మిత్రులందరికీ శుభాభినందనలు! మిమ్మల్ని మా కోనసీమకి తీసుకువెల్దామను కుంటున్నాను. మీరు సిద్ధమేనా?.... ఏమి ఖర్చుకాదు నేనే తీసుకువెళ్తాను. మీరు చెయ్యాల్సిందల్లా ప్రతిక్షణం అనుభూతిని మనసునిండా నింపుకోవాలి. రైలు ప్రయాణం గోదావరి బ్రిడ్జ్ మీదనుండి తీసుకువెళతాను. వెళుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి గోదావరి నదీమ తల్లి ఒడిలో చిన్న దీవిలా ఏర్పడింది.. అందులో కొంతమంది నివసించడం వాళ్ళని చూస్తే నాకు ఎంతో అసూయగా వుంటుంది ఎంతో స్వచ్చంగా కృత్రిమ వాతావరణానికి దూరంగా గోదారమ్మ వడిలో ఆ జీవనం అనుభవిస్తేనే తెలుస్తుంది... అదిగో మళ్ళీ గోదావరి పరవళ్ళు అదిగో నదీ తీరం. రాజమహేంద్రానికి వరం....అక్కడ నుంచి మా ఊరి ప్రయాణం. అదిగో కాలవలు అదిగో పచ్చని చేలు పచ్చని చేల వెనుక లీలగా కనిపిస్తున్నది మా ఊరు....సరే తిరుగుప్రయాణంలో మరి గోదావరి నిత్య హారతి చూసి వెళ్దాము సరేనా? మీరు ఎప్పుడంటే అప్పుడు. ఎన్ని సార్లంటే అన్నిసార్లు తనివి తీరా తిలకించండి! పులకించండి! సందర్శించండి! పరవశించండి!! సత్యసాయి - విస్సా ఫౌండేషన్.
నాతొ ప్రయాణానికి సిద్ధమయితే మరెందుకు ఆలస్యం మీరు సిద్ధంగా ఉంటే ఈ లింక్ నొక్కండి!!!
నాతొ ప్రయాణానికి సిద్ధమయితే మరెందుకు ఆలస్యం మీరు సిద్ధంగా ఉంటే ఈ లింక్ నొక్కండి!!!
No comments:
Post a Comment