నగరంలో ఫాల్గుణమాసం
__________________
__________________
.. the land
lost with my childhood, suddenly came searching for me '
-Pablo Neruda (One Hundred Love Sonnets,VI)
lost with my childhood, suddenly came searching for me '
-Pablo Neruda (One Hundred Love Sonnets,VI)
నగరంలో ఫాల్గుణం ప్రవేశించాక
నువ్వు మామూలుగా ఉండటం కష్టం
రోజూ పొద్దున్నే నువ్వు ఇంటినుంచి
ప్రపంచం లోకి మలుపు తిరిగే వీథిలో
కొత్తగా జెండాలు ఎగురుతుంటాయి
పెళ్ళికోసమో, ఆటలపోటీకోసమో
ఏదీకాకపోతే ఓటరులిస్టులు సవరించడానికో
రోడ్డుకడ్డంగా షామియానా వేసినట్టు
ఇప్పుడేదో కొత్త కలకలం నిన్నడ్డగిస్తుంది
నీమీద తొలిరంగులజల్లు పడుతోందని
తెలుస్తుంది, కాని ఎంత తుడుచుకున్నా
ఆ వెలుతురు మరక చెరగదు.
నువ్వు మామూలుగా ఉండటం కష్టం
రోజూ పొద్దున్నే నువ్వు ఇంటినుంచి
ప్రపంచం లోకి మలుపు తిరిగే వీథిలో
కొత్తగా జెండాలు ఎగురుతుంటాయి
పెళ్ళికోసమో, ఆటలపోటీకోసమో
ఏదీకాకపోతే ఓటరులిస్టులు సవరించడానికో
రోడ్డుకడ్డంగా షామియానా వేసినట్టు
ఇప్పుడేదో కొత్త కలకలం నిన్నడ్డగిస్తుంది
నీమీద తొలిరంగులజల్లు పడుతోందని
తెలుస్తుంది, కాని ఎంత తుడుచుకున్నా
ఆ వెలుతురు మరక చెరగదు.
నగరంలో ఫాల్గుణం అడుగుపెట్టిందని
గుర్తుపట్టేటప్పటికి
నువ్వు మర్చిపోయిన పాటలు, పెదాలు
పరిమళాలు నిన్ను చుట్టుముడతాయి
నీ అసలు నివాసం
'సుషమాసుధాగానమంజువాటి ' అని
మళ్ళీ గుర్తొస్తుంది.
ఆ పదాలమీద పేరుకున్న దుమ్ముని
ఊదేస్తూనే అవి తుమ్మెదలై ఎగిరిపోతాయి
నువ్వు కిటికీలోంచి చూడగానే
పన్నిన పసుపుపూల వలలో
నీ చూపులు చిక్కుకుంటాయి.
గుర్తుపట్టేటప్పటికి
నువ్వు మర్చిపోయిన పాటలు, పెదాలు
పరిమళాలు నిన్ను చుట్టుముడతాయి
నీ అసలు నివాసం
'సుషమాసుధాగానమంజువాటి ' అని
మళ్ళీ గుర్తొస్తుంది.
ఆ పదాలమీద పేరుకున్న దుమ్ముని
ఊదేస్తూనే అవి తుమ్మెదలై ఎగిరిపోతాయి
నువ్వు కిటికీలోంచి చూడగానే
పన్నిన పసుపుపూల వలలో
నీ చూపులు చిక్కుకుంటాయి.
ఎప్పట్లానే మళ్ళా నగరంలో
ఫాల్గుణం నడిచివస్తుంటే
గాథాసప్తశతికి కొత్త అనువాదం
కొరియర్లో వస్తునట్టనిపిస్తుంది.
పొద్దుటివేళ పారదర్శకమైన
పలచనినీడలచుట్టూ కొంతచిక్కదనం తో పాటు
నీ చిన్నప్పుడు అమ్మ నీ చేతుల్లో పెట్టిన
పాలగ్లాసుగోరువెచ్చదనం కూడా.
ఎక్కడ చూడు,సిటీబస్సుల్లోంచి, ఆటోల్లోంచి
ఒకటే పెళ్ళివారు దిగుతుంటారు.
నువ్వాఫీసుకి వెళ్తావేగాని
నీ చిన్నప్పటి బంధువులెవరో, ఎక్కడో, ఎవరినో
నీ ఇంటికి అడ్రసు అడుగుతున్నారనిపిస్తుంది
ఇప్పుడు నువ్వు ఆఫీసులో ఆ బూడిదరంగు
బ్లాక్ అండ్ వైట్ ఇంకుజెట్టులో
ఏది ప్రింటు తీసినా
రంగులే బయటికొస్తుంటాయి.
ఫాల్గుణం నడిచివస్తుంటే
గాథాసప్తశతికి కొత్త అనువాదం
కొరియర్లో వస్తునట్టనిపిస్తుంది.
పొద్దుటివేళ పారదర్శకమైన
పలచనినీడలచుట్టూ కొంతచిక్కదనం తో పాటు
నీ చిన్నప్పుడు అమ్మ నీ చేతుల్లో పెట్టిన
పాలగ్లాసుగోరువెచ్చదనం కూడా.
ఎక్కడ చూడు,సిటీబస్సుల్లోంచి, ఆటోల్లోంచి
ఒకటే పెళ్ళివారు దిగుతుంటారు.
నువ్వాఫీసుకి వెళ్తావేగాని
నీ చిన్నప్పటి బంధువులెవరో, ఎక్కడో, ఎవరినో
నీ ఇంటికి అడ్రసు అడుగుతున్నారనిపిస్తుంది
ఇప్పుడు నువ్వు ఆఫీసులో ఆ బూడిదరంగు
బ్లాక్ అండ్ వైట్ ఇంకుజెట్టులో
ఏది ప్రింటు తీసినా
రంగులే బయటికొస్తుంటాయి.
నగరంలో ఫాల్గుణం కుదురుకోగానే
నీ ఇంటిపక్కనొక డ్రామాకంపెనీ
డేరావేసినట్టే ఉంటుంది
అర్థరాత్రి అంతా నిద్రపోతుంటారుగాని
నీకు మటుకు రాయబారం పద్యాలు వినిపిస్తుంటాయి
దిరిసెనపువ్వులాంటి జ్ఞాపకమొకటి
నిన్ను రాపాడుతుంది, నువ్వు పగిలిపోతావు
నీ చుట్టూ అట్టకట్టిన
ఇత్తడి, రాగి, సేవెండిరంగుల కోశంచిట్లి
తెల్లవారుతూనే
పసిడిరెక్కల పాటతో
నువ్వొక కోకిలగా బయటికొస్తావు
నీ ఇంటిపక్కనొక డ్రామాకంపెనీ
డేరావేసినట్టే ఉంటుంది
అర్థరాత్రి అంతా నిద్రపోతుంటారుగాని
నీకు మటుకు రాయబారం పద్యాలు వినిపిస్తుంటాయి
దిరిసెనపువ్వులాంటి జ్ఞాపకమొకటి
నిన్ను రాపాడుతుంది, నువ్వు పగిలిపోతావు
నీ చుట్టూ అట్టకట్టిన
ఇత్తడి, రాగి, సేవెండిరంగుల కోశంచిట్లి
తెల్లవారుతూనే
పసిడిరెక్కల పాటతో
నువ్వొక కోకిలగా బయటికొస్తావు
No comments:
Post a Comment