Wednesday, March 16, 2016

గుమ్మడి కాయ అనగానే మనకి గుర్తొచ్చేది దిష్టి. ఇంట్లోని మహిళలు దిష్టి తీయడానికి ఎక్కువగా గుమ్మడికాయనే వాడుతుంటారు. గృహప్రవేశం నుండి కొత్త వెహికిల్స్ దాకా ఇలా ఏ శుభకార్యం అయినా గుమ్మడికాయ కొట్టే మొదలుపెడతారు. వింటర్ సీజన్లో ఎక్కువగా లభించే ఈ గుమ్మడికాయలు కేవలం దిష్టికి మాత్రమేనా…? చూద్దాం.
మన పూర్వీకులు ఏర్పరచిన ప్రతి పండుగ, ఆచార సంప్రదాయాల వెనుక ఏదో ఒక మానవ ప్రయోజనం ఇమిడి ఉంటుంది. మనం తయారు చేసుకొని తినే వంటకాలు, అందులో వినియో గించే పదార్థాలు అన్నీ మన ఆరోగ్యానికి దివ్య ఔషధాల్లా పనిచేసేవే. మన భారతీయ సంప్రదాయక వంటకాలలో గుమ్మడి కాయకు మంచి స్థానమే ఉంది. గుమ్మడికాయలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, బి1,సి, డి, బి 12వంటి ప్రధానమైన విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయని, ఫ్లెవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందని, చర్మాన్ని ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
గుమ్మడిలో ఉండే విటమిన్ ఇ చర్మంను సాఫ్ట్ గా మార్చడంతో పాటు సన్ రాషెస్ ను మరియు స్కిన్ అలర్జీలను నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
గుమ్మడికాయలో విటమిన్ ఎ మరియు పొటాసియం అధికంగా ఉండటం వల్ల… ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
గుమ్మడికాయలో విటమిన్ సి మరియు ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల చుండ్రుకు కారణం అయ్యే ఇన్ఫెక్షన్స్ ను అరికడుతుంది . తలలో డ్రైనెస్ వల్ల చుండ్రు ఏర్పడకుండా తలకు తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది . గుమ్మడి రసాన్ని పెరుగులో మిక్స్ చేసి తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య దరిచేరదని బ్యూటీషియన్లు అంటున్నారు.
గుమ్మడిలో జింక్, విటమిన్ సి ఉండటం వల్ల కాలిన గాయాలకు మందులా పనిచేస్తుంది. గాయాలైన ప్రదేశంలో లేదా ఏవైనా కీటకాలు కుట్టిన ప్రదేశంలోనైనా గుమ్మడి జ్యూస్ ను అప్లై చేస్తే త్వరగా తగ్గు ముఖం పడతాయి.
నారింజ రంగులో ఉన్న గుమ్మడికాయలో బీటా కెరోటిన్ ఎక్కువ మోతాదులో ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది గుండె వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు.
గుమ్మడికాయ ప్రొస్టేట్ గ్రంథి వాపుతో బాధపడే వారికి ఉపశమనాన్ని ఇస్తుంది.
గుమ్మడికాయ తినడం వల్ల కడుపులోని నులిపురుగుల చనిపోతాయి. దాని వల్ల బలహీనత తగ్గి పిల్లలు చురుగ్గా ఉంటారని పిల్లల వైద్యులు చెబుతున్నారు.
100 గ్రాముల గుమ్మడికాయలో 62.6% తేమ, 48.4% కొవ్వు, 31% ప్రొటీన్లు ఉండటం వల్ల చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.
గుమ్మడి జ్యూస్ లో కొద్దిగా తేనె, విటమిన్ ఇ ఆయిల్, పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ గా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేసి, ముడుతలను నివారిస్తుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

No comments:

Post a Comment

Total Pageviews