తెలుగు కనబడితే సరిపోదు , వినబడాలి..
తెలుగు వినబడితే సరిపోదు , కనబడాలి..
తెలుగు కనబడాలి, వినబడాలి కూడా!
తెలుగు వినబడితే సరిపోదు , కనబడాలి..
తెలుగు కనబడాలి, వినబడాలి కూడా!
నేటికాలంలో ఎంతోమంది విద్యార్థులకు తెలుగు మాట్లాడటం వచ్చుకాని, మాట్లాడుతున్న దాన్ని రాయమంటే రాయలేరు! వత్తులు, దీర్ఘాలు మాయం చేశేస్తున్నారు. దాదాపు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలన్నీ కూడా తెలుగును ఏదో పెట్టామంటే పెట్టామన్నట్టుగా కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు అమ్మభాష విలువను, గొప్పదనాన్ని, విశిష్ఠతను తెలియచెప్పటంలో ఈ పాఠశాలలన్నీ విఫలమయ్యాయి...
ఇక ఇంట్లో వాతావరణం చూస్తే, మావాడు అది కావాలి, ఇది కావాలి , ఆ స్థాయికి చేరాలంటే ఆంగ్లాన్నే ఉద్ధరించాలి అనుకుంటూ తల్లిదండ్రులు ఆంగ్లానికిచ్చినంత ప్రాముఖ్యత తెలుగు భాషకు ఇవ్వటంలా, మాట్లాడుతున్నారుగా చాల్లే అనుకుంటున్నారే తప్ప తెలుగును వారు రాయగలరా లేదా అని మాత్రం పట్టించుకోవటంలా... అమ్మభాష రానివారు లక్షలు సంపాదించేవాడైనా పనికిమాలినవారే...
ఇక మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతే చెప్పేవి ఏవీ అమలు చేయవు. తెలుగుకు అది చేస్తాం, ఇది చేస్తాం, తెలుగును ఉద్ధరిస్తాం అంటూ ప్రగల్భాలే తప్ప దాన్ని ఆచరణలో చూపిన నాథుడు లేడు. తెల్లవారితే ఎన్నో ఉత్తర్వులు విడుదల చేసే మన తెలుగు ప్రభుత్వాలు అవి తెలుగు భాషలో సంపూర్ణంగా విడుదల చేయయటంలో విఫలం అవుతున్నాయి.
తెలుగు భాషకు ఏమీ కాదు, ఎందుకంటే తమ తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తారో, గౌరవిస్తారో తెలుగు భాషను అంతగా ప్రేమించేవారు, గౌరవించేవారు ఉన్నారు కనుక.
ముందు నేను మారాలి, తరువాత ఇళ్లు మారాలు, తరువాత సమాజాన్ని మార్చాలి.!
తెలుగు భాషను ఉద్ధరిస్తున్న భాషాభిమానులందరికీ నమఃసుమాంజలి..
తెలుగు భాష వర్థిల్లాలి..
తెలుగుతల్లి ప్రభ కడలి అంచులు దాటాలి!
తెలుగు భాష వర్థిల్లాలి..
తెలుగుతల్లి ప్రభ కడలి అంచులు దాటాలి!
జై తెలుగుతల్లి!
దయచేసి #పంచుకోండి!
No comments:
Post a Comment