Wednesday, August 27, 2014

పెద్దలమాట చద్దిమూట!!!


మహా గణాధిపతి మహాత్మ్యం ..నిరాడంబరత గణపతి తత్త్వం.

మహా గణాధిపతి మహాత్మ్యం ..నిరాడంబరత గణపతి తత్త్వం.
పెద్ద తల --- విజ్ఞతతో ఎక్కువగా ఆలోచించు
చిన్ని కళ్ళు --- నిశితంగా, ఏకాగ్రతతో మంచిని గ్రహించు
పెద్ద చెవులు --- శ్రద్ధగా మంచిని మాత్రమే విను
చిన్ని నోరు --- హితముగా, మితముగా మాట్లాడు, తిను (పెద్ద బొజ్జ కలిగి ఉన్నా)
ఉద్యోగం --- ఇతరుల పనులు ఆటంకం కలగకుండా పూర్తి అయ్యేలా చూడటం
ఎలుక వాహనం --- నిరాడంబరత్వం, కాలుష్య రహితం
తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేసి విశ్వ ప్రదక్షిణ పూర్తి చెయ్యటం --- సూక్ష్మంలో మోక్షం
ఫల, పుష్ప, గరిక, పత్రి లతో మట్టి ప్రతిమల తో పూజ --- పర్యావరణాన్ని పూజించు, పరిరక్షించు.

ఆ గణపతి యొక్క నిరాడంబరత పర్యావరణ స్పృహతో మట్టి వినాయకుని పూజిద్దాం.ఆ మహా గణపతి ఆశీర్వాదం పొందుదాము.!!!

శుభోదయం.


Sunday, August 24, 2014

శివదర్శనం సర్వ పాప హరణం !


పెద్దలమాట చద్దిమూట!!!


శుభోదయం!!!


గోవుల్ని, గోపురాల్నిపరిరక్షించండి!! సత్యసాయి విస్సా ఫౌండేషన్

 గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్(GHHF) సేవ్ టెంపుల్స్ .ఆర్గ్ USA, డా.ఘజల్ శ్రీనివాస్ గారు, ప్రకాష్ రావు గారు వంటి ఎందఱో మహానుభావుల సారధ్యంలో గోవుల, ఆలయాల పరిరక్షణ ధ్యేయంగా  అంతర్జాతీయ లఘు చలన మహాయజ్ఞం లో నేను సైతం పాల్గొనడం, సన్మానం అందుకోవడం, నా స్పందన తెలియచేయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను, మూడు రోజులుగా 40 చిత్రాలు శ్రీ ప్రసాద్ ప్రివ్యు దియేటర్ వేదికగా ప్రదర్సించబడటం, ఈరోజు కొన్నింటిని చూడటం ఎందఱో మహానుభావులను కలుసుకోవడం ఒక మరపురాని అనుభూతి. మారిషస్ సంజీవ గారి 'అయం దేవాలయః' ఒక ఉత్తమ చిత్రంగా శ్రీశ్రీ శ్రీ శ్రీ శ్రీ  చిన జియ్యర్ స్వామి వారి కరకమలాల ద్వారా స్వర్ణ గోవు పురస్కారం అందుకొనడం ఒక అదృష్టం.. ఇవిగో కొన్ని చిత్రాలు
యు ట్యూబ్ లో ఈ షార్ట్ ఫిల్మ్లు లు చూడవచ్చు ..చూడండి!! ...స్పందించండి!! ...గోవుల్ని, గోపురాల్నిపరిరక్షించండి!!               సత్యసాయి విస్సా ఫౌండేషన్. 








ఇవిగో కొన్నియు ట్యూబ్ లో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్లు లు మా ఫౌండేషన్ విస్సా లింక్ మీద క్లిక్ చేసి కూడా  చూడవచ్చు ..చూడండి!! ...స్పందించండి!! ...గోవుల్ని, గోపురాల్నిపరిరక్షించండి!!    సత్యసాయి విస్సా ఫౌండేషన్. 
Play List Link
Individual YouTube Links
Ch V Ramana “Sri Vishnu PanchayatanaDivyamahaKshetram” – Savetemples Short Film Festival 2014
Sanjiva Narasimha Appadoo “Protection of Cows in Mauritius” – Savetemples Short Film Festival 2014
Sanjiva Narasimha Appadoo “Ayam Devaalayah” – Savetemples Short Film Festival 2014
NoozillaSuribabu “Ambaa” – Savetemples Short Film Festival 2014 
HJS “HinduokeMandirokiSurakshakaMahatva” – Savetemples Short Film Festival 2014
Bhanu Prakash “DevaalyaRakshane-Sanatana Dharma Rakshana” – Savetemples Short Film Festival 2014
Isha Foundation “Temples – Consecrated Spaces for Well Being” – Savetemples Short Film Festival 2014
Changamma Charitable Trust “Duties of Priest” by Renuka G – Savetemples Short Film Festival 2014
INTAC, Kadapa “Aalaya PariRakshana Sanatana DharamaRakshna”-Savetemples Short Film Festival 2014 
A Babartist Studio “DevaalayaPrarirakshana” by Sateesh BP – Savetemples Short Film Festival 2014
SubhapradhaChithraMaalika “Jeevanadhaaralu” by Chowdhary BA – Savetemples Short Film Festival 2014
V Ramachandran “Salvaging Divinity” – Savetemples Short Film Festival 2014
Television Program Company “Temple Treat” by MatiurRahman – Savetemples Short Film Festival 2014
Rishi JeevanSamaj “Vande Gou Mataram” – Savetemples Short Film Festival 2014
Shareeff Media House “Jai Gowmatha” by Shareff Mohamed – Savetemples Short Film Festival 2014
Ramaneeyam Movies “IntiKanna Gudi Padhilam” by J V R Murthy – Savetemples Short Film Festival 2014 
H Productions “Nidarshanam” by Hanumantha Rao Uppe – Savetemples Short Film Festival 2014
Icon Production “SilpaVilaapam” by Sai Srivasthava K – Savetemples Short Film Festival 2014 
Shiva Manjari Creations “Shankara” by ManjulaSooroju – Savetemples Short Film Festival 2014
Srikoormam Films “Deva Devam” by K Laxmi Prasanth – Savetemples Short Film Festival 2014
Bhasker Hanuman Creations “Velugu” by P Sai Dasaradhi – Savetemples Short Film Festival 2014
Alka Media “Nidhi” by A LohitKumar – Savetemples Short Film Festival 2014
Alka Media “Viluva” by A LohitKumar – Savetemples Short Film Festival 2014
Maruthi Movie Makers “NadicheDevaalayam” by K Rudra – Savetemples Short Film Festival 2014
Geetha Krishna Entertainments “Sankalpam” – ParameswaraSarma-Savetemples Short Film Festival 2014
BalakrishnaArchakam “Devaalayam” – Savetemples Short Film Festival 2014
All Time Entertainers “Vighatham” by K Kranthi Kumar – Savetemples Short Film Festival 2014 
Cool Creatives “Maa” by Meera N SK – Savetemples Short Film Festival 2014
Cine Style Videos “Gopuram” ShashankRamanujapuram – Savetemples Short Film Festival 2014
NruthyaDarpana Presents “Nrityaarchana”-M Venkateswara Rao – Savetemples Short Film Festival 2014
Dileep Kumar Kandula “Vedaalayam” – Savetemples Short Film Festival 2014
AVN Flower Flow Films “DehameDevaalayam” by A Naga Seshu – Savetemples Short Film Festival 2014
Mahalakshmi Films “PunahPratista” by P Lakshmi Ganesh – Savetemples Short Film Festival 2014
Tejo Film & TV Institute “VaaranikiOkkaRoju” – Y Durga Prasad-Savetemples Short Film Festival 2014
Bhavyasri Productions “JeevanaVedham” by Rajashekar Babu V – Savetemples Short Film Festival 2014
K S R Murthy “Mana Devaalayaalu” – Savetemples Short Film Festival 2014 
Lucky Enterprises “Revolution” by Gopi Krishna – Savetemples Short Film Festival 2014 
Vaishnavi Creations “Gopraasastyam” by Vaddepalli Krishna – Savetemples Short Film Festival 2014
GVS Srinivas “Devaalayam” – Savetemples Short Film Festival 2014
Moral Productions “Aatma the Soul” by KottapaliSeetaram – Savetemples Short Film Festival 2014
JR Films “A Aa Lu” Directed by Krishna Prasad Ganta – Savetemples Short Film Festival 2014 

Friday, August 15, 2014

పగటివేష కళాకారులు




పగటివేష కళాకారులకు రంగస్థలంతో పనిలేదు. పాత్రోచితము, రసోచితము, ప్రాంతీయోచితమైన వేషభాషలతో, నృత్య గానాలతో పట్టపగలు వేషాలు వేసుకుని హావ భావ నటనలు చిలికిస్తూ, రాగ, మేళ, తాళాలతో, పండిత పామరులను మెప్పించడం పగటివేష కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు ఊరూరా తిరుగుతూ పౌరాణిక జానపద పాత్రలు పోషిస్తువుంటారు ఇదిగో ఈ  కళాకారుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి పాత్రలో ఎలా జీవిస్తున్నారో చూడండి. వీరి వివరాలు వారి మాటల్లోనే చూడండి ఈ కార్డులో కూడా ఉన్నాయి. సత్యసాయి విస్సాఫౌండేషన్.

Wednesday, August 13, 2014

భర్తృహరి నీతి శతకము 

తెలియని   మనుజుని   సుఖముగ
దెలుపందగు,  సుఖతరముగ దెలుపంగవచ్చున్
దెలిసినవానిం,   దెలిసియుం 
దెలియని  నరుం దెల్ప   బ్రహ్మదేవుని  వశమే.

భావం :-  తెలియని వారికి సులభంగా తెలియజేయవచ్చు. తెలిసిన వారికి ఇంకా సులభంగా తెలియచేయవచ్చు. కాని  తెలిసింది  కోచేమే అయినా సర్వజ్ఞుడనని  భావించే వ్యక్తిని  బ్రహ్మదేవుడు కూడా రంజింప జేయ జాలడు.    

పెద్దలమాట చద్దిమూట !!!!!


శుభోదయం.


Monday, August 11, 2014

విస్సా పీఠం (ఫౌండేషన్) ఆవిర్భావ సభ


విస్సా పీఠం (ఫౌండేషన్) ఆవిర్భావ సభ "సంగితమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏక మాపాతమధురం అన్యదాలోచనామృతం" అన్నట్లుగా ఆ సంగీతం సాహిత్యం మా పూర్వీకుల వారసత్వ సంపద, మా వంతు భాధ్యత గా ఆ సంపదను పెంచుకుని పదిమందితో పంచుకోవాలన్న సదాశయంతో, మా పూజ్యజనకులు కీ!!శే.శ్రీ విస్సా వెంకట సత్య వర ప్రసాదరావు గారి పేరిట 'కళా వర ప్రసాద పురస్కారం' నెలకొల్పడం జరిగింది. మా విస్సా ఫౌండేషన్ ఆశయాల కు అనుగుణంగా విశేష ప్రతిభ కలిగిన చిన్నారులను ప్రోత్సహించడం మరియు పెద్దలను సముచిత రీతిన బిరుదు సత్కారాలతో సన్మానించడం జరుగుతుంది.స్వగ్రామం పినపళ్ళ లోను, ఆయుధ కర్మాగార నివాసప్రాంతం లోనూ వివిధ కార్యక్రమాలను చెయ్యటం జరిగింది.... ఆవిర్భావ సభ వీడియోలు మీకోసం! 

Total Pageviews