Tuesday, December 18, 2018

మార్గశిర శుద్ధ ఏకాదశి; గీతా జయంతి

మార్గశిర శుద్ధ ఏకాదశి మామూలు ఏకాదశి కాదు. ఎందుకంటే, 5వేల ఏళ్ల క్రితం ఇదే రోజు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను బోధించాడు! అందుకే, మార్గశీర్ష మొదటి ఏకాధశిని గీతా జయంతి అంటారు. అంటే, ఆ రోజున గీత జన్మించిందన్నమాట! బహుశా ఈ కారణం చేతనే కృష్ణుడు ''మాసానాం మార్గశీర్షోహం'' అన్నాడు. మాసాలలో తాను మార్గశీర్ష మాసం అని భగవానుడు ప్రత్యేకంగా చెప్పాడు. అంతటి విశిష్ఠత ఈ గీతా జయంతి కారణంగానే వచ్చిందనుకోవచ్చు....

మామూలుగా భగవద్గీత కృష్ణార్జునుల సంవాదం అని మనకు తెలుసు. కాని, మనకు తెలియని ఇంకా బోలెడన్ని విషయాలు, విశేషాలు గీతలోనూ, గీత గురించి వున్నాయి. అందులో ముఖ్యమైన అయిదు సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం!

1. భగవద్గీత పార్థుడికి, పార్థ సారథికి మధ్య చర్చ అయితే... గీత అని ఎందుకు అన్నారు? గీత అంటే పాట. భగవద్గీత పాట రూపంలో అనుష్టుప్ ఛందస్సులో వుంటుంది. ప్రతీ శ్లోకంలోని ప్రతీ పాదానికీ 32అక్షరాలు వుంటాయి. కొన్ని చోట్ల కొన్ని కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలకి త్రిష్టుప్ ఛందస్సు కూడా ఉపయోగించటం జరిగింది. అందులో నాలుగు పాదాలు, పాదానికి 11అక్షరాలు వుంటాయి. 2, 8, 11 అధ్యాయాల్లో మనం ఇలాంటి చూడవచ్చు...

2. భగవద్గీత పరిమాణం ఎంత? భగవద్గీత మొత్తం 18అధ్యాయాల్లో విస్తరించి వుంది. అందులో మొత్తం 7వందల శ్లోకలు వున్నాయి.

3. భగవద్గీత ఎన్ని వేల సంవత్సరాల క్రితం, ఎప్పుడు భగవానుడు ప్రబోధించాడు? మహాభారతంలో పేర్కొన్న వివిధ ఖగోళ విశేషాలు, గ్రహాణాల ఆధారంగా లెక్కగడితే క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో కలియుగం ప్రారంభమైంది! అంతకు 35ఏళ్లు ముందు కురుక్షేత్రంలో గీతా బోధ జరిగింది! అంటే... భగవద్గీత క్రీస్తు పూర్వం 3137వ సంవత్సరం నాటిదన్నమాట!

4. భగవద్గీత ఇంగ్లీష్ లోకి ఏ సంవత్సరంలో అనువాదించారు? 1785లో! చాల్స్ వికిన్స్ లండన్లో ఈ తొలి అనువాదం చేశాడు. అంతకు కేవలం 174ఏళ్లే ముందే ఇంగ్లీష్ లోకి బైబిల్ ను అనువదించారు!

5. భగవద్గీత ఇప్పటి వరకూ మొత్తం ఎన్ని భాషల్లోకి తర్జుమా అయింది? గీతాచార్యుడు సంస్కృతంలో చేసిన బోధనని ఇప్పటి వరకూ 175భాషల్లోకి అనువదించారు! 
నేడు గీతా జయంతి
☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?
👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
👉-కర్తవ్యం గురించి చెబుతుంది.
👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
👉నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.
అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.
గీత చదువుకో.....
నీ రాత మార్చుకో.....
గీతా జయంతి శుభాకాంక్షలు

Monday, December 17, 2018

ధనుర్మాస మహాత్యం

ధనుర్మాస మహాత్యం

ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు. ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో వేంకటేశ్వరున్ని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈమాసం మొత్తం  శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ థనుర్మాసాన్ని భావిస్తారు. ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి.

ప్రతిదినం ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసిన తర్వాత ...మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్యోజనమును సమర్పిస్తారు. ఈ ధనుర్మాస ప్రత్యేక ప్రసాదాలను తీసుకుంటే తమకి ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ ధనుర్మాస ఉత్సవాలను దేశవ్యాప్తంగా విష్ణు దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్దారు. 108 దివ్య వైష్ణవక్షేత్రాలలో ప్రధాన మైన తిరుమలలోనూ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు అర్చకులు.

ధనుర్మాస పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతుంది. ఈనెల 16వ రాత్రి 10గo.52ని ల నుంచీ ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికార్లు. ఈ నెల రోజులపాటూ శ్రీవారికి చేసే సుప్రభాత సేవను రద్దు చేసి ఆస్ధానంలో తిరుప్పావై పఠించనున్నారు అర్చకులు. దీని వెనుక పురాణ గాధను పరిశీలిస్తే  గోదాదేవి  తనను ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను ఈ నెల రోజుల పాటూ పఠిస్తారు. రోజుకొక పాశురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం ఆలయంలో జరుగుతుంది. నిత్యం వేదపారాయన చేసే అర్చకులే స్వామివారికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ధనుర్మాసం మొత్తం జీయంగార్లు తిరుప్పావై పాశురాలను స్వామివారికి చదివి వినిపిస్తారు.

గోదాదేవి రచించిన ఈ 30 పాశురాలను రోజుకోక పాశురం చోప్పున.... పటిస్తారు జీయంగార్లు. అనంతరం స్వామివారికి తోమాలను సమర్పించి, సహస్రనామార్చన చేస్తారు అర్చకులు. అనంతరం యధావిదిగద అన్ని పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు. పెళ్లి కావాల్సిన వారు ఈ మాసంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షింతలను తాము శిరస్సున దరిస్తే ఖచ్చితంగా ఏడాదిలోనే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వస్తుంటారు.

ఇక శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో నిత్యం  భోగ శ్రీనివాస మూర్తికే జరుపడం ఆచారం. అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాస మూర్తికి  బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు అర్చకులు. మరో వైపు  నిత్యం శ్రీవారిని తులసీ ఆకులతో అర్చిస్తుంటారు అర్చకులు. అయితే ఈ మాసం మొత్తం తులసిఆకులకు బదులుగా బిల్వ  పత్రాలను ఉపయోగించడం ఆచారం. ఈ బిల్వపత్రాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో ఈ పత్రాలతోనే స్వామివారిని అర్చస్తారు అర్చకులు.

ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి. ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి.

కాత్యాయనీవ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్రత విధానం ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరిస్తారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవం మహా ఘనంగా జరుగుతుంది. తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్

ని ''పావై నొంబు'' అంటారు.

వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.


Image result for వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.

Image result for వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మూడు + కోటి = ముక్కోటి
ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరిచి , ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు.
ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలావిశేషాలు ఉన్నాయి.
శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య,కూర్మ,వరాహ, నారసింహావతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ,ద్వాపరయుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి, కలియుగంలో విరజానదీ మధ్యభాగంలో, సప్తప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీ దేవి భూ దేవిల సమేతుడై, విష్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా, శేషపాన్పుపై అర్చావతారుడై వెలసిన దివ్యగాధను, ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది. ఇందు వెనుక ఆసక్తికరమైన కధ ఉంది.
పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు, తన గొప్పదనాన్ని అందరితోపాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాల్కులకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ భూనీలా సమేతముగా, పరమశివుడు పార్వతీగంగా సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీ వాణీ సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు ,ముక్కోటి దేవతలు, సకలలోక వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసారు. వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతిదేవి ఇంద్రునితో ," నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమణులున్నారని ఏర్పాటు చేస్తే, అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా" అని అడుగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వశి,మేనక,తిలోత్తమలను పిలిపించి నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు. వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయమని కోరాడు.
అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, అనంతరం లక్ష్మీ నారాయణుల పాద పద్మములకు, వాణిపద్మజులను సేవించి, సభికులకు అభివందనం చేసి, సరస్వతీ భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలు పెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు. రంభ నాట్యకౌసల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీ దేవి నవరత్నఖచిత బంగారు గండపెండేరాన్ని,లక్ష్మీ దేవి బంగారు కడియాన్ని,సరస్వతి దేవి రత్న ఖచిత దండ కడియాన్ని, రంభకు బహూకరించారు. ఇంకా చాలా మంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు.
రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభాసదులందరూ కరతాళధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందన వనానికి వెళ్ళాడు.
ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు ,నేరుగా నందన వనానికి వెళ్ళి,సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికీ అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్నకిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినప్పటికి బృహస్పతి వినకపోవడంతో, రోషావేశపూరితమైన రంభ దేవ గురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది.
ఈ లోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి, ముగ్గురుని త్రిమూర్తుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఈ శాపాలు అందరు అనుభవించవలసిందే అని తెలిశాక, ఇంద్రుడు భోరున విలపించసాగాడు. దీనముగా వేడుకున్నాడు.
ఇంద్రుని దుఃఖాన్ని చుసిన కరుణాపూరితుడైన విష్ణుభగవానుడు అతనిని ఓదార్చి, తను భూలోకంలో అవతరించి శాపవిమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీ దేవి " స్వామి గురువుశిష్యులు ఇద్దరు పరస్పర వివేకశూన్యులై శపించుకుంటే , ఆ శాపవిమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి...రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా? " అని అడిగింది.
తాను ద్వాపరయుగాంతంలో దుర్వాసుని శాపంవల్ల బాధితురాలైన ఓ గొల్ల భామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు.
అలా శ్రీ మహవిష్ణువు భూలోక అవతార వెనుక చాల కథలు ఉన్నాయి...అందులో ఇది ఒకటి!
Image result for వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.

అంతా కలిసి మనుషులంతే!

‘ఇదంత అర్రీబుర్రీగా తేలే యవ్వారం కాదు. నువ్వడగ్గానే బోటేసెయ్యడానికి! దానికో కతా కమామీసూ వుంటది. శ్రీ గవర్నమెంటు వారి ఉత్తర్వుండాల. ఆ గుమాస్తాల్నీ ఆళ్లనీ బెత్తాయించాల! ఏటి? ఆఁ! ఓ లకారందాకా కర్చవుద్ది!’ చుట్టపొగ ధారాళంగా వదుల్తూ చెప్పాడు కాంట్రాక్టర్.

‘లకారందాకా అవుతుందిటండీ!’ అంటూ నసుగుతున్నాడు జోగినాథం.

‘సర్లేవయ్యా! విన్నాంగా? అలాగే కానీ! నాకుమాత్రం మాటరాకూడదు. పెద్దింటి వ్యవహారం. ఫంక్షనుకొచ్చే వాళ్లంతా చాలా పెద్దమనుషులు! ఏఁవనుకున్నావో?’ అంటూ దర్పంగా కారెక్కాడు సోమరాజుగారు.

‘దీన్సిగదరగా! ఏం ఫోర్సూ?’ అని మనసులో అనుకుని, ‘మాకు తెల్దేటండీ? మీరెళ్లండి నేజూస్కుంటాను!’ అంటూ సాగనంపేసాడు కాంట్రాక్టర్.

‘ఇదిగో జోగినాథం, ఆ పళ్లంరాజుకి ఫోను కలుపు. అర్జంటుగా ఓ బోటు కావాలన్జెప్పు. డీలక్సే!’ అంటూ లోపలికి అరిచాడు.

‘మీకేఁవండీ! ఎన్నైనా చెబ్తారు. ఇప్పటికిప్పుడు బోటెయ్యాలంటే మాటల్టండీ? ఎన్ని కాయితాలు నింపాలి, ఎన్ని దస్కత్తులు పెట్టించాలి? ఇవాళంతా నాకిక నిద్దరుండదు!’ అంటూ విసుక్కున్నాడు జోగినాథం.

‘మన కిష్టిగాణ్ణట్టుకునెళ్లవయ్యా! ఆ పెద్దమడిసి లకారం ఇస్తానన్నాడు ఆలకించలేదా?’ అన్నాడోలేదో

‘లకారాలన్నీ మీకూ, నకారాలన్నీ నాకునున్నూ! సర్లెండి! బయల్దేరుతున్నా! ’ అంటూ పంచెబిగించి బయటపడ్డాడు.

గోదారిమీద డీలక్సు బోటేసుకుని పాపికొండల మీదుగా లంకలన్నీ తిరుగుతూ బాపుగారి జన్మదినోత్సవం జరపాలని ప్లానేసాడు మంగళా టెక్స్‌టైల్స్ సేట్ గారు.

దానికి జంగమనేని భగవంతరావుగారు, రాజా రామదాసుగారు, కొబ్బరికాయల సుబ్బారాయుడు కూడా వస్తున్నారు. పెద్దవాళ్లతో వ్యవహారం. అంతాజేరి బోటుమీద ఎంచక్కా ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ కావలసింది తింటూ, ఆనక కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిని చూసేసి ఒడ్డుకి చేరాలని ప్రణాళిక వేసేరు.

ఇంకో జనతా బోటుని కూడా బెత్తాయించమని చెప్పాడు సేటు. అలగాజనం వస్తారేమోననీ, పెద్దమనుషులకి ఇబ్బందవుతుందనీనూ!

సేట్ చెప్పిందంతా విన్న భగవంతరావు రెండు బోట్లుండడానికి వీల్లేదన్నాడు. ‘అందరం సమానమేనూ, సీతారాముడు చెప్పింది మర్చిపోయారా?’ అంటూ సున్నితంగా మందలించాడు.

సుబ్బారాయుడు కూడా అదేమాటన్నాడు. ‘మా అమ్మాయి అను, అల్లుడు బాబ్జీ చెప్పీదాకా నేనూ అలాగే గునిసీవోణ్ణి! ఆళ్లే నా కళ్లుతెరిపించారు!’ అంటూ గుర్తుచేసుకున్నాడు.

కాంట్రాక్టర్ తలుచుకుంటే బోటేయించడం అదెంతపని? అందుకే జోగినాథంతో కలిసి సోమరాజుగారిని వెళ్లి మాటాడమని పంపించాడు సేట్.

మొత్తానికి జోగినాథం, కిష్టిగాడూ కలిసి అందమైన డీలక్స్ బోటొకటి సంపాయించారు.

మధ్యలో సామాలమ్మ పెసరట్ల పొయ్యికోసం జాగా వదిలేసి, చుట్టూరా కుర్చీలేయించాడు శ్రీధరంబాబు. అంతాచేరి వేడివేడి పెసరట్లు వేసినవి వేసినట్టే లాగించేస్తున్నారు.

శ్రీధరం భార్య లక్ష్మి, మన రామం పెళ్లాం సీతా,  సుబ్బారాయుడి కూతురు సుశీలా కలిసి వచ్చినవాళ్లందరికీ కాఫీలూ, టిఫిన్లూ అందాయోలేదో చూసుకుంటున్నారు.

ఇక సీతారాముడయితే తల్లో నాలుకే! పెద్దాళ్లూ, పిల్లలూ అందరికీ అతనే కావాలి.

‘రామఁవన్నయ్యా గౌను బొత్తం కుట్టిపెట్టవూ?’

‘రామన్నయ్యా నాకు పెసరట్టొద్దు. ఉత్తి ఉప్మాయే కావాలి. తెచ్చిపెట్టవూ?’

‘ఏఁవోయ్ రామం? ఆ వెనకాలున్నవాళ్లకి కాఫీలందలేట్ట? ఓమారు కనుక్కో!’

‘ఒరేయ్, రాముడూ, ఈ వత్తులపెట్టి ఎక్కడుందో కాస్త వెదికిపెడుదూ నీకు పుణ్యఁవుంటుంది!’

ఇంతమంది హృదయాల్లోనూ ఆ అందాలరాముడు కొలువై వున్నందుకు సీతకీ, భగవంతరావుకీ చాలా గర్వంగా అనిపిస్తోంది.

‘పేరంటాలపల్లొచ్చింది. అందరం దిగి తీర్థాల్లోకెళ్లి కాసేపలా తిరిగొద్దాం!’ అంటూ ప్రకటించారు బాబ్జీ, అనూరాధ!

అప్పులప్పారావుకి పేరంటాలపల్లనగానే ఆశపుట్టింది. ఆవూళ్లోనేగా తీతా వుంట?

బోటలా రేవులో ఆగ్గానే ఒక్కంగలో దూకి పరిగెట్టాడు. నెత్తిన టోపీతో కొంగలా అడుగులేసుకుంటూ నడుస్తూ పోతున్న ముసలతన్ని ‘బావున్నావా తీతా?’ అనడిగాడు.

‘ఒరేయ్ అప్పారావ్, ఎన్నాళ్లయిందిరా నిన్నుచూసి? ఎప్పుడొచ్చావు ఏఁవిటి కథ?’ అంటూ కళ్లనీళ్లపర్యంతమైపోయాడు.

‘ఓ ఫైవిస్తే నీకో గుడ్ న్యూస్ చెప్తాను తీతా!’ అన్నాడు గారంగా!

‘నీ రేటింకా ఫైవేనుట్రా? రోజులెలా వున్నాయి? ఇంద, ఈ అయిదొందలుంచు!’ అంటూ ఫెళఫెళలాడే కొత్తనోటిచ్చాడు తీతా.

‘నాకొద్దు తీతా! అయిదివ్వు చాలు. అదే పదివేలు!’ అని అయిదే తీసుకుని ఎవరెవరొచ్చారో చెప్పాడు.

‘ఏఁవిటీ, మన రాఁవుడొచ్చాడా? డిప్టీకలక్టర్ రాముడు??’ ఆనందం పట్టలేకపోతున్నాడు.

‘వచ్చాడు తీతా! వాణ్ణా బెస్ట్ ఫ్రెండు! నీకుతెలుసుగా?’ అంటూ తీతాని వెంటబెట్టుకుని బోటుదగ్గరకి తీసుకెళ్లాడు. అంతమందినీ ఓసారే చూసేటప్పటికి ఆనందం పట్టలేకపోయాడు తీతా.

ఆనక అతనూ వాళ్లతో కలిసి బోటెక్కాడు.

మాధవాచార్యులూ, బామ్మగారు కలిసి చేసుకునే దైవార్చనకి ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన సదుపాయాలు చేసిపెడుతున్నారు రాముడూ, గోపీ!

సామాలమ్మ ఆధ్వర్యంలో అంతాకలిసి చాకలిబానాట ఆడారు. అందరికంటే ముందు సుబ్బారాయుడు ఔటైపోయాడు. చుట్టూ తిరుగుతూ రుమాలట్టుకెళ్లి అనూరాధకేశాడు. అదిచూసిన బాబ్జీ చెప్పబోతోంటే వద్దని వారించాడు.

మాఁవా అల్లుళ్ల అన్యోన్యత చూసి అన్నపూర్ణమ్మ, రామభద్రయ్య మనసులోనే మురిసిపోతున్నారు.  అంత మంత్రిహోదాలో వుండికూడా తమతో కలిసి బోటెక్కి వచ్చిందని అన్నపూర్ణమ్మని చూసి గర్వపడుతున్నారు మిగతావాళ్లు!

కొబ్బరుండలు పంచింది కాంట్రాక్టర్ పెళ్లాం. ఆవిడ మనసులానే తియ్యగా, ఒక్క రాయైనా తగలకుండా ఎంతో రుచిగా వున్నాయవి. గోపీ వాళ్లావిడ రాధ తెచ్చిన జంతికలు, జోగినాథం భార్య ప్రత్యేకంగా చేయించుకొచ్చిన పూతరేకులు అంతా ఎగబడి తిన్నారు.

ఒకరేవులో బోటాపించి, తన అథార్టీతో మనుషుల్ని పురమాయించి, అప్పటికప్పుడు తీతా తీయించి, పంచిపెట్టిన తిప్పుడు బెల్లం రుచి పిల్లలకి చాలా నచ్చేసింది.

వాళ్లందరితోపాటూ మధ్యలో కూర్చుని భగవంతరావు కూడా చిన్నపిల్లాడికిమల్లే తిప్పుడు బెల్లం తింటోంటే కుర్చీల్లో కూర్చున్న పెద్దాళ్లందరికీ కళ్లు తడిబారాయి. ఆ పసిమనసు కొట్టే కేరింతలకి వాళ్ల మనసులూ మురిసాయి.

సోమరాజుగారి ‘ఇలాకా’ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా పెట్టించాడు కాంట్రాక్టరు. ఆ కాసేపూ సోమరాజుగారిని విపరీతంగా ఆటపట్టించేసారు శ్రీధరఁవూ, రాముడూ, గోపీ! ఆనక మళ్లీ నవ్వేసుకున్నారు అంతాకలిసి.

ఈలోగా చీకటడిపోయింది. పున్నమవడంవల్ల నిండుచంద్రుడు నిగనిగలాడుతూ బయటపడ్డాడు. అప్పుడే పుట్టిన పిల్లాణ్ణి చూసుకున్న గోదారితల్లి కళ్లు వెండివెలుగులతో మెరుస్తున్నాయి. ఆ వెలుగంతా ఆ పున్నమి పున్నెమేనని ఎరగదు ఆ పిచ్చితల్లి!

గలగలలు ఎక్కువయ్యాయి. ఆనందపు అలల్లో సరదాలు సంబరాల మధ్య జనతా బోటులాంటి మహరాజా డీలక్స్ బోటు హాయిగా సాగిపోతోంది.

ఇంతటి ఆనందాన్నీ రెట్టింపు చేస్తూ కృష్ణమూర్తి అందుకున్న పాటకి అతని భార్య సత్యభామ, అతని ఒకటిన్నర కేసు వసుంధర చేసిన నృత్యం అందరికీ కన్నుల పండగే చేసింది.

చివరాఖర్న సేటుగారు మాటాడుతూ....

‘నేనూ....

రూపాయి ఖర్చుపెట్టాలంటే చాలా ఆలోచిస్తాను. దానివల్ల వస్తే లాభఁవన్నా రావాలి. నష్టమన్నా రాకుండా వుండాలి. ఇదే! ఇన్నాళ్లనించీ నేనిలానే అనుకుంటూ వుంటే...

నిన్నా....

ఈ క్రిష్ణమూర్తొచ్చాడు నా దగ్గరకి. ‘మీరు ఖర్చుపెట్టే రూపాయికి వచ్చే లాభంకంటే ఎక్కువ విలువైనది నే రప్పిస్తాను. ఆనక మీరే ఆశ్చర్యపోతారు’ అన్నాడు.

నేన్నమ్మలా! చెప్పొద్దూ? ‘డబ్బుకంటే ఆనందాన్నిచ్చేవి ఏఁవుంటాయయ్యా ఈలోకంలో?’ అంటూ కొట్టిపారేశాను. కోప్పడ్డాను.

కానీ.....

ఇతను వినలేదు. నన్ను నానాయాగీ చేసి, లక్షా పట్టుకుపోయాడు. ఖర్చుపెట్టేశాడు.

ఇప్పుడు చెప్తున్నాను.

నేనూ....

ఓ ఫూల్ని! ఇంతకాలం డబ్బొక్కటే ఆనందాన్నిస్తుందనేసుకున్నవాణ్ణి!

ఈ సుబ్బారాయుడు, భగవంతరావు...వీళ్ల ఆత్మీయత,

ఇంకా నేతివాసన వదలని మన సామాలమ్మ పెసరట్టు రుచీ,

మాధవ మనందరి మంచినీ కోరుతూ చేసే ఆ పూజాదికాలు,

ఈ ఆడపిల్లలు.. రాధ, లక్ష్మి, సీత, అను చేసిన నిస్వార్ధసేవలు, 

‘రాముడూ రాముడూ’ అంటూ ఎంతమంది పిలిచినా విసుక్కోకుండా అతనందించే ఆనందం,

ఇవన్నిటితోపాటు ఆ వెన్నెల పరుచుకున్న గోదారీ, ఎదురుగా ఋషీశ్వరుల్లా కొలువుతీరిన ఆ పాపికొండలూ...

ఇంత సంపద ఎన్ని లక్షలిచ్చినా రాదని అర్ధమైంది. క్రిష్ణమూర్తిని ఇవాళే మేనేజరుగా ప్రమోట్ చేస్తున్నాను. ఇంతలా మేనేజ్‌మెంట్ తెలిసినతను మేనేజరుకాక ఇంకెవరు?

అందరికీ ధన్యవాదాలు! ఇలానే ప్రతీయేడూ మనందరి సృష్టికర్తలైన బాపురమణల్ని మనసారా తలుచుకుంటూ ఆలోకంలో కూడా వారిని ఆనందాల గోదాట్లో స్నానం చేయిద్దాం!

శుభంభూయాత్! సెలవు!’

అంటూ ముగించారు.

అందరి కళ్లల్లోనూ తడి. వెన్నెల పడి ముత్యాల్లా మెరుస్తున్న అందరి కళ్లు ఎలావున్నాయంటే...

ఆ బోటుని దూరాన్నించి చూసేవాళ్లకి ‘అందులో మణిమాణిక్యాలున్నాయా?’ అని అనిపించేంతలా!

అవును. వారిద్దరి కలలూ, కలాలూ కలిసి వెలిసిన మణులేగా అక్కడున్నవారంతా!

మంచీచెడూ వేరేవేరే రాసులుగా పోసుండవు.

కాంట్రాక్టరూ, సుబ్బారాయుడు, భగవంతరావులు దెయ్యాలూ కారు...

మాధవా, కృష్ణమూర్తి, రాముడూ దేవుళ్లూ కారు...

అంతా కలిసి మనుషులంతే!

కష్టాలనే ఇష్టాలుగా మలచుకుని స్పష్టమైన మార్గాన్ని మనకి చూపించిన ఇంతమంది మానవులనీ సృష్టించిన ఆ బాపురమణలకి నా వందనం.

ఇప్పటికీ అర్ధం కాదు...

అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ...
ఇప్పటికీ అర్ధం కాదు...
పనిచేయటానికి బ్రతుకుతున్నానా?
లేక బ్రతకటానికి పని చేస్తున్నానా అని !?

బాల్యంలో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...
పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని?
ఆ సమాధానం ఇప్పుడు దొరికింది!
మళ్ళీ బాల్యం కావాలని!
మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని
మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది
వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని

ఔను...
లోకం లాజిక్కుని  చూపింది వాళ్ళే మరి!
 జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే!
డబ్బు సంపాదించేటపుడు తెలిసింది.....
నా విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని
నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని

 నవ్వాలని అనిపించినా ...
నవ్వలేని  పరిస్థితి...
ఎలా ఉన్నావని ఎవరైనా అడిగినప్పుడు ---
ఓహ్ !
నాకేం  బ్రహ్మాండంగా వున్నా!!
అని అనక తప్పనప్పుడు.
ఏడవాలన్నా  ఏడవలేని పరిస్థితి!
వాడికేందిరా....
దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు
ఇది జీవిత నాటకం...
ఇక్కడ అందరూ నటులే...
నటించక తప్పదు....
అవార్డుల కోసం కాదు...
బ్రతకటం కోసం !!
కాదు.. కాదు....
బాగా బ్రతుకుతున్నానని నమ్మించటం కోసం.

రాతి మనిషి నిప్పురాజేయటానికి చాలా కష్టపడ్డాడట....
ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు ...
ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...

సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట....
బాహ్య లోకంలో జీవం ఉందా లేదా అని....

మరి మానవ జీవితంలో సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!

ఓజోన్ పొర డ్యామేజ్ అయి భూతాపం పెరిగుతుందని ఆందోళన ...
ఒకరిపై ఒకరికి వుండే ఈర్ష్యా, ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే...

పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు కర్కశత్వం కూడా !

మట్టిలో మొక్కలు నాటాలి...
మనసులో మానవత్వం నాటాలి
ఇదంతా గట్టిగ అరవాలి.... అందరికి చెప్పాలి....

మళ్ళీ ఒక్క క్షణం...
నాకెందుకులే అని !
సమస్య నా ఒక్కడిదే కాదుగా అని!

నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి
పక్కవాళ్ళ కష్టం గురించి పట్టించుకునేంత తీరికెక్కడిది నాకు!
నా పని...
నా ఇల్లు...
నా పిల్లలు...
నా...నా.. నా...
నాతోనే నలిగిపోతున్నా...!
ప్రక్కవాణ్ణి నిందిస్తూ రోజు గడిపేస్తున్నా!

జీవితమన్నది
తనంత తానుగా...
నడచి పోతుంది…
గడచి పోతుంది....
మనకళ్ళముందే.....
మనకు తెలియకుండానే ముగిసిపోతుంది.

చేయడానికి చాలా టైం వుందని
చావు దగ్గరకోచ్చేదాకా చోద్యం చూస్తున్నా!
చివరికి ఉసూరంటూ కాటిదాక నలుగురి కాళ్ళతో నడిచిపోతున్నా కనుమరుగౌతున్నా...

ఎవరినో అడిగాను ...
అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని ?
ఎవరో మహానుభావుడు ఎంతో  అందంగా సేలవిచ్చాడు !!!
నిద్ర, సగం మృత్యువట!
మరి మృత్యువు,ఆఖరి నిద్రట!!
అసలు ప్రశాంతంగా నిద్రించి ఎన్నేళ్ళయ్యిందో!
ఏదో ఒకనిద్ర ఆవహిస్తే అదే వరం!

ఆనందం లేని అందం...
జవాబు లేని జీవితం....
ప్లాస్టిక్ పరిమళం..
సెల్ ఫోను సోయగం...
వెరసి ఇదీ నా నాగరిక జీవనం!
 తెల్లారి పోతున్నది...
 రోజుమారుతున్నది..
మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....

ఏంటో జీవితం....
రైలు బండి లా తయారయింది!
ప్రయాణమైతే ప్రతి దినం చెయ్యాలి
చేరే గమ్యం మాత్రం లేనే లేదు!

ఒకడు శాసించి ఆనందిస్తాడు
మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు

ఒక రూపాయి విలువ తక్కువే కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే....
అది లక్ష ఎప్పటికీ కాదు...
ఆ లక్ష సంపూర్ణం కాదు...

అందుకే...
మనిషి లో  మనీ కోసం కాకుండా, ఆనందం,సంతోషం కోసం బతకండి

అదే నిజమైన జీవితమౌతుంది!
👏👏👏👏👏👏👏👏

Friday, December 14, 2018

దశావతారాలు వెనుకున్న రహస్యాలు

దశావతారాలు: విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు..
ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణేతిహాసాల్లోనూ ఇది విషయం మనకు స్పష్టమౌతున్నది. కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం. అంతేకాక...మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్క్రుతిలో భాగమే...
విష్ణువు పది అత్యంత ప్రసిధ్ద అవరోహణల్ని సమిష్టిగా దశావతారలని అంటారు. ఇది గరుడు పురాణంలో రాసుంది. మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి నాలుగు అవతారాలు సత్య యుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత మూడు అవతారాలు, త్రేతాయుగంలో, ఎనిమితో అవతారం ద్వారపర యుగంలో తొమ్మిదో అవతారం కలియుగంలో, పదోది కలియుగాంతంలో కనిపిస్తుందని అంచనా ...
చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది. ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు. మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది.
పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. కానీ వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఆ అవతారలు బట్టే విష్ణువు ఎక్కువ ప్రాచుర్యం పొందాడు.
భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు).
పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:

1. మత్స్యావతారము:
మహా మీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంత్యకాలంలో, వేదాల్ని దొంగలించిన సోమకుణ్ణి వధించి, సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నావెనెక్కినంచి, సప్తర్షులతో , సకల బీజాల్ణీ , ఓషధుల్నీ కూడిన ఆ నావని తన మూపు మీద ధరించి రక్షించాడు... %ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో వూవస్వత మనుపు.

2. కూర్మావతారము:
కూర్మాతవారము,లో క్షీరసాగరమథనవేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు ..

3. వరాహావతారము:
వరాహావతారము సత్య యుగంలోనే కనిపించినది. ఆ దేవదేవుడు పంది రూపంలో అవతరించాడు. హిరణ్యాక్షుడనే అను రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసి...భూమిని పాతాళంలో పడవేసి బ్రహం నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు. వరహావతతారంలో విష్ణుమూర్తి హిరణ్య్యాక్షుడిని సంహరించి...భూమిని, వేదాలను రక్షిస్తాడు .
4. నృసింహావతారము లేదా నరసింహావతారము:
నారసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది. ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నారసింహావతారంలో దిగివచ్చిన శ్రీమహా విష్ణువు హిరణ్య కశ్యపుడిని సంహరిస్తాడు.

5. వామనావతారము :
వామనావావతారంతో బలిని మూడడుగులడిగి, ముల్లోకాల్నీ ఆక్రమించాడు. అంటే శ్రీ మహావిష్ణువు మరుగుజ్జు రూపంలో వచ్చిన వామనుడు. రెండడుగులతో అండపిండ బ్రహ్మాండాల్ని ఆక్రమించి మూడో పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపుతాడు . ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు. మానవలు మొదట మరుగుజ్జులుగా ఉన్నారనే విషయం ఇక్కడ మనకు తెలుస్తోంది .

6. పరశురామావతారము:
కుపితభావంతో, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించాడు. మనషి రూపంలో ఉన్నా...అనాలోచితంగా, ఆవేశపూరితంగా ప్రవర్థించడం కనిపిస్తుంది. అంటే నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదహరణగా చెప్పుకోవచ్చు,.

7. రామావతారము:
శ్రీరాముడై, దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది, సముద్ర నిగ్రహనాది పరాక్రమాల్ని ఆచరించాడు. ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించడం, తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం కనిపిస్తుంది. రామావాతరాం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది . మానవ జీవనం ఎలా సాగాలో ఆచరించిన చూపిన రాముడు ఆదర్శపురుషుడయ్యాడు .

8. బుద్దావతారము:
బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. కలియుగాదిలో రాక్షససమ్మోహనం కోసం, కీకటదేశంలో (మధ్యగయా ప్రాంతంలో) జినసుతుడై, బుద్దుడనే పేర ప్రకాశిస్తాడు.

9. కృష్ణావతారము:
బలమరామ, కృష్ణావతారలతో భూమి భారన్ని తగ్గించాడు . బలరాముడి సోదరుడిగా శ్రీక్రుష్ణుడు జన్మిస్తాడు. ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జ్ఝానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజంయం సాధిసంచేందుకు ఆయన రథసారిధిగా నిలిచాడు శ్రీక్రుష్ణడు . ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

10 కల్కీ అవతారము :
చివరగా కలియుగ, కృటయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు ...సర్వమ్లేచ్ఛ సంహారంగావిస్తాడు. దర్శ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం, ప్రతీ యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తూ ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఈ అవతారలన్నీ అందుకు ప్రతీకలే...
Related image
వ్యాస కర్తకు ధన్యవాదాలు.
కలియుగంలో అధర్మ పరులకు ధర్మము అధర్మముగా కనిపించును . విప్ర దూషణ, వేదాలను,భగవంతుణ్ణి కూడా దూషించే స్థాయికి చేరి తుదకు నాశనం చెందుతారు.

ఇది విజ్ఞానపు యుగమా లేక అజ్ఞానపు యుగమా

విజ్ఞానం మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తెచ్చిందో చూడండి🤔

మొదట : బావులలో నీరు త్రాగి వందేళ్ళు బ్రతికేవారు...
ఇప్పుడు : ఫిల్టర్ నీరు త్రాగుతూ 40 యేళ్ళకే ముసలి వాళ్ళం అయిపోతున్నాము...
.

మొదట : నూనె  గింజలు గానుగ ఆడించిన నూనె తిని వృధాప్యములోనూ గట్టిగా వుండేవారు..
ఇప్పుడు : డబల్ ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ తింటూ కూడా చిన్న వయసులోనె   హృదయాఘాతానికి గురి అవుతున్నాము..

మొదట : రాళ్ళ ఉప్పును సేవించినా ఆరోగ్యవంతులు గా వుండేవారు..

ఇప్పుడు : అయోడిన్ ఉప్పు సేవిస్తున్నా హై బీ.పి  &  బీ. పి తో బ్రతుకుతున్నాము..

మొదట : వేప పుల్లలు, బొగ్గు, ఉప్పుతో పల్లు తోమి 80 సంవత్సారాలలో కూడా చెరుకుగడలు చీల్చుకుని తినేవారు..
ఇప్పుడు : కోల్గేట్ తో పల్లుతోముతూ కూడా డెంటిస్ట్ దగ్గరకు పరుగెత్తుతాం..


మొదట : నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేసేవారు
ఇప్పుడు : అన్ని స్కానింగ్లు చేసి కూడా రోగం ఏంటో చెప్పలేక పోతున్నారు

మొదట :    7 - 8 మందికి జన్మ నిచ్చిన తల్లి తన 80 వ యేట కూడ పొలం పనులు సునాయాసంగా చేసేది
ఇప్పుడు :   మొదటి నెల నుండి వైద్యల పర్యవేక్షణలో వున్నా ఆపరేషన్ తోనే పిల్లలు పుడుతున్నారు

మొదట : బెల్లం పిండి వంటలను కడుపు నిండా తినేవారు
ఇప్పుడు : తినక ముందే  షుగర్ వచ్చేసి వుంటుంది

మొదట :   వృద్దుల కు కూడా కీళ్ళ నొప్పులు వుండేవి కావు
ఇప్పుడు : యవ్వన దశ నుండే కీళ్ళ జబ్బులు, నడుం నొప్పులు మొదలు అయిపోతున్నాయి

చివరగా

ఇది విజ్ఞానపు యుగమా లేక అజ్ఞానపు యుగమో తెలియడంలేదు విధి విచిత్రము కాకపోతే  🤔🤔

Saturday, December 8, 2018

మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు


#మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు
1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.
2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు, అలాంటి వారి చెడు సలహాలని దూరం పెట్టాలి.
3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.
4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.
5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.
6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.
7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.
8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం ,యుధిష్టరుడు ,కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.
10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.
11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.
12. స్త్రీని అవమానికి గురి చేయరాదు:
కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది, స్త్రీలు దేవతలతో సమానం వాళ్ళని అవమాన పరచడం అనేది చాలా పెద్ద పాపం 

ఓం నమః శివాయ.... శంభోశంకర హరహర మహాదేవ...

శివపార్వతుల కళ్యాణానికి
వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ
పక్కన కూర్చున్న పేరంటాలిలో
గుసగుసగా  ఓ మాట అంది .......

>>>. ఇదేం విడ్డూరం అమ్మాయ్ః
పార్వతి ఎండకన్నెరుగని పిల్ల ........
పరమేశ్వరుడేమో  ఎండలో  ఎండిపోతూ
వానలో తడిసిపోతూ శ్మశానాల్లో బతికే రకం

ఆమె తనువంతా సుగంధ లేపనాలు ....
అతడి శరీరమంతా బూడిద గీతలు .....
ఆమె చేతులకు పంకీలు  ......
అతడి చేతులకు పాము పిల్లలు ......
  ఎక్కడా పొంతనే లేదు
      చూస్తూ ఉండూ   నాలుగు రోజులైతే
               పెళ్ళి పెటాకులవుతుంది

నాలుగు రోజులు కాదు ........
నాలుగు యుగాలు గడిచిపోయాయి .......
    ఆదిప్రేమికులు ఆదిదంపతులుగా
           వర్ధిల్లుతూనే ఉన్నారు 
....     ....      ....

బయటికి కనిపించే రూపాన్ని కాదు
శివుడి అంతః సౌందర్యాన్ని చూసింది పార్వతి

      అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ
          కాలంబు గతి రత్నగర్భ పథము 
                 దర్శించుకుందా తల్లి
         కాబట్టే ఆ ప్రేమ అజరామరమైంది

       అతడు విష్ణువు అయితే   ఆమె లక్ష్మీ
           అతడు సూర్యడైతే  ఆమె నీడ
         అతడు పదం అయితే ఆమె అర్థం
   
           అలా అని ఆ దంపతుల మధ్య
        విభేదాలు రాలేదా అంటే వచ్చాయి
 ఆ కాపురంలో సమస్యలు తలెత్తలేదా అంటే
     తలెత్తాయి    ప్రతి సమస్య తర్వాత
         ఆ బంధం మరింత బలపడింది
              ప్రతి సంక్షోభం ముగిశాక
       ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు

ఏ ఆలుమగలైనా పట్టువిడుల పాఠాల్ని
   శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి

     ఒకసారి శివుడు మాట చెల్లించుకుంటే
మరోసారి పార్వతి పంతం నెగ్గించుకుంటుంది

         మధురలో అమ్మవారిదే పెత్తనం
 సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మకు మొగుడే
       నైవేద్యాలు కూడా దొరసానమ్మకు
              నివేదించాకే  దొరవారికి 
                అదే చిదంబరం లో
           నటరాజస్వామి మాటే శాసనం 
    శివకామసుందరి తలుపుచాటు ఇల్లాలు...
 
ఒక్క మధురై ఏంటి ఒక్క చిదంబరం  ఏంటి
     ఇలా ఎన్నో చోట్ల భార్య పెత్తనం కొన్ని చోట్ల
అలానే భర్త పెత్తనం మరి కొన్ని చోట్ల
     అందుకే వారు ఇద్దరూ జగత్తును ఏలే
అది దంపతులు ఆయిన్నారు పార్వతీపరమేశ్వరులు

  ఓం నమః శివాయ....
 శంభోశంకర  హరహర మహాదేవ...

Wednesday, December 5, 2018

పోలిస్వర్గం కథ

పోలి స్వర్గం కథ ఇదీ
కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.
Related image
Image result for పోలి స్వర్గంఅనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.  కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.
Related imageఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.
Related imageఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంరు.
_తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.....Image result for పోలి స్వర్గం
ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

శివాభిషేక, జప మంత్రాలు.

శివాభిషేక, జప మంత్రాలు.
నమక చమకాలతో శివాభిషేకానికి సమయం లేనప్పుడు కనీసం ఈ 8 మంత్రాలతో నిత్యం శివాభిషేకం చేసుకోవచ్చు.
Image result for శివాభిషేక, జప మంత్రాలు*
ఓం నమస్తే అస్తు భగవన్  విశ్వేశ్వరాయ,
మహాదేవాయ, త్ర్యంబకాయ  త్రిపురాంతకాయ
త్రికాగ్నికాలాయ  కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ  మృత్యుంజయాయ  సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ : || .1
*
ఓం సద్యోజాతం  ప్రపద్యామి  సద్యోజాతాయ వై  నమో నమః |
భవే భవే నాతిభవే  భవస్వ మామ్  భవోద్భవాయ నమః || -2
*
ఓం వామదేవాయ నమో,  జ్యేష్ఠాయ నమ:  శ్రేష్ఠాయ నమో  రుద్రాయ నమః
కాలాయ నమః  కలవికరణాయ నమో  బలవికరణాయ నమో
బలాయ నమో  బలప్రమథనాయ నమ:  స్సర్వభూతదమనాయ నమో
మనోన్మనాయ నమః || .3
Related image*
ఓం  అఘోరే భ్యో థ ఘోరే భ్యో  ఘోర ఘోరతరేభ్య:
సర్వే భ్య :  స్సర్వశర్వేభ్యో  నమస్తే అస్తు రుద్రరూపేభ్యః || -4
*
ఓం తత్పురుషాయ  విద్మహే  మహాదేవాయ ధీమహి
తన్నో రుద్ర : ప్రచోదయా త్ || .5
*
ఓం ఈశాన : సర్వ విద్యానా మీశ్వర  స్సర్వ భూతానాం
బ్రహ్మా ధిపతి ర్బ్రహ్మణో ధిపతి ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ || .6
*
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ! -7
Image result for శివాభిషేక, జప మంత్రాలు*
ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ : శివాయ || .8
*
మంత్రం.7, మంత్రం.8, .. ఒక్కొక్కటి 108 సార్లు  చొప్పున  ప్రతి నిత్యం  జపించ వచ్చును.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి .


మనం మరొక్కసారి మనం చేసుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం
 దిక్కులు :-
""""""""""""""
(1) తూర్పు,
(2) పడమర,
(3) ఉత్తరం,
(4) దక్షిణం

మూలలు :-
""""""""""""""""
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం

 వేదాలు :-
"""""""""""""
(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

 పురుషార్ధాలు :-
"""""""""""""""""""""
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా

 పంచభూతాలు :-
"""""""""""""""""""""""
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.

  పంచేంద్రియాలు :-
""""""""""""""""""""""""""
(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.


 లలిత కళలు :-
""""""""""""'"'"""""""
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.


  పంచగంగలు :-
"""""""""""""""""""""
(1) గంగ,
(2)  కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.

  దేవతావృక్షాలు :-
""""""""""""""""""""""""
(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.

  పంచోపచారాలు :-
"""""""""""""""""""""""""
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.

  పంచామృతాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.

 పంచలోహాలు :-
"""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

 పంచారామాలు :-
""""""""""""""""""""""""
(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

 షడ్రుచులు :-
"""""""""""""""""
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.

  అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-
"""""""""""""""""""""""""""""""""""""""
(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

  ఋతువులు :-
""""""""""""""""""""
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర

  సప్త ఋషులు :-
""""""""""""""""""""""""
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

  తిరుపతి సప్తగిరులు :-
"""""""""""""""""""""""""""""""
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.

  సప్త వ్యసనాలు :-
""""""""""""""""""""""""
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యబిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

    సప్త నదులు :-
""""""""""""""""""""""
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.
           
 నవధాన్యాలు :-
""""""""""""""""""""""""
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.

  నవరత్నాలు :-
"""''''""""""""""""""""
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

   నవధాతువులు :-
""""""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.

  నవరసాలు :-
"""""""""""""""""""
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర

  నవదుర్గలు :-
"""""""""""""""""""
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.

  దశ సంస్కారాలు :-
""""""""""""""""""""""""""
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

   దశావతారాలు :-
"""""""""""""""""""""""""
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.

  జ్యోతిర్లింగాలు :-
""""""""""""""""""""""""
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

 తెలుగు వారాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.

  తెలుగు నెలలు :-
"""""""""""""""""""""""""
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
( 9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.

  రాశులు :-
""""""""""""""
( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.

  తిథులు :-
""""""""""""""""
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

  నక్షత్రాలు :-
"""""""""""""""""
( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

  తెలుగు సంవత్సరాల పేర్లు :-
""""""""""""""""""""""""""""""""""""""
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ.  -
1935, 1995, 2055, 2115

10.ధాత.  -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ               
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి       
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి             
1979, 2039, 2099, 2159

54.రౌద్రి               
1980, 2040, 2100, 2160

55.దుర్మతి             
1981, 2041, 2101, 2161

56.దుందుభి           
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి       
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి               
1984, 2044, 2104, 2164

59.క్రోదన                 
1985, 2045, 2105, 216

60.అక్షయ             
1986, 2046, 2106, 2166.

Total Pageviews