Friday, July 24, 2015

మంచిమాట ! ఓర్పు, సహనం ఎంత చేదుగా ఉంటాయో వాటి వల్ల లభించే ఫలం అంత తియ్యగా ఉంటుంది.

మంచిమాట !
ఓర్పు, సహనం ఎంత చేదుగా ఉంటాయో 
వాటి వల్ల లభించే ఫలం 
అంత తియ్యగా ఉంటుంది.


ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!!

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!!
శ్రీ లలితా సహస్రనామం అత్యంత శక్తిమంతమైనదిగా ... మహా మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. 'బ్రహ్మాండపురాణం' లో ఉత్తరభాగంలో లలితా సహస్రనామావళి విశిష్టత కనిపిస్తుంది. దీనిని మొదటిసారిగా హయగ్రీవ స్వామి ... అగస్త్య మహర్షికి బోధించాడు. ఆనాటి నుంచి కూడా లలితా సహస్రనామం తనని విశ్వసించిన వారిని ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వస్తోంది. అందువల్లనే చాలామంది నిత్యం అమ్మవారి లలితా సహస్రనామావళిని చదువుతూ వుంటారు.చాలామంది లలితను చదవడం వలన ఒకే విధమైన ఫలితం ఉంటుందని అనుకుంటారు. కానీ ఇందులోని ప్రతి పంక్తి ఒక్కో దోషాన్ని నశింపజేసి ... ఒక్కో పుణ్య ఫలాన్ని అందిస్తుంది. ఆరోగ్యం .. సంపద .. సంతానం .. ఇలా ఏది కావాలనుకుంటే అది పొందడానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఆ పద్ధతులను పాటిస్తూ లలిత చదవడం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. లలితాదేవిని నిత్యం సహస్ర నామాలతో ఆరాధిస్తూ .. అర్చిస్తూ వుండటం వలన ఆ తల్లి అనుక్షణం కాపాడుతూ వుంటుంది .. కరుణిస్తూ వుంటుంది. 
 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!!



Tuesday, July 21, 2015

మంచిమాట !!!

                                                                                                మంచిమాట !!!

నిన్ను నువ్వు పోగుడుకోకు... ఎవరూ నమ్మరు

నిన్ను నువ్వు కించ పరచుకోకు .. అదే నిజం

 అనుకుంటారు.

శుభోదయం .../\...

                     శుభోదయం .../\..

.
చిన్ని ప్రయత్నం పెద్ద లక్ష్యాలను సాధించడానికి

 
చిన్ని అడుగు మహాప్రస్థాన మవుతుంది


కావాల్సిందల్లా సంకల్పబలమే !!

Monday, July 20, 2015

పెద్దలమాట చద్దిమూట!!


శుభోదయం .../\...


శ్రీ గోదారమ్మ మహా తల్లి పుష్కరాల్లో 15 వ తేదిన తాతపూడి గోదావరిలో... 16, 17 వ తేదిల్లో రాజమహేంద్రి మహానగరంలో అఖండ గోదావరిలోయధావిధిగా ఆచరించి గోదావరి మాతకి పూజలు, శ్రద్ధగా పుణ్యస్నానాలు,భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము.


శ్రీ గోదారమ్మ మహా తల్లి పుష్కరాల్లో 15 వ తేదిన తాతపూడి గోదావరిలో శ్రద్ధగా పుణ్యస్నానాలు, యధావిధిగా ఆచరించి గోదావరి మాతకి పూజలు, నా కవితా హారతి, తీర్థవిధులు ఆచరించిపూజ్యులు  మా అమ్మగారు బుచ్చిమహలక్ష్మి గారు గోదానం....  నా మిత్ర శ్రేష్టుడు శ్రీ వాడపల్లి నాగు ఆచార్యులవారు మరియు వారి గురుతుల్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహా నక్షత్ర యాగశాలలో మా తాతగారు కీర్తిశేషులు విస్సా వెంకటరావు గారి శ్రీ వెంకటేశ్వర పద్యాలు, గోదావరి మాతకి నా కవితా హారతి. ఆలపించే భాగ్యం నాకు లభించింది 16, 17 వ తేదిల్లో రాజమహేంద్రి మహానగరంలో అఖండ గోదావరిలో పుణ్యస్నానాలు, తీర్ధ విధులు, ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ గోదావరి మాత కి నా కవితా హారతి సమర్పించాను. దైవానుగ్రహం వల్ల ఆనందంగా పుష్కర పుణ్య స్నానాలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. ఆ దృశ్యాలు మీ కోసం.త్వరలో మరిన్ని ఫోటోలు పూర్తి వీడియోలు .

















































Tuesday, July 14, 2015

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?

       గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.
గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.
అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.
అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.
ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

Total Pageviews