*చెట్టు, పిట్ట కథ.అందులో నీతి*
అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు.
ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట తనకూ తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని, మొదటి చెట్టు దగ్గరకు వెళ్లి అడిగింది, "వర్షా కాలం వస్తోంది.నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద *గూడుకట్టుకోనా?"అంది*
*"వద్దు"*అనేసింది మొదటి చెట్టు.పిట్ట చిన్న బుచ్చుకుంది.
నిరాశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహాయం కోసం వేడుకుంది. *సరే*"అంది రెండో చెట్టు. మహదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలు పెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది.
*పిట్ట, పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది*
ఈలోగా వర్షాకాలం వచ్చేసింది.
అంతలో పెద్ద వర్షం. వర్షం పెద్దదైంది. వరద రావడం మొదలైంది. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్ళతో సహా కూలి పోయి, నీటిలో కొట్టుకుని పోతోంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ, *భగవంతుడు నీకు శిక్ష వేసాడు. నాకు సహాయం చేయడానికి*నిరాకరించావుగా అంది నవ్వుతూ...... నేను బలహీనమైనదానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకుని పోతానని కూడా తెలుసు. *నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకు పోకూడదనే, నువ్వు గూడు కట్టు కునేందుకు నిరాకరించాను నేను* నన్ను క్షమించు. నువ్వు పది కాలాలు సుఖంగా ఉండు", అంది ఆనందంగా. *ఆ చిన్న పిట్ట చిన్ని గుండెలో సముద్రమంత ఆవేదన*. నీతి:ఎవరైనా నిరాకరిస్తే వారిని *తప్పుగా అర్థం చేసు కోవద్దు వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది*ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది.

No comments:
Post a Comment