Monday, June 5, 2017

ఆహరం ఆరోగ్యం.

ఆహరం ఆరోగ్యం.
వరిబియ్యం
వరిబియ్యం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రధానమైన ఆహారం,అనునిత్యమైన ఈ ఆహారధాన్యం గురించి కొంతైనా తెలుసుకోవటం ఎంతైనా అవసరం.
*బియ్యంలో శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్ధాలు అత్యధిక శాతంలో వున్నాయి.
*దీనిలో శరీర నిర్మాణానికి ఉపకరించే మాంసకృతులు 7 శాతమే వున్నాయి .
*గోధుమతో పోలిస్తే బియ్యంలో మాంసకృతుల శాతం స్వల్పం . ఐతే మనిషి శరీరం మాత్రం గోదుమలోని మాంసకృతుల కన్నా బియ్యం లోని మాంసకృతులే అధికంగా వినియోగించు కుంటుంది .
* చాలాకాలం నుంచి పాలిష్ పట్టిన బియ్యన్నే వాడే వారిలో ఒకవేళ పాదాలు తిమ్మిరి పట్టడం,మొద్దు బారడం, మంటగా అనిపించడం కనుక జరిగితే ,అది విటమిన్ బి , లోపంగా గ్రహించాలి.
*విటమిన్ బి నీళ్ళల్లో తేలికగా కరిగిపోతుంది.కాబట్టి బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. ఇలా కడిగితే నీళ్ళ ద్వార ఈ విటమిన్ బయటకు వెళ్ళిపోయే అవకాశం వుంది.
*బియ్యంలో గింజకి, పైన వుండే వరిపోట్టుకీ , మధ్య విటమిన్ బి వుంటుంది. బాగా పాలిష్ పట్టిన బియ్యంలో తవుడుతోపాటు ఇది వెళ్ళిపోతుంది .
*అన్నాన్ని ఉడికించిన తరువాత గంజిని వార్చకుండా సన్నని మంటమీద ఇరిగిస్తే విటమిన్ బి ని పదిల పరచినవారవుతారు.కారనంతరాలవల్ల గంజిని వరిస్తే, దానిని పారపోయకుండా కొచెం ఉప్పు చేర్చి మజ్జిగలో కలుపుకొని రుచికరమైన పానీయంగా చేసుకొని వాడవచ్చు.
*మామూలు బియ్యం కన్నా ఉప్పుడు బియ్యంలో బి విటమిన్ శాతం ఎక్కువగా వుంటుంది.గిమ్జలోనికి ఈ విటమిన్ చొచ్చుకుని పోవటంవల్ల ఈ బియ్యాన్ని ఎంత కడిగినా ఏమీకాదు.

No comments:

Post a Comment

Total Pageviews