Monday, December 17, 2018

ఇప్పటికీ అర్ధం కాదు...

అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ...
ఇప్పటికీ అర్ధం కాదు...
పనిచేయటానికి బ్రతుకుతున్నానా?
లేక బ్రతకటానికి పని చేస్తున్నానా అని !?

బాల్యంలో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...
పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని?
ఆ సమాధానం ఇప్పుడు దొరికింది!
మళ్ళీ బాల్యం కావాలని!
మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని
మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది
వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని

ఔను...
లోకం లాజిక్కుని  చూపింది వాళ్ళే మరి!
 జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే!
డబ్బు సంపాదించేటపుడు తెలిసింది.....
నా విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని
నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని

 నవ్వాలని అనిపించినా ...
నవ్వలేని  పరిస్థితి...
ఎలా ఉన్నావని ఎవరైనా అడిగినప్పుడు ---
ఓహ్ !
నాకేం  బ్రహ్మాండంగా వున్నా!!
అని అనక తప్పనప్పుడు.
ఏడవాలన్నా  ఏడవలేని పరిస్థితి!
వాడికేందిరా....
దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు
ఇది జీవిత నాటకం...
ఇక్కడ అందరూ నటులే...
నటించక తప్పదు....
అవార్డుల కోసం కాదు...
బ్రతకటం కోసం !!
కాదు.. కాదు....
బాగా బ్రతుకుతున్నానని నమ్మించటం కోసం.

రాతి మనిషి నిప్పురాజేయటానికి చాలా కష్టపడ్డాడట....
ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు ...
ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...

సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట....
బాహ్య లోకంలో జీవం ఉందా లేదా అని....

మరి మానవ జీవితంలో సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!

ఓజోన్ పొర డ్యామేజ్ అయి భూతాపం పెరిగుతుందని ఆందోళన ...
ఒకరిపై ఒకరికి వుండే ఈర్ష్యా, ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే...

పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు కర్కశత్వం కూడా !

మట్టిలో మొక్కలు నాటాలి...
మనసులో మానవత్వం నాటాలి
ఇదంతా గట్టిగ అరవాలి.... అందరికి చెప్పాలి....

మళ్ళీ ఒక్క క్షణం...
నాకెందుకులే అని !
సమస్య నా ఒక్కడిదే కాదుగా అని!

నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి
పక్కవాళ్ళ కష్టం గురించి పట్టించుకునేంత తీరికెక్కడిది నాకు!
నా పని...
నా ఇల్లు...
నా పిల్లలు...
నా...నా.. నా...
నాతోనే నలిగిపోతున్నా...!
ప్రక్కవాణ్ణి నిందిస్తూ రోజు గడిపేస్తున్నా!

జీవితమన్నది
తనంత తానుగా...
నడచి పోతుంది…
గడచి పోతుంది....
మనకళ్ళముందే.....
మనకు తెలియకుండానే ముగిసిపోతుంది.

చేయడానికి చాలా టైం వుందని
చావు దగ్గరకోచ్చేదాకా చోద్యం చూస్తున్నా!
చివరికి ఉసూరంటూ కాటిదాక నలుగురి కాళ్ళతో నడిచిపోతున్నా కనుమరుగౌతున్నా...

ఎవరినో అడిగాను ...
అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని ?
ఎవరో మహానుభావుడు ఎంతో  అందంగా సేలవిచ్చాడు !!!
నిద్ర, సగం మృత్యువట!
మరి మృత్యువు,ఆఖరి నిద్రట!!
అసలు ప్రశాంతంగా నిద్రించి ఎన్నేళ్ళయ్యిందో!
ఏదో ఒకనిద్ర ఆవహిస్తే అదే వరం!

ఆనందం లేని అందం...
జవాబు లేని జీవితం....
ప్లాస్టిక్ పరిమళం..
సెల్ ఫోను సోయగం...
వెరసి ఇదీ నా నాగరిక జీవనం!
 తెల్లారి పోతున్నది...
 రోజుమారుతున్నది..
మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....

ఏంటో జీవితం....
రైలు బండి లా తయారయింది!
ప్రయాణమైతే ప్రతి దినం చెయ్యాలి
చేరే గమ్యం మాత్రం లేనే లేదు!

ఒకడు శాసించి ఆనందిస్తాడు
మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు

ఒక రూపాయి విలువ తక్కువే కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే....
అది లక్ష ఎప్పటికీ కాదు...
ఆ లక్ష సంపూర్ణం కాదు...

అందుకే...
మనిషి లో  మనీ కోసం కాకుండా, ఆనందం,సంతోషం కోసం బతకండి

అదే నిజమైన జీవితమౌతుంది!
👏👏👏👏👏👏👏👏

No comments:

Post a Comment

Total Pageviews