Thursday, July 31, 2014

పోతన భాగవత పద్యం.
నా పుణ్య మేమి సెప్పుదు ?  నీ
పాదరజంబు  గంటి  నే, సనకాదుల్
నీ పాదరజము గోరుదు
రే పదమం దున్ననైన నింక మేలు హరీ !

భావం:-     "శ్రీహరీ ! నీపాదధూళిని  నేను పొందగల్గాను. నా పుణ్యమేమని  చెప్పను! సనకాది దివ్యములను కూడా నీ పాదదూళినే కావాలని కోరుకొంటారు.ఏ స్థితి లో ఉన్న ఇక నాకు క్షేమమే.

శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మిత్రులందరికీ


శుభోదయం../\..


Tuesday, July 29, 2014

నెమలి సోయగం.


నుదిటికి కుంకుమ ఎంత అందాన్నిస్తుందో .. ఇంటిముందర రంగవల్లిక అంత అందాన్నిస్తుంది. .


శుభోదయం../\..


పోతన భాగవత పద్యం.

పోతన భాగవత పద్యం.

నీ పద్యావళు లాలకించు చెవులున్,  ని న్నాడు వాక్యంబులున్,
నీ పేరం బనిసేయు  హస్తయుగముల్, నీ మూర్తిపైo జూపులున్,
నీ పాదంబులపొంత  మ్రొక్కు శిరముల్, నీ సేవపై జిత్తముల్,
నీ పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!

భావం :-   " కమల పత్రాల వంటి నేత్రాలు గల మహానుభావా! నీపై రచించిన స్తుతి వింటూ వుండే  చెవులునూ, నిన్ను గురించి మాట్లాడే వక్కునూ, మాకు అనుగ్రహించు. ఏ పనిచేసినా నీ పేరనే, నీ పనిగా చేసేటట్లు,  మా చూపులన్నీ నీ రూపం పైననే ఉండేటట్లూ, మా బుద్ధులు నీ పైననే ఉండేటట్లూ  దయతో మమ్మల్ని అనుగ్రహించు.

Monday, July 28, 2014

అందరికీ శ్రావణ మంగళవార శుభాకాంక్షలు.అమ్మవారి దయ, అనుగ్రహం, ఆశీర్వాదం మన అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకొంటున్నాను.

అందరికీ శ్రావణ మంగళవార శుభాకాంక్షలు.అమ్మవారి దయ, అనుగ్రహం, ఆశీర్వాదం మన అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకొంటున్నాను.
శ్రీ మంగళగౌరి స్తవము.
నిర్మలమైన మనస్సుతో శ్రీ మంగళ గౌరీ స్తవమును చదువుదాము.
శ్రీ మంతాక్షర మాలయాగిరిసుతాం యః పూజయే చ్చేతసా 
సంధ్యాసుప్ర్యవాసరం సువియత స్తస్యామలం స్యాన్మనః
చిత్తాంబోరుహ మంటపే గిరినుతానృత్తంవిధత్తే సదా
వాణీ వక్త్రసరోరుహే జలదిజాగేహే జగన్మంగళా.
రక్షరక్ష జగన్మాతర్దేవి మంగళ చండికే
హరికే విపదాంరాళేర్హర్ష మంగళకారికే
హర్ష మంగళ దక్షేచహర్ష మంగళ దాయికే
శుభే మంగళ దక్షే చ మంగళ చండికే
మంగళే మంగళార్హేచ సర్వమంగళ మంగళే
సతాం మంగళాదే దేవి సర్వేషాం మంగళాళయే
పూజ్యే మంగళ వారే చ మంగళాభీష్ట దేవతే
మంగళాదిష్టాతృదేవి మంగళానాంచ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని.
సారే చ మంగళాధారే సారే చ సర్వకర్మాణామ్
ప్రతిమంగళ వారే చ పూజ్యేహే మంగళ ప్రదే
పుత్రా దేహి ధనందేహి సౌభాగ్యం సర్వమంగళే
సౌ మాంగల్యం సుఖం జ్ఞానం దేహిమే శివసుందరి.
పోతన భాగవతపధ్యం
జ్ఞానులచే  మౌనులచే
దానులచే యోగసంవిధానులచేతం
బూని నిబద్ధుం డగునే
శ్రీనాథుండు భక్తియుతులచేతం బోలెన్ ?

భావం :      భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకుగానీ, మౌనులకుగానీ, దానపరులకు గానీ యోగీశ్వరులకు గానీ పట్టుబడడు గదా !

వెలుతురు చీకటిని తొలగించునట్లు జ్ఞానము అవివేకమును తొలగించును.


Sunday, July 27, 2014

పోతన భాగవత పద్యం.

చిక్కడు సిరి కౌగిటిలో 
జిక్కడు సనకాది యోగి చిత్తబ్జములం 
జిక్కడు శ్రుతిలతికావలి
జిక్కె నతండు లీల దల్లిచేతన్ రోలన్.

భావం:    ఆ లీలా గోపాలబాలుడు లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కలేదు; సనకసనందనాదులైన మహాయోగుల హృదయాలలోనూ చిక్కలేదు. ఉపనిషత్తులలోనూ  చిక్కలేదు. అటువంటివాడు లీలగా, అవలీలగా తల్లి చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు.  

శుభోదయం.


Saturday, July 26, 2014

పోతన భాగవత పద్యం.

పోతన భాగవత పద్యం.

జగదీశ్వరునకుం  జన్నిచ్చు తల్లిగా 
నేమి నోము నోచె నీ యశోద !
పుత్రుండనుచు నవని బోషించు తండ్రిగా 
o డేమి సేసె నందితాత్మ!

భావం:-    మహర్షీ!ఈ జగత్తుల కన్నింటికీ ప్రభువైన భగవంతునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి  ఈ యశోదాదేవి వెనుకటి జన్మలో ఏ నోములు నోచిందో? శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏ తపస్సులు చేసాడో ? కృష్ణ కధామృతం త్రాగి ఆనందించిన మహాత్ముడవు నీవు.

దేవాలయాలలో రావిచెట్టు, వేప చెట్టు ఎందుకు వుంటాయి?
       రావిచేట్టుకి అశ్వత్థ వృక్షమని , భోధివృక్షమని పేర్లు వున్నాయి. దాదాపు ప్రతి దేవాలయం లోను రావిచెట్టు  లేదా వేపచెట్టు వుంటాయి. ఎక్కువ చోట్ల రావి,వేప కలసి వుంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను, వేపచేట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోష నివారణ కలిగి సంసారం అన్యోన్యంగా ఉంటుందని పెద్దలు చెపుతారు. రావి చెట్టులో అణువణువూ నారాయణ స్వరూపమే అని ఆగమ శాస్త్రాలు, స్కాందపురాణం  చెపుతున్నాయి. అందుకే శ్రీ కృష్ణుని "వటపత్ర సాయి" అని అంటారు. రావి చెట్టు కింద విశ్రమించిన తరువాత మహా జ్ఞానోదయం కలిగి సిద్ధార్ధుడు 'బుద్ధుడు ' అయ్యాడు.అందువల్లనే రావిచేట్టును 'బోధివృక్షం' అంటారు.
                     వేపవృక్షం కుడా యీనో ఔ షాద గుణాలను కలిగిన దివ్యవృక్షం. వేప ఆకులను ఎన్నో రోగాలకు మందుగా వాడతారు. వేపచెట్టు గాలికి ఎన్నో రోగకారక క్రిములు నశించిపోతాయి.వేపాకులను నీటిలో వేసి కాచి త్రాగినా, స్నానం చేసినా చర్మ వ్యాధులు నశిస్తాయి.వేపవంటి దివ్య ఔషధ వృక్షం భూలోకంలో మరొకటి లేదు.దివ్య శక్తులున్న వృక్షాలు కాబట్టి రావి, వేప చెట్టులను దేవాలయాలలో ప్రత్యేకంగా  నాటి పూజిస్తారు.  

శుభోదయం.


Friday, July 25, 2014

మాతృదేవోభవ.


పోతన భాగవతపద్యం.

కలయో ! వైష్ణవమాయయో ! యితర సంకల్పార్ధమో! సత్యమో 
తలంపన్ నేరక యున్నదాననో! యశోదాదేవిం గానో పర 
స్థలమో ! బాల కుం డెంత! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర 
జ్వలమై యుండుట కేమి హేతువొ ! మహాశ్చర్యంబు చింతింపంగన్!

భావం :- ఆమె విభ్రాంతురాలై ఇలా అనుకొన్నది. " నేను కల గనలేదు కదా ? లేకపోతే ఇది విష్ణువు మాయ కాదుగదా ? దీనిలో మరేదైనా అర్ధముందా? లేకపోతే ఇదే సత్యమేమో ? నా బుద్ధి పనిచేయడం లేదు?అసలు నేను యశోద నేనా ? ఇది అసలు మా ఇల్లేనా? లేకపోతే ఈ కుర్రవాడు ఎంత? వీని నోటిలో ఈ బ్రహ్మాండమంతా వెలుగులు చిమ్ముతూ ఉండటం ఎంతై వింత? ఆలోచించి చూచినా కొద్దీ ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా వున్నది."

శుభ శుభోదయం.


ఓం నమో వేంకటేశాయ!!!


Total Pageviews