పోతన భాగవత పద్యం.
జగదీశ్వరునకుం జన్నిచ్చు తల్లిగా
నేమి నోము నోచె నీ యశోద !
పుత్రుండనుచు నవని బోషించు తండ్రిగా
o డేమి సేసె నందితాత్మ!
భావం:- మహర్షీ!ఈ జగత్తుల కన్నింటికీ ప్రభువైన భగవంతునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి ఈ యశోదాదేవి వెనుకటి జన్మలో ఏ నోములు నోచిందో? శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏ తపస్సులు చేసాడో ? కృష్ణ కధామృతం త్రాగి ఆనందించిన మహాత్ముడవు నీవు.
No comments:
Post a Comment