Monday, March 14, 2016

చీమకుర్తి

చీమకుర్తి
చీమకుర్తివెళ్ళినప్పుడే మరొక రెండు అద్భుతమైన ప్రయత్నాలు కూడా చూసాను.
డాజవహర్ గారు చీమకుర్తిలో పేరు పొందిన వైద్యుడు.వారి కుటుంబ సభ్యులంతా కూడా వైద్యులేఆయన ఇల్లుఆసుపత్రి ఒక్క ప్రాంగణంలోనే ఉన్నాయిపాతకాలపు ఇళ్ళల్లోని ధారాళమైన గాలి,నలుగురికోసం తెరిచిన ముంగిలిలంకంత పెరడు ప్రాంగణంలోనే ఒక పక్కఆయన 20 మంది అంధబాలబాలికలకోసం నడుపుతున్న హాష్టలునా అన్నవాళ్ళెవ్వరూ లేని  పిల్లల్ని వాళ్ళ చిన్నప్పుడే తెచ్చి తమదగ్గర పెట్టుకున్నామనీగత పది పదిహేనేళ్ళుగా  పిల్లలు తమ దగ్గరే పెరిగిచదువుకునిపై చదువులకి వెళ్తూ ఉన్నారనీ జవహర్ చెప్పారు పిల్లల ఆలనా,పాలనా తామెవ్వరికీ అప్పగించలేదనీ,తమ కుటుంబమే చూసుకుంటూ ఉంటూందనీప్రభుత్వం నుంచి కనీసం మాట సాయం కూడా తీసుకోలేదనీ చెప్పారు. 'ఇప్పుడంటే ఇక్కడ గ్రానైట్ పడి చీమకుర్తి ఇట్లా కనబడుతోందిగానీఇదంతా చాలా చాలా వెనకబడినప్రాంతమే కదా వైకల్యానికి చాలావరకూ మేనరికాలే కారణం. 'అన్నారాయన. 'ఇటునుంఛి ఎటు వెళ్ళినా ఫ్లోరైడ్ నీళ్ళుమెడలు తిప్పలేరు.కీళ్ళు పనిచెయ్యవుచిన్నవయసులోనే వృద్ధాప్యం ముంచుకొస్తుంది 'అని కూడా అన్నారాయనడా.జవహర్ చేస్తున్న మరొక గొప్ప ప్రయత్నంప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు చెయ్యడంబహుశా దేశంలోనే కళాశాల స్థాయిలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న చోటు అదేననుకుంటాను.దాంతో 40 మంది మాత్రమే పిల్లలుండి మూసేస్తారనుకున్న కాలేజి ఇప్పుడు 250 మంది పిల్లలతో కలకల్లాడుతూందన్నారుబియ్యంకాకతక్కిన ఖర్చుల మీద నెలకి 60-70 వేలదాకా అవుతుందనీఅదంతా అయిదారుగురు మిత్రులు భరిస్తూ ఉన్నారనీ చెప్పారు పిల్లలతో మాట్లాడుతూండగా మాఘ చంద్రుడు ఉదయిస్తూన్నాడుఅంతదాకా చీకటి పొరకమ్మిన ప్రాంగణం మీద వెండి రాలడం మొదలయ్యింది.  'మా పిల్లలు పాటలు పాడతారువింటారా 'అన్నారు జవహర్ హాస్టలు పైకప్పుమీంచి రాలుతున్న వెన్నెల్లో ఒక పిల్లవాడు 'అమ్మా నను కన్నందుకు వందనాలు..' అంటో పాడటం మొదలుపెట్టాడునా హృదయం చలించిపోయింది తల్లిఆమె ఎక్కడ ఉందోగానిఈపాట వింటే కళ్ళనీళ్ళ పర్యంతమైపోతుందికదా అనిపించింది.
అక్కణ్ణుంచి మేమా రాత్రి పడమటి నాయుడి పాలేనికి వెళ్ళాంమంచికంటి వెంకటేశ్వర రెడ్డి గ్రామీణబాలబాలికల్తో విద్యారంగంలో చేపట్టిన అద్భుతమైన ప్రయోగ శాల.  గత శతాబ్దంలో యూరోప్ లో,మొదటి ప్రపంచ యుద్ధం సంభవించినప్పుడూ,రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతా కూడా చాలా మంది విద్యావేత్తలు గొప్ప ప్రయోగాలు చేపట్టారుయుద్ధం వల్ల మానసికంగా గాయపడ్డ చిన్నారులకోసం పాఠశాలలు తెరిచి విద్య నేర్పడంలో ఎన్నో కొత్త పోకడలు పోయారుఅలాగేరష్యాలో టాల్స్టాయిమకరెంకోలూనాషార్కీభారతదేశంలో టాగోర్గాంధీకృష్ణమూర్తిఆఫ్రికాలో జోమోకెన్యెట్టాలాటిన్ అమెరికాలో జోస్ మార్టివంటివారుకూడా చాలా ప్రయోగాలు చేసారు ప్రయోగాలగురించి వినడంచదవడం దానికదే గొప్ప విద్యతెలుగు నేలమీద కూడా అటువంటి ప్రయోగాలు చేస్తున్నవారు లేకపోలేదు.కాని వారి ప్రయోగాల గురించి మనకే తెలియదుఇక తక్కినప్రపంచానికి తెలిసే అవకాశమెక్కడిది?
'అరుగులన్నిటిలోను  అరుగు మేలు ' అని అడిగితే 'పండితులు కూర్చుండు మా అరుగు మేలు ' అన్నట్టుపోరాటాలన్నిటిలోనూ పోరాటం గొప్పదని అడిగితేవిద్యకి సంబంధించిన పోరాటాలూప్రయత్నాలే సర్వోన్నతమైనవని నమ్ముతాను నేనుఎందుకనో తెలుగు నేల ఇంకా రాజకీయ పోరాటాలే ఎక్కువ ఫలప్రదాలని నమ్ముతూ ఉందిప్రతి రాజకీయ పోరాటమూ,దాని వెనక ఒక విద్యా సంస్కరణ లేకపోతేఅంతిమంగా దారుణవైఫల్యాన్ని చవిచూస్తుందని నేను స్పష్టంగా తెలుసుకున్నాను.
1857 లో దేశమంతా మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో తలమున్కలై ఉంటేఈశ్వర చంద్ర విద్యాసాగర్ భుజాన ఒక సంచీ తగిలించుకుని బర్డ్వాన్,మిడ్నపూర్చిట్టగాంగుల్లో బాలికల కోసం పాఠశాలలు తెరవడంలో నిమగ్నుడైపోయాడుభారత జాతీయ కాంగ్రెస్ విప్లవాత్మక జాతీయ పోరాటాన్ని నడుపుతుంటేస్వామి వివేకానందులు మాస్ ఎడ్యుకేషన్ గురించి దిక్కులు పిక్కటిల్లేలా ఘోషిస్తూ ఉన్నారుదండకారణ్యమంతా గిరిజన తిరుగుబాట్లతో రక్తసిక్తమవుతుంటేగిడుగు సవరభాషలో వాచకాలు రాసిగిరిజన భాషమాధ్యమంలో ప్రపంచంలోనే తొలిసారి పాఠాలు చెప్తూ ఉన్నాడువారు నిజమైన విప్లవకారులువారు నిజమైన వైతాళికులు సంగతి తెలిసినవాడు కనుకనే గాంధీజీ కూడా తన జీవిత చరమాంకంలో నయీ తాలీం కి అంకురార్పణ చేసాడుఇప్పుడు మన సమాజంలో,ముఖ్యంగా మన గ్రామాల్లో నెలకొన్న వాతావరణం యుద్ధవాతావరణంలాంటిదేఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా తీవ్రమైనదీ,దారుణమైనదీనూధనికులు మరింత ధనికులుగా,పేదలు మరింత నిస్సహాయులుగా మారుతున్న  కాలం భారతదేశాన్ని ఈస్టిండియా కంపెనీ దోచుకున్న కాలంకన్నా భీకరమైన కాలం పరిస్థితిని ఎత్తి చూపడానికిధిక్కరించడానికీమార్చడానికి ఎందరో ఉన్నారురాజకీయ  నాయకులుపాత్రికేయులువిప్లవకారులు,కవులురచయితలుకాని కనబడనిదల్లాఒక విద్యాసాగర్,ఒక గిడుగుఒక గిజుభాయి మాత్రమేఅందుకనేఎవరు విద్యారంగంలో మౌలిక ప్రయోగాలు చేస్తుంటే వాళ్ళనే నా అభిమాన హీరోలుగా భావిస్తున్నానువాళ్ళెక్కడున్నా పోయి పరిచయం చేసుకోవాలనీవారి ప్రయోగాల్నీప్రయత్నాల్నీ స్వయంగా పరిశీలించాలనీ,నిశితంగా నిగ్గు తేల్చుకోవాలనీ అనుకుంటానుఇప్పుడు చీమకుర్తి మండలంలో పడమటి నాయుడిపాలేని కి కూడా అందుకే వెళ్ళానుఅక్కడ మంచికంటి వెంకటేశ్వరరెడ్డి అనే ఒక ఉపాధ్యాయుడు ఎట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాడో తెలుసుకోవాలనుకున్నవాళ్ళు మంచికంటిరాసిన 'శాంతివనంపిల్లలుఅనుభవాలుప్రయోగాలు '(2014) అనే పుస్తకం చదవాలి. (పుస్తకం కావలసినవాళ్ళు santivanam@gmail.org ను సంప్రదించవచ్చు.) అతడి ప్రయత్నాల వెనక డాక్టర్ కొర్రపాటి సుధాకర్ అనే ఒక .ఎన్.టి సర్జన్ ఉన్నారు. (ఆయన మా కొర్రపాటి ఆదిత్యకి బాబాయి అని తెలిసినప్పుడు నాకెంత సంతోషమనిపించిందో).   అక్కడ ఉన్నంతసేపూ,అతడి ఇంట్లో అతడితోపాటే ఉంటున్నపిల్లల్తో గడిపేను.వాళ్ళు వేసిన బొమ్మలురాసిన కవితలు చూసానువిన్నానుఒళ్ళంతా ఉత్సాహం చిమ్ముతున్న దీపకళికలు వాళ్ళు కాంతిని తక్కిన ప్రపంచం చూడటానికి ఎన్ని కాంతిసంవత్సరాలు పడుతుందో!
చీమకుర్తి1
            ఆదివారం చీమకుర్తి పబ్లిక్ స్కూల్లో సైన్స్ వేడుకల ముగింపు సమావేశానికి రమ్మని సి..ప్రసాద్ గారు రమ్మంటే వెళ్ళానుప్రసాద్ గారు తెలుగు నేల మీద నడయాడుతున్న ఒక అద్భుతమైనఅద్వితీయుడైన వ్యక్తిపాఠశాలలకి వెళ్ళడమూపిల్లలతో,ఉపాధ్యాయులతో,తల్లిదండ్రులతో మాట్లాడటమూ జీవితంగా మార్చుకున్న వ్యక్తిచీమకుర్తి ఒంగోలునుంచి మార్కాపురం వెళ్ళే దారిలో ఉంది.అక్కడ కొత్తగా బయటపడ్డ గెలాక్సీ గ్రానైట్ వల్ల కొందరు వ్యక్తులూకొన్ని కుటుంబాలూ సంపన్నులై ఉండవచ్చుగాకకానీ  ఊరూ వెనక ఉన్న పృష్టభూమీ చాలా పేదవిఅక్కణ్ణుంచి మార్కాపురం, పైన నల్లమల అడవులూ నేనెన్నో ఏళ్ళు తిరుగాడినవిఅట్లాంటి బీదభూమిలో ఎన్.ఎస్ప్రకాశ్ అనే ఒక అభ్యుదయవాది స్థాపించిన పాఠశాల అదిదాదాపు పాతికేళ్ళ ముందు  పాఠశాల స్థాపించడం కన్నా ముందు ఆయన మార్క్సిస్టు పార్టీలో క్రియాశీలక కార్యకర్తకళాకారుడు.ప్రజానాట్యమండలి లో ఎన్నో నాటకాలకు దర్శకత్వం వహించి ఊరూరా తిరిగి ప్రదర్శనలిచ్చినవాడుఆయన స్థాపించిన పాఠశాల వెనక ఆయన్ను తీర్చిదిద్దిన కుటుంబం,పార్టీ,సంస్థసిద్ధాంతాల విలువలు సజీవంగానూ,బలంగానూ ఉండటం నేను  రోజంతా గమనిస్తూనే ఉన్నానుతెలుగులో అభ్యుదయ సాహిత్యోద్యమం బలంగా ఉన్న రోజుల్లో కవులురచయితలు  దేశప్రగతి వైజ్ఞానికంగా పురోభివృద్ధితోనే ముడిపడి ఉందని నమ్మారుశ్రీలోనూ,కొడవటిగంటికుటుంబరావులోనూ  విశ్వాసం చాలా బలంగా కనిపిస్తుందిబాల్యంనుంచే పిల్లల్లో తల్లిదండ్రులూ,పాఠశాలలూ సైంటిఫిక్ టెంపర్ ని ప్రేరేపించాలనిఅది వాళ్ళను మూడవిశ్వాసాలనుంచి బయటపడవెయ్యడమేకాకవాళ్ళని చైతన్యవంతం చేస్తుందనీ అభ్యుదయ వాదులు నమ్మారువాళ్ళ దృష్టిలో మార్క్సిజం కూడా ఒక రాజకీయ కార్యాచరణ కన్నా ముందు ఒక శాస్త్రీయ దృక్పథం.
అటువంటి సైద్ధాంతిక నేపథ్యం నుంచి వచ్చిన ప్రకాశ్ గారు ప్రతి ఏటా తన పాఠశాలలో రెండు రోజుల పాటు వైజ్ఞానిక వేడుక నిర్వహించడంలో ఆశ్చర్యమేముందినేను  ప్రదర్శనలో ప్రతి విభాగంలోనూ,ప్రతి ఎగ్జిబిట్ నూ చూసిప్రతి బాలికతోనూ,బాలుడితోనూ సంభాషించేను.ముఖ్యంగా గణిత శాస్త్రవిభాగంలో , పిల్లలు గణిత సూత్రాల్ని అర్థం చేసుకున్నతీరూవాటిని రకరకాల లోకాస్ట్నోకాస్ట్ పరికరాలతో వివరించిన తీరూ నన్నెంతో ముగ్ధుణ్ణి చేసాయికాని కేవలం సైన్స్ ప్రదర్శన ఒక్కట్టే అయిఉంటేనేనీ నాలుగు వాక్యాలూ రాయడానికి ఉత్సాహపడిఉండే వాణ్ణి కాను.అన్నింటికన్నా ముందు ప్రకాశ్ గారు ఒక చిత్రకారుడూ,కళాకారుడూ కూడా.అక్కడ ప్రాథమిక పాఠశాలవిభాగంలో తెలుగుఇంగ్లీషు,హిందీ భాషల కు సంబంధించిన బృందాలు పప్పెట్రీ షోలు చేస్తూ ఉన్నాయిమామూలుగా మనం స్పైరల్ బైండింగ్ కి వాడే అట్టల్తో పిల్లలు కీలుబొమ్మలు తయారు చేసారుపారేసిన కొబ్బరికాయలుసీసాలు వంటివాటితో బొమ్మలు తయారు చేసారుఅక్కడ తెరవెనుక నిలబడి  పిల్లలు పాఠ్యపుస్తకాల్లో కథల్ని నాటకీకరణ చేసి ప్రదర్శిస్తుంటేఅది చూస్తున్న పిల్లల్లో నేనూ ఒక పిల్లవాణ్ణైపోయాను.   మధ్యాహ్నం  పాఠశాల ఆవరణలో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు తర్వాత ఎంపిక చేసిన కొందరు పిల్లలకి ఒక శాస్త్రవేత్తతో ముఖాముఖి మాట్లాడే ఒక సెషన్ ఏర్పాటు చేసారుఇస్రో నుంచి వచ్చిన ఒక సీనియర్ సైంటిస్టు అంతరిక్ష పరిశోధనమీదరాకెట్లతయారీమీద,చంద్రయాన్,కుజయాన్ గురించీ చక్కని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారుసాయంకాలం సమావేశానికి ముందు బాలికలు కోలాటమాడేరుగంటేడ గౌరునాయుడు రాసిన అజరామరమైన గీతం 'పాడుదమా స్వేచ్ఛాగీతం ' వాళ్ళట్లా కోలాటంతో పాడుతుంటే అక్కడున్న ప్రతి ఒక్కరికీ ఒళ్ళంతా పులకిస్తూనే ఉందిపాఠశాల సమగ్రంగా వికసించడమంటే అదిచక్కటి పాఠశాల సైన్సు గురించి మాత్రమే మాట్లాడదునా చిన్నతనంలో, 1969 లో మనిషి చంద్రుడిమీద అడుగుపెట్టినప్పుడుచందమామ ప్రత్యేక సంచిక వెలువరించింది.అందులో 'నవీనచంద్రుడు ', 'పురాణచంద్రుడు ' అని రెండు కథనాలు ప్రచురించింది.( బహుశా అది కొ.కు ఆలోచనే అయి ఉండవచ్చు). నవీన చంద్రుడు ఒక ఉపగ్రహందాని ధ్రువాల దగ్గర మంచు పొర తప్పతక్కిందంతా ఒక నిర్జలక్షేత్రందాని గురించి తెలుసుకోవలసిందేకాని పురాణ చంద్రుడు క్షీరసాగర మథనంలో సముద్రంనుంచి లక్ష్మీదేవితో పాటు ప్రభవించినవాడుమనందరి బాల్యంలోనూ అతడు కొండలమీంచి మనకోసం గోగుపూలు తెచ్చే జాబిల్లి.మనమామయ్యఅప్పుడప్పుడే కళ్ళుతెరుస్తున్న  పసివయసులో చందమామ పత్రిక నాకేమి చెప్పిందంటే ఇద్దరు చంద్రుళ్ళూ కూడా నిజమేనని.ఒకరికొకరు విరుద్ధం కారనినవీన చంద్రుడు నా బుద్ధిని ఆకర్షిస్తాడుపురాణ చంద్రుడు నా మనసుని దోచేసుకున్నాడుస్వయంగా శాస్త్రాన్నీ,కళనీ ఆరాధించినఅనుష్టించిన వాడు నడుపుతున్న పాఠశాల కాబట్టి అక్కడ వట్టి vertical growth కాక horizontal growth కనబడటం సమంజసమే కదా.

No comments:

Post a Comment

Total Pageviews