Saturday, March 30, 2019

ఎండాకాలం.. మండేకాలం.. వచ్చేసింది నలభై ఏళ్ల వెనక్కి.చాలా హాయిగా కూడా వున్నాము. కనీసం ఫాన్లు కూడా వుండేవి కావు.

హుష్షురష్షునిపించే ఎండాకాలం.. మండేకాలం.. వచ్చేసింది. ఉదయం నుండే ఏసీలూ.. కూలర్లూ.. బయ్యిబయ్యిమని తిరిగేస్తూవుంటాయి. ఫంక్షన్ హాళ్ళూ.. షాపింగ్ మాల్సూ.. అన్నీ ఏసీలే.. ప్రయాణాలు కూడా ఏసీ బళ్ళలోనే.. ఏంటో.. అవిలేందే వుండలేని పరిస్థితి ఇప్పుడు.. వీపున కట్టుకునే ఏసీ మిషన్లు కూడా వచ్చేస్తాయేమో త్వరలో..

               అలా ఓ ముఫ్ఫై, నలభై, ఏభై ఏళ్ల వెనక్కి.. ఓసారి వెళ్ళొద్దాం.. ఇప్పుడు మనం అలవాటు పడిపోయిన ఈ సౌకర్యాలన్నీ అప్పుడేవీ? అయినా శుభ్రంగా బానేవున్నాము. చాలా హాయిగా కూడా వున్నాము. ఒకానొకచోట కనీసం ఫాన్లు కూడా వుండేవి కావు. అయినా హాయిగా వుండేవాళ్ళం..

            ఓ సారి గుర్తు చేసుకోండి ఆరోజులు. పెరట్లో ఏ వేప చెట్టు కిందో.. కొబ్బరి చెట్టు కిందో.. ఏ నులక మంచమో.. లేకపోతే మడతమంచమో వాల్చుకుని. నడుం వాల్చిన రోజులు ఎంత బావుండేవో.. ఇప్పుడు ఆ ఏసీలు వేసుకుని..  తలుపులు బిడాయించుకుని.. బయట ఎవడు కాలింగ్ బెల్ కొడుతున్నాడో వినపడక.. ఏసీ చల్లదనానికీ వణికి.. ఆనక వచ్చే కరెంటుబిల్లుకీ కూడా వణికే రోజులు ఇవి.

           ఇహ.. సాయంత్రం అయేసరికి వాకిట్లో చల్లటి నీళ్లు వత్తుగా చల్లి.. వరుసగా నవారు  మంచాలు, మడతమంచాలు పెద్దలకి .. కిందన పరుపులు, పాతచీరలతో కుట్టిన మెత్తని బొంతలు.. పిల్లలు, ఆడవాళ్లు.. వేసుకుని... ఏడింటికల్లా భోజనాలు ముగించేసి.. ఈ పక్కల మీదకి చేరేవారు. పిల్లలంతా.. ఏ బామ్మగారి చుట్టూ చేరితే.. ఆవిడ చెప్పే కధలు వింటూనో.. లేదా పైన కనపడే ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతూ.. తలా కాసిని వాటాలు వేసుకుంటూనే.. పక్కన చెట్ల నుంచి వీచే చిరుగాలికి నెమ్మదిగా నిద్రలోకి జారుకునేవారు.

     పెద్దలకైతే తమ లోకాభిరామాయణాలు తమకి వుండనే వుంటాయి. మంచాల కింద మట్టి కూజాలలో నీళ్లు నింపుకుని.. మధ్య మధ్యలో గాలి స్ధంభిస్తే తమకి, పిల్లల కి విసరడానికి తాటాకు విసనకర్రలు కూడా పక్కనే పెట్టుకునేవారు. ఎక్కడా దోమలు అనే మాటే లేదు. ఎంత బావుండేవి ఆ రోజులు.

          ఎప్పుడైనా ఈ ఎండాకాలం
రాత్రుళ్లు ముసురు పట్టి.. చిన్న జల్లు పడ్డాకూడా లేవడానికి బద్దకం.. ఆ.. ఇదేం వానలే. పడదులే.. మనల్ని లేపడానికే వచ్చింది.. మనం లోపలకి వెళ్ళగానే తగ్గిపోతుంది.. ఈ చినుకులని లెక్క చేయకూడదనుకుంటూ.. దుప్పటి ని నిండా ముసుగేసుకున్నా కూడా.. ఆ వాన అంతకన్నా మొండిది.. మనం లేచేదాకా సూదుల్లాంటి చినుకులతో పొడిచి, పొడిచి.. ఇంట్లోకి తరిమేది. కాస్త తెరిపివ్వగానే.. మనమూ.. మన బొంతా తిరిగి తయారమేవాళ్ళం బయటకి రావడానికి. ఆ మట్టివాసన ఎంత బావుండేదో.. పీలుస్తూ.. మళ్లీ గాఢనిద్ర లోకి జారుకునేవాళ్ళం.

       ఉదయమే... తెల్లారిందోయ్.. లేవండోయ్  అంటూ.. సూరిబాబు గారి సూది చురుకులూ... కొక్కొరోకో కూతలూ.. పేడనీళ్ళ కళ్ళాపి వాసనలూ.. చుయ్ చుయ్ అంటూ పాలపొదుగుల నుంచి పాలుపిండేటప్పుడు  వచ్చే  శబ్దాలూ.. వీటన్నితో పాటు.. లేవరా వెధవాయ్ అనే పెద్దల  అష్తోత్తరాలతో.. బద్ధకంగా వళ్ళు విరుచుకుంటూ లేచే ఉదయాలూ..

         అబ్బే.. ఇప్పుడెక్కడా లేవు.. కాగడా వేసి వెతికినా.. అంజనం వేసి చూసినా కానరావు..

      ఏవీ? ఇప్పుడేవీ? ఆ అనుభూతులూ.. అనుభవాలూ.. అర్ధరాత్రి దాకా.. టీవీలూ, ఫోన్లూ.. ఏసీ లతో బంధించిన గదులు.. లోపలిగాలి బయటకిపోక..బయటగాలి లోపలకి రాక.. మట్టివాసన స్థానే .. రూమ్ స్ప్రే లు కొట్టుకుంటూ.. ఏదో బతికేస్తున్నాం హుష్షురష్షు అనుకుంటూ.. ఇలా అందమైన, గతాలను తలుచుకుంటూ.. అంతేగా.. అంతేగా..

తెలుగు సౌరభం: పెండ్లి: బృందారకానంద మందార మకరంద

తెలుగు సౌరభం: పెండ్లి: బృందారకానంద మందార మకరంద: పెండ్లి: బృందారకానంద మందార మకరంద           బిందునిష్యందాల విందు పెండ్లి : రంగారు ముంగారు సరసాంత           రంగాల సత్యనర్తనము పెం...

Thursday, March 21, 2019

విస్సా వారి కుటుంబం గురించి ఆ గ్రామ ప్రముఖులు సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళాప్రియుడు, పర్యాటకుడు, "యాత్ర ప్రియారత్న" శ్రీ కొత్తపల్లి సూర్యానారాయణ గారి స్పందన: ముఖపుస్తక మాధ్యమం 20-03-2019

  • Suryanarayana Kothapalli ప.గో.జి.లో మిలటరీ మాధవరం అనేవూళ్ఱో ఇంటికిఒక్క రన్నా మిలటరీ లోచేరినవారుంటారట తూ.గో.జీ.లో ఆలమూరు మండలం లోని పినపళ్ళ గ్రామం లోఉదేమిలటరీ కి చెందిన ఆర్డినెన్స్ ఫేక్టరీల్లో ఒకే కుటుంబా నికిచెందిన ముగ్గురు ఉెద్యోగం చేస్తూ తమసేవలందించారు వారిలో ప్రస్తుతం ఫేస్ బుక్ లోతరచు విలువైన వివేకవంతమైన పోస్టులు పెడుతూఅందరినీ అలరిస్తున్న శ్రీ.సత్యసాయివిస్సా ఒకరు విదుషీమణి ...శ్రీమతి.విస్సా నాగమణి గారు వీరి సతీమణియే.వీరు కూడ తమ భావ ఝరిని నిరంతరం ఫేస్బుక్ లో వితరణ చేస్తూండటం వీక్ష కులుఎరిగినదే...| విషయంలోకి వస్తాను...సత్యసాయి గారి చిన్నాన్నగారైన...విస్సా రాధాకృష్ణ గారు జబల్ పూరు ఆయుధ కర్మాగారం లో ఉన్నతో ద్యోగం చేసి రిటైరై కూడ మిలటరీ పటిమ తో అడ్వకేట్ గాప్రాక్టీస్ చేస్తున్నారు. మరో చిన్నాన్నగారైన విస్సా సీతారామ్ గారు కూడ తిరు
  • Suryanarayana Kothapalli జబల్పూరు ఆయుధకర్మాగారాల్లో ఉద్యోగంచేశారు. విస్సా వారికుటుంబం లో ఉపాధ్యాయవృత్తిలో మూడు తరాల వారున్నారు.పాతతరం లో శ్రీ.ప్రసాదరావుగారు వీధిన వెళుతూ వుంటే సామాన్యులు మాన్యులు పూజ్యభావం తో అంజలి ఘటించే వారట.వారి కుమారుడు శ్రీ.వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యాయ వృత్తి కి వన్నెతెచ్చారు. వీరికి సంగీతంఅదనపు అలంకారం.వీరి కుమారుడు శ్రీ.ప్రసాదరావుగారు ఉపాధ్యాయ వృత్తి తోబాటుహోమియో వైద్యం సప్త తాళ తరంగాల భజన బుర్రకధ లుచెప్పడం లోవిశేషమైన పేరు గడించారు. వీరితనయుడుశ్రీ.వెంకట్ వృత్తుల్లో కెల్లఆకర్ష నీయమైన మేటి ఉపాధ్యాయ వృత్తిలో నేసౌఖ్యంగాసగౌరవంగా సేవలందిస్తు న్నారు.
  • Suryanarayana Kothapalli అంతేకాదు...విస్సా వారివంశంలో సంగతసాహిత్యాలతో బాటు కవిత్వం కూడ అనువంశికంగా వస్తూనే వుంది.పెద్దాయన ...సత్యసాయి గారి పెదతాత గారైన వేంకటరావుగారు సహజకవి సరళ కవి శ్రీవెంకటేశ్వర శతకం వ్రాశారు. ద్రాక్ష పాకం కంటె సుళువైన కలఖండ పాకం శైలి లో.వీరిప్రత్యేకతలు....అజాతశతృవు ..మృదు మధుర భాషి...డబ్బంటేఎవరికిచేదు..జనాంతిక ప్రశ్న....ఈ మహాత్మునికి చేదే....బీరువాల్లోని జేబుల్లోని రొంటిన వున్న డబ్బునిఘడియకోసారి తడిమి చూసు కుంటూ దాచుకునో ఖర్చుపెడుతూనో ఝంఝాటంలో సతమత మయ్యేరోజుల్లోఈయన....exemtion....| ఇదే వంశం లో ఇదిగో...ఈ మన సత్యసాయి గారుమరో కవి..| దేవులపల్లి లా భావకవి ..చిన్నయసూరిలా వచనకవి
  • Suryanarayana Kothapalli అన్నట్లు....నన్నయ్య ఇంట్లో మరో కవిలేడు...ఎఱ్ఱన...తిక్కన...పోతన...మొదలైనపూర్వ కవులు....శ్రీ.శ్రీ. ఆరుద్ర ఆత్రేయ మొలైనఆధునిక కవులు కూడ ఈ వరస లోని వారే.....| ..సాయిగార్కి మహా సహస్రావధాని ఫుంబావ సరస్వతి నడయాడే విగ్జ్నానసర్వ స్వం అసూయా గ్రస్తులు నివురు గప్పిన నిప్పు మద్బులు చాటు వచ్చిన మధ్యందిన మార్తాండుడు ఐన మాడుగులనాగఫణి శర్మగారుసన్నిహితులు ఇష్టదైవం లాంటివారు.ఇృగువ కట్టిన వస్త్రంకు మల్లెలుమోసుక వచ్చిన లేలేత అరిటాకు కుఆయావాసనలు అంటకుండాఉండవు గదా ,...|ఆ మహా పండితుని సాహచర్యం వృధా కాలేదు ఈయన గ్రహణ శక్తి మేరకు అబ్బింది. షరతులు వర్తిస్తాయన్నట్లు సృగీతం గానం అదనపు యోగ్యతలు....|

Wednesday, March 20, 2019

హిందూ ఒక మతం కాదు ....భారతీయుల జీవన విధానం హిందూ ధర్మం సనాతనమైనది

విదేశీయుడు: స్వామి క్రిస్టియానిటీ స్థాపకులు ఎవరు?

స్వామి చిన్మయానంద: జీసస్

విదేశీయుడు: ఇస్లాం స్థాపకుడు ఎవరు?

స్వామి చిన్మయానంద: మహమ్మద్

విదేశీయుడు: హిందూ మత స్థాపకులు ఎవరు?

స్వామి చిన్మయానంద: సమాధానం ఇవ్వలేదు. మౌనంగా వుండిపోయారు.

విదేశీయుడు: అదేమిటి స్వామి మీ మతానికి స్థాపకులంటూ ఎవ్వరూ లేరా?

స్వామి చిన్మయానంద: హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు జీవన విధానం, ధర్మం., ఎందుకంటే ఇది వ్యక్తుల నుండి వచ్చిన జ్ఙ్ఞానం కాదు. నీవు అడిగినటువంటిదే నేను అడుగుతాను. సమాధానం చెప్పగలవా. కెమిస్ట్రీ స్థాపకులు ఎవరు, జువాలజీ స్థాపకులు ఎవరు? దీనికి నీ వద్ద ఖచ్చితమైన సమాధానం వుందా? వుండదు. అలాగునే ఈ సనాతన హిందూ ధర్మం కూడా ఎంతో మంది సైంటిస్టుల పరిశోధనల ఫలితమే. ఆ పరిశోధకులే మన ఋషులు, మునులు.

విదేశీయుడు: అపరాధభావంతో మిన్నకుండిపోయాడు.

స్వామి చిన్మయానంద: నువ్వు ఒక క్రిస్టియన్ ని అడిగితే బైబిల్ ఇస్తాడు. ఒక ముసల్మాను సోదరున్ని అడిగితే ఖురాన్ ఇస్తాడు. అదే హిందువుని అడిగితే తన గ్రంధాలయానికి ఆహ్వానిస్తాడు.
ఎందుకంటే ఇక్కడ వున్నది మితం కాదు… అనంతం…
హిందూ ఒక మతం కాదు ....భారతీయుల జీవన విధానం
హిందూ ధర్మం సనాతనమైనది
🙏🙏🙏

*ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ *కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ అబ్రహాం లింకన్* టీచర్ కి రాసిన లేఖ. ~~~~~~~~~~~~~~~~~~~~~~

*ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ ఒకనాటి *అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్* టీచర్ కి రాసిన లేఖ.
~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇది ప్రతి తల్లికి, తండ్రికి, టీచర్ కు, విద్యార్ధికి చేరాల్సిన లేఖ.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ప్రముఖ అనువాదకురాలు శ్రీమతి శాంత సుందరిగారు లేఖను తెలుగులోకి అనువదించి మనకు అందించారు.
************************************
" మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు.కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది.
అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.
ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు.
ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకిరావచ్చు.
అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా?
*ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని* నేర్పండి.
అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి.
ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ , *జిత్తులమారి రాజకీయ నేత* ఉండే చోటే *అంకితభావంతో పనిచేసే నేత* కూడా ఉంటాడనీ చెప్పండి.
*అప్పనంగా దొరికిన ఒక డాలరు కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని* నేర్పండి.
స్కూల్లో మోసం చేసి గెలవటం కన్నా ఫెయిలవటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి.
*ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం*,.. నేర్పండి.
అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, *కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ* నేర్పండి.
అసూయకు వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.
*వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే* నేర్పండి.కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.
*ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ* నేర్పండి.
పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి.
*అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ, వాటిని తను మట్టుకు గౌరవించటం* నేర్పండి.
*అందరూ దేన్నో అనుసరిస్తున్నా, తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని* మా అబ్బాయికి నేర్పండి.
అందరు చెప్పేదీ వినమనీ, సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి.
*తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని* చెప్పండి కానీ తన హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని నేర్పించండి.
*అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి*.
*ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలనీ,అప్పుడే మానవాళి మీదా దేవుడిమీదా వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ* నేర్పించండి.
మీకు వీలైనంత వరకూ ప్రయత్నించి వాడిని మంచి పిల్లవాడుగా మలచండి.
మీరు మలచ గలరు. ఇది మా నమ్మకం.
Worth letter to every class teacher
Please forward to everyone.

భారతీయ హిందూ వ్యవస్తలో వివాహం సంప్రదాయ పద్దతుల పరమార్ధం

భారతీయ హిందూ వ్యవస్తలో సంప్రదాయ వివాహం (పెళ్లి) ఎంతో గొప్పది. వివాహం జరుగుతున్నప్పుడు బ్రాహ్మణోత్తములు వధూవరులచేత కొన్ని సాంప్రదాయ పద్దతులను ఆచరింప చేస్తారు. అలా ఎందుకు చేస్తారు? వాటి పరమార్ధం ఏమిటి? కాబోయే నూతన వధూవరులు వాటిగురించి సూక్షమంగా తెలుసుకొనుట మంచిది.
పెళ్లంటే నూరేళ్లు.. తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడు ముళ్లు, బంధువుల సందడి ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల కోలాహలంతో.. పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు వధువు, వరుడు.
పవిత్రంగా భావించే హిందూ సంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలున్నాయి. చాలా ఆచారాలు, సందప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం వెలుతులో కొత్తజీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు.. పెళ్లికి పరమార్థం చెప్పే వేదమంత్రాలు.. శ్రావ్యంగా వినిపించే మంగళవాయిద్యాలు.. మనస్పూర్తీగా దీవించే పెద్దలు.. అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి.. ఘుమఘుమల సువాసనలతో నోరూరించే విందు భోజనం.. అన్నింటి మేళవించే.. తెలుగింటి పెళ్లి వైభోగం.
అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయానికి అద్దంపట్టే తెలుగు పెళ్లిలోని విశేషాలు, వాటి విశిష్టతలు ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
బాసికం
బాసికం పెళ్లి అంటే ముందుగా వధూవరుల అలంకరణకు ఖచ్చితంగా ఉపయోగించేది బాసికం. వధూవరుల నుదుటిపై కాంతులీనే ఆభరణమే బాసికం. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. దీన్ని పెళ్లి సమయంలో ఖచ్చితంగా వధూవరులు కట్టుకోవాలి. ఎందుకనే డౌట్ అందరికీ ఉంటుంది. దృషి దోష నివారణకు బాసికాన్ని కడతారు. సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు.
జీలకర్ర, బెల్లం
జీలకర్ర, బెల్లం జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతోంది. జీలకర్ర, బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కూడా కలిసిపోవాలని పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
వధూవరుల మధ్యలో తెర
వధూవరుల మధ్యలో తెర మధ్యలో ఉంచే తెరకు కూడా అర్థం ఉంది. వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు. ఇలా వాళ్ల బంధం బలపడుతుందని అర్థం.
కన్యాదానం
కన్యాదానం దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లికూతురి తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇస్తారు. పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు వధువు తండ్రి. ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు.
బ్రహ్మముడి
బ్రహ్మముడి వధువ చీర అంచును, వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడి వేయటం అంటే జీవితాంతం ఆశీస్సులను, బ్రాహ్మణాశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయటమే. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారు.
ఉంగరాలు తీయటం
పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు.. చుట్టూ ఉన్న వాళ్లందరికీ చాలా సరదా. చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు ఇది. పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది
మంగళ సూత్రం
సూత్రం అంటే దారం. మంగళప్రదమైంది కనుగ మంగళ సూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వరుడు, వధువు మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు.
మూడు ముళ్లే ఎందుకు ?
మనకు మూడుతో విడదీయరాని సంబంధం ఉంది. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలా మూడుకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ముడులు కూడా మూడు ఉన్నాయి. అలాగే మనకు స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా, లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం.
మాంగళ్య ధారణ సమయంలో మంత్రం
మాంగళ్యధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది. మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతమ్. అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగల్యంతో నీవు శత వసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నా జీవితం, నా జీవనగమనం ఈ మాంగళ్యంపైనే ఆధారపడి ఉందని అర్థం.
తలంబ్రాలు
తలంబ్రాలు వివాహంలో ముఖ్య ఘట్టం. వధూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు. అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం. ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు.
పాణిగ్రహణం
కన్యచేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడిచేతిని పట్టుకోవటాన్ని పాణిగ్రహణం అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి, పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయిపైకి ఉండేలా చేయి పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం.
హోమం
పవిత్రమైన అగ్ని మనిషికి, దేవునికి వారధిగా ఉంటుంది. హోమం చుట్టూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడు సార్లు తిరుగుతారు
ఏడు అడుగుల పరమార్థం
భార్యా భర్తలు ఇద్దరు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు.
నల్ల పూసలు ధరించేది ఎందుకు?
మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.
భార్య, భర్తకు ఏ వైపు
ఎలాంటి కార్యాలలోనైనా భర్తకు భార్య ఎడమ వైపునే ఉండాలన్నది నియమం. పూజలు, దానాలు, ధర్మాలు చేసేటప్పుడు భార్య, భర్తకు ఎడమవైపునే ఉండాలి. కన్యాదానం, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడి వైపున ఉండాలి.
కాలితో బియ్యం నెట్టడం ఎందుకు ?
కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో కాలుపెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. లక్ష్మీ నివాసముండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశంను గడపపై ఉంచుతారు. ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లికూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం. ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం.

Monday, March 18, 2019

నాణేలు సేకరించటం పిల్లలకు అలవాటు చేయండి, Venkataramana Paidimarri gari Facebook post numdi

వాజ్ పాయ్ గారి పేర 100 రూపాయల నాణెం

భారత ప్రభుత్వ కలకత్తా, బొంబాయి మింట్ వారు నాణేలు అమ్మకానికి పెట్టారు, ఆసక్తి ఉన్నవారు సేకరించు కోవచ్చు, ధర అధికం, నాణేలు సేకరించే వారికి మంచి అవకాశం. మళ్ళీ చాలా కాలం తరువాత , “శ్రీ జగన్నాధ్ నాబకళేబర 2015” పేరిట 1000 రూపాయల నాణెం విడుదల చేశారు. అలాగే వివిధ అంశాలపై 500, 200, 150, 125, 100 రూపాయల నాణేలు అమ్మకానికి పెట్టారు. వివరాలు వారి వెబ్సైట్లో లభిస్తాయి. ఈ నాణేలు మళ్ళీమళ్ళీ అమ్మరు, అమ్మినప్పుడు కొనుక్కోవాలి. ఇది ఒక పెట్టుబడి లాంటిది, చాలా ఏళ్ళ తరువాత అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ కాయిన్స్ కొనే, అమ్మే షాపులు వుంటాయి, అన్ని నగరాల్లో ఏడాదికి, రెండేళ్ళకు కాయిన్ ప్రదర్శనలు జరుగుతాయి. ఇవాళ ఒక పావలా కాయిన్ కొనాలంటే 50 రూపాయలు అవుతుంది, 5 రూపాయల ఇందిరాగాంధి కాయిన్ కొనాలంటే వందలు, వేలు అవుతుంది. నాణేలు సేకరించటం పిల్లలకు అలవాటు చేయండి, బొమ్మలు వున్న కాయిన్స్ చాలా విలువైనవి, కాయిన్స్ పెట్టుకోటానికి ఆల్బమ్ అమ్ముతారు. ఇప్పటివరకు 1,2,3,5,10,20,25,50 పైసల, 1,2,5,10 రూపాయల నాణేలు, పైగా వాటిల్లో బొమ్మలున్నవి ఎన్నో చూసివుంటాము. ఇవాళ బొమ్మలు వున్న కాయిన్స్ చాలా అరుదుగా లభిస్తున్నాయి. ఇంట్లో చిన్న పిల్లలుంటే ముందుగా ఆంధ్రాబ్యాంక్ లో “కిడ్డిబ్యాంక్” అక్కౌంట్ ఓపెన్ చేయండి, పిల్లలకు పెద్దలకు అదో కాలక్షేపం. నా మటుకు నేను చాలా కాయిన్స్ సేకరించాను. చిల్లర శ్రీమహాలక్ష్మి అని ఊరికే అన్నారా.

Monday, March 4, 2019

ఎవరు నేర్పేరమ్మ మా చిన్ని మల్లె కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మ కూ...

ఎవరు నేర్పేరమ్మ 
మా చిన్ని మల్లె కొమ్మకు 
పూలిమ్మని రెమ్మ రెమ్మ కూ... 
ఇది మా ఇంటి మల్లెల వేళ!
అక్షరాల అల్లరి వేళ!! 
సత్యసాయి విస్సా




జల్లూరు లో మా పెద్దమ్మగారింట జ్ఞాపకాల జలకాలాట

ఏ బ్రహ్మాండాల నుంచి
దొలికి పడ్డాయో నీళ్లు
ఊహలో పట్టని
ఏ వైశాల్యాల గుండా
వీటి చిరంతన ప్రయాణమో
ఏ విశ్వాంతరాళాల
ఆదిమ శబ్ధాలను మోసుకొచ్చాయో'
అంటారు ఆచార్య ఎన్.గోపి జలగీతం కావ్యారంభం చేస్తూ ఇంకా
జలం ఒక సంస్కృతి
జలం ఒక చారిత్రక కృతి
జలం సకల విన్యాసాల ఆవిష్కృతి
భూమికి పురుడు పోసింది
నీటిని కోరటమంటే 
జీవనసారాన్ని కాంక్షించటం
మనిషీ! నీటిని తెలుసుకోవటమంటే
నిన్ను నువ్వు తెలుసుకోవటమే.
చెరువులు బాల్యస్మృతిగా మారటం
ఎంత విషాదం
చెరువుల్ని ఎవరెత్తుకు పోయారు
అంటారు ఆవేదనగా
'కాల ప్రవహానికి
దృశ్యరూపం కదా నది!'
ప్రవహించిన నీరు గతించిన కాలమూ వెనక్కి రావు.
అలాగే ఇలా చెరువుల్లో ఈతలూ,
కాలువలు, బోరింగ్ పంపులు, బావులవద్ద జలకాలు
మన బాల్యస్మృతుల జ్ఞాపకాలు
మరోమారు ఆస్వాదించ గలిగే అవకాశాలు ఎప్పుడూ వదిలిపెట్టకూడదు
మన స్థాయి, అహం అడ్డురాని బాల్యంలోకి వెళ్ళిపోవాలి ఇలా...



నిన్న పిఠాపురం మండలం 
జల్లూరు లో మా పెద్దమ్మగారింట జ్ఞాపకాల జలకాలాట
ముక్తాయింపు
నీరుపల్లమెరుగు అని నమ్మినంత కాలం
ఇంటి పక్క ఇల్లు అలా ఊరు పక్క ఊరు విశ్వమంతా విస్తరించాం!
పైపైకి పారించగలం అన్న నమ్మకం చిక్కాక
ఇంటి పై ఇల్లు అలా బహుళ అంతస్తుల భవనాలు
విశాల ఆధునిక స్నానాల గదులు
ప్రతి నిమిషం మన అవసరాలకు జీవనదుల్ని
డ్రైనేజీ నదులుగా మారుస్తున్నాం
ఒకసారి మన ఇంటి నీటి వాడకం పై ఓ కన్నేద్దాం
వృధాని అరికట్టి వృధానీటిని వీలైనంత తిరిగి వాడుకకు వినియోగిద్దాం
జపాన్ వంటి దేశాలు ఈ దిశగా ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టాయి
అవసరం మేరకే వాడుకుందాం!
వృధా నీరు అవకాశాన్ని బట్టి మొక్కలకు ఇతర అవసరాలకు వినియోగిద్దాం!
భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం...
జల వనరులు వారికీ అందిద్దాం!! 
సత్యసాయి - విస్సా ఫౌండేషన్.

Total Pageviews