Thursday, July 3, 2014

పోతన భాగవత పద్యం.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుపై 

బాదాబ్జంబులపై గపోలతటిపై,బాలిండ్లపై  నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే!  కాయంబు నాపాయమే!

భావం :- ఇతడు చెయ్యి చాచి అడుగుతున్నాడు. ఈ చెయ్యి ఎంత గొప్పది? మొదట లక్ష్మీదేవి కొప్పుపైన, శరీరం పైనా, పైటపైనా, పాదపద్మాలపైనా, చెక్కిళ్ళ పైనా, పాలిండ్లపైనా సరికొత్త గౌరవాన్ని పొందేది.అటువంటి గొప్ప చెయ్యి ఇప్పుడు క్రిందిది కావడమూ, నా చెయ్యి పైడి కావడమూ ఎంత అదృష్టం! ఎంత మేలు! ఈ రాజ్యం ఏపాటిది? ఇది శాశ్వతంగా వుండేది కాదు. ఈ శరీరం కూడా పడిపోకుండా నిలిచేది కాదు.

No comments:

Post a Comment

Total Pageviews