పరమ రమణీయ మహిళా మణీ!
శతసహస్ర వందనం! సాష్టాంగ వందనం!!
యుగ యుగాలుగా,
అమ్మలగన్న అమ్మవై,
ముత్తాతమ్మవై, తాతమ్మవై,
నానమ్మవై, అమ్మమ్మవై,
అమ్మవై, అత్తమ్మవై,
అక్కవై, చెల్లివై,
మిత్రురాలివై, చెలివై,
ఆలివై, మగాడిలోసగమై అర్దాంగివై,
కూతురువై విజయం వెనుక నీవై
తరతరాలకు జన్మనిచ్చి,
తిట్టి, కొట్టి, లాలించి, పాలించి,
జోలపాడి, ప్రోత్సహించి,
ఉత్సాహపరచి, సంస్కరించి,
మగాడి హృదయాన్నితస్కరించి,
ఉత్తేజ పరచి, ఉల్లాసపరచీ
ఆప్యాయతానురాగ ప్రేమామృతాన్నిపంచి,
సృష్టిలో అందాన్ని, ఆనందాన్ని పెంచి,
సహనానికి ప్రతీకవై...ప్రతిఫలం ఆశించని
పరమ రమణీయ మహిళా మణీ!
తీర్చలేని నీ రుణానికి శతసహస్ర వందనం!
మరువలేని నీ త్యాగానికి మా సాష్టాంగ వందనం!
సత్యసాయి - విస్సా ఫౌండేషన్.
No comments:
Post a Comment