Friday, June 30, 2017

తల్లి తండ్రులకు చిన్న విన్నపం

తల్లి తండ్రులకు చిన్న విన్నపం 
మీ పిల్లలు ఓడిపోయారని తిట్టకండి 
గెలవడానికి మరో ప్రయత్నం ఉందని గుర్తు చెయ్యండి 
ఎందుకంటే తిడితే వారిని వారు తక్కువగా చేసుకొని
చేతకానివారిలా తయారు అవుతారు
తప్పేదో ఒప్పేదో నిదానంగా చెప్పండి
లేదంటే చెడి పోవటానికి దారులు వెతుక్కుంటారు

మనము తులసిని ఎందుకు పూజిస్తాము?



మనము తులసిని ఎందుకు పూజిస్తాము?
సంస్కృతములో 'తులనా నాస్తి అథైవ తులసి' అంటే దేనితోను పోల్చలేనిది తులసి (దాని లక్షణాలలో) అని అర్ధము. భారతీయులకు గల పవిత్రమైన మొక్కలలో ఇది ఒకటి.
వాస్తవానికి ఇది స్వశుద్ధికారి కనుకనే పూజా సమయాలలో వినియోగించే వస్తువులలో ఇదొక్కటే ఒకసారి వాడిన తరువాత కడిగి మళ్ళీ పూజకు వాడదగినదిగా పరిగణించవచ్చు.
ఒక కధనం ప్రకారము తులసి ఒక దేవత. ఆమె శంఖచూడునికి భక్తి శ్రద్ధలు గల భార్య. ఆమెలోని భక్తి, ధర్మశీలత యందు గల విశ్వాసములను చూచి భగవంతుడు ఆమెను పూజార్హత గల తులసి మొక్కగాను మరియు భగవంతుని తలమీద అలంకరింప బడే యోగ్యత గలది గాను దీవించాడు. తులసి ఆకుని సమర్పించకుండా చేసిన ఏ పూజ అయినా అసంపూర్ణమే. అందువలననే తులసి పూజింప బడుతుంది (కొన్ని పూజలలో తులసి వాడకూడదు అంటారు. విష్ణు పూజ కి సంబంధించి మాత్రం తప్పక వాడ వలసినది).
ఇంకో కధనం ప్రకారము - భగవంతుడు తులసికి తన అర్ధాంగి అయ్యేలాగ వరమిచ్చాడు. అందువలన ఆమెకు భగవంతునితో చాల ఆడంబర పూరితముగా వివాహ మహోత్సవం జరుపుతాము. ఈ విధముగా విష్ణు మూర్తి భార్య యగు లక్ష్మీ దేవికి కూడా తులసి ప్రతీక. ఎవరైతే ధర్మబద్ధమైన సంతోషకరమైన గృహస్థ జీవితాన్ని గడపాలని కోరుకుంటారో వారు తులసిని పూజిస్తారు.
ఒకసారి సత్యభామ కృష్ణ భగవానుడిని తన దగ్గరున్న విలువైన సంపదతో తులాభారము చేస్తుంది. కానీ ఆ సంపదతో పాటు రుక్మిణీ దేవి భక్తితో ఒక్క తులసీదళం వేసే వరకు ఆ తులామానం సరితూగలేదు. ఆ విధంగా తులసి ప్రపంచంలోని మొత్తము సంపద కంటే భక్తితో సమర్పించే చిన్న వస్తువైనా సరే గొప్పదిగా భగవంతుడు స్వీకరిస్తాడని ప్రపంచానికి నిరూపించడములో ప్రధాన పాత్ర పోషించినది.
తులసి ఆకు చాల విశేషమైన ఔషధ విలువలని కలిగి ఉన్నది. జలుబుతో సహా వివిధ అనారోగ్యాలను నయం చేయడానికి వాడబడుతుంది.
తులసి మాల తో జపం చేస్తే చిత్తశుద్ది త్వరగా కలిగి తద్వారా మోక్షం లభిస్తుంది. చిత్తశుద్ది కి తులసి మాల ఉత్తమం.
తులసిని దర్శించినప్పుడు స్మరించవలసిన శ్లోకము:
యాన్మూలే సర్వ తీర్ధాణి యన్మధ్యే సర్వ దేవతాః
యదాగ్రే సర్వవేదాశ్చ తులసీత్వామ్ నమామ్యహమ్
ఎవరి మూలములో సర్వ పుణ్య తీర్ధాలు ఉన్నాయో, ఎవరి అగ్రములో సర్వ దేవతలున్నారో మరియు ఎవరి మధ్య భాగంలో సర్వ వేదాలున్నాయో అట్టి తులసికి ప్రణమిల్లుతున్నాను.

ప్రశంస:--


మనం ఎవరినైనా, వారిలో ఉన్న సద్గుణాలను నిజాయితీగా ప్రశంస చేయడం వల్ల, ఆ వ్యక్తి మరింత ప్రోత్సాహము పొంది, ఆతనిలో ఉన్న ఆ సద్గుణములను మరింత వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. 
కానీ అలాగని ప్రశంస చేయడంలో తగు జాగ్రత్త కూడా తీసుకోవాలి. అదే పనిగా ప్రశంస చేయడం సరికాదు, ఇది చాలా సున్నితమైన అంశం. ఈశ్వరుడిని, గురువుని మాత్రమే ప్రత్యక్షముగా ప్రశంస చేయాలని విజ్ఞులైన పెద్దలు చెబుతారు. స్నేహితులు, బంధువుల గురించి, వారిని ప్రత్యక్షంగా ప్రశంస చేయడం కన్నా, ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి సద్గుణములను ప్రశంసించడం మంచిది. 
యజమాని, తన సేవకుడికి అప్పజెప్పిన కార్యం దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాతనే ప్రశంస చేయాలి. 
ఒక తండ్రి తన కొడుకుని ప్రత్యక్షంగా ఎప్పుడూ ప్రశంస చేయకూడదు".

"గొప్పఅమ్మ"

హృదయం ద్రవించే వ్యాసం. ఒకసారి చదవండి!
మానాన్న ప్రపంచంలోని అందరి అమ్మలకన్నా "గొప్పఅమ్మ"
గంగాదాస్! నిన్ను ప్రిన్సిపాల్ మేడం పిలుస్తున్నారు !
ఆయా వచ్చి చెప్పిన మాటలకు ఎండలో మొక్కలకు గొప్పు తవ్వుతున్న గంగాదాస్ అదిరిపడ్డాడు .
దేనికి ? అని అడిగాడు ఆయాను .
ఏమో! నాకేమి తెలుసు ? అంటూ వెళ్లిపోయింది ఆయా .
చేతులకు ఉన్న మట్టిని గబగబా బకెట్ లోని నీళ్ళల్లో ముంచి కడిగేసుకున్నాడు . తలపాగా విప్పి చెమటలు కారుతున్న ముఖాన్ని తుడుచుకున్నాడు .
వడి వడిగా అడుగులు వేస్తూ కారిడార్ చివరన ఉన్న ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెడుతున్నాడు. అతని మనసులో ఆందోళన.
ఏమి జరిగింది ? మొక్కల గురించా ? ఎక్కడైనా పొరపాటు చేశానా ? లేక తన పిల్ల ఏమైనా తప్పు చేసిందా ? ఎవరినైనా కొట్టిందా ? అలా చెయ్యదే ! ఏమి జరిగింది ? ఇన్ని రోజులుగా ఒక్కసారీ ఎప్పుడూ తనను పిలవని ప్రిన్సిపాల్ మేడం ఎందుకు పిలిచారు ?” అడుగులు తడబడుతున్నాయి . గుమ్మం దగ్గరకి వెళ్ళాడు .
చిన్నగా స్ప్రింగ్ డోర్ మీద శబ్దం చేశాడు .
అమ్మగారండీ ! లో గొంతుకతో పిలిచాడు .
లోపలికి రా ! ప్రిన్సిపాల్ గొంతు అధికారికంగా వినిపించింది . అతనిలో ఆందోళన పెరిగిపోయింది .
కళ్ళజోడు పెట్టుకుని , తెల్లని కాటన్ సారీ కట్టుకుని , తెల్లని జుట్టుతో ఉన్న ప్రిన్సిపాల్ ని చూడగానే వంగివంగి నమస్కరించాడు .
ఆమె టేబుల్ మీద ఉన్న ఒక కాగితం తీసి అతనికి ఇస్తూ
చదువు అంది
వణికిపోయాడు గంగాదాస్
అమ్మా! నేను చదువుకోలేదు . నాకు ఇంగ్లీష్ రాదు . తెలుగు కూడా రాదు . ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండమ్మా !
తప్పు చేస్తే ఇంకొక్క అవకాశం ఇవ్వండమ్మా !
దయగలమీరే పొమ్మంటే ఎక్కడకి పోవాలమ్మా ?” దీనంగా అన్నాడు గంగాదాస్
అతడి కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు .
మీ దయవలన నేను నాబిడ్డ ని ఇక్కడ చదివించుకుంటున్నాను. మీరు పొమ్మంటే దానికి
ఇలాంటి స్కూల్లో నా జన్మలో చేర్చలేను, పొమ్మని అనకండమ్మా వణికిపోతున్నాడు .
అరెరే ! ఏదేదో ఊహించేసుకోకు! మేము నీ పిల్లకి సీటు ఇచ్చింది ఆమె తెలివితేటలు చూసి , నువ్వు మా సిన్సియర్ వర్కర్ వి కాబట్టి. ఈ కాగితం నీకు చదివి పెట్టడానికి టీచర్ గారిని పిలుస్తా ఉండు ! ఇది నీ కూతురు రాసినదే ! నీకు అది చదివి వినిపించాలి అనిపించి నిన్ను పిలిపించాను. ఇది నువ్వు వినాలి .
ప్రిన్సిపాల్ గారి పిలుపు విని సరోజ టీచర్ అక్కడకి వచ్చింది . ఆమె ఆ పేపర్ తీసుకుని చదవడం మొదలు పెట్టింది
ఈ రోజు మా క్లాసులో మాతృ దినోత్సవం గురించి వ్యాసం రాయమన్నారు .
నేను ఒక పల్లెటూరిలో పుట్టాను . అక్కడ ఇప్పటికీ విద్య, వైద్యం అనేవి రెండూ సరిగా లేవు ! పిల్లలను కనడం అంటే ఆడవాళ్ళకు మళ్ళీ పునర్జన్మే మా పల్లెటూళ్ళల్లో .
పిల్లలను కనలేక పురిటిలోనే చనిపోయే తల్లులు ఎక్కువ మా ఊరిలో .
అలాగే మా అమ్మకూడా నన్ను కంటూ తను కన్ను మూసింది . నన్ను తన చేతుల్లోకి తీసుకోకుండానే, తన దగ్గర పాలు తాగకుండానే పురిటిలోనే చనిపోయింది .
నన్ను తన చేతులలోకి తీసుకున్నది అప్పటికీ ఇప్పటికీ మా నాన్న ఒక్కడే !
తల్లిని చంపి పుట్టాను అన్నారు .
"శనిగొట్టుదానిని" అన్నారు . ఎవ్వరూ నన్ను కనీసం ఎత్తుకునేవారు కారు .
నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మమ్మ, నాన్నమ్మా , తాతలూ అందరూ బలవంతం చేశారు, కొడుకును కనమని .
ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా నాన్న వినలేదు .
ఆ ఊళ్ళో ఉంటే వాళ్లందరూ అలాగే బలవంతం చేస్తారు అని, ఉన్న ఇంటినీ , పొలాలనూ అన్నిటినీ వదిలి నన్ను (రోజుల పిల్లను) ఎత్తుకుని నాకోసం నాకు అన్నీ తానే కావాలని, నా జీవిత ఔన్నత్యం కోసం తనకు అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలనూ వదిలి వట్టి చేతులతో, నా మీద ప్రేమతో , నన్ను పెంచాలి,ప్రయోజకురాలను చేయాలి అనే తలంపుతో ఈపట్టణం వచ్చేశాడు .
చిన్నప్పుడు నాకోసం ఎన్నెన్ని కష్టాలు పడి ఉంటాడో !
ఇప్పుడు తలచుకుంటూ ఉంటె అనిపిస్తుంది .
ఒక్కటే రొట్టె ఉంటె తనకు రొట్టెలు అంటే ఇష్టం ఉండవు అనేవాడు .నాకు ఇప్పుడు తెలుస్తోంది
నా ఆకలి తీరితే తన ఆకలి తీరిపోయినట్లు నాన్న అనుకునేవాడు అని .
తాను పస్తులు ఉంటూ నాకు తినిపించాడు అని ఇప్పుడు తెలుస్తోంది .
తన శక్తికి మించి నాకు ఎన్నో సౌఖ్యాలు, సదుపాయాలూ నాన్న నాకు కల్పించాడు .
నన్ను ఈ స్కూల్ లో చదివించడం కోసం నాన్న ఇక్కడ తోటమాలిగా చేరాడు .
ప్రేమ ఆప్యాయత అనేవి అమ్మకు మారుపేర్లు అయితే అవి నేను పొందుతున్నది మానాన్న నుండి .
సానుభూతి అనేది అమ్మకు నిర్వచనం అయితే మా నాన్నే నాకు"అమ్మ".
అమ్మకు ప్రతిరూపం త్యాగం అయితే మా నాన్న త్యాగం ముందు అది చాలా తక్కువ
ప్రేమ ఆప్యాయత, త్యాగం, సానుభూతి ఇలాంటి పదాలకు నిర్వచనం “అమ్మ” అయితే మా నాన్న అంతకన్నా ఎక్కువ నాకు .
మా నాన్న ప్రపంచం లోని అందరి అమ్మల కన్నా "గొప్పఅమ్మ "
ఈ మాతృదినోత్సవం సందర్భంగా నేను నాతండ్రికి ఈ ప్రపంచంలోని తల్లితండ్రులు అందరికన్నా గొప్పవాడిగా సెల్యూట్ చేస్తున్నా !
ఇంకా ఈ స్కూల్ లో ఉన్న తోటమాలి నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటాను .
ఈ వ్యాస రచనలో నేను ఫెయిల్ కావచ్చు . నా టీచర్ కి ఇది నచ్చకపోవచ్చు .
కానీ నిస్వార్ధ ప్రేమకు ప్రతిరూపం అయిన నా తండ్రికి ఇది నేను అర్పించే కృతజ్ఞత .
చదువుతున్న సరోజ టీచర్ గొంతులో కన్నీటిజీర !
వింటున్న ప్రిన్సిపాల్ చీర చెంగుతో కళ్ళను అద్ధుకుంటోంది.
గంగాదాస్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు దిగమింగు కుంటున్నాడు .
ఆ ఎ.సి గది నిశ్శబ్దంగా అతడి వెక్కిళ్ళ చప్పుడు వింటోంది .
ఆ పేపర్లను సరోజ టీచర్ చేతులలోనుండి తీసుకున్నాడు . గుండెలకు హత్తుకున్నాడు, నిలబడలేక పోతున్నాడు .
ప్రిన్సిపాల్ మేడం అతడికి దగ్గరగా వచ్చింది . కుర్చీ దగ్గరకి తీసుకువెళ్ళింది . కూర్చో బెట్టింది తన టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్ళను అతడి చేతికి ఇచ్చింది . ఆమె గొంతులో ఏదో తెలియని ఆర్ద్రత .
గంగా దాస్ !
మీ అమ్మాయి రాసిన ఈ వ్యాసానికి మేము 10/10 మార్కులు ఇచ్చాము . మాతృదినోత్సవం సందర్భంగా ఇంతకంటే గొప్పవ్యాసం ఎవరూ రాయలేరు, ఎందుకంటే ఇది ఒక కూతురు తన తల్లి పట్ల చూపే అభిమానానికి వెయ్యి రెట్లు అభిమానాన్ని వ్యక్తపరుస్తున్న వ్యాసం. మేము రేపు మన స్కూల్లో మాతృదినోత్సవం జరపబోతున్నాము.దానికి ముఖ్యఅతిధి నువ్వే !
నిన్ను మించిన తల్లి ఇంతవరకూ మా స్కూల్ చరిత్రలో మాకు తెలీదు . అందుకే నీకు సత్కారం చెయ్యాలని నిర్ణయించుకున్నాము . నీఅంగీకారం కోసమే నిన్ను పిలిపించాను.అంది
మేము ఈ సత్కారం చెయ్యడానికి ముఖ్య కారణం పిల్లలను తల్లులే కాదు తండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారు అనే విషయం అందరికీ తెలియాలని .
నీవు చేసిన త్యాగానికి, నీవు నీ కుమార్తె పట్ల చూపిన ప్రేమకు గుర్తింపుగా ఈ సత్కారం చెయ్యాలి అనుకుంటున్నాము . ఇది ఎందరికో స్పూర్తిదాయకం కావాలి .
నిన్ను గౌరవించడం ద్వారా మీ అమ్మాయి తన తండ్రి ప్రపంచం లో "గొప్పతల్లి" అన్న మాటలను నిజం చెయ్యాలి అనుకుంటున్నాము .
మా స్కూల్లో ఒక గొప్ప తండ్రి ఉన్నాడు అని పిల్లల తల్లి తండ్రులకు చెప్పాలి అనుకుంటున్నాము .
నువ్వు మాబడి తోటలో పూల చెట్లను కాపాడే తోటమాలివి మాత్రమే కాదు .
నీ జీవితపు తోటలో పూసిన పూబాలను కాపాడుతున్న ఒక చక్కటి తోటమాలివి.
అందుకే రేపు నీవే మాకు ముఖ్య అతిధివి !

చక్కని పద్యం

శ్రమ చేసియు ఫలమొందక
విమనస్కత గాంత్రు జనులు;
విధులను మరువన్
భ్రమ గొల్పెడి భవభయమున
బ్రమత్తులగుచు మడియుదురు భవ్య సుమేధా!
భావము: శ్రమ పడి కూడా ఫలితము పొందలేని వారు, నిరాశా నిస్పృహలతో మనో నిగ్రహము కోల్పోతూ ఉంటారు. చేరవలసిన గమ్యము, అందుకు అనుసరించవలసిన త్రోవ నుండి తప్పిపోతారు. వీటన్నిటికీ మూల కారణము భ్రమ, సందేహము. ఇటువంటి తమోగుణ ప్రధానమైన భావములకు లోనైతే అపజయము, పతనము తప్పవు. అందువలన తాము ​ఏర్పరచుకొన్న లక్ష్యము మరియు ఎంచుకున్న మార్హమునందు గట్టి నమ్మకము, చేసే పనిలో ఏకాగ్రత: ఈ రెంటితో భయవిముక్తులై విజయము సాధించ గలరు.

భక్తి అంటే ...


"భక్తి అంటే ఏమిటి?"అని అడిగారొక రాజుగారు.
"భక్తీ అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం కాదు, భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడం..." చెప్పారు ఒక మహర్షి.
"అవునా, నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసింది ఏమిటి?"
నాయనా! నిజానికి దైవం ఎవరి నుంచీ ఆశించేది ఏమీ లేదు. మానవ జన్మ ముక్తికి ఒక అవకాశం. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి నిన్ను నువ్వు తరింప చేసుకునేందుకు కాని, నువ్వు దేవుడికి ఏదో గొప్ప ఉపకారం, సేవ చేసావని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దానధర్మాలు వ్యర్ధం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం... నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్ధనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చరు. ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో దానం చేస్తూ, ఆ దైవం మెచ్చే పని నీవు చేసినప్పుడు , ఆయన తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం!
" అందుకు చాలా సహనం, ఓర్పు ఉండాలి కదా!"
అవును, సహజంగా మనలోని భక్తి ఎలా ఉంటుందంటే... ఒకరు వంద బిందెలతో శివుడికి అభిషేకం చేస్తే , శివుడు ప్రత్యక్షం అవుతాడు, అని చెప్పరే అనుకోండి, 98 బిందెలు మోసుకొచ్చి, అత్యంత ఓర్పుతో అభిషేకం చేస్తాం. 99 వ బిందె దైవం ఇంకా రాలేదే అన్న విసుగుతో, ఆయన నెత్తినే పడేసి వస్తాం. ఓర్పుకు ఓటమి లేదు. నమ్మకం, ఓర్పు, సేవ ఇవే దైవాన్ని చేరే మార్గాలు.
అలా ముని నుంచీ ఉపదేశం పొందిన రాజు గారు అనేక దానాలు చేసారు. భూ దానం, గో దానం, సువర్ణ దానం, కన్యా దానం. దైవ సాక్షాత్కారం కోసం వేచి ఉన్నారు. మారువేషంలో రాత్రులు తిరుగుతూ, ప్రజల అవసరాలు కనిపెట్టి అనేక గుప్త దానాలు చేసారు. అయినా దైవం ప్రత్యక్షం కాలేదు. రాజుగారు దైవానుగ్రహం కోసం ప్రార్ధిస్తూ, ఓర్పుగా సేవ చెయ్యసాగారు.
ఒక రోజు రాజుగారు రాత్రివేళ మారువేషంలో తిరుగుతుండగా, ఒక ఇంటి నుంచీ పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక పేద బాలుడు తనకు ఆట బొమ్మలు కావాలని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. విధవరాలయిన ఆమెకు సరయిన బట్టలే లేవు, బొమ్మలు ఎలా కొంటుంది? దిక్కుతోచక కొడుకును సముదాయిస్తోంది. కాని, పిల్లవాడు మొండికేసి ఏడుస్తున్నాడు. రాజు హృదయం ద్రవించిపోయింది. మర్నాడు మంచి మంచి బొమ్మలు, తినుబండారాలు ఆ పిల్లవాడికి పంపాడు. వెంటనే రాజు ముందు దైవం ప్రత్యక్షం అయ్యారు. రాజు ఆశ్చర్యపోయాడు.
"స్వామి! నేను ఎన్నో గొప్ప దానధర్మాలు చేసినా, ఆలయాలు, సత్రాలు, చెరువులూ త్రవ్వించినా నీవు రాలేదు. మరి ఈ నాడు నాపై నీ దయ కలిగేందుకు కారణం ఏమిటి?"
"రాజా! పూర్ణ మనస్సుతో ఏ చేసే చిన్న పనయినా నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. పిల్లవాడి మీద దయతో మనసు కరిగి, నీవు చేసిన దానం వల్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. నీవు చేసే దానధర్మాలను ఇలాగే కొనసాగించి, తుదకు నా సన్నిధి చేరతావు," అని దీవించి అదృశ్యం అయ్యారు.
ప్రతీ క్షణం మనం మరణానికి చేరువ అవుతుంటాం. అది గుర్తెరగాలి. దానం చేసేందుకు మరొకరిపై ఆధార పడకండి.ఉన్నంతలో క్రొత్తవి, లేదా పాత బట్టలు, దుప్పట్లు, ఆహారం, కాస్త డబ్బు ఏదైనా ఇవ్వండి. రోజుకొక మంచి పని చెయ్యడం లక్ష్యంగా పెట్టుకుందాం. ఉన్నంతలో, నలుగురికీ సహాయపడదాం. మానవ సేవే మాధవ సేవ

గురుబ్రహ్మ

ఒక మాస్టార్ని ఓ విద్యార్థి అడిగాడు.

సార్! మీరు నేర్పించిన విద్యతో మేము చాలా ఉన్నతమైన స్ధితికి ఎదిగినప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ రాదా అని. 
ఎందుకు? అని మాష్టారు అడిగితే ...
"మీరు చేరలేని స్థాయికి మేము చేరుకున్నాం, కానీ మీరు మాత్రం ఇలాగే ఉండిపోతున్నారు కదా!"అని. దానికి మాస్టారు శైలిలో కొంత విడమరిచి చెప్పాల్సి వచ్చింది.
"ఓ యాభై అంతస్తులున్న బిల్డింగ్ ఎవరు కడతారు. యాభై అడుగుల మనిషి కాదు కదా.
ఆరు అడుగుల లోపే ఉన్న మనిషి కడతాడు.
అంటే ఎంత ఎత్తున బిల్డింగ్ కట్టడానికి అంత ఎత్తున్న మనిషి కావాలి అంటే ఎలా.?
ఎందరికో నీడనిచ్చే చెట్టు తనకు నీడ లేదే అని ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రకృతికి అర్థమే లేదు.
తను నీడ గురించి ఆలోచించకుండా ఉంటేనే నలుగురికి నీడనివ్వగలదు.
టీచర్ కూడా అంతే.
తన నీడలో ఎందరు ఎదిగినా అది తన ఎదుగుదలగా గుర్తించి ఒదిగి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు. అది నేను ఆస్వాదించాను "అని చెప్పాడు.

Thursday, June 29, 2017

పెద్దలమాట చద్దిమూట!!!!


శుక్రవార శుభ శుభోదయం../\..

శుక్రవార శుభ శుభోదయం../\..

ఆనందం సీతాకోక చిలుక వంటిది 
దాన్ని వెంబడిస్తే ఎప్పుడూ చేతికి చిక్కదు
కానీ నిశ్శబ్దంగా కాచుకుని ఉంటే 
మన చెంతన వాలుతుంది!!

Wednesday, June 28, 2017

విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది..

విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది..
భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?
అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.
ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు
ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"
స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"
మళ్ళీ నిశబ్దం.
స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.
అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.
"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.
శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.
"అదెలా" అని అందరూ అడిగారు.
శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.
శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు.
ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు

ఔషధం కానిదేదీ ఈ జగత్తులో లేదు..!

ఔషధం కానిదేదీ ఈ జగత్తులో లేదు..!
ఆరోగ్య పరిరక్షణ, రోగనివారణ అనేవి ఆయుర్వేద శాస్త్ర ప్రధాన లక్ష్యాలు. ఆయువు నిర్వహణలో సహజసిద్ధమైన వనమూలికల పాత్ర నిర్వివాదం. ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధం కూడా. మానవుడు ప్రాణవాయువు, నీరు, ఆహారం, వస్త్రం, వసతి మొదలైన సర్వ అవసరాలకు మొక్కలపైనే ఆధారపడి ఉన్నాడు. మొక్కలే లేకుంటే మనిషి మనుగడే లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మొక్కల ఆధారంగా జీవించే మానవుడు రోగగ్రస్తుడైనప్పుడు అతడి శరీరం సహజంగానే వనమూలికలను కోరుకుంటుంది. అందువల్లనే వనమూలికలతో తయారైన ఔషధాలు ఎలాంటి విపరీత లక్షణాలు కలుగనీయకుండా రోగాలను నివారించగలుగుతున్నాయి. వనమూలికలు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధినిర్మూలనలో మేలు చేస్తాయని, వాటి ఉపయోగం అత్యంత లాభదాయకమని ఆధునిక అభిప్రాయం. ఈ నేపథ్యంలో అందరికీ పరిచయం ఉండి, సులభంగా అందుబాటులో ఉండే మొక్కలు, వాటిలో ఆరోగ్య విలువలను తెలియచేయడం ద్వారా సాధారణ ఆరోగ్య సమస్యలకు సులభమైన నివారణోపాయాలు తెలియచేస్తున్నాం. ఆహార ధాన్యాలన్నింటికీ కొన్ని ఉపయోగాలు ఉంటాయి.
• ఆహార ధాన్యాలు - ఔషధీ విలువలు
వరి, బియ్యం - బలాన్ని కలిగిస్తాయి.. జ్వరం తగ్గాక శక్తిని కలిగిస్తాయి. వాంతులు నోటిపూత, కుసుమ వ్యాధులను నివారిస్తాయి.
గోధుమలు - పుష్టినిస్తాయి.జ్వరంలో వాడతగినవి.మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
రాగులు - పుష్టినిస్తాయి. చిన్న పిల్లలకు, వృద్ధులకు మంచిది. వెంట్రుకలు బాగా పెరుగుతాయి
జొన్నలు- మధుమేహం కలవారికి మంచి ఆహారం.ఎండాకాలంలో తక్షణ శక్తి ఇస్తుంది.
కందులు - పుష్టినిస్తాయి, రక్తాన్ని శుభ్రపరుస్తాయి.
పెసర్లు - పప్పు ధాన్యాలు అన్నింటికన్నా ఎక్కువ మేలు చేస్తుంది.
మినుములు - వీర్యవృద్ధిని, మూత్రపిండాలకు బలము కలుగచేస్తుంది.
శనగలు - స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. కడుపులో క్రిములను చంపుతుంది. నూనెతో వేయించి తనడం మంచిది కాదు. సౌల్యం ఉన్నవారు తినరాదు.
ఉలువలు - మూత్రంలో రాళ్ళు, క్షయ, అతి మూత్రం, రుతుబద్ధతను తగ్గిస్తాయి.
వేరుశనగలు - చిన్న పిల్లలకు పుష్టికరం. మొలకలు తీసి వాడాలి. శరీర పుష్టిని కలిగిస్తుంది.
బఠాణీలు - శరీర పుష్టిని కలిగిస్తాయి.
మసూరపప్పు - విరోచనాలు, అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుంది.
నువ్వులు - వీర్యవృద్ధిని, చర్మ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. పండ్లను గట్టి పరుస్తుంది, ఋతు బద్ధాన్ని విప్పుతుంది.
అలసందలు- స్తన్యవృద్ధిని, వీర్యవృద్ధిని కలిగిస్తుంది.
• కాయగూరలు - ఔషధీ విలువలు
తోటకూర/ పెరుగు తోట కూర - స్ర్తీలలో ఎర్రబట్ట, ఆర్శమొలలు,వాతవ్యాధులు నివారించబడతాయి
పుదీనా - అజీర్ణాన్ని తొలగించి ఆకలిని కలిగించును.
కొత్తిమీర - ఆకలిని కలిగించును, నోటిపూత, పంటినొప్పి, మానసిక వత్తిడిని నిర్మూలిస్తుంది.
కరివేపాకు - జిగట విరేచనాలు, రక్తవిరేచనాలు తగ్గిస్తుంది.
పొన్నగంటికూర - నేత్ర వ్యాధులు కలవారికి, కడుపులో క్రిములు కలవారికి మేలు చేస్తుంది.
అవిశ ఆకు - రేచీకటి, మలబద్ధకాన్ని తొలగిస్తుంది.
మునగాకు, కాయ - చెవి వ్యాధులు, ఆర్శ మొలలు తగ్గిస్తుంది. స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది.
ముల్లంగి - దుంపలలో ఉత్తమమైనది, మూత్రములో రాళ్ళు పుట్టకుండా చేస్తుంది.
గాజర - రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది.
కంద - ఆర్శ మొలలు, కడుపులో క్రిములు కలవారికి మంచిది.
అరటికాయలు - శిశువులలో అజీర్ణం, జిగట విరేచనాలు తగ్గిస్తుంది. ఆయువును పెంచుతుంది. కడుపులో పుండ్లను మాన్పుతుంది.
బూడిద గుమ్మడి - శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బలాన్నిస్తుంది. మూత్రంలో రాళ్ళు, జిగట విరేచనాలు తగ్గిస్తుంది.
అల్లం - ఆకలి కలిగిస్తుంది. అజీర్ణం, జలుబు తగ్గిస్తుంది.
ఉల్లి (నీరుల్లి) - ఆకలి కలిగిస్తుంది. వడదెబ్బ తొలిగిస్తుంది.
కాకరకాయలు - మధుమేహం, కడుపులో క్రిములు తగ్గిస్తుంది.
కామంచికూర - కడుపులో క్రిములు, హృదయరోగాలు గలవారు వాడదగినది.
బీరకాయలు - వేడిని తగ్గిస్తుంది. అన్ని రకాల వ్యాధులకు పథ్యం.
కొబ్బరికాయ - పుష్టినిస్తుంది, వడదెబ్బను అలసటను పోగొడుతుంది.
చింతపండు- వాతవ్యాధులు, మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది. సంవత్సరం పాతది మంచిది.
చింతచిగురు - ఆర్శ మొలలు కలవారికి మంచిది.
మెంతికూర- వేడిని, ఆర్శమొలలను, మధుమేహం, జిగట విరేచనాలను తగ్గిస్తుంది.
పాలకూర - పొట్టలో జబ్బులు కలవారికి మంచిది.
చుక్కకూర - ఆకలిని కలిగిస్తుంది. కీళ్ళ నొప్పులు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
బచ్చలి - ఆకలిని పెంచుతుంది. జ్వరం కలవారు తినరాదు.
గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది
వంకాయలు- ఆకలిని, రక్తాన్ని వృద్ధి చేస్తాయి. లేతవి మేలు.
చిలగడ దుంపలు- వేడిని తగ్గిస్తాయి. రక్త వృద్ధి చేస్తాయి.
సొరకాయ - రుచిని కలిగిస్తుంది. మూత్రమును జారీ చేస్తుంది.
పచ్చి మిరపకాయలు - ఎక్కువగా తింటే వీర్య నష్టం కలుగుతుంది.
పొట్లకాయ - అందరు రోగులకు మంచిది. వీర్యపుష్టిని కలిగిస్తుంది
బుడ్డ కాకర కాయ - ఆకలిని కలిగిస్తుంది. చర్మవ్యాధులు, కడుపులో పుండ్లు తగ్గిస్తుంది
చామకూర- ఆర్శ మొలలు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
చామదుంపలు - మూత్రపిండాలకు బలాన్ని చేకూరుస్తుంది.
ఆలుగడ్డలు - పుష్టికరం, బలకరం, ఎక్కువగా తినరాదు.
ఇంకా మనం వంటలో ఉపయోగించే పదార్ధాలనేకంలో పోషక విలువలు ఉంటాయి. ప్రకృతి మనకు ఇచ్చిన ఆహారం మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అది పప్పు ధాన్యాలైనా, కాయగూరలైనా, పళె్ళైనా, వంట దినుసులైనా, మూలికలైనా. అయితే ఈ ఆహారాన్ని కూడా మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. 

నగల పెట్టె !

నగల పెట్టె !

ఒక వ్యక్తి భార్య అకస్మాత్తుగా మరణించింది. అతని నలుగురు కొడుకులు అత్యంత ప్రేమగా కొద్ది రోజులు చూసుకొన్నారు. ఒక మంచి రోజు చూసి తండ్రి ని ఆస్తి పంపకం చేయమని అడిగారు. ఎవరికి వారు తను ఇచ్చిన ఆస్తిని రెట్టింపు చేసి తండ్రి కి మంచి పేరు తెస్తామని హామి ఇచ్చారు. ఆ అమాయక తండ్రి ఆస్తి మొత్తం నలుగురికి సమం గా పంచేసాడు.  మరునాడే కొడుకులు ఎవరికి వారు వేరు పడి తండ్రిని ఒక్కొక్కరు నెల చొప్పున చూసేటట్టు పంచుకున్నారు. మొదటి నెల పెద్దకొడుకు ఇంట్లో రెండువారాలు గడిచాయి. కొడుకు కోడలు నిర్లక్ష్యం చేయడం ప్రారంబమైంది. రెండో నెల రెండో కొడుకు ఇంటికి వెళ్లాడు. అక్కడా అంతే! మూడు వారాలు మించి ఉండలేకపోయాడు. నాలుగోవారం మూడో కొడుకు ఇంటికెళ్లాడు. అదేమిటి వారం ముందే వచ్చారు అని కోడలు అడిగింది. మిగిలింది షరా మామూలే! ఇక్కడ అంతకంటే ఘోరం. రెండు వారాల్లో చిన్న కొడుకు ఇంటికి బయలు దేరాడు! ఇదేంటి ! ఇంత తొందరగా వచ్చాడు ! ..ముసలాడు అనుకున్నారు కొడుకు కోడలు.  ఇక్కడి నరకం భరించలేక వారంలో ఆశ్రమానికి బయలుదేరివెళ్లిపోయాడు. అక్కడ గురువు గారితో తన కష్టం చెప్పుకున్నాడు. గురువు గారు తన వద్ద నెలరోజులు ఉంచుకొని ఒక అందమైన పెద్ద పెట్టెను భహుమతిగా ఇచ్చి, మరణించే వరకు దీనిని నీదగ్గర ఉంచుకో ! అని సలహా ఇచ్చాడు. తాళం అడిగితే నాదగ్గర ఉందని చెప్పు అని చెప్పారు. కొడుకులు కోడళ్లు అడిగినా ఇవ్వవద్దని అందులో విలువైన సంపద ఉందని చెప్పాడు.
తండ్రి అందమైన పెద్ద పెట్టేతో తిరిగి వచ్చేసరికి పెద్ద కొడుకు ఆనందంతో స్వాగతం పలికాడు..!  తండ్రి ఈ పెట్టెలో విలువైన సంపద ఉందని తన మరణానంతరం మీరు సమంగా పంచుకొండి అని చెప్పాడు. తాళం స్వామీజీ దగ్గర ఉంటుందని కూడ చెప్పాడు. నలుగురు కొడుకులు చాల ఆనందం తో తండ్రిని చాలబాగుగా చూడాలని భార్యలకు హుఖుం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు తండ్రి తో ప్రేమగా కబుర్లు చెప్పేవారు.
కాల క్రమం లో తండ్రి ఆనందం గా మరణించాడు. మరణానంతరం కొడుకులు స్వామిజీ దగ్గర తాళం చెవులుతెచ్చి పెట్టె తెరచి చూసారు. అందులో నల్లటి రాళ్లు తప్ప మరేంలేవు. కొడుకులు కోపంతో .... అంతా మోసం అంటూ స్వామీజి దగ్గర గొడవకు వచ్చారు.
స్వామీజి అప్పుడు ఇలా బదులుపలికారు!
అందులో మోసం లేదు....నాయనా ..! మీ బుద్ధి స్వరూపం ఉంది! మీ తండ్రి ఆస్తి మొత్తం పంచిన తరువాత మీ నిర్లక్ష్యం తట్టుకోలేక  నా వద్దకు వచ్చాడు. ఆ పెట్టె నేనే అతనికి ఇచ్చి పంపాను! అందులో ఏముందో ఆయనకు కూడ తెలియదు!    నేను చెప్పమన్నది చెప్పాడు.  "అందులో ఉన్నది నల్లని రాళ్ల స్వరూపం లో ఉన్న మీ బుద్థి. అది వదిలేస్తారో స్వీకరిస్తారో మీ ఇష్టం" అని స్వామీజి బదులిచ్చారు!

ఉదాత్తమైన ప్రాణి జటాయువు.

జటాయువు - స్వామి కార్యం
గృధ్రాధిప గతి దాయక రాం!!
స్వామి కార్యం అనేసరికి ప్రతి ప్రాణి తన శక్తి మేర కృషి చేసిన గాథలను అద్భుతంగా వర్ణించిన మహా కావ్యము శ్రీమద్రామాయణము.
ఉడుత వారధి కోసం,
సంపాతి లంకకు మార్గం కోసం,
అతని సోదరుడు జటాయువు సీతమ్మ ఆనవాల కోసం,
వానరసైన్యం రావణుని వధించి ధర్మస్థాపన కోసం....
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవరాశులు ప్రభువుకు తోడ్పాటుగా నిలిచాయి. అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి జటాయువు.
దశరథుని మిత్రుడైన జటాయువు ఒక గ్రద్ద. వృద్ధాప్యంతో శరీరం సహకరించక పోయినా సీతను అపహరించుకుపోతున్న రావణుని ఎదిరించి కొనప్రాణమున్నంత వరకు పోరాడిన వీరుడు.
సీతమ్మను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు అమ్మ జాడ తెలిపి రామకార్య సాఫల్యానికి తోడ్పడిన గొప్ప జీవి. జటాయువు, సంపాతి ఇద్దరు అన్నదమ్ములు.
సీతా రామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మొట్టమొదటి సారి పంచవటి సమీపంలో జటాయువు రాముని కలుస్తాడు. తాను దశరథుని మిత్రుడని తెలిపి సృష్టిలో జంతు జాతి ఏ విధంగా ఆవిర్భవించిందో విపులంగా తెలుపుతాడు.
కర్దమ ప్రజాపతి నుండి గరుత్మంతుడు (శ్రీమహావిష్ణువు యొక్క వాహనము), అరుణుడు (సూర్యుని రథసారథి) గ్రద్ద సంతతిగా ఎలా జన్మించారో వివరిస్తాడు. అదే వారసత్వానికి తాను, సంపాతి చెందినట్లు తెలుపుతాడు.
అరుణుని సంతతే జటాయువు, సంపాతి. దశరథుని స్నేహానికి గౌరవంగా ఈ భీకరమైన దండకారణ్యములో సీత రక్షణకు తాను రామునికి తోడుగా ఉండగలనని పలుకుతాడు.
సీతాపహరణం తరువాత రావణుని చేతిలో రెక్కలు తెగి, రక్తసిక్తమై అసువులు బాయటానికి సిద్ధంగా ఉన్న జటాయువును చూసి రాముడు జటాయువే సీతను చంపి ఉంటాడని అనుమానించి అతనిని చంపబోతాడు.
అప్పుడు జటాయువు తనకు రావణునికి మధ్య జరిగిన యుద్ధాన్ని వివరించి సీత జాడ తెలుపుతాడు. రావణుని చరిత్రను, అతని శక్తి పరాక్రమాలను, ఏ విధంగా సీతను అపహరించింది వివరించి రాముని చేతిలో ప్రాణాలు వదులుతాడు.
తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఆ వీరుని చూసి రాముడు దుఃఖించి, అతనికి స్వయంగా ఉత్తరక్రియలు జరుపుతాడు. ఈ విధంగా జటాయువు ఉత్తమలోకాలను పొందుతాడు..

చక్కని కథ!!!

చక్కని కథ!!!
ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు.
"లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు" అంటూ పిలిచింది.
మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము.అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు.
భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి"నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా," అని అడిగింది." లేదు..... కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం" అన్నారు.
ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా పెద్దాయన" నా పేరు 'ప్రేమా, ఇతని పేరు 'గెలుపూ, ఈయన పేరు 'ఐశ్వర్యం'. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్యనించు" అన్నాడు. వచ్చిన వారు మాములు మనుషులు కారు అని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న దేవతలని తెలిసిపోయింది.
సంతోషంతో పొంగిపోతు అమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో "బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని" అన్నాడు.
దానికి ఆమె "గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయే కాబట్టి ఐశ్వర్య దేవతని ఆహ్వనిద్దాం" అని అంది.
వీరి ఇద్దరి మాటలు వింటున్న్న వారి కోడలు, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి ప్రేమ మూలాధారం సుఖజీవనానికి" అంటూ సలహ ఇచ్చింది.
వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ' ప్రేమ ' అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది.
ఆముగ్గురూ "మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండి పోవాల్సివచ్చేది .ప్రేమను మీరు పిలవడం వలన మేమూ పిలవకుండానే వచ్చాము కారణం ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆఙ్ఞ" అన్నారు......కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి

వానా వానా వల్లప్ప!

వానా వానా వల్లప్ప!
వాకిలి తిరుగూ చెల్లప్ప!
కొండమీది గుండురాయి
కొక్కిరాయి కాలువిరిగె
దానికేమి మందు?
వేపాకు పసుపూ,
వెల్లుల్లిపాయ,
నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,)
నూటొక్కసారి,
పూయవోయి నూరి,
పూటకొక్కతూరి.
..
వల్లప్పా! వల్లప్పా! వాన కురుస్తున్న దంటుంది చెల్లెలు.
బయటకుపోక చెల్లెలును
వాకిట్లోనే ఆడుకోమంటాడు వల్లప్ప.
వానలో తిరిగితే కొండమీదినుండి (ఆకాశం నుండి)
గుండురాళ్లు (వడగళ్లు) పడి కొక్కిరాయి (అల్లరి పిల్లవాడు) కాలు విరిగింది -
కాబట్టి వానలోకి పోవద్దని వల్లప్ప అంటే,
కాలు విరిగితే మందు ఏమిటని చెల్లెలు అడుగుతుంది.
వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ నూనెలో మడ్డి - ఇవన్నీ కలిపి,
నూటొక్క సారిపిండి (ఆవర్తితతైలము)
ఆ తైలమునుపూట కొకసారి విరిగిన కాలుకు రాస్తే,
కూడు కొంటుందంటాడు వల్లప్ప.
🌧 వానా వానా వల్లప్ప అని పాడుకుంటారు మన చిన్నారులు.. 🌚 రెయిన్ రెయిన్ గో అవే అని నేర్పిస్తుంది పాశ్చాత్య విద్యా విధానం..
🌾వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి, అందరికీ తిండి దొరుకుతుంది.. అని మనం కోరుకుంటాం.. మన విశాల దృక్పథానికి, శ్రమ సంస్కృతికి ఇది నిదర్శనం..
👺కానీ తాము బాగుంటే చాలు అని కోరుకొని, ఇతరులను దోచుకు తినే వారికి వానలతో పనేముంది..
🤔ఇంతకూ మన పిల్లలకు ఏమి నేర్పిద్దాం.. వానా వానా వల్లప్పా లేక రెయిన్ రెయిన్ గో అవేనా..  ఆలోచించండి..

Tuesday, June 27, 2017

సాహితీ గోదావరి----------వాడ్రేవు చినవీరభద్రుడు

వాడ్రేవు చినవీరభద్రుడు
తుపాను నవల్లో అనుకుంటాను, అడవి బాపిరాజుగారు, గంగానది రుషుల నది, యమున ప్రేమికుల నది, కృష్ణ శిల్పుల నది, కావేరి సంగీతకారుల నది అని చెప్తూ, గోదావరి కవుల నది అంటారు. గోదావరి నీళ్లల్లో, ఆ ఒడ్డున మనలో కవిత్వాన్ని మేల్కొల్పే లక్షణమేదో ఉందని నాక్కూడా అనుభవమైంది.

82-87 మధ్యకాలంలో నేను మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించక డిగ్రీ చదువు మధ్యలో ఆపేసి రాజమండ్రిలో టెలిఫోన్స్‌లో అకౌంటెంటుగా పనిచేశాను. ఆ అయిదేళ్ల కాలంలోనే నేను నిజంగా సాహిత్యమంటే ఏమిటో తెలుసుకున్నాను. గోదావరి గట్టు నా తక్షశిల. అక్కడ నాకు గొప్ప గురువులు దొరికారు. గొప్ప సహాధ్యాయులు దొరికారు. గోదావరి అనగానే నాకు వాళ్లంతా గుర్తొస్తారు.

‘మా గోదావరియే, తదీయతటియే అమ్నాయంత సంవేద్యుడౌ మా గౌరీశుడె, మా వేణుగోపాలుడే...’ అంటూ మంత్రం జపం చేస్తున్నట్టుగా పద్యపాదాలు నెమరేసుకునే మల్లంపల్లి శరభయ్య గుర్తొస్తారు. ఆయనది కృష్ణాజిల్లా ఎలకుర్రు. కాని జీవితమంతా గోదావరి సన్నిధిలోనే గడిపారు. కవిత్వం పండితులు బోధించకూడదు, భావుకులు బోధించాలి అనేవారాయన. ఒక కవిత్వ వాక్యం ముందు ఎట్లా సాష్టాంగపడాలో ఆయన్ని చూసే నేర్చుకున్నాను.

ఎన్నో సాయంకాలాలు, రాత్రులు సమాచారం మేడ మీద వాళ్లింట్లో, గోదావరి గట్టున ఆయన సంస్కృత, తెలుగు కావ్యానందమనే మృష్టాన్నభోజనం చేస్తూ మధ్యలో ఒక్కొక్క ముద్ద నా చేతుల్లో కూడా పెట్టేవారు. ఆ రుచి ఎట్లాంటిదంటే, ఆ తర్వాత నాకు సాహిత్యంలో మరెవ్వరినీ గురువులనుకోవడానికి మనసొప్పలేదు.

మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి యానాం దగ్గర పల్లిపాలెంలో పుట్టారు. వాళ్ల నాన్నగారు మధునాపంతుల సత్యనారాయణమూర్తి అక్కడ నుంచి ‘ఆంధ్రి’ అనే పత్రిక నడిపారు. ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో తెలుగులో నవ్యకవిత్వం, నవ్య సాహిత్య చైతన్యం అంకురించిన వేళలకి పల్లిపాలెం సాక్షి అని సాక్షాత్తూ తిరుపతి వెంకట కవులే గొంతెత్తి మరీ చెప్పారు. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన మధునాపంతుల ఆంధ్ర పురాణాన్ని రచించడంలో ఆశ్చర్యమేముంది? ఆంధ్రుల చరిత్రని పురాణంగా చెప్పవచ్చనే ఆ ఒక్క ఆలోచనతో ఆయన విశ్వనాథ సత్యనారాయణని కూడా దాటిపోయారనిపిస్తుంది.

ఆర్.ఎస్.సుదర్శనంగారు పుట్టింది మదనపల్లిలో. ఉద్యోగరీత్యా అయిదారేళ్లపాటు రాజమండ్రిలో ఉన్నారు. కాని ఆ ఊరితో ఆజన్మబంధం పెనవేసుకున్నారు. ఆయన వల్లనే రాజమండ్రి సాహిత్య చర్చల్లో అస్తిత్వ వాదం, ఫ్రాయిడ్, యూంగ్, సార్త్రే, కిర్క్ గార్డ్, పాల్ టిల్లిచ్ ప్రవేశించారు. ఆయన వల్లనే రమణమహర్షి, కృష్ణమూర్తి, ‘ద డాన్స్ ఆఫ్ ఊలీమాష్టర్’ల గురించి మేం తెలుసుకోగలిగాం. ఆయన్నొక సారి షేక్‌స్పియర్ నాటకాలు చెప్పమని అడిగాం. మాకోసం ఆయన నాలుగైదు రోజులపాటు గౌతమీ గ్రంథాలయంలో హేమ్లెట్ నాటకం పాఠం చెప్పారు. ఆ చెప్పిన విధానం ఎటువంటిదంటే, ఆ తర్వాత షేక్‌స్పియర్ నాటకాలు చదువుకోవడానికి నాకు మరెవ్వరి సహాయమూ అవసరం లేకపోయింది.

గురజాడ కళాసమితి దర్శకుడు, రూపక ప్రయోక్త టి.జె.రామనాథంతో నా సాహచర్యం ఎంత విలువైందో నేను రాజమండ్రి వదిలిపెట్టిన తర్వాతనే నాకు మరింత స్పష్టంగా తెలిసొచ్చింది. ఆయన్ను రాజమండ్రి పత్రికలు ‘జనరంజక రూపకర్త’ అని పిలిచేవి. ప్రజల అభిరుచి స్థాయికి తాను దిగకుండా కళాఖండాల్ని సృష్టించిన బి.ఎన్.రెడ్డిలాగా కాకుండా పండిత పామర రంజకంగా కళాసృష్టి చేసిన కె.వి.రెడ్డి లాంటి దర్శకుడు రామనాథమని మా మహేష్ ఎప్పుడూ అంటూండేవాడు.

ఇరవయ్యేళ్ల వయసులో ఆయన నాతో ‘స్వాతంత్రోద్యమ శంఖారావం’ అనే డాక్యుమెంటరీ రూపకం రాయించాడు. ఆ రూపకం రిహార్సల్స్ కోసం ప్రతి రాత్రీ ధవళేశ్వరంలో గడిపి తెల్లవారాక రాజమండ్రి రావడం ఒక అనుభవం. నాకే కాదు, అందులో గాంధీగా నటించిన ప్రసిద్ధ కవి వసీరాకీ, నెహ్రూగా నటించిన ప్రసిద్ధ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణకుమార్‌కీ మరెందరికో కూడా.

సావిత్రిగారిది కూడా రాజమండ్రి కాదు, ఆమె పుట్టింది పశ్చిమగోదావరి జిల్లాలో. కాని ఆమె రాజమండ్రి సావిత్రిగా తెలుగులో మొదటి మిలిటెంటు ఫెమినిస్టుగా గుర్తింపు పొందింది. ఆమె హేతువాది, కమ్యూనిస్టు, ఫెమినిస్టు నిజమే కాని, అన్నిటికన్నా ముందు ఆమె నిజమైన మనిషి. ఒకసారి ఆమెను అకారణంగా అరెస్టుచేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. వారం రోజులో, రెండు వారాలో ఉన్నదనుకుంటాను. ఆ కొద్దిరోజుల్లోనే ఆమె అక్కడి డిటెన్యూలకి చింగిజ్ అయిత్ మాతొవ్ ‘తల్లిభూదేవి’ నవల మొత్తం చదివి వినిపించింది.
అందరూ సమాచారం సుబ్రహ్మణ్యంగా ఎంతో ఆత్మీయంగా పిలుచుకునే సుబ్రహ్మణ్యం గోదావరి సంస్కృతికి నిజమైన ప్రతినిధి. రాజమండ్రి ఆత్మ అతడికి తెలుసు. చిన్నపత్రికల సంపాదకుల్లో అత్యుత్తమ సంపాదకుడిగా చాలా చిన్నవయసులోనే ప్రధానమంత్రి నుంచి సత్కారం పొందినవాడు. కాని అతణ్ని నేను కేవలం పాత్రికేయుడిగా చూడలేను. అతడు నాలాంటివాళ్లందరికీ తండ్రి, సోదరుడు, మిత్రుడు.

కవులూరి గోపీచంద్‌ది ఏలూరు. వాళ్ల నాన్నగారు కవులూరి వెంకటేశ్వరరావు గారు చాలాకాలం విశాలాంధ్రలో పనిచేశారు. ఆయన వల్ల గోపీచంద్ చిన్నవయసులోనే మార్క్స్‌ని, ఎంగెల్స్‌ని, లెనిన్‌ని చదువుకున్నాడు. తండ్రి రాయిస్టు కావడం వల్ల ఎం.ఎన్.రాయ్‌ని కూడా చదివాడు. చాలాకాలం పాటు రాజమండ్రి పేపర్ మిల్లులో, ఆ తర్వాత ఒరిస్సాలో జె.కె.పేపర్ మిల్లులోనూ కెమిస్టుగా పనిచేశాడు. ముప్ఫై ఏళ్ల వయసులో భార్యని, పిల్లవాణ్ని వదిలిపెట్టి జీవిత సత్యం వెతుక్కుంటూ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియదు. కాని అతడితో ఒక్కసారి మాట్లాడినవాళ్లు కూడా ఇప్పటికీ అతణ్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. తన సాహచర్యంతో అతడు నన్ను తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. అతడి వల్లనే నేను తత్త్వశాస్త్ర విద్యార్థిగా మారేను.

మేమందరం మహేష్‌గా పిలుచుకునే చక్రాల వెంకట సుబ్బమహేశ్వర్ గోదావరి జిల్లావాడు కాడు. కాని పేపర్ మిల్లులో సేఫ్టీ ఆఫీసరుగా పనిచేసేవాడు. మా బృందంలోనే మా మిత్రురాలు శకుంతలని పెళ్లి చేసుకుని తర్వాత రోజుల్లో శ్రీహరికోట వెళ్లిపోయినదాకా మహేష్, రాజమండ్రితో విడదీయలేనంత అనుబంధం పెంచుకున్నాడు. గర్భగుళ్లో దేవుడికి హారతిస్తూ అర్చామూర్తిని పరిచయం చేస్తారే, అట్లా మహేష్ రాజమండ్రికి పట్టిన హారతి లాంటివాడు. ఆ వెలుగులోనే నేను రాజమండ్రినీ, గోదావరినీ పోల్చుకున్నాను.అతడి వల్లనే నాకు వీరేశలింగం, చిలకమర్తి, టంగుటూరి ప్రకాశం, గరిమెళ్ల వంటివారు అర్థమయ్యారు. ఎన్ని సాయంకాలాలు, ఎన్ని రాత్రులు, ఎన్ని ఎడతెగని చర్చలు!

కవిత్వం, తత్త్వశాస్త్రం, కళాసృజనకి పరిమితమైన మా బృందంలో సంగీతాన్ని పట్టుకొచ్చినవాడు వంక బాలసుబ్రహ్మణ్యం. అతడి సాహిత్య పరిచయం, పరిజ్ఞానం తక్కువేమీ కాదు. ఆయన ప్రేరణ వల్లనే నేనూ, గోపీచంద్ కలిసి రాజమండ్రి రీడర్స్ క్లబ్ ఏర్పాటు చేశాం కూడా. ఒక వేసవిలో రెండువారాల పాటు సాహిత్య, సామాజిక శాస్త్ర తరగతులు కూడా నడిపాం. కాని సంగీతాన్ని ఎట్లా వినాలో, ఎట్లా ప్రశంసించాలో బాలసుబ్రహ్మణ్యమే మాకు నేర్పాడు.

ఆ గోదావరి గట్టుమీద పాత టేప్‌రికార్డరొకటి పట్టుకొచ్చి, ఈ రోజు మీకు హేమంత కుమార్‌ని పరిచయం చేస్తాననేవాడు. పాట గురించి, ట్యూన్ గురించి, రాగం గురించి, అందులోని భావం గురించి, ఔచిత్యం గురించి సుదీర్ఘంగా చెప్పేక, అప్పుడు ఆన్ బటన్ నొక్కగానే ‘ఏ నయన్ డరే డరే...’ అని వినబడగానే మాకళ్లముందొక అతిలోక స్వాప్నిక ప్రపంచం తలుపులు తెరుచుకునేది.

రాళ్లబండి కవితాప్రసాద్ నా రాజమండ్రి మిత్రుడు కాడు. కాని నాకు గోదావరి మిత్రుడు. నేను రాజమండ్రిలో గోదావరిని ఉపాసిస్తున్నప్పుడు అతడు భద్రాచలంలో గోదావరిని ఉపాసిస్తున్నాడు. తర్వాత రోజుల్లో గోదావరికీ, సాహిత్య స్నేహాలకీ ఎంతో దూరంగా, ప్రభుత్వోద్యోగులుగా మేం జీవించవలసివచ్చినప్పుడు గోదావరి సాక్షిగ మేం మళ్లా ఆ స్వప్న ప్రపంచంలోకి ప్రయాణించాలని కలలుగనేవాళ్లం. ఈ ఏడాదో, వచ్చే ఏడాదో వాలంటరీ రిటైర్మెంటు తీసుకుందామని, అప్పుడు మళ్లా ఆంధ్ర దేశమంతా తిరుగుతూ సాహిత్యం గురించి మాట్లాడుతూ దేశాన్ని జాగృతం చేద్దామని ఎన్నెన్నో ఊసులాడుకునేవాళ్లం, ఊహలు పంచుకునేవాళ్లం.

నా జీవితంలో నేను కొండల్లో పుట్టాను, అడవుల్లో తిరిగాను, నగరంలో గడుపుతున్నాను. కాని నది ఒడ్డున జీవించిన అనుభవం అద్వితీయం. ఆ నది గోదావరి కావడం నా అదృష్టం.
 ఏరీ ఆ సన్మిత్రులు? నన్నిక్కడ వదిలేసి ఎక్కడకు వెళ్లిపోయారు? మా మాష్టారు శరభయ్యగారు ఒక పద్యంలో రాసుకున్నట్టుగా ‘తలప ధరణి బ్రదుకె దాగిలిమూతయో! వారలెందొ! కానరారు మరల’. ఇప్పుడు మిగిలిందల్లా అక్కడ గోదావరి నీళ్లు, ఇక్కడ నా కన్నీళ్లు.


Saturday, June 24, 2017

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

గోరింటాకు
ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?
మహిళలకు ఇష్టమైనది గోరింటాకు. గోరింటా పూసిందీ కొమ్మా లేకుండా... మురిపాలా అరచేతా మొగ్గా తొడిగిందీ ... అని ఓ కవి ఎంతో రమ్యంగా గోరింటాకు అందాలను వర్ణిం చాడు. ఈ ఆషాడంలో అందంతో పాటు..ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీఅరచేతుల నిండా నింపుకోండి.గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు.ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.. కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది.ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగామెరిసిపోతుంటాయి.ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న మర్మమేంటో.. మీకు తెలుసా..?ఆషాఢమాసంతో గ్రీష్మ ఋతువు పూర్తిగా వెళ్లిపోయి.. వర్షరుతువు ప్రారంభమౌతుంది.గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది.. మన శరీరంలో ఉన్న వేడి.. బయట చల్లబడిన వాతావరణం పరస్పరవిరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలౌతాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అందువల్లే గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతారు.మహిళలు.. ఈ ఆషాడంలో అందంతో పాటు..ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ అరచేతుల నిండా నింపుకోండి.

ఆషాడ మాస విశిష్టత

రేపటినుంచి అనగా 25-06-2017 నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. ఆషాడ మాస విశిష్టత తెలుసుకుందామా!!
చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం నాల్గవ నెల. ఈమాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రంలో సంచరించడం వల్ల దీనిని ఆషాఢమాసం అని పేరు ఏర్పడింది. ఈమాసం అత్యంత ఫలప్రదమైంది.
ఈమాసంలో శుక్లపక్ష ద్వితీయన, పుష్యమీ నక్షత్రమున, సుభద్రతో కూడిన రాముణ్ణి రథం యందు కూర్చోబెట్టి యాత్రోత్సవమును జరిపించడం ఉన్నది. ఈమాసంలో విష్ణువు పాల సముద్రంలో పాముపడక యందు నిద్రిస్తాడు అని అందువల్ల ఆ సమయంలో హరిని పూజించడం వల్ల బ్రహ్మహత్యాది పాపము త్వరలోనే పోతుంది. ఆషాఢ మాసంలో సూర్యుడు, వరుణుడు అనే పేరు పొందుతాడు. వసిష్ఠుడు, రంభ, సహజన్యుడు, హూహువు, శుక్రుడు, చిత్రస్వనుడు, అనే వారు తనకు పరివారం కాగా కాలం గడుపుతుంటాడు. ఈమాసం నుంచే చాతుర్మాస్య వ్రతం చెప్పబడింది.
⁠⁠⁠⁠⁠💐సరదాగా నవ్వుకుందాం.💐

ఒక తల్లికి నలుగురు కుాతుళ్లు ఉండేవారు....
  👧        💇      🙆      🙅

అందులో 👧 మెుదటి అమ్మాయి పేరు......
      ........... విరిగిన.........

💇 రెండవ అమ్మాయి పేరు......
              ........... చిరిగిన......

🙆మూడవ అమ్మాయి పేరు..........
          ...........పాడైపోయిన......

🙅నాలుగవ అమ్మాయి పేరు.......
          ..... చనిపోయిన....

ఇలా ఈ విధంగా ఆ తల్లి తన
కుాతుళ్లకు పేర్లు పెట్టుకుంది ......

.......... ఒక రోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు... 👤👤

అతనితో తల్లి ఇలా అడుగుతుంది :-''మీరు కుర్చీలో కూర్చుంటారా..? లేకా చాప మీద కూర్చుంటారా''...?

👤అతిథి :-'' కుర్చీ మీద కూర్చుంటాను ''..

తల్లి :- ''విరిగిన....👧! కుర్చీ తీసుకోనిరా''.. !

👤అతిథి :-'' వద్దులేండి..! నేను చాప మీద కుార్చుంటాను''..!

తల్లి :- '' చిరిగిన..💇!  చాప తీసుకోని రా''..!

👤అతిథి :- '' ఉండనివ్వండి.. నేను కింద నేలపైనే.  కుర్చుంటాను..

............. అలా ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు.....
  ......  కొద్దిసేపు తర్వాత......

తల్లి :- '' మీరు టీ తీసుకుంటారా...?
  లేక పాలు తీసుకుంటారా ''. ..?

👤అతిథి:- '' టీ ''

తల్లి :- '' పాడయిపొయిన...🙆!
                  టీ తీసుకోని రామ్మా ...''

👤అతిథి :- '' వద్దు, వద్దులేండి..
                   నేను పాలు తీసుకుంటాను... ''

తల్లి :-  '' చనిపోయిన...🙅!
                ఆవు పాలు తీసుకుని రామ్మా.. ''
                         
........    ఈ మాటలు విన్న 👤అతిథి ఏమీ తోచకా అక్కడి నుండి పారిపోయాడు........ 🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃
మీరు నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ బతకండి 😁😁😁😁😁😁😁😀😀😀

గాయత్రీ మంత్రము అంటే…

“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు

7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు

10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

11. మన వేనుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.

“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి....

" పంచభక్ష్యభోజనము " .

పంచభక్ష్య భోజనము అంటే ఏమిటి?

1.భక్ష్యము: నమిలి తినేది,
2.భోజ్యము: చప్పరిస్తే కరిగిపోయేది,
3.చోష్యము: పీల్చుకునేది/జుర్రుకునేది,
4.లేహ్యము: నాక్కుంటూ తినదగినది,
5.పానీయము: త్రాగేది,

ఈ 5 విధాలైన పదార్ధాలతో కూడిన భోజనమే " పంచభక్ష్యభోజనము " .

Thursday, June 22, 2017

భక్తి అంటే ఏమిటి ?


"భక్తి అంటే ఏమిటి?"అని అడిగారొక రాజుగారు.
"భక్తీ అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం కాదు, భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడం..." చెప్పారు ఒక మహర్షి.
"అవునా, నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసింది ఏమిటి?"
నాయనా! నిజానికి దైవం ఎవరి నుంచీ ఆశించేది ఏమీ లేదు. మానవ జన్మ ముక్తికి ఒక అవకాశం. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి నిన్ను నువ్వు తరింప చేసుకునేందుకు కాని, నువ్వు దేవుడికి ఏదో గొప్ప ఉపకారం, సేవ చేసావని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దానధర్మాలు వ్యర్ధం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం... నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్ధనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చరు. ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో దానం చేస్తూ, ఆ దైవం మెచ్చే పని నీవు చేసినప్పుడు , ఆయన తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం!
" అందుకు చాలా సహనం, ఓర్పు ఉండాలి కదా!"
అవును, సహజంగా మనలోని భక్తి ఎలా ఉంటుందంటే... ఒకరు వంద బిందెలతో శివుడికి అభిషేకం చేస్తే , శివుడు ప్రత్యక్షం అవుతాడు, అని చెప్పరే అనుకోండి, 98 బిందెలు మోసుకొచ్చి, అత్యంత ఓర్పుతో అభిషేకం చేస్తాం. 99 వ బిందె దైవం ఇంకా రాలేదే అన్న విసుగుతో, ఆయన నెత్తినే పడేసి వస్తాం. ఓర్పుకు ఓటమి లేదు. నమ్మకం, ఓర్పు, సేవ ఇవే దైవాన్ని చేరే మార్గాలు.
అలా ముని నుంచీ ఉపదేశం పొందిన రాజు గారు అనేక దానాలు చేసారు. భూ దానం, గో దానం, సువర్ణ దానం, కన్యా దానం. దైవ సాక్షాత్కారం కోసం వేచి ఉన్నారు. మారువేషంలో రాత్రులు తిరుగుతూ, ప్రజల అవసరాలు కనిపెట్టి అనేక గుప్త దానాలు చేసారు. అయినా దైవం ప్రత్యక్షం కాలేదు. రాజుగారు దైవానుగ్రహం కోసం ప్రార్ధిస్తూ, ఓర్పుగా సేవ చెయ్యసాగారు.
ఒక రోజు రాజుగారు రాత్రివేళ మారువేషంలో తిరుగుతుండగా, ఒక ఇంటి నుంచీ పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక పేద బాలుడు తనకు ఆట బొమ్మలు కావాలని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. విధవరాలయిన ఆమెకు సరయిన బట్టలే లేవు, బొమ్మలు ఎలా కొంటుంది? దిక్కుతోచక కొడుకును సముదాయిస్తోంది. కాని, పిల్లవాడు మొండికేసి ఏడుస్తున్నాడు. రాజు హృదయం ద్రవించిపోయింది. మర్నాడు మంచి మంచి బొమ్మలు, తినుబండారాలు ఆ పిల్లవాడికి పంపాడు. వెంటనే రాజు ముందు దైవం ప్రత్యక్షం అయ్యారు. రాజు ఆశ్చర్యపోయాడు.
"స్వామి! నేను ఎన్నో గొప్ప దానధర్మాలు చేసినా, ఆలయాలు, సత్రాలు, చెరువులూ త్రవ్వించినా నీవు రాలేదు. మరి ఈ నాడు నాపై నీ దయ కలిగేందుకు కారణం ఏమిటి?"
"రాజా! పూర్ణ మనస్సుతో ఏ చేసే చిన్న పనయినా నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. పిల్లవాడి మీద దయతో మనసు కరిగి, నీవు చేసిన దానం వల్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. నీవు చేసే దానధర్మాలను ఇలాగే కొనసాగించి, తుదకు నా సన్నిధి చేరతావు," అని దీవించి అదృశ్యం అయ్యారు.
ప్రతీ క్షణం మనం మరణానికి చేరువ అవుతుంటాం. అది గుర్తెరగాలి. దానం చేసేందుకు మరొకరిపై ఆధార పడకండి.ఉన్నంతలో క్రొత్తవి, లేదా పాత బట్టలు, దుప్పట్లు, ఆహారం, కాస్త డబ్బు ఏదైనా ఇవ్వండి. రోజుకొక మంచి పని చెయ్యడం లక్ష్యంగా పెట్టుకుందాం. ఉన్నంతలో, నలుగురికీ సహాయపడదాం. మానవ సేవే మాధవ సేవ

అ - ఱ

'అ'మ్మ పెట్టిన గోరుముద్దలతో
'ఆ'నందంగా బడి కెళ్తారు..
'ఇ'క్కడ అక్కడ
'ఈ'లలు వేస్తూ
'ఉ'రకలు వేస్తూ
'ఊ'యల ఉడతల కథలే వింటూ
'ఋ'ణమో పణమో ఏమీ తెలియక
'ౠ' అని దీర్ఘం తీస్తూ
'ఎ'రుపు,నలుపు,పసుపు ,తెలుపు అంటూ
'ఏ'డు రంగుల సీతాకోకచిలుకల్లాగా
'ఐ'దుగురో ఆరుగురో స్నేహితులతో కలిసి
'ఒ'ప్పుల కుప్ప ఆటలు ఆడి
'ఓ'డల ఒంటెల కథలే వింటూ
'ఔ'రా అనిపించే ఆశ్చర్యాలతో
'అం'దరు ఎంతో సంతోషించి
'అః' అంటూ మురిసిపోతారు....
.
'క'లము కావాలని మారాం చేస్తే
'ఖ'ర్జూరపు పండు నాన్నే ఇస్తే
'గ'బగబా తిని
'ఘ'ణ ఘణ గంటలు గుండెల్లో మోగగా
'జ్ఞా'పకాలే అల్లేసుకుంటారు..
.
'చ'క చక బడికి వెళ్లి
'ఛ'లో అంటూ క్లాసుకి చేరుకోని
'జ'తగా అందరు కూడి
'ఝ'మ్మని ఎవరి సీట్లలో వాళ్లు కూర్చొని
'ఞ'(ఇని) మాస్టారు చెప్పింది రాస్తారు..
.
'ట'క్కరి పిల్లలందరు
'ఠ'పీమని శబ్దం చేస్తే
'డ'ప్పుల మోతల్లె ఆ శబ్దానికి
'ఢ'మాల్ అని బెత్తంతో సారు వాయిస్తారు
'ణ'ణణణణ అని ఇంటి గంట మొగంగా
.
'త'లుపు తోసుకుని
'థ'పా థపామని
'ద'బ్బున పిల్లలందరు
'ధ'న ధన చప్పుడు చేస్తూ
'న'డచుకుంటూ కొందరు బయటికి వస్తే
.
'ప'రుగులతో కొందరు
'ఫ'స్టునేనంటే నేనని
'బ'యటకు వెళ్లి
'భ'లే భలే
'మ'న మంచి బడియని కొందరు
'యా'హూ అంటూ కొందరు
'ర'యిలు ఇంజనంత హుషారుగా
'ల'యబద్దంగా జతగా
'వ'డివడిగా బయటకు వచ్చి
'శ'బ్దాలు పెద్ద పెద్దగా చేస్తూ
'ష'రతులు వేసుకుంటూ ముందు ఇంటికి నువ్వానేనా అని
'స'రదాగా గంతులు వేస్తూ వెళుతూ
'హా'య్ అని చెప్పుకున్న మనసులు బాయ్ చెప్పుకుని
గ'ళ'మెత్తి ఈరోజుకు ఇక సెలవు అని
ల'క్ష'ణంగా
'ఱ'య్యిన అందరు ఇంటికి చేరిపోతారు!!

Wednesday, June 21, 2017

యోగా దినోత్సవ శుభాకాంక్షలు.

అందరికీ అంతర్జాతీయయోగా దినోత్సవ శుభాకాంక్షలు.

 విస్సా ఫౌండేషన్.

"ప్రసాదం‌"

"ప్రసాదం‌" వివరణ
ఒక పిల్లవాడికి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు?” అని ప్రశ్నించాడు.
గురువుగారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం.
పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని కంటస్ధం చేయమని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత, నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి "నేర్చుకున్నావా?" అని అడిగారు. "నేర్చుకున్నాను" అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు.
శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువుగారు తల అడ్డంగా ఆడించారు.
దానికి ప్రతిగా శిష్యుడు, "కావాలంటే పుస్తకం చూడండి..!" అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు.
"శ్లోకం పుస్తకంలోనే ఉందిగా, నీకు శ్లోకం ఎలా వచ్చింది...?" అని అడిగారు గురువు గారు.
శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ ఇలా అన్నారు
"పుస్తకంలో ఉండే శ్లోకం
స్థూలస్థితిలో ఉంది. నువ్వు చదివినప్పుడు నీ బుర్రలోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది.
అదేస్థితిలో నీ మనస్సులోనూ ఉంది. అంతే కాదు, నువ్వు చదివి నేర్చుకోవడం వల్ల పుస్తకంలో స్థూలస్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు కదా!
అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి, స్థూలరూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం!" అని వివరణ చేశారు.
అందుచేత మనం ఏది తినాలనుకున్నా, ముందుగా భగవంతునికి మనస్సులో నివేదన చేసి తింటే ఆ పదార్ధం కాస్త ప్రసాదంగా మారి మనలో పదార్ధదోషము లేకుండా శుభములను చేకూరుస్తాది.

నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం.

నమస్కారం ఒక సంస్కారం
నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం.
మనం తోటివారికి నమస్కరించేటప్పుడు, అది సంస్కారవంతంగా ఉండాలి.
మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది.
నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు.
అందుకు ఆయన ‘కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించా’లన్నాడు.
అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’ అని దీవించారు.
అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనట్లు పురాణగాథలు చెబుతున్నాయి.
*ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ భిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు.
వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు.
అది చూసిన మంత్రి ‘ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?’ అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు.
తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు.
 మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
అప్పుడు ఆ రాజు ‘మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు.
అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?’ అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.
*యోగశాస్త్రంలో ‘నమస్కారాసనం’ ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం.
అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి.
అది సమర్పణకు ప్రతీక.
ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.
*రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు.
సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.
‘ఎదిగేకొద్దీ ఒదగాలి’ అంటారు పెద్దలు.
ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు.
ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు.
*ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు.
అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.
శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి.
అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు.
ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని- పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.
అందుకే ‘అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్య రహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి.
నీలో, నాలో, ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి’.
ఇలా ప్రార్థించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం! సంస్కరించుకుందాం!!

ఎవరు గొప్ప…..?

ఎవరు గొప్ప…..?
పూర్వము ఏడేడులోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యుడికి, ప్రాణికోటికి ప్రాణాధారమైనటువంటి వాయుదేవుడికి మద్య పోటీ మొదలయ్యింది. వారిరువురిలో ఎవరు బలవంతులన్న సమస్య ఏర్పడింది.
ఈ సమస్యను పరిష్కరించుకొనుటకు వారివురి మద్య పోటీ ఒకటి నిర్వహించుకొన్నారు. అదే సమయానికి భూలోకంలో ఒక గొఱ్ఱెలకాపరి గొఱ్ఱెలను మేపుతూ కొండప్రాంతములో సంచరించడం సూర్యుడు, వాయుదేవుడు గమనించారు.
అతను ఒక తెల్లటి వస్త్రమును శరీరముపై కప్పుకొని గొఱ్ఱెలను తోలుతూ కొండప్రాంతంలో కూనిరాగాలుతీస్తూ వెళ్తున్నాడు. 
పోటి ఏమనగా ఎవరు తన బలంతో ఆ గొఱ్ఱెలకాపరిపై వున్న వస్త్రాన్ని తొలగించగలరో వారు మహాబలవంతులని పరీక్ష పెట్టుకున్నారు.
పోటీ మొదలయ్యింది.
మొదట వాయుదేవుడు శరవేగంతో గాలిని వీచడం ప్రారంభించాడు.
కొండప్రాంతములో ఉన్నట్లుండి పెద్దహోరుగాలి మొదలయ్యింది.
గొఱ్ఱెలకాపరి ఉన్నట్టుండి మొదలైన ఎదురుగాలికి స్పందించి చెట్టు చాటుకు పరుగులుతీశాడు. వాయుదేవుడు తనప్రతాపాన్ని పెంచాడు. హోరుగాలి దుమారంగా మారింది.
గొఱ్ఱెలకాపరిని ఉన్నట్టుండి చుట్టుముట్టింది.
తన తెల్లటివస్త్రము గాలికి నిలువలేక అతని నుంచి దూరంగా ఎగరసాగింది.
గొఱ్ఱెలకాపరి గట్టిగా లాగుతూ పెనుగులాడాడు. వాయుదేవుడు తన బలాన్నంతా ప్రయోగించి వస్త్రాన్ని అతని వొంటిమీదనుంచి తొలగించడానికి ప్రయత్నించాడు.
గొఱ్ఱెల కాపరి చలికి వణుకుతూ ఈదురుగాలికి బెదరి ఒక కొండక్రింద తలదాచుకున్నాడు. వాయుదేవుడుశాంతించి తనఓటమిని అంగీకరించాడు.
పోటిపరీక్షలో తనవంతుగా సూర్యుడు బరిలోకిదిగాడు.
ఉన్నట్టుండి వేడిసెగలను వదిలాడు. దానితొ గొఱ్ఱెల కాపరికి చెమటలు పట్టాయి.
సూర్యుడు తన వేడి ఉద్రుతాన్ని పెంచసాగాడు. దానితో ఉక్కపోతకు తట్టుకోలేక గొఱ్ఱెలకాపరి వొంటిమీదవున్న వస్త్రాన్ని తొలగించి సంచిలో వేసుకున్నాడు.
సూర్యుడు పోటిపరీక్షలో జయం తనదే అని గర్వంతో విర్రవీగసాగాడు.
అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వగతుడు, సర్వసమర్థుడు అయిన శ్రీహరి ప్రత్యక్షమైనాడు.
శక్తిని పరులకు ఉపయోగపడేలా ఉపయోగించాలికాని పరులకు కీడుచేయడానికి కాదని జ్ఞానోపదేశం చేశాడు.
“మీ ఇద్దరి బల ప్రదర్శనతో గొఱ్ఱెలకాపరి భయగ్రస్తుడై అనోరోగ్యముతో రోగగ్రస్తుడైనాడని, ఒకరికొకరు బలప్రదర్శనగావిస్తే సృష్టి తలక్రిందులౌతుందని, ఎవరికర్తవ్యాన్ని వారు నెరవేర్చాలని ధర్మోపదేశాన్ని చేశాడు.
సూర్యుడు-వాయుదేవుడు తమ అజ్ఞానానికి సిగ్గుతో తలవంచి శ్రీహరిని శరణుకోరి తమ విధులను నిర్వర్తించుటకు బయలుదేరారు.
*ఇదేవిదంగా మనుష్యులైన మనము కూడా మానవత్వంతో భగవంతుడు మనకు నిర్దేశించిన కర్తవ్యాన్ని తెలుసుకొని ధానిని అమలపరచాలి. ఏకారణంతో అయినా ఇంకొకరితో మనల్ని పోల్చుకోవడం, కయ్యానికి దిగడం మంచిది కాదు. మనల్ని సృష్ఠించిన భగవంతుడే గీతలో “స్వధర్మే నిదనం శ్రేయః..” అని అన్నాడు.
కావున ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించడం
అన్ని విధాల శ్రేయస్కరం అన్న నీతిని గ్రహించాలి.

చిత్రగుప్తుని దేవాలయం


చిత్రగుప్తుని దేవాలయం
మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది. కలియుగంలో అతని పేరిట గుళ్లు గోపురాలు కూడా ఉన్నాయి. మన రాజధాని నగరంలోనూ చిత్రగుప్తుడికో ఆలయం ఉంది. అసలు చిత్రగుప్తుడు ఎవరో, ఆయన మన పాప పుణ్యాల చిట్టా రాయడం ఏమిటో తెలుసుకుందాం..
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. కానీ వీటిని వేళ్ల మీద లెక్కించొచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉన్నారు భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది.స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్‌ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్‌ పూర్‌ లోని ఫూటాతాల్‌, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో , ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు రెండు శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్‌ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.
ఉత్తర భారత దేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైద్రాబాద్‌ పాతబస్తీ కందికల్‌ గేట్‌ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి. దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు వెళాల్సి ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు కందికల్‌ గేట్‌ రైల్వే ట్రాక్‌ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో. బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.
దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.దీన్నే భాయ్‌ దూజ్‌ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం అని దేవాలయ పూజారీ రంచాచార్యులు చెప్పారు.అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక వాటికి పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. కేతు గ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని మరో పూజారీ చంద్రకాంత్‌ జోషి తెలిపారు. ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య కూడా అంతంత మాత్రమే.ఇంతటి విశిష్టమైన దేవాలయం అభివృద్ది కాకపోవడానికి వాస్తు దోషమేనంటారు ప్రముఖ వాస్తు నిపుణులు జాలిగామ నరేష్‌ కుమార్‌. తూర్పు ఆగ్నేయం పెరగడం,తూర్పు భారం,ఈశాన్యం బరువు, దక్షిణ నైరుతి గేటు తెరవడం వల్ల దేవాలయం ఖ్యాతి చెందడం లేదని ఆయన అన్నారు.

Monday, June 19, 2017

💢నిత్య పారాయణ శ్లోకాలు💢

💢నిత్య పారాయణ శ్లోకాలు💢
మనలో చాలామందికి తెలియని శ్లోకాలు
ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...
🌷ప్రభాత శ్లోకం :🌷
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!
ప్రభాత భూమి శ్లోకం : 
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!
🌝సూర్యోదయ శ్లోకం : 🌝
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!
🍀స్నాన శ్లోకం : 
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!
భస్మ ధారణ శ్లోకం : 
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!
🍀భోజనపూర్వ శ్లోకం : 🍀
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!
💢 భోజనానంతర శ్లోకం : 💢
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!
🌷సంధ్యా దీప దర్శన శ్లోకం :🌷
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!
😔నిద్రా శ్లోకం :😔
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!
👍కార్య ప్రారంభ శ్లోకం : 👍
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!
🌷హనుమ స్తోత్రం : 🌷
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!
💢శ్రీరామ స్తోత్రం : 💢
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
గణేశ స్తోత్రం : 
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!
🔯శివ స్తోత్రం : 🔯
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!
🕉గురు శ్లోకం : 🕉
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!
సరస్వతీ శ్లోకం :
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!
🌷లక్ష్మీ శ్లోకం 🌷:
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!
వెంకటేశ్వర శ్లోకం :
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!
దేవీ శ్లోకమ్ :
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!
💢దక్షినామూర్తి శ్లోకం💢 :
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!
అపరాధ క్షమాపణ స్తోత్రం :
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!

🔯 విశేష మంత్రా: 🔯
💢పంచాక్షరి -
ఓం నమశ్శివాయ
అష్టాక్షరి -
ఓం నమో నారాయణాయ
🌷ద్వాదశాక్షరి -
ఓం నమో భగవతే వాసుదేవాయ.

Total Pageviews