Monday, August 31, 2015

తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ సందర్భాల్లో విస్సా ఫౌండేషన్ కార్యక్రమాలు! పురస్కారాలు! సన్మానాలు! సత్కారాలు! కొన్ని జ్ఞాపకాల…ఆ అనుభూతులు మీకోసం! -

              మా పూజ్య జనకులు స్వర్గీయ విస్సా వేంకట సూర్య సత్య వర ప్రసాద రావు గారి పుణ్య తిధి 04/08/2015 నాడు మా విస్సా ఫౌండేషన్ ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వర్గీయ అబ్దుల్ కలాం గారి స్పూర్తితో.. అతిథి తెలుగు ఉపాధ్యాయుడుగా  వీలైనన్నిపాఠశాలలు సందర్శించి బాల బాలికల యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేలా, భాషా సంప్రదాయాల పట్ల మక్కువ కలిగించేందుకు సంస్కృతి శ్లోకాలు, తెలుగు పద్యాలూ, కవితలు గేయాలపై వారికి అభిరుచి పెంచి, అవగాహన కల్పించేందుకు అనేకానేక శతకాల నుంచి ఆణిముత్యాలు ఏర్చి కూర్చి పిల్లలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని ముందుగా పినపళ్ళలో శ్రీ సాయి ప్రాధమికొన్నత పాఠశాల, మరియు 5 తేదిన పెదపళ్ళ లో శ్రీ లక్ష్మీ పబ్లిక్ స్కూల్ లో దిగ్విజయంగా నిర్వహించి పిల్లలతో గడపడం ఎంతో ఆనందాన్ని కలిగించింది..గతంలో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ సందర్భాల్లో విస్సా ఫౌండేషన్ కార్యక్రమాలు! పురస్కారాలు! సన్మానాలు! సత్కారాలు! కొన్ని జ్ఞాపకాల అనుభూతులు మీకోసం! ---  సత్య సాయి - విస్సా ఫౌండేషన్.                                        

తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లోవివిధ సందర్భాల్లో విస్సా ఫౌండేషన్ కార్యక్రమాలు! పురస్కారాలుసన్మానాలుసత్కారాలు!

 ప్రముఖులతో… సన్మానాలు

శ్రీ శ్రీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ఎప్పటి లాగానే అత్యంత భక్తి శ్రద్దలతో మా ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో శ్రీ రామాలయంలో ఈరోజు సోమవారం అనగా 31-08-2015 తేదీన ఉదయం 10:00 గంటలనుండి మొదలయి 12.30 నిముషాలవరకు పూజా కార్యక్రమం పూర్తయి 12.30 నిముషాల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఆ పూజా చిత్రాలు మీ అందరికోసం.

ఓం శ్రీ పూజ్యాయ రాఘవేంద్రాయ 
సత్య ధర్మరతాయచ |
భజతాం కల్పవృక్షాయ 
నమతాంకామధేనవే ||
శ్రీ శ్రీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ఎప్పటి లాగానే అత్యంత భక్తి శ్రద్దలతో మా ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో శ్రీ రామాలయంలో ఈరోజు సోమవారం అనగా 31-08-2015 తేదీన ఉదయం 10:00 గంటలనుండి మొదలయి 12.30 నిముషాలవరకు పూజా కార్యక్రమం పూర్తయి 12.30 నిముషాల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఆ పూజా చిత్రాలు మీ అందరికోసం. 

Sunday, August 30, 2015

వట్టి మాటలు కట్టిపెట్టి...తెలుగు కు గట్టిమేల్ తలపెట్టండోయ్!!

చూద్దాం! వీరు మాట ఎంత నిలబెట్టుకుంటారో...లేకుంటే నిలదీద్దాం!! 
తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా... 
వంకర ఏంకర్ల సంకర భాష 
తల్లితండ్రుల నిరాదరణ 
సమాజంలో పెరుగుతున్నవిదేశీ వ్యామోహం 
బోధనా పరిపాలనా భాషగా అమలులో పాలకుల నిర్లక్ష్యం
తాజాగా ప్రభుత్వ చదువులమ్మ ఒడిలో నుంచి తెలుగుతల్లి జారిపోయింది! 
ఆంగ్లమాధ్యమ చదువలమ్మే బడులలో తెలుగుదనం దోషిగా నిర్ణయమయింది!!
పిల్లలకు తెలుగుదనపు రుచి.... తెలియని తనం... వెరసి 
కర్ణుని చావుకి కారణాలు అనేకం అన్నట్లుగా ...మన 
అమృతభాష... మాతృభాష... మృతభాషగా మారి పోయేందుకు దోహదపడుతున్నాయి 
చాప క్రింద నీరులా చల్లగా భాష కనుమరుగు అయిపోతోంది! 
భాష నిర్వీర్యం అయితే జాతి నిర్వీర్యమైనట్లే...
వెన్నెముక లేని పరాన్న జీవులుగా మనం మిగిలి పోకముందే....
మన ఉనికి నిలుపుకుందాం! మన మనికి
తెలుగు సమాధి మీద కాకుండా 
ఆంగ్లాన్ని ఆదరిద్దాం!...వరాల తెలుగును గౌరవిద్దాం!!
తెలుగు పునాదిపై మన ఆశల ఆంగ్ల భవనాలు నిర్మిద్దాం!
తెలుగు వారిగా తలెత్తుకు సగర్వంగా జీవిద్దాం!
గిడుగు వారి జన్మదినాన! మాతృభాషా పుణ్య దినాన! 
గురజాడ గిడుగు అడుగుజాడల్లో....నడిచే ప్రయత్నం ప్రతిజ్ఞ చేద్దాం!! 
తెలుగుతేజం తో విశ్వంలో వెలుగులు నింపుదాం!!
జై తెలుగు తల్లి! జై జై తెలంగాణా తల్లి!! ...సత్యసాయి విస్సా ఫౌండేషన్!

Saturday, August 29, 2015

తెలుగుతేజం తో విశ్వంలో వెలుగులు నింపుదాం!!

 ఈ లంకె నొక్కండి!! తెలుగు తల్లి పై కవిత నా కవిత చూడండి!!  
https://www.youtube.com/watch?v=oygIK_wqjuU

తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా... 
వంకర ఏంకర్ల సంకర భాష  
తల్లితండ్రుల నిరాదరణ 
సమాజంలో పెరుగుతున్నవిదేశీ వ్యామోహం 
బోధనా పరిపాలనా భాషగా అమలులో పాలకుల నిర్లక్ష్యం
తాజాగా ప్రభుత్వ చదువులమ్మ ఒడిలో నుంచి తెలుగుతల్లి జారిపోయింది!   
ఆంగ్లమాధ్యమ చదువలమ్మే బడులలో తెలుగుదనం దోషిగా నిర్ణయమయింది!!
పిల్లలకు తెలుగుదనపు రుచి.... తెలియని తనం... వెరసి 
కర్ణుని చావుకి కారణాలు అనేకం అన్నట్లుగా ...మన 
అమృతభాష... మాతృభాష... మృతభాషగా మారి పోయేందుకు దోహదపడుతున్నాయి 
చాప క్రింద నీరులా చల్లగా భాష కనుమరుగు అయిపోతోంది! 
భాష నిర్వీర్యం అయితే జాతి నిర్వీర్యమైనట్లే...
వెన్నెముక లేని పరాన్న జీవులుగా మనం మిగిలి పోకముందే....
మన ఉనికి నిలుపుకుందాం! మన మనికి
తెలుగు సమాధి మీద కాకుండా 
ఆంగ్లాన్ని ఆదరిద్దాం!...వరాల తెలుగును గౌరవిద్దాం!!
తెలుగు పునాదిపై మన ఆశల ఆంగ్ల భవనాలు నిర్మిద్దాం!
తెలుగు వారిగా తలెత్తుకు సగర్వంగా జీవిద్దాం!
గిడుగు వారి జన్మదినాన! మాతృభాషా పుణ్య దినాన! 
గురజాడ గిడుగు అడుగుజాడల్లో....నడిచే ప్రయత్నం ప్రతిజ్ఞ చేద్దాం!! తరఫున 
తెలుగుతేజం తో విశ్వంలో వెలుగులు నింపుదాం!!
జై తెలుగు తల్లి! జై జై తెలంగాణా తల్లి!! ...సత్యసాయి విస్సా ఫౌండేషన్!  
https://www.youtube.com/watch?v=oygIK_wqjuU

కవితా సాహితి

నీటి గడియారం
నువ్వు ఎక్కడలచుకొన్న రైలు 
ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు 
ఏళ్ళూ పూళ్ళూ నిరీక్షించలేక 

ఎక్కేస్తావేదో ఒక బండీ . 
నీ ఆదర్శాల లగేజీ 
ఎక్సేసంటాడు టీ. ఐ .సీ 
నీ ఈప్సితాల ట్రంకుపెట్లు 
కలలబ్రేకులో పారేయాలి . 
నువ్వు తెచ్చుకొన్నవన్నీ ఎక్కించీలోపున 
కదిలిపోతుంది బండీ .
అందుకే అందులో కొన్ని 
నీ అభిమాన హీరోలదగ్గిరేవదిలెయ్యి . 
నువ్వు వెళ్ళదలచుకొన్న ఊరు
నువ్వుబతికుండగా చేరదారైలు 
దేవుడా !ఇంత చేశావా అని 
ఉన్న ఊళ్ళోనే ఉండు

ఆరుద్ర
-----------------------------
తెలుగమ్మా వెలుగమ్మా
దాశరధి,
తెలుగమ్మా తెలుగమ్మా

అలనాటి మహాంధ్ర వైభవాగ్నులు మాలో
వెలింగింప జేయవమ్మా!
నలు చెరగుల తెలుగు ప్రజ హనమ్ముగ బ్రతుకన్

ఓరుగల్లు పురాన ఉదయించి గగనమ్ము 
ప్రాకిన తెల్గు పతాక నీవు 
విద్యానగరమందు విప్పారి వెల్గిన 
సాహితి చంద్రమశ్శకల నీవు 
ఇక్ష్వాకు రాజు ఇలవేలుపై నంది 
కొండ వీటి సెనంగు దండి 
వీరుల భుజ దండమ్ము దూకిన చండి నీవు

పోతనామాత్యు భాగబతాది మధుర 
గీతికలలోన పలికిన కీరమీవు 
కవి కలమ్మున గళమున చవులు నింపు 
స్వామినీ కవితా సరస్వతివి నీవు

నీవు లేకున్నచో నేనేడ? జగమేడ?
దారి లేనట్టి యెడారిగాక 
నీవు రాకున్న చో భావ మంజరులేడ? 
శిశిర జర్జర వన శ్రేణి గాక నీవు లేకున్నచో నిత్య యౌవన మేడ? 
వార్దక బ్రష్ట జీవనము గాక 
నీవు రాకున్నచో నింగి తారకలేడ? 
గాడాంధకార మేఘములె గాక 
అఖిల సారస్వతోద్యానమందు పొగడ
పువ్వులటు గుమ్మనెడు నిన్ను పొగడ తరమె
రమ్ము నారసనా నృత్య రంగమందు 
నర్తనము చెయవమ్మ ఆంద్ర జనయిత్రి!

రక్త కాంచన తరువ్ర తతి శారద వేళ
పూవులతో పొంగి పోయినట్లు 
శశి కాంత పాషాణ చయము వెన్నెలలోన 
కరిగి నీరైకాల్వగట్టి నట్లు 
చంద్ర బాహు ద్వయ సాంద్రోప గూహమ్య 
కల్హారమునకు పుల్కలిడినట్లు
రాజ హంసీ గురుద్ర చిత బాల తరంగ 
రంగ వల్లి నీట పొంగినట్లు

నిన్ను తలచిన యపుడెల్ల నన్ను నేను 
మరచి పోదును వింత సంబరము తోడ 
తెలుగు టిల్లెప్పుడొకటిగా వెల్లుగునట్లు 
వరము లీ వమ్మ ఆంధ్ర సౌ భాగ్య ల క్ష్మి

ద్వేషాగ్ని యార, పీయూష ధారలు వార 
పద్యాల కొన్నింటి పాడదలతు 
కాటిన్యములు దండి, కరుణమ్ము పెంపొంద 
పదముల కొన్నిటిని వాడవలతు
వినమెల్లడుల్లగా రసముప్పతిల్లగా 
వివిధ భావముల కల్పించనెంతు 
అసహనమ్ముల ద్రుంచ ఐకమత్యము పెంచ 
నిర్మల స్నేహమ్ము నించదలతు

ఎన్ని కోట్లైన నేమి నీ కన్న బిడ్డ 
రెక్కడింది ననేమి వారొక్కటియని 
ఐక్య కంఠమ్ముగా పల్కునట్లు సేయ 
కవిత చెప్పెదనమ్మ బంగారు తల్లి.

శ్రీ దాశరధి

Thursday, August 27, 2015

మిత్రులందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు.

యాసా పద్మాసనస్థా విపుల కటి తటీ పద్మపత్రాయతాక్షి
గంభీరావర్త నాభి:స్తన భరనిమితా శుభ్రవస్త్రోత్తరీయా 
లక్ష్మీర్దివైర్గజేంద్రై: మణిగనఖచితై స్నాపితాహేమ కుంభై:
నిత్యం సాపద్మహస్తామమవసతుగృహే సర్వమాంగళ్య యుక్తాః!!

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి 
విశ్వప్రియే  విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయిసన్నిధత్స్వ
పద్మాసనే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మ సంభవే
త్వంమాం భజసి పద్మాక్షి యేన సౌఖ్యం లభామ్యహం!!

వరాలను...శుభాలను...సిరి,సంపదలను...సౌఖ్యాలను ఇచ్చే లక్ష్మి * వరలక్ష్మి దేవి * ఆ తల్లి అనుగ్రహం మన అందరిపైనా ఎల్లవేళలా కురియాలని కోరుకొంటున్నాను.

                                 మిత్రులందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు. 

Wednesday, August 26, 2015

పెద్దలమాట చద్దిమూట!!

పెద్దలమాట చద్దిమూట!!

నైపుణ్యం మన పనితనాన్ని తెలుపుతుంది.
ప్రేరణ మనం ఏమి చేయగలమో తెలుపుతుంది 
వైఖరి మనం ఎంతబాగా పని చేయగలమో తెలుపుతుంది.

Total Pageviews