Thursday, October 11, 2018

మూడవరోజు తదియ - చంద్రఘంట రూపం

ఈరోజు నవరాత్రుల్లో మూడవరోజు తదియ - చంద్రఘంట రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది.
పిండజ ప్రవరారూఢా- చండకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతేమహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా|| 
దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరసున అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. నైవేద్యం కొబ్బరి అన్నం.
మనఅందరిపైనా ఆ అమ్మ కరుణ కలిగి ఉండాలని కోరుకొంటున్నాను.
”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”
గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.
Related image1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య
ప్రతిపదార్ధం :
ఓం : ప్రణవనాదం
భూః : భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌
భూవః : రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌
సువః : స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌ ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి.
తత్‌ : ఆ
సవితుర్‌ : సమస్త జగత్తును
వరేణ్యం : వరింపదగిన
భర్గో : అజ్ఞానాంధకారమును తొలగించునట్టి
దేవస్య : స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను
ధీమహి : ధ్యానించుచున్నాను
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి.

No comments:

Post a Comment

Total Pageviews