Monday, July 6, 2015

అక్షింతల పరమార్థం ఏమిటి? అక్షింతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు?

అక్షింతల పరమార్థం ఏమిటి? అక్షింతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు,                         కుంకుమలు కలపడం ఎందుకు?
మనిషి దేహంలో విద్యుత్ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో
ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్ ప్రసారకేంద్రం కూడా. తలపై
అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. పసుపు కుంకుమలుశుభానికి సంకేతాలు.ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం. ఆయుర్వేదం ప్రకారం, చర్మసంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది.
అక్షితలు వేసే వారికి ఎలాంటి రోగసమస్యలున్నా, పుచ్చుకునేవాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపుకుంకుమలు నివారిస్తాయిట.భగవద్గీతలో అన్నాద్భవంతి భూతాని” అని మూడవ అధ్యాయంలో
శ్రీకృష్ణపరమాత్ముడు  చెప్పాడు.
జీవులు అన్నం చేత పుడతారట. ఈఅన్నం తయారీకి మనం ఉపయోగించే
ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరిగి ఈ జీవుడినిభగవంతుడిలో చేర్చడమే. అక్షింతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది అని పెద్దలు చెపుతున్నారు.

No comments:

Post a Comment

Total Pageviews