Tuesday, January 31, 2017

వసంత పంచమి శుభాకాంక్షలు.

శుభోదయం! వసంత  పంచమి శుభాకాంక్షలు.
ఓం శ్రీ సరస్వత్యై నమః
యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై  నమోనమః !!!!
మాఘమాసంలో వచ్చే వసంత పంచమి దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పంచమి నాడే "సరస్వతీదేవి అమ్మవారు" జన్మించిందట. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ తల్లి. అప్పటి నుండి శ్రీ పంచమి రోజున సరస్వతిఅమ్మవారిని పూజించడం జరుగుతోంది.  ఆధ్యాత్మిక, ధార్మిక చింతన అన్నది రిటైర్మెంట్ అయ్యాక, వయస్సు అయ్యిపోయిన తర్వాత పొందవలిసినది కాదు, చిన్నప్పటి నుండి మనదైన ఘన సంప్రదాయ వారసత్వాన్ని మన పిల్లలకి అందిస్తే వారు ఉత్తమ పౌరులుగా తద్వారా ఉత్తమ సమాజం ఏర్పడేందుకు దోహద పడుతుంది. మనకు రాంకులు రావాలంటే లక్షలు ఖర్చు చేసి పేరుపొందిన కాలేజీలో చేర్చడం కన్నా అత్యంత ముఖ్యమైనది సరస్వతి మాత కటాక్షం, దైవానుగ్రహం ఉంటేనే కాని ఉత్తమ ఫలితాలు రావు. పిల్లలకి చిన్నప్పటి నుండి మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు గురించి తెలియచెప్పడం వాటిని ఆచరించేలా చూడడం మన తల్లి తండ్రుల బాధ్యత, కనీస కర్తవ్యం! శుభం భూయాత్!!

Monday, January 30, 2017

అప్పడాల పిండి తయారు చేయండి

అప్పడాల పిండి - అప్పడాలు:
ఈ వంటకం అందరికీ తెలుసు. మన ఇళ్ళల్లో పెళ్లిళ్లు, వడుగులు వగైరా శుభకార్యాలు అయితే మొదటగా విగ్నేశ్వరుని మీదు కట్టిన తరువాత చేసే మొట్టమొదటి వంటకం. ఇంట్లో వాళ్ళని, పక్క వాళ్ళని పిలిచి ఈరోజు అప్పడాలు వత్తాలమ్మ వచ్చి కాస్త సాయం చేయండి అని పిలిచి ప్రపంచం లో ఉన్న అన్నీ విషయాలు ముచ్చట్లాడుకుంటూ సరదాగా చేసే పిండివంట ఇది. అప్పటి రోజుల్లో ఈ సమావేశం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోయేవి కాదు. మా బామ్మ మా అమ్మ అయితే అప్పడాలు చేసేముంది కొద్దిగా అప్పడాల పిండి చిన్న ఉండలు చేసి అన్నం లోకి వేసుకోడానికి తీసి పెట్టేది. ఈ విషయమే నేను చెప్పేది. ఇది ఎలా తయారు చేయాలో మరి చూద్దామా.
ముందుగా మినపప్పు మిల్లు ఆడించాలి. ఆ మినప పిండిని ఒక కంటైనర్ లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు కావలసినంత మినప పిండిని ఒక చిన్న బేసిన్ లోకి తీసు కోవాలి. అందులో కొద్దిగా అంటే ఒక స్పూన్ మిల్లు ఆడిన పప్పు నుని వేసుకుని సరిపడినంత ఉప్పు వేసి, మిర్చి పొడి తగినంత వేసుకుని, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలపాలి. ఇప్పుడు చపాతీ పిండి కలిపినట్లు కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ ముద్దగా చేసుకోవాలి. ఎక్కువ నీరు పోస్తే పల్చగ అయి పోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఒక స్పూన్ ఉండే టట్లుగ
పోస్తూ ఉండాలి. పప్పు నూనె సరిపోక పోతే మళ్ళా కొద్దిగా తీసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొవాలి. ఈ అప్పడాల పిండి ఉండలు బహు రిచిగా ఉంటాయి. ఉండలు చేసి కొద్ది కొద్ది గా తీసుకుంటూ వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని నంచుకుంటూ తింటే అద్భుతహ: ఇంట్లో పచ్చళ్లు రెడీ గా లేనప్పుడు ఈ ఉండలు చేసుకుని తినచ్చు. పెళ్లి విందులలో ఈ ఉండలు తప్పనిసరిగా మెనూ లో ఒక ఐటెమ్ ఇవాళ రేపు. మరి మీరు కూడా ట్రై చేస్తారా.

పిల్లలను జంగ్ ఫుడ్స్ నుండి దూరం చేయండి.

తెలుగువారి వంటకాలు చాలా గొప్పవి. అన్ని విటమిన్‌లు చాలా సమృద్ధిగా లభించేవి. మీకు నచ్చితే సరదాగా పిల్లలకు చెప్పండి.
పానీపూరి వద్దు
పరమాన్నము ముద్దు.
దమ్ బిర్యాని వద్దు
దద్దోజనం ముద్దు
నూడిల్స్ వద్దు
నువ్వుండలు ముద్దు
కూల్ డ్రింక్స్‌ వద్దు
కొబ్బరిబొండాలు ముద్దు
బర్గర్ లు వద్దు
బూరెలు ముద్దు.
పిజ్జాలు వద్దు
పిండొడియం ముద్దు.
కుర్ కురేలెందుకు దండగ
కమ్మనైన పులిహొరుండగ
తెల్లదనం వద్దు
తెలుగుదనం ముద్దు.
నవ్వండి, నవ్వుతూ విద్యార్థులను జంగ్ ఫుడ్స్ నుండి దూరం చేయండి.
ధన్యవాదాలు.

దయచేసి ఈ కధ చదవండి!

దానం కూడ తాహతను కనిపెట్టి చేయాలట....
ఎవరి తాహత.....
దయచేసి ఈ కధ చదవండి!
ఒకసారి కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీదుల్లో వెళుతున్నారు. వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు.
సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.
మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.
తెల్లారింది...... చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు.
కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వచ్చినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు – అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో.
లేదు అర్జునా....... ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.
దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు.
అతని హృదయం ద్రవించింది.
కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.
నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది…దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు.
అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేల సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు.
ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా........, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని
దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా.........., అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు.
అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.
నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

Tuesday, January 17, 2017

వెలుగుపండగ: అయిదు తంకాలు

వెలుగుపండగ: అయిదు తంకాలు
1.
కోసికుప్పనూర్చిన
పంటపొలాల్లో
హేమంతసంధ్య-
ఏరుకోని పరిగెలాగా 
బంగారు కాంతి.

2.
రాత్రంతా ఎంత
మంచు కురిసిందో
ఒకరాత్రి వేళ లేచిచూస్తే-
తడిసిపోయిన
చందమామ.

3.
నాతో బంధం 
పెనవేసుకున్నవాళ్ళకి
నేనివ్వగలిగేదల్లా-
అడవీ, కొండా
అంచులేని వెన్నెలా.

4.
ఏడాదిపొడుగునా
పీల్చుకున్న ఎండ
పండిన ప్రతి ఆకులోనూ-
హేమంతంలో జెండాకొండ
సూర్యకాంతశిల.

5.
ఈ వెలుగుపండగ
ఒకప్పుడు 
ఆరుబయట జరుపుకునేవారు-
ఇప్పుడు తలుపులు మూసుకుని
టివీలో చూస్తున్నారు.

Monday, January 16, 2017

పద పదవే వయ్యారి గాలిపటమా


పద పదవే వయ్యారి గాలిపటమా 
పద పదవే వయ్యారి గాలిపటమా 
నింగికెగర లేని మేము నిన్ను నింగిలోకి ఎగరేయగలం 
గాలిలోన నువ్వు గిరికీలు 
నేలపైన మా కేరింతలు 
పద పదవే వయ్యారి గాలిపటమా

పద పదవే వయ్యారి గాలిపటమా 
పైన పక్షిలాగ ఎగిరిపోయే పక్కచూపు
చూసుకుంటూ తిరిగెదవే గాలిపటమా
నీలిమబ్బుల్లో ఆడుకుందువేమో
వింత చుక్కల్తో నవ్వుకుందువేమో
వగలాడి జగజంతివిలే
దిగి రాకుండా ఎటులుందువులే
అంబరంనే కాదు అంతరంగంలోనూ 
ఆనంద సంబరమై ఎగరాలి నీవు 

పద పదవే వయ్యారి గాలిపటమా! 






















Tuesday, January 10, 2017

భోగి, సంక్రాంతి, కనుమ..బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సౌజన్యంతో

భోగి, సంక్రాంతి, కనుమ
హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం.
ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల లోని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి.
మొదటి రోజు 'భోగి'. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, భోగి మంటలు వీసి , కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు.
రెండో రోజు 'మకర సంక్రాంతి'. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్తశోభ తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. .
సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సాకినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.
మూడో రోజు 'కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి.
ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు.
ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే "సంక్రాంతి" పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.
సంక్రాంతి రోజులలొ శుభాలనిచ్చే కొన్ని వ్రతాలు :
సంక్రాంతి నెలపట్టాక కన్నెలు , ముత్తయిదువులు ఎన్నోవ్రతాలు , నోములు నోచుకుంటారు . వాటిలో
1 . బొమ్మల నోము :
గతం లో ఆడపిల్లలకు చిన్నవయసు లోనే వివాహము చేసేవారు . వారితో ముక్కనుమ నాడు బొమ్మలనోము పేరిట "సావిత్రి గౌరీదేవి నోము నోయించేవారు . ఈ వ్రతాన్ని వరుసగా తొమ్మిదేళ్ళు చేయాల్సివుంది. దీనివల్ల గృహిణులకు శుభాలు కలుగుతాయని నమ్మకం .
2 . గొబ్బిగౌరీవ్రతం : ఈ వ్రతం భోగి రోజు మొదలవుతుంది . భోగిపండుగనాడు సాయంత్రం నట్టింట్లో ఓ వైపు మండపం కట్టి అలంకరిస్తారు . ఈ కాలము లో దొరికే పండ్లు , కూరగాయలు , చెరకు గడలతొ అలంకరిస్తారు . మండపం మధ్య బియ్యం పోసి నడుమ గౌరీదేవిని ఉంచి పూజలు చేస్తారు . భోగి నుండి నాలుగో రోజు ఉద్వాసన పలికి , మండపం లో అలంకరించిన కూరగాయలఓ కూర వండుకుంటారు . దీన్నేగొబ్బి కూర అంటారు .
3 , గోదాదేవి నోము :
పూర్వము గోదాదేవి ' పూర్వఫల్గుణ నక్షత్రం లో , కర్కాటక లగ్నం లో తులసి వనం లో జన్మించినది . ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణిణ్ణి ఆరాధించినది . ఈమె నెలపెట్టిన రోజు నుండి ధనుర్మాషమంతా ఒక నెలరోజులు వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది . ఈ వ్రతకాలము లో ఆమె గోపికలతో కలిసి పూజించినారు ... మనం ఈ నాడు పెట్టే ఆ గొబ్బెమ్మలే గోపికలు .. జనవాడుకలో గోపీ బొమ్మలే గొబ్బెమ్మలుగా పిలవబడుతున్నాయి .
పెళ్ళి కాని ఆడపిల్లలంతా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూపాటలు పాడుతూ , ప్రదక్షిణలు చేస్తూ , తాము గోపికలు గా ఊహించుకొని కృష్ణభగవానుణ్ణి మదిలో అర్పిస్తే మంచి భర్త లభిస్తాడనేది ఓ నమ్మకం .
సంక్రాంతి దేవతకు ఏడు పేర్లు :
ఒక్కో పండుగనాడు ఒక్కో దేవుడిని , దేవతను పూజించడం మన సంప్రదాయం . అలాగె సంక్రాంతి పండుగకూ ఓ అధిష్టానదేవత వుంది . ఆ దేవి పేరు పండుగ నాటి వారం తో ముడిపడి వుంటుంది .
పండుగ
ఆదివారం వస్తే దేవత పేరు ....... ఘోర.
సోమవారం వస్తే దేవత పేరు ......ధ్వంక్షి .
మంగళవారం వస్తే దేవత పేరు ....మహోదరి ,
బుధవారం వస్తే దేవత పేరు ........మందాకిని ,
గురువారం వస్తే దేవత పేరు ........మంద ,
శుక్రవారం వస్తే దేవత పేరు .........మిశ్ర ,
శనివారం వస్తే దేవత పేరు ...........రాక్షసి ,
ముగ్గులు
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మద్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష , వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలు కూ సంకేతాలుగా చెప్పచ్చు.
రధం ముగ్గు
మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రధం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.
గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మద్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలు తొ అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.
బోగిమంట
మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.
బోగిపళ్ళు
బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.
తిల తర్పణం
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.
సంకురుమయ / సంక్రాంతి పురుషుడు
మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లొ పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.
హరిదాసు
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.
గంగిరెద్దు
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. "జుగోప గోరూప ధరామివోర్విం" దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.
హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి.
పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.అంచేతే భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణం లో రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.
ఆది శంకరాచార్యుడు ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నాడు.

Monday, January 9, 2017

బంధాలు తెగిపోతున్నయి జాగ్రత్త


సంక్రాంతి సాక్షి ......."గురుసహస్రావధాని" డా.కడిమిళ్ళ వరప్రసాద్


సంక్రాంతి సాక్షి
వైరాగ్య వాసనల్ పండించె భరతాంబ
దానికి మా హరిదాసు సాక్షి
సంగీతమున జంతు జాలమ్ము మురిపించె
ఇద్దానికో గంగిరెద్దు సాక్షి
సరస సంభాషణా సాహితీ చాతురి
కల్లరి మరదలు పిల్ల సాక్షి
ప్రతి పదార్థమునందు భగవంతునిం జూపె
ముఖ్యమ్ముగా గొబ్బిముద్ద సాక్షి
కాయ కష్టమ్ములో లక్ష్మి గలదటంచు
పలుకుచుంటకు బచ్చని పైరు సాక్షి
పల్లె సొగసులకై రంగవల్లి సాక్షి
శ్రమయె సౌందర్యమనగ సంక్రాంతి సాక్షి
......."గురుసహస్రావధాని" డా.కడిమిళ్ళ వరప్రసాద్

Saturday, January 7, 2017


మీకోసం...: జీ మెయిల్‌లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా!

మీకోసం...: జీ మెయిల్‌లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా!: కంపోజ్‌ చేయడం, ఫైల్‌ను అటాచ్‌ చేయడం, సెండ్‌ కొట్టడం, అప్పుడప్పుడూ చాట్‌ చేయడం.. ఈ ఫీచర్స్‌ని ఉపయోగించడం అందరూ చేసేదే. ఇవే కాకుండా జీమెయ...

Friday, January 6, 2017

తొలి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శన చరిత్ర.

తొలి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శన చరిత్ర.

మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణపరమాత్మ ‘భగవద్గీత’ విభూతియోగంలో చెప్పాడు. అంటే, ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈమాసం, ప్రకృతిని అంటా సౌందర్యమయం చేస్తుంది. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సారమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఉత్తరాయణం దేవతలకు పగటికాలమైతే, దక్షిణాయణం రాత్రికాలమని చెప్పబడుతోంది. విష్ణుమూర్తి రాత్రికాలమైన దక్షిణాయనంలో ఆషాడ శుద్ధ ఏకాదశినుండి నాలుగునెలలపాటు యోగ నిద్రలో గడుపుతూ లోకం తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అందుకే ఆషాఢ శుద్ధ  ఏకాదశిని ‘శయన ఏకాదశి’ (తొలిఏకాదశి) అని అన్నారు. తొలి ఏకాదశికి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తిక శుద్ద ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీనినిన్ ‘ఉత్థాన ఏకాదశి’ అని అన్నారు.

తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ‘ఏకాదశి’. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ‘ఒకటి, కృష్ణపక్షంలో  ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఆవిధంగా సంవత్సరంలో ఇరవైనాలుగు ఏకాదశులు.’ చాంద్రమానం ప్రకారం, మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులోస్తాయి. ప్రతిఏకాదశి ఓ పర్వదినమనే చెప్పొచ్చు. అసలు ఏకాదశి ఆవిర్భావం కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది. పూర్వం మృదుమన్యుడు అనే రాక్షసుడు, శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి, ఆ స్వామిని మెప్పించి స్త్రీ పురుషుల నుండి తనకు మరణం లేకుండా ఉండేట్లుగా వరాన్ని పొందాడు. వరాన్ని అనుగ్రహించిన శివుడు అయోనిజ అయిన స్త్రీ చేతిలో మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు, వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా పారిపోగా, వారి దేవేరులంతా ఒక ఉసిరిచెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెదుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెదకడానికి ప్రయత్నిస్తుండగా, దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టుతొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుడిని సంహారించింది. ఆ కన్యక పేరే ‘ఏకాదశి’, అప్పట్నుంచి ప్రతి పక్షంలో పదకొండవ రోజున ఆమెను పూజించడం ఆచారమైంది.

ఏకాదశి మహాత్యాన్ని తెలిపే అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. ఆ కథలలో రుక్మాంగదుని కథ ఒకటి. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ, ప్రజలను కంటి పాపలవలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడ ధర్మవర్తనులై జీవిస్తుండే వారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం, రంభ మోహినీ వేషధారిణియై, రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా, మార్గమధ్యంలో తారసపడిన మోహినీ రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మొహావేశపరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తియై ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతబ్రష్టున్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశినాడు తనతో దాంపత్యసుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది. ఏకాదశివ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్నకొడుకును చంపడానికి నిర్ణయించుకోగా, అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, జరిగిన మోసాన్ని అతనికి వివరించి, రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు.

ఇక ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖసంతోషాలను అందించే పర్వంగా భక్తజనులచే ఎంతో గొప్పగా జరుపబడుతుంటుంది. మన తెలుగువాళ్ళు ఈ పండుగను ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలుచుకుంటూఉంటారు. ఈ రోజున విష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడనీ, అందుకే ఈ పండుగ ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలువబడుతోంది అంటారు. స్వామి భూలోకానికి దిగి రావడం వెనుక ఓ ఉదంతం ఉంది. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా మురాసురుడు అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ, దేవతలను విపరీతంగా పీడిస్తుండేవాడు. అతని హింసను తట్టుకోలేక పోయిన దేవతలు, వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల అభ్యర్థనలను ఆలకించిన విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి వచ్చి మురాసురుని సంహరించాడు. ఆ సంహారం ఏకాదశినాడు జరిగినందువల్ల, ఈ రోజుకి ‘వైకుంఠ ఏకాదశి’ అని పేరు వచ్చింది.

విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈరోజున వైష్ణవ దేవాలయలలొ ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ద్వారాన్నే వైకుంఠ ద్వారమని పిలుస్తారు. ఆరోజున భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలను, స్నానసంధ్యాలు ముగించుకుని, విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామిదర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ ప్రదక్షిణనే ముక్కోటి ప్రదక్షిణ అని అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవదర్శనంవల్ల సకల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం.

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఒక కథ చెప్పబడుతోంది. మహాప్రళయం జరిగింది. ప్రళయానంతరం, నీటి మీద తేలుతున్న విష్ణుభగవానుడు, మరలా సృష్టి చేయడాన్ని గురించి ఆలోచిస్తూండగా, ఆయన ముందు పంచభూతాత్మకమైన (ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి) బ్రహ్మాండం గోచరించింది. అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామరపువ్వు ఉద్భావించగా, అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మకు, విష్ణుభగవానుడు మంత్ర, తంత్ర, శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిశ్శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకోగా, అప్పుడు స్వామి శ్రీరంగనాథుని రూపంలో, తన భార్యలతో, పరివారగణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి, బ్రహ్మకు జ్యోతిశ్శాస్త్రాన్ని బోధించి, తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కోలుచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా, స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువైయ్యాడు.

కొంతకాలం తరువాత ఆ విగ్రహాల విమానం సూర్యవంశ మూలపురుషుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇవ్వబడి, కాలక్రమాన శ్రీరామచంద్రునికి చేరింది. రామావతారాన్ని ముగించే ముందు, శ్రీరాముడు ఆ విమాన విగ్రహాలను విభీషణుకి ఇచ్చి, తనకు చేసిన సహాయానికి గుర్తుగా తను ఆ విగ్రహాలను ఇస్తున్నట్లుగాను, వాటిని లంకకు తీసుకుని వెళ్ళి పూజాదులు చేయవలసిందిగాను, అయితే లంకకు చేరేవరకు విమానవిగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పాడు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు, లంకాద్వీపానికి బయలు దేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు, కావేరినదీ తీరాన్ని చేరుకునేసరికి సంధ్యావందనం చేయాల్సిన సమయమైంది. వెంటనే కావేరీతీరంలో స్నానం చేసి సంధ్య వార్చుకుందామనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కిందపెట్టకూడదు కదా! ‘ఎలా?!’ అని అటూ ఇటూ చూసిన విభీషణుని కంట్లో బాలబ్రహ్మచారి కనపడ్డాడు. విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని బ్రతిమాలి, తాను సంధ్య వార్చుకుని వచ్చేంతవరకు విమానాన్ని పట్టుకుని ఉండాల్సిందిగా చెప్పి, సంధ్యవార్చుకునేందుకై వెళ్లాడు. దానిని తీసుకున్న బాల బ్రహ్మచారి కొన్ని ఘడియలు మాత్రమే పట్టుకుంటానని, సమయం మించితే కింద పెట్టేస్తానని చెప్పాడు. అలాగే విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో బాలబ్రహ్మచారి విమానాన్ని కింద పెట్టేశాడు. అది అక్కడ భూమికి అతుక్కుపోయింది.

ఇంతలో విభీషణుడు పరుగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి అక్కడకు దగ్గరలోని కొండపైనున్న వినాయకుని గుడిలో దాక్కున్నాడు. కోపంతో వూగిపోయిన విభీషణుడు, వినాయకుని గుడిలోకి వెళ్ళి, ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక్క మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్ట పడింది. ఇంతకీ ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తూ వినాయకుడే. ఇప్పటికీ వినాయకుని విగ్రహంపై సోట్టను చూడవచ్చు. బాలబ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంత్రం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందగా, బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిళ్ళైయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు, రంగనాథస్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయ పడ్డాడు. అయితే స్వామి అందుకు సమ్మతించక, తాను అక్కడే ఉండిపోనున్నట్లు, సంవత్సరంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తనను ఆరాధించ వచ్చని చెబుతాడు. విభీషణుడు స్వామికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలోని సప్తప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుని ఆలయాన్ని చూడవచ్చు. అప్పట్నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఆత్యంత వైభవంగా జరుపబడుతోంది.

వైష్ణవ దేవాలయాలలో మామూలు రోజులలో అయితే ఉత్తరద్వారాలను మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశిరోజున మాత్రం తెరచి ఉంచుతారు. మన తెలుగు రాష్ట్రాలలోని తిరుపతి, భద్రాచలం, మంగళగిరి మొదలైన క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. తిరుపతిలో ఈరోజు శ్రీవారిసన్నిథిన రావత్తు తోడక్కం జరుగుతుంది. నమ్మాళ్వారు విరచితమయిన భగవద్విషయమనబడే దివ్యప్రబంధంలోని నాలుగవ ఆయిరం అధ్యయనం జరుగుతుంది. వేదపారాయణం తోడక్కం తరువాత జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దేవస్థానం చుట్టూవున్న చూళిక ద్వారాలు తెరుబడుతాయి. భక్తులు ఈ చూళిక నుంచి ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఇక, భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని అధ్యయనోత్యవాలని పిలుస్తారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశీ మహోత్సవాలు ధను: శుద్ధ తదియతో ప్రారంభమయి ఏకాదశితో సమాప్తమవుతాయి. ఏకాదశికి ముందు పదిరోజులను అధ్యయనోత్సవాలని అంటారు. ఈ అధ్యయనోత్సవాల సమయంలో ధనుశ్శుద్ధ విదియ నుండి ధనుశ్శుద్ధ దశమి వరకు రోజుకొక అవతారం చొప్పున స్వామిని దశావతారాలతో అలంకరించి మధ్యాహ్నసమయంలో కళ్యాణమండప పందిరిలో వేంచేసి చేస్తారు. అనంతరం స్వామి తిరువీథి సేవకు బయలుదేరుతారు. ఏకాదశికి ముందురోజైన దశమినాటి సాయంత్రం గోదావరినదిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తరువాత పదిరోజులు మొక్షోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఇరవై ఒక్కరోజులలో చతుర్వేద పారాయణం, నాలాయిర దివ్యప్రబంధం పారాయణం చేయబడుతుంది. ఈ ఉత్సవాలను చూసి తరించేందుకు దేశం నలుమూలల నుండి భక్తజన సందోహం తరలి వస్తుంటారు.
ఏకాదశిరోజున ఉపవాసాన్ని పాటించాలి. ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల సూర్య, చంద్రగ్రహణ సమయంలో చేసే దానం, అశ్వమేథయాగం చేసిన ఫలితాలకంటే అధికపలం లభిస్తుంది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణం, అదీ పాటించకలేకపోతే నీరు, పాలు, పండ్లను తీసుకోవచ్చు. అలా కుదరనప్పుడు ఒక్కపొద్దు అంటే, ఒంటిపూట భోజనం చేయవచ్చు. సుఖ సంతోషాలను పంచే పండుగ వైకుంఠ ఏకాదశి.

చక్కెర ( WHITE POISON )

       చక్కెర ( WHITE POISON )

  చక్కెర ఒక్క విష పదార్ధం . అనేక రోగాలకు మూలం ఈ చక్కెర .

1 .  చక్కెర తయారిలో ఎక్కువగా గంధకం వాడతారు . ఈ గంధకం వాడతారు . ఈ గంధకం బాణా సంచా తయారు చేస్తారు .

2 . గంధకం అత్యంత కఠోరమైన ధాతువు . ఈ ధాతువు మన శరీరంలోకి వెళితే , తిరిగి బయటకు రాదు .

3 . చక్కెర CHOLESTEROL స్ధాయిలను పెంచుతుంది . హృదయ రోగాలు వస్తాయి . HEART ATTACK వస్తుంది .

4 . చక్కెర వలన ఊబకయం వస్తుంది .

5 . B. P. వస్తుంది .

6 . బ్రేన్ హెమరేజ్ వస్తంంది .

7 . చక్కెరలో తేలికగా జీర్ణం కాని SUCROSE అనే పదార్ధం వుంది .ఈ పదార్ధం మనుష్యులలో మరియు జంతువులలో కూడా జీర్ణం కాదు .

8 . చక్కెర తయారిలో 30 రకాల హానికరమైన రసాయనాలు వాడుతారు .

9 . చక్కెర వలన మధుమేహ వ్యాధి రావడానికి అవకాసం కలదు .

10 . చక్కెర వలన కడుపులో మంట వస్తుంది .

11. చక్కెర వలనTRIGLYCERIDES పెరుగు తాయి .

12 . చక్కెర వలన PARALYSIS వస్తుంది .

13 . 1836 సంవత్సరములకు ముందు భారతీయులు శుద్ధమైన బెల్లం ( Jaggery ) నే వాడే వారు .  అప్పుడు వారికి ఎటు వంటి అనారోగ్య సమస్యలు లేవు .

14 . వీలైనంత వరకు బెల్లంని వాడండి .

గమనిక: ---
  ప్రకృతిలో ఏ పదార్ధమైన తెల్లగా ఉంటే , అది మనకు అంత అనుకూలమైనది కాదు . 

నేటి యువతీ....యువకుల కోసం ఈ కథ.

ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు.

చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు............

చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు.

డైరెక్టరు : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా?

యువకుడు: లేదండీ! మా అమ్మ-నాన్నగార్లె అన్ని ఫీజులు కట్టెవారు.......

డైరెక్టరు: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?

యువకుడు: ఖాళీ-సిసలు పాత-ఇనుము వెస్ట్-పేపర్ ప్లాసిటిక్-స్క్రాప్ చిన్న-చిన్న-వ్యాపారములు చేసి అదే పనిని వృ త్తిగా  మార్చుకొని నన్ను చదివించారు.......

డైరెక్టరు: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు.

యువకుడు: తన చేతులను చూపించాడు........
అవి చాలా సున్నితంగా నాజూకుగా సుతి-మెత్త్తగా   ఉన్నాయి.

డైరెక్టరు: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు వారు చేసే పనిలో  సహాయపడ్డావా?

యువకుడు: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకునిమంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను.

డైరెక్టరు: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి.

డైరెక్టరు: నాదొక చిన్నవిన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను.

యువకుడు: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్.

డైరెక్టరు: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిదండ్రులకు మూడు-రోజులు విరామము ఇచ్చి.....
వారు చేసే పనిని నీవు సర్రిగ్గా మూడు-రోజులు చేసి.....రా! తప్పకుండా నువ్వు ఈ ఉద్యోగంలో చేరవచ్చు....

యువకుడు: అలాగే సర్. అని.. తల్లిదండ్రులకు సహాయపడటానికి వెళ్లి  వారిని చూడగానే విపరీతంగా ఏడ్చాడు.....
ఆ-చేతులు కాయలుగట్టి.........
కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చి
రక్తం కారుతూ....... గరుకుగా.......చాలా ఘోరంగా కనపడ్డాయి......

ఆ చేతులలో తన మొహాన్ని పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.....వారి కష్టాన్ని తలచుకుని వారు చేసే పనిని తానే అ-మూడు-రోజులు
తల్లిదండ్రుల మీద-ఉన్న ప్రేమతో.... ఇష్టముతో.... కష్టపడి తన-డైరెక్టరు పెట్టిన పరీక్షను పూర్తి చేసాడు.

మరుసటిరోజు ఆఫీసుకు కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చిన వాటికీ డాక్టర్-వద్ద ప్రథమ-చికిత్స చేయిన్చుకొని   కళ్ళల్లో నీళ్ళతో వెళ్ళి ....
ఆ డైరెక్టరు పాదాలకు నమస్కరించాడు...."

మీరు నా కళ్ళు తెరిపించారు సర్!

నా తల్లిదండ్రుల కష్టాన్ని నాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.

మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తే వారిని కంటికి రెప్పలా ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాను"

దానికి డైరెక్టరు ఇలా సమాధానం ఇచ్చారు......"

ఇంట్లో తల్లిదండ్రుల కష్టం తెలిసిన వారికే ఆఫీసులోని పై అధికారుల కష్టాలు అర్థంఅవుతాయి.......
కాబట్టి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉన్నవారికే మా-ఆఫిసులో ఉద్యోగాలు ఇవ్వాలని నీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇలాంటిచిన్న పరీక్ష పెట్టడం జరిగింది...

నీవే ఈ ఉద్యోగానికి 100% అర్హుడవు.

కాబట్టి డబ్బులు పెట్టి మనల్ని చదివిస్తున్నారుకదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండాఅసలు ఆ ఫీజుకు కట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒక్కసారి తలచుకుని చక్కగాచదువుకుని ప్రయోజకులు కండి,,,,,

ఆల్ ది బెస్ట్.............🌷🌹🌻
ఈ-కథ అందరి అమ్మ-నాన్నలకు అంకితం...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻..

రాజమహేంద్రవరం సమీపంలోని పుణ్యక్షేత్రాలు


Bragana Vivaha vivaraalu


Wednesday, January 4, 2017

రోజూ విజ్ఞానం పెరుగుతోందని సంతోషించాలా
పెరుగుట విరుగుట కొరకే అని చింతించాలా .......
అమ్మా నాన్న వద్దు .... అమెరికాయే ముద్దు అంటున్న కాలం
పరుగు పందెం లో యాంత్రికమై , ఆర్ద్రత తగ్గిన జీవితం
చందమామ చూస్తూ బామ్మ కధలు వింటూ ,
ఎంతో సరదాగా ఆ నాడు ముద్దలు తిన్నాము
రోజులో ఒక్కసారి కలిసి చేసే రాత్రి భోజనం
అది కూడా మౌనంగా..... టి. వి చూస్తూ నేడు చేస్తున్నాము
యధారాజా తధా ప్రజా ! చేసుకున్న వారికీ చేసుకున్నంత
పెద్దలు కంప్యూటర్స్ , పిన్నలు టాబ్లెట్స్ తో మునుగుతూ ......
మంచీ చెడూ మాట్లాడే సమయం కూడా తగ్గి పోతూ
ఇనవారితో లేదు బంధం , కానివారితో గంటలు కాలక్షేపం
రామాయణ, భారత ,పంచతంత్రా లు వింటూ నీతులుఎరిగిన మన బాల్యం
కార్టూన్స్ పేరుతో వయసుకు మించే నేర్పుతున్న చెత్త తో నేడు అద్వాన్నం
ఉరుకులు పరుగుల జీవనంలో లోపిస్తున్న అనురాగ మాధుర్యం
ఈ నాడు ఎవరి వారే యమునా తీరే ...... ఐ పొఇన కుటుంబ జీవనం......
పెద్దలే లేని ఇళ్ళు , భయ భక్తులు క్షీణిస్తున్న వైనాలు
అంతర్జాలం,టి . వి. ,సినిమా ల్లో తెలిపే అక్కరలేని సమాచారాలు
సంస్కృతి, సంస్కారం మరుస్తూ సంప్రదాయానికే ఎసళ్ళు....
సమాజ క్షేమానికి ఊపిరి .. . క్రమ శిక్షణ నిండిన కుటుంబం
మంచీ చెడు విచక్షణ ..... ఉగ్గుపాలతో రంగరిస్తేనే భద్రం
ఒకరికొకరై, సాగుతూ లక్షణం గా ఉంటె అదే సుఖ పరివారం
మొక్కై వంగనిది మానై వంగునా .... అన్నారు
పిల్లలకు కావాల్సినది... కావు ఖరీదైన బహుమతులు
మనసున మనసై ఉండే అమ్మా-నాన్నా ఆత్మీయతలు
అరచేతి లో వైకుంఠాలు నేర్పద్దు
కస్టపడి సాధించుకునే మనస్తత్వాలు ముద్దు
నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తులు
పిల్లల జీవితాలు శోభాయమానంగా తీర్చి దిద్దండి
జీవిత విలువలు నేర్పుతూ ..... వారి వ్యక్తిత్వాలు
దివ్యంగా , మోహనంగా చెక్కండి
సువర్ణ భవితకు బాట వేయండి ......

వ్యక్తి తన సహజమైన గుణాలను కోల్పోకూడదు.....

ఒక సన్యాసి నదిలో స్నానం చేస్తున్నాడు. తేలోకటి నదిలో కొట్టుకుపోతున్నది. సన్యాసి దాని వంక చూసాడు. దాన్ని రక్షించదలచి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది అతన్ని కుట్టింది.కంగారుతో అతడు దాన్ని నీటిలో వదిలాడు.అయ్యో చచ్చిపోతున్నదే అనిపించింది.మరలదానిని రక్షించాలని బుద్ధి పుట్టింది.చేతిలోకి తీసుకున్నాడు. మళ్లీ అది అతనిని కుట్టింది. తిరిగి దానిని నీటిలో వదిలాడు.ఎలాగైనా రక్షించాలనుకొని మూడవమారు చేతిలోకి తీసుకుని విసిరి గట్టు మీద వేసాడు. అది జరా జరా నేలమీదికి పాకుతూ పోయింది.ఇదంతా చూస్తున్న యువకుడొకడు ఆ సన్యాసిని ఇలా అడిగాడు,
"అయ్యా! అది విష జంతువని తెలుస్తూనే ఉంది కదా,అది మిమ్మల్ని రెండు సార్లు కుట్టింది. అయినా దాన్ని ఎందుకు రక్షించారు ?"
అందుకు ఆ సన్యాసి,"ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తేలు తన స్వభావాన్ని వదలకుండా కుడుతున్నదే, అలాంటప్పుడు సన్యాసి అయిన నేను పరోపకారం చేయడం అనే నా స్వభావాన్ని ఎందుకు వదులుకోవాలి ?" అని సమాధానమిచ్చాడు.పరిస్థితుల ప్రభావం వలన, వత్తిడులవలన, ఇబ్బందులవలన వ్యక్తి తన సహజమైన గుణాలను కోల్పోకూడదు..... 

వినడం చేతకావాలి...

దయచేసి ఇది చదవండి!చాలా మంచి విషయం.
వినడం చేతకావాలి...
"మానవీయం"
మనుష్యుడిగా పుట్టిన రాముడు కూడా ఎన్నో చోట్ల తప్పులు చేయబోయాడు. ఒకానొకప్పుడు సీతమ్మ కనబడనప్పుడు రాముడికి చాలా కోపం వచ్చేసింది. 'ఈ లోకాలన్నింటినీ లయం చేసేస్తాను, దేవతలు కూడా సంచరించలేరు, బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణా!' అని బాణం తీసి సంధించబోయాడు. నిజంగా అది చేసి ఉంటే... విద్య నేర్పిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు తలవంచుకుని ఉండేవారు. తన భార్య కనబడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా! లక్ష్మణస్వామి వచ్చి, కాళ్ళ మీద పడ్డాడు. ''అన్నయ్యా ! చంద్రుడికి కాంతి ఎలా ఉంటుందో, సూర్యుడికి ప్రభ ఎలా ఉంటుందో - రాముడు మంచివాడు, ధర్మం తప్పడని నీ నడవడి చేత నీకు కీర్తి అలా ఉంది.
మచ్చ వస్తుందన్నయ్యా! వద్దన్నయ్యా! ధర్మం తప్ప వద్దన్నయ్యా! నీవు ఇలా చేస్తే - 'రాముడు ఒకసారి ధర్మం తప్పి బాణాలు వేయలేదా' అన్న మాట శాశ్వతంగా నిలిచిపోతుంది. ధర్మాన్ని వదిలిపెట్టవద్దన్నయ్యా !'' అంటాడు. ''తమ్ముడా! నీవు చెప్పినది కూడా నిజమే'' అని తన కోపాన్ని నిగ్రహించుకుంటాడు రాముడు.
నీకు తెలియకపోవచ్చు. వినడం చేత కావాలి. తెలియకపోవడం తప్పు కాదు. ఒకరు చెప్పినప్పుడు వినడం చేతనై ఉండాలి. అది కూడా నాకు చేత కాదంటే... ఇక ఆ పరమేశ్వరుడు కూడా రక్షించలేడు వాణ్ణి! రావణాసురుడు పాడైపోవడానికి కారణం అదే. మంచి మాట వినకపోవడమే. చివరకు పది తలలు తెగి పడిపోయాడు. దుర్యోధనుడిదీ అదే పరిస్థితి. ఇంకాస్త ముందుకుపోయి 'జానామి ధర్మం న చ మే ప్రవృత్తి, జానామ్య ధర్మం న చ మే నివృత్తి' అన్నాడు. 'ధర్మం నాకు తెలియదా? తెలుసు! కానీ అలా చేయాలనిపించడం లేదు. ధర్మం ఏమిటో నేను చదువుకోలేదా? చదువుకున్నాను! కానీ నా కిష్టం ఉండదు - అలా చేయడం! అయినా నాలోని ఈశ్వరుడే నా చేత చేయిస్తున్నప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతారు?' అని ఎదురు ప్రశ్నించాడు. ఇలా మెట్టవేదాంతం చెప్పబట్టే, తొడలు విరిగిపడిపోయాడు కురుక్షేత్రంలో.
తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. మంచిమాట విన్నప్పుడు దానికి అనుగుణంగా నీ నడవడిక మార్చుకోకపోవడం మాత్రం పెద్ద తప్పు. ధర్మాచరణ చేత తృప్తి పొందాలి. ''చూడు నాయనా! 'నాన్నగారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలన్నారమ్మా'- అని ఇప్పటివరకు 'ధర్మం...ధర్మం' అంటూ దానికి కట్టుబడి వెళ్ళిపోతానంటున్నావు. అది అంత సులభం కాదు. రేపు మీ ఆవిడను తీసుకుని అడవుల గుండా వెళుతున్నప్పుడు క్రూరమృగాలు అరిస్తే, నీ భార్య ఉలిక్కిపడి నిన్ను పట్టుకుంటే... ఎక్కడో అంతఃపురంలో హంసతూలికా తల్పాల మీద పవ్వళించవలసిన నా భార్య ఇంత కష్టపడడమేమిటని అప్పుడు తిరిగి వచ్చి నాన్న గారి మీద తిరగబడకూడదు. ధర్మం తప్పకుండా ఉండాలి. అలా ఉండగలవా? ఏ ధర్మం కోసమని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో, ఆ ధర్మానికి కట్టుబడి వచ్చే కష్టనష్టాలు తట్టుకోగలవా? 'తట్టుకోగలను' అని అనుకుంటే ఆ ధర్మమే నిన్ను సదా రక్షించుగాక !'' అని కౌసల్య అంటుంది. ''యం పలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ, స వై రాఘవా శార్దూల ధర్మస్త్వామభిరక్షతు'' అని తల్లిగా కైకేయి చెప్పిన శ్లోకం రామాయణంలో బంగారు పాత్రలో పోసిన అమృతం లాంటిది. రాముడు ఎంతగా తట్టుకుని నిలబడ్డాడంటే... చివరకు ఒక రాక్షసుడు కూడా ఆయన గురించి చెబుతూ, ''రామో విగ్రహవాన్ ధర్మః'' అనక తప్పలేదు.
'అయ్యా! నాకీ సుఖం అనుభవించాలనుంది. నేనిది అనుభవించవచ్చా?' అని కొందరికి సందేహం. అంతరాత్మ చెప్పింది ప్రమాణం చేసుకో! 'ధర్మమే, అనుభవించేయ్' అన్నప్పుడు అనుభవించు. 'వద్దు! అది ధర్మచట్రంలో ఇమడదు' అన్నప్పుడు దాని జోలికి వెళ్లకు. 'పంచదార పరమాన్నం తెల్లగా, బెల్లం పరమాన్నం నల్లగా ఉంది. నాకు తెల్లగా ఉన్నది తినాలనిపిస్తోంది. తిననా?' సన్న్యాసివి కాదు కదా! గృహస్థువు. తప్పేమీ లేదు. దేవుడికి నైవేద్యం పెట్టి, కొద్దిగా ఇతరులకు పెట్టి, మిగిలినది నీవు తినేసెయ్. ఏ తప్పూలేదు. 'అయ్యా ! నా పక్కనున్నావిడ నల్లగా, ఎదురుగా ఉన్న ఆవిడ తెల్లగా కనిపిస్తోంది.' అది ధర్మ చట్రంలో ఇమడదు. అధర్మం. అలాంటి ఆలోచనలు రానీయకు అన్నప్పుడు వదిలేసెయ్. అదొక్కటే తీర్పు.
ఎందుకంటారా! ఇది మర్త్య లోకం. ఇందులో నువ్వు శాశ్వతంగా ఉండవు. ధర్మం చెప్పిన పరమేశ్వరుడు మళ్ళీ నిన్ను లెక్కలడుగుతాడు. ఈ జన్మలో ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకో. మిగిలిన జీవరాశులేవీ ఇలా విముక్తి పొందలేవు. అలా పొందగలిగినదీ, శాస్త్రాన్ని పట్టుకోగలిగినదీ, గురువును సేవించగలిగినదీ- భగవన్నామం పలుకగలిగినదీ, మంచిమాట చెప్పగలిగినదీ, తాను తరించగలిగినదీ, దేవత కాగలిగినదీ, ఉత్తరోత్తర జన్మలలో మనుష్య జన్మలోకి వచ్చి మళ్లీ ఇంకా ఎదగగలిగిన స్థితి పొందగలిగినదీ, ధర్మాన్ని విడిచిపెట్టి కిందకు వెళ్ళి కొన్ని కోట్ల జన్మల వెనక్కి పడిపోయి స్థావర జంగమమైపోగలిగినదీ కూడా మనుష్యుడే! నువ్వు ఏమవుతావన్నది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.
రోగాలెందుకు వచ్చాయని వైద్యుడు అడగడు. 'ఇక చేయకు అలాంటి పనులు. నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి పంపిస్తా' అంటాడు. భగవంతుడు కూడా అంతే! ఒకసారి తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడిపోయావు. నిన్ను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. ఈశ్వరుడి అనుగ్రహాన్ని, గురువు యొక్క సౌలభ్యాన్ని , శాస్త్ర పరమార్థాన్ని, ధర్మం వైశిష్ట్యాన్ని సమన్వయం చేసుకుని తరించగల స్థితి మానవుడికి ఒక్కడికే ఉంది. ఇతరాలకు లేదు. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుని, ఈశ్వరానుగ్రహాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంత అవసరమో గుర్తించిననాడు దాని వైభవం మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మాచరణ ద్వారా తరించగల అవకాశాన్ని పరమేశ్వరుడు మనందరికీ ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుందాం!

నుదిటికి కుంకుమ ఎంత అందాన్నిస్తుందో... ఇంటిముందు రంగవల్లిక అంతే... అందాన్నిస్తుంది.




Tuesday, January 3, 2017

మధుమానసం: " తెరతీయగరాదా" - కథా విశ్లేషణ - Thanks to Kathajag...

మధుమానసం: " తెరతీయగరాదా" - కథా విశ్లేషణ - Thanks to Kathajag...: Updated : వంద కథల్లో ఏ కథను ఎంచుకోవాలో అని చాలా బెంగ పడ్డాను మొదట. చివరికి వరుసలో అమ్మ ఇంటి పేరు కనపడగానే ఆగిపోయి కథా అంతా చదివాను. నా ఆలో...

హేమంతం నుంచి హేమంతం దాకా......వాడ్రేవు చినవీరభద్రుడు 9490957129

హేమంతం నుంచి హేమంతం దాకా
 January 02, 2017 00:19 (IST)
హేమంతం నుంచి హేమంతం దాకా
∙ఒక చదువరి అంతరంగం

అనేక వైరుధ్యాల మధ్య, అనేక కర్తవ్యాల మధ్య, స్పష్టంగా బోధపడని మంచిచెడుల మధ్య ఆత్మికంగానూ, నైతికంగానూ తోడు నిలబడేది సాహిత్యమొక్కటే.

1 ఒక సంవత్సరం గడిచిపోయింది. కొత్త సంవత్సరం ప్రవేశించింది. హేమంతం నుంచి హేమంతం దాకా గడిచిన కాలమంతా ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో కలయికలు, వియోగాలు. కాని నిజంగా నాకు సన్నిహితంగా ఉన్నది సాహిత్యమొక్కటే. ఇన్నేళ్ళు గడిచినా, బహుశా, జీవించడమెట్లానో నాకిప్పటికీ తెలియలేదనే అనుకుంటాను. అనేక వైరుధ్యాల మధ్య, అనేక కర్తవ్యాల మధ్య, స్పష్టంగా బోధపడని మంచిచెడుల మధ్య ఆత్మికంగానూ, నైతికంగానూ తోడు నిలబడేది సాహిత్యమొక్కటే. అందుకనే, ‘ద బెస్ట్‌ అమెరికన్‌ పొయెట్రీ 2016’ సంకలనకర్త ఎడ్వర్డ్‌ హిర్‌ equipment for living అన్నాడు. జీవించడానికి ఊతమిచ్చే సాధనసంపత్తి, నా వరకూ, నిస్సందేహంగా, సాహిత్యమే.

2 ఈ ఏడాది పొడుగునా నన్ను అంటిపెట్టుకున్న కవి కబీరు. ఆయన రాసిన కవిత్వమూ, ఆయన మీద వచ్చిన పరిశీలనలూ, పరిశోధనలూ విస్తారంగా చదివాను. కబీరు నన్ను గాఢంగా ఆకట్టుకోవడానికి కారణం, ఆయన కూడా ఆత్మలో స్వాతంత్య్రం పొందడానికి కావలసిన సాధనసంపత్తి కోసం సాహిత్యం వైపే చూశాడు. ఆయన జీవించిన 15వ శతాబ్దపు భారతదేశానికీ, మనం జీవిస్తున్న ఇప్పటి భారతదేశానికీ ప్రాయికంగా ఏమీ తేడా లేదు. అదే డంబాచారం, అదే ఆత్మవంచన, అదే పరపీడన. ముఖ్యంగా సమాన హృదయధర్మం కలిగిన మనుషుల కోసం అన్వేషణ. వాళ్ళు దొరకడం లేదనే తపన. ‘నన్ను నేనర్పించుకుందామంటే ఒక్కడూ కనబడలేదు/ లోకమంతా ఎవరి చితుల్లో వాళ్ళు దగ్ధమవుతున్నారు’ అంటాడు.

3 అనంతపురం వెళ్ళినప్పుడు, కదిరి ప్రాంతంలో ఒక గిరిజన తండాను వెతుక్కుంటూ వెళ్తుండగా, ఎవరో ‘ఇక్కడే కటారుపల్లె, వేమన సమాధి చూసారా?’ అనడిగారు. మాఘమాసపు వేపచెట్ల నడుమ, అప్పుడే నీళ్ళు పోసుకుంటున్నట్టున్న రావిచెట్ల మధ్య నేను మొదటిసారి ప్రయాణిస్తున్న బాటలో కటారుపల్లెలో అడుగుపెట్టాను. ఆ ఊరు మొదటిసారి చూసినప్పుడు కాంప్‌బెల్‌ ఎట్లా వర్ణించాడో ఇప్పటికీ అలానే ఉంది. అక్కడొక పెద్ద మెమోరియల్‌ హాల్, ఎన్ని శతాబ్దాలుగానో వేమన సమాధిగా పిలవబడుతున్న చిన్న సమాధి మందిరమొకటి ఉంది. ఆ సమాధి మందిరం చుట్టూ నాలుగువైపులా ఒక స్మృతిప్రాంగణం, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ వారు నిర్మించింది ఉంది. ఆ ప్రాంగణంలో నాలుగువైపులా గోడల మీద సుమారు 120 వేమన పద్యాలు చెక్కి వున్నాయి.

ఆ ప్రాంగణం, పద్యాలు తాపడం చేసిన ఆ గోడలు, ఆ పద్యాల్లోని సారళ్యాన్నీ, విరాళాన్నీ స్ఫురింప చేస్తున్నట్టుగా ఆ గచ్చుమీద ధారాళంగా పరుచుకున్న ఉదయ సూర్యకాంతీ నన్ను విభ్రాంతికి గురిచేసాయి. ఇట్లాంటి ఒక మందిరమిక్కడ నిర్మించారని తెలుగువారికి ఎంతమందికి తెలుసు? జర్మనీకి ఒక గొథే, ఇంగ్లీషుకి ఒక షేక్‌స్పియర్, మరాఠీలకి ఒక జ్ఞానేశ్వరుడు, తమిళులకి ఒక తిరువళ్ళువర్, బెంగాలీలకి ఒక టాగోర్‌  ఎట్లానో తెలుగువాళ్ళకి ఒక వేమన అట్లా కదా! కాని ఫ్రాంక్‌ఫర్ట్, స్ట్రాట్‌ఫర్డ్‌ అట్‌ ఏవన్, అలండి, తిరునాయనార్‌ కురిచ్చి, జొరసంకొల్లాగా తెలుగువాళ్ళ సాహిత్య తీర్థక్షేత్రమేది? ఆ ప్రాంగణం నిజానికి ఒక ప్రపంచ స్థాయి సాహిత్య సభ, తాత్త్విక చింతనా శిబిరాలు జరగవలసిన ప్రాంగణం. సమాజం మరింత శుభ్రపడాలని కోరుకునేవాళ్ళు ఇక్కణ్ణుంచి ఊరేగింపుగా తమ సామాజిక ఉద్యమాలు మొదలుపెట్టవలసిన ప్రాంగణం. తెలుగునేల మీద కవిత్వం చెప్తున్న ప్రతి ఒక్క కవీ జీవితకాలంలో ఒక్కసారైనా సందర్శించవలసిన దీక్షాభూమి.
4 గడచిన ఏడాది షేక్‌స్పియర్‌ 400వ వర్ధంతి సంవత్సరం. సాహిత్యాన్ని లిరిక్, ఎపిక్, డ్రామాలుగా విభజించాడు అరిస్టాటిల్‌. కవి గొంతు మాత్రమే వినిపించేది లిరిక్‌ అనీ, పాత్రలు మాత్రమే మాట్లాడుకునేది డ్రామా అనీ, కవీ,పాత్రలూ కూడా మాట్లాడేది ఎపిక్‌ అనీ ఆయన నిర్వచించాడు. ఈ వర్గీకరణ ఎంత అర్థవంతమో అంత  అర్థరహితమని కూడా పోర్చుగీసు కవి పెసావో విమర్శించాడు. ఎందుకంటే, గొప్ప కవిత్వంలో ఏకకాలంలో, కవి గొంతు, పాత్రల గొంతూ, కవీ పాత్రలూ కలగలిసి కూడా వినిపిస్తారని ఎడ్వర్డ్‌ హిర్‌‡్ష ఒకచోట రాసాడు. బహుశా షేక్‌స్పియర్‌ విశిష్టత ఇదే అనుకుంటాను. ఆయన ఒక పాత్ర చెప్పుకున్న స్వగతంలో కూడా ఒక యుగం సంక్షోభమంతా చూపించగలడు. ఆయన కవిత్వ శైలిలో లిరిక్, ఎపిక్, డ్రామా మూడూ విడదీయలేనంతగా పెనవైచుకుపోయి ఉంటాయి. షేక్‌స్పియర్‌ను చదవగలడం ఈ జీవితంలో నాకు లభించిన గొప్ప వరాల్లో ఒకటనుకుంటాను. మన చుట్టూ ఉన్న దైనందిన ప్రాపంచిక జీవితాన్ని గొప్ప సాహిత్యంగా ఎట్లా మార్చుకోవచ్చో, ఆయన రాసిన ఒక్క వాక్యం కూడా అమేయమైన స్ఫురణని అందించ గలుగుతుంది.

5 రాత్రి వానకి తడిసిన అడివి,
ఏదో చెప్పాలని కంపిస్తున్నది:
కోకిల కూత.
వేసవి ఋతుపవన మేఘంగా కరిగిపోయే కాలమంతా మా ఊళ్ళో, అడవిమధ్య, కొండలెక్కుతూ, కాలిబాటల్లో పూల గుసగుసలు వింటూ, బొమ్మలు వేసుకుంటూ గడిపేను. మా ఊళ్ళో జెండాకొండ ఎక్కినప్పుడు, ఆ సుకుమార క్షణాల్ని హైకూలుగా పిండి వడగట్టేను.
కొండకింద లోయలో అదే పల్లె:
లేనివల్లా
మా అమ్మ, మా ఇల్లు.

6 గొథే తొలిరోజుల్లో రాసిన నవల ‘ద సారోస్‌ ఆఫ్‌ యంగ్‌ వెర్థర్‌ ’(1774) చదివాను. ఆయన జీవితకాలంపాటు రాస్తూ వచ్చిన ఫౌస్ట్‌ నాటకాన్ని నా తొలిరోజుల్లో చదివాను. ఆయన తొలిరోజుల్లో రాసిన ఈ మహామోహమయ రచన ఇప్పుడు చదివాను. జర్మన్‌ రొమాంటిసిజం ఉ«ధృతంగా ఉన్న రోజుల్లో రాసిన ఈ నవల యూరోప్‌ నంతటినీ ఒక జ్వరంలాగా చుట్టబెట్టింది. నవల పూర్తి చేసాక కూడా నన్నొకటే ఆలోచన వెంటాడుతూ ఉంది. ఏదో ఒక అంశాన్ని, ప్రేమనో, మోహమో, ఇన్‌ ఫాచ్యుయేషనో ఏదో ఒకదాన్ని ఇంత గాఢంగా, ఇంత తీవ్రంగా, ఇంత జీవన్మరణతుల్యంగా కోరుకునే మన:స్థితి ఇప్పుడెక్కడైనా కనిపిస్తుందా? బహుశా, చలంగారి తర్వాత, ఇంత తదేకంగా, ఇంత మమేకంగా జీవితం వెంటపడ్డ మనుషులు గాని, రచయితలు గాని మనకెక్కడైనా కనిపిస్తున్నారా?
7 బాబ్‌ డిలాన్‌కి నోబెల్‌ పురస్కారం ప్రకటించినప్పుడు మరోమారు ఈ సంగతే స్పష్టమైంది. సాహిత్యం జీవన సాధనసంపత్తిగా మారిపోయిన కవులింకా మనమధ్య ఉన్నారని. అసీరియన్, ఈజిప్టియన్‌ మహాసంస్కృతుల్లో ఏ ఒక్కదానికీ  చెందక తమ సర్వేశ్వరుణ్ణే తాము నమ్ముకుంటూ తమ నమ్మకం కోసం తమ జీవితాల్ని తృణప్రాయంగా త్యాగం చెయ్యగలిగిన యూదు ప్రవక్తల్లాగా జీవిస్తున్న కవులింకా ఈ ప్రపంచంలో లేకపోలేదు. తమ విధేయతను శాసించే, కొనుగోలు చెయ్యాలనుకునే విరుద్ధ శక్తులమధ్య, ఏ ఒక్కదానికీ చెందక, తమ ఒంటరి కాలిబాటన తాము సాగిపోయే కవులకి డిలాన్‌ మనకాలం ప్రతినిధి, మనకాలం వీరుడు.
8 కొత్త సంవత్సరంలో చదవలవసినవీ, పారాయణం చెయ్యవలసినవీ మరెన్నో పుస్తకాలున్నాయి. పంచుకోవలసినవీ, పాడుకోవలసినవీ మరెన్నో పాటలున్నాయి. ఒక మనిషి తన అత్యంత బలహీన క్షణాల్ని గుర్తుపట్టడం ద్వారానే బలోపేతుడవుతాడు. తన మానవత్వాన్ని నిలుపుకోవడం కోసమే కవిగా, కథకుడిగా మారతాడు. అరేబియన్‌ రాత్రుల కథల్లో షహ్రాజాద్‌ లాగా మృత్యువును మరొక్కరోజు వాయిదా వేయడం కోసమే ప్రతి రాత్రీ ఒక కొత్త కథ అల్లుకుంటాడు. గడపలో అడుగుపెట్టిన ప్రతి కొత్త రోజునూ అజరామరం చెయ్యడంకోసం ఒక పూర్వకవిని తలుచుకుంటాడు, ఒక కొత్త రూపకానికి తెరతీస్తాడు. నేనూ ఇంతే.




(రచయిత : వాడ్రేవు చినవీరభద్రుడు 9490957129 )

నూతన సంవత్సరానికి స్వాగతం పలికేలా ఆశల పల్లకిలో..మల్యాల

ఓ వైపు పక్షుల కిలకిల రావాలు.. మరోవైపు పచ్చదనం పరుచుకున్న కొండలు.. అదే క్షణాన మంచు దుప్పటిని చీల్చుకుంటూ పూల వనం నుంచి నిద్రలేచిన భానుడు.. లేలేత  కిరణాలతో తొలిపొద్దుకు సిద్ధమయ్యాడు.

నూతన సంవత్సరానికి స్వాగతం పలికేలా ఆశల పల్లకిలో.. ఆకాంక్షల హరివిల్లులా.. ఆహ్లాదాన్ని పంచుతూ  ప్రకృతి  ఒడిలో సేదతీరినట్లుగా కనిపించిన  ఈ సందుర దృశ్యం ఆదివారం ఉదయం మల్యాల శివారులో కనిపించింది. ‘సాక్షి’ కెమెరా క్లిక్‌ మనిపించింది. – మల్యాల

Total Pageviews