Monday, February 28, 2022

"స్కైలాబ్" తగిన ప్రచారానికి నోచుకోని ఒక చక్కని సినిమా

 ఒక చక్కని సినిమా ఇది ప్రచారం లేదు  

4 డిసెంబర్ 2021 తేదీన విడుదలైన స్కైలాబ్ సినిమా ఎంతమంది చూసారు. 1979లో స్కైలాబ్ నేలమీద పడబోతోందన్న వార్త ఇతివృత్తంగా ఆ నేపథ్యంలో ఒక తెలంగాణా పల్లెటూరి నేపధ్యంగా అల్లిన ఈ చిత్రం లో  సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, నారాయణరావు, తులసి, సుబ్బరాయ శర్మ, తదితరులు నటించిన ఈ సినిమా 

1979లో స్కైలాబ్ ఊరి మీద పడుతుందని అప్పట్లో ప్రతి ఊళ్లోనూ కలకలం ఏర్పడిన సంగతి అప్పటి వారికి తెలుసు. 

ఎలాగూ పొతాము అనే తెగింపుతో చాలామంది ఆస్తులమ్మేసుకోవడం, దానాలు చేసేయడం, రకరకాల తీరని కోర్కెలు తీర్చేసుకోవడం, ఎవర్నైనా తిట్టాలనుకుంటే భయాన్ని పక్కనబెట్టి తిట్టేయడం, పెరట్లో ఉన్న కోళ్లని మేకల్ని కోసుకు తినేయడం, రైతులు పొలం పనులకు వెళ్లకపోవడం, చాలమంది తాగి పొడుకోవడం లాంటివి చేసారు. 

చివరికి స్కైలాబ్ సముద్రంలో పడడంతో కధ సుఖాంతం అయింది. సరదాగా నడుస్తుంది. నటీనటుల హవభావాలు, నెపధ్య సంగీతం కెమెరా పనితీరు, ఆర్ట్ వర్క్ లాంటి సాంకేతిక విలువలు బాగున్నాయి  1979 నాటి కాలాన్నిపునఃసృష్టించడం కళా దర్శకుని ప్రతిభ కు నిదర్శనం. ఈ చిత్రం ఒక ఆర్ట్ సినిమాలా అలరిస్తుంది. 

మీ కోసం ఈ లింక్‌ ఇస్తున్నాను. https://www.youtube.com/watch?v=CFj76ZnB-5Q   చూడండి! ప్రచారం మనం కల్పిద్దాం! మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్‌ 



Sunday, February 13, 2022

ఇకనుంచైనా నీటి వనరులను, ప్రేమాభిమానాలను పదికాలాలు కాపాడుకుందాం!

 ఇకనుంచైనా నీటి వనరులను, ప్రేమాభిమానాలను పదికాలాలు కాపాడుకుందాం!

జల్లూరు బావి పన్నీటి జల్లు స్నానం!
చినుకులా రాలిన నీటి చుక్క నదులుగా వాగులై వరదలై కడలి లో కలిసే
ఆ మహా ప్రస్థానంలో అలా అలా, కాలువలై సాగి సాగి, కాస్త ఆగి ఆగి, ఊరిలో చెరువులై కూసింత సేద తీరి మానవ నాగరికతకు జీవం పోసిన "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి" అంటూ సంకల్పం చెప్పుకునే నీటిపై మానవాళి కృతజ్నత క్రమంగా కనుమరుగై స్వచ్చమైన నీరు కాస్తా మురుగుగా మారిపోతొంది. తాగునీటి, సాగునీటి కాలువలు అడుగంటి
మురుగునీటి కాలువలు నిత్యం పెరుగుతున్నాయి. ఆనాటి ఇంటింటా నీటి వనరుగా విలసిల్లిన బావి, నుయ్యి అని పిలవబడే
ఈ వనరు ఓ అందమైన జ్నాపకంగా మారింది. ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది.అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు. ఆ సాంప్రదాయ కొనసాగుతున్న అరుదైన ఇళ్లల్లో మా పెద్దమ్మ గారి ఊరు జల్లూరు పుణ్యక్షేత్రాలు అటు పిఠాపురం ఇటు సామర్లకోట కు మధ్యలో వుంది. పూర్వం జైనలూరుగా ప్రసిధ్ది చెందిన ఈ ఊరులో కూచిమంచి వారు బహుమంచి వారు కరణీకం ప్రధాన వృత్తిగా, ధర్మం ప్రధాన ప్రవృత్తిగా విలసిల్లిన ఆ అపురూప సాంప్రదాయాన్నిఈ తరం వరకూ అదే ఆప్యాయత, ఆదరణ, అభిమానం, ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఈనాటికీ అడుగంటని ఈ తియ్యటి కొబ్బరి నీటి బావి లాగే సజీవంగా వున్నాయి. తరచు ఆ జల్లూరు పన్నీటి జల్లుల్లో ఇలా నా శారీరిక, మానసిక మాలిన్యాన్ని శుభ్ర పరచుకోవడం కోసం ఉవ్వీళ్ళూరుతాను.
పూర్వం కాలువలు, చెరువులు నుంచి కావిళ్ళతో, ఇంట్లో నూతినుంచి ఇలా చేదతో ఓపికతో తోడుకున్న వాడికి తోడుకున్నంత మహదేవా అన్నట్లుగా అవసరానికి మాత్రమే వాడేవారు. ఇప్పుడు చెరువులు పూడ్చి, ఇళ్ళు కట్టి, గొట్టపు బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును మోటారు పంపు ద్వారా వ్యవసాయంలో అటు సాగునీటికి ఇళ్లల్లో కూడా తాగునీటికి విరివిగా వినియోగించడం వల్ల మోటర్లతో తోడి, టాంకుల్లో సంపుల్లో నింపి నిత్యం ఎంతో వృధాగా సింకుల్లో ఇంకిస్తున్నాం. బావులు రకాలు
దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో బావిగిలక నిర్మించబడి ఉంటుంది.
ఇకనుంచైనా నీటి వనరులను, ప్రేమాభిమానాలను పదికాలాలు కాపాడుకుందాం!

Total Pageviews