Tuesday, August 18, 2015

నాగ పంచమి శుభాకాంక్షలు.

                                          నాగ పంచమి శుభాకాంక్షలు.

ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు.
నాగ పంచమి రోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుంటారు. తర్వాత తలంటుకుని, నిత్యపూజ పూర్తి చేస్తారు.ఆపైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు పెడతారు. గంధం చిలకరిస్తారు. దీపం, అగరొత్తులు వెలిగించి, అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ అయిదు నాగ దేవతలనూ మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరిస్తారు.
పాలు, పండ్లు, పంచామృతం, నువ్వులు, కొర్రలు, పంచామృతం మొదలైన వాటిని నాగ దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు.
             విషాణి తస్య నశ్యంతి న టాం హింసంతి పన్నగాః
             న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్!!
అనే మంత్రాన్ని స్మరిస్తూ పుట్టలో పాలు పోయాలి.


No comments:

Post a Comment

Total Pageviews