Friday, March 31, 2017

హేమలంబి నవవర్ష శుభాశయాలు:--వేటూరి ఆనందమూర్తి.

హేమలంబి నవవర్ష శుభాశయాలు:
అవనిపై మధుమాస మవతరించిన వేళ
జగ్తతిపై వాసంత చైత్రరథమే కదిలె
పుడమితల్లికి ఒడలు పులకరింతలై పోయె
దిశ లెల్ల దరహస దీప్తిరేఖలు పర్వె
నభ మెల్ల చైతన్య నాదమేదుర మాయె
రాగదమ్మ నవాబ్దమా! స్వాగతం బందుకొనుమా!
వందనము నవవర్షమా! కుసుమాభినందనల నందుకొనుమా!//
ఈశ్వరారాధన ప్రవణమౌ ప్రజకెల్ల
నీప్సితార్థము లన్ని యీడేరగా వలెను
బహుజన హితమ్ముగా బహుజన సుఖమ్ముగా
బహుమాన్యమై వరల వలయున్
 గతము భవితకును మార్గము చూపి వర్త మా
న తరమ్ము నడిపింపవలయున్
హిత మెరిగి లోకసమ్మతమైన మత మెరిగి
సతము శ్రేయము గూర్పవలయున్
ధనధాన్యములు సంపదభివృద్ధు లలరారి
ధర్మచింతన పెరుగవలయున్
తనుమనమ్ములు సర్వజనసేవకే అంకి
తము లన్నభావమ్ము వలయున్.//
చాంద్రమానము ననుసరించే జాతి కంతా పర్వదిన మిది
చైత్ర శుద్ధ ప్రతిపదాది వసంత ఋతువున కిదే ఆది
సకల కర్ణాటాంధ్ర మహరాష్ట్రాదు లందరి కిదె యుగాది
ఈ యుగాదే మన యుగాది – ఇదే మన సంవత్సరాది//
ఆరు రుచుల ఉగాది పచ్చ్డడి ననుభవించే అవసర మ్మిది
వేయి రుచుల ఉగాదిగొజ్జు రసాయనమ్మై మనుచు నా డిది//
వీటి ముంగిట తోరణాలూ వేగుజాము తలంటు తానాల్
కొత్త దుస్తులు పిండివంటలు గుడులలో పంచాంగ పఠనాల్
కల్గు యోగ సుయోగ దుర్యోగాలు వత్సర ఫలశ్రవణాల్
ఇష్టమృష్టాన్నాలు పూజలు శిష్టజన సంసేవనాలు // ఈ యుగాదే//
మావికొమ్మలు వేపరెమ్మలు ప్రోవులై విరబూచు ఋతువిది
కోకిలమ్ములు బం భరమ్ములు కొసరి కూసే పూల తే రిది
పురులు విప్పిన మయూరమ్ములు పొత్తు కోరే కొత్త కా రిది
శిశిర మేగిన వసంతానికి చెలువు గూర్చే చిగురు తొడు గిది//ఈ యుగాదే//
వేటూరి ఆనందమూర్తి.

స్వగతం -వాడ్రేవు చినవీరభద్రుడు

ఎన్నో పనులు, ఎన్నో కర్తవ్యాలు, ఎన్నో వ్యాపకాల మధ్య మన రోజువారీ జీవితం గడుస్తూ ఉండవచ్చుగాక, కాని,మనల్ని సతమతం చేసే ఎన్నో ఆలోచనల మధ్య, ఆలోచనకీ, ఆలోచనకీ మధ్య విరామంలో,మన ప్రమేయం లేకుండానే మన మనసుని ఏదో ఒక తలపు ఆక్రమిస్తూ ఉంటుంది. ఏదో ఒక స్నేహమో, ఒక దృశ్యమో, ఒక హృదయమో మనని లోబరుచుకుంటూ ఉంటాయి.అట్లా మనని ఏ తలపు లోబరుచుకుంటుందో దానికే మన హృదయం నిజంగా అంకితమయినట్టు.
నా మటుకు నాకు మా ఊరూ, ఆ కొండలూ, ఆ అడవీ, ఆ నీడలూ, కొండలమీంచి ఉదయించే ప్రభాతాలూ, ఆ ఇళ్ళమీంచి పరుచుకునే సాయంకాలపు ఎండా-ఈ దృశ్యాలే నా అంతరంగ గర్భాలయంలో ప్రతిష్టితమయిపోయాయి. మధ్యలో కొన్నాళ్ళపాటో, కొన్నేళ్ళపాటో కొన్ని స్నేహాలో, కొన్ని కలలో,కొన్ని వైఫల్యాలో నా అంతరంగాన్ని మసకబరిచి ఉండవచ్చుగాక,కొన్ని ప్రేమలో, కొన్ని శరాఘాతాలో పొగలాగా కమ్ముకుని ఉండవచ్చుగాక,కాని, మళ్ళా నెమ్మదిగా, ఆ వెన్నెలరాత్రులో,ఆ వర్షాకాలాలో నా తలపుల్లో కుదురుకోగానే నాకేదో గొప్ప స్వస్థత చేకూరినట్టుగానూ, నేను మళ్ళా మనిషినయినట్టుగానూ అనిపిస్తుంది.
మరీ ముఖ్యంగా మాఘఫాల్గుణాల్లో మొదలై, ఈ తొలివసంతవేళలదాకా నా మనసంతా ఆ అడవిదారుల్లోనే సంచరిస్తూ ఉంటుంది. ఆ నల్లజీడిచెట్లు, ఆ తపసిచెట్లు,ఆకులన్నీ రాలిపోయిన బూడిదరంగు అడవిలో అన్నిటికన్నా ముందు చిత్రకారుడి లేతాకుపచ్చరంగు చిలకరించినట్టు చిగురించే నెమలిచెట్లు, ఆ కొండదారుల్లోనే నేను తిరుగుతూ ఉంటాను. ఇక ఇప్పుడు ఆ కొండవార,అ అడవిపల్లెలో, లేతపసుపు వెలుతురు ధారాపాతంగా కురుస్తున్నట్టు ఉంటుంది. ఆ వెలుగుని ఒక కవితగా పిండి వడగట్టాలని నాలోనేనే ఎన్నో వాక్యాలు దారంలాగా పేనుకుంటూ ఉంటాను. కాని స్వరకల్పనకు ట్యూన్ దొరకని సంగీతకారుడిలాగా ఒకటే కొట్టుమిట్టాడుతుంటాను.
సరిగ్గా అట్లాంటి వేళల్లోనే ప్రాచీన చైనా కవులవైపూ, ప్రాచీన చీనాచిత్రలేఖనాల వైపూ చూస్తూంటాను. ఆకాశాన్నీ, భూమినీ పట్టుదారాలతో కలిపికుట్టడమెట్లానో వాళ్ళకే తెలుసు. ఆ కవితల్లో వాళ్ళీ లోకాన్నే చిత్రించారుగానీ, వాటిని చదువుతుంటే, అలౌకికమయిన స్ఫూర్తి ఒకటి మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. ఆ బొమ్మల్లో,ఆ నల్లటి గీతల్లో వాళ్ళు కొండలు, అడవులు, నదులు, పడవలు, ఒంటరి బాటసారులు, కలయికలు, వియోగాలు అన్నిట్నీ చిత్రించిపెట్టారు.
ఆ బొమ్మల్నట్లా తదేకంగా చూస్తూంటాను. చిన్నపిల్లలు, ఇంకా చదవడం రానివాళ్ళు, బొమ్మల పుస్తకాలు చూస్తారే అట్లా. ఆ బొమ్మల్ని చూస్తూ ఆ అక్షరాల్లో ఏముందో ఊహిస్తూంటారే అట్లా. ఆ చైనా కవితల్ని బట్టి వాళ్ళ బొమ్మల్నీ, ఆ బొమ్మల్ని బట్టి ఆ కవితల్నీ పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఉదాహరణకి,
చిత్రకారుడూ, కవీ కూడా అయిన వాంగ్ వీ రాసిన ఏ నాలుగు వాక్యాలు చదివినా మనసంతా ఖాళీ అయిపోతుంది. ఆ విస్తారమైన మనోక్షేత్రం మీద సూర్యరశ్మినో, చంద్రకాంతినో వర్షించడం మొదలుపెడుతుంది. ఈ కవిత చూడండి:
నిర్జనపర్వతశ్రేణి,
కనుచూపు మేర ఎవరూ లేరు
ప్రతిధ్వనులుమటుకే వినబడుతున్నవి
అడవిలోతట్టున నీల-హరితశాద్వలం పైన
మెత్తటి లోవెలుగు.
ఈ నిశ్శబ్దం ఒక విమానంలాంటిది. దీన్లో అడుగుపెట్టి నేనా ప్రాచీన శైలశ్రేణిమీంచి,ఆ విస్మృతకాననాలగుండా కొన్ని క్షణాల్లోనే ఎన్నో భ్రమణాలు పూర్తిచేస్తూ ఉంటాను.
అక్కడొక కొండ మీద ఒక పూరిల్లు ఉంటుంది, ఆ వాలులోంచి ఆ కొండమీదకి సన్నని కాలిబాట ఉంటుంది. ఆ బాట పక్క మాఘమాసంలో మంకెనలూ, వైశాఖమాసంలో తురాయిలూ పూస్తూ ఉంటాయి. రాత్రి ఒక వసంత వాన రహస్యంగా కురిసి ఉంటుంది. తెల్లవారగానే తడిసిన ఆ బాట మీద పూలు రాలి ఉంటాయి. ఆ కొండమీద కుటీరంలో నాకోసం ఒక అతిథి వచ్చి ఉంటాడనీ, కాని ఆ అథితి ఇంకా నిద్రలేచి ఉండడనీ అనిపిస్తూంటుంది. ఈ మనోజ్ఞచిత్రాన్ని నా మనసులో పచ్చబొట్టు పొడిచింది వాంగ్ వీ రాసిన ఈ కవితనే కదా:
ఎర్రటి మంకెన పూత మీదరాత్రికురిసిన వాన
వసంతవనాలలేతాకుపచ్చమీద తొలగని పొగమంచు
రాలిన పూలనింకా ఎవరూ తుడిచిపెట్టలేదు
పక్షుల కిలకిల, కొండమీద అతిథి ఇంకా నిద్రలేవలేదు.
నాలో రెండు పొరలున్నాయనిపిస్తుంది. లోపల ఒక ప్రవాహం, దాని మీద మరొక ప్రవాహం. సంఘానికీ, రాజ్యానికీ, ధర్మానికీ సంబంధించినదంతా ఆ పై పై ఉరవడి మాత్రమే. ఆ విషయాలు ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా అదంతా ఎందుకో నాలోపల్లోపలకి ఇంకదు. వరదనీళ్ళలాగా అది ఎంత ఉధృతంగా ప్రవహించినా, కళ్ళముందే కొట్టుకుపోతుంది. కాని ఆ లోపలి ప్రవాహం, అది యుగాల కాలమానం ప్రకారం అత్యంత మందంగా, అత్యంత గోప్యంగా ప్రవహిస్తూంటుంది. ఆ ప్రవాహం ఒడ్డునో లేదా, ఆ ప్రవాహమధ్యంలోనో ఏ నావ మీదనో పూర్వకవులు కనిపిస్తూంటారు. బహుశా నా అసలైన జీవితానుభవం అది. ఒక కాలానికో, ఒక దేశానికో, ఒక భాషకో పరిమితమయింది కాదది. అందుకనే 1200 వందల ఏళ్ళ కిందటి ప్రాచీన చైనా కవి లి-బాయి రాసిన ఈ కవిత చదివితే, నా సమకాలికులందరికన్న ఎంతో సన్నిహితుణ్ణి కలుసుకున్నట్టు ఉంటుంది:
నువ్వెందుకింకా ఆ పచ్చటికొండలకే
అంటిపెట్టుకున్నావని
అడుగుతారు వాళ్ళు.
నేను చిరునవ్వి ఊరుకుంటాను.
నా మనసు తేలికపడుతుంది.
అడవి సంపెంగలు
ఏటిబాటన కిందకు ప్రవహిస్తూంటాయి
వాటి జాడ కూడా మిగలదు.
మనకి కనిపిస్తున్నవాటికన్నా ఆవల
మరెన్నో భూములున్నాయి,
మరెన్నో ఆకాశాలున్నాయి.
నా కంటిముందు కనిపిస్తున్నదొక్కటే ఆకాశం కాదనేదే నాకు గొప్ప ఊరట. ఇక్కడ నగరంలో నేనుంటున్న వీథిలో రాలుతున్న పసుపు పూలని చూడగానే నేను తిరిగిన పూర్వపుదారులన్నీ నా తలపుల్లో ప్రత్యక్షమవుతాయి. హృదయాన్ని గాయపరచడానికి ఒక పూలరేకు చాలు. ఇక రాలుతున్న అన్ని పూలరేకల్ని చూస్తే చెప్పేదేముంది?
దు-ఫు ఇలా అన్నాడని విక్రమ సేథ్ గుర్తుచేస్తున్నాడు:
The pain of death's farewells grows dim.
The pain of life's farewells stays new
అలాగని ఒక అతిథి కోసం చూడకుండా ఉండలేను. ఎవరో ఒక కొత్తస్నేహితుడో, స్నేహితురాలో ఆ బాటమ్మట, చివరి మలుపు తిరిగి, ఏ తెల్లవారు జామునో మొదటి ఆటో పట్టుకుని నా ఇంటికొస్తున్నారన్నట్టే ఎప్పుడూ ఒక ఊహ. జీవితమంతా ప్రవాసిగానే గడిపిన దు-ఫు మటుకే ఇట్లాంటి కవిత రాయగలడు:
నా ఇంటిచుట్టూ వసంతకాలపు సెలయేరు
రోజూ కొంగలు మటుకే వచ్చిపోతుంటాయి
రాలిన ఆ పూలనింకా ఎవరూ తుడిచిపెట్టలేదు
అతిథుల్లేరు.తలుపు తెరిచే ఉంది.
ఈ దారిన అడుగుపెట్టిన మొదటిమనిషివి నువ్వే.
నువ్వు వెళ్ళవెలసిన వూరింకా దూరం.
నా ఆతిథ్యమేమంత గొప్పదికాదు,
పేదవాణ్ణి,ఉన్నది కొద్ది పానీయం .
చూడు,నీకిష్టమయితే ఆ పాతకాలపు
పెద్దమనిషి, నా పొరుగింటాయన్ని పిలుస్తాను
ఒక్క గుక్క కలిసి తాగుదాం.
తన కవిత్వమంతా పేదవాళ్ళ గురించీ, కఠోరవాస్తవాల గురించీ మాత్రమే రాస్తూ వచ్చిన బై-జుయికి కూడా వసంతకాలమంటే తన ఊరే గుర్తొస్తుంది. అతడి కవిత:
చియాంగ్ నాన్ లో నా పాతగ్రామంలో
నది ఒడ్డున నేనో మొక్క నాటాను.
రెండేళ్ళయింది
ఇంటికి దూరమై ఎక్కడెక్కడో
తిరుగుతున్నాను
అయినా ఆ నది ఒడ్డున ఆ పచ్చదనం
కల్లోకొస్తూనే ఉంటుంది
చియాంగ్ నాన్ లో నది ఒడ్డున
ఆ చెట్టుకింద ఇప్పుడెవరు చేరిఉంటారా
అని తలపు తొలుస్తూనే ఉంటుంది.
రోజువారీ జీవితం సణుగుతూనే ఉంటుంది. నగరం రణగొణధ్వని ఆగదు. క్రీస్తు చెప్పినట్టు సీజర్ వి సీజర్ కీ, దేవుడివి దేవుడికీ విడివిడిగా చెల్లించడమెట్లానో, ఆ విద్య ఇప్పటికి పూర్తిగా పట్టుబడింది.
లోకంలో నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేరుస్తూనే, ఇప్పుడా ఆ అడవిపల్లెలో ఆ చిగురించిన చింతతోపులో ఆ కొండసంపెంగ చెట్టుదగ్గర ఎవరు జమకూడేరా అని నా తలపుల్లో తొంగిచూస్తుంటాను.
LikeShow More Reactions
Comment
61 comments
Comments
Srinivasreddy Lethakula అద్భుతః సర్
LikeReply114 hrs
Vattem Venkateswarlu Subhodayam sir.Anduke mee sahacheryam korukunnanu.supar fenta stick.
LikeReply114 hrs
Vinodkumar Matam మూగగా మీమ్మల్ని చూడడమే వరకే వాటి చెప్పెంత వాడిని కాదూ, మీరు చెప్పారే చదువురాని బొమ్మల్నిట్ల చూడడం అలా అంతే, శుభొదయము సార్
LikeReply113 hrs
రామ మోహన్ రెడ్డి మణ్యం మీరు ఉటంకించిన ఆ చైనా కవులకన్నా , ప్రకృతి ని ఆస్వాదించి అందులోనే మమేకమై చూసే మీ దృష్టికోణం గొప్పదని నా భావన. నమస్కారము.
LikeReply113 hrs
Shiwazee Komakula ఆలోచనకీ ఆలోచనకీ మధ్య విరామంలో మన ప్రమేయం లేకుండానే మన మనసుని ఏదో ఒక తలపు ఆక్రమిస్తూ ఉంటుంది. ఏదో ఒక స్నేహమో, ఒక దృశ్యమో, ఒక హృదయమో మనని లోబరుచుకుంటూ ఉంటాయి. అట్లా మనని ఏ తలపు లోబరుచుకుంటుందో దానికే మన హృదయం అంకితమైనట్టు
*
LikeReply113 hrs
Vijay Koganti ఒక 'మెత్తటి వెలుగు' తో యీ వుదయాన మీ మాటలలో , బొమ్మలోని చెట్లలో... శుభోదయం సర్
LikeReply113 hrs
N Vijaya Lakshmi Amazing sir
LikeReply113 hrs
Vasudha Rani బయటి ప్రవాహం లోపలి ఇంకని వాడే స్వచ్ఛమైన మనిషి ,మనసు కూడా....
LikeReply113 hrs
Rajasekhar Rao Goteti లోకంలో నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేరుస్తూనే, ఇప్పుడా ఆ అడవిపల్లెలో ఆ చిగురించిన చింతతోపులో ఆ కొండసంపెంగ చెట్టుదగ్గర ఎవరు జమకూడేరా అని నా తలపుల్లో తొంగిచూస్తుంటాను.
LikeReply213 hrs
Suryanarayana Sastry Mandalika Excellent potrait
LikeReply113 hrs
Vidya Sankaram కొందరు మిగిలినవారి దిన చర్యలకు మార్గదర్సులే...వారిలో మీరొకరు...భళి చిత్రం
LikeReply113 hrs
Sridhar Choudarapu బాగుంది సర్. 

మనలోని మరో మనిషిని పట్టుకున్నారు. ఆ మనిషీ అప్పుడప్పుడిలా మాతో మాటాడుతున్నాడు, రాతల్లో గీతల్లో. 


బతుకు వెంపర్లాట కాసిని కాసులకోసం... ఆ కాసులిచ్చే తిండీ గుడ్డా గూడులకోసం. తప్పదు.

అయినా మీలోని మరోమానవుడు, రాత్రి నిద్ర మానేసి మనసు తలుపులు తట్టేందుకూ, మమ్మల్ని మేలుకొలుపేందుకూ, మరోలోకం చూపేందుకూ నిరంతరం యత్నిస్తూనే ఉన్నాడు.... 

ధన్యులం మీ పరిచయభాగ్యం వల్ల
LikeReply113 hrsEdited
Sunitha Pothuri అద్భుతంగా ఉందండీ ..
LikeReply113 hrs
Mohannaidu Karri ప్రకృతిని సహజసుందరంగా చూపడం మీతర్వాతే ఎవరైనా అనడం అతిశయోక్తి కాదు.
LikeReply113 hrs
K Subrahmanyeswara Sarma Your message is much better than Morning coffee. It energizes the whole day.
LikeReply13 hrs
Harshavardhanreddy Sane ఆస్వాధిoచడo తప్ప... వ్యక్థం చేయలేని....
LikeReply113 hrs
Tummuri Sivaram ఈ ఉదయం మీ కవిత తో నా ఎద హాయిగా ఉంది
మీ శబ్దాలు శబ్దాలుగా ఉండవు
చదవగానే బొమ్మలుగా మారిపోతాయి
LikeReply213 hrs
Rajaram Thumucharla మీ హృదయతన్మయత్వానికి అద్భుత వాక్య రూపం హాయిగా ప్రకృతి అందాన్ని అక్షరాల్లోకి తర్జూమా చేసి చూపి చదివించారు సర్.ధన్యవాదాలు
LikeReply112 hrsEdited
Paresh Doshi It is said that sangam is union of three rivers. Two flowing on ground, and third Saraswarhi underground. Whenever you crave for the places you spent your childhood in, I visualise this river. And what an apt name : Saraswati.
LikeReply112 hrs
Veereswar Rao Vadrevu What a post sir. No words to express my appreciation.
LikeReply112 hrs
Sarojini Devi Bulusu తెలుసా మిత్రమా .. నేను మీ మాటలతో పయనించి మీరు చెప్పిన వెన్నో న జ్ఞాపకాల్లో. కూడా ఉన్నాయని గుర్తిస్తూ మీ వెనుక మనసు పయనం చేస్తాను. మీ మాటలు పూర్తయ్యే వేళకి మళ్ళీ నాలో నేను,నాతొ నేను .. మీ మాటలన్నీ మూటగట్టుకుని . . .
LikeReply212 hrs
Padma Padmapv Nomorewords. .shubodayamsir
LikeReply112 hrs
Prema Prasad వేనవేల అందాలు ప్రకృతిలో .
LikeReply112 hrs
Suseela Nagaraja Sir!నమస్తె! జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి!!! 
పైన చెప్పినట్లు మూగగా మిమ్మల్ని చూడటం! మీరు రాసినవి ఆస్వాదించటం అంతే!!! మీ సరస్వతి ప్రపంచమంతా చాచి ఉంది సార్!
LikeReply212 hrs
Suraparaju Radhakrishnamoorthy కాలం కాళ్ళ కిందుగా కదిలిపోతుంటుంది.ట్యూన్ దొరికింది మీకు! ప్రకృతితో స్వరం కలిపే ఉన్నారు.
LikeReply212 hrs
Vishwanatham Kamtala సాహితీ మూర్తికి పాదాభి వందనాలు.
ధ్యానంలో లీనమయిన ఒక వ్యక్తికి
స్మరణకూ స్మరణకూ మధ్యన లభించే ఆ పవిత్ర సమయం "నిర్గుణ అద్వైత స్వరూపం" మీలో సాహితీజ్యోతి యై వెలుగుతుంది.ఆజ్యోతి స్వరూపానికి ఏ పేరిడిినా అది పరమపావనమే, అనిర్వచనీయమే,ఆదర్శప్రాయమే.
...See more
LikeReply211 hrs
Ravi Kumar supar sir
LikeReply111 hrs
Chaya Pradeepa Pv ప్రకృతి లోని ప్రతి అంశంపట్ల మీదైన రీతిలోచూస్తూ..స్పృశిస్తూ...స్పందిస్తూ...వాటికీ అందమైనమాటలతో రూపమిచ్చి మమ్మల్ని ఆలోకంలోకి తొంగిచూసేలా చేస్తారు.యాంత్రిక జీవితానికి కాసేపు విరామం...మనసుకు దొరికే ఒకింత విశ్రాంతి సర్! ధన్యవాదాలు💐💐💐💐
LikeReply111 hrs
Mallesham Muppa అద్భుతమైన పోస్ట్ సర్.ధన్యవాదాలు.
LikeReply111 hrs
Satyanarayana Dyavanapalli Idi vasanthamaa sir...
LikeReply110 hrs
Bsmkumar Surya Nishabda spardha manalni gayam chesinapudu ..Pata tagilinchukonna calender prefix dairy lo chinnanadu naku tanichina kanti muchhata cheerala Madatha kinda eppudu dorukutundi . Na eduruga kurchunna o business man tella juttu lonunchi eppatido ma tataia...See more
LikeReply110 hrs
Venkata Krishnamoorthy Pulipaka ధన్యవాదాలు మీ ప్రకృతి సౌందర్య పిపాసకు.
LikeReply10 hrs
Madugula Narayanamurthy యేల పూత తోక రేలా రేల
LikeReply110 hrs
Usha Rani Akella అద్భుతంగా ఉందండీ.. 👌👌🙏🙏
LikeReply110 hrs
Kommi Pyaraiah I followingsir
LikeReply110 hrs
Spandhana Kandula అద్భుతం సర్ _/|\__
LikeReply19 hrs
Satyanarayana Thamma Excellent Sir
LikeReply19 hrs
Sasi Thanneeru మనలో రెండు పొరలు నిజం. పై ది చుట్టు వాళ్లకి , లోన ఉండే పసితనం మనం ,విశ్వ ప్రేమే దాని నైజం . బాగా వ్రాసారు
LikeReply19 hrs
Krishnamurthy Punna మెత్తని వెలుతురు రంగులు 😊
LikeReply8 hrs
Ghv Prasad Sir, Mee rachanalu fb chadivina taruvata nenu vaatini print teesikoni file chestunna. Endukante fb lo chadivina daani Kanna print lo chadivite aa kicke veru kadaa?
LikeReply17 hrs
Nanda Kishore As soon as I finish to read you, I always end up in spring.
LikeReply26 hrs
Mallikarjuna Adusumalli లలిత మనోహరమైనమీ చిత్రాలతోపాటు , విశ్వ సాహిత్యాన్ని అందిస్తున్నారు.అభివందనాలు.
LikeReply16 hrs
Kantharao Siramsetty మనిషికి రెండు రకాల నయనాలుంటాయి. అవి (1) భౌతిక వస్తుసంచయాన్ని,సమస్త ప్రకృతిని చూడగల సహజనేత్రాలు. ఇక (2) ఉపనయనాలు అంటే మనకంటికి కనిపించే నయనాలు కాకుండా మానసికమైన అంతర్నయనాలు. భౌతిక నయనాలకంటే ఈ ఉపనయనాలు ఎంతో శక్తివంతమైనవి. ఇవి చూడడానికి కంటికి కన్పించవు. కానీ, ఇవి వారు పేర్కొన్నట్టుగా ఎన్ని శతాబ్దాలనాటి ధృశ్యాలనైనా క్షణాల్లో దర్శంచగలవు. వివరించగలవు. వినిపించగలవు. ఈ ఉపనయనాల శక్తి ఏ కొద్దిమందికిో వుంటాయి. ఆ కొద్దిమందిలో మొదటివరుసలో ప్రధమస్థానంలో నిలువగల సరస్వతీ పుత్రులు మన వీరభద్రుడుగారు. ఈ సందర్భంగా వీరభద్రుడిగారికి నాదో విన్నపం. అదేమిటంటే వారి ఉద్యోగవిరమణ కార్యక్రమాన్ని వారి స్వంత గ్రామంలో నిర్వహించాలి . దానికి తెలుగు సాహిత్యకారులందరినీ ఆహ్వానించాలి. వచ్చిన వారందరికీ వారి గ్రామంలో నెలకొన్న ప్రాకృతిక సౌందర్యం యొక్క అంతర్ సౌందర్యాన్ని చూడడం ఎలాగో వారు అందరికీ నేర్పించాలి. అప్పుడు మనకోసం వారింత శ్రమపడి వివరించనవసరం వుండదు కదా? మనిషికుండే ఉపనయనాల ఉపయోగికతను ఎరిగించిన వారవుతారుకదా?
UnlikeReply36 hrs
Sasikala Volety మీ అనుభూతులతో ప్రయాణం చేయించారు. ఇన్నాళ్ళు నా కళ్ళు యధాలాపంగా చూసిన ఋుతువులు, కాలాలు, మాసాలు, కొండా, కోన, కానలాలు, కాసారాలు, చెట్టు కొత్తగా కనిపిస్తన్నాయి. మీ ప్రాచీన చీనీ కవులు ఇప్పుడు కొంచెం అర్ధమవుతున్నారు. అంతర్వాహినిని ఒడిసి పట్టే ప్రయత్నమయితే చెయ్యాలనే ఉంది. జీవమోడే అద్భుత కళాఖండాలకు ధన్యవాదాలు.
LikeReply15 hrs
Vakkalanka Vaseera Mammalnee konda daari pattinchAaru
LikeReply14 hrs
Kamaladevi Devi Ranihttps://www.facebook.com/GauthamKashyapShridharKavuri/posts/1155349617944081
Gautham Kashyap
15 hrs
అనంతంగా వున్న అంధకారాన్ని
అంతమొందించడానికి అవిశ్రాంతపోరాటం
చేస్తున్నవాడు, ఈ లోకంలో నాకు తెలిసిన
నిజమైన తొలి కామ్రేడ్ ఆ ఆదిత్యుడే .! - గౌతమ్ కశ్యప్
LikeReply3 hrs
Kamaladevi Devi Rani chinnaveerabhadrudugaru meeru oka rasamaya chitraanni kallamundara 
aavishkarimpa chasaru. manotantrulanu
rasamaya jagattulo munchi',Prakruti
...See more
LikeReply13 hrs
Tulasi Mummidi Sir when I was reading not reading mechanically with heart I was reading at that time I thought about rabindranadh geetanjali.sir I did not read literature but I like it.some words have taken me to inner.basically I am trying to see spirituality in ur poems and in u also.again and again I will read the above.thank u sir for ur great works.thank u
LikeReply13 hrs
Venkat Reddy Ganta కొండలు, అడవులు,నదులేకాదు అరేబియా ఎడారుల్లోఇసుక తుఫాన్లని, ఈదురుగాలిని కూడా ఆస్వాదించగల కవితాహృదయం మీది.
LikeReply22 hrs
Ram Bhaskar Raju E Anubhavam punaadhigaaa jaaluvaarina padavinyasam.... abhinandanalu sir.
LikeReply7 mins
Someone is typing a comment...

Total Pageviews