Thursday, March 31, 2016


            ఈ సత్యాన్ని  ప్రతీ తల్లి, తండ్రి  గ్రహించాలి...

మీ పిల్లల పట్ల మీరు చూపే ప్రేమాభిమానములు విలువైనవి, అమూల్యమైనవి, వెలకట్టలేనివి ...
కాకపోతే ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లి, తండ్రులు చేస్తున్న చాలా చిన్న విషయం అనుకునే పెద్ద పొరపాటు
“నేను పడ్డ కష్టం,
శ్రమ నా బిడ్డ పడకూడదు”
ఇది తల్లి, తండ్రుల నిస్పక్షపాతమైన, కల్మషమైన, పవిత్ర ప్రేమకు చిహ్నo .
కాని ఇక్కడ మీరో విషయం మర్చిపోతున్నారు...
మీరు ఆ కష్టాలు, శ్రమలు పడ్డారు కాబట్టే ఇంత పైకి వచ్చి భాద్యతగా ఉంటూ వున్నారు..
అదే మీ పిల్లల విషయంలో మీరు కఠినంగా ఉండకుండా సున్నితంగా వారికి లోకం తెలియకుండా పెంచితే మాత్రం మీరు, వారు, వారితో వున్న ప్రతీ ఒక్కరు మూల్యం చెల్లించాల్సి వుంటుంది...
కష్టమేమిటో ఎరగని వాడికి సుఖం విలువ తెలియదు.
నష్టమేమిటో ఎరుగని వాడికి లాభం విలువ తెలియదు.
కాలమేమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలియదు.
ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి...
"అతి ప్రేమ,అతి గారాబం,అతి అలుసు అనేది అస్సలు మంచిది కాదు"..
మీ పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాలనే భావనతో వారిని మరీ సున్నితంగా పెంచుతున్నారు.
ఇదే నేడు సమస్యగా మారింది.
స్వీటీ అనే అమ్మాయి ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు.
అడిగింది కాదనకుండా ఇంకా ఎక్కువగా ఆమెకు తెచ్చి అందిస్తారు.
చిన్నతనం నుండి ఓ మహారాణి అన్న భావనను స్వీటీలో పెంచారు.
ఉన్నత చదువులు చదివి.. పెళ్లాయ్యాక...
భర్త ఆమెను ప్రత్యేకంగా చూడకపోవడంతో గొడవ పడేది.
ఇలా పెరిగడం వల్లే చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది.
ఇలా స్వీటీ ఒక్కటే కాదు..
ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
దీనికి పెంపకంలోని లోపాలే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు అన్నం విలువ,డబ్బు విలువ తెలియచేయాలి...
కొన్ని సందర్భాలలో చేతినిండా డబ్బు ఉన్నా తినడానికి తిండి దొరకదు..
అలాగే కొన్నిసార్లు తినిడానికి అన్నీ దొరికినా చేతిలో డబ్బులు ఉండవు..
ఇటువంటి పరిస్ధితులు జీవితంలో ఎదుర్కొన్న వారికి తప్పకుండా అన్నం,డబ్బు విలువ తెలుస్తుంది...
అతి గారాబం చేయడం వలన పిల్లలకు కష్టాలు తట్టుకొనే శక్తి సడలుతుంది..
అలాగే అతి భయం, బెదిరింపు, కొట్టడం,తిట్టడం చేయడం వలన
మొండిగా/మూర్ఖంగా తయారయ్యే అవకాశం ఉంది...
కనుక తల్లిదండ్రులు ఈ రెండింటిని బేలన్స్ చేస్తూ పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాలి...
ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొనే శక్తి కలిగే వారిగా చేసి వారికి మార్గదర్శకంగా నిలవాలి....
వారికి కష్టం...
నష్టం...
సుఖం
అన్నీ తెలియాలి.
లగ్జరీగా పిల్లల్ని పెంచ డం నేటి ఫ్యాషన్‌.
అదే ఇప్పుడు కొంప ముంచుతోంది.
ఇలా పెరిగిన వారు చిన్న కష్టాలకే హడలుతున్నారు.
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ అంశాలపై అవగాహన పెంచాలి.
కొంతమంది తల్లి, తండ్రులు తమకు ఎన్ని కస్టాలు వున్నాయో,
తము సరుకులు తెచ్చేందుకు కూడా ఎలా ఇబ్బంది పడుతున్నారో వగైరా విషయాలు పిల్లల దాకా రానివ్వరు ఇవన్ని వాళ్ళకు తెలియాలని అనుకోరు..
కాని అది కరెక్ట్ కాదు.
పిల్లలకు విచ్చలవిడి తనాన్ని మనమే అలవాటు చేస్తున్నాం..
మీరు సంపాదించే ప్రతీ రూపాయి యెంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారో వాళ్ళకు తెలియాలి తద్వారా వాళ్ళకు దుబారా ఖర్చులు అలవడకుండా వుంటాయి..
ముఖ్యముగా తల్లి తండ్రులు వాల్లకు చదువు కంటె జీవితంలో జనరల్ విషయాలు ఎక్కువ అవగాహనకు తీసుకురావాలి..
చదువు ఒక్కటే ఉంటె ఈ కాలంలో సరిపోదు.
కొందరు పిల్లలు సెలవు దినాల్లో ఏదైనా పనికి పంపుతుంటారు కారణం వాళ్ళు సంపాదించి పెడతారని కాదు..
వాళ్ళకు డబ్బు విలువ తెలుస్తుందని ..
ఇలా ప్రతీ తల్లి, తండ్రులు వాళ్ళ పిల్లలకు సరైన అవగాహనా,
సరైన శిక్షణ అందిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు తప్పకుండా అవుతారు.
గొప్ప వాళ్ళు కాకపోయినా మంచి మనుషులుగా మిగులుతారు...
ప్రతీ గొప్ప వారు డబ్బునుంచి వచ్చిన వారు కాదు కష్ట, నస్టాల్లోనుంచి వచ్చిన వారు కారణం వారు అన్నీ అనుభవించి వచ్చినవారు కనుక వారికి అన్ని తెలుసు..
నాయకులు ఏ.సి రూముల్లో కూర్చొని పనిచేస్తే సరిపోదు..
ఆ పని చేస్తే ఎవరికి మేలు కలుగుతుంది,
ముందు ఎవరికి ఉపయోగపడాలి,
ఏ పని ఏ ఏ సమయాల్లో సమయానుకూలంగా చెయ్యాలనే విషయం వారు స్వయంగా కష్ట, నష్టాలు అనుభవిస్తేనే తెలుస్తుంది...
పిల్లల్ని ముద్దుగా చూడటంలో తప్పులేదు కానీ...
వారికి లోకం తెలీకుండా పెంచడంలోనే అసలు సమస్య.
అందుకే దయచేసి తల్లి, తండ్రులారా మేల్కోండి..
రేపటి భావితరానికి మీరు బాటలు వెయ్యండి.

పెళ్ళినాటి ప్రమాణాలు.
సప్తపదిలో ఏడు అడుగులు వేస్తూ " ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు " అనే మంత్రం చదువుతారు. దాని అర్ధం:-
మొదటి అడుగు : శక్తి కోసం
రెండవ అడుగు : బలం కోసం
మూడవ అడుగు : వ్రతం కోసం
నాల్గవ అడుగు : ఆనందం కోసం
ఐదవ అడుగు : ఇంద్రియబలం కోసం
ఆరవ అడుగు : రుతువులకోసం
ఏడవ అడుగు : గృహ ధర్మాలకోసం
వధూవరులు ఇద్దరూ కలసి జీవితాంతం ఇలాగే కలసి నడుస్తామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపది కార్యక్రమం తోనే * వధువు ఇంటి పేరు మారిపోతుంది *. వివాహానికి ఈ సప్తపది కార్యక్రమమే చాలా ముఖ్యం.
ఈ పెళ్ళినాటి ప్రమాణాలను స్త్రీ , పురుషులు ఇద్దరూ అనుసరించి పాటించిననాడే పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకొంటుంది. భార్య భర్తకు , భర్త భార్యకు తోడునీడగా, అన్యోన్యం గా అరమరికలు లేకుండా అర్ధనారీశ్వర తత్వంతో జీవిస్తేనే ఈ ప్రమాణాలకు ఒక విలువ వుంటుంది.

Friday, March 25, 2016

శనివారం తులసికోట వద్ద దీపమెలిగించండి..!

శనివారం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజుగా పురోహితులు అంటున్నారు. అలనాడు 
వైష్ణవులు శనివారం పూట శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించేవారని పురాణాలు 
చెబుతున్నాయి.అందుచేత శనివారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా 
స్వానమాచరించి తులసికోట ముందు నేతితో గాని, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగించేవారికి 
అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా తులసికోట ముందు దీపమెలిగిస్తే.. ఆ గృహంలో లక్ష్మీదేవి 
ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.అలాగే శనివారం సాయంత్రం పూట 
శ్రీమన్నారాయణుని ఆలయాన్ని సందర్శించుకుని నేతితో దీపమెలిగించుకునే వారికి 
ఈతిబాధలు తొలగిపోయి, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
శనివారం పూట ఒక పూట మాత్రమే భుజించి, శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుడిని 
ధ్యానించే వారికి శనిగ్రహ ప్రభావంచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.ఇంకా తొమ్మిది 
వారాల పాటు నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని, విష్ణుమూర్తి ఆలయాన్ని 
తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని 
పురోహితులు సూచిస్తున్నారు
కుంకమ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ??




మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో ఆదిదేవత వున్నాడు. అలాగే లాలట అధి దేవత

బ్రహ్మా. లలాటం బ్రహ్మా స్థానం . బ్రహ్మా దేవుని రంగు ఎరుపు. కావున బ్రహ్మాస్థానమైన లలాటాన 

ఎరుపు రంగు(కుంకుమ) ధరించాలి. ఎప్పుడైతే కుంకుమ లలాటాన(నుదుటన) అద్దుతారో 

అప్పుడు జ్ణానచక్రాన్ని పూజించినట్లు అవుతుంది. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే 

శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడివేలితో ధరిస్తే ఆయువు సమృద్ది చేందుతుంది. 

బోటనవేలితో ధరిస్తే శక్తి, చూపుడు వేలితో ధరిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి  అని పెద్దలు 

చెపుతారు.

Saturday, March 19, 2016

ఒకరోజు పశు వధ శాలలో ఒకడు
గోవును చంపడానికొచ్చినపుడు
గోవు వానిని చూసి నవ్వింది.
.
.
.
దాన్ని చూసి కసాయి అడిగాడు.
నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?
అని అడిగాడు.
.
.
అప్పుడు గోవు ఇలా చెప్పింది.
.
నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు.
.
అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది.
ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను, నువ్వు చంపి, నా మాంసాన్ని తినే
నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను.
.
.
పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి.
పాలతో వెన్న చేసుకున్నారు.వెన్నతో నెయ్యి చేసుకున్నారు.
నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు.
అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.
ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.
కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్.....
నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్.
ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే.
నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్.
కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్.
నిన్ను కన్న తల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను.
శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.
నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?
.
.
నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.
.
(మీకు సాధ్యమైనంతవరకూ మీ బంధుమిత్రులందరికీ
ఇది తెలియజేసి గోమాత ఋణాన్ని తీర్చండి.)

Thursday, March 17, 2016

మిత్రులారా...శుభోదయం!!

మహనీయుల సాహితీ సేద్యములో కుసుమించిన కావ్య సౌరభాలని ఒక సారి ఆస్వాదిద్దాం! ఆనందిద్దాం!!.భావితరాలకి అందిద్దాం ..మన తెలుగు దనం కృషిని అభినందిద్దాం!!! ఇలా..ప్రతి రోజు మనవైన ..ఘన సాహితీ సంపదలను పంచుకుని...పెంచుకుందాo.
తనకు తెలియదు, ఒకడు చెబితే వినడు.
కొందరు మాకు అన్నీ తెలుసునని గొప్పగా చెప్పుకుంటారు. ఆ విషయం మీద అవగాహన లేకపోయినా మాకు అంతా తెలుసులే అని గర్వంగా ఫీలవుతారు. ఎదుటి వారు ఇలా కాదు, 'అలా' అంటే వినరు. ఇతరులు నాకు చెప్పేంత వాళ్ళా అని కోపగించుకుంటారు. నేనే గొప్పని చెప్పుకుంటారు. అందరి కంటే నాకే బాగా తెలుసు అని భ్రమపడతారు. కాని వాళ్ళకు ఏం తెలియదు. మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారిని ఉద్దేశించినప్పుడు ఈ నానుడిని వాడతాం.
ఆలోచించి మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఆలోచించకూడదు.
ఎదుటివారిని నొప్పించేలా మాట్లాడుతున్నామా? స్నేహపూరకంగా మాట్లాడుతున్నామా? అనే విషయాల్ని మాట్లాడేటప్పుడే ఆలోచించాలి. మాట్లాడిన తర్వాత ఆ మాటను తిరిగి వెనక్కి తీసుకోలేం. మాట నాలుక దాటి బయటకు వచ్చే ముందు ఈ విషయాల్ని గ్రహించటం మంచిది. ఎందుకంటే పెదవిదాటి బయటకు వచ్చిన మాటకు విలువ ఉండదు సరికదా! ఆ మాట సరైనది కాకపోతే నలుగురిలో నవ్వులపాలు కావాల్సి వస్తుంది.అంతే కాదు మనల్ని మంచివారుగానో, చెడ్డవారుగానో ఎదుటివారి ముందు నిలబెట్టేది మనమాటే. నోరుంది కదా! అని నోటికొచ్చిన మాటల్లా మాట్లాడితే మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచిస్తే మాట్లాడిన తర్వాత చింతించే ప్రమాదం తప్పుతుంది.
                                      * పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ....! 
వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. దీనితో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. మనం తినే ఆహారంలో మెగ్నీషియం సమపాళ్ళలో ఉంటే జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు నేర్చుకోవాలనే ఆకాంక్ష మరింత పెరుగుతుంది. సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేవెూ గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు.
ఇలా మరిచిపోయేందుకు కారణం వారిలో పరీక్ష అంటే వున్న భయం, టెన్షన్‌ కావచ్చు. పరీక్షలొస్తున్నాయంటే చాలు పిల్లలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా, ఆందోళన వల్లా, భయం వల్లా పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతారు. ఇలాంటి టెన్షన్లకు పిల్లలు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారం వారి తల్లిదండ్రులు తప్పక ఇవ్వాలి. 

2. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ మెదడు చలాకీగా పనిచేయాలన్నా, అనారోగ్యం, నిద్రలేమి, ఆందోళన సమస్యల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

3. పిల్లలకు మంచి ఆహారంతోపాటు విటమిన్‌ బి12, విటమిన్‌బి6, విటమిన్‌ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పోలేట్‌ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. 

4. పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది.
5. నేరేడు పండులో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయి. ద్రాక్ష, చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండడం వల్ల రోజూ ఒక గ్లాస్‌ ద్రాక్ష జ్యూస్‌ తీసుకోవడం ఎంతో మంచిది. 6. అలాగే ఆపిల్స్‌లో కూడా విటమిన్లతోపాటు కాల్షియం, క్వెర్‌సిటిన్‌, ఆంథోసియానిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మతిమరుపు సమస్యను తప్పించుకోవచ్చు. కొంతమంది ఆపిల్‌ తొక్కను తీసేసి పండును మాత్రమే పిల్లలకిస్తుంటారు. ఆపిల్‌ తొక్కలో కూడా మంచి పోషకాలు ఉంటాయనే సంగతిని మరవరాదు. 

7. ఇక పాలకూర వాడకం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బొప్పాయి, అరటిపండులో ఉన్న పోలేట్‌, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్‌ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండిపదార్థం మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి. 

8. తేనె వాడకం వల్ల యాంగ్జైటీ తగ్గి జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే, వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే వారికి పోషకాహారం తప్పక అందించాలి.

Wednesday, March 16, 2016

గుమ్మడి కాయ అనగానే మనకి గుర్తొచ్చేది దిష్టి. ఇంట్లోని మహిళలు దిష్టి తీయడానికి ఎక్కువగా గుమ్మడికాయనే వాడుతుంటారు. గృహప్రవేశం నుండి కొత్త వెహికిల్స్ దాకా ఇలా ఏ శుభకార్యం అయినా గుమ్మడికాయ కొట్టే మొదలుపెడతారు. వింటర్ సీజన్లో ఎక్కువగా లభించే ఈ గుమ్మడికాయలు కేవలం దిష్టికి మాత్రమేనా…? చూద్దాం.
మన పూర్వీకులు ఏర్పరచిన ప్రతి పండుగ, ఆచార సంప్రదాయాల వెనుక ఏదో ఒక మానవ ప్రయోజనం ఇమిడి ఉంటుంది. మనం తయారు చేసుకొని తినే వంటకాలు, అందులో వినియో గించే పదార్థాలు అన్నీ మన ఆరోగ్యానికి దివ్య ఔషధాల్లా పనిచేసేవే. మన భారతీయ సంప్రదాయక వంటకాలలో గుమ్మడి కాయకు మంచి స్థానమే ఉంది. గుమ్మడికాయలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, బి1,సి, డి, బి 12వంటి ప్రధానమైన విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయని, ఫ్లెవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందని, చర్మాన్ని ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
గుమ్మడిలో ఉండే విటమిన్ ఇ చర్మంను సాఫ్ట్ గా మార్చడంతో పాటు సన్ రాషెస్ ను మరియు స్కిన్ అలర్జీలను నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
గుమ్మడికాయలో విటమిన్ ఎ మరియు పొటాసియం అధికంగా ఉండటం వల్ల… ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
గుమ్మడికాయలో విటమిన్ సి మరియు ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల చుండ్రుకు కారణం అయ్యే ఇన్ఫెక్షన్స్ ను అరికడుతుంది . తలలో డ్రైనెస్ వల్ల చుండ్రు ఏర్పడకుండా తలకు తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది . గుమ్మడి రసాన్ని పెరుగులో మిక్స్ చేసి తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య దరిచేరదని బ్యూటీషియన్లు అంటున్నారు.
గుమ్మడిలో జింక్, విటమిన్ సి ఉండటం వల్ల కాలిన గాయాలకు మందులా పనిచేస్తుంది. గాయాలైన ప్రదేశంలో లేదా ఏవైనా కీటకాలు కుట్టిన ప్రదేశంలోనైనా గుమ్మడి జ్యూస్ ను అప్లై చేస్తే త్వరగా తగ్గు ముఖం పడతాయి.
నారింజ రంగులో ఉన్న గుమ్మడికాయలో బీటా కెరోటిన్ ఎక్కువ మోతాదులో ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది గుండె వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు.
గుమ్మడికాయ ప్రొస్టేట్ గ్రంథి వాపుతో బాధపడే వారికి ఉపశమనాన్ని ఇస్తుంది.
గుమ్మడికాయ తినడం వల్ల కడుపులోని నులిపురుగుల చనిపోతాయి. దాని వల్ల బలహీనత తగ్గి పిల్లలు చురుగ్గా ఉంటారని పిల్లల వైద్యులు చెబుతున్నారు.
100 గ్రాముల గుమ్మడికాయలో 62.6% తేమ, 48.4% కొవ్వు, 31% ప్రొటీన్లు ఉండటం వల్ల చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.
గుమ్మడి జ్యూస్ లో కొద్దిగా తేనె, విటమిన్ ఇ ఆయిల్, పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ గా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేసి, ముడుతలను నివారిస్తుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
వేసవి వచ్చేసింది....ఇక కొందరైనా పాటించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకొండి
వడగాలులు, దాహం, నీరసం, అలసట...
వీటివల్ల చిరాకు
కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
వేసవి చిట్కాలు:--
1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5) మజ్జిగ అన్నంలో తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు..మజ్జిగ చాలా మంచివి.
7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు.
అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.వాళ్ళతో ఆడుతూ..
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా దబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే.
కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి.
అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
15. వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి
Important note ***
16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి.
గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి.
వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి.
దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.
19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.....కూలింగ్ వాటర్ దొరుకుతుంది కదా అని ఫంక్షన్స్ లో ఎక్కువ తీసుకోకండి.దాహం తీరటం మాట అటుంచి గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
21.ఎక్కువ AC లలో కాక ఇంటి ఉష్ణోగ్రత కే అలవాటు పడాలి..ఎటయినా వెళ్ళినప్పుడు ఇండియాను తట్టుకునే శక్తి కలుగుతుంది..
22.పిల్లలను సాయం సమయంలో పార్కులకో మైదానాలకో తిఇసుకువెళ్ళాలి..రోజంతా ఇంటిలో ఉన్న వారికీ ఇదో ఆటవిడుపు..పెద్దలకు కుడా..
23.పెళ్లిళ్ల సమయం కాబట్టి భోజనాలు చేయవలసి ఉంటుంది ..మిగిలవాటితో కాక..మజ్జిగ లేదా పెరుగును ఎక్కువ వాడాలి.
24. చంటి పిల్లలకు అన్నంలో నేయి వేసి పెడతాం..కానీ.ఈ కాలంలో నెయ్యి తగ్గిస్తే మంచిది.దాహమయిన చెప్పలేరు.ఏడుస్తుంటారు..చిరాకు పడుతుంటారు..
25.పెద్దవారికి ఆరారా చలవ పానీయాలు ఇవ్వాలి.
26.చెరుకురస౦ ఐసు వేయకుండా తాగండి.
27.అరటిపండు ముక్కలుగా కోసి పాలతో కలిపి మిక్సిలో వేసి బనానా షేక్ చేయండి..పంచదార
బదులుగా తేనే కలిపితే బావుంటుంది.రుచికి ఒక యాలుక వేసినా బావుంటుంది.

శుభసాయంత్రం!

బద్దకంలో దారిద్ర్యం ఉంది 
కృషిలో ఐశ్వర్యం ఉంది 
అందుకేనేమో........ 
కృషితో నాస్తి  దుర్భిక్ష్యం అంటారు.!!!


Tuesday, March 15, 2016

                        ఔషధాల పెట్టె మన పోపులపెట్టె

పోపుల పెట్టె.. దీన్నే నిపుణులు ఔషధాల పెట్టె అంటున్నారు. నిత్యం వంటకాల్లో వాడే ఈ దినుసులు వంటకాలకు ఘుమఘుమలూ, రుచినివ్వడానికే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. ఆకలిని పెంచి.. నోటిని శుభ్రం చేసే ఈ దినుసులు అమోఘమైన పోషకాల మిళితం.
మిరియాలు: బెల్లం, మిరియాలూ నూరి చిన్న ఉండలా చేసి దవడన పెట్టుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. మిరియాల పొడిని పాలలో కలిపి తీసుకున్నా దగ్గునుంచీ ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్‌ఫెక్షన్లూ అదుపులోకి వస్తాయి. జీర్ణశక్తీ బాగుంటుంది.

యాలకులు: వీటిని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.దంతాలూ, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్లు, జీర్ణసమస్యలూ అదుపులోకి వస్తాయి. తలనొప్పి తగ్గాలంటే ఇలాచీ టీ తాగితే మంచిది.

మెంతులు: వీటిలో పీచు అధికం. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జీవక్రియలూ, జీర్ణ ప్రక్రియలు మెరుగుపడతాయి. మధుమేహం ఉన్నవారికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. బాలింతలు తింటే పాలు వృద్ధి అవుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ దూరమై.. రక్తం శుద్ధి అవుతుంది. హైపర్‌థైరాయిడ్‌ ఉన్నవారికి పరిష్కారం దొరుకుతుంది.

ధనియాలు: వంటల్లో వాడటం వల్ల గ్యాస్‌ పెరగకుండా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. జర్వం వచ్చినప్పుడు ధనియాలతో చేసిన రసం, కషాయం వంటివి ఇవ్వడం వల్ల త్వరగా తగ్గుతుంది. వీటిలో ఎ, డి1, బి2 విటమిన్లూ, ఇనుము అధికంగా ఉంటాయి. ధనియాలూ లేదా కొత్తిమీరతో చేసిన రసం తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇక, ధనియాల్లోనూ పీచు సమృద్ధిగా ఉంటుంది. చెడుకొలెస్ట్రాల్‌ని తగ్గించే శక్తి వీటి సొంతం. థైౖరాయిడ్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారు ధనియాలు తీసుకుంటే మంచిది.

జీలకర్ర: వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో జీలకర్ర కీలకపాత్ర పోషిస్తుంది. జీలకర్రలో ఇనుము లభిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి ఇది తక్షణ ఉపశమనాన్నిస్తుంది. రక్తవిరేచనాలతో బాధపడేవారు జీలకర్ర రసం తీసుకుంటే మంచిది. భోజనం తరవాత జీలకర్రను నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల చక్కగా జీర్ణమవుతుంది.

ఆవాలు: వీటిలో ఇనుము, జింక్‌, క్యాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. ఆవాల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి మితంగా వాడటం మంచిది.

కారం: ఘాటైన మిరపకు వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. కారంలో విటమిన్‌ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు నుంచీ త్వరగా ఉపశమనం లభిస్తుంది.

పసుపు: పసుపును తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. క్యాన్సర్‌ కారకాలను ఇందులోని పోషకాలు అడ్డుకుంటాయి. ఎసిడిటీ ఉన్నవారు పసుపును నీళ్లలో కలుపుకుని తాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అజీర్తి దూరమవుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కాళ్లవాపులూ, కీళ్లనొప్పులూ తగ్గుతాయి
.

ఇంగువ: రోజూ చేసే వంటల్లో ఇంగువ వాడటం వల్ల గ్యాస్‌ సమస్యలు ఇబ్బంది పెట్టవు. కడుపునొప్పి, వూపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌, నరాల బలహీనత వంటివి తగ్గుముఖం పడతాయి.
లవంగాలు: గొంతు గరగర బాధిస్తున్నప్పుడు లవంగాలు చప్పరిస్తే మంచిది. ఆస్తమా ఉన్నవారు లవంగాలను నీళ్లలో మరిగించి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పంటినొప్పి ఉన్నవారు లవంగ నూనె వాడితే త్వరగా నొప్పి తగ్గుతుంది.

దాల్చిన చెక్క: వాంతులవుతున్న భావన కలిగితే దాల్చినచెక్క చప్పరించాలి. పంటినొప్పీ, చిగుళ్ల వాపునకు దాల్చినచెక్కపొడి బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడంలోనూ దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతుంది.

                                      (ఈనాడు పేపర్ లోని ఆర్టికల్ ఆధారంగా)

Monday, March 14, 2016

ఒక గ్రామంలో ఊరుచివర ఒక మర్రిచెట్టు క్రింద ఒక సాధువు తపస్సు చేసుకొంటూ ఊరు వారు పెట్టిన భిక్షతో కాలం గడుపుతూ ఉండేవాడు. అతనికి మంచిసిద్ధులు, మహిమలు ఉన్నాయని ఆ గ్రామంలో వాళ్ళు నమ్మేవారు.
ఒకరోజు అక్కడికి దగ్గరలోని ఒక ఇంటిఅరుగు మీద ఒక కుక్క పడుకొని ఉంటే అది చూసి ఇంటియజమాని ఇంట్లోంచి ఒక కొరకంచు తీసుకొచ్చి దాంతో కుక్కని గట్టిగా కొట్టాడు. ఆకొరకంచు తగిలినదెబ్బకు, దానివల్లకాలిన మంటకు ఆకుక్క చాలాబాధగామొయ్యో మంటూఅరుస్తూ ఆసాధువు ఉండే చెట్టుకేసి పరిగెత్తింది..
అదిగమనించినసాధువుకు కుక్కపరిస్థితికి చాలా జాలికలిగింది. అతను ఆకుక్క పైని కమండలంలోని నీళ్ళుచల్లి యిలాఅన్నాడు. చూడు, నిన్ను ఆ యింటి యజమాని నిష్కారణంగా బాధించాడు. అతనికి ఏం శిక్ష వెయ్యమంటావో చెప్పు అని అడిగాడు.
దానికి ఆ కుక్క యిలా బదులు చెప్పింది. స్వామీ అతన్ని అనుకొని ఏం లాభం, నేను పూర్వజన్మలో చేసుకొన్న పాపం నన్ను బాధిస్తోంది. అలాకాదు అతను ఏ కారణం లేకుండానిన్ను బాధపెట్టాడు.ఏదోఒక శిక్ష చెప్పు అన్నాడు సాధువు.
అప్పుడు కుక్క అంది మహానుభావా అయితే ఆ యింటి యజమాని ఏదైనా ఒక మంచి దేవస్థానంలో ఉద్యోగిగా కుదురుకొనే ఏర్పాటు చెయ్యండి అని. సాధువు అదేమిటి అలా అంటావు శిక్ష అడిగితే నువ్వు అతనికి దేవాలయంలో ఉద్యోగం ఇప్పించామంటున్నావేమిటి అన్నాడు.
ఏంచెప్పమంటారు స్వామీ నేనుగతజన్మ లో ఒక దేవస్థానంలో ఉద్యోగిని. అప్పుడు నేను చెయ్యని తప్పుడుపనులులేవు. దేవుడంటే భీతి ఉండేది కాదు. పాపభయం లేకుండా దేవుడి సొమ్ముని తినేసేవాడిని. ఎందరినో భక్తులను, అర్చకులను అవమానించేవాడిని. వేదపండితులను చులకనగా చూసే వాడిని. ఆశ్రితులను, లంచం ఇచ్చేవారిని గౌరవంతో చూసేవాడిని. వారికి శీఘ్రమే దైవదర్సనం కల్గించేవాడిని. ఇదిగో ఆ పాపాల ఫలితమే ఇప్పుడీ కుక్క జన్మ. వాడు కూడా నాలాగే అవుతాడు అదే వాడికి శిక్ష అంది.

  ఆంజనేయస్వామి సిందూరాన్ని పెట్టుకుంటే లాభాలు!

1. ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.

2. ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది. 

3.ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది. 

4. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.

5. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతరు. 

6. విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు. 

7. లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది.
 
8. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.

9. ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ నెరవేరుతాయి.

10. ఆంజనేయస్వామికి సిందూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుంది.
ఆంజనేయ స్వామి సింధూరం ధరించడం  వలన పై లాభాలు కలుగుతాయని 
పెద్దలు చెపుతారు.

శుభోదయం ../\..


షిరిడిలో హారతి

షిరిడిలో  హారతి
తెల్లవారు జాము మూడున్నర. కృష్ణపక్షపు చివరిరాత్రులు. షిరిడీ క్షేత్రంలో ప్రాతకాల సంరంభం మొదలయ్యింది. ఎన్నో ఏళ్ళ తరువాత సూర్యోదయ పూర్వ హారతి చూడటం కోసం సమాధి మందిర ప్రాంగణంలో అడుగుపెట్టాను. మరొక రెండురోజుల్లో ముగిసిపోతున్న మాఘమాసం. ప్రాంగణంలో అడుగుపెడుతూనే నా చిన్నప్పటి గ్రామాల నిర్మలత్వాన్ని తలపిస్తూ వేపపూల తీపిగాలి. ఫాల్గుణమాసం రాబోతున్న సూచనగా విద్యుద్దీపాల వెలుతుర్లో మిలమిల్లాడుతున్న కొత్త చిగుర్లు. సమాధిమందిరం పక్కనే ఉండే గురుస్థానం దగ్గరికి చేరుకునేటప్పటికి తొలివేపపూల పరిమళం నన్ను తడిపేసింది. అప్పటికే అక్కడ కొందరు భక్తులు చేరుకున్నారు. వాళ్ళంతా ఆన్ లైన్లో ముందే హారతి దర్శనం కోసం టికెట్లు తీసుకున్నవాళ్ళు. నేను మొదటిసారి 1993 లో షిరిడి దర్శించినప్పుడు, ఇంత రద్దీ లేదు. నేరుగానే సూర్యోదయహారతి దర్శనానికి పోగలిగాంనాలుగు కాగానే దేవస్థాన పౌరసంబంధాధికారి అక్కడకొచ్చి రిజిస్టరు తెరిచి ఒక్కొక్కరినీ పేరుపేరునా పిలవడం మొదలుపెట్టాడు. మా వంతు రాగానే మేం కూడా నెమ్మదిగా లోపలకి అడుగుపెట్టాం.సమాధిమందిరంలో మేం అడుగుపెట్టేటప్పటికే అక్కడ చాలామంది ముకుళిత హస్తాలతో బాబా ను చూస్తూ నిలబడి ఉన్నారు. ఆయనమీద ప్రకాశవంతమైన లేతనీలం రంగు వస్త్రం. సమాధిపైన కూడా అదే రంగు చద్దరు పరిచిఉన్నారు. గంగ ఒడ్డున సన్న్యాసులు సూర్యోదయం కోసం నిశ్శబ్దంగా వేచి ఉన్నట్టు అక్కడంతా ఒక పవిత్రప్రతీక్ష.
అప్పుడు గులాబితోటలోంచి కమ్మ తెమ్మెర వీచినట్టు భూపాల రాగంలో ఒక కీర్తన మొదలయ్యింది.....
ఉఠా ఉఠా సకల జన..
నాలో ఏదో ప్రకంపన. పురాతన స్మృతిలోంచో, అడవుల్లోంచో, సాగరతీర సైకత భూమి మీంచో ఎవరో పిలుస్తున్నారు. నాది కాని దేశంలోనో, గ్రామసీమల్లోంచో నేను పోతున్నప్పుడు అపరిచిత గృహంలోంచో ఎవరో ఒక తల్లి, అక్క, చెల్లి, 'నాన్నా ' అన్నయ్యా ' అంటూ పిలుస్తున్నట్టు. మా ఊళ్ళో రామకోవెల దగ్గర రాత్రి దీపం పట్టుకుని నిలుచుని మా అమ్మ 'నాగమ్మా ' అని పిలుస్తున్నట్టు.
ఉఠా ఉఠా సకల జన
వాచే స్మరావా గజానన
గౌరీహరాచా నందన
గజవదన గణపతి..
ఎవరు రాసారో తెలియని పారంపరిక గణేశ స్తుతి నన్నెందుకు ఇంతలా చలింపచేస్తోంది.
కీర్తన ఎప్పుడు ముగిసిందో తెలియలేదు.అప్పుడు మరొక కీర్తన-
ఘనశ్యామ సుందరా శ్రీధరా అరుణోదయ ఝాలా
ఉఠిలవకారీ వనమాలీ ఉదయాచళీ మిత్ర ఆలా..
స్వరం, ఎవరో మరాఠీ భావుకుడు దేశ్ రాగంలో ఆలపించిన ప్రభాత వందనం నా సమస్త అసిత్వాన్నీ చూర్ణం చెయ్యడం మొదలుపెట్టింది. ఇది భక్తికాదు, ప్రార్థనకాదు, జీవిత స్ఫురణ. పొద్దున్నే కొలనులో ఎర్ర తామర రేకులు విచ్చుకున్నంత మృదువుగా మనిషిలో ఆత్మ విప్పారడం. వేపచెట్టు లోపల్నుంచీ విరిగి పైకి తీపిగా పొంగి పూలుగా విచ్చుకోవడం. నాలో కూడా ఏదో జరుగుతోందని తెలుస్తోంది. నా చేదు విరిగిపోవడం మొదలయ్యింది. కాలం మలుపు తిరిగేవేళల్లో నేను పోగొట్టుకున్న ప్రేమల విహ్వల స్ఫురణని తొలిజాము నాలో నిద్రలేపుతోంది? ఒక రోజు మేలుకోవాలని కోరుకునే కోరిక నా హృదయాన్ని, ఒక పిల్లగాలికి కూడా కుండపోతగా వర్షించే కారుమబ్బులాగా, ఎందుకు మార్చేస్తోంది?
ఆనందకందా ప్రభాత ఝాలీ ఉఠీ సరలీ రాతీ
కాఢీ ధార్ క్షీరపాత్ర ఘేవుని ధేను హంబరతి
లక్షితాతీ వాసురే హరీ ధేను స్తనపానాలా..
నా చిన్నప్పుడు సెలవులయిపోయాక మా ఇంటినుంచి బయట అడుగుపెడుతున్నప్పుడు మా అమ్మ ఇంటిముంగట నిల్చున్నప్పుడు, లోపలనుంచీ పొరలివచ్చే బెంగలాగా, ఒక ఉత్తాపతరంగం నాలోపల్నుంచి కట్టలు తెంచుకోవడం మొదలయ్యింది.
ఉండబట్టలేకపోయాను, ఏడ్చేసాను.
అక్కడందరి దృష్టీ బాబా మంగళమూర్తిపైనే ఉంది. అసలక్కడ ఎవ్వరికీ మరొకరి ధ్యాస లేదు.
కీర్తన ముగుస్తూనే సుప్రసిద్ధ మంగళగీతం 'జయజగదీశ హరే' మొదలయి, పూర్తయిపోయింది కూడా.నా కళ్ళట్లా వర్షిస్తూనే ఉన్నాయి. ఎవరో నా హృదయంలో చెయ్యిపెట్టి గుండెకి అడ్డుపడ్డ క్లేశాన్నో ఊడబెరికేసారు. ఎంత దయామయ చర్య!అప్పుడు నేను ప్రభాతహారతి గీతాలు వినడానికి పూర్తిగా అర్హుణ్ణైనానిపించింది...
ఒక క్షణం నిశ్శబ్దం....4.30....కాకాడ హారతి గీతాలాపన మొదలయ్యింది.
'జోడునియా కర చరణి-ఠేవిలా మాథా
పరిసావీ వినంతీ మాఝీ-పండరీనాథా'
తుకారాములు పాండురంగని ముందు పాడిన పాట.
పదం ముగిస్తూ తుకా ఇలా అంటున్నాడు:
'నేను ఎక్కణ్ణుంచి ఎంత విలువలేని మాటల్తో నిన్ను వేడుకున్నా కూడా ఒక్క సారి నిన్ను పేరుపెట్టి పిలవగానే నా బంధాల్ని నీ స్వహస్తాలో తుంచెయ్యి ప్రభూ ' ....ఎక్కడి పండరిపురం, ఎక్కడి షిరిడి బీద మరాట్వాడా ప్రాంతానికి షిరిడినే పండరిపురం చేసాడు సాయినాథుడు. ప్రతిరోజూ తుకారాం కీర్తనతో తన గ్రామాన్నీ, తనని నమ్ముకున్న బృందాన్నీ మేల్కొల్పడం ఎంత అద్భుతం!
కీర్తన ముగుస్తూనే జనాబాయి గీతం.
'ఉఠా పాండురంగా ప్రభాత సమయో పాతలా
వైష్ణవ్యాంచా మేలా గరుడ పారీదాటలా'
దేవుణ్ణి మేల్కొల్పడం ఎంత గొప్ప చారుచర్య! ఎవరు ఎవరిని మేల్కొల్పుతున్నారు? ఆండాళ్ నుంచి జనాబాయి దాకా ప్రభాత వేళ భగవంతుణ్ణి నిద్రలేపడంలో అనుభవించిన స్ఫూర్తి ఎట్లాంటిదో కదా! ప్రజల్ని మేల్కొల్పిన వైతాళికులు, ఒక బంకిం, ఒక గురజాడ, ఒక భారతి, ఒక నజ్రుల్ ఇస్లాం , ఒక ఫైజ్, ఒక హిక్మత్, ఒక నెరుదా లు అనుభవించిన జీవితసాఫల్య స్ఫూర్తికీ, ప్రభాతకీర్తనలకీ ప్రాయికంగా తేడా ఏముంది?
షిరిడిలో వందేళ్ళ ముందు ఇంకా తెల్లవారకుండానే వెలిగించిన కాగడాతో సాయిబాబాకి హారతి ఇస్తూంటే పండితులు, పామరులు, నిరక్షరాస్యులైన గృహిణులు అంతా తన్మయులై ఆయన్నే చూస్తూ పరవశించిన దృశ్యాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాను. షిరిడిలో హారతి సంప్రదాయం ఎప్పుడు మొదలయ్యిందో ఇతమిత్థంగా చెప్పలేకపోయినా, ఒక అంచనా ప్రకారం ఇది 1910 తర్వాత మొదలై, బాబా మహాసమాధి చెందేటంతదాకా, అంటే, 1918 దాకా ఎనిమిదేళ్ళపాటు నిరాఘాటంగా కొనసాగింది.
కాని కాకడ హారతి, రాత్రి పడుకునే ముందే ఇచ్చే సేజ్ ఆరతిని ఆయన మసీదులో పడుకునే రోజు కాక, రోజు విడిచి రోజు చావడిలో పడుకునేటప్పుడు మాత్రమే అనుమతించేవారట. ఎందుకని? మేలుకొలుపు, పవళింపు హారతులు సేవలు కాబట్టి, అవి హిందూ సంప్రదాయాలు కాబట్టి, ఆయన వాటిని మసీదులో అనుమతించలేదు.చావడిలో మాత్రమే అనుమతించారు. అద్భుతమైన స్పష్టతని సాయిబాబా తన జీవితమంతా చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా ప్రతి ఒక్క అంశంలోనూ చూపిస్తూ వచ్చారు,జాగ్రత్త పడుతూ వచ్చారుసాయిబాబా హిందువా? ముస్లిమా? ఇందులో నిజమేదో తెలుసుకోవాలన్న్న తన సమకాలిక ప్రజల కుతూహలాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఎంతో దయార్ద్రహృదయంతో ధ్వంసం చేస్తూనే వచ్చారు.హిందూ-మహ్మదీయ మైత్రికోసమూ, వాళ్ళని కలిపి ఒక కుటుంబంగా నిలపడంకోసమూ సాయిబాబా జీవించారని చెప్పడం ఆయన్ని అర్థం చేసుకోవడంలో ఒక పద్ధతి. ఆయన హిందువులకు హిందువు, మహ్మదీయులకు ముస్లిం అని చెప్పుకోవడంలో ఒక ఊరట ఉంది. కాని సాయిబాబా తనను హిందువుగా భావించేవాళ్ళకు ముస్లింగానూ, ముస్లింగా భావించేవాళ్ళకు హిందువుగానూ కనిపిస్తూ, వినిపిస్తూ, వివరిస్తూ వచ్చారు. మీ గురువెవరని ముస్లిములు అడిగినప్పుడు వెంకూసా అని, హిందువులు అడిగినప్పుడు రోషన్ షా అని జవాబిచ్చారాయన. ఒకరోజు మసీదులో, ఒక రోజు చావడిలో. ఒకవైపు నైష్టిక శ్రోత్రియుడిలాగా మసీదులో నిత్యాగ్నిహోత్రం, మరొకవైపు ముస్లిం ఫకీర్ లాగా చావడిలో చిలిం వెలిగిస్తూ వచ్చారు. చివరికి,తాను ప్రతిపాదించిన రెండు మాటలు-'శ్రద్ధ', 'సబూరీ' లే చూడండి. 'శ్రద్ధ' సంస్కృత పదం, ఉపనిషత్తుల పదం. 'సబూరీ' ఆరబిక్ పదం. అది సబర్ అనే ధాతువునుంచి ఉత్పన్నమైంది.ఓపిక, నిగ్రహం, కట్టుబడి ఉండటం అని దానికి అర్థాలు.
నా ఇంటికి తూర్పు ఒక వాకిలి, పడమట మరొక వాకిలి అని కబీర్ అన్నమాటలకి నిలువెత్తు ఉదాహరణ సాయిబాబాఅందుకనే, ఒక న్యాయవిచారణలో భాగంగా కోర్టు ప్రతినిధి ఆయన్ను మీ మతమేమిటి అని అడిగినప్పుడు తనది కబీర్ మతం అని చెప్పాడాయన.
నా ఆలోచనల్లో నేనుండగానే ప్రభాతకీర్తనలు ఒకదానివెనక ఒకటి సాగిపోతున్నాయి. కృష్ణ జోగేశ్వర్ భీష్మ, నామదేవులు, తుకారామ మహరాజు, దాసగణు మొదలైన వారందరి ప్రేమతో, ఆర్తితో, హృదయాన్ని చీల్చుకుని వచ్చిన గీతాలతో మందిరమంతా మోగిపోతూ ఉంది. సంగీతవాద్యాల సుస్వరాలు ఉత్సవవాతావరణాన్ని సృష్టించాయి. వెలుతురులో ఒకటి రెండు సార్లు కన్నార్పకుండా బాబా మనోహరమూర్తిని చూసాను.
లోకమాన్య బాలగంగాధర తిలక్ మిత్రుడూ, సుప్రసిద్ధ న్యాయవాది అయిన జి.ఎస్,కపర్డే ఒకచోట రాసుకున్న వాక్యాలు గుర్తొచ్చాయి. ఒక ప్రభాతవేళ తాను కాకడహారతికి హాజరయినప్పుడు సాయిబాబా ఎంతో ప్రసన్నంగా చిరునవ్వు నవ్వారనీ, అట్లాంటి చిరునవ్వును ఒక్కసారి చూడటానికేనా ఏళ్ళ తరబడి అక్కడ ఉండిపోవచ్చునని రాసుకున్నాడాయన (షిరిడీ డైరీ,7.1.1912).
చిరునవ్వు ఒక మనిషిది. హిందువు, ముస్లిమూ కాని మనిషిది. దేశమిప్పుడు హిందూసమాజంగానూ,ముస్లిం శిబిరంగానూ చీలిపోతున్న కాలంలో ఏడీ అట్లాంటి మనిషి? ఎక్కడ అట్లాంటి చిరునవ్వు?




                        

Total Pageviews