ మొహమూ ఏకం చేసుకున్నాడు. బురదలో చేపపిల్లలా తప తప కొట్టు కున్నాడు.
చివరికి తన మురికి తనే భరించలేక కెవ్వుమని ఏడుపు లంకించుకున్నాడు.
పిల్లవాడి ఏడుపు విని నాన్న దగ్గరి కొచ్చాడు.
పిల్లవాడు చేతులు పైకెత్తి ఎత్తుకోమన్నట్లుగా తండ్రి వైపు చూస్తూ క్యార్ క్యార్ మన్నాడు.
మల మూత్రాలు ఒళ్ళంతా పుసుకుని దుర్గంధ భూయిష్టంగా ఉన్న కొడుకుని నాన్న చూశాడు, గానీ ఎత్తు కోలేదు.
అంతలో పిల్లాడి ఏడుపు విని అమ్మ కూడా పరిగెట్టు కొచ్చింది.
ఏమోయ్! వాడు చూడు! ఎలా ఉన్నాడో? ఒంటి నిండా పూసుకున్నాడు! అన్నాడు నాన్న!
అమ్మని చూసి మరింత గట్టిగా ఏడుస్తూ చేతులు చాపాడు పిల్ల వాడు.
అమ్మ నాన్నలా దూరంగా ఉండి పోలేదు. ఒక్క ఉదుటున వచ్చి ఎత్తుకుంది.
స్నానాలగదికి తీసికెళ్ళి పీటేసుకు కూర్చుంది. చీర కుచ్చిళ్ళు మోకాళ్ళకి పైకి లాక్కుని, పిల్లాణ్ణి కాళ్ళ పైనేసుకుంది. నీళ్ళూ,సున్నిపిండీ వేసి.. రుద్ది కడిగింది. పొడి తువ్వాలు పెట్టి ఒళ్ళంతా తుడిచింది. పరిమళాలు విరజిమ్మే గంధపు పొడులేవో రాసింది.
బొట్టూ,కాటుకా పెట్టింది.
ఉతికిన జుబ్బా తొడిగింది.
బుగ్గన కాసంత దిష్టి చుక్క పెట్టి, ఎత్తి ముద్దులాడింది.
పిల్లవాడు ఏడుపు ఆపి కిలకిలా నవ్వుతుండగా తెచ్చి నాన్న చేతికిచ్చింది. చదువుతున్న పుస్తకం అవతల పెట్టి, కొడుకు నెత్తుకుని నా తండ్రే! నా బంగారు కొండే! అంటూ.. ముద్దులాడాడు. పిల్లవాడు పరమానందంలో మునిగి పోయాడు.
భగవంతుడు నాన్నలాంటి వాడు!
మనం మురిగ్గా ఉంటే ఎత్తుకోడు,
దగ్గరకి రాడు, రానివ్వడు.
సద్గురువు అమ్మలాంటి వాడు.
*మన దోషత్రయాన్ని [మల విక్షేప ఆవరణలు]దూషించడు.
*మన ఈషణ త్రయాన్ని [దార ధన పుత్ర ] చూసి ఈసడించడు.
*వాసనాత్రయాన్ని[లోక దేహ శాస్త్ర ] చూసి వద్దకు రావద్దని వారించడు.
*మన అహంకారాన్ని చూసి
అసహ్యించు కోడు.
*ఓపికగా మన చిత్తాన్ని శుధ్ధి చేసి
మన అహంకరాన్ని అణచి వేసి,
వాసనల్ని వదలగొట్టి
ఈషణ, ఈర్ష్యాసూయల్ని దాటించి
నిర్మల, విశుధ్ధుల్ని చేసి
భగవంతునికి ప్రీతిపాత్రులమయ్యేట్లుగా చేస్తాడు.
ఎందుకంటే….
*తారతమ్య సాంద్రత సమం కానిదే
ఒక పదార్ధం మరో పదార్ధంలో కలసిపోదంటుంది భౌతిక శాస్త్రం.
*బ్రహ్మమెంత నిర్దోషమో,
అంత నిర్మలమైతే తప్ప బ్రహ్మస్వరూపులం కాలేమంటుంది గీత!
*ఇహైవ తైర్జిత స్సర్గః, యేషాం సామ్యే స్థితం మనః।
నిర్దోషం హి సమం బ్రహ్మ, తస్మాద్బ్రహ్మణి తే స్థితాః॥
అందుకే మరి…..
ఎవరెంతగా అన్నా
ఎవరెంతగా విన్నా,
ఎంత చదివినా,
ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా,
సద్గురువుని ఆశ్రయించటం తప్పనిసరి
అంటాది మన సనాతనధర్మం.

Saturday, June 9, 2018

MBA for brahmin girl students at sampradaya tirupati.

Happy to announce starting MBA for brahmin  girl students at sampradaya tirupati. Contact us for details

"Sampradaya" is run by His Holiness shri Sri  Vijayendra Saraswati Sankaracharya Swami, Kanchi Kamakoti Peetam.

If you know  any Brahmin girl candidates , in your circle, wanting to do MBA, pl pass info. Absolutely free education, hostel,etc. Just a service

Contact Ms. Lakshmi
+91 95001 95021
Kanchi Matt

Thursday, June 7, 2018

హిమాలయ మంచు శ్రేణుల్లో కూడా సెల్ సిగ్నల్స్ లేవని బాధపడేవారు.

హేమంతం, వసoతo. గ్రీష్మం, ఆ పై వర్షం.. మనసుకి కళ్ళు, చెవులూ ఉంటే ప్రతి ఋతువు అద్భుతమైనదే. అంతా రసరమ్య కావ్యమే. వర్షాకాలాన్నే తీసుకోండి. ఆ రోజుల్లో నేను బి.కాం., చదివేవాడిని. సముద్రానికి కాస్త దూరంగా, ఇసుక తిన్నెల మధ్యలో చిన్న పెంకుటిల్లు. వెళ్ళటానికి దారి కూడా లేదు. సైకిల్ కూడా చేతుల మీద మోసుకు వెళ్ళాల్సిందే. వర్షం వస్తే ఆ మట్టి వాసన మధురంగా ఉండేది. రాత్రి పదకొండిoటికి అప్పుడే వర్షం వచ్చి వెలిసిన తరువాత హరికెన్‌ లాంతరు వెలుగులో చదువుతూ ఉంటే, గాలి తెరలు కిటికీ రెక్కల సందుల్లోంచి అలలు అలలుగా శబ్దం చేసేవి. ఎక్కడో దూరం నుంచి సముద్రపు హోరు. అంతలో ఒక రైలు కూత వినబడేది. క్రమక్రమంగా ఆ రైలు దగ్గరికి వస్తూ ఉంటే ఎంతో ఫాసినేటింగ్‌గా ఉండేది. పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయేది. మళ్ళీ నిశ్శబ్దం, ఇప్పటికీ అది నాకు చాలా రొమాంటిసైజింగ్‌ అనుభవం. అందుకే రైల్వే ట్రాక్ పక్కనే విద్యాపీఠం కట్టాను.
చిత్రం ఏమిటంటే ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త విన్సెంట్‌ పీలే’ కూడా ‘ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ అన్న పుస్తకంలో “సరిగ్గా ఇదే” అనుభవాన్ని వర్ణించాడు. ‘‘రైలు శబ్దం నన్ను ఉద్వేగపరుస్తుంది. అర్ధరాత్రి పక్కమీద పడుకుని నిద్రపోతూ ఉండగా దూరం నుంచి మిత్రుడు పిలిచినట్టు రైలు కూత వినిపిస్తుంది. చప్పున లేచి కిటికీ తలుపు తెరిచి చీకట్లోకి చూస్తాను. ఏమీ కనబడదు. కానీ శబ్దం మాత్రం దగ్గరవుతూ ఉంటుంది. దూరంగా చిన్న దీపం. రైలు క్రమక్రమంగా దగ్గర కొచ్చి, కొండ లోయల్లోoచి ఏరిన ధ్వనులన్నిటినీ మా ఇంటి చుట్టూ నక్షత్రాల్లా వెదజల్లి నిశ్శబ్దంలోకి సాగి పోతుంది’’ అంటాడు. ఆ తరువాత వ్యాసాన్ని కొనసాగిస్తూ ‘‘కొందరు మనుషులు ఎంతో తొందరగా తమ జీవితపు పరిమళాన్ని కోల్పోయి ప్రాపంచిక విషయాలలో గడపటానికి అలవాటు పడిపోతారు!’’ అంటూ వాపోతాడు ఈ మానసిక శాస్త్రవేత్త.
కొంచెం కూడా సౌందర్యారాధన, ప్రకృతి పట్ల ఇష్టం లేకుండా బ్రతికేవారిని చూస్తే ఆశ్చర్యo కలుగుతుంది. బ్రతకటానికీ జీవిoచటానికీ తేడా తెలియని వీరు, భూమాత చలికి తెల్ల దుప్పటి కప్పుకుందేమో అన్నట్టున్న హిమాలయ మంచు శ్రేణుల్లో కూడా సెల్ సిగ్నల్స్ లేవని బాధపడేవారు.

మానసిక ఒత్తిడిని అధిగమించటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉన్నదా

తన దేశం తరపున ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ మాచ్‌లు ఆడిన ప్రఖ్యాత ఆటగాడికి క్యాన్సర్‌ వచ్చింది. అతడిచ్చిన ఇంటర్‌వ్యూలో ఒక భాగాన్ని యథాతథంగా ఇక్కడ చెబుతాను. ‘‘నేను బ్రతికుండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు. నాదేశం తరపున ప్రాతినిధ్యం వహించాలని కృతనిశ్చయుడినై ఉన్నాను. ఇక్కడ నాకు మూడు ‘డి’లు సాయపడ్డాయి. డిజైర్‌, డిటెర్మినేషన్‌, డెడికేషన్‌ (కోరిక, పట్టుదల, అంకితభావం). బ్రతకాలన్న కోరికని నేను చాలా గాఢంగా పెంచుకోవాలని తెలుసు. అంతేకాదు, నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించటానికి నేను అంకితభావంతో పని చేయాలి. దీనికి పట్టుదల కావాలి. ఓటమికి లొంగిపోకూడదని నేను గాఢంగా అనుకొంటున్నాను. నాకు తెలుసు, నా జీవితంలో మరిన్ని దీర్ఘకాలిక విజయాలని సాధించటానికి సమయంలేదని. కానీ, అందువల్ల ప్రపంచం మీద ద్వేషాన్నీ, నామీద నిరాసక్తతనీ నింపుకో దల్చుకోలేదు. దాని బదులు ప్రేమనీ, పట్టుదలనీ పెంచుకోవాలనుకుంటున్నాను. ప్రపంచం అందాలని ఆస్వాదించటానికి కాలం ప్రాతిపదికగా కాకుండా మనసుని ప్రాతిపదికగా తీసుకోవాలనుకుంటున్నాను. నా మరణం ఒక యాక్సిడెంట్‌ అయితే ఆ యాక్సిడెంట్‌ నుంచి ఎలాగూ నేను బయటపడలేను. నేనేమిటో నన్ను అలాగే స్వీకరిస్తాను తప్ప, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా స్వీకరించదల్చు కోలేదు. నేను పోరాడదల్చుకున్నాను. నవ్వుతూ పోరాడదల్చుకున్నాను.’’
చాలా ఆశ్చర్యకరంగా, శాస్త్రజ్ఞులు, వైద్యశాస్త్ర నిపుణులు ఆశ్చర్యపోయేలాగా ఆ ఆటగాడు క్యాన్సర్‌ నుంచి అద్భుతంగా బయటపడ్డాడు. మానసిక ఒత్తిడిని అధిగమించటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉన్నదా? అతడు చెప్పిన ఇంటర్‌వ్యూ ఎoత ఆర్ధ్రంగా, ఎంత నిర్దుష్టంగా, ఎంత ప్రభావవంతంగా ఉన్నదో గమనించండి. యువరాజ్ సింగ్, జెఫ్రీ బాయ్-కాట్, జెన్స్ గుత్రేజ్ మొదలైన వారందరూ ఈ విధంగా కేన్సర్ని జయించిన క్రీడాకారులే. చిన్న చిన్న మానసిక ఒత్తిడులకే క్రుంగిపోయే మనం వీరి నుంచి తెలుసు కోవలసింది చాలా ఉంది.

Total Pageviews