Sunday, July 29, 2018

వాడ్రేవు చినవీర భద్రుడు గారికి నమస్సులతో గురుపూర్ణిమ శుభాకాంక్షలు. నిండుగా పూసిన అక్షరాల చెట్టు.

Sasi Thanneeru గారు, ఇంత ఆదరణీయంగా రాసిన మీరే నాకు గురువులు. చిన్నవారు కాబట్టి ఆశీస్సులు, గురుత్వం చూపించినందుకు నమస్సులు.
మీరు రాసిన పోస్టుని తిరిగి నా మిత్రులకోసం ఇక్కడ యథాతథంగా పంచుకుంటున్నాను.
____________________________
వాడ్రేవు చినవీర భద్రుడు గారికి నమస్సులతో గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
నిండుగా పూసిన అక్షరాల చెట్టు.
రేపటి దాకా సమయం ఇచ్చి గంటకే పని ఎంతవరకు వచ్చింది అని అడిగే జీవిత వత్తిడిలో కాళ్లకు చక్రాలు కట్టుకోని పరిగెత్తుతూ ఉంటే ఒక చక్కని పరిమళం సేదతీరమని దారి పక్కకు పిలిచి దాహం తీర్చే చల్లని నీటినిచ్చి, నీడను ఇస్తే ఎలా ఉంటుంది?
ఇదుగో భద్రుడు అని ప్రేమగా సాహిత్యలోకం పిలుచుకునే వాడ్రేవు చినవీరభద్రుడు గారి అక్షరాలంత హాయిగా ఉంటుంది!!
'నిండుగా పూసిన మామిడి చెట్టు ఎదుట ఏ ఒక్కరు ఒంటరి కారు'
...... చినవీరభద్రుడు
ఆయన మాటలంత నిండుగానే ఎన్నివ్యాసాలు, ఎన్ని అనువాదాలు,ఎన్ని కవితలు,ఎన్ని సమీక్షలు,ఎన్ని ముందుమాటలు ,ఎన్ని తర్కాలు. నిజంగా నిండుగా పూసిన మామిడిచెట్టు!!
ఎవరి ప్రచురణ కోసమూ ఎదురు చూడరు.జ్ఞానం నాకే ఉండాలి అని దాచుకోరు.
నేర్చుకుంటే చెట్టును మించిన గురువు లేరు ఎక్కడా!
ఈ జ్ఞానపు చెట్టు నీడలో అందరం నేర్చుకొనే శిష్యులమే
నేర్చుకోవడం లోని బాల్యకాలపు ఆనందం ఈయన వద్ద నేర్చుకోవాలి.
ఈ వయసులో సాహిత్యం బాటలోనే నడుస్తూ ఇంకోవైపు నీటిరంగులు అద్దుకున్న ప్రకృతిని తన కుంచె నుండి జాలువారుస్తూ . ... కబీరు నాది దుఃఖం లేని దేశం పుస్తకం మీద తన కుంచె అందాన్నే ముఖ చిత్రంగా నిలపడం ఎంత బాగుంది!
కెంజాయ రంగు ఆకాశం క్రింద నీటిలో తన ప్రతిబింబము చూపిస్తూ ఉన్న హంస , పుస్తకపు లోపలి మాటలను ముందే తనలో చూపిస్తూ''అతని'' స్పృహ వల్లనే కబీరు తాను ఎక్కడ నుండి వచ్చాడో అక్కడకు చేరుకుంటాడు. ..... ఎక్కడికి? తన బింబం ఏదో అక్కడకి చేరుకుంటాడు.
ఎంత చక్కగా గీసారు , ఎంత చక్కగా వ్రాసారు!
ఒక వైపు ఋగ్వేదం లోని సూక్తులు వివరిస్తూ తర్కిస్తూ ఉంటారు,ఇంకో వైపు నాచ్చియార్ తిరుమొళి భక్తి ఆవేశాన్ని విచారిస్తూ ఉంటారు, ఇంకో వైపు అనువాదాలను,100 రోజులు నీగ్రోల స్వతంత్ర స్వరాన్ని గానం చేయగల కలం బలం వీరికి గాక ఎవరికి ఉంది?
పాల్స్ రోబన్ ,లొరేయేన్ ,మాయా ఏంజిలో అందరూ తమ భావాలను భాష దాటి సజీవంగా ఈయన కలం లో ఒంపుతూ ఉంటారు. మాయా ఏంజిలో గురించి వై ద కెజెడ్ బార్డ్ సింగ్స్ అని వివరిస్తూ వీరు చెప్పే వ్యక్తిత్వ పాఠాలు దాచుకోతగినవి.
ఇంకో వైపు తన ఉద్యోగ అనుభవాలు, గిరిజనులు కోసం చేసిన పోరాటాలు మనతో పంచుకుంటూ ఉంటారు. కొత్త బోధనా పద్ధతులు చర్చిస్తూ ఉంటారు. ఎప్పుడూ నేర్చుకుంటూనో, నేర్చుకున్న జ్ఞానం పంచుతూనో ఉండే చలివేంద్రం ఈయన!!
ఒక వైపు ''ఒక శతాబ్దానికి దర్పణం మునిపల్లె రాజు '' అని పోయినవారి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటూ గౌరవిస్తూ, చిన్న పాప వ్రాసిన కవితలోని ''ఇప్పుడు వచ్చిన అమ్మ కన్నీళ్లు ఖచ్చితంగా ఉల్లిపాయలివి కాదు'' అనే వాక్యాలను సమభావంతో స్మరిస్తూ ఉంటాడు.
ఎలా అర్ధం చేసుకోగలం వీరిని .... వీరు రూమి నుండి మనకోసం పట్టుకొచ్చిన వాక్యపుష్పాల పరిమళం తో తప్ప!
''కొందరు మనల్ని పలకరిస్తే కస్తూరి పరిమళం గుప్పుమంటుంది. మరికొందరిని పలకరిస్తే పొగ కమ్ముకుంటుంది'' ..... రూమీ
నిరంతరం నేర్చుకుంటూ ఉండటం పక్క వారికి ఆ వెలుగు పంచడం,చివరికి ఒక చిన్న గీత తెలుగును రెండుగా విభజించి ఆయన ఈ వైపుకు రావాల్సి వచ్చినపుడు కూడా , ఇల్లు వదిలిన బెంగతో వదలినపుడు కూడా ఒక మాట అంటారు ''ఇపుడు నేను కొంచెం వంట చేయడం నేర్చుకుంటూ ఉన్నాను. ఆడవాళ్ళ కష్టం నాకు అర్ధం అవుతూ ఉంది''
''సాయంకాలపు చెర్రీపూలు
నేడు అప్పుడే రేపుగా మారిపోయింది''.
జపనీయ కవి హైకూలు నుండి .
''అది పేపర్ లో వచ్చిన ఆర్టికల్ అయినా ,'పుస్తకం ప్రచురించినా, 'ఫేస్ బుక్ పోస్ట్ అయినా కనపడేది ఒకటే- ఆ వ్యక్తి శ్రద్ధ, నిరంతర అధ్యయనం!
ఆయన వాక్యాల్లోనే ..
''మనిషిని కవి చేసేవి రెండే
ఒకటి అతను పుట్టిన ఊరు
రెండు ఉందని అతడు నమ్మే ఇంకో ప్రపంచం''
ఆ ఇంకో ప్రపంచమే ఇప్పటి కవితల పుస్తకం ''కొండ మీద అతిథి '' వైపు ఆ కాలాన్ని నడిపించి ఉంటుంది.
ఇంకా మొన్న చిగుర్చిన ఉగాది కవితలోని పంక్తులు-
''చెట్టులాగా ఉగాదిని శిరసావహించడం ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను ''.
ఆకులు చిగురించినా , రాలిపోయినా అదే స్థిత ప్రజ్ఞతతో ఉండే చెట్టు నుండి ఇది నేర్చుకోవాలి అని తానే ముందు సాధన చేస్తూ చెపుతున్నారు.
''జీవిత కాలం పొడుగుతా నన్ను నేను శృతి చేసుకుంటూనే ఉన్నాను:"
మనిషి జీవితం మొత్తం తప్పులు సరిదిద్దుకుంటూ పయనిస్తూనే ఉంటాడు. నేను తప్పులే చేయను అనేవాడిది ఎంత మూర్ఖత్వం. ఈయన తనను తానూ శృతి చేసుకుంటూ పయనిస్తున్నారు అని యెంత చక్కని స్వరాన్ని వినిపించారు!
''ఒక చెట్టులాగా, ఒక చెరుకు గడ లాగా ,ఒక కోయిల లాగా ఉగాదిని స్వీకరించాలి, అందరికీ ఆ తీపిని పంచాలి అనే ఆకాంక్ష ఎంత గొప్పది''
ఈయన పేస్ బుక్ ఫాలోయర్ గా నేను అందుకున్న జ్ఞానానికి ఎన్ని కృతజ్ఞతా వాక్యాలు చెప్పినా చందమామకు నూలుపోగు సమర్పించినట్లే!
ఎక్కడివో ఈయనకు ఇంత చక్కటి ఆలోచనలు. బాల్యకాలావస్థ లోనే ఉంటూ విమర్శలకు కూడా నవ్వును పంచేె ఆ ధీరత్వం!!
బహుశా ఈయన వ్రాసినట్లు ... రోజువారీ జీవితం లోంచే స్వర్గం వైపుగా నడిచే విద్యని రూమీ నుండి కబీరు, కబీరు నుండి ఠాగూరు, వారినుండి వీర భద్రుడు గారు నేర్చుకొని ఉండవచ్చు.
***
ఇంకా అంటారు కదా ..
''ఇంత జీవితం వృథాగా గడిపాను ,చీనా జపాన్ చిత్రకారుల్లాగా ఒక వెదురుపోదనో, తూనీగనో చిత్రీకరించితే చాలు అని !
- శశి తన్నీరు

Friday, July 27, 2018

దేశం ‘భాషల మృత్యుదిబ్బ’గా మిగులుతుంది! ప్రొ।। గణేశ్‌ డెవి.ఈనాడు27-07-2018

ఈ అంశంపై పూర్తి వివరాలు నేటి ఈనాడు లో చదవండి.
దేశం ‘భాషల మృత్యుదిబ్బ’గా మిగులుతుంది! 
అర్థశతాబ్దంలో దేశంలో 283 భాషలు మాయమయ్యాయి 
ప్రజల భవిష్యత్తుకు ఇది ప్రమాద సంకేతం 
హెచ్చరిస్తున్న విఖ్యాత భాషా పరిశోధకులు గణేశ్‌ డెవి 
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి 
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి 
మన దేశంలో సగటున ప్రతి 2 నెలలకు ఒక భాష కనుమరుగైపోతోంది!  ఇదేదో జోస్యం కాదు. మూలమూలలూ గాలించి.. ప్రజలు మాట్లాడుతున్న భిన్న భాషలపై విస్తృతంగా అధ్యయనం చేసి.. దేశంలో మొత్తం 780 సజీవ భాషలున్నాయని తేల్చిచెప్పినవిఖ్యాత భాషా పరిశోధకులు, విద్యావేత్త ప్రొ।। గణేశ్‌.ఎన్‌.డెవి చెబుతున్న క్షేత్రస్థాయి వాస్తవం ఇది!
 ఇదే కాదు.. భాషల విషయంలో మనం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రమాదకరమైన ధోరణులు చాలానే చోటు చేసుకుంటున్నాయి. గత ఐదు దశాబ్దాలుగా దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో 3వ స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు 4వస్థానానికిజారిపోయింది. ఒక భాష మాట్లాడే వారి సంఖ్య తగ్గి పోతుండటం మనం ఊహించిన దానికంటే కూడా పెద్ద ప్రమాద సంకేత మని హెచ్చరిస్తున్న ప్రొ।। డెవి
భాషల మృత్యు దిబ్బగా మిగులుతుంది! 
ప్రొ।। గణేశ్‌ డెవి.. కొండలు కోనలు దాటుకుని దేశం మూలమూలలూ తిరిగి.. ప్రతి సమూహంతోనూ మమేకమై.. ప్రజల భాషలను మక్కువగా అక్కున జేర్చుకుని.. దేశ భాషలపై విస్తృతంగా పరిశోధన చేస్తున్న శక్తిలాంటి వ్యక్తి! దేశంలో ప్రజలు మాట్లాడుకొనే సజీవ భాషలు ఎన్ని ఉన్నాయన్న దానిపై విస్తృత అధ్యయనం ‘పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’కు సారథ]్యం వహించిన ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఇంగ్లిషు, మరాఠీ, గుజరాతీలలో ఇప్పటి వరకూ 80కిపైగా పుస్తకాలను ప్రచురించారు. ప్రస్తుతం ధార్వాడలో ఉంటూ ప్రపంచంలోని భిన్న భాషల తీరుతెన్నులపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.  ఇంగ్లిషు,  ఇతర అంతర్జాతీయ భాషలపై ‘పీఎల్‌ఎస్‌ఐ’ ప్రచురించిన తాజా సంకలనాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ముఖ్యాంశాలు..


మీరు భారతదేశం ‘భాషల మృత్యుదిబ్బ’గా (గ్రేవ్‌యార్డ్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌) మారుతుందని హెచ్చరిసున్నారు. ఎందుకలా? దేశంలో అంతటి తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయా? 
జ: కచ్చితంగా! గత ఐదు దశాబ్దాల్లో దేశంలో 283 భాషలు అదృశ్యమయ్యాయి. అంటే ఏడాదికి ఆరు భాషలు.. ప్రతి రెండు నెలలకు ఒక భాష చచ్చిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో 22 భాషలుండగా వాటిలో 17 భాషలు తగ్గిపోయాయి. గత పదేళ్లలో 17 భారతీయ భాషలు తిరోగమనం బాట పట్టాయి. 
ప్రాథమిక విద్యాబోధన మాతృభాషకు దూరం జరగటం మంచిదేనంటారా? 
జ: మాతృభాషలో విద్య.. అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రస్తుతం దేశంలో అన్నిచోట్లా చదువుల్లో ప్రమాణాలు పడిపోయాయి. 5వ తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలు సరిగా చదవలేకపోతున్నారు. అందులో సగం మంది ఏం చదువుతున్నారో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది జాతీయ విపత్తు. మాతృభాషలో విద్యాబోధన తప్పనిసరి. దీంతో పాటు ఇంగ్లీషు చదువూ అవసరమే. ఎందుకంటే అది విజ్ఞానానికి సంబంధించిన భాష. దీన్ని పరిగణలోకి తీసుకొని కొన్ని ‘భాషా నగరాలను’ ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రత్యేక భాషా రిసోర్స్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దేశంలో హిమాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లు రెండూ ఈ ప్రయోగం చేసి మంచి ఫలితాలు కూడా సాధించాయి. అన్ని రాష్ట్రాలూ ఆ బాటను అనుసరించాలి.
భాషలు అదృశ్యం కాకుండా ఉండాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలంటారు? 
జ: చిన్న భాషలు బతికున్న చోట అక్కడున్న జీవనోపాధి విధానాలను సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఈ భాషలకూ, సంస్కృతికీ వలసలు ప్రధాన శత్రువులవుతున్నాయి. ఇదే సమయంలో వలసలు ఆధునికతకు కూడా కారణమవుతున్నాయి. వలసల అవసరం పెద్దగా లేకుండా ఆధునికత సాధించేలా ఉండాలి. దీనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. ప్రస్తుతం విచ్చలవిడిగా వాడుతున్న మొబైల్స్‌ మూకదాడులకే దోహదపడుతున్నాయి. ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు తేవాల్సిన అవసరం ఉంది.

ఏ రాష్ట్రంలో మంచి భాషా విధానం ఉంది? 
జ: ఎలాంటి సందేహం లేకుండా ఝార్ఖండ్‌లోనే. 14 అధికార భాషలను గుర్తించారు. గిరిజన భాషలకూ సముచిత ప్రాధాన్యం ఇచ్చారు.

అనేక భాషల సమ్మిళితంగా ఉన్న సమాజాలు తక్కువ హింసాత్మకంగా ఉంటే.. ఒకే భాషాధిపత్యం కలిగిన ప్రాంతాలు, సమూహాల్లో హింసాత్మక ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి!
----------

Saturday, July 21, 2018

ధర్మం/నీతి/విలువలు బోధించే 79 పుస్తకాలు, 14 ప్రవచనాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో ---- *పుస్తకాలు*

ధర్మం/నీతి/విలువలు  బోధించే 79 పుస్తకాలు, 14 ప్రవచనాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో
------------------------------------------------
           *పుస్తకాలు*
చాణక్య నీతి సూత్రాలు   http://bit.ly/Dharmam-1
విదురనీతి   http://bit.ly/Dharmam-2
బోధాయన ధర్మ సూత్రము   http://bit.ly/Dharmam-3
ధర్మం   http://bit.ly/Dharmam-4
హిందూ ధర్మ శాస్త్రము   http://bit.ly/Dharmam-5
11 నీతి కథలు   http://bit.ly/Dharmam-6
నీతి కథా మంజరి-1   http://bit.ly/Dharmam-7
చాణక్య నీతి దర్పణము   http://bit.ly/Dharmam-8
నిర్ణయ సింధువు-1   http://bit.ly/Dharmam-9
మానవ ధర్మ శాస్త్రము   http://bit.ly/Dharmam-10
అమ్మ చెప్పిన కమ్మని నీతి కథలు   http://bit.ly/Dharmam-11
ఆర్ష ధర్మ సూత్రములు   http://bit.ly/Dharmam-12
భారతమాత సేవలో   http://bit.ly/Dharmam-13
ధర్మ సందేశాలు   http://bit.ly/Dharmam-14
కుటుంబ వ్యవస్థ అవసరమా ?   http://bit.ly/Dharmam-15
మహాభారత కథలు-1   http://bit.ly/Dharmam-16
ధర్మ శాస్త్ర రత్నాకరం   http://bit.ly/Dharmam-17
నీతి కథామంజరి   http://bit.ly/Dharmam-18
మాటల మధ్యలో రాలిన ముత్యాలు-1,2   http://bit.ly/Dharmam-19
ధర్మ ఘంట   http://bit.ly/Dharmam-20
నిత్య జీవితానికి నియమావళి   http://bit.ly/Dharmam-21
మంచివాళ్ళు మాటతీరు   http://bit.ly/Dharmam-22
యధార్ధ మానవత్వము   http://bit.ly/Dharmam-23
ధర్మ మంజరి   http://bit.ly/Dharmam-24
సంపూర్ణ నీతి చంద్రిక-1,2   http://bit.ly/Dharmam-25
మహనీయుల ముచ్చట్లు   http://bit.ly/Dharmam-26
రామాయణము మానవ ధర్మము   http://bit.ly/Dharmam-27
భారత నీతి కథలు-1,2   http://bit.ly/Dharmam-28
బడిలో చెప్పని పాటాలు   http://bit.ly/Dharmam-29
పవిత్ర సన్నివేశములు   http://bit.ly/Dharmam-30
పరమోత్తమ శిక్షణ   http://bit.ly/Dharmam-31
బాల శిక్ష   http://bit.ly/Dharmam-32
నీతి శతక రత్నావళి   http://bit.ly/Dharmam-33
నీతి వాక్యామృతం   http://bit.ly/Dharmam-34
మహర్షుల హితోక్తులు   http://bit.ly/Dharmam-35
మహాభారత కథలు-5   http://bit.ly/Dharmam-36
మానవ జీవితము-2   http://bit.ly/Dharmam-37
మానవ జీవితము-3   http://bit.ly/Dharmam-38
మానవ ధర్మము   http://bit.ly/Dharmam-39
ధర్మ పధం కథలు   http://bit.ly/Dharmam-40
విదురామృతం   http://bit.ly/Dharmam-41
సంస్కృతి - సంప్రదాయం   http://bit.ly/Dharmam-42
స్ఫూర్తి కణాలు   http://bit.ly/Dharmam-43
హితోపదేశము-1,2   http://bit.ly/Dharmam-44
ఆర్ష కుటుంబము   http://bit.ly/Dharmam-45
మనుస్మృతి   http://bit.ly/Dharmam-46
పరాశర స్మృతి   http://bit.ly/Dharmam-47
సనాతన ధర్మం దాని విశిష్టత   http://bit.ly/Dharmam-48
రత్న త్రయము   http://bit.ly/Dharmam-49
పౌర హక్కులు - విధులు   http://bit.ly/Dharmam-50
నీతి సుధానిది-3నుంచి5   http://bit.ly/Dharmam-51
జాతక కథలు-1 నుంచి 5   http://bit.ly/Dharmam-52
వేమన పద్యములు   http://bit.ly/Dharmam-53
ధర్మ శాస్త్రాలలో శిక్షాస్మృతి   http://bit.ly/Dharmam-54
భారతంలో నీతి కథలు   http://bit.ly/Dharmam-55
నీతి కథలు   http://bit.ly/Dharmam-56
చందమామ కథలు   http://bit.ly/Dharmam-57
నూరు మంచి మాటలు   http://bit.ly/Dharmam-58
నీతి కథామాల   http://bit.ly/Dharmam-59
ఋగ్వేద కథలు   http://bit.ly/Dharmam-60
కాశీమజిలీ కథలు-1   http://bit.ly/Dharmam-61
అపూర్వ చింతామణి   http://bit.ly/Dharmam-62
పంచతంత్రం-మిత్ర భేదం,మిత్ర ప్రాప్తికం   http://bit.ly/Dharmam-63
భేతాళ కథలు   http://bit.ly/Dharmam-64
భట్టి విక్రమార్కుని కథలు   http://bit.ly/Dharmam-65
పేదరాసి పెద్దమ్మ కథలు-2   http://bit.ly/Dharmam-66
సుజ్ఞాన బోధిని-నీతి కథలు   http://bit.ly/Dharmam-67
బాలానంద బొమ్మల పంచతంత్రం-1,2   http://bit.ly/Dharmam-68
పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు   http://bit.ly/Dharmam-69
ప్రేరణార్ధక కథలు   http://bit.ly/Dharmam-70
B.N.భాషితాలు   http://bit.ly/Dharmam-71
అమృత బిందువులు   http://bit.ly/Dharmam-72
369 మంచిముత్యాలు   http://bit.ly/Dharmam-73
సంస్కృత లోకోక్తులు   http://bit.ly/Dharmam-74
వేమన వేద సూక్తులు   http://bit.ly/Dharmam-75
అన్ని సందర్బాల్లో సూక్తులు   http://bit.ly/Dharmam-76
సజీవ సత్యాలు   http://bit.ly/Dharmam-77
భర్త్రుహరి సుభాషితము   http://bit.ly/Dharmam-78
సంస్కృత సూక్తి రత్న కోశః-2   http://bit.ly/Dharmam-79

**ప్రవచనాలు ***
సామాన్య ధర్మములు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015   http://bit.ly/Dharmam-VID-1
ధర్మ వైశిష్ట్యము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015   http://bit.ly/Dharmam-VID-2
సనాతన ధర్మము,నిత్యకర్మానుష్టానం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012   http://bit.ly/Dharmam-VID-3
ధర్మాచరణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014   http://bit.ly/Dharmam-VID-4
ధర్మము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013   http://bit.ly/Dharmam-VID-5
జీవన యాగం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015   http://bit.ly/Dharmam-VID-6
ధర్మం - అధర్మం -శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014   http://bit.ly/Dharmam-VID-7
గృహస్థ, సన్యాస ధర్మం - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2011   http://bit.ly/Dharmam-VID-8
మను స్మృతి - శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే  ప్రవచనం-2010   http://bit.ly/Dharmam-VID-9
ధర్మాలు-ఆచారాలు-ఆవశ్యకత -శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015   http://bit.ly/Dharmam-VID-10
హిందూ ధర్మం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016   http://bit.ly/Dharmam-VID-11
నిత్య జీవితంలో సనాతన ధర్మం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-USA-2016   http://bit.ly/Dharmam-VID-12
ప్రకృతి మాతకు నీరాజనం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015   http://bit.ly/Dharmam-VID-13
వాహన ప్రయాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం   http://bit.ly/Dharmam-VID-14

ధర్మం/నీతి/విలువలు పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు,ప్రవచనాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
Website:  www.freegurukul.org
Facebook:  www.fb.com/freegurukul
Telegram:  http://t.me/freegurukul
Android App: FreeGurukul

Collections:
KSV KRISHNA REDDY, GHM,ZPHS,GANTI,EAST GODAVARI
ADMIN, BEST SOCIAL TEACHER WHATSAAP GROUPS

Friday, July 20, 2018

బ్రాహ్మణులు కొరకు కాశీలో ప్రత్యేక ఆశ్రమం :

బ్రాహ్మణులు కొరకు కాశీలో ప్రత్యేక ఆశ్రమం :

బ్రాహ్మణులు కొరకు కాశీలో శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమ సేవ  సొసైటీ తరపున ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటు చేసాము.

⏩ఏ.సి, నాన్ ఏ.సి రూములు, అతి తక్కువ ధరలకే సింగిల్ బెడ్ లు, ఎయిర్ కూలర్ గదులు కేటాయింపు..

⏩2, 3, 5 పడకలు గల రూములు కలవు. ఎయిర్ కూలర్ సదుపాయంతో ఒక్కొక్కరికి కేవలం 150/- (ఒక రోజుకు) లకే వసతి కల్పించబడును.

⏩ఈ ఆశ్రమంలోబ్రాహ్మణులు కొరకు ప్రత్యేక నారాయణ సేవ (అన్నదానం) జరుగుతుంది. ప్రతీ రోజు రెండు సార్లు ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 03.30 వరకు మరియు రాత్రి 07:00 నుండి 09:00 వరకు

⏩అనుష్ఠానం చేసుకొనుటకు ప్రత్యేక సదుపాయాలు కలవు.

⏩ఉచిత లైబ్రరీ సదుపాయం.

☎ ఈ విషయాలలో మీకు ఎలాంటి వివరాలు కావలసినా సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు:
+91 89191 23647
+91 99367 64525
+91 99187 74933

Email: sethu2kasi@gmail.com

Facebook: https://www.facebook.com/kashi.hariharasastry

సంప్రదించవలసిన అడ్రస్:

శ్రీ కాశీ గాయత్రీ సేవ సొసైటీ,
శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమం,
అబ్బూరు హరి హర శాస్త్రి,
D 47 /2B 2G,
PDR మాల్ దగ్గర,
రామాపుర, వారణాసి.
PIN 221001

Wednesday, July 18, 2018

ధ్వజస్థంభం పుట్టుక



మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు

1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.
2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ.
పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది
కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు...
అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట,దుర్భాష లాడుట చేయరాదు.
ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు.
ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును.
భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం
భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు...

కప్పు పెరుగు విలువ ఎంత ???



ఒక వ్యాపారికి తన 45 సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది.
అతని బంధువులు, స్నేహితులు, తనని 2వ వివాహము చేసు కొని స్థిరపడమని పరి పరి విధాల చెప్పి చూచారు..
కానీ, తనకు, తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని, వానిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని, వాడి అభివృద్ధే తన ధ్యేయమని,
చెప్పి, ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు.
అతని కుమారుడు, విద్యాబుద్ధులు నేర్చి, సక్రమంగా పెరిగి పెద్దవాడైన తదుపరి, అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి, తను కష్ట పడి వృద్ధిచేసిన వ్యాపారాన్ని కూడా వప్పగించి, తన వృద్ధాప్య జీవితం గడపటం మొదలు పెట్టాడు...
అలా కొంత కాలం గడచి పోయింది.
ఒకరోజు, వృద్ధుడైన వ్యాపారి భోజన సమయం లో తన కోడలిని "కొంచెం పెరుగు వుంటే వేయమని" అడిగాడు.
దానికి కోడలు "అయ్యో పెరుగు లేదండీ" అని చెప్పింది.
అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు..
భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్లిపోయిన తరువాత, కొడుకు, కోడలు భోజనానికి కూర్చున్నారు...
వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు..
భార్యను ఏమీ అనలేదు. మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు.

కానీ పని మీద మనసు లగ్నం చేయ లేక పోయాడు.
రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసును తొలుస్తున్నది.

తనకొఱకు తన తండ్రి చేసిన త్యాగం, ప్రేమతో పెంచిన తీరు, కష్టపడి వృద్ధిచేసి అందించిన, వడ్డించిన విస్తరి లాంటి వ్యాపారం.. అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి..
తన తండ్రి జీవితమంతా చేసిన కష్టం, ఒక కప్పు పెరుగును ఇవ్వలేక పోయిందా అనే బాధను తట్టుకోలేక పోయాడు..
తండ్రికి ఇపుడు ఇంకొక వివాహం చేస్తే, ఆ భార్య అతని బాగోగులు బాగా చూచుకొన గలదు..
కానీ ఇపుడు తండ్రి ససేమిరా ఒప్పుకోడు..

భార్యను దండించితే మనసు మారుతుందన్న నమ్మకం లేదు...

ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు.
చివరకు ఒక నిర్ణయానికి వచ్చి, మరుసటి రోజు హఠాత్తుగా తన తండ్రిని వేరొక ఊరు తీసికొని వెళ్లి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరచి తండ్రిని అక్కడవుంచి తిరిగి వచ్చేసాడు.
మామగారు అంత హఠాత్తుగా ఎక్కడికి, ఎందుకు వెళ్లాడో కోడలికి అర్ధం కాలేదు..
భర్తను అడిగింది గానీ తనకు కూడా తెలియదని చెప్పటంతో ఆలోచనలో పడింది. 
ఒక వారం గడిచిపోయింది..
మామగారి విషయం తెలియటం లేదు. భర్తను అడిగే ధైర్యం చేయలేక పోయింది. సహజంగానే ఆతృత పెరిగింది.
ఆరోజు ఉదయం భర్త వెళ్లిన తరువాత, ఏదో పని మీద గుమాస్తా ఇంటికి వచ్చాడు..
కోడలు మామ గారి గురించి ఆరా అడిగింది..
ఎంజరిగిందో తెలియదు గాని...
పెద్ద వ్యాపారి గారు పెళ్లి చేసుకోబోతున్నారని... ఏర్పాట్లు పూర్తయ్యా యని,
వ్యాపారాన్ని కూడా తనే చూచు కుంటారని, ఆయన కొత్త కాపురం ఈ ఇంట్లోనే ఉంటారని, కొడుకు తన కాపారాన్ని ఒక అద్దె ఇంటి లోనికి మార్చ బోతున్నారని,
అందరూ చెప్పుకుంటున్నారనీ..
గుమాస్తా చెప్పిన విషయం
విని నివ్వెర పోయింది..
ఒక్కసారిగా కోడలి కంటిముందు, తన భావి జీవితం కనపడింది..
తాను చేస్తున్న తప్పు తెలిసింది.. ఇపుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసు కుంది.
గుమాస్తాను,  మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి తెలుసుకొని పరుగున వెళ్ళి ఆయన కాళ్లపై పడి క్షమాపణ కోరింది. తన తప్పు తెలుసు కున్నానని, ఇకనుండి తన తండ్రిలా చూచుకుంటానని ప్రాధేయ పడింది.
ఈవిషయాలేవీ తెలియని మామగారికి పరిస్థితి అర్ధం  కాలేదు..
అపుడు వచ్చాడు కొడుకు..
కప్పు పెరుగు విలువ కోడలికి తెలియ జెప్పటానికి తాను ఎంత చేయ వలసి వచ్చిందో వివరించాడు.
తనకు తానుగా మార టానికి , భర్త పడిన కష్టం చూచి సిగ్గుపడింది..
వృద్దాప్యంలోని తల్లిదండ్రులు పిల్లలకు ATM కార్డులాంటి వారు..
అదే సమయంలో పిల్లలు వారికి ఆధార్ కార్డ్ లాంటి వారుగా ఉండాలని తెలుసుకుంటే కుటుంబ బంధాలు ఎంత సహజంగా పరిమళిస్తాయో ఒక్కసారి ఆలోచించండి...

Brahmana Free Marriage samachara kendram


Chaild Heart disease free treatment


జూబిలీ ఉత్సవాలు వాటి పేర్లు

కొన్ని సంవత్సరాలు సాఫల్య జీవనం గడిచాక సంస్థలు కానీ వ్యక్తులు కానీ జూబిలీ ఉత్సవాలు జరుపుకుంటాం కదా! సంవత్సరాలు వాటి పేర్లు మీ సమాచారం కోసం

ANNIVERSARIES
  • One (1) year – Cotton Jubilee
  • Two (2) years – Paper Jubilee
  • Three (3) years – Leather Jubilee
  • Four (4) years – Flower/Fruit Jubilee
  • Five (5) years – Wooden Jubilee
  • Six (6) years – Iron Jubilee
  • Seven (7) years – Wool
  • Eight (8) years – Bronze Jubilee
  • Nine (9) years – Copper Jubilee
  • Ten (10) years – Tin/Aluminium Jubilee
  • Eleven (11) years – Steel Jubilee
  • Twelve (12) years – Silk and Fine Linen Jubilee
  • Thirteen (13) years – Lace Jubilee
  • Fourteen (14) years – Ivory Jubilee
  • Fifteen (15) years – Crystal Jubilee
  • Twenty (20) years – China/Porcelain Jubilee
  • Twenty Five (25) years – Silver Jubilee
  • Thirty (30) years – Pearl Jubilee
  • Thirty Five (35) years – Coral Jubilee
  • Forty (40) years – Ruby Jubilee
  • Forty Five (45) years – Sapphire
  • Fifty (50) years – Golden Jubilee
  • Fifty Five (55) years – Emerald Jubilee
  • Sixty (60) years – Diamond Jubilee
  • Great Jubilee in the year 2000
  • Silver Jubilee, a celebration of a 25th anniversary
  • Golden Jubilee, a celebration of a 50th anniversary
  • Diamond Jubilee, a celebration of a 60th or 75th anniversary
  • Platinum Jubilee, a celebration of a 70th or 75th anniversary
  • Titanium Jubilee, a celebration of a 75th or 100th anniversary

Tuesday, July 17, 2018

నవగోప్యాలు

 --

ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం- అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.

భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు. మరుక్షణంలో మనిషి ఛస్తాడని తెలిస్తే ముందు క్షణమే ఆలోచనతో చావడం ఖాయం. నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్తక్రారుడు.
ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీనపరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది.
ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దానే్న ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని. సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.
‘‘మననం చేసేది మంత్రం’’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.
ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరచి ఎవ్వరంటేవారు తయారుచేయకూడదు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.
సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.
దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.
మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది. అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగుతుంది. దాంతో పగ.. అలా అంతే ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ.

సృష్టిలో విశిష్టమైనది స్త్రీ

మగాడితోసహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టికోసం. మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...
"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?".

ఆప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి...ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ సృష్టి. వివక్ష తగదు. మొండికేసే
పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.

"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది.
"ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది.

ఆప్పుడు దేవుడు "ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.

"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.

అప్పుడు దేవుడు "ఎందుకాలోచించదు? అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.

దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.

అప్పుడు దేవుడు "అదా...కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు.

దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది.

అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..."
చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని.

**ఇంటికి దీపం ఇల్లాలు**


ఆమెను ఒకరు అడిగారు మీరు వర్కింగ్ ఉమేనా, లేదా హౌస్ వైఫా?
అని.....
హా ...... నేను కేవలం హౌస్ వైఫే కాని 24గంటలు వర్క్ చేసే హౌస్ వైఫే
నేను ఒక అమ్మ
నేను ఒక భార్య
నేను ఒక కుమార్తె
నేను ఒక కోడలు
నేను ఒక అలరాం గడియారం
నేను ఒక  వంటామె
నేను ఒక  అంట్లుతోమె పనిమనిషి ని
నేను ఒక టీచర్
నేను ఒక అకౌంటెంట్
నేను ఒక గుమాస్తా
నేను ఒక వడ్దించే వేటర్
నేను ఒక ఆయా
నేను ఒక నర్సు
నేను ఒక గార్డనర్
నేను ఒక గూర్ఖ
నేను ఒక కౌన్సిలర్
నేను నా భర్తకి శయనభాగస్వామి

అయినా చూడండి నాకు సి. యల్.  లేదు, ఈ. యల్ లేదు సండెలేదు, పండుగ , అంతేకాదు నాకు జీతంలేదు.
కాని ఎందుకో అందరూ అడుగుతారు ఇంట్లో కూర్చొని ఎం చేస్తావని?
ఫలానా ఆవిడ ఇలా పనిచేస్తుంది, ఫలానా ఆవిడా అక్కడ ఉద్యోగం చేస్తుంది,  ఫలానా ఆవిడ వ్యాపారం చేస్తుంది అని.
మీరు కాళీగా ఉండే బదులు అలా పని చేయొచ్చు కదా అని.
 దయచేసి ఒకరిని  మరొకరితో పోల్చకండి.
అందరి ఆడవారి పరిస్థితులు  ఒకేలా ఉండవు.
వాషింగ్ మెషిన్,మిక్సీలు వచ్చాక కూడా ఇంకేమి పని ఉంటుంది అంటారేమో ....!
మీ ఇంటి ఇల్లాలిని ఒక్క నెల రోజులు పుట్టింటింకి పంపించి అదే వస్తువులతో  మీ ఇల్లాలి   పని ఒక్కసారి మీరు చేసి చూడండి.
మీ వంటగది చెప్తుంది మీ అమ్మ(గృహిణి)  చేతి పని
మీ పూజ గది చెప్తుంది మీ ఇల్లాలి చేతి పవిత్రత
మీ బాత్రూం, మీ వాకిలి  చెప్తుంది హౌస్ వైఫ్ వ్యాల్యూ ఏమిటో
మేము చేసే పనికి  జీతాలు,సన్మానాలు,సత్కారాలు మేం కోరుకోవటం లేదు.
మా పనిని గుర్తించక పోయినా పర్లేదు,కాని తక్కువ చేసి మాత్రం చూడొద్దు.
గుర్తుంచుకోండి:
 ఒక గృహిణి ఇంటి పని నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఏ పనైనా చేయగలదు కానీ ఒక గృహిణి పని ఎవరు చేయలేరు
ఈ మెసేజ్ అందరు జీతం లేకుండా పనిచేసే గృహిణి పాదపద్మానికి అర్పించడమైనది.


ఇట్లు
కుటుంబ సభ్యులు _/\_

Monday, July 16, 2018

పూదండ : పూదండ లో జత చేయండి

పూదండ : పూదండ లో జత చేయండి: మీ తెలుగు బ్లాగుని పూదండ లో జత చేయండి.ఇది చాలా సులభం.మీ బ్లాగు యొక్క URL ని మాకు ఈ మెయిల్ ద్వారా పంపితే చాలు .మా E-mail id: poodanda85@gmai...

చిత్రకవితా ప్రపంచం: బలు వితంతుకు మైథున ప్రాప్తిరస్తు! (పేరడీ పద్యం)

చిత్రకవితా ప్రపంచం: బలు వితంతుకు మైథున ప్రాప్తిరస్తు! (పేరడీ పద్యం): బలు వితంతుకు మైథున ప్రాప్తిరస్తు! (పేరడీ పద్యం) సాహితీమిత్రులారా! శ్రీనాథకవిసార్వభౌముడు ఒకసారి ఒక సుందరాంగిని చూచి చెప్పిన పద్యం...

చిత్రకవితా ప్రపంచం: ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్...

చిత్రకవితా ప్రపంచం: ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్...: ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ సాహితీమిత్రులారా! " ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ &qu...

చిత్రకవితా ప్రపంచం: కవయామి - వయామి - యామి

చిత్రకవితా ప్రపంచం: కవయామి - వయామి - యామి: కవయామి - వయామి - యామి సాహితీమిత్రులారా! భోజరాజు గొప్ప కవితాప్రియుడు. తన రాజ్యంలో ప్రతిఒక్కరు కవిత్వం అల్లగలిగి ఉండాలి. కవితాశక్...

సాహితీ నందనం: కొత్త పాతలలో ఏది మంచిది?

సాహితీ నందనం: కొత్త పాతలలో ఏది మంచిది?: కొత్త పాతలలో ఏది మంచిది? సాహితీమిత్రులారా! మనవాళ్ళు అంటూవుంటారు "గతకాలము మేలు వచ్చు కాలముకంటేన్" - అని, మరికొందరేమో...

సాహితీ నందనం: ఉపమాలంకార విశేషాలు - 4

సాహితీ నందనం: ఉపమాలంకార విశేషాలు - 4: ఉపమాలంకార విశేషాలు - 4 సాహితీమిత్రులారా~ దండి వివరించిన ఉపమాలంకార రూపాలను చూశాము. ఇక్కడ అప్పయ్యదీక్షితులవారి ఉపమ ఆహార్యభేదాలను ...

Sunday, July 15, 2018

Harish Aluru: మంచి మాటలు

Harish Aluru: మంచి మాటలు: పూర్వము పెద్దిభొట్టు అనే గొప్ప కవి వుండేవాడు.ఇతను మంచి సంస్కృత సాహిత్యము,శాస్త్ర పాండిత్యము గలవాడు.పెద్దిభొట్టు నిరాడంబరుడు మంచి వాడు.ని...

హరి కాలం: బ్రాహ్మణుడికి ప్రాధాన్యత లేని హిందూమతం నిలబడుతుందా...

హరి కాలం: బ్రాహ్మణుడికి ప్రాధాన్యత లేని హిందూమతం నిలబడుతుందా...:      పశువధ నియంత్రణకి సంబంధించిన వివాదాలలో ఒక కేసుకు తీర్పునిస్తూ న్యాయమూర్తి ఆవు కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతుందని చెప్ప...

Thursday, July 12, 2018

బ్రాహ్మణ స్టూడెంట్స్ హాస్టళ్ల్ ట్రస్టు న్యూ నల్లకుంట

[13:42, 7/12/2018] K L Kji 2: బ్రాహ్మణ స్టూడెంట్స్ హాస్టళ్ల్ ట్రస్టు న్యూ నల్లకుంట Hyd
Admissions for boarding facilities (boys only) are open to B.Tech,  M.Tech, MBA, L.L.B., CA or any graduation, UPSC CIVILS  (IAS) coaching OR ANY other coaching students at Brahmin Students Hostel, New Nallakunta, Hyderabad
Please contact @ 9849696467 for further details🙏
[13:47, 7/12/2018] K L Kji 2: బ్రాహ్మణ మిత్రులకు: *The new admissions for the year 2018-2019 and renewal for the
existing borders, interviews will be held on 14-07-2018 and
15-07-2018 (saturday and Sunday) by 10:00 am to
01:00 pm at hostel premises*.

You are requested to be present with application form including your
College certificates (bonafide),adhar card.

Newly opting for admission borders are expected to
Be with necessary documents with parents/guardians

Please contact phone no —9849696467

Wednesday, July 11, 2018

స్వామీజీలు,పీఠాధిపతులు,అర్చకులు, బ్రాహ్మణులు మన ధర్మానికి దేశానికి ఏంచేస్తున్నారు?

స్వామీజీలు,పీఠాధిపతులు,అర్చకులు, బ్రాహ్మణులు మన ధర్మానికి దేశానికి ఏంచేస్తున్నారు?

ఈమధ్య హిందూ అని చెప్పుకునే అనేకమంది ప్రశ్న ఇది.ఈప్రశ్న వేసేవారందరూ నిజానికి ఆయా పీఠ సంప్రదాయాల గురించి కానీ త్రిమతాచార్యుల గురించి గానీ అసంఖ్యాక అర్చక సంప్రదాయాలగురించి ఓనమాలు తెలియని వారే.

పేరుకు సర్వసంగ పరిత్యాగులైనా ప్రతీ పీఠానికి ఒక నిర్దిష్ట సంప్రదాయం, మూర్తి అర్చన ,గోపూజ,వేద,సంస్కృత పాఠశాలల నిర్వహణ,సువాసినీపూజ,శ్రీచక్రార్చన,లింగ లేక సాలిగ్రామార్చన లాంటి దైనందిన ఆచార పరంపర తప్పనిసరిగా ఉంటుంది.

వీరు ఎక్కడికో ఏకార్యక్రమం సందర్భంగానో ఏసీ కార్లలో వచ్చింది చూసి విమర్శించేవారు వారి నిత్యజీవన విధానాన్ని గానీ వారి మఠాలతరఫున నిర్వహించే గోశాలలు గానీ, వేద సంస్కృత పాఠశాలలు గానీ,విద్యాసంస్థల నిర్వహణ గానీ, వైద్యసేవలు కానీ,చాతుర్మాస్య సందర్భంగా వారి నియమనిష్టలు కానీ చూడకుండానే వారు ఏసీ రూముల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని భ్రమపడి అనవసరంగా నిందలు వేసి నోరుపారేసుకుంటున్నారు.వారు ఏసీ కార్లలో రావడం చూసిన వారుండొచ్చు కానీ నిత్యం ఏసీరూముల్లో గడపడం చూసినవారెంతమంది?

ఈ విమర్శలు చేసేవారందరూ పీఠాధిపతుల జీవనశైలిని కనీసం ఒక నెలరోజుల పాటు వారితో ఉండి గమనిస్తే ఇలాంటి విమర్శలు చేయరు.ఇలాంటి విమర్శలు చేసేవారు ఎంత కలిగిన వారైనా సరే..తమ ఇంటికి  స్వయంగా తమ  రక్తసంబధీకులైన బంధువులొస్తేనే ఒక వారం పదిరోజుల పాటు వారిని పోషించడానికి నానా తిప్పలు పడతారు.ఒక్క గోమాతను జీవితాంతం పోషించమంటే గుడ్లు తేలేస్తారు.ఇక ఇలాంటి వారు ఒక చిన్న దేవాలయాన్ని స్వయంగా నిర్మించాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే.

అలాంటిది అనేక దేవాలయాలు,వేదపాఠశాలు,విద్యా వైద్యసంస్థలు,గోశాలలద్వారా వందలవేల మందికి విద్యాదానం ద్వారా తమకు ఏసంబంధంలేని అనేకమంది విద్యార్థులను మరియు వందలాది గోవులను పోషించే వారిని అకారణంగా దూషించడం అపచారమే ఔతుంది.

ధర్మరక్షణ ,పీఠాధిపత్యం,అర్చకత్వం, వేదాధ్యయనం అంటే తొలుత సెక్యులర్ గా ఉండి రెండు మూడు సంవత్సరాలకింద ఫేస్ బుక్ లోకొచ్చి,ఫ్రీగా వచ్చిన జియో సిమ్ వేసుకుని ఖాళీ ఉన్నప్పుడు నాలుగు పోస్ట్ లు పెట్టి, ఏదైనా ధార్మిక కార్యక్రమానికి హాజరై నాలుగు సెల్ఫీలు దిగి పోస్ట్ చేసి రాత్రికి ఒక బీరు,ఒక నైన్టీ కొట్టి తొంగోవడం కాదు.

ఉపనయనం ఐన దగ్గర నుంచి వేదాధ్యయనం, తరువాత తల్లిదండ్రుల అనుమతితో సన్యాసం, గురుశుశ్రూష,అనేక వైదిక మరియు లౌకిక విద్యా విషయ సంగ్రహం  దశాబ్దాలపాటు చేసినవారే పీఠాధిపత్యానికి అర్హులు.

అర్థరాత్రి దాకా ఫోన్ పట్టుకుని పడుకుని,మధ్యాహ్నం దాకా నిద్ర లేవని వాళ్లు బ్రాహ్మీముహూర్తంలో లేచి నిత్యపూజాదికాలు చేసుకునే అర్చకులను నిిందింస్తుంటే దేనితో నవ్వాలో అర్థం కావడం లేదు.

మిషనరీలకు దీటుగా కంచిపీఠం తరఫున వైద్యసేవలుండాలని భావించిన జయేంద్ర సరస్వతి స్వామి వారు శంకరనేత్రాలయ స్థాపించడంవల్ల ఎదురుగా ఉన్న విదేశీ మతమాఫియాల కుట్రలకు,జయలలిత తప్పుడు కేసులకు జైలుపాలైతే ఈకట్టర్ హిందువులంతా ఎక్కుడదాక్కున్నారో అర్థం కాదు.

ఈ పీఠాధిపతులు చేసే ఏదైనా కార్యక్రమానికి గానీ ఉద్యమానికి గానీ మీడియా సహకరించదు. ప్రభుత్వ సహాయం ఉండదు.పూర్ణకుంభ స్వాగతం తప్ప  దేవాలయాల నిర్వహణలో ఏమాత్రం నిర్ణయాధికారం ఉండదు.ఈ రాజకీయ గోలెందుకని కనీసం తమ మానాన తమ పనేదో తాము చేసుకుంటున్న పాపానికి సాటి హిందువులుగా సహకరించపోయినా ఫర్వాలేదు. రాళ్ళు మాత్రం వేయకండి.

ఆదిశంకరులు కాలినడకన దేశంతిరిగారనీ ఈనాటి స్వాములకు ఏసీకార్లెందుకని మరో వెధవ లాజిక్.అదే ఆదిశంకరులు కౌపీనవంతః ఖలుభాగ్యవంతః,అర్థమనర్థం భావయనిత్యం అనికూడా అన్నారు. ఆదిశంకరులమీద అంత గౌరవం ఉన్నవారైతే  మీరంతా కేవలం గోచీలుపెట్టుకుని తిరగొచ్చుకదా?ఆదిశంకరుల కాలానికి కత్తులు,బాణాలు మాత్రమే ఉన్నాయి. ఈకాలంలో అవేపట్టుకుని యుద్ధానికి వెళతామనడం ఎలాంటిదో వీరివాదనలు అలాంటివే.మన తాతముత్తాతలకున్న బలం,ఓపిక మనకున్నాయా?మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసిన ఇంటిపని,వంటపని ఈరోజు మన ఇంటి ఆడవాళ్లు చేస్తున్నారా?

అలాగే "చాతుర్వర్ణం మయాసృష్టం" అనే గీతా శ్లోకాన్ని పట్టుకుని వక్రభాష్యాలు చెప్పడం వీళ్ళు చేసే మరో పని.పుట్టుకతో కులం రాదనీ గుణం వల్లవస్తుందనీ ఈమేధావుల లాజిక్.ఈవాదన చేసే వారందరికీ తమతమ కులాలు, కులవృత్తులు, వాటితో వచ్చే ప్రభుత్వ ప్రయోజనాలు  పుట్టుకతో కావాలి.కానీ ఒక్క బ్రాహ్మణుడికి మాత్రమే కులం పుట్టుకతో ఉండకూడదు.కులవృత్తి ఐన అర్చకత్వం పౌరోహిత్యం వారికి మాత్రమే ఎందుకు అని దబాయింపు.ఒక మంగలికి క్షవరం-మేళం,రజకుడికి బట్టలుతకడం,ఒక గముళ్ళకు కల్లుగీయడం,వడ్రంగికి చెక్కడం కులవృత్తిగా ఉండడం వీరికి అసహజం అనిపించదు.కానీ ప్రభుత్వ మద్దతు లేక ఉద్యోగాలకు రిజర్వేషన్లు లేక కేవలం కులవృత్తితో పొట్టపోసుకుంటున్న అర్చకులకు మాత్రమే పుట్టుకతో కులం ఉండకూడదు.వారేవా!

గీతాచార్యుడి వాక్యంపై మీకు అంత విశ్వాసమే ఉంటే అదే గీతాచార్యడు గోవర్ధనగిరి ఎత్తిన సందర్భంగా ఏంచేశారో, ఏంచెప్పారో తెలుసుకోవాలి.ఇంద్రుడికి హవిర్భాగం ఇవ్వకపోయినా, యజ్ఞం చేయకపోయినా నష్టం లేదని చెప్పి కేవలం గోకులంలో  గోబ్రాహ్మణపూజ మాత్రమే చేసిన శ్రీకృష్ణుడిపై ఆగ్రహించి ఇంద్రుడు రాళ్ళవర్షం కురిపిస్తే కేవలం గోబ్రాహ్మణారాధనశక్తివల్ల ఇంద్రుడిని సైతం జయించి గోవర్ధన గిరి ఎత్తానని పరమాత్మ చెప్పలేదా?ఏంచేసినా చేయకపోయినా గోబ్రాహ్మణపూజ వల్ల సమస్తయజ్ఞఫలాలు దక్కుతాయని చెప్పలేదా?

ఒక నిరుపేద బ్రాహ్మణుడిని శ్రీకృష్ణపరమాత్మ ఎలా ఆదరించి గౌరవించారో  కుచేలోపాఖ్యానంలో చదవలేదా?అంతటి దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న సందంర్భంలోనూ కుచేలుడు నోరుతెరిచి నాకిదికావాలి కృష్ణా అని అడిగాడా?(వీరు ఏనాడైనా పురాణేతిహాసాలు పూర్తిగా చదివితేకదా? )ఎందుకంటే బ్రాహ్మణులు అల్పసంతోషులు.సరిగ్గా నాటి కుచేలుడి పరిస్థితే  నేడు అనేకమంది బ్రాహ్మణులదికూడా.

శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ పరమశివుడు కానీ అమ్మవారుకానీ గణపతి కానీ సుబ్రహ్మణ్యుడుకానీ ఏఅవతారంలోనైనా బ్రాహ్మణులను రక్షించారు,పూజించారు కానీ మీలా ఎకసెక్కాలాడి అవమానించి దూషించారా?విష్ణు సహస్రనామ స్తోత్రములో వాక్యాలప్రకారం బ్రహ్మణో బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః-అంటే శ్రీమహావిష్ణువు బ్రాహ్మణప్రియుడు మాత్రమే కాదు ఆయనే స్వయంగా బ్రాహ్మణుడు కూడా.

అలాగే బ్రాహ్మణులైన మన పురాణరచయితలు సైతం ధర్మాన్ని కొలమానంగా తీసుకున్నారేతప్ప కులాన్ని కాదు.బ్రాహ్మణుడైన రావణుడిని వధించిన శ్రీరాముడిని బ్రాహ్మణ వంశజులైన మహర్షులంతా పరమాత్మగా స్తుతించారుతప్ప మాకులంవాడిని చంపావని నిందించలేదు.ఆయన ఆలింగనం కోసం మరుజన్మలో తమ కులాన్ని కూడా విడిచిపెట్టి గోపకన్యలుగా జన్మించారు.

ఇక ప్రస్తుత కాలానికి వస్తే ఈదేశంలో రైతులతరువాత కనీసవేతనం,పనిగంటలు లేనిది అర్చకులు, పురోహితులే.ఐనప్పటికీ రైతులాగే ఎవరినీ నిందించకపోవడమే కాకుండా లోకాత్సమస్తాత్ సుఖినోభవంతు అనగలిన వైదిక సంస్కారం అర్చకబ్రాహ్మణులది.అలాంటి సాధుజీవులపై కంచెఐలయ్యలాంటి హిందూ ద్వేషవర్గం,విదేశీ మతమాఫియాలు ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయో సరిగ్గా అలాంటి ప్రచారమే హిందూ అనిచెప్పుకునే వారూ చేస్తే వారికీ వీరికి తేడా ఏంటి?

రెండు దశాబ్దాల క్రితం సంస్క్రతం రెండవభాషగా తీసుకుని చదువుకునే విద్యార్థులు ఉండేవారు. కమ్యూనిస్టుల సిలబస్ కారణంగా సాధారణ విద్యార్థులు దేవభాషకు దూరమయ్యారు. ఇప్పుడు మిగిలింది పండితబ్రాహ్మణులు,కొద్దిమంది భాషాభిమానులే.వారి తరం అంతరిస్తే మిషనరీలు,బహుళజాతి కంపెనీలు ఆడింది ఆట పాడింది పాట.

పసుపు దగ్గరనుండి వేపపుల్లదాగా గోమూత్రం దగ్గరనుంచి ఆయుర్వేదం దాకా దేన్నైనా పేటెంట్ చేసుకోవచ్చు.వైదిక సిద్ధాంతాలు,వేద గణితాలు తమవిగా ప్రచారం చేసుకోవచ్చు.అప్పటికి గ్రంథాలుంటాయి కానీ అర్థం చేసుకుని చెప్పగలిగే వారు మాత్రం అంతరిస్తారు.వారి ఏజెంట్లు,పెయిడ్ మీడియా చెప్పిందే అర్థంగా చలామణీ ఔతుంది. బ్రాహ్మణులు, అర్చకులు,పీఠాధిపతులు త్వరగా అంతరించడమో,లేక హిందూ సమాజంపై పూర్తిగా పట్టుకోల్పోవడమో విదేశీమాఫియాలకు  అత్యవసరం.

ఒక్క ఉదాహరణ చూపాలంటే సుభాష్ పాలేకర్ గారు గోఆధార వ్యవసాయం గురించి తిరుపతి యూనివర్సిటీలో వివరిస్తుంటే సైన్స్ ను అవమానించారని ఆయూనివర్సిటీ ప్రొఫెసర్లు ధర్నాకు దిగారంటే రాబోయే కాలంలో ఏంజరగబోతుందో అర్థం చేసుకోవచ్చు.
వందేళ్ళ క్రితం మనదేశంనుండి ఉచితంగా ఒంగోలు ఎద్దులను తీసుకెళ్ళిన బ్రెజిల్, ఇంగ్లండ్ లు ఈరోజు మనం  అదేజాతి  ఎద్దు ఒక్కటివ్వమనడిగితే చెప్పిన ధర అక్షరాలా ఒక మిలియన్ డాలర్లు( సుమారు ఆరుకోట్లు ).

హైదరాబాద్ రుద్రారం వద్ద అల్ కబీర్ కంపెనీ పెట్టినప్పుడు ఎన్నో బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు వ్యతిరేకించినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించుకోలేదు.రెండు దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మేలుజాతి గోసంపదమొత్తం వధించబడి విదేశాలకు ఎగుమతి అయిపోయింది.ఫలితంగా రైతులకు రెండవ ఆదాయంగా ఉండే పాడి పశువుల ద్వారా వచ్చే ఆదాయం పోయి ఆత్మహత్యలు పెరిగాయి.

పైరెండూ చిన్న ఉదాహరణకు చెప్పాను.భారతదేశపు సంప్రదాయ మత,వైద్య, రసాయన, వైజ్ఞానిక ,వైదిక గ్రంథాలను అర్థం అయ్యేలా చెప్పగలిగే వారు అంతరిస్తే ప్రతీరంగంలోనూ రంజిత్ ఓఫిర్లు ప్రవేశించి వక్రభాష్యాలు చెపుతారు.కాబట్టి హిందూ అని చెప్పుకునేవారు ఆగట్టునుంటారో ఈగట్టుకొస్తారో తేల్చుకోవాలి.

మీరు హిందూ ధర్మంలోని దొంగస్వాములపై పోరాడాలనుకుంటే నిత్యానంద, రమణానంద,ప్రభోదానంద లాంటి స్వయంప్రకటిత దైవజనులు బోలెడుమందిఉన్నారు.మీకు చేవవుంటే మీకు చేతనైతే వారిపై పోరాడండి.

అంతేకానీ ఈధర్మంలో ఉంటూ ఈధర్మంలో భాగమైన వారిని అవమానించడమంటే తినేకంచంలో ఊయడం,ఒకసారి ఊశాక తిరిగి ఆఊసిన కంచంలోనే మళ్ళీ మళ్ళీతినడంలాంటిది.ఇది తినేవారికేకాదు చూసేవారికికూడా అసహ్యకరం.

గమనిక-ఈ పోస్ట్ కేవలం వేదాధ్యయనం,అర్చకత్వం ,పౌరోహిత్యం,పీఠాధిపత్యం లాంటి సంప్రదాయ బ్రాహ్మణ ధర్మంలో నిమగ్నమై ఉన్న బ్రాహ్మణుల గురించి మాత్రమే. లౌకిక ఉద్యోగ,వ్యాపారాల్లోఉన్న  బ్రాహ్మణులకు మద్దతుగా కాదు.

గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం
లోకాత్సమస్తాత్ సుఖినో భవన్తు

Tuesday, July 10, 2018

ఓజస్ - OJAS: షష్టి పూర్తి

ఓజస్ - OJAS: షష్టి పూర్తి:            తెలుగు సంవత్సరములు (60).  ప్రభవ  ..... నుంచి ......     క్షయ వరకు .  మనిషి పుట్టి (60) సంవత్సరాలు పూర్తి అయినప్పుడు తాను పుట...

బ్రహ్మ ముహూర్తం విశిష్టత

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.
ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.
బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

అన్నమాచార్యుని అలరులుకురియగ నాడినదే...కీర్తన భావార్ధం

ప||      అలరులు కురియగ నాడెనదే
            అలకల కులుకుల నలమేల్ మంగ  || అలరులు ||
చ||       అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
           అరతెర మరగున నాడెనదే 
          వరుసగ పూర్వదువాళపు తిరుపుల
         హరి కరగింపుచు నలమేల్ మంగ
  || అలరులు ||
చ||       మట్టపు మలపుల మట్టెల కెలపుల
           తట్టెడి నడపుల దాటెనదే
           పెట్టిన వజ్రపు పెండెపుతళుకులు
           అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ
  || అలరులు ||
చ||       చిందుల పాటల శిరిపొలయాటల
           అందెల మోతల నాడెనదే
           కందువ తిరు వేంకటపతి మెచ్చగ
           అందపు తిరుపుల నలమేల్ మంగ
  || అలరులు ||

అలమేల్మంగ దివ్య నృత్యపు పాట యిది! అమ్మవారు నాట్యం చేస్తుంటే ఆమె కొప్పులోని విరులు జలజలా రాలినవట! ఆమె ముంగురులు సుతారంగా అల్లలాడినవట! పూర్వ దువాళపు తిరుపులు ప్రదర్శిస్తూ, అరతెరమరుగున కూచిపూడి రి సత్యభామ వలె అలమేల్మంగ హరికి ఆనందాన్ని గొల్పుతూ నాట్యం చేసినది. కాళ్లకు అలంకరించిన వజ్ర పెండెములు తళుకుళు జిమ్ముచుండగా ప్రణయ కలహముతో కూడిన చిందులు నృత్యాన్ని తిరువేంకటపతి మెచ్చగా అలమేల్మంగ అభినయించినది.
అలకల కులుకుల = ముంగురులందలి కులుకులు;
అరవిరి సొబగు = విరిసీ విరియని పుష్ప సౌందర్యము;  
అరతెర = సగంతెర, నాట్య సంప్రదాయము;     
పూర్వ దువాళపు తిరుపులు = మొట్టమొదలు నటి, రంగస్థలమునకు వచ్చునపుడు రెండుకాళ్లతో కుప్పళించి ఎగిరి నేలతాకు లోపలనే ఒక చుట్టు తిరిగి దూకుట యని కీ.శే. ప్రహాకరశాస్త్రిగారి ఊహ! ఇదియొక నాట్య విశేషము;
మట్టపు మలపులు = లయాత్మకమైన అంగవిక్షేపములు;
తట్టెడి నడపులు= సశబ్దముగా అడుగులు పెట్టుట;
పెండెపు తళుకులు =బిరుదుగా పాదమున ధరించు అందెల మెరుగులు;
చిందుల పాటలు = లయ ప్రధానమైన పాటలు;
శిరి పొలయాటలు = లక్ష్మీదేవి ప్రణయ కలహకలాపము;
ఒనర = పొందికగా; చేరులు = గొలుసులు;
కమల = లక్ష్మీదేవి;
భూసతి = భూదేవి;
పట్టవెరపై = గ్రహించుటకు సాధ్యము కానట్లు;
అమరాంగనలు = దేవతాస్త్రీలు

కోపం తగ్గించుకోవడం వివేకవంతుల లక్షణం.

కోపంవలన కలిగే నష్టాలు, కోపాన్నితగ్గించుకునే పద్ధతులను ప్రముఖ మెజీషియన్, సైకాలజిస్ట్, మార్గనిర్దేశకులు అయిన శ్రీ.బి.వి. పట్టాభిరామ్ గారి  సలహాలను పాటిద్దాం, ఆరోగ్యమే మహాభాగ్యం అని చాటుదాం. 

 
"మా ఇంట్లో నా మాటకెవరైనా ఎదురుచెప్తే భరించలేకపోతున్నాను సార్! చేతిలో ఏదుంటే అది వారి మీదకు విసిరేస్తున్నాను. ఈ కోపం తగ్గించుకోడానికి మీ దగ్గర చిట్కాలేమైనా ఉన్నాయా?" అంటూ ఉస్సూరని కూర్చున్నాడు ఓ చిరుద్యోగి.
"తప్పకుండా ఉన్నాయి.అయితే మీకు ఏయే సందర్భాల్లో కోపం వస్తూందో ఎప్పుడైనా గమనించారా?" అని అడిగాను.
"దానికి సమయం, సందర్భం అక్కర్లేదు. ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి మా ఆవిడ వెంటనే మంచినీళ్ళివ్వకపోతే కోపం. ఒక వేళ మంచినీళ్ళిచ్చినా, వెంటనే ఎందుకు టీ తీసుకురాలేదని కోపం. ఒకవేళ రెండూ ఇచ్చినా టిఫిన్ ఏదైనా తెచ్చి తగలెయ్యొచ్చు కదా అని అరుస్తాను ఒకవేళ ఇవన్నీ తెచ్చినా ’పిల్లలెక్కడికి తగలడ్డారు?’ అని తిడతాను. ఒకవేళ వాళ్లంతా ఇంట్లోనే ఉంటే, ’పుస్తకాలు ముందేసుకోకుండా ఏం చేస్తున్నారు భడవల్లారా?’ అని కరుస్తాను. ఒకవేళ వాళ్ళు చదువుతున్నా, వాళ్ళకు అంతకు ముందు వచ్చిన ఛండాలం మార్కుల గురించి తిట్టి, ఇలా అయితే మీరు అడుక్కుతింటారని నానా మాటలూ అంటాను. ఎందుకిలా కోపం వస్తోందో తెలియడం లేదు. ఒక్కోసారి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. భగవంతుడు ఈ కోపాన్ని నా ఒక్కడికే ఇచ్చాడేమోననిపిస్తుంది." అన్నాడు దిగాలుగా.
"కోపం మీకే కాదు, ప్రతి జీవికీ వస్తుంది. పిల్లికీ, కుక్కకీ కూడా కోపం పాలెక్కువే.కోపం మీ ఒక్కరి ఆస్తీ కాదు.అయితే దాన్ని అదుపులో ఉంచుకోవడం వివేకవంతుల లక్షణం. తప్పనిసరైతే, కోపాన్ని నటించాలి తప్ప, నిజంగా కోపం తెచ్చుకోకూడదు. దానివల్ల సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి. విలువ ఇచ్చేవారు కూడా ఇవ్వరు. మీ పట్ల భక్తి పోయి, భయం ఏర్పడుతుంది. చివరికి మిమ్మల్ని విడివిపెడతారు"అన్నాను.
"నిజమే. మా అబ్బాయికి ఎంసెట్ లో మంచి ర్యాంకు రాలేదని గొడ్డును బాదినట్లు బాదాను.వాడు ఆ రోజే ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతవరకూ రాలేదు. నిజానికి మా వాడు మంచి స్టూడెంటే. ఆ సంవత్సరం ఎంసెట్ పరీక్షలో ఒక అధికారి తన కూతురి కోసం, పేపర్ లీక్ చెయ్యడం వల్ల చాలా మంది బ్రిలియంట్ స్టూడెంట్స్ దెబ్బతిన్నారని తరువాత తెలిసింది. మా వాడి జాడ ఇంతవరకూ తెలియలేదు. అసలు ఉన్నాడో లేడోనని భయంగా ఉంది" అన్నాడు కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ.
" మీ కోపానికి ఫలితం చూశారు కదా! మీరింకా కోపాన్ని పెంచుకుంటూ పోతే, మిగతా వారితో మీ సంబంధాలెలా ఉన్నా, మీ ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం!" అన్నాను.
"నా ఆరోగ్యానికా? నేను బాగానే ఉన్నాను కదా! ఏదో ఆ కోపం వచ్చినప్పుడు అలా ఉంటాను తప్ప తరువాత మామూలవుతున్నాను" అన్నాడు అమాయకంగా.
"అని మీరనుకుంటున్నారు. మీకు కోపం వచ్చినప్పుడు మీ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా?" అని ప్రశ్నించాను.
"మార్పులా?" అని అడిగాడు.
"అవును. పది మార్పులు జరుగుతాయి. అవి మీ వయస్సును రోజురోజుకూ తగ్గిస్తాయి." అంటూ ఆ పది మార్పులూ ఇలా చెప్పాను.
1.కోపం వచ్చినప్పుడు ఎడ్రినల్ గ్రంధులు విడుదల చేసే హార్మోన్స్ అధికమై, శరీరానికి అత్యధిక శక్తి వచ్చి ఏ అఘాయిత్యమైనా చేయించగలవు.
2.ఎడ్రినల్ గ్రంధులు విడుదల చేసే హార్మోన్ల వల్ల బాడీ కెమిస్ట్రీలో మార్పులు వస్తాయి. రసాయనాలు విషతుల్యం కాగలవు.
3.ఉచ్ఛ్వాసనిశ్వాసాలు అత్యధికమై కోపాన్ని మరీ పెంచుతాయి.
4.గుండె కొట్టుకునే వేగం తీవ్రమవుతుంది.
5.రక్త ప్రసరణ అత్యంత వేగాన్నందుకుంటుంది. దానివల్ల రక్తపుపోటు రావచ్చు,ఉంటే పెరగొచ్చు.
6.కోపం వల్ల నోరెండిపోతుంది. ఫలితంగా జీర్ణక్రియ తాత్కాలికంగా ఆగిపోతుంది.
7.చేతులు,పెదవులు వణుకుతాయి.చెమట పడుతుంది.
8.శరీరంలో కండరాలు బిగుసుకుంటాయి.
9.రక్తప్రసరణ అస్తవ్యస్తమై, శరీరంలో కొన్ని క్రియలు దెబ్బతింటాయి.
10.చివరిదైనా ముఖ్యమైనది మీ కోపం మిమ్మల్ని గుండె, లివరు వీటికి సంబంధించిన జబ్బులకు గురి చేస్తుంది.
 
"కాబట్టి మీ కోపం, మీ కుటుంబ పరిస్థుతులనే కాక, మీ శారీరకస్థితిని కూడా అతలాకుతలం చేయగలదు. మైగ్రెయిన్, అల్సర్స్, గ్యాస్, షుగర్ వ్యాధి, రుమాటిజం(కీళ్ళ నొప్పులు) వంటి జబ్బులు కోపిష్టి వారి ఆప్తమిత్రులని మరిచిపోకండి!" అన్నాను.
"మీరు ఇవన్నీ చెప్పి భయపెట్టకండి. నా కోపం తగ్గించే మార్గం చెప్పండి. మీరంతా అదృష్టవంతులు.మీకు కోపం రాదు" అన్నాడు బాధగా.
"ఎవరన్నారు? అందరికీ కోపం వస్తుంది. సహజంగా కోపం రాని వారిక్కూడా కోపం వచ్చే సంఘటనలు ఎన్నో రోజూ జరుగుతున్నాయి. ఉదాహరణకు ట్రాఫిక్ జామ్ లు, టెలిఫోన్ల్ రాంగ్ కాల్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వకపోతే పని జరగపోవడం, అప్పు దొరక్కపోవడం, పిల్లల చదువులు, లోకంలో కులాల పిచ్చి పెరిగి, చేతికందిన అదృష్టం జారిపోవడం ఇలా ఎన్నో! చివరికి ఒక రోజు పేపరు వాడు పేపరు వెయ్యకపోయినా, టీవీలో చెత్త ప్రోగ్రాములు వచ్చినా, పాలవాడు ఆలస్యంగా వచ్చినా కోపం వచ్చి తీరుతుంది. అలాగని ప్రతి దానికీ చెలరేగిపోయి, చేతిలో వున్నది విసిరికొడితే, ఒకరోజు సమాజం మిమ్మల్ని ఏకాకి చెయ్యడం తప్పదు! అందరూ మిమ్మల్ని విసిరేస్తారు!" అన్నాను.
"అయితే నన్నేం చెయ్యమంటారు?" జాలి కలిగేలా అడిగాడు. నా మాటలు అతన్ని దాదాపు భయపెట్టాయి.
"ఏమీ పరవాలేదు. ముందు ఇంటి వారి మీద కోపం తెచ్చుకోవడం మానండి. మీరేమన్నా చచ్చినట్లు పడతారనే ధీమా నుంచి బయటపడండి. వారికీ కోపం ఉంటుందని మరిచిపోకండి! బయటివారి మీద కోపం ఇంట్లో ప్రదర్శించకండి. కుటుంబసభ్యులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మరిచిపోకండి. ఇక ఈ పద్ధతులు పాటించండి.
 
1.కోపం వచ్చినప్పుడు ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుని మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. వీలైతే దైవనామం స్మరించండి.
2.ప్రతి నిత్యం ఏదో ఒక రిలాక్సేషన్ ఎక్సర్స్ సైజు 10 నిమిషాలు చేయండి. లేదా యోగాభ్యాసం చెయ్యండి.
3.కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు తాగడమో, వంద వరకూ అంకెలు లెక్కపెట్టడమో చేయండి.
4.ఇతరులు నిజంగా తప్పుచేసినప్పుడు కోపం వచ్చినట్లు నటించండి తప్ప, నిజంగా కోపం తెచ్చుకోకండి.
5.చివరగా, మీకు చాలా పనులు వాయిదా వేసే అలవాటుంది కాబట్టి, ఇవాల్టి, కోపాన్ని మరునాటికి వాయిదా వేయండి!" అంటూ లేచాను.
సర్వేజనా సుఖినోభవంతు    

Monday, July 9, 2018

అభ్యంగన స్నానం

తలంటు స్నానం తో ఎన్ని లాభాలో
మన భారతీయ జీవన విధానములో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంది . ప్రతీ రోజు స్నానం చెయ్యడం మన పద్దతి .కొంతమంది రొండు పూటలా చేస్తారు .పండగ వోచ్చినపుడు ప్రత్యెక స్నానం చెయ్యడం అందరికి తెలిసిందే .వస్తు గుణ దీపిక లో తలంటు స్నానం గురించి వ్రాయబడింది. సంక్రాంతి నాడు తలంటు స్నానం ఒక ప్రత్యెక కార్యక్రమమని అందరికి తెలుసు .తలంటు స్నానాన్ని అబ్యాన్గన స్నానమని అంటారు . కొబ్బరి నూనె,నువ్వులనూనె,ఆవునెయ్యి ,ఆముదం వీటిలో దేనినైన అబ్యాన్గన స్నానానికి వాడవొచ్చు .నూనె చాలా మంచిది .ముందుగా నూనె శరీరానికి బాగా పట్టించి మర్దనా చెయ్యాలి .కనీసం పదినిమిషాలు ఆగిన తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టాలి ,తర్వాత మరో పది నిమిషాలు ఆగాలి తర్వాత పొడి పిండి తో మొత్తం దేహానికి పట్టిన నలుగును వదిలించుకోవాలి. తర్వాత శరీరమంతా శుబ్ర పడేలా రెండు బకెట్ నీళ్ళతో స్నానం చెయ్యాలి. ఈ విధముగా చేయడం వలన గజ్జి, చిడుము, సర్పి, దద్డురులు మొ .చర్మ రోగములు ,దుస్వప్నములు దరి చేరావు. శరీరం మీద మలినాలను ,దుర్గందాల ను పోగొడుతుంది సుఖ నిద్ర ,శరీరం తేలికగా వుండడం ,దేహానికి పుష్టి,కాంతి , మృదుత్వం కలుగుతుంది. కండ్లకు చాలవ చేస్తుంది, పైత్యాన్ని అనుస్తుంది .వృదాప్యం తొందరగా రాదు,అలసటనూ, వాతమును పోగొడుతుంది.సుఖ నిద్ర పట్టును, కాంతి, ఆయుష్షు పెరుగుదల ,బుద్ధి బలిమి ,దేహపుష్టి ,వీర్య వృద్ది కలుగుతాయి .జటరాగ్ని బాగుంటుంది .దేహము కాళ్ళు చేతులు ,గోళ్ళు, సిరస్సులందు పుట్టిన తాపమును ,మంటలను పోగొట్టును .మాడపట్టున చమురు ను వుంచి మర్దించడం వలన చెవులకు ,తక్కిన అవయములకు బలము నిచ్చును .తలవెంట్రుకలు వృద్ధ్హిపరచును ,మృదుత్వాన్ని ఇచ్చును.
అరిపాదాలకు చమురు మర్దించడం వలన మంటలను పోగొట్టును .అరికాళ్ళ నొప్పులు హరించును .
అబ్యాన్గన స్నానం వలన ఇన్ని రకముల ప్రయోజనములు వున్నాయి  కాబట్టే మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు .
ఆధునిక యుగంలో అభ్యంగన  స్నానానికి ప్రాధాన్యత తగ్గిపోవడము వలన దేహానికి అనారోగ్యం ఎక్కువ అవుతోంది .పూర్వ కాలంలో చర్మ వ్యాధులు చాలా తక్కువుగా ఉండేవి. వారం వారం  అభ్యంగన  స్నానం చాలామంచిది .కనీసం పండగలలోనైనా అభ్యంగన  స్నానం చేస్తే ఎంతో  మంచిది .

కులము కన్నా మంచి గుణము గొప్పది .

పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు
మాట కన్నా నెంచ మనసు దృఢము
కులము కన్నా మిగుల గుణమే ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ

గురి కుదరని పైపై పూజ కంటే నిశ్చలమైన జ్ఞానం ముఖ్యం. మారే మాటల కంటే అచంచలమైన మనస్సు ప్రధానం. సామాజికంగా ఏర్పడిన లక్షణం స్వభావతః ఏర్పడిన లక్షణం ఎన్నదగినది. బాహ్యంగా చేసే పనులు సరే, వాటికి మూలాలు లోపల ఉన్నాయా, లేదా అని చూసుకొమ్మంటున్నాడు వేమన. పాత మాటే కావచ్చు. కాని ఎప్పటికి పాతపడని మాట అని గుర్తించుకోవాలి.

పూజ అంటే తెలియనిదెవరికి? అర్చన, దేవుడిని కొలవడం. బుద్ధి అంటే బోధ చేత ప్రకాశించేది. బోధ అంటే జ్ఞానం, అంటే వస్తువు యొక్క యదార్థ గుణాన్ని తెలిపేది. నిదానం అంటే నెమ్మది, ఓపిక అనే అర్థాలున్నా ఇక్కడ కారణం, మూల హేతువు.

అలాగే మాట అంటే పైకి చెప్పేది. మనస్సు అంటే చిత్తం. ఇది జీవాత్మకంటే భిన్నమైంది. జ్ఞానం పుట్టేది దీనిలోంచే. పైకి చెప్పే మాటకు పునాది మనస్సులో ఉంటే, ఆ మాటకు కాంతి ఉంటుంది. మనసులో పుట్టిన జ్ఞానం స్థిరమైనది అని సారాంశం.

ఇక కులం, ఇది మనిషి పుట్టిన తర్వాత వచ్చిందే. సామాజికంగా దీనిలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. కాని మౌలికంగా మనిషి గుణమే గొప్పది.

‘అమ్మ’

మాతృ దేవో భవ
పితృ దేవో భవ
ఆచార్య దేవో భవ
అతిధి దేవోభవ
మనది పితృ స్వామ్య వ్యవస్థ అయినా అనాదిగా అమ్మను ఆగ్రభాగమిచ్చి పూజించి గౌరవించడం మన సంప్రదాయం! అమ్మపై ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలుగా కీర్తించారు. ఈ సందర్భంలో వాటిలో కొన్నింటిని మననం చేసుకుందాం! అమ్మ’ – ప్రపంచంలోని ప్రతీ మనిషీ ఒక్కో రకంగా నిర్వచనం చెప్పే పదం. ‘అమ్మ’ అనే పదం ఒకటే అయినా అమ్మ గురించి చెప్పమంటే.. ఒక్కొక్కరి తలపుల్లో ఒక్కో భావం పలుకుతుంది. అమ్మ గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా ఎన్నికబుర్లు చెప్పినా చెప్పేవారికీ, వినేవారికీ కూడా తనివి తీరదు. అసలు అమ్మ లేకపోతే సృష్టే లేదు కదా.

Sunday, July 8, 2018

ఒక తెలుగు అభిమాని కవిత


పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు
కాకినాడ కాజ కజ్జికాయ
బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న
తీయనైన భాష తెలుగు భాష!

మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు
తాటిముంజలు మేటి సీతాఫలాలు
మెరయు చక్కెరకేళి మాధురులకన్న
తీయనైనది నా భాష తెలుగు భాష!

పెసర పిండి  పైన  ప్రియమగు నల్లంబు
దాని పైన మిర్చి దద్దరిల్ల
జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు 
సాటి తెలుగు  భాష మేటి భాష

స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు
తాగ లెక సురులు ధరణి లొన
ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు   
ఆవ కాయ కొఱకు నంగలార్చి.

కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు
రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ
కారమింగువలను  తగిలించి తిను వాడు
ఘనుడు తెలుగు వాడు కాదె భువిని

ఆట వెలది యనిన అభిమానమెక్కువ
తేట గీతి యనిన తియ్య దనము
సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు
కంద పద్యమెంత సుందరమ్ము

27-07-2018 చంద్ర గ్రహణము వివరములు

చంద్ర గ్రహణము వివరములు

శ్రీ మహాగణాధిపతయేనమః
            శ్రీగురుభ్యోనమః
ది--27-07-2018 శుక్రవారం విలంబనామసంవత్సర ఆషాఢపూర్ణిమరోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము
     రాత్రి-  గం-11-52  నిముషములనుండి 03-48 నిముషములవరకు
నిత్య భోజనములు  మధ్యాహ్నం 02-00  లోగా ముగించుకోవాలి
బాలురకు,వృద్ధులకు అనారోగ్యవంతులకు రాత్రి 08-00  వరకు స్వీకరించవచ్చును.

మకరరాశిలొ గ్రహణం కావున
మకరరాశివారు చూడరాదు

అలాగె,ఉత్తరాషాడా,శ్రవణా నక్షత్రములవారికి,బహుదోషం

మేష,సింహ, వృశ్చిక,మీన రాసులవారికి ---  శుభం

వృషభ,కర్కాటక,కన్య,ధనుస్సు రాసులవారికి--  మధ్యమఫలం

మిధున,తుల,మకర,కుంభ రాసులవారికి---  అధమఫలితం

ఆరోజు మధ్యాహ్న సమయానికి,దేవాలయాలు మూసివేసి
మరుసటిరోజు యధావిధిగా సంప్రోక్షణాదులు చేయవలెను 

శుక్రవారం గ్రహణంరోజున ఆబ్దీకం వచ్చినయడల మధ్యాహ్నం 11-50 నిమషములలోపు పూర్తిచెయ్యవలెను
           శుభం..

'పాపోహం, పాప కర్మాహం ... ' అని ఎందుకంటాము ?

పూజంతా అయ్యాక చివరిలో - 'పాపోహం, పాప కర్మా2హం, పాపాత్మా పాప సంభవః ...' అంటాము కదా ! ఎందుకు ? నేనేమీ పాపాలు చెయ్యలేదు కదా' ! అలా ఎందుకనాలి?


యాని  కాని  చ పాపాని  జన్మాంతర  కృతాని  చ !
తాని  తాని  వినశ్యంతి  ప్రదక్షిణ  పదే  పదే  ! పాపో2హం పాప  కర్మా2హం  పాపాత్మా  పాపసంభవః !
పాహి మాం  కృపయా దేవ  శరణాగత  వత్సల ! అన్యథా శరణం నాస్తి
త్వమేవ  శరణం  మమ
తస్మాత్కారుణ్య భావేన  రక్ష రక్ష మహేశ్వర  !! అంటూ  ప్రార్ధిస్తాము.

మనం అసలు  పాపాత్ములమే  కాదు.  మనం పరబ్రహ్మ  స్వరూపులము. మనం  నిత్య శుద్ధ బుద్ధ ముక్త  సచ్చిదానంద ఆత్మ  స్వరూపులము. 
వేదవాణి మనను  'శృణ్వంతు సర్వే  అమృతస్య పుత్రాః ....' అంటూ సంబోధించి ప్రబోధించింది. అమృతము అంటే మరణము లేనిది, అంటే పరమాత్మ. అమృతస్య పుత్రాః అంటే పరమాత్మ నుంచి ఉద్భవించిన సంతానం. ఇటువంటి  వారు పాపాత్ములెలా  అవుతారు ?

మరి మనం 'పాపోహం, పాప  కర్మాహం ... ' అని  ఎందుకంటాము  ?

మనం చేసే పనులతో, మాట్లాడే మాటలతో, మనస్సు లో కలిగే  ఆలోచనలతో మనం  కావాలని చేసినా వద్దని చేసినా, పుణ్యము, పాపము తప్పని సరిగా కలుగుతాయి. కనుక  మనం చేసిన పాపాన్ని ఎప్పటికప్పుడు మనం పోగొట్టుకోవాలి. సంధ్యావందనం చేసేటప్పుడు ఏ పూట చేసిన పాపం ఆ పూట చేసే సంధ్యావందనంతో పోతుంది, అనే మంత్రాలున్నాయి. అలా పగలు చేసే పనుల వల్ల కలిగే పాపం పగలు చేసే సంధ్యావందనం తోను, రాత్రి చేసిన కర్మల పాపం రాత్రి చేసే సంధ్యావందనంతోను పోగొట్టుకుంటున్నారు.

యదహ్నాత్ కురుతే పాపం
తదహ్నాత్ ప్రతి ముచ్యతే !
యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యా ప్రతిముచ్యతే !!

మన ప్రమేయం లేకుండా మనకు కలిగే పాపాలు ఇలా తొలగిపోతాయి కానీ కావాలని స్వార్ధంతో చేసే పాపాలు తొలగవు. వాటి ఫలం అనుభవించాల్సిందే  !

మనం అసలు పాపమే  చేసి ఉండక పోతే  మనుష్యులుగా పుట్టే  వాళ్ళమే కాదు. పూర్తిగా  పుణ్యమే ఉన్నవాళ్ళు,  పూర్తి సత్త్వగుణ  సంపన్నులు  దేవతలవుతారు. పూర్తిగా తమోగుణ సంపన్నులు చెట్లు చేమలుగా పుడతారు. తమోగుణ, రజోగుణ సంపన్నులు  రాక్షసులవుతారు. సత్త్వరజస్తమో గుణాలు  మూడు హెచ్చు తగ్గులలో ఉన్నవారు మానవులుగా  పుడతారు. మానవులలో సత్త్వ, రజస్, తమో  గుణాలలోని హెచ్చు  తగ్గులను బట్టి మానవులలోనే, దేవతలు,   మానవులు, రాక్షసులు కూడా ఉంటారు. మానవత్వం నుంచి దైవత్వానికి ఎదగటానికి మన సాధన ద్వారా  ప్రయత్నించాలి.

ఈ ప్రపంచమే సత్యము  అనుకునే అజ్ఞానమే పాపము. వివేచనతో ఈ అజ్ఞానం లోంచి బైట పడటమే పాపాన్ని పోగొట్టు కోవటము,  పుణ్యాన్ని సంపాదించటము.

మన అసలు స్వరూపం పరబ్రహ్మ తత్త్వం. కానీ అజ్ఞానం లో ప్రతిఫలించిన పరమాత్మ తనను తానే జీవునిగా భావించుకుంటోంది. ఆ జీవునికి తన్మాత్రలతో ప్రకృతిలోని భోగాలను అనుభవించటానికి ఒక శరీరము ఉపాధిగా దొరుకుతున్నది. ఆ ఉపాధిలో ఉండి,  ఇంద్రియాలు, ప్రాణముతో కలిసి చిత్తవృత్తుల ద్వారా సుఖ దుఃఖాల ననుభవిస్తూ, పాపపుణ్య కార్యాలను చేస్తున్నాడు. ఆకలి దప్పికలు ప్రాణ లక్షణాలైనట్లుగా
పాపము, పుణ్యము అనేవి జీవునికి సంబంధించినవి. జీవుడు చేసిన కర్మల ఫలం పాప పుణ్యాలను కలిగిస్తుంది. కనుక  మనకు పాప పుణ్యాలున్నాయి. ధర్మాచరణ వల్ల పాపం నశిస్తుంది. పరోపకారం చెయ్యటం వల్ల, ధర్మకార్యాచరణ వల్ల పుణ్యం కలుగుతుంది. పాప పుణ్యాలు ఏవీ  మిగలకుండా  చేసుకుని, స్వధర్మాన్ని నిష్కామంగా, భగవదర్పణ భావంతో ఆచరిస్తుంటే పాపపుణ్యాలు నశించిపోతాయి. సంచితం నశించిపోతుంది.
'ప్రారబ్ధం భోగతో నశ్యేత్'
అనుభవించి ప్రారబ్ధాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడు పాపము ఉండదు, పుణ్యము ఉండదు. అటువంటి స్థితిని  పొందేలా మన ప్రవర్తన ఉండాలి. అను నిత్యము అటువంటి జీవితం గడుపుతూ  'యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ' అని ఈశ్వరార్పణ భావంతో కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండేవారు చేసే ఏ పని ఫలితమూ వారినంటదు. పాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల ! - దయతో నన్ను రక్షించు అని ప్రార్ధించటము తప్పులు చేసి పాపాలుకలగకుండా కాపాడమని చేసే ప్రార్ధన కాదు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, అని పరమాత్మను సర్వస్య శరణాగతి చేసి సర్వ సమర్పణ భావంతో జీవించటమే  ! మామూలుగా పూజ చేసేటప్పుడు
మనకు పెద్దలు అలవాటు చేసిన నిత్య పూజలో సాధారణంగా - ధర్మార్ధకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్యర్ధం అంటూ, ఇష్ట కామ్యార్ధ సిధ్యర్ధం అంటూ ఇంకా మనకు కావలసినవి కూడా చెప్పుకుంటాము. భావం తెలుసుకుని చెప్పుకోవాలి, చెప్పిన దానిని ఆచరించాలి.

గురూపదేశం పొందిన వారు - మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్ధం, (జపించే దైవం పేరు) గురూపదేశమంత్ర సిధ్యర్ధం, మమషడూర్మ్యాది రహిత షట్స్ధల పరబ్రహ్మ నిర్వాణ సుఖసంపదవాప్త్యర్ధం, గురూపదేశ మంత్ర సిధ్యర్ధం, గురూపదేశ మంత్ర జప మహం కరిష్యే ! అని చెప్పుకుంటాము. ఆత్మా త్వం గిరిజా మతిః పరిజనాః ప్రాణాః శరీరంగృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితిః ! సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరాః ! యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం !! అనే భావన స్థిరపడినప్పుడు  ఏ కర్మ అంటదు.

ప్రధానోపాధ్యాయులకోసం మేమొక కరదీపిక రూపొందిస్తూండగా నా కొలీగ్ డా.సర్వేశ్వర్ నెట్ లోంచి కొంత సమాచారం తీసిపెట్టాడు. అందులో 'హెడ్ మాస్టర్'

ప్రధానోపాధ్యాయులకోసం మేమొక కరదీపిక రూపొందిస్తూండగా నా కొలీగ్ డా.సర్వేశ్వర్ నెట్ లోంచి కొంత సమాచారం తీసిపెట్టాడు. అందులో 'హెడ్ మాస్టర్' అనే ఒక మాడ్యూల్లో ఒక వ్యాసం నా దృష్టిని ఆకర్షించింది. ఆ వ్యాసం ద్వారా నేను మొదటిసారిగా డరోతీ సేయర్స్ రాసిన The Lost Tools of Learning (1947) గురించి విన్నాను.
ఆ వ్యాసం వెంటనే చదవకుండా ఉండలేకపోయాను. గత డెబ్బై ఏళ్ళుగా లెక్కపెట్టలేనన్ని సార్లు ముద్రించబడుతూ వస్తున్న ఆ వ్యాసం నాకొక కనువిప్పు. మొత్తం 23 పేజీల ఆ వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. విద్య పట్ల, బోధన పద్ధతుల పట్లా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా చదవవలసిన వ్యాసం అది.
మామూలుగా మనం యూరోప్ లో మధ్యయుగాలు చీకటి యుగాలనీ, మతం ప్రజల్ని గుడ్డిగా శాసించిందనీ, ఆ అంధయుగంనుంచి కొత్త పరివర్తన రినైజాన్సుతో మొదలయ్యిందనీ చదువుకున్నాం. అప్పుడే ప్రాచీన గ్రీకు గ్రంథాలు వారికి అందుబాటు లోకి వచ్చాయనీ, వాటిని అధ్యయనం చెయ్యడం ద్వారా వారు వివేచనాశీలురుగానూ, హేతువాదులుగానూ, మానవతావాదులుగానూ రూపొందారనీ చిన్నప్పుడు మా హైస్కూలో మా వెంకటరత్నం మాష్టారు మాకు చెప్పారు.
కానీ, ఆ గ్రీకు గ్రంథాల్ని మధ్యయుగాల విద్యార్థులు ఏ పద్ధతిలో చదివారు? వాటిని వారికెవరు బోధించారు? ఏ బోధన-అభ్యసన ప్రక్రియ వల్ల లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, బొకాషియో, డాంటే, షేక్ స్పియర్, గెలీలియో, బ్రూనో లు రూపొందారు? ఏ విద్యాబోధన పునాదులమీద తదనంతర కాలాల్లో ఫ్రాన్సిస్ బేకన్,న్యూటన్, వోల్టేర్, డెనిస్ డిడిరో, గొథే, సెర్వాంటిస్ లు ప్రభవించగలిగారు? వారు ఏ పద్ధతిలో చదువుకున్నారు? మాంటిసోరీ, పెస్టలోజి, ఫ్రోబెల్ వంటి విద్యావేత్తలు లేని కాలంలో, ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక విద్యావిధానం ఊహించడానికి కూడా లేని రోజుల్లో, అచ్చుపుస్తకాలూ, పత్రికలూ, కంప్యూటర్లూ, ఇంటర్నెట్లు లేని కాలంలో ఏ సామగ్రి, ఏ సాహసం, ఏ వ్యక్తిత్వ నిర్మాణం ఆధారంగా యూరోప్ ప్రపంచవిజేత కాగలిగింది?
ఇది ఒక ప్రశ్న. దీని వెను వెంటనే పుట్టే మరొక ప్రశ్న మరి ఇప్పుడు అటువంటి మహామేధావులు, సృజనాత్మక కళాకారులూ, మౌలిక శాస్త్రవేత్తలూ ఎందుకు ప్రభవించడం లేదు? నిజమే,టెక్నాలజీ పరంగా ప్రపంచం ఇప్పుడు సాధిస్తున్న విజయాలు మనం కొలవలేనివి.కాని మౌలిక విజ్ఞాన శాస్త్రంలో మనం ఎక్కడున్నాం?
ఇక మూడవ ప్రశ్న, అన్నిటికన్నా, ముఖ్యమైన ప్రశ్న, డరోతీ సేయర్స్ అడిగింది. ఆమె ఇలా అంటోంది:
'ఇంతదాకా పశ్చిమ యూరోపు చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యున్నతస్థాయికి అక్షరాస్యతా శాతం చేరిన ఈ కాలంలో, ప్రజలు మనమింతదాకా కనీ వినీ ఎరగనంతగా, వ్యాపార ప్రకటనల, బహిరంగ ప్రచారాల ప్రభావానికి లోనుకావడం మీకు వింతగా, దురదృష్టకరంగా గోచరించడంలేదా? లేదా అదంతా, రేడియోవల్లా, పత్రికలవల్లా ముదంటికంటే ప్రచారం మరింత విస్తృతంగా వ్యాపించడం తప్ప మరేమీకాదని తీసిపారేస్తారా? నిజంగా చూడండి, ఈ పరిస్థితికి, ఒక వాస్తవానికీ, అభిప్రాయానికీ మధ్య తేడా చూడలేకపోవడానికీ, నిర్ధారణకీ, సంభావ్యతకీ మధ్య సరిహద్దులు గీసుకోలేని ఈ పరిస్థితికి కారణం మన ఆధునిక విద్యాపద్ధతులేమోనన్న అనుమానం, మీ మనసుల్లో, లోపల్లోపల, మీకు కలగడం లేదా?'
ఆమె ఈ ప్రశ్న అడిగినప్పుడు యూరోప్ అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగించింది. ఒక ప్రజాస్వామిక దేశం ఒక రాజరిక దేశం మీద ఆటంబాంబు వేసిన పొగ మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ ఆమె ఈ ప్రశ్న అడిగింది. కానీ, అప్పటికి టివి లేదు, ట్విట్టర్, స్కైప్, ఫేస్ బుక్, యూట్యూబుల్లేవు. ఇప్పుడు, ఈ అత్యాధునిక సమాచార ప్రసార సాధనాల మధ్య ఆమె ప్రశ్న,మరింత బిగ్గరగా నా మొహం మీద మొహం పెట్టి, అడుగుతోంది: చెప్పు, మనుషులు ఎందుకింత ద్వేషపూరితంగా, ఇంత అర్థరహితంగా, ఇంత వితండంగా వాదించుకుంటున్నారు?
డరోతీ సేయర్స్ వ్యాసం చదవకముందు నాకు అనుమానంగా ఉన్నదికాస్తా ఇప్పుడు రూఢి అయిపోయింది. ఈ అర్థరాహిత్యానికీ, ఈ ద్వేషానికీ మూలాలు మన పాఠశాలల్లోనే వెతకవలసి ఉంటుందని. విజ్ఞానసాధనాలు కాలేకపోయిన మన పాఠశాల వైఫల్యానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఇది. నిజమే, ఈ ఆధునిక విద్య మధ్యయుగాల్లో యూరోప్ లోనూ, వందేళ్ళ కిందట భారతదేశంలోనూ మనం ఊహించలేనిది. కాని, వందేళ్ళ కిందట దేశం చూసిన ఒక గాంధీ, టాగోర్, అంబేద్కర్, జగదీశ్ చంద్రబోస్, రామానుజన్, రామన్, రాధాకృష్ణన్ ఇప్పుడెందుకు కనిపించడం లేదు? భాషలేవైనా, ప్రాంతాలేవైనా, మతధర్మాలేవైనా, భారతదేశం ఒకటే అని తాము నమ్మి, మనల్ని నమ్మించగలిగిన ఆ మహామానవులు ఇప్పుడు టెలివిజన్ స్టూడియోల్లో ఎందుకు కనిపించడం లేదు?
మధ్యయుగాల్లో చదివిన చదువుకన్నా ఇప్పుడు మన పాఠశాలల్లో పిల్లలు ఎన్నో సబ్జెక్టులు చదువుకుంటున్నారనీ, కాని దాని అర్థం వాళ్ళు మధ్యయుగాలనాటి విద్యార్థుల కన్నా ఎక్కువ తెలుసుకుంటున్నారని మాత్రం కాదంటోంది డరోతీ. ఆమె ఈ మాటలు అంటున్నప్పటికి సరిగ్గా నలభై ఏళ్ళముందు గాంధీజీ తన హింద్ స్వరాజ్ లో ఈ ప్రశ్నలే వేసినట్టు ఆమెకి తెలీదు. తాను చదువుకున్న ఆల్జీబ్రా, జాగ్రఫీ, హిస్టరీ ఏవీ కూడా తన ఇంద్రియాలనెట్లా అదుపులో పెట్టుకోవాలో తనకు నేర్పలేకపోయాయని గాంధీ ఆ పుస్తకంలో వాపోయాడు.
మధ్యయుగాల్లో విద్యావ్యవస్థ ఇందుకు భిన్నంగా ఉండేదని అంటుంది డరోతీ సేయర్స్. అప్పుడు విద్యార్థులకి నేర్పేవి మొత్తం ఏడు అంశాలు. వాటిలో మొదటి మూడింటినీ 'ట్రివియం' అనీ, మిగిలిన నాలుగింటినీ 'క్వాడ్రివియం' అనీ అనేవారు. ట్రివియంలో మూడు అంశాలు: తర్కం, వ్యాకరణం, అభివ్యక్తి (రెటారిక్). తర్కం అంటే ఆలోచించమెట్లానో తెలుసుకునే కళ. వివిధ సంకేతాల్ని కనుగొనడం, వాటిమధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వ్యాకరణం. తాను అర్థం చేసుకున్నదాన్ని ఆలోచనతో మేళవించి చెప్పగలగడం రెటారిక్. నిజానికి ఇవి మూడూ సబ్జెక్టులుకావు, అధ్యయన పద్ధతులు అనవలసి ఉంటుంది. అంటే నేర్చుకోడమెట్లానో నేర్పే పద్ధతులన్నమాట. ఒకసారి, ఈ పద్ధతుల్ని పిల్లవాడికి పరిచయం చేసిన తరువాత, పిల్లవాడు, నేర్చుకోడమెట్లానో నేర్చుకున్నాక, ఏ విషయాన్నైనా, ఎంత కొత్త విషయాన్నైనా తనంత తానే నేర్చుకోగలుగుతాడు.
కానీ,ఇప్పుడు మన పాఠశాలల్లో ఇది జరుగుతోందా? 'పిల్లవాడికి పద్యాలకి అర్థం చెప్పరూ' అని వెంకమ్మ అడిగిన ప్రశ్నకి 'యిప్పటి మటుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ళ స్కూళ్ళల్లో తెలుగుపద్యాలమీద ఖాతరీ లేదండి. యంతసేపు జాగర్ఫీ, గీగర్ఫీ, అర్థమెటిక్,ఆల్జీబ్రా, మాథమాటిక్స్, యివన్నీ హడలేసి చెప్తారండి' అంటాడు గిరీశం. అప్పణ్ణుంచి ఇప్పటిదాకా మన పాఠశాలల్లో నడుస్తున్నది విద్య కాదు, 'హడలేసి చెప్పడమే'.
తర్కం, వ్యాకరణం,రెటారిక్ నేర్పిన తర్వాత, పిల్లలకి నాలుగు సబ్జెక్టులు మాత్రమే మధ్యయుగాలు నేర్పేవి. మొదటిది, అరిథ్ మెటిక్,అంటే, సంఖ్యల్ని అర్థం చేసుకోవడం. రెండవది సంగీతం. అంటే సంఖ్యాజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమెట్లానో తెలుసుకోవడం. మూడవై జామెట్రీ. అంటే స్థలం గురించిన పరిజ్ఞానం. నాలుగవది, ఖగోళశాస్త్రం. స్థలం గురించి తెలుసుకున్నదాన్ని ఆచరణలో అనువర్తింపచెయ్యడం. ఈ నాలుగు అంశాల్లోనూ మధ్యయుగాల్లో బోధించిన విషయం బహుశా ఇప్పుడు అయిదవతరగతి పిల్లవాడి స్థాయికి మించి ఉండకపోవచ్చు. కాని, మనం చూడవలసింది విషయవిస్తృతిని కాదు. విషయంవేరు, అభ్యసన సామర్థ్యం వేరు. ఇప్పటి అయిదవ తరగతి పిల్లవాడికి లభించే పరిజ్ఞానంతోనే అప్పుడొక కోపర్నికస్ రూపొందాడని మనం మర్చిపోకూడదు. కాని, ఇప్పుడు మసాచుసెట్స్ యూనివెర్సిటీనుంచి నోబెల్ బహుమతులు పుచ్చుకుంటున్న శాస్త్రవేత్తలు ప్రభవిస్తున్నారు కాని,మరొక కోపర్నికస్ పుట్టలేదని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఇరవయి ఒకటవ శతాబ్దానికి అవసరమైన విద్యానైపుణ్యాలుగా చెప్పుకుంటున్న నాలుగు నైపుణ్యాల్లోనూ: critical thinking, creative abilities, communication మధ్యయుగాల ట్రివియంలో ఉన్నవేనని నాకిప్పుడు అర్థమవుతోంది. నాలుగవ నైపుణ్యం, collaboration ఒక్కటే కొత్తగా వచ్చి చేరిన నైపుణ్యం. అందులో ఆశ్చర్యం లేదు. గత అయిదువందల ఏళ్ళుగా ప్రపంచం నేర్చుకున్న గుణపాఠాల వల్ల నేర్చుకోకతప్పని నైపుణ్యం అది.
GBT.ORG
However, it is in the highest degree improbable that the reforms I propose will ever be carried into effect. Neither the parents, nor the training colleges, nor the examination boards, nor the boards of governors, nor the ministries of education, would countenance them for a moment. For they amount....

Total Pageviews