Wednesday, October 31, 2018

నవంబర్ 1 వ తేదీ, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రమే కాదు. తెలుగు వారికంటూ, తెలుగు భాషకంటూ గుర్తింపు తెచ్చిన రోజు

నవంబర్ 1 వ తేదీ, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రమే కాదు. తెలుగు వారికంటూ, తెలుగు భాషకంటూ గుర్తింపు తెచ్చిన రోజు. తెలుగు వారందరికీ చరిత్రాత్మకమైన రోజు. ఉత్తరాది వారు మనల్ని మద్రాసీలు, సాంబారు గాళ్ళు అని గేలి చేసే వారు (ఇప్పటికీ చేస్తూనే ఉంటారు) తెలుగు భాషమాట్లాడే వారందరి కోసం రాష్ట్రం కావాలని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పడడానికి అసువులు బాసిన అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి దేశ రాష్ట్రాల పట్టికలో ఆంధ్ర అనే పదం ఉంటే అరుణాచల్ ప్రదేశ్ కంటే ముందు ఉండి, అగ్రస్థానంలో ఉంటుందని తద్వారా ఎక్కువ గుర్తింపు ప్రయోజనం ఉంటుందని ఎంతో ముందు చూపుతో తమ పదవులను సైతం తృణప్రాయంగా ఆశించిన బూర్గుల రామ కృష్ణా రావు గారి లాంటి ఎందఱో మహనీయులు ఎన్నెన్నో త్యాగాలు చేసారు. రాష్ట్రాలు ఏర్పడవచ్చు విడిపోవచ్చు కానీ వాటి ఏర్పాటుకు కారణ భూతులయిన,మూలపురుషులయిన మహనీయులను స్మరించుకోవడం, వారందరికీ శ్రద్ధాంజలి ఘటించడం ప్రతి ఒక్క తెలుగు వాడి కృతజ్ఞతా పూర్వక కర్తవ్యం! ఈ సందర్భంగా
శ్రీ సామవేదం జానకిరామ శర్మ గారి కవితను నివాళిగా అర్పిద్దాం!
అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
దాన మిచ్చె ధధీచి మౌని యతడు!
యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
శిబి చక్రవర్తి ప్రసిద్దుడతడు!
అది యొక లెక్కయా? యడుగులు మూడుగా
ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల._/i\_

విద్యార్థి, సుఖార్థి కాకూడదు.



సుఖార్థీ చేత్త్యజేద్విద్యాం విద్యార్థీ చేత్త్యజేత్సుఖం 
సుఖార్థినః కుతో విద్యా? సుఖం విద్యార్థినః కుతః?
సుఖం కోరుకుంటే విద్యను వదలాలి. విద్యను కోరుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖాన్ని కాంక్షించేవారికి చదువెక్కడ? విద్యకావాలనుకొనే వారికి సుఖమెక్కడ? అని ఈ శ్లోకానికి భావం.
“శ్రమ ఏవ జయతే” అనే వాక్యం అన్ని రంగాలకూ అన్వయిస్తుంది. ఏ మాత్రమూ శ్రమలేకుండా ఫలాలను ఆశించటం క్షమార్హం కాని నేరం. ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలను పొందలుగుతారు. పూర్వకాలంలో విద్యార్థులందరూ గురుకులవాస క్లిష్టంగా చదివేవారని అనేక గ్రంథాలద్వారా తెలుస్తుంది.
నిజానికి ఇప్పుడంత కష్టం అవసరం లేదు. ఆధునిక కాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ఫలితంగా ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆహ్వానించి, స్వీకరించి,తమవ్యాసంగాన్నిమరింత పటిష్టం చేసుకోవటం అవసరం. ఐతే మౌలికమైన శ్రమను మాత్రం అలక్ష్యం చేయకూడదు.
ఏ సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోగల చిన్న, పెద్ద యంత్రాలు వచ్చాయని సంతోషించాలో, కొందరు పిల్లలు “రెండు రెళ్ళు నాలుగు” అని చెప్పటానికి కూడా “ క్యాలిక్యులేటర్” ఉంటేనేగానీ చెప్పలేక పోతున్నందుకు, వారి ధారణ శక్తి తగ్గుతున్నందుకు ఆందోళనపడాలో తెలియని పరిస్థితులున్నాయి.
కొందరు శ్రమపడి చదవటానికి విముఖులై, పరీక్షల సమయంలో అనూహ్యంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలద్వారా పరీక్షాకేంద్రాలకు బయట ఉండేవారినుంచి సమాధానాలు పొందున్నారు.ఇలా అజ్ఞానం వికసించి, విజ్ఞానం వికటించటం సాంకేతికవిద్యా విజయం కానేరదు.
తల్లిదండ్రులు పిల్లలకు సౌకర్యాలు సమకూర్చటం అవసరమే. కానీ ఆ సౌకర్యాలు పిల్లలను సోమరులుగా, భవిష్యత్తులో ఏ చిన్న కష్టం, ఏ కొద్దిపాటి అసౌకర్యం ఎదురైనా తట్టుకోలేని వారినిగా తయారు చేయకూడదు. కష్టం అనుభవిస్తేనే సుఖం రాణిస్తుంది. కేవల సుఖలాలస జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంది. శ్రమసౌందర్య సాధితమైన విద్య – సమాజం పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది.
చిరంజీవులు విద్యావంతులై, సంస్కారవంతులై అధికారులుగా, దేశాధి నేతలుగా ప్రజలకు సేవచేసి ధన్యులుకావాలంటే, ముందుగా - వారు కష్ట, సుఖాలపట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. వెలుగు లేనిచోట చీకటి ఉంటుంది.కష్టం తెలియనిచోట కఠిన స్వభావమే రాజ్యమేలుతుంది.
కష్టపడి చదవటమే సుఖాన్ని పొందటానికి యోగ్యత. “కష్టపడని వ్యక్తికి అన్నం తినే హక్కు ఉండదు” అన్నారు గాంధీజీ. అందువల్ల కష్టపడి చదువుకోవాలని, దాని వల్ల లభించే సుఖమే ఆదరణీయమని, కష్టపడకుండా విద్యను పొందాలనుకోవటం అవివేకమని గ్రహించాలి.
గౌ.శ్రీ కొంపెల్ల రామకృష్ణమూర్తి గారి ఆణిముత్య వివరణలు 🙏🙏

గోవింద !

గోవింద నామం
గో అనే సంస్కృత పదానికి 9 అర్ధాలు ఉన్నాయి. కొన్నిటిని తెలుసుకుందాం !
వింద అంటే రక్షించేవాడు అని అర్ధం. గో అనే పదానికున్న ఒక అర్ధం వంశం అని..కాబట్టి గోవిందా అంటే మా వంశాన్ని రక్షించే వాడా !అని ప్రార్ధించడం దీనర్థం
అలాగే గో అనే పదానికి మాట అని కూడా అర్థం కాబట్టి గోవిందా అంటే నేను మాట్లాడే మాటని రక్షించే వాడా !అని అర్థం. 
ఏదయినా ఓ మాటని నేను గనుక అంటే ఆ మాట మీద నిలిచే శక్తిని, మాట తప్పని తనాన్ని అనుగ్రహించు అని కోరుకోవడం అన్న మాట !
ఎంత గొప్ప నామం గోవింద !అనేది.
గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద !

యమునోత్రి తీర్థ స్థలం

యమునోత్రి యమునా నది జన్మస్థానం. ఇది

Image may contain: outdoor, water and nature
Image may contain: mountain, sky, outdoor and nature
స్థల పురాణం
యమునోత్రి స్నానఘట్టం
యమునోత్రి స్నానఘట్టం
యమునోత్రి అంటే యమునానది జన్మస్థలము. యమునా నది జన్మించిన ఈ ప్రదేశములో యమునాదేవి ఆలయము ఉంది. ఈ ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం. ప్రస్తుత ఆలయాన్ని జయపూర్ మహారాణి గులారియా 19వశతాబ్ధంలో నిర్మించబడింది.పాత ఆలయం వాతావరణం మరియు ఇతర కారణాల వలన శ్ధిలస్థితికి చేరుకున్న తరువాత జయపూరు రాణిచే ఆలయం పునర్నిర్మించబడింది. కొన్ని చిన్న చిన్న ఆశ్రమాలు మరియు గెస్ట్హౌసులు కాక ఆలయసమీపంలో నివసించడానికి వసతులు తక్కువ. యాత్రీకులు సమీపంలోని రాణిచెట్టి తదితర ప్రాంతాలలో బసచేసి ఆలయానికి చేరి నదీమాతను దర్శించి వెనుతిరుగుతుంటారు. ఇక్కడి ఉష్ణకుండ స్నానం యాత్రీకుల శ్రమాంతర ప్రయాణానికి కొంత సేదతీరుస్తుంది.
యమునా నది పురాణ కథనం
సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం. వారు శని,యముడు మరియు యమున.సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన ఛాయను తన స్థానంలో తన ఛాయను ఉంచి తపమాచరించడానికి వెళ్ళింది. ఛాయాదేవికి సూర్యుని వలన కలిగారు. తరువాత ఛాయాదేవి సంధ్యాదేవి కుమారుల పట్ల కొంత అశ్రద్ధను చూపించసాగింది. ఒక రోజు ఛాయాదేవి తన కుమారులకు ఆహారాన్ని అందించి సంధ్యా దేవి సంతానానికి ఆహారాన్ని అందించడానికి నిరాకరించడంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు. ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడివికా శపించింది.ఇది గమనించిన సూర్యుడు శనిని తల్లిని తన్నిన కారణమడిగాడు,శని చెప్పినది విని సూర్యునికి ఛాయా దేవి మీద సందేహం కలిగి కన్న తల్లివైతే ఇలా చేయవు అసలు నీవెవరు అని ఆమెను నిలదీయగా తను సంధ్యను కానని ఆమెచే నియమించబడిన ఛాయాదేవినని నిజం చెప్పింది. ఈ సంఘటన తరువాత శని యమూడు ఆప్రదేశాన్ని విడిచి పోతారు. యముడు శువునికి సహాయంగా మరణానంతరం ప్రాణులకు పాపం చేసినందుకు దండననిచ్చే నరకాధిపతి అయ్యాడు. దండన ఇవ్వడంలో సమానంగా వ్యవహరిస్తాడని పురాణ కథనం. అన్నదమ్ముల వియోగాన్ని సహించలేక యమున కన్నీరు మున్నీరుగా ఏడ్వగా ఆమెకన్నీరు నదిగా ప్రవహించినట్లు పురాణ కథనం కొన్నిచోట్ల ప్రచారంలో ఉంది.
యమునోత్రి గుడి
యమునోత్రి గుడి ముందుగా యాత్రీకులు స్నానానికి అనువుగా ఉష్ణగుండం ఉంటుంది.యాత్రీకులు ఇక్కడ స్నానాదికాలు సాగించి యమునదేవి దర్శనం చేసుకుంటారు.గర్భ గుడిలో యమునా,సరస్వతి మరియు గంగా మూర్తులు ఉంటాయి.ఇక్కడ దర్శనం తరువాత యాత్రీకులు ఆలయం పక్కన ఉన్న చిన్న ఉష్ణ గుండంలో చిన్న బియ్యం మూటలను దారానికి కట్టి లోపల వదిలి అన్నం తయారు చేసుకుంటారు.దీనిని ప్రసాదంగా స్వీకరించకూడదు.ఇక్కడ నీటిలో ఉండే రసాయనాల కారణంగా ఇది ఆహారానికి పనికి రాదు ఆనీటిలోని వేడిని యాత్రీకులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే అన్నం వండే ప్రక్రియను చేపడతారు. తరువాత యాత్రీకులు నదీమతల్లికి పూజాదికాలు చేసి నదిలోని జలాన్ని తీర్థంగా పాత్రలు,కేనులలో నింపుకుంటారు.నదిలో పూలు,దీపం దోనెలో పెట్టి వదులు తుంటారు.పూజా ద్రవ్యం,దీపాలు సులువుగానే నదీ సమీపంలోను మరియు దుకాణాలలో లభిస్తాయి.
గుడికి చేరే మార్గాలు
యమునోత్రిలో డోలీ
యమునోత్రి ఆలయం చేరడానికి హనుమాన్ చెట్టి జానకి చెట్టి వరకు వ్యానులు వెళతాయి.అక్కడినుండి గుర్రం,డోలీ ,బుట్ట మరియు కాలి నడకన ఆలయం చేరుకోవాలి.డోలీ,గుర్రం,బుట్టలలో తీసుకు వెళ్ళడానికి భారథ ప్రభుత్వం నిర్ణయించిన వెలకు ధనం కట్టి వెళ్ళాలి.అక్కడక్కడ విశ్రాంతి కోసం ఆగినప్పుడు డోలీవాలాలూ గుర్రాలను నడిపే వారు బుట్టలలో గుడికి చేర్చే వాళ్ళ కోరికను అనుసరించి వారికి ఆహార పానీయాల ఖర్చు యాత్రీకు భరించడం ఒక ఆనవాయితీ. ఇక్కడ యాత్రీకులను ఆలయానికి చేర్చే పనిలో ఘడ్వాల్,మరియు బర్గూరు నుండి పనివాళ్ళు వస్తూ ఉంటారు.ఆలయానికి కొంచందూరం నుండి యాత్రీకులు కాలినడకన గుడిని చేరాలి.డోలీ నడిపే వారిలో ఒకరు యాత్రీకులకు తోడుగా వచ్చి దర్శనానికి సహాయం చేస్తారు.వారు తిరిగి యాత్రీకులను డోలీ వరకు తీసుకు వచ్చి బయలుదేరిన ప్రదేశానికి యాత్రీకులను చేరుస్తారు.అక్కడినుండి తిరిగి హనుమాన్ చెట్టి వరకు వ్యానులలోనూ,జీపులలోనూ చేరాలి.ఇవి బాడుగకు సులువుగానే లభిస్తాయి.
.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది.

తెలుగు సౌరభం: పెండ్లి: బృందారకానంద మందార మకరంద

తెలుగు సౌరభం: పెండ్లి: బృందారకానంద మందార మకరంద: పెండ్లి: బృందారకానంద మందార మకరంద           బిందునిష్యందాల విందు పెండ్లి : రంగారు ముంగారు సరసాంత           రంగాల సత్యనర్తనము పెం...

" సంక్రాంతి..! యండమూరి ప్రేమ/ ఆనందో బ్రహ్మ

" సంక్రాంతి..!

భూదేవి కొత్త పెళ్ళికూతురైతే బంతిపూలు
పసుపు! మిరపపంట కుంకుమా!!

అప్పటిదాకా రంకెలు వేసిన చలి, తనే మూడంకెవేసి
డొంకదారి బట్టింది. గెల్చిన రాజులా ఆమని, సర్వాంగ
భూషితయై రావటానికి తయారవుతూంది.

"సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణివ్వావే
తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే.
చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వావే -"

మనసులో అసలు పాట అదికాదట. ఎవరో కవి అన్నాడు

మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వావే...
గుమ్మడి పువ్వంటి కొడుకునివ్వావే.
అదట అసలు కోరిక!

ఊరికి ఇట్నుంచి బుడబుక్కలవాడు డమరుకాన్నీ,
అట్నుంచి జంగందేవర గంటనీ పట్టుకుని
బయల్దేరారు. అన్నాళ్ళూ ఏమయ్యారో గానీ
బాలసంతువాడు, పెద్దమాలవాడు కూడా
దర్శనమిస్తున్నారు. పెద్దెద్దువాడు బక్క చిక్కిన
గంగిరెద్దుకి వీలైనంతలో అలంకరణ చేసి
ఇంటింటిముందూ ఆపి నమస్కారం
చేయిస్తున్నాడు. పక్కూళ్ళో జరిగే పొట్టేళ్ళ పందేనికి
కుర్రకారు అప్పుడే బయల్దేరుతున్నారు.
కోడిపందేలు సరేసరి.

అప్పటికే ఆలస్యమయిపోయిందని తాతయ్య వడివడిగా
నడుస్తున్నాడు. ఆయన కదుల్తూంటే వరణా
తరంగిణీ దరవికస్వర నూత్న కమలకషాయ
గంధము.....ప్రత్యూష పవనాంకురములు
పైకొనువేళ - అన్న ప్రవరాఖ్యవర్ణన గుర్తొస్తుంది.
అయితే ఆయన ప్రస్తుతం భాషాపరశేషభోగి! అందానికి
వారసుడు మాత్రం వెనుక నడుస్తూన్న సోమయాజి.
అతడు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి. ఇంకా
కుర్రవాడు! అలేఖ్య తనూవిలాసుడవటానికి మరి
నాలుగయిదేళ్ళు పడుతుంది. అయినా
అమ్మాయిలు గొబ్బిళ్ళు సర్దే మిషమీద, ముందున్న
ముసలాయన గమనించకుండా వెనుకనున్న ఆ
కుర్రాడిని ఓరగా చూస్తున్నారు.

"ఈ రోజు కూడా బడి వుందిరా?"
"ఉంది తాతయ్యా!"
"సంక్రాంతి పూట బడి ఏమిట్రా?"
"ఈసారి మొదటిస్థానం మాకే రావాలని మావాళ్ళు చాలా
పట్టుదలగా వున్నారు తాతయ్యా అందులోనూ మా
అయ్యవారికి ఈ దేముళ్ళ మీదా, పండగలమీదా నమ్మకం
లేదు" అంటూ ఆయన మొహంలోకి చూశాడు. అయితే
ఆ మోహంలో తిరస్కారం ఏదీ కనపడలేదు.

"తనమీద తాను నమ్మకం పెంచుకున్న మనిషికి
దేముడి అవవరం లేదురా అబ్బీ. అయితే మీ
అయ్యవారు అంత ధీశాలా? లేక పిడివాదంతో తర్కంచేసే
మూర్ఖుడా?"

సోమయాజి తబ్బిబ్భై ఆయనవైపు చూశాడు. నాలుగు
వేదాల్నీ నలిగులిపట్టిన ఈ నలిమేలి దొర ఏ గొప్ప
హేతువాదికీ తీసిపోడు. అలా అని తన నమ్మకాల్తో
అవతలివారిని నొప్పించడు.

ఇంతలో రేవు దగ్గిరపడింది. మోకాలి లోతుకి దిగాడాయన. దోసిలిలోకి తీసుకున్న నీటిలోసూర్యుడు ప్రతిబింబిస్తూ వుండగా అన్నాడు -

"సంక్రాంతిలో విశేషమేమీ లేదురా మకరరాశిలోకి
సూర్యుడు ప్రవేసించటంలోనూ విశేషమేమీ లేదు.
కానీ కాసిని తిండిగింజలకోసం చెట్టుకోక పక్షిగా వెళ్ళిన
కొడుకులూ ఆడపిల్లలయిన ఈడపిల్లలూ, వాళ్ళ
కొడుకులూ అందరూ కలవటంలో విశేషం వుంది.
ఆదిరా పండగంటే! ఒక పండగ వెళ్ళగానే మరో
పండగకోసం ఎదురు చూడటంలో తృప్తి వుంది.
అదే లేకపోతే రోజులు నిస్సారంగా, మనకీ, పశువులకీ
తేడా లేకుండా గడిచిపోతాయి. మనిషి బ్రతుకే ఒక పండగ
అని నిరూపించటం కోసమే పండుగ" అంటూ చెప్పి
ఆయన నీళ్ళలో మునిగాడు"
From AANADOBRAHMA

Sunday, October 21, 2018

నా ఈ చిత్రమైన కధ చదవండి. మీ అభిప్రాయం చెప్పండి











మొన్న శిల్పారామం వెళ్ళాం
అలా చూస్తూ చూస్తూ ఒక రైతు కుటుంబం
ఆ రైతు భార్య శ్రమజీవన సౌందర్యం నన్ను కట్టిపడేసింది
నాకు ఆ శ్రమజీవన సౌందర్య రాశిని ముద్దుపెట్టుకోవాలని అనిపించింది.
కానీ ఎలా అందరూ చూస్తున్నారు.  అంతేకాక  పక్కనే అతని భర్తవున్నాడు
నా భార్య కూడా చూస్తూనే వుంది కానీ నాలో చెలరేగుతున్న భావనలని పసిగట్టలేకపోయింది.
సరే ఏమైనా సరే ఆమెని ముద్దుపెట్టుకోవాలన్న కోరిక బలపడింది. వెంటనే ఆమె బుగ్గపై ముద్దుపెట్టాను.
ఆమె ఈ హఠాత్ పరిణామానికి ఖంగారు పడింది మనసులో ఆనందపడింది. అలాగే ముందుకు వెళితే మరో బంజారా జంట కనిపించింది. ఆ బంజారా యువతి కూడా ఎంతో అందంగా ఉంది. ఇందాకటిలాగానే ఆమె భుజంపై చెయ్యివేసాను ఆమె కూడా ఏమి అనలేదు అందంగా సిగ్గుపడింది. చేసిన తప్పు చెపితే పోతుంది అంటారు కదా అందుకే పబ్లిగ్గా మీ ముందు పెట్టాను.ఇదండీ ఇంతకీ నేను చేసింది తప్పా, ఒప్పా మీరే చెప్పాలి. అప్పటివరకూ నాకు మనశాంతి  లేదు.  మీ సత్యసాయి విస్సా

కథకాదు కాదు వాస్తవం సర్ అందుకే మనసు మనసులో లేదు ఎంటో అలా జరిగిపోయింది 

Saturday, October 20, 2018

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.
.
 .
అవును ఇది ఒక చేదు నిజం ।
.
ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.

వాళ్ళు.....
.

 రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !
నడక అలవాటు ఉన్నవాళ్ళు!
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు !
.

వాళ్ళు.....
.

.
 ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!
మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
 పూజకు పూలు కోసే వాళ్ళు !
.
.వాళ్ళు....
.

పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు !
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !

.

వాళ్ళు
.

 అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !
తోచిన సాయం చేసేవాళ్ళు !
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !
.

వాళ్ళు
.
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!

.
వాళ్ళు

.

పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు !
.

.
వాళ్ళు ....
.
.
తీర్థయాత్రలు చేసేవాళ్ళు !
ఆచారాలు పాటించే వాళ్ళు !
తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !
.
.
వాళ్ళు ....
.
.
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !
లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు !
చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !
.
.
వాళ్ళు ....
.
.
తలకు నూనె రాసుకునే వాళ్ళు !
జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !
.

.

మీకు తెలుసా ?
.

.
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.

.
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.
.

మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి
.

.
.లేదంటే .....
.
.లేదంటే .....
.
.లేదంటే .....
.
ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.
.
.
.వాళ్ళ ప్రపంచం వేరు
.
.

.
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
.

 స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
.

కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
.

ద్వేషం, మోసం లేని జీవనం గడిపిన తరం అది!
.

సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది!
.

లోకానికి భయపడే జీవనం గడిపిన తరం అది !
.

ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!
.

.
.
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది
.
.
.
.
మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి.
.
.
.
సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని  మార్చేయ్యకండి !!!

తప్పులను సరిదిద్దగలది  సంస్కారమే!
.
.

సర్కారు చేసే  చట్టాలు కాదు.

Sunday, October 14, 2018

సాహితీ నందనం: రుబాయీ

సాహితీ నందనం: రుబాయీ: రుబాయీ సాహితీమిత్రులారా! రుబాయీ అంటే అరబ్బీలో నాలుగని అర్థం అలాగే రుబాయీలో నాలుగు పంక్తులుంటాయి. వీటి ఛందస్సు ఉండదని కాదు దా...

Saturday, October 13, 2018

ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణా దేవిగా పూజలు అందుకుంటుంది..

అన్నపూర్ణా దేవి
సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్త పద్మభ్యాం కుష్మాండ శుభదాస్తుమే!!
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ 
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
బిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్నపూర్నేశ్వరీ !!
సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్ఠి పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని పెద్దలు చెపుతారు. అన్నపూర్ణా దేవికి తెల్లని పువ్వులతో పూజ చేయాలి. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి.
Image result for annapurna deviImage result for annapurna devi
Image result for annapurna devi

Thursday, October 11, 2018

గాయత్రీస్తోత్రం

Related imageగాయత్రీస్తోత్రం

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ |
అజరేఽమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || ౧ ||

నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే |
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే || ౨ ||

అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |
Image result for images of gayatri mataనిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే || ౩ ||

త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || ౪ ||

పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః || ౫ ||

రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || ౬ ||

Image result for images of gayatri mataత్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || ౭ ||

త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ || ౮ ||

తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || ౯ ||

చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |
స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || ౧౦ ||

Image result for images of gayatri mataనమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || ౧౧ ||

అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || ౧౨ ||

మూడవరోజు తదియ - చంద్రఘంట రూపం

ఈరోజు నవరాత్రుల్లో మూడవరోజు తదియ - చంద్రఘంట రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది.
పిండజ ప్రవరారూఢా- చండకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతేమహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా|| 
దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరసున అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. నైవేద్యం కొబ్బరి అన్నం.
మనఅందరిపైనా ఆ అమ్మ కరుణ కలిగి ఉండాలని కోరుకొంటున్నాను.
”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”
గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.
Related image1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య
ప్రతిపదార్ధం :
ఓం : ప్రణవనాదం
భూః : భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌
భూవః : రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌
సువః : స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌ ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి.
తత్‌ : ఆ
సవితుర్‌ : సమస్త జగత్తును
వరేణ్యం : వరింపదగిన
భర్గో : అజ్ఞానాంధకారమును తొలగించునట్టి
దేవస్య : స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను
ధీమహి : ధ్యానించుచున్నాను
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి.

ఆది శేషుని ఆశ


శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన ఆదిశేషునికి, తాను ఆ స్వామికి మెత్తటి పరుపులాగా ఉంటూ సేవ చేయడం, అమితమైన సంతోషాన్నికలిగిస్తుంటుంది. ఆయన్ని మోయడం ఆదిశేషునికి ఎప్పుడూ కూడా పెద్ద సమస్య అనిపించలేదు. విష్ణువు అసలు బరువు ఉన్నట్లుగానే అనిపించడు. ఇదిలావుండగా, ఒకరోజున ఆదిశేషునికి, శ్రీమహావిష్ణువు మోయలేనంత బరువుగా అనిపించాడు. “ఎందుకిలా జరుగుతోంది?” అని ఆశ్చర్యచకితుడైన ఆదిశేషుడు, అదే విషయాన్ని గురించి, శ్రీమహావిష్ణువుతో ప్రస్తావించాడు. అది విన్న విష్ణుమూర్తి, “ఆదిశేషా! నిన్న భూలోకానికి వెళ్లాను కదా! అక్కడ ఓ పుణ్య ప్రదేశంలో, శివుడు తాండవనృత్యాన్ని చేయడము చూసాను. త్రినేత్రుడి తాండవ నృత్యాన్ని చూసిన నా మనసు, సంతోషముతో నిండిపోయింది. అందుకే నా శరీరంకూడ బరువెక్కింద” ని, నవ్వుతూ చెప్పాడు. విష్ణువు చెప్పిన సంగతిని విన్న ఆదిశేషుడు మనసులో కూడ, ఓ చిన్న ఆశ మొదలైంది. ఎలాగైనా తాను కూడా శివతాండవ నృత్యాన్ని చూసి తరించాలి. “నేను కూడా ఆ స్వామి తాండవ నృత్యాన్ని చూసే భాగ్యం కలుగుతుందా స్వామి?” అని, తన స్వామిని అభ్యర్దించాడు ఆదిశేషుడు. అప్పుడు విష్ణువు, “ప్రస్తుతం శివ పరమాత్మ తాండవం చేస్తున్నాడు. నువ్విప్పుడు అక్కడకు వెళితే, ఆయన తాండవ నృత్యాన్ని చూసి, ఆనందించవచ్చు” అని చెప్పాడు. చెప్పడమే కాదు, వెంటనే చూసి తరించమని, ఆదిశేషునికి, తన అనుమతిని కూడా, ఇచ్చాడు.
వెంటనే ఆదిశేషుడు, మనిషితల, పాము శరీరముతో కూడిన ఓ చంటిబిడ్డడి రూపాన్ని ధరించి, అత్రిమహర్షి ధర్మపత్నియైన అనసూయాదేవి చేతులలో, పడ్డాడు. మనిషి తల, పాము శరీరంతో కూడిన ఆ బిడ్డని చూడగానే! ఒళ్ళు జలదరించుకున్న అనసూయాదేవి, తనచేతులను గట్టిగా విదిలించి, ఆ బిడ్డడిని దూరంగా విసిరేసింది.
Image result for images of adi seshaకిందపడిన ఆ బిడ్డ, “తల్లీ! భయపడవద్దు, నేను మీ కుమారుడిని. నన్ను మీరే పెంచాలి” అని పలుకుతూ, అనసూయాదేవి పాదాలపై పడటంతో, ఆ బిడ్డని దగ్గరకు తీసుకున్న అనసూయ, ‘పతంజలి’ అని పేరు పెట్టి, పెంచుకోసాగింది.
అలా అత్రి మహాముని ఆశ్రమములో పెరిగిన పజంజలి, సకల శాస్త్ర కోవిదుడైనాడు. శివదేవుడు, చిదంబరములో, ఆనందతాండవం చేస్తుంటాడని తెలుసుకున్న పతంజలి, ఒకరోజున, తన తల్లిదండ్రుల అనుమతితో, శివతాండవాన్ని తిలకించడానికి, బయలుదేరాడు. ఆదిశేషుడు పతంజలి రూపాన్ని ధరించడం వెనుక గల అసలు కారణం ఇదే!
ఆదిశేషుడు వ్యాకరణానికి అధిదేవత. ఆయన ఈ భూలోకానికి, పతంజలి రూపంలో వచ్చాడని తెలుసుకున్న విద్యార్థులు, భూలోకం నలుమూలల నుండి, ఆయన దగ్గర వ్యాకరణం నేర్చుకోడానికి తరలి వచ్చారు. పతంజలికి ధర్మసంకటం! తాను పరమశివుని తాండవనృత్యాన్ని చూసేందుకు వచ్చాడా? లేక ఈ విద్యార్థిలోకానికి, వ్యాకరణ పాఠములు నేర్పేందుకు వచ్చాడా? అయితే, తనను వెదుక్కుంటూ వచ్చిన విద్యార్థులకు, తగిన విద్యను బోధించడం, గురువు యొక్క విద్యుక్తధర్మం. కానీ, విద్యార్థులకు పాఠాలు చెబుతూ, తన అమూల్యమైన కాలాన్ని ఖర్చు చేయలేడు. ఆ మరుక్షణమే, పతంజలి మనసులోని ఓ ఆలోచన. ఆదిశేషుని అంశమైన తనకు, వేయితలలు కదా! కాబట్టి తన వేయి తలలతో, ఒకేసారి, వెయ్యిమంది విద్యార్థులకు, పాఠాలను చెప్పొచ్చు. అయితే తను వేయితలలతో, కొలువు దీరి, ఊపిరి పీలుస్తూ వదిలితే, అప్పుడు విడుదలయ్యే విషవాయువు వలన, విద్యార్థులు దగ్ధమైపోయే అవకాశం ఉంది.
Image result for images of adi seshaఅందుకనే, తను పాఠాలు చెబుతున్నపుడు, తనకు ఆ విద్యార్థులకు మధ్య, ఓ తెరను కట్టమన్నాడు. అలా తాను తెరవెనుక ఉండి , వేయి మంది విద్యార్థులకు పాఠాలను చెప్పసాగాడు పతంజలి. పాఠాలు చెప్పేముందు, తన విద్యార్థులకు రెండు నిబంధనలు విధించాడు పతంజలి. పాఠం చెబుతున్నప్పుడు, ఎవ్వరూ కదలకూడదనేది మొదటి నిబంధన. అలా కదలి బయటకు వెళ్ళే విద్యార్థి, బ్రహ్మ రాక్షసునిగా మారిపోయి, నాలుగు రహదారుల కూడలిలో నున్న చెట్లకు దెయ్యాల్లా తల్లక్రిందులుగా వ్రేలాడతారన్నది, రెండవ నిబంధన. పతంజలి అలా నిబంధనలను విధించడం వెనుక, ఓ అంతరార్థం ఉంది. అధ్యాపకులు పాఠం చెబుతున్నపుడు, విద్యార్థులు మధ్యలో లేచి! బయటకు వెళితే, పాఠాలు సరిగా, వారి బుర్రలకెక్కవు. ఫలితంగా ఆ విద్యార్థుల భవిష్యత్తు, చెట్లకు తలక్రిందులుగా వ్రేలాడుతున్న దెయ్యాలవలె, మారుతుందన్నది, పతంజలి చెబుతున్న నిత్యసత్యం. ఇక రెండవ నిబంధన ప్రకారం, పతంజలి, పాఠాన్ని చెబుతున్నపుడు, ఏ ఒక్క విద్యార్థి, పతంజలితో మాట్లాడాలన్న కోరికతో, తెరను తొలగించి, లోపలకు తొంగి చూడకూడదు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి అలా చేస్తే, ఆ విద్యార్థితోపాటు, మిగతా విద్యార్థులు కూడా భస్మమైపోతారు.
అలా తన విద్యార్థులకు నిబంధనలను విధించిన ఆదిశేషుని అంశమైన పతంజలి, వేయితలలతో వ్యాకరణ పాఠాలను చెప్పసాగాడు. ఎంతో కష్టతరమైన వ్యాకరణాన్ని, ఇంత సులభశైలిలో అర్థమయ్యేటట్లు చెబుతోన్న తమ గురువు , వేయి శిరస్సులతో కూడిన పతంజలిని చూడాలన్న కోరిక, కొంతమంది విద్యార్థుల మనసులలో మొలకెత్తి, మెల్లమెల్లగా బలపడసాగింది. కొంతసేపటికి తనలోని ఉద్వేగానికి అడ్డుకట్ట వేయలేకపోయిన ఓ విద్యార్థి, తెరను తొలగించి చూసాడు. అంతే! ఆ మరుక్షణంలోతెర తొలగించిన విద్యార్థితో పాటూ, అక్కడున్న విధ్యార్థులంతా, కాలి బూడిడైపోయారు. ఒక విద్యార్థి చేసిన దుందుడుకు చర్య వల్ల, మిగితా విద్యార్థులంతా, మాడి మసైపోవడం, పతంజలిని, ఎంతగానో బాధించింది. ఒక్కడు మిగలకుండా, అందరూ చనిపోయారే అని, పతంజలి దుఃఖితుడౌతున్న సందర్భంలో, అక్కడొక విద్యార్థి ప్రత్యక్షమయ్యాడు. పతంజలి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదెలా సాధ్యం?!
అందరూ మాడి , మసైపోయిన తరువాత, ఈ విద్యార్థి ఎలా బ్రతికి బట్టకట్టాడు? పతంజలి పాదాలపై పడిన ఆ విద్యార్థి, “గురువర్యా! మీ దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చిన వెయ్యిమంది విద్యార్థులలో నేనూ ఒకడిని. నేను గౌడదేశం (వంగదేశం – బెంగాల్) నుంచి వచ్చాను. మీరు చెప్పిన వ్యాకరణపాఠాలు, ఏమాత్రం నా బుర్రకెక్కకపోవడంతో, మధ్యలో లేచి బయటకివెళ్లాను. నన్ను మన్నించండి” అని చెప్పాడు. ఆ విద్యార్థి మాటలను విని, సంతోషించిన పతంజలి, “శిష్యా! బాధపడవద్దు. నీకు అర్థమయ్యే విధంగానే, వ్యాకరణ పాఠాలను బోధిస్తాను” అని చెప్పి, అలాగే ఆ విద్యార్థిని, వ్యాకరణంలో నిష్ణాతునిగా చేసాడు.
అలా పతంజలి శిష్యరికం చేసి, వ్యాకరణ పండితునిగా ప్రఖ్యాతిగాంచిన విద్యార్ధియే, ఆదిశంకరుని గురువైన గౌడపాదుడు. గౌడదేశానికి చెందిన వాడైనందున, అతన్ని గౌడపాదుడు అన్నారు. పతంజలి విధించిన నిబంధనను మీరినందువల్ల, గౌడపాదుడు, చెట్టుకు తలక్రిందులుగా వ్రేలాడే దెయ్యంగా, మారిపోయాడు. మరలా పతంజలియే, గోవిందభగవత్పాదునిగా అవతరించి, గౌడపాదుని శాపవిముక్తునిగా చేసాడని ‘శంకరవిజయం’ కథనం.
అనంతరం పతంజలి, తాను చూడాలనుకున్న శివ తాండవాన్ని, తనివితీరా దర్శించుకున్నాడు. వ్యాకరణ శాస్త్రం, యోగశాస్త్రం, వైద్యశాస్త్రాలకు సంబంధించిన పలు గ్రంథాలను రచించిన పతంజలి, మనస్సు, వాక్కు, శరీర ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రాలను, మానవాళికి అందించి, ఎంతో మహోపకారాన్ని చేసాడు. నాడు, తన దేవుడు విష్ణువు చూసి ఆనందించిన శివతాండవమును, తాను కూడా చూడాలన్న, ఆదిశేషుని ఆశ తీరింది.

త్రిపురసుందర్యష్టకం

త్రిపురసుందర్యష్టకం
Image result for bala tripura sundariకదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్
నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౧ ||
కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౨ ||
కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా || ౩ ||
Related imageకదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్
విడంబితజపారుచిం వికచచంద్ర చూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౪ ||
Related imageకుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే || ౫ ||
స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలామ్
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౬ ||
Image result for bala tripura sundariసకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికామ్ || ౭ ||
పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతామ్
ముకుందరమణీ మణీ లసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ || ౮ ||

No automatic alt text available.

మందారం (Hibiscus)


No automatic alt text available.No automatic alt text available.No automatic alt text available.స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.పువ్వులలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక అందమైన పుష్పం మందార లేదా మందారం (Hibiscus) ఒక అందమైన పువ్వుల చెట్టు. మందారం మలేషియా దేశపు జాతీయ పుష్పం.దేవతల పూజలోను...తలలో అలంకారం గాను వాడతారు.మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు. మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. ఇందులో రేఖమందారం, ముద్దమందారం ,ఎరుపు, తెలుపు,పసుపు,ఆరంజ్, చాలా రంగులు ఉన్నాయి. దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. ఇందులో విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.ఈ మొక్క నుంచి నూనె తీస్తారు.మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది.మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందాన్ని, మెరుపుని ఇస్తుంది.ఈ నూనెతో చుండ్రును నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గతమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.No automatic alt text available.

కేశాలు తెల్లబడకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది.అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉందేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. కేశాలు తొందరగా తెల్ల బడకుండా చూస్తుంది. చర్మం నునుపుగ ఉండేలా చూస్తుంది.చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది.స్నానానికి వెల్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది.పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది.పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ చేస్తే తొందరగా తగ్గుముఖం పడతాయి..మనకు ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ మందార ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.

Total Pageviews